Mains exam
-
Andhra pradesh: జనవరి 5న గ్రూప్–2 మెయిన్స్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గ్రూప్–2 మెయిన్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ బుధవారం వెల్లడించారు. డీఎస్సీ, ఎస్ఎస్సీ తదితర పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌పై వివరణ తీసుకుని గ్రూప్–2 మెయిన్స్ తేదీని ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు.కాగా, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 899 గ్రూప్–2 కేటగిరీ పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ నిర్వహించగా, 4,04,039 మంది హాజరయ్యారు. ఏప్రిల్ 5న ఫలితాలు ప్రకటించారు. ఇందులో మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో 89,900 మంది అర్హత సాధించినట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. వాస్తవానికి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కమిషన్ నిర్ణయించినప్పటికీ... నిరుద్యోగ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఎక్కువ మందికి మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు.వాస్తవానికి జూన్‌లోనే మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించినప్పటికీ చైర్మన్ లేకపోవడం, ఇతర కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేశారు. తాజాగా జనవరి 5న మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆఫ్ లైన్లో నిర్వహించే ఈ పరీక్షలకు సంబంధించి పేపర్–1, పేపర్–2లలో 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.భర్తీ చేస్తున్న పోస్టులు ఇవే...ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్–2 నోటిఫికేషన్లో డిప్యూటీ తహసీల్దార్–114, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్–150, గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్–4, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్–16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్–28 పోస్టులతోపాటు 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఏవో), సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మరో రెండు పోస్టులను కలిపారు. -
రిజర్వ్డ్ కేటగిరీలకు నష్టం జరగదు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షల విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్న వాదన పచ్చి అబద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను భరోసా ఇస్తున్నానని, మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి నష్టం జరగలేదని, భవిష్యత్తులో కూడా ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. ఆదివారం గాం«దీభవన్‌లో ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఇతర నేతలతో కలసి మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు గ్రూప్–1 మెయిన్స్ విషయంలో నిరుద్యోగులను రెచ్చగొడుతూ.. లేనిపోని అనుమానాలు, అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. అపోహలు వద్దు ‘పీసీసీ అధ్యక్షుడిగా, బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిగా గ్రూప్–1 అభ్యర్థులందరికీ భరోసా ఇస్తున్నా. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు అన్యాయం జరగదు. ఇది పార్టీ, ప్రభుత్వ పక్షాన మేమిస్తున్న భరోసా. అన్ రిజర్వ్డ్ మెరిట్ జాబితాలోకి వచ్చిన అభ్యర్థులను మళ్లీ రిజర్వ్డ్ కేటగిరీలో లెక్కించరు. మెరిట్ జాబితాలో ఎంపికైన రిజర్వ్డ్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలోనే కొనసాగుతారు. రిజర్వ్డ్ పోస్టుల్లో తక్కువ పడితేనే ఇతర అభ్యర్థులను తీసుకుంటారు. అందుకే సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అసలు నష్టమే జరగదు. అర్థం చేసుకోవాలి’అని మహేశ్‌గౌడ్ వివరించారు. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి గాం«దీభవన్ సేకరించిన సమాచారం ప్రకారం.. మొత్తం అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులే 75 శాతం ఉంటారని మహేశ్‌గౌడ్ చెప్పారు. కానీ బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై పరీక్షల విషయంలో లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. పదేళ్లలో ఎన్ని గ్రూప్–1 ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన బీఆర్ఎస్ది చిత్తశుద్ధా? పది నెలల్లో 50వేల ఉద్యోగాలిచ్చిన కాంగ్రెస్‌ది చిత్తశుద్ధా అన్నది నిరుద్యోగులు ఆలోచించాలన్నారు. ఇంటర్ ఫలితాలను కూడా సక్రమంగా ఇవ్వలేని బీఆర్ఎస్ తమకు బుదు్ధలు చెప్పాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. దేశంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ.. ఎన్ని ఉద్యోగాలిచ్చిందో బండి సంజయ్ చెప్పాలని, ఏ ముఖం పెట్టుకుని బీజేపీ నేతలు ధర్నాలు చేస్తున్నారో చెప్పాలని విమర్శించారు. -
నేటి నుంచే గ్రూప్–1 మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సివిల్ సర్విస్ ఉద్యోగాలుగా పేర్కొనే గ్రూప్–1 కొలువుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. ఈనెల 27వ తేదీ వరకు వరుసగా జరిగే ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు కలిపి.. మొత్తం 46 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.మొత్తం 563 గ్రూప్–1 పోస్టుల కోసం 31,383 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు పరీక్షల నిర్వహణ, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. సహాయకుల (స్క్రైబ్) ద్వారా పరీక్ష రాసే దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట అదనంగా కేటాయిస్తారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు.ఏడు రోజులు... ఏడు పరీక్షలు.. సోమవారం నుంచి 27వ తేదీ వరకు ఏడు రోజులు.. ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రతి పరీక్షకు 3గంటల సమయం ఉంటుంది. ప్రతి పరీక్షకు గరిష్ట మార్కులు 150. జనరల్ ఇంగ్లిష్ మినహా మిగతా పరీక్షలను ఇంగ్లి‹Ù, తెలుగు, ఉర్దూ భాషల్లో ఏదో ఒక దానిలో రాయవచ్చు. అయితే అన్ని పరీక్షలను ఒకే భాషలో రాయాలి. అభ్యర్థులు అన్ని పరీక్షలకు తప్పకుండా హాజరుకావాలి. అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 1.30 గంటలకు పరీక్షా కేంద్రాన్ని మూసివేస్తారు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులను లోనికి అనుమతించరు. అభ్యర్థి తొలి పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలి. డూప్లికేట్ హాల్‌టికెట్ జారీ చేసే అవకాశం ఉండదు. -
కానిస్టేబుల్ పరీక్షలో 'బలగం' సినిమాపై ప్రశ్న.. అదేంటంటే?
తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన చిత్రం 'బలగం'. కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రికార్డులు కొల్లగొట్టింది. ఎప్పుడు తెరపై కనిపించని వారు కూడా ఈ సినిమాలో ఫేమస్ అయిపోయారు. అంతలా ప్రజల ఆదరాభిమానులు సంపాదించుకున్న ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు వరించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ' 'బలగం' తొలి సినిమానే.. కానీ ఆమె జీవితమే ఓ కన్నీటి కథ') అయితే తాజాగా ఈ సినిమాపై తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షలో ఓ ప్రశ్న వచ్చిందంటే బలగం సినిమాకు ఉన్న ఆదరణ ఏంటో అర్థమవుతోంది. ఈనెల 30న జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రశ్నను అడిగారు. మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఓ విభాగంలో బలగం సినిమాకు పురస్కారం లభించింది అన్న ప్రశ్న అడిగారు. అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నకు ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఉత్తమ నాటకం అనేది సరైన సమాధానం. ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఉత్తమ నాటకం విభాగంలో అవార్డ్ దక్కింది. కాగా.. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, వేణు యెల్దండి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికీ పల్లెల్లో ఈ సినిమాను పెద్ద తెరలపై ప్రదర్శిస్తున్నారు. (ఇది చదవండి: తోడుగా ఉన్న భర్త చనిపోయాడు, చేతికందిన కొడుకు కూడా: బలగం నటి) -
గ్రూప్–1 మెయిన్స్‌కు తండ్రీ తనయుడు
యాదగిరిగుట్ట రూరల్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి మెయిన్స్‌కు తండ్రీ కొడుకులు అర్హత సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు ఏలూరు బాలనర్సయ్య (48), ఏలూరు సచిన్ (22) శనివారం విడుదలైన ఫలితాల్లో ఒకేసారి ఈ ఘనత సాధించారు. బాలనర్సయ్య ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. సచిన్ హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటూ గ్రూప్–1కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా తండ్రి ఇంతకుముందే గ్రామంలో సర్పంచ్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ఇద్దరూ ఒకేసారి మెయిన్స్‌కి అర్హత సాధించడం ఆనందంగా ఉందని బాలనర్సయ్య చెప్పారు. -
నకిలీ హాల్ టికెట్‌తో సివిల్స్ పరీక్షకు..
సాక్షి, హైదరాబాద్: యూపీఎస్సీ సివిల్‌సర్వీసెస్(మెయిన్స్) పరీక్షలకు శుక్రవారం ఓ యువతి నకిలీ హాల్‌టికెట్‌తో రావడాన్ని అధికారులు గుర్తించారు. కర్నూల్ జిల్లాకు చెందిన యువతి బజార్‌ఘాట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రంలో హాల్‌టికెట్(నెంబర్ 7601738) పరీక్షకు హాజరయ్యింది. హాల్ టికెట్‌ను పరిశీలించిన చీఫ్ అబ్జర్వర్ నకిలీదిగా గుర్తించారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు హైదరాబాద్ జిల్లా పౌరసంబంధాల అధికారి పేర్కొన్నారు. -
2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల విడుదల
సాక్షి, ఢిల్లీ : ప్రతిష్టాతకమైన ఇండియన్ సివిల్ సర్వీసెస్ 2019కి సంబంధించిన తుది ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాకమైన సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో 304 జనరల్, 78 ఈబీసీ, 254 ఓబీసీ, ఎస్సీ 129, ఎస్టీ 67 మంది ఉన్నారు. కాగా సివిల్ సర్వీస్ ఫలితాల్లో ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్, జతిన్ కిషోర్ రెండవ ర్యాంకు, ప్రతిభా వర్మ మూడవ ర్యాంక్ సాధించారు. కాగా అభ్యర్థులు తమ ఫలితాలను యూపీఎస్సీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలంగాణ యువకుడు తన సత్తా చాటాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డిపేటకు చెందిన మంద మకరంద్ ఆలిండియా 110 ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్‌తో మకరంద్‌కు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. కాగా మకరంద్ తల్లిదండ్రులిద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రస్తుతం మకరంద్ కుటుంబం సిద్దిపేటలో నివాసం ఉంటుంది. -
అక్టోబర్ 4న సివిల్స్ ప్రిలిమినరీ
న్యూఢిల్లీ: అక్టోబర్ 4వ తేదీన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుందని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం తెలిపింది. మేలోనే జరగాల్సిన ఈ పరీక్ష కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ప్రిలిమినరీ, మెయిన్స్‌లో ఎంపికైన విద్యార్థులకు పర్సనాలిటీ టెస్టులు జూలై 20 నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ చెప్పారు. లాక్‌డౌన్‌కు కేంద్రం సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సవరించిన క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 4(ఆదివారం), మెయిన్స్ 2021జనవరి 8(శుక్రవారం)న ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మెయిన్స్ 5 రోజుల పాటు సాగనున్నట్లు తెలిపారు. ఈ తేదీలు మారే అవకాశం కూడా ఉంటుందన్నారు. 2019 సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించిన మెయిన్స్ వచ్చే నెల 20న ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఎన్డీఏ, ఎన్ఏ (1) తో పాటు ఎన్డీఏ, ఎన్ఏ (2) 2020ను సెప్టెంబర్ 6న జరుగుతాయని యూపీఎస్సీ పేర్కొంది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కోసం అక్టోబర్ 4న జరగాల్సిన ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలు వాయిదా పడినట్లు తెలిపింది. -
ఏప్రిల్ 7 నుంచి గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు
సాక్షి, అమరావతి : గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 7వ తేదీ నుంచి 19 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు గురువారం రివైజ్డ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా పలువురు అభ్యర్థుల నుంచి పరీక్షలు వాయిదా వేయాలని విన్నపాలు అందడంతో కమిషన్ ఇటీవల పరీక్షల్ని వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తేదీల వారీగా, పేపర్ల వారీగా ఆయా పరీక్షల రివజ్డ్ షెడ్యూల్ ఇలా... ఏప్రిల్ 7 : తెలుగుపేపర్ (క్వాలిఫయింగ్ నేచర్) ఏప్రిల్ 8 : ఇంగ్లిష్ పేపర్ (క్వాలిఫయింగ్ నేచర్) ఏప్రిల్ 11 : పేపర్1 ఏప్రిల్ 13 : పేపర్2 ఏప్రిల్ 15 : పేపర్3 ఏప్రిల్ 17 : పేపర్4 ఏప్రిల్ 19 : పేపర్5 వీటితో పాటు గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 10, 11 : అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మే 11 : మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ మే 12 : సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్ ,ఇంజనీరింగ్ పీటీవో, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ కెమిస్ట్ ఏపీ గ్రౌండ్ వాటర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ -
ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు
సాక్షి, అమరావతి: డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్లో ఏపీపీఎస్సీ స్వల్ప మార్పులు చేసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య ప్రకటన విడుదల చేశారు. పాత షెడ్యూల్ ప్రకారం డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టుల మెయిన్ పరీక్ష నవంబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం నవంబర్ 29, 30వ తేదీలలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ మెయిన్ పరీక్ష ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6,8వ తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా, నవంబర్ 6, 7వ తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్ 6న ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్– 2 పరీక్షలను నిర్వహిస్తారు. పేపర్–3 పరీక్షను నవంబర్ 7న మధ్యాహ్నం నిర్వహించనున్నారు. -
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు వెల్లడి
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రధాన పరీక్ష ఫలితాలను గురువారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి దేశ రాజధానిలోని యూపీఎస్సీ కార్యాలయంలో ప్రారంభమయ్యే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు తమ వయస్సు, విద్యార్హతలు, కుల ధ్రువీకరణ తదితర అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అందజేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 60 మంది ఎంపికైనట్లు శిక్షణా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మెయిన్స్‌లో అర్హత పొందని వారి మార్కులను ఇంటర్వ్యూలు పూర్తయిన 15 రోజుల్లోగా యూపీఎస్సీ వెబ్సైట్లో ఉంచుతుంది. -
సివిల్స్-2017 మెయిన్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ : సివిల్స్-2017 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ) ఈ ఫలితాలను తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్యలో సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన సంగతి తెలిసిందే. మూడు స్టేజీల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ను యూపీఎస్సీ నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్, మూడు ఇంటర్వ్యూ. మెయిన్స్ ఎగ్జామ్‌ను క్లియర్ చేసిన అభ్యర్థుల రోల్ నెంబర్లను www.upsc.gov.in పొందుపరిచినట్టు యూపీఎస్సీ పేర్కొంది. ఈ ఎగ్జామ్‌లో ఎంపికైన వారికి ఫిబ్రవరి 19 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశముందని యూపీఎస్సీ తెలిపింది. జనవరి 18 నుంచి ఈ వెబ్సైట్లో ఇంటర్వ్యూ లెటర్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు వయసు, విద్యార్హతల సర్టిఫికేట్లు, కమ్యూనిటీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వంటి ఇతర ఒరిజనల్ డాక్యుమెంట్లను పట్టుకుని రావాల్సి ఉంటుందని యూపీఎస్సీ తెలిపింది. క్వాలిఫై కానీ అభ్యర్థుల మార్కు షీట్లను కూడా తుది ఫలితాల వెల్లడి నుంచి 15 రోజుల్లో యూపీఎస్సీ తన వెబ్సైట్లో పెట్టనుంది. -
సజావుగా గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పేపర్–4 శనివారం సజావుగా జరిగింది. పరీక్ష జరుగుతున్న ఎస్ఎస్బీఎన్ డిగ్రీ, జూనియర్ కళాశాల కేంద్రాలను కలెక్టర్ జి.వీరపాండియన్ సందర్శించారు. పరీక్ష జరుగుతున్న తీరును డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవిని అడిగి తెలుసుకున్నారు. మొత్తం 688 మంది అభ్యర్థులకుగానూ 410 మంది హాజరైనట్లు కలెక్టర్‌కి డీఆర్ఓ చెప్పారు. పరీక్ష నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లను చేశామని, కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ మలోలా, ఏపీపీఎస్సీ సహాయ కార్యదర్శులు ఆర్.వి.రమణ, మహబూబ్‌బాషా, సుధాకర్‌బాబు, తదితరులు ఉన్నారు. -
ప్రశాంతంగా గ్రూప్-2
అనంతపురం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని 12 కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్–2 మెయిన్ పరీక్ష తొలిరోజు శనివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,686 మంది అభ్యర్థుల్లో 1,615 మంది హాజరయ్యారు. 71 మంది గైర్హాజయ్యారు. తొలి రోజు 95.78 హాజరుశాతం నమోదైంది. -
గ్రూప్-1 మెయిన్స్ 13వ తేదీ పరీక్ష వాయిదా
హైదరాబాద్: 2011 గ్రూప్-1 మెయిన్స్ తొలి రోజు పరీక్షను ఈనెల 13వ తేదీ నుంచి 24వ తేదీకి మార్పు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మెయిన్స్ పరీక్షలు ఈనెల 13 నుంచి ప్రారంభమై 23వ తేదీ వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ ఇంతకు ముందు ప్రకటించింది. అయితే బక్రీద్ పండగను ఈనెల 12వ తేదీకి బదులు 13వ తేదీకి మార్పు చేయడంతో ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ తొలి రోజు పరీక్షను 13వ తేదీకి బదులు 24వ తేదీకి మార్పు చేసింది. విద్యార్ధులు ఈ మార్పును గమనించాలని సూచించింది. పరీక్ష కేంద్రాలు దూరాభారం ఇలా ఉండగా హైదరాబాద్ కేంద్రంగా పరీక్షలు రాయాలనుకున్నవారికి కేటాయించిన సెంటర్లు దూరాభారంగా ఉన్నాయని ఆయా అభ్యర్ధులు వాపోతున్నారు. ముఖ్యంగా గ్రూప్-1 పరీక్షల కోసం తెలంగాణ ప్రాంత జిల్లాలవారే కాకుండా ఏపీలోని పలు జిల్లాల నుంచి అభ్యర్ధులు హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో చేరారు. వీరంతా పరీక్షలను హైదరాబాద్ కేంద్రం నుంచి రాయడానికి ఆప్షన్ ఇచ్చారు. అయితే వీరికి కేటాయించిన కేంద్రాలు హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండడంతో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. పరీక్ష కేంద్రానికి వెళ్లిరావడానికి దాదాపు 2గంటలకు పైగా సమయం పడుతోందని, ఇలా పరీక్షలన్ని రోజులూ అయిదారు గంటలు ప్రయాణానికే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను కేంద్రాలుగా కేటాయింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు కావలసి ఉందని ఏపీపీఎస్సీ వర్గాలు వివరించాయి. అనుమతుల విషయంలో ఇబ్బందులు ఉన్నందున ప్రైవేటు విద్యాసంస్థలను ఎంచుకుని అభ్యర్ధులకు కేటాయించామని పేర్కొన్నాయి. -
రేపు జేఈఈ మెయిన్ రాతపరీక్ష
హాజరుకానున్న దాదాపు లక్షన్నర మంది విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ మే 24న జేఈఈ అడ్వాన్స్డ్ ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు ఈసారి ఒకే కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ/ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ రాత పరీక్ష శనివారం (ఈనెల 4న) జరగనుంది. దీనితోపాటు ఈ నెల 10, 11వ తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఏర్పాట్లు పూర్తిచేసింది. బీఈ/బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించిన రాత పరీక్ష పేపర్-1 ఉదయం 9:30 నుంచి 12.30 వరకు.. బీఆర్క్/బీప్లానింగ్‌లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఈ రెండు పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. అయితే పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించబోమని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ఇక 10, 11 తేదీల్లో జరిగే ఆన్లైన్ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12.30 వరకు జరుగుతాయి. విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. మొత్తంగా ఈ పరీక్షలకు తెలంగాణ నుంచి 70 వేల మంది హాజరుకానుండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 80 వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 27న జేఈఈ మెయిన్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా టాప్ లక్షన్నర మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తారు. జేఈఈ మెయిన్ ర్యాంకులను జూలై 7న ప్రకటిస్తారు. ఇవీ పరీక్ష కేంద్రాలు.. 4న జరిగే ఆఫ్‌లైన్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 150 కేంద్రాలను సీబీఎస్ఈ ఏర్పాటు చేసింది. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లా కేంద్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. 10, 11వ తేదీల్లో జరిగే ఆన్లైన్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 283 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో... ఏ పీలోని బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏ లూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కంచికచర్ల, కర్నూలు, నరసారావుపేట, నెల్లూ రు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తా డేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, వైజాగ్, విజ యనగరంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మే 24న అడ్వాన్స్డ్.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను మే 24న నిర్వహించేందుకు బాంబే ఐఐటీ చర్యలు చేపట్టింది. జేఈఈ మెయిన్‌లో టాప్ లక్షన్నర మంది విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. వారు మే 2 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 24న పరీక్ష నిర్వహించి జూన్ 18న ఫలితాలు ప్రకటిస్తారు. రెండింటికి ఒకే కౌన్సెలింగ్! ఏటా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను జూన్‌లో ప్రకటించి, ఎన్ఐటీ/ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ ఫలితాలను జూలైలో ప్రకటిస్తున్నారు. ఇలా వేర్వేరు తేదీల్లో ఫలితాలు ప్రకటించి, ప్రవేశాలు చేపట్టడం వల్ల ఎన్ఐటీల్లో సీట్లు మిగిలి పోతున్నాయి. ఐఐటీలో సీటు వస్తుందో రాదో తెలియక ఎన్ఐటీలో చేరి పోవడం, తీరా ఐఐటీలో వస్తే ఎన్ఐటీలో సీటువదులుకోవడంతో మరో విద్యార్థి నష్టపోవాల్సి వస్తోంది. దీంతో ఈసారి రెండింటికీ ఒకేసారి కౌన్సెలింగ్ ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపట్టింది. -
తెలుగులోనే సివిల్స్
విజయనగరం ఫూల్‌బాగ్ : సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలను తెలుగులోనే నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఎంపీలు ఒత్తిడి తేవాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. శనివా రం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ)ఆధ్వర్యంలోతెలుగులో సివిల్స్ నిర్వహించడంతో పాటు సీశాట్ రద్దు చేయాలని కోరుతూ పలు ప్రజాసంఘాలు, మేధావులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీవైఎఫ్ఐరాష్ట్ర కార్యదర్శి ఎం. సూర్యారావు మాట్లాడుతూ, ప్రస్తుత సివిల్స్ పరీక్షా విధానం వల్ల సామాజిక శాస్త్రాల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. సీ శాట్‌ను రద్దుచేయడంతో పాటు ప్రాంతీయ భాషల్లో సివిల్స్ నిర్వహించాలని దేశవ్యాప్తంగా ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విషయమై ప్రస్తుతం పార్లమెంట్లో చర్చ జరుగుతోందని, ఇప్పటికైనా తెలుగు ఎంపీలంతా ఏకమై ప్రాంతీయభాషల్లో సివిల్స్ నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రిటైర్డ్ ఆర్డీఓ కె.ఆర్.డి.ప్రసాద్ మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సివిల్స్ పరీక్షా విధానంలో మార్పులు అవసరమేనని అభిప్రాయపడ్డారు. పంచాయతీరాజ్ ఏఈఈ ప్రభాత్ మాట్లాడుతూ, 2011 నుంచి అమల్లోకి వచ్చిన సీ శాట్ వల్ల నష్టాలెక్కువన్నారు. ప్రస్తుతమున్న సివిల్స్ విధానం కేవలం ధనవంతులకు మాత్రమే ఉపయోగపడేదిగా, కార్పొరేట్రంగానికి లాభాలను తెచ్చేదిగా ఉందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ఎ.జగన్మోహన్రావు ప్రవేశపెట్టిన ‘సివిల్స్ తెలుగులో నిర్వహిం చాలి, సీ శాట్‌ను రద్దుచేయాలి’తీర్మానాన్ని రౌండ్‌టేబుల్ సమావేశం ఆమోదించింది. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఆర్ఓ డి.రామ్‌కుమార్, ఏపీ ఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఆర్వీ రమణమూర్తి, అసోసియేట్ అధ్యక్షుడు కె.రామకృష్ణరాజు, బీసీ హాస్టల్స్ వెల్ఫేర్స్ వార్డెన్స్ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.గౌరీప్రసాద్, డీవైఎఫ్ఐ నాయకులు కె.త్రినాథ్, ఆర్.త్రినాథ్, పి.శ్రీరామ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.గణేష్, మణికంఠ పాల్గొన్నారు. -
గ్రూప్-1కు మళ్లీ మెయిన్స్
ఏపీపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశం ఇంటర్వ్యూలు కూడా పూర్తయిన 2011 గ్రూప్-1 కేసులో తీర్పు వివాదాస్పద 6 ప్రశ్నలు తీసేసి మెరిట్ జాబితా రూపొందించండి దాని ప్రకారం అర్హులకు మెయిన్స్ నిర్వహించాలంటూ ఉత్తర్వులు సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-1 వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ప్రిలిమ్స్, మెయిన్స్‌తోపాటు ఇంటర్వ్యూలు కూడా పూర్తయిన 2011-నోటిఫికేషన్‌లోని 314 పోస్టులకు.. ఇపుడు మళ్లీ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలోని వివాదాస్పద ప్రశ్నలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసును సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. వివాదాస్పద ఆరు ప్రశ్నలను తొలగించి మిగిలిన ప్రశ్నలకు లభించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను కొత్తగా రూపొందించాలని సుప్రీంకోర్టు ఏపీపీఎస్సీని ఆదేశించింది. అంతేకాదు, ఆ మెరిట్ జాబితాను అనుసరించి అర్హులకు మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కూడా ఉత్తర్వులిచ్చింది. జస్టిస్ హెచ్.ఎల్.గోఖలే, జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు కేసును పరిష్కరిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీనిపై కమిషన్ వర్గాలను సంప్రదించగా.. కోర్టు తీర్పు కాపీ అందాక పరిశీలించి, కమిషన్‌లో చర్చించి చర్యలు చేపడతామని పేర్కొన్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇంటర్వ్యూలు పూర్తయిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అసలేం జరిగిందంటే... 2011 నవంబర్‌లో 314 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ 2012 మే 27న ప్రిలిమ్స్ రాత పరీక్షలు నిర్వహించింది. వాటి ఫలితాలను జూన్ 13న ప్రకటించింది. ఇందులో 1:50 చొప్పున 16,426 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది. అయితే పలువురు అభ్యర్థులు ఇందులో కటాఫ్ మార్కులు తెలియజేయాలని, కీని ప్రకటించాలని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఆగస్టు 31న ఏపీపీఎస్సీ కీని ప్రకటించింది. ఆ కీలో తప్పులు దొర్లాయని, 13 ప్రశ్నలకు తప్పుడు సమాధానాలనే ఏపీపీఎస్సీ కీలో సరైనవిగా పేర్కొందని అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా కమిషన్ వర్గాలు మొదట పట్టించుకోలేదు. మెయిన్స్ రాత పరీక్షలకు వారం రోజుల ముందు కమిషన్ వేసిన నిపుణుల కమిటీ 7 తప్పులను మాత్రమే సరిదిద్దింది. దీంతో కటాఫ్ మారింది. మొదట మెయిన్స్‌కు ఎంపిక చేసిన జాబితా నుంచి 845 మంది అభ్యర్థులను తొలగించగా, 1,201 మంది కొత్త వారికి మెయిన్స్ రాసే అవకాశం వచ్చింది. వారంతా ప్రిపేర్ కాకుండానే మెయిన్స్ పరీక్షలు రాయాల్సి వచ్చింది. మరోవైపు అభ్యర్థులు ఎంత మొత్తుకున్నా మిగిలిన ఆరు తప్పులను సరిదిద్దలేదు. 2012 సెప్టెంబర్ 18 నుంచి 28 వరకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్ కేంద్రాల్లో రాత పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు 10 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరు కాగా 606 మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. వారికి గత జనవరి 28 నుంచి మార్చి 22వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. అభ్యర్థుల న్యాయపోరాటం.. మరోవైపు పలువురు అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో దొర్లిన ఆ ఆరు తప్పులను కూడా సరిదిద్దాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు... నాలుగు ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ న్యాయవివాదం జరుగుతుండగానే ఏపీపీఎస్సీ 2011 నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షను, ఇంటర్వ్యూను పూర్తిచేసింది. దీంతో హైకోర్టు తుది ఫలితాల ప్రకటనను నిలుపుదల చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌చేస్తూ ఏపీపీఎస్సీ ఈ ఏడాది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వేసింది. జస్టిస్ గోఖలే, జస్టిస్ చలమేశ్వర్‌ల ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను ఆలకించిన మీదట కేసును పరిష్కరిస్తూ తాజా ఆదేశాలిచ్చింది.