చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై.. ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం 'బలగం'. 'పిట్టకు పెట్టుడు' అనే నేపథ్యంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు యెల్దండి ఈ చిత్రాన్ని నిర్మించారు.. టాలీవుడ్‌లో పలు అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఓటీటీలో సైతం ఈ సినిమాకు భారీగా ఆదరణను పొందింది. ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి కారణం. ఇందులోని పాత్రలు ప్రతి ఇంట్లో ఉండేవిగా.. మనుషుల బంధాలను, వారి మధ్య ప్రేమలను తెలిపేదిగా తెరకెక్కడమే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో బలగం సినిమాపై ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే
► 'బలగం' చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి? అనే ప్రశ్నకు... A. దర్శకుడు: వేణు యెల్దండి, B. నిర్మాత: దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి, C. సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, D. కొమరయ్య పాత్రను పోషించినారు: ఆరుసం మధుసుధన్ అనే ఆప్షన్స్‌ను జోడించారు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో సినిమా రావడంతో 'బలగం' మూవీకి ఇలాంటి ప్రాముఖ్యత దక్కింది అని చెప్పవచ్చు.
గతంలో 'బలగం' నుంచి అడిగిన ప్రశ్న ఇదే
ఇదే ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా ఒక ప్రశ్న అడిగారు..
► 2023లో ఒనికో ఫిలిమ్స్ (ONYKO Films) అవార్డులలో 'బలగం' సినిమాకి ఏ విభాగంలో పురస్కారం (Award) లభించింది? అనే ప్రశ్నకు... 1. ఉత్తమ దర్శకుడు చలనచిత్ర విభాగం, 2. ఉత్తమ డాక్యుమెంటరీ చలనచిత్ర విభాగం, 3. ఉత్తమ నాటకం చలనచిత్ర విభాగం, 4. ఉత్తమ సంభాషణ చలనచిత్ర విభాగం.. అనే ఆప్షన్స్‌ను జోడించారు.
ఆ సమయంలో ఇదే విషయాన్ని దర్శకుడు వేణు యెల్దండి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అప్పుడు పలు విమర్శలు కూడా వచ్చాయి. సినిమాను మరో రెండుసార్లు అయినా చూస్తాం. కానీ ఈ పరీక్షకు గానీ, కానిస్టేబుల్ చేసే ఉద్యోగానికి గానీ అక్కడ అడిగిన ప్రశ్నతో ఏమైనా సంబంధం ఉందా? ఇలా ఎలా ఆలోచిస్తారు? అంటూ దర్శకుడి వాల్‌పై నెటిజన్లు కామెంట్లు చేశారు. వివాదాలు పక్కనపెడితే ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసేమో మీరు కూడా చెక్ చేసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment