Venu Yeldandi
-
‘ఎల్లమ్మ’గా సాయి పల్లవి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
వెండితెరపై ఎల్లమ్మగా సాయి పల్లవి(sai Pallavi) కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. నితిన్ హీరోగా ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టాలనుకుంటున్నారు. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు సాయి పల్లవిని అనుకుంటున్నారట. ఆల్రెడీ తెలంగాణ నేటివిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఫిదా, విరాటపర్వం’ చిత్రాల్లో సాయి పల్లవి నటిగా మెప్పించారు. ఇక ఇప్పుడు వేణు తెరకెక్కించే చిత్రం కూడా తెలంగాణ నేపథ్యంలోనే ఉంటుందట. ఎల్లమ్మ(Yellamma) పాత్రకు సాయి పల్లవి అయితేనే న్యాయం చేస్తుందని వేణు, దిల్ రాజు భావిస్తున్నారట. దిల్ రాజు ద్వారా సాయి పల్లవిని కలిసిన వేణు.. కథ చెప్పి ఆమె పాత్ర గురించి వివరించారట. ఆమె పాత్ర నచ్చడంతో సాయి పల్లవి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ గాపిప్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరోసారి తెలంగాణ నేపథ్య సినిమాలో సాయి పల్లవి నటించబోతున్నారనే వార్త తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ గాసిప్ నిజమై.. వెండితెరపై ‘ఎల్లమ్మ’గా సాయి పల్లవి కనిపిస్తారా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
‘బలగం’వేణుకి షాకిచ్చిన నాని.. ‘ఎల్లమ్మ’ రానట్లేనా?
హీరో నాని సినిమా ప్లానింగ్ గురించి అందరికి తెలిసిందే. చేతిలో ఒక్క సినిమా ఉండగానే..మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేసుకుంటాడు. అందుకే హిట్, ఫ్లాప్ తేడా లేకుండా ఈ నేచురల్ స్టార్ నుంచి వరుస సినిమాలు వస్తుంటాయి. గతేడాది డిసెంబర్లో ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకులను పలకరించిన నాని..ఇప్పుడు ‘సరిపోదా శనివారం’తో రాబోతున్నాడు. ఆగస్ట్ 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది. (చదవండి: నా జీవితంలో ఆ 105 రోజులు మర్చిపోలేను)ఈ చిత్రం తర్వాత వరుసగా మూడు సినిమాలు చేయాల్సింది. అందులో ఒకటి బలగం వేణుతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. దిల్ రాజు నిర్మాణ సంస్థలో ఈ సినిమా తెరకెక్కాలి. నాని కోసం ‘ఎల్లమ్మ’ టైటిల్‌తో వేణు ఓ కథను కూడా రెడీ చేశాడట. ‘సరిపోదా శనివారం’ రిలీజ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందనే ప్రచారం జరిగింది. (చదవండి: రిలీజ్‌కు ముందే కల్కి మరో రికార్డు.. )కానీ ఇప్పుడు ఈ చిత్రం క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. నానినే ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడట. బలగం వేణు చెప్పిన కథకు, శ్రీకాంత్ ఓదెల చెప్పిక కథల మధ్య సారూప్యత ఉండడంతో..నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతకు ముందు సాహో ఫేం సుజిత్ సినిమాను కూడా నాని రిజెక్ట్ చేశాడు. మంచి కథ దొరికితే భవిష్యత్తులో నాని-వేణు కాంబినేషన్ కొనసాగే అవకాశం ఉంది. -
సస్పెన్స్ విడిపోయింది.. ఒకేసారి రెండు సినిమాలపై క్లారిటీ
ఇప్పుడున్న హీరోల్లో వేగంగా సినిమాలు చేసేది ఎవరా అని చూస్తే చాలామందికి గుర్తొచ్చే పేరు నాని. ఓ మూవీ సెట్స్‌పై మరొకటి అనౌన్స్ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు మాత్రం డబుల్ ధమాకా ఇచ్చేశాడు. గత కొన్నాళ్ల నుంచి ఏవైతే రూమర్స్ వస్తున్నాయో వాటిపై అధికారికంగా అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమాలు? ఏంటి సంగతి? గతేడాది డిసెంబరులో 'హాయ్ నాన్న' అనే సెంటిమెంట్ మూవీతో హిట్ కొట్టిన హీరో నాని.. ప్రస్తుతం 'సరిపోదా శనివారం' చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 29న థియేటర్లలోకి ఇది రానుంది. దీని షూటింగ్ జోరుగా నడుస్తోంది. మరోవైపు నాని చేయబోయే కొత్త చిత్రాలపై కూడా ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) 'బలగం' దర్శకుడు వేణు.. తన రెండో మూవీతో నానితో చేయబోతున్నాడని చాలారోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. తాజాగా నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలతో పాటు వేణు కూడా నానిని కలిసి విష్ చేయడంతో ఈ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తీసే ఈ సినిమా ప్రకటన త్వరలో వస్తుంది. మరోవైపు 'ఓజీ' తీస్తున్న సుజీత్.. నానితో సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసి మరీ అధికారికంగా ప్రకటించేశారు. క్రూరమైన వ్యక్తి.. సౌమ్యుడిగా మారడంతో అతడి ప్రపంచం తలకిందులైపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో సినిమా చూసి తెలుసుకోవాలని హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాది రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. సో ఇలా తన పుట్టినరోజున రెండు సినిమాల అప్డేట్స్ నాని నుంచి వచ్చేశాయ్. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
'నా బలగం అందరు చూశారు.. ఒక్క ఆయన తప్ప': వేణు ఎమోషనల్ పోస్ట్!
బలగం సినిమాతో అందరినీ ఏడిపించిన డైరెక్టర్ వేణు యెల్దండి. జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న వేణు ఆ తర్వాత నటుడిగా, కమెడియన్‌గా రాణించారు. గతేడాది తెలంగాణ పల్లె నేపథ్యంలో బలగం సినిమాను తెరకెక్కించారు. ఎవరూ ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అప్పటివరకు కమెడియన్‌గా తెలిసిన వేణులో ఇంతమంచి దర్శకుడు ఉన్నాడన్న విషయం తెలిసింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రలో కనిపించారు. అయితే తాజాగా వేణు యెల్దండి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేను తీసిన బలగం సినిమాను అందరు చూశారు.. ఒక్క మానాన్న తప్ప.. మిస్ యూ నాన్న' అంటూ పోస్ట్ చేశారు. దాదాపు 24 ఏళ్ల క్రితమే వేణు తండ్రి మరణించగా.. ఆయనను తలుచుకుని వేణు ఎమోషనలయ్యారు. అంతే కాకుండా తన తండ్రి ఫోటోను షేర్ చేశారు. Naa BALAGAM Cinema andaru choosaaru.. Maa nanna tappa🥲 MISS YOU NAAINA🙏 Late 06/02/2000#father pic.twitter.com/U831rWKRgS — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) February 8, 2024 -
రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు
టాలీవుడ్లో గుర్తుండిపోయే సినిమాల లిస్ట్ తీస్తే అందులో 'బలగం' కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ గ్రామీణ నేపథ్య కథతో తీసిన ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. అప్పటివరకు కమెడియన్ గా తెలిసిన వేణులో ఇంతమంచి దర్శకుడు ఉన్నాడని బయటపెట్టింది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్) ఈ ఏడాది 'బలగం' సినిమాతో దర్శకుడిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన వేణు యెల్దండి.. ఇప్పుడు తండ్రిగా మరోసారి ప్రమోషన్స్ పొందాడు. తనకు అమ్మాయి పుట్టిందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇకపోతే వేణుకి ఇదివరకే ఓ కొడుకు ఉన్నాడు. ఇద్దరూ కలిసి యూట్యూబ్ ఛానెల్లో పలు వీడియోస్ కూడా చేశారు. ఇక 'బలగం' తర్వాత మళ్లీ దిల్ రాజు నిర్మాణంలో వేణు మరో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో 'బలగం'లో యాక్ట్ చేసిన ప్రియదర్శినే హీరోగా నటిస్తున్నాడని టాక్. అయితే ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి) View this post on Instagram A post shared by Venu Yeldandi (@venuyeldandi9) -
టాలీవుడ్లో విషాదం.. బలగం నటుడు కన్నుమూత!
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రం బలగం. వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కాగా.. ఈ సూపర్ హిట్ మూవీలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా నటించారు. మురళీధర్ గౌడ్, కేతిరి సుధాకర్ రెడ్డి, జయరామ్, రూప, రచ్చ రవి ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: బలగం మూవీ అరుదైన ఘనత.. ఇంతవరకు ఏ సినిమాకు దక్కలేదు!) అయితే ఈ చిత్రంలో సర్పంచ్ పాత్రలో కనిపించిన నర్సింగం తాజాగా కన్నుమూశారు. ఈ విషయాన్ని దర్శకుడు వేణు యెల్దండి ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఆయనకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు చిత్రబృందం సభ్యులు ఆయనకు సంతాపం ప్రకటించారు. వేణు ట్వీట్లో రాస్తూ..' నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి. మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి. బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను.ఆరోజు కల్లు, గుడాలు తెప్పించాడు నాకోసం.' అంటూ బలగం సినిమా రోజులను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. (ఇది చదవండి: ‘బలగం’ తర్వాత యష్‌తోనే సినిమా ఎందుకంటే:దిల్ రాజు ) నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి 🙏 మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి🙏 బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను.ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించాడు నాకోసం..🙏 pic.twitter.com/smDHR8ULyU — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) September 5, 2023 -
ఆ ఇద్దరూ కలియుగంలోకి వస్తే?
నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాక్షస కావ్యం’. దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ని ‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి, హీరో తిరువీర్ విడుదల చేసి, సినిమా మంచి హిట్టవ్వాలన్నారు. శ్రీమాన్ కీర్తి మాట్లాడుతూ– ‘‘పురాణాల్లోని జయ విజయలు ఒక్కో యుగంలో ఒక్కో రాక్షసుల్లా పుట్టారు. వాళ్లు ఇప్పుడు కలియుగంలోకి వస్తే ఎలా ఉంటుంది? అనే కాల్పనిక కథతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రంలో మంచి భావోద్వేగాలున్నాయి’’ అన్నారు దాము రెడ్డి. ‘‘టీజర్ ఎంత బాగుందో సినిమా అంతకంటే బాగుంటుంది’’ అన్నారు నవీన్ బేతిగంటి.. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఉమేష్ చిక్కు, సహనిర్మాతలు: నవీన్ రెడ్డి, వసుంధరా దేవి. -
బలగం మూవీ అరుదైన ఘనత.. ఇంతవరకు ఏ సినిమాకు దక్కలేదు!
చిన్న సినిమా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించిన చిత్రం బలగం. తెలంగాణ సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించారు. వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బలగం కలెక్షన్ల వర్షం కురిపించింది. దిల్ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ గ్రామీణ సంప్రదాయాన్ని తెరపై ఆవిష్కరించిన వేణుపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ప్రభావం ఎంతలా ఉందటే.. ఏకంగా పల్లెల్లో ప్రత్యేక షోలు ప్రదర్శించే స్థాయికి చేరుకుంది. అంతలా ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. వెండితెరపై సత్తాచాటిన ఈ చిత్రాన్ని అవార్డులు అంతేస్థాయిలో వరించాయి. ఏకంగా అంతర్జాతీయ వేదికలపై బలగం పేరు మార్మోగింది. (ఇది చదవండి: కానిస్టేబుల్ పరీక్షలో 'బలగం' సినిమాపై ప్రశ్న.. అదేంటంటే?) ఇప్పటివరకు అంతర్జాతీయ వేదికలపై వందకుపైగా అవార్డులు సొంతం చేసుకుని అరుదైన రికార్డ్ సాధించింది. పలు దేశాల్లో జరిగిన ఈవెంట్స్‌లో వివిధ విభాగాల్లో బలగం సినిమాకు అవార్డులు దక్కాయి. ఇంతవరకు ఏ సినిమా సాధించలేని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా నటించారు. మురళీధర్ గౌడ్, కేతిరి సుధాకర్ రెడ్డి, జయరామ్, రూప, రచ్చ రవి ప్రధాన పాత్రల్లో కనిపించారు. గతంలో ‘స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023’లో ‘బలగం’ చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ప్రియదర్శి, ఉత్తమ సహాయ నటుడుగా కేతిరి సుధాకర్ రెడ్డి (కొమురయ్య పాత్రధారి) అవార్డులను గెలుచుకున్నారు. కానిస్టేబుల్, గ్రూప్-4 పరీక్షల్లో ప్రశ్నలు అంతే కాకుండా గతంలో తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షలో ఓ ప్రశ్న వచ్చిందంటే బలగం సినిమాకు ఉన్న ఆదరణ ఏంటో అర్థమవుతోంది. ఇటీవలే జరిగిన గ్రూప్-4 పరీక్షలో సైతం బలగం సినిమా ప్రశ్నను అడిగారు. తెలంగాణలో పల్లెపల్లెలో బలగం సినిమాకు పెద్దఎత్తున అభిమానులు ఉన్నారు. అలాగే మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఉత్తమ నాటకం విభాగంలో అవార్డ్ దక్కింది. (ఇది చదవండి: సమంత కీలక నిర్ణయం.. షాక్‌లో అభిమానులు!) A journey of Excellence and Recognition! ❤️ Earlier, we had Films running for 100 days.. Films running in 100 centers.. Films collecting 100 crores .. Now, we have achieved a film with 100+ international awards ❤️#Balagam is a special film for many reasons 🤗🤗#balagam pic.twitter.com/26yfgS8sse — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) July 4, 2023 -
గ్రూప్-4 పరీక్షలో 'బలగం' సినిమాపై అడిగిన ప్రశ్న ఇదే!
చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై.. ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం 'బలగం'. 'పిట్టకు పెట్టుడు' అనే నేపథ్యంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు యెల్దండి ఈ చిత్రాన్ని నిర్మించారు.. టాలీవుడ్లో పలు అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఓటీటీలో సైతం ఈ సినిమాకు భారీగా ఆదరణను పొందింది. ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి కారణం. ఇందులోని పాత్రలు ప్రతి ఇంట్లో ఉండేవిగా.. మనుషుల బంధాలను, వారి మధ్య ప్రేమలను తెలిపేదిగా తెరకెక్కడమే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో బలగం సినిమాపై ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే ► 'బలగం' చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి? అనే ప్రశ్నకు... A. దర్శకుడు: వేణు యెల్దండి, B. నిర్మాత: దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి, C. సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, D. కొమరయ్య పాత్రను పోషించినారు: ఆరుసం మధుసుధన్ అనే ఆప్షన్స్‌ను జోడించారు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో సినిమా రావడంతో 'బలగం' మూవీకి ఇలాంటి ప్రాముఖ్యత దక్కింది అని చెప్పవచ్చు. గతంలో 'బలగం' నుంచి అడిగిన ప్రశ్న ఇదే ఇదే ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా ఒక ప్రశ్న అడిగారు.. ► 2023లో ఒనికో ఫిలిమ్స్ (ONYKO Films) అవార్డులలో 'బలగం' సినిమాకి ఏ విభాగంలో పురస్కారం (Award) లభించింది? అనే ప్రశ్నకు... 1. ఉత్తమ దర్శకుడు చలనచిత్ర విభాగం, 2. ఉత్తమ డాక్యుమెంటరీ చలనచిత్ర విభాగం, 3. ఉత్తమ నాటకం చలనచిత్ర విభాగం, 4. ఉత్తమ సంభాషణ చలనచిత్ర విభాగం.. అనే ఆప్షన్స్‌ను జోడించారు. ఆ సమయంలో ఇదే విషయాన్ని దర్శకుడు వేణు యెల్దండి ట్విటర్లో పోస్ట్ చేశాడు. అప్పుడు పలు విమర్శలు కూడా వచ్చాయి. సినిమాను మరో రెండుసార్లు అయినా చూస్తాం. కానీ ఈ పరీక్షకు గానీ, కానిస్టేబుల్ చేసే ఉద్యోగానికి గానీ అక్కడ అడిగిన ప్రశ్నతో ఏమైనా సంబంధం ఉందా? ఇలా ఎలా ఆలోచిస్తారు? అంటూ దర్శకుడి వాల్‌పై నెటిజన్లు కామెంట్లు చేశారు. వివాదాలు పక్కనపెడితే ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసేమో మీరు కూడా చెక్ చేసుకోండి. -
‘బలగం’వేణుకి బంపరాఫర్.. బాలయ్యతో సినిమా!
తొలి సినిమాతోనే హిట్ కొట్టిన దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో వేణు యెల్డండి ఒకరు. జబర్దస్త్ కామెడీ షోతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు.. దర్శకుడిగా మారి ‘బలగం’ అనే చిన్న చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు.. పలు అంతర్జాతీయ అవార్డులను సాధించింది. వేణు దర్శకత్వ ప్రతిభపై మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ప్రశంసల జల్లు కురిపించారు. వేణులో ఇంత టాలెంట్ ఉందా అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణలోని పలు గ్రామాల్లో ప్రజలంతా కలిసి ఎల్ఈడీ తెరపై ఈ సినిమా వీక్షించారంటే.. బలగం ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: ఆ ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరీ! ) ఇప్పటి వరకు బలగం సక్సెస్‌ని ఎంజాయ్ చేసిన వేణు.. ఇప్పుడిక తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. తనకు డైరెక్టర్‌గా చాన్స్ ఇచ్చిన దిల్ రాజు బ్యానర్లోనే తన తర్వాతి సినిమా కూడా ఉంటుందని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు వేణు. దిల్ రాజు కూడా ఇదే మాట చెప్పారు. అయితే తర్వాతి సినిమా ఏ హీరోతో తీస్తారనేది ఇప్పటివరకు చెప్పలేదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వేణు తర్వాతి చిత్రంపై క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. (చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి ) వేణు తన రెండో సినిమాను ఓ స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడట. ఆయన ఎవరో కాదు.. నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇప్పటికే బాలయ్యకు వేణు కథ చెప్పాడట. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే రూమర్ కనుక నిజమైతే.. బలగం వేణుకి బంపరాఫర్ దక్కినట్లే అని నెటిజన్స్ అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది వేణు స్పందిస్తేనే తెలుస్తుంది. ఇక బాలయ్య విషయానికొస్తే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు కూడా బాలయ్యకు ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. అలాగే బాలయ్యకు హ్యాట్రిక్ విజయాలు అందించిన బోయపాటి కూడా త్వరలోనే మరో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
కానిస్టేబుల్ పరీక్షలో బలగం ప్రశ్న, దిల్ ఖుష్ అయిన డైరెక్టర్
బలగం సినిమానా? మజాకా? కానిస్టేబుల్ పరీక్షలో బలగం చిత్రానికి సంబంధించిన ప్రశ్న వచ్చిందంటే ఈ మూవీ ఏ రేంజ్లో ఆదరణ పొందిందో అర్థమవుతోంది. ఏప్రిల్ 30న జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో బలగం సినిమాకు వచ్చిన అవార్డుపై ఓ ప్రశ్న అడిగారు. మార్చి 2023లో ఒనికో ఫిలింస్ అవార్డుల్లో ఏ విభాగంలో బలగం సినిమాకు పురస్కారం లభించింది? అని అడిగారు. ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి 1. ఉత్తమ డాక్యుమెంటరీ, 2. ఉత్తమ నాటకం, 3. ఉత్తమ దర్శకుడు, 4. ఉత్తమ సంభాషణ అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. వీటిలో 2. ఉత్తమ నాటకం సరైన సమాధానం. ఈ సినిమా ఒక్క ఒనికో ఫిలిం అవార్డు మాత్రమే ఏంటి లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో బెస్ట్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డులు సైతం సొంతం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలోనూ ఎన్నో అవార్డులు అందుకుని సత్తా చాటింది. తాజాగా కానిస్టేబుల్ పరీక్షలో బలగంపై ప్రశ్న రావడంపై దర్శకుడు వేణు సంతోషం వ్యక్తం చేశాడు. ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. 'నిన్న నా స్నేహితుడొకరు ఈ ఫోటో పంపారు. చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తోంది. నా కలను నిజం చేసిన తెలుగు ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అంటూ చేతులెత్తి నమస్కరించిన ఎమోజీలను జత చేశాడు. Good morning all .. Friend sent me ds pic yesterday,I am very happy and proud. I thank all the Telugu audience. Who made my dreams come true🙏🙏 #balagam @dilrajuprodctns @acharya_venu @BRSHarish @KTRBRS @telangana_folks_ @TelanganaCMO @TelanganaToday pic.twitter.com/IMYrNt2afO — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) May 1, 2023 చదవండి: రూ.7 లక్షలు రావాల్సి ఉంది, చైతన్య మాస్టర్‌కు పేమెంట్ ఆపేశారు కానిస్టేబుల్ పరీక్షలో బలగంపై ప్రశ్న -
కానిస్టేబుల్ పరీక్షలో 'బలగం' సినిమాపై ప్రశ్న.. అదేంటంటే?
తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన చిత్రం 'బలగం'. కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రికార్డులు కొల్లగొట్టింది. ఎప్పుడు తెరపై కనిపించని వారు కూడా ఈ సినిమాలో ఫేమస్ అయిపోయారు. అంతలా ప్రజల ఆదరాభిమానులు సంపాదించుకున్న ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు వరించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ' 'బలగం' తొలి సినిమానే.. కానీ ఆమె జీవితమే ఓ కన్నీటి కథ') అయితే తాజాగా ఈ సినిమాపై తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షలో ఓ ప్రశ్న వచ్చిందంటే బలగం సినిమాకు ఉన్న ఆదరణ ఏంటో అర్థమవుతోంది. ఈనెల 30న జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రశ్నను అడిగారు. మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఓ విభాగంలో బలగం సినిమాకు పురస్కారం లభించింది అన్న ప్రశ్న అడిగారు. అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నకు ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఉత్తమ నాటకం అనేది సరైన సమాధానం. ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఉత్తమ నాటకం విభాగంలో అవార్డ్ దక్కింది. కాగా.. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, వేణు యెల్దండి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికీ పల్లెల్లో ఈ సినిమాను పెద్ద తెరలపై ప్రదర్శిస్తున్నారు. (ఇది చదవండి: తోడుగా ఉన్న భర్త చనిపోయాడు, చేతికందిన కొడుకు కూడా: బలగం నటి) -
నీ మొహానికి హీరోయిన్ అవుతావా?.. అని ఎగతాళి చేశారు!
బలగం సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పల్లె సెంటిమెంట్‌ను తెరపై ఆవిష్కరించిన దర్శకుడు వేణు యెల్దండిని ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో నటీనటులకు మరింత ఫేమ్ తీసుకొచ్చింది. ఇప్పటికీ కూడా గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారంటే ఆ సినిమా ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేని పాత్ర ఒకటుంది. ఆ పాత్ర ఎవరు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి. బలగం సినిమాలో ఆ సీన్ మీకు గుర్తుందా? 'అదేనండి ప్రియదర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి థమ్స్ అప్ బాటిల్ తెచ్చి ఇవ్వడం.. ఆ తర్వాత ప్రియదర్శి సిగ్గుపడడం.. అది చూసి ముసలావిడ ముఖం తిప్పుకోవడం' ఆ సీన్లో బొద్దుగా కనిపించిన అమ్మాయి గురించి మీకు తెలుసా? ఇంతవరకు ఒక్క సినిమా చేయకుండానే అద్భుతంగా నటించింది. ఒక్క డైలాగ్ లేకపోయినా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టింది. ఆ అమ్మాయి పేరే సౌదామిని. ఆర్టిస్ట్ కావాలన్న కోరికతో టాలీవుడ్లో తొలి అవకాశం అందుకున్న సౌదామిని తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (చదవండి: Hollywood Actor: సింగర్‌లా కనిపించేందుకు సర్జరీలు.. యువ నటుడు మృతి!) సౌదామిని మాట్లాడుతూ.. ' వేణు సర్ ఆఫీసుకు వెళ్లాక నన్ను సిగ్గు పడమన్నారు. సిగ్గు పడగానే సెలెక్ట్ చేశారు. వేణు సర్ సౌమ్య పిలిచారు. ఈ సినిమాలో ప్రియదర్శి చాలా సపోర్టింగ్‌గా ఉంటారు. సినిమా కోసం పది కేజీలు పెరిగా. కేకులు తినేసి బరువు పెరిగాను. నాకు ఫన్ జోనర్ అంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ సినిమా ఇదే. బీఎస్సీ ఫస్ట్ ఇయర్లోనే చదువు ఆపేశా. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక ఉండేది. ఎక్కడికైనా వెళ్లాలంటే నాకు భయం. అన్నయ్యను తీసుకెళ్లేవాణ్ని. కొందరు నన్ను చూసి నీ మొహానికి హీరోయిన్ అవుతావా అనేవాళ్లు. నేను ఈ స్థాయికి రావడానికి వేణు సర్ కారణం. వేణు సర్ అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. బలగం సినిమా తర్వాత జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కాల్ చేశారు. మా సినిమాలో నీకు మంచి క్యారెక్టర్ ఇస్తామని చెప్పారు. వేణు సర్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి. తెలుగులో అల్లు అర్జున్, చిరంజీవి నా ఫేవరేట్.' అని చెప్పారు. (చదవండి: Pooja Hegde: బుట్టబొమ్మను వదలని ఫ్లాపులు.. ఆ సినిమాతోనైనా మారేనా!) -
తాగుడుకు బానిసయ్యా.. అసలు ఈ బతుకు ఎందుకు అనుకున్నా?: కమెడియన్
తనదైన బాడీ లాంగ్వేజీతో, తెలంగాణ యాసలో డైలాగులు పలికిస్తూ నవ్వించగల వ్యక్తి కర్తానందం. జబర్దస్త్ స్టేజీపై కమెడియన్‌గా సత్తా చాటిన ఆయన వెండితెరపై కూడా నటుడిగా రాణిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బలగం, దసరా సినిమాల్లో నటించి మరింతమంది ప్రేక్షకులకు దగ్గరైన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్తూ కన్నీటిపర్యంతమయ్యాడు. 'మాది సూర్యాపేట. ఖమ్మంలో పదవ తరగతి వరకు చదువుకున్నా. మేము నలుగురు అన్నదమ్ములం, ఒక చెల్లి. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. మా ఐదుగురిని అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని పోషించింది. తను ఇప్పుడు లేదు, కానీ తన గురించి తలుచుకుంటే కన్నీళ్లాగవు. నేను చిన్నతనం నుంచే నాటకాలు వేసేవాడిని. చదువుకునే వయసులోనే జలగం వెంగళ్రావు చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాలేకపోవడంతో కూలీ పనులు చేశాను. ఎన్నో బాధలు అనుభవించాను. ఈ పరిస్థితుల్లో తాగుడుకు బానిసయ్యాను. ఏ పని చేసినా కలిసిరాలేదు. రోడ్డు పక్కన ఎంగిలి బీడీలు ఏరుకుని తాగాను. ఎందుకు ఈ బతుకు? అనిపించింది. కానీ ఏదో ఒకటి సాధించాలనుకున్నాను. సాయం కోసం మా ఫ్రెండ్స్‌ను ఆశ్రయించాను. అప్పుడు పోలీస్ శాఖ ప్రతి జిల్లాకు కళాబృందాన్ని ఏర్పాటు చేస్తుందన్న విషయం తెలిసింది. వారు నన్ను ఆ కళాబృందానికి హోంగార్డుగా పనిచేయమన్నారు. 22 సంవత్సరాలు అదే ఉద్యోగం చేసి కొంతకాలం క్రితమే రిటైరయ్యాను. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వచ్చిన బోలెడన్ని సినిమాల్లో నటించాను. చాకలి ఐలమ్మ సినిమాలో జబర్దస్త్ రాజమౌళితో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా వేణు టీమ్‌లో చేరాను. దాదాపు 200 ఎపిసోడ్లు చేశాను. నన్ను బుల్లితెరకు పరిచయం చేసిన వేణు బలగం సినిమాలోనూ అవకాశం ఇచ్చాడు. ఆయన నా దేవుడు. ఆయనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను' అంటూ కంటతడి పెట్టుకున్నాడు కర్తానందం. -
ఒక్క షాట్ కోసం..ఎన్నిరోజులు షూట్ చేసామంటే...
-
చిరంజీవి గారు అలా అనేసరికి నేను చాలా...
-
ఈ సినిమా వల్ల నా భార్య పడ్డ కష్టం...
-
' 'బలగం' తొలి సినిమానే.. కానీ ఆమె జీవితమే ఓ కన్నీటి కథ'
తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన చిత్రం 'బలగం'. మానవ సంబంధాలను, ముఖ్యంగా రక్తబంధాన్ని హృదయాలను హత్తుకునేలా చూపించారు. ఈ సినిమా కన్నీళ్లు పెట్టనివారు లేదంటే ఏ రేంజ్లో హిట్ అయిందో అర్థమవుతోంది. అయితే ఈ సినిమాలో నటించిన వారిలో ప్రతి ఒక్కరీ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నవారే. అలాంటివారిలో కీలక పాత్రధారిగా బలగం సినిమాలో మెప్పించిన కొమరయ్య చెల్లెలు పోచవ్వ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. బలగం చిత్రంలో పోచవ్వ పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె సురభి కళాకారిణి కాగా.. ఈ సినిమాలో పోచవ్వ నటనకు ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. కొమరయ్యకు చెల్లెలుగా.. ఆ కుటుంబానికి మేనత్తగా మెప్పించింది. విజయలక్ష్మి మాట్లాడుతూ.. ' తాను సురభి కళాకారిణిని. 35 ఏళ్ల పాటు నాటకాలు వేశా, హరికథలు చెప్పా. నంది అవార్డు వచ్చింది. నేను చేసిన తొలి చిత్రం బలగం. నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం దర్శకుడు వేణునే. ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డా. నా భర్త చనిపోయాక పిల్లలకు పెళ్లిళ్లు చేశా. ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. నా చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ సమయంలో నా కోడలు గర్భవతి. నా జీవితంలో అంతుచిక్కని విషాదం. భర్త చనిపోవడం, నాలుగేళ్లకే కుమారుడిని పోగొట్టుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయా. ఆ సంఘటన నుంచి ఇప్పటికీ బయట పడలేకపోతున్నా.' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె నటించిన తొలి సినిమా అయినా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. -
నా ఇంట్లోనే బలగం షూటింగ్, వేణు కనీసం థ్యాంక్స్ చెప్పలేదు: ఇంటి ఓనర్
కంటెంట్‌లో దమ్ము ఉంటే ఎంత చిన్న సినిమా అయినా, ఎటువంటి ప్రచారం లేకపోయినా కేవలం మౌత్ టాక్‌తో ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పిస్తుంది. బలగం సినిమాకు చిత్రయూనిట్ ఎంత ప్రచారం చేసిందో కానీ జనాలు అంతకుమించి పబ్లిసిటీ చేశారు. ఒకసారి సినిమా చూసి వదిలేయకుండా ఇష్టంగా, బాధ్యతగా కుటుంబాన్ని సైతం థియేటర్‌కు తీసుకెళ్లారు. ప్రేక్షకులే దాన్ని సూపర్ హిట్ చేశారు. బలగం సినిమా షూటింగ్ అంతా సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. సినిమా సక్సెస్ కావడంతో చిత్రీకరణ జరిపిన లొకేషన్స్ కూడా పాపులరయ్యాయి. ఆ లొకేషన్స్‌లో హీరో ఇల్లు కూడా ఉంది. కోనరావుపేట మండలం కోలనూరు గ్రామంలో ఉందీ ఇల్లు. తాజాగా ఈ ఇంటి యజమాని రవీంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'బలగం సినిమా డైరెక్టర్ వేణుది మా ఊరే. దిల్ రాజుగారు సినిమా ఛాన్స్ ఇచ్చారు.. సాయం చేయమని అడిగితే నా ఇల్లు ఇచ్చాను. నెలన్నర రోజులు ఈ ఇంట్లో షూటింగ్ చేస్తే మేము వేరే ఇంట్లో ఉన్నాం. డబ్బులిస్తామన్నారు. కానీ నేనే వేణు దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు. ఈ సినిమా ఊహించనంత పెద్ద హిట్టయింది.. సినిమాలో మా ఇల్లు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ అన్ని వారాలు జరిగింది. కానీ ఏనాడూ దిల్ రాజు గారు ఇక్కడికి రాలేదు. ఆయన కూతురు, తమ్ముడి కొడుకు మాత్రమే వచ్చారు. సినిమా సక్సెస్ అయ్యాక వేణు కనీసం థ్యాంక్స్ చెప్పలేదు. నా నెంబర్ ఆయన దగ్గర ఉంది కానీ ఫోన్ చేయలేదు, మేము గుర్తు రాలేదు. అయినా ఆయన నుంచి ఇవేమీ నేను ఆశించలేదు కూడా! సినిమా కోసం ఇష్టపడి ఇల్లు ఇచ్చాను. దీని నుంచి ఎలాంటి పబ్లిసిటీ కోరుకోవడం లేదు' అని చెప్పుకొచ్చాడు. -
చట్టపరమైన చర్యలు తీసుకోండి.. బలగం డైరెక్టర్‌పై ఫిర్యాదు
పల్లె సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించిన చిత్రం 'బలగం'. చిన్న సినిమా అయినా ఊహించని విజయాన్ని అందుకుంది. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడ చూసినా బలగం మూవీ పేరే వినిపిస్తోంది. ఈ సినిమాలో క్లైమాక్స్ అందరి హృదయాలకు హత్తుకునేలా ఉంది. అంతటి గొప్ప సినిమాను అందించిన దర్శకుడు వేణుపై కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకవైపు వేణుపై ప్రశంసలు కురిపిస్తుంటే.. వారు మాత్రం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. (ఇది చదవండి: బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత) బలగం సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులైన మమ్మల్ని కించపరిచే విధంగా తీసిన సన్నివేశాలు చాలా బాధించాయని తహసీల్దార్ మహేశ్వరను కలిసి వినతిపత్రం అందజేశారు. బలగం సినిమాలో ఎంపీటీసీలను కించపరిచేలా ఉన్న సీన్లను తొలగించి దర్శకుడు వేణుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీలు డిమాండ్ చేస్తున్నారు. -
ఇంత సాహసం ఎవరూ చేయరు.. కానీ చేసి చూపించాడు: పరుచూరి
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం మూవీ సంచలనం సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కాయి. కమెడియన్ వేణు యెల్లండి తెరకెక్కించిన ఈ సినిమాతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు. తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన సమీక్షను వెల్లడించారు. కొత్త సినిమాలను ఎప్పటికప్పుడు ఆయన విశ్లేషిస్తుంటారు. తాజాగా ఆయన ‘బలగం’ మూవీపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సినిమా చూసి తనకు కూడా కన్నీళ్లాగలేదని తెలిపారు. చిత్ర దర్శకుడు వేణు, పాటల రచయిత కాసర్ల శ్యామ్‌ను ఫోన్ చేసి అభినందనలు తెలిపానన్నారు. పరుచూరి మాట్లాడుతూ.. 'ఒక సినిమాకు ఏది బలమో అదే ఇందులో ఉంది. ఇదొక వినూత్నమైన ప్రయోగం. నిజానికి సినిమా చేసేటప్పుడు ఇంతటి విజయం సాధిస్తుందని దిల్‌రాజు కూడా ఊహించి ఉండరు. ఖర్చు పెట్టిన దాని కంటే పదిరెట్లు ఎక్కువే వసూళ్లు రాబట్టింది. అగ్రహీరోలు, దర్శకులు, రచయితలను నమ్ముకోవాల్సిన అవసరం లేదు. కథను మాత్రమే నమ్ముకోవాలి. చిన్న బడ్జెటా? పెద్ద బడ్జెటా? అనేది విషయం కాదు. పెద్ద బడ్జెట్ సినిమాతో సమానంగా నిలిచింది ఈ బలగం. వేణులో ఇంత గొప్ప రచయిత ఉన్నాడా అసలు ఇది ఊహించలేదు. ' అని అన్నారు. వేణు గురించి మాట్లాడుతూ.. 'వేణుని ‘జబర్దస్త్’ కమెడియన్‌గా మాత్రమే చూశా. వేణులో ఇంత గొప్ప రచయిత, ఇంత సృజనాత్మకత ఉందా? అనిపించింది. కామెడీ చేసే కుర్రాడు గుండెలను హత్తుకునే సినిమా తీయగలడా అనేది ఊహకందని అంశం. వేణు చేసిన మాయ ఏంటంటే.. సినిమా మొదటి నుంచి కన్నీళ్లు పెట్టించేలా సినిమా తీయొచ్చు. కానీ అతను అలా చేయలేదు. నవ్విస్తూనే.. చివరకు భావోద్వేగానికి గురి చేశాడు.' అని అన్నారు. (ఇది చదవండి: ‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు) నేను కూాడా కన్నీళ్లు పెట్టుకున్నా పరుచూరి మాట్లాడుతూ.. 'ఒక సినిమా చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలా అరుదు. ఈ మూవీ చూసి నేను కూడా కన్నీళ్లు పెట్టుకున్నా. ఒక కుటుంబం విచ్ఛిన్నమవుతున్నప్పుడు మనం కన్నీళ్లు పెడతాం. కానీ ఇందులో కుటుంబ సభ్యులు కలిసేటప్పుడు భావోద్వేగానికి గురవుతాం. ఇది ఓ అపురూప దృశ్యకావ్యం. క్లైమాక్స్ పది నిమిషాల్లో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోకపోతే నాకు మెసేజ్ పెట్టండి. ఒక మనిషి చనిపోయాక 11 రోజుల కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సాహసమే అని చెప్పాలి. ఇలాంటి సాహసాలు ఎవరూ చేయరు. ఇలాంటి సినిమాలు చూస్తారా? అని భయపడతారు. అలాంటి భయాలేమీ లేకుండా వేణు అద్భుతంగా తెరకెక్కించాడు.' అని అన్నారు. -
అలాంటి పాత్రలు చేయడానికి అభ్యంతరం లేదు: బలగం ఫేమ్
ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా బలగం మాటే వినిపిస్తోంది. అంతలా గ్రామీణ ప్రజలను ఆకట్టుకుంది ఈ చిత్రం. పల్లె సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించిన చిత్రం బలగం. తెలంగాణ పల్లెల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలను తెరపై చక్కగా చూపించారు దర్శకుడు వేణు యెల్దండి. చిన్న సినిమా హృదయాలకు హత్తుకునేలా చేశారు. అంతలా విజయం సాధించిన ఈ చిత్రంపై ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్యకల్యాణ్ రామ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన వారిపై టాలీవుడ్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ చిత్రంలో హీరోకు అత్తమ్మగా, హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్‌కు తల్లి పాత్రలో రూప లక్ష్మి తనదైన నటనతో మెప్పించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన పాత్రకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కుటుంబ నేపథ్యం గురించి వివరించారు. రూప లక్ష్మి మాట్లాడుతూ..'మా నాన్న రైతు. ఆయనకు ఆరుగురు సంతానం. నన్ను లెక్చరర్‌కి దత్తత ఇచ్చారు. అయితే ఇప్పటికీ నేను నా కుటుంబ సభ్యులతో చక్కగా కలిసే ఉంటాను.' అని అన్నారు. మీరు తక్కువ వయసులోనే తల్లి పాత్రను పోషించారు. అలాగే రేపు ప్రభాస్ వంటి హీరోలకు తల్లి పాత్ర చేయమని అడిగితే ఏం చేస్తారని ప్రశ్నించగా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'ఒక మహిళగా సంతృప్తినిచ్చే స్థానం అమ్మ. కాబట్టి అలాంటి పాత్రలు వస్తే నటించటానికి ఎప్పుడు సిద్ధమే. ఇందులో నాకేలాంటి అభ్యంతరం లేదు. 70 ఏళ్ల వ్యక్తికి అమ్మగా నటించాలని అడిగినా నాకేలాంటి ఇబ్బంది లేదు. స్టార్ హీరోలకు అమ్మ పాత్రలో నటించటానికి నేనేప్పుడు సిద్ధమే.' అని అన్నారు. కాగా.. బలగం చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌రామ్‌లతో పాటు సుధాకర్ రెడ్డి, నర్సింహ, రూప లక్ష్మి, మురళీధర్‌లకు చాలా మంచి గుర్తింపు దక్కింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ నేపథ్యంలో సినిమా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గ్రామాల్లో ప్రజలు ఏకంగా పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసుకుని మరీ ఆ సినిమాను చూసేస్తున్నారు. (ఇది చదవండి: అదిరిపోయే లుక్‌తో కాజోల్.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్) -
మేము సినిమాను అడ్డుకోవడం లేదు.. బలగంపై దిల్ రాజు కామెంట్స్
గ్రామాల్లో బలగం సినిమా ప్రదర్శనను తాము అడ్డుకోవడం లేదని నిర్మాత దిల్ రాజు అన్నారు. సినిమా ప్రేక్షకులకు చేరువ కావడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. మా సినిమా చూసిన ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఉన్న మనస్పర్థలు మరిచిపోయి కలుసుకుంటున్నారని వెల్లడించారు. ఒక నిర్మాతగా తనకు ఇంతకంటే అదృష్టం ఏముంటుంది అని అన్నారు. ప్రజలు వివాదాలు పక్కనపెట్టి కలుస్తున్నారంటే తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. చిన్న మాట అంటేనే తట్టుకోలేను మీరు రాజకీయాల్లో వస్తారన్న ప్రశ్నపై దిల్ రాజు స్పందించారు. నేను రాజకీయాల్లో వస్తానా లేదా అన్నది అప్రస్తుతమని కొట్టి పారేశారు. రాజకీయాల్లో ఎన్నో అడ్డుంకులు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. సినీ ఇండస్ట్రీలో చిన్నమాట అంటేనే నేను తట్టుకోలేనని తెలిపారు. అలాంటిది నేను రాజకీయాల్లోకి వస్తాననడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. కాగా.. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించిన 'బలగం'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. చిన్న సినిమా అయినా మానవ సంబంధాలను హృదయాలకు హత్తుకునేలా ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. తెలంగాణ పల్లెల్లో జరిగే సంప్రదాయాలే కథాంశంగా ఈ సినిమాను రూపొందించారు. -
నవ్వుకు బ్రేక్.. కన్నీళ్లు పెట్టిస్తున్న కమెడియన్స్!
సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. కామెడీకి మించిన ఎంటర్టైన్మెంట్ ఏం ఉంటుంది? ఎంత సీరియస్ సినిమా అయినా.. అందులో కాసింత కామెడీ లేకపోతే ఆడియన్స్ సహించరు. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కామెడీకీ, కమెడియన్స్‌కి మన దర్శకులు పెద్ద పీట వేస్తున్నారు. కమెడియన్స్ వల్లే సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. సీరియస్ కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో సీరియస్ సినిమాలు ఎక్కువైయ్యాయి. దీంతో కమెడియన్స్ కూడా తమ రూటు మర్చారు. తమదైన హాస్యంతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యే గిలిగింతలు పెట్టిన కమెడియన్స్.. ఇప్పుడు భయపెడుతున్నారు.. ఏడిపిస్తున్నారు. నవరసాలను పండిస్తూ ‘వావ్’ అనిపిస్తున్నారు. నవ్వుకు బ్రేక్ ఇచ్చిన బ్రహ్మీ దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు విరామం లేకుండా తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు బ్రహ్మానందం. ఆయన పేరు విన్నా..ఫొటో చూసినా నవ్వు రావాల్సిందే. సోషల్‌మీడియా ప్లాట్ ఫామ్స్ లో కనిపించే ఫన్నీ మీమ్స్ బ్రహ్మానందం ప్రస్తావన లేకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు. అంతలా కామెడీ పండించిన బ్రహ్మీ.. సడెన్‌గా నవ్వుకు బ్రేక్ ఇచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’లో చక్రపాణిగా సీరియస్ పాత్రలో నటించి తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బ్రహ్మానందంలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటారు. ఇన్నాళ్లు తనదైన కామెడీతో నవ్వించిన బ్రహ్మానందం..‘రంగమార్తాండ’తో ప్రేక్షకులను ఏడిపించాడు. భయపెట్టిన సునీల్ భీమవరం యాసతో అందరిని నవ్విస్తూ స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు సునీల్. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరితో కలిసి నటించి, తనదైన మార్కు కామెడీకి సరి కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తర్వాత ‘అందాల రాముడు’తో హీరోగా మారాడు. సిక్స్ఫ్యాక్స్ చూపించాడు. అదరిపోయే స్టెప్పులతో అలరించాడు. కానీ వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. రూటు మార్చి మళ్లీ కమెడియన్‌గా మారాడు. కానీ లెక్కల మాస్టార్ సుకుమార్ మాత్రం సునీల్‌ని సీరియస్ ట్రాక్ ఎక్కించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రంలో మంగళం శ్రీనుగా సునీల్ నటన, ఆహార్యం కొత్తగా అనిపించింది. సునీల్ బెదిరిస్తే.. ఆడియన్స్ భయపడ్డారు. దీంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. పుష్ప 2లోనూ సునీల్ సీరియస్ లుక్‌లో కపించబోతున్నాడు. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్’లోనూ సునీల్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ‘సీరియస్’ నరేశ్ రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా రాణించిన వ్యక్తి ‘అల్లరి’ నరేశ్. తొలి సినిమా ‘అల్లరి’ నుంచి 2021లొ వచ్చిన ‘బంగారు బుల్లోడు’ వరకు తనదైన కామెడీతో నవిస్తూ హాస్యరస చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచాడు. కానీ ఇప్పుడే ఈ కామెడీ స్టార్ సీరియస్ బాట పట్టాడు. 2021లో వచ్చిన ‘నాంది’ చిత్రంతో సీరియస్ కథలకు శ్రీకారం చుట్టాడు. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఉగ్రం’ చిత్రంలో పవర్ఫుల్ పోలీసు అధికారిగా నరేశ్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రం మే 5న విడుదల కాబోతుంది. నవ్విస్తూనే..ఏడిపించిన దర్శి తెలంగాణ యాసలో కామెడీ పండిస్తూ అందరిని నవ్విస్తున్న ప్రియదర్శి.. మధ్య మధ్యలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ‘మల్లేశం’ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఇక బలగం సినిమాతో అందరిని నవ్విస్తూనే.. చివర్లో తనదైన నటనతో ఏడిపించాడు. ఎలాంటి పాత్రనైనా పోషించి మెప్పించగలడని ఈ చిత్రంతో నిరూపించాడు. కన్నీళ్లు పెట్టించిన కోవై సరళ టాలీవుడ్లో లేడీ కమెడియన్స్ అనగానే అందరికి గుర్తొంచే పేరు కోవై సరళ. కోవై సరళ, బ్రహ్మానందం కాంబినేషన్ గురించి ఎంత సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్‌లు రాసుకునేవారు మన దర్శకులు. అయితే గతకొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది కోవై సరళ. ఇటీవల ఆమె నటించిన తమిళ మూవీ ‘సెంబి’ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో కోవై సరళ తనలోని నట విశ్వరూపాన్ని చూపించింది. తన మనవరాలికి జరిగిన అన్యాయంపై ఓ బామ్మ చేసే పోరాటమే ఈ చిత్రం. ఇందో బామ్మగా నటించిన కోవై సరళ.. తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించింది. కొన్ని సన్నివేశాల్లో కోవై సరళ నటన చూస్తే.. కన్నీళ్లు ఆగవు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. సత్యం రాజేశ్ నట విశ్వరూపం ఇన్నాళ్లు తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించిన సత్యం రాజేశ్.. ‘మా ఊరి పొలిమేర’ వెబ్ సిరీస్‌తో అందరిని భయపెట్టాడు. ఉత్కంఠగా సాగే ఆ వెబ్ సిరీస్‌లో ఆటో డ్రైవర్ కొమిరిగా సత్యం రాజేశ్ జీవించేశాడు. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. అందరిని భయపెట్టిస్తాడు. త్వరలోనే ‘మా ఊరి పొలిమేర 2’ కూడా రాబోతుంది. ఇందులో సత్యం రాజేశ్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. బలగం వేణు జబర్దస్త్ కామెడీ షోతో అందరికి పరిచమైన కమెడియన్ వేణు. చాలా కాలంగా కమెడియన్‌గా రాణిస్తున్న వేణుకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘బలగం’ మూవీతో వేణు పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. కమెడియన్ వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా? అని అందరు చర్చించుకునేలా చేసింది. తెలంగాణ పల్లె నేపథ్యంలో వేణు తెరకెక్కించిన ‘బలగం’ చిత్రం..బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ వేణు ప్రతిభ గురించే చర్చిస్తున్నారు. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇలా వెండితెరపై నవ్వులు కురిపించే కమెడియన్స్.. నవ్వుకు బ్రేక్ ఇచ్చి.. సీరియస్ ట్రాక్ ఎక్కి మెప్పిస్తున్నారు. -
బలగం మూవీ.. ఆడియన్స్‌కు షాకిచ్చిన దిల్ రాజు!
పల్లె సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించిన చిత్రం బలగం. తెలంగాణ పల్లెల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలను తెరపై చక్కగా చూపించారు. చిన్న సినిమా హృదయాలకు హత్తుకునేలా చేశారు దర్శకుడు వేణు. అంతలా విజయం సాధించిన ఈ చిత్రంపై ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక గ్రామాల్లో అయితే ఏకంగా అందరూ ఒకచోట చేరి మరీ పెద్ద తెరలపై చూస్తున్నారు. కుటుంబ సభ్యుల భావోద్వేగాలకు కనెక్ట్ కావడంతో సినిమా చూసిన వారు కన్నీళ్లు ఆపులేకపోతున్నారు. ఇంతగా భారీ విజయం సాధించిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తూ.. అవార్డులు కూడా కొల్లగొడుతోంది. అయితే తాజాగా బలగం సినిమా మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కూడా ఎవరో కాదు. ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు టీమ్ కావడం గమనార్హం. వేణు ఎల్దండి మొదటిసారి దర్శకుడిగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు వారసులు హన్షిత, హర్షిత్ రెడ్డి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. తన సినిమాకు సక్సెస్ వస్తే ఏ నిర్మాత అయినా సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ అందుకు భిన్నంగా దిల్ రాజు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు ప్రధాన కారణం ఈ చిత్రాన్ని గ్రామాల్లో పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి ప్రదర్శించడమే. ఇలా చేయడం నేరమని ఆరోపిస్తూ నిజామాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది దిల్ రాజు టీం. తమ అనుమతి లేకుండా ఇలా చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీని కోరారు. ఇలా చేయడం వల్ల తమ ఆదాయానికి గండి పడుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు వచ్చిన ఆదరణ చూసి సంతోషించాల్సింది పోయి.. ఫిర్యాదు చేస్తారా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.