తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన చిత్రం 'బలగం'. కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రికార్డులు కొల్లగొట్టింది. ఎప్పుడు తెరపై కనిపించని వారు కూడా ఈ సినిమాలో ఫేమస్ అయిపోయారు. అంతలా ప్రజల ఆదరాభిమానులు సంపాదించుకున్న ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు వరించిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: ' 'బలగం' తొలి సినిమానే.. కానీ ఆమె జీవితమే ఓ కన్నీటి కథ')
అయితే తాజాగా ఈ సినిమాపై తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షలో ఓ ప్రశ్న వచ్చిందంటే బలగం సినిమాకు ఉన్న ఆదరణ ఏంటో అర్థమవుతోంది. ఈనెల 30న జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రశ్నను అడిగారు. మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఓ విభాగంలో బలగం సినిమాకు పురస్కారం లభించింది అన్న ప్రశ్న అడిగారు. అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నకు ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఉత్తమ నాటకం అనేది సరైన సమాధానం. ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఉత్తమ నాటకం విభాగంలో అవార్డ్ దక్కింది. కాగా.. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, వేణు యెల్దండి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికీ పల్లెల్లో ఈ సినిమాను పెద్ద తెరలపై ప్రదర్శిస్తున్నారు.
(ఇది చదవండి: తోడుగా ఉన్న భర్త చనిపోయాడు, చేతికందిన కొడుకు కూడా: బలగం నటి)
Comments
Please login to add a commentAdd a comment