
బలగం సినిమాతో అందరినీ ఏడిపించిన డైరెక్టర్ వేణు యెల్దండి. జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న వేణు ఆ తర్వాత నటుడిగా, కమెడియన్‌గా రాణించారు. గతేడాది తెలంగాణ పల్లె నేపథ్యంలో బలగం సినిమాను తెరకెక్కించారు. ఎవరూ ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అప్పటివరకు కమెడియన్‌గా తెలిసిన వేణులో ఇంతమంచి దర్శకుడు ఉన్నాడన్న విషయం తెలిసింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రలో కనిపించారు.
అయితే తాజాగా వేణు యెల్దండి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేను తీసిన బలగం సినిమాను అందరు చూశారు.. ఒక్క మానాన్న తప్ప.. మిస్ యూ నాన్న' అంటూ పోస్ట్ చేశారు. దాదాపు 24 ఏళ్ల క్రితమే వేణు తండ్రి మరణించగా.. ఆయనను తలుచుకుని వేణు ఎమోషనలయ్యారు. అంతే కాకుండా తన తండ్రి ఫోటోను షేర్ చేశారు.
Naa BALAGAM Cinema andaru choosaaru..
Maa nanna tappa🥲
MISS YOU NAAINA🙏
Late 06/02/2000#father pic.twitter.com/U831rWKRgS— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) February 8, 2024