తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన చిత్రం 'బలగం'. మానవ సంబంధాలను, ముఖ్యంగా రక్తబంధాన్ని హృదయాలను హత్తుకునేలా చూపించారు. ఈ సినిమా కన్నీళ్లు పెట్టనివారు లేదంటే ఏ రేంజ్‌లో హిట్ అయిందో అర్థమవుతోంది. అయితే ఈ సినిమాలో నటించిన వారిలో ప్రతి ఒక్కరీ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నవారే. అలాంటివారిలో కీలక పాత్రధారిగా బలగం సినిమాలో మెప్పించిన కొమరయ్య చెల్లెలు పోచవ్వ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆమె అసలు పేరు విజయలక్ష్మి. బలగం చిత్రంలో పోచవ్వ పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె సురభి కళాకారిణి కాగా.. ఈ సినిమాలో పోచవ్వ నటనకు ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. కొమరయ్యకు చెల్లెలుగా.. ఆ కుటుంబానికి మేనత్తగా మెప్పించింది.
విజయలక్ష్మి మాట్లాడుతూ.. ' తాను సురభి కళాకారిణిని. 35 ఏళ్ల పాటు నాటకాలు వేశా, హరికథలు చెప్పా. నంది అవార్డు వచ్చింది. నేను చేసిన తొలి చిత్రం బలగం. నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం దర్శకుడు వేణునే. ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డా. నా భర్త చనిపోయాక పిల్లలకు పెళ్లిళ్లు చేశా. ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. నా చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ సమయంలో నా కోడలు గర్భవతి. నా జీవితంలో అంతుచిక్కని విషాదం. భర్త చనిపోవడం, నాలుగేళ్లకే కుమారుడిని పోగొట్టుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయా. ఆ సంఘటన నుంచి ఇప్పటికీ బయట పడలేకపోతున్నా.' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె నటించిన తొలి సినిమా అయినా తనదైన నటనతో ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment