group-4 exam
-
గ్రూప్–4 పరీక్షను బహిష్కరించిన ఓయూ విద్యార్థి నేతలు
లాలాపేట(హైదరాబాద్): టీఎస్పీఎస్సీ శనివారం నిర్వహించిన గ్రూప్–4 పరీక్షను బహిష్కరించినట్లు ఓయూ జేఏసీ నాయకులు రాజు నేత తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గత మార్చి నెలలో నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్–1 ప్రశ్నాపత్రం లీకేజీ కేసు విషయమై పోరాడితే అక్రమంగా కేసులు పెట్టారని తెలిపారు. కానీ ఇప్పటి వరకు అసలైన నేరస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అందుకే గ్రూప్–4 పరీక్షకు వెళ్లకుండా బహిష్కరించామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 వేల ఉద్యోగాల భర్తీకి శనివారం నిర్వహించిన గ్రూప్–4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన ఈ పరీక్షలకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. టీఎస్పీఎస్సీ వెల్లడించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగిన పేపర్–1 పరీక్షకు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్–2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలవారీగా ఓఎంఆర్ షీట్ల లెక్కింపు తర్వాత హాజరు శాతంపై స్పష్టత వస్తుందని తెలిపింది. చదవండి: ఐదు తరగతులు.. ఒక్కరే మాస్టారు -
గ్రూప్ 4లో పరీక్షల స్థాయి మధ్యస్తం.. పలువురు అభ్యర్థుల పరేషాన్!
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 వేల ఉద్యోగాల భర్తీకి శనివారం నిర్వహించిన గ్రూప్–4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన ఈ పరీక్షలకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. రెండు పరీక్షలకు మొత్తంగా 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 9,12,380 మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ వెల్లడించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగిన పేపర్–1 పరీక్షకు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్–2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలవారీగా ఓఎంఆర్ షీట్ల లెక్కింపు తర్వాత హాజరు శాతంపై స్పష్టత వస్తుందని తెలిపింది. పేపర్–1 (జనరల్ స్టడీస్), పేపర్–2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) పరీక్షల్లో ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నాయని అభ్యర్థులు పేర్కొన్నారు. పేపర్–1లో ఎక్కువగా సూటిప్రశ్నలు, అప్లికేషన్ తరహా ప్రశ్నలు వచ్చాయని, పేపర్–2లో గణితం నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు. గ్రాఫ్స్, చార్టులతో కూడిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టిందన్నారు. చాలా వరకు నంబరింగ్ సిస్టంలో ప్రశ్నలు రావడంతో అభ్యర్థులు కాస్త తికమకపడ్డట్లు తెలిసింది. చిన్న సినిమాగా ఇటీవల విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న బలగం చిత్రం నుంచి కూడా ఈ పరీక్షలో ఓ ప్రశ్న రావడం గమనార్హం. ♦ సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ సెంటర్లో శనివారం ఉదయం అభ్యర్థులకు ఇచ్చే ప్రశ్నాపత్రం బండిల్ సీల్ లేకుండా ఉండటంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. సీలు ముందే తీసి పేపర్ లీక్ చేశారా అని ప్రశ్నించారు. ఓఎంఆర్ షీట్స్ బండిల్ అనుకొని పొరపాటున సీల్ తీశామని ఇన్విజిలేటర్లు, పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. ♦ హైదరాబాద్‌లోని మారుతీనగర్‌లో ఉన్న ఓ కేంద్రంలో కె.రాజేష్ (36) అనే అభ్యర్థి పేపర్–1 పరీక్షను సెల్ఫోన్లో చూసి రాస్తూ పట్టుబడ్డాడు. కలెక్టర్ ఆదేశంతో అతనిపై మాల్‌ప్రాక్టీస్ కింద కేసు నమోదైంది. ♦ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన వల్లందాస్ మురళి అనే అభ్యర్థి కాస్త ఆలస్యంగా పేపర్–2 పరీక్ష రాసేందుకు రాగా అప్పటికే గేటుకు తాళం వేశారు. దీంతో గోడదూకి లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించారు. ♦ వరంగల్ జిల్లా కొనాయమాకుల వద్ద గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ మహిళ 3 నెలల పాపతో వచ్చింది. అక్కడే డ్యూటీ చేస్తున్న గీసుకొండ ఎస్సై ఎ. శ్వేత ఆ బిడ్డను పరీక్ష సమయం ముగిసే వరకు అక్కున చేర్చుకుంది. ♦ ఖమ్మం దరిపల్లి ఆనంతరాములు ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో ఉదయం పరీక్ష రాసిన వారిలో నలుగురు అభ్యరులు ఓఎంఆర్ షీట్లు ఇవ్వకుండానే బయటకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని షీట్లు తీసుకున్నారు. అలాగే వారు మధ్యాహ్నం పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరించారు. ♦ జగిత్యాల జిల్లాలోని గ్రూప్–4 పరీక్ష కేంద్రాల వద్ద మహిళా అభ్యర్థులు తమ ఆభరణాలు తొలగించడానికి ఇబ్బంది పడ్డారు. ♦ జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో పేపర్–1 పరీక్ష రాసేందుకు వచ్చి కిటికీ పక్కన కూర్చున్న ఓ అభ్యర్థి ఓఎంఆర్ షీట్ గాలి కి కొట్టుకుపోయింది. దాన్ని తెచ్చుకొనేందుకు పోలీసులు అతన్ని అనుమతించకపోగా అక్కడి సిబ్బంది చివరకు షీట్‌ను తీసుకొచ్చారు. ♦ జడ్చర్లలోని బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాల కేంద్రంలో ఓ మహిళ అస్వస్థతకు గురి కావడంతో ప్రాథమిక చికిత్స అందించారు. ♦ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ఒరిజినల్ ఐడీ కార్డులు తీసుకురాని దాదాపు 100 మంది అభ్యర్థులను పరీక్షకు నిరాకరించారు. ♦ విద్యుత్ వైరు తెగిపోవడంతో ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వేస్టేషన్ వద్ద సికింద్రాబాద్ నుంచి మణుగూరు వెళ్తున్న రైలు సమీపాన నిలిచిపోయింది. దీంతో గ్రూప్–4 పరీక్ష రాసేందుకు రైల్లో వస్తున్న వందలాది మంది అభ్యర్థులు ఉరుకులు పరుగులు తీస్తూ ప్రైవేటు వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు బయలుదేరారు. ♦ వనపర్తి జిల్లాలోని 46 పరీక్ష కేంద్రాల నుంచి అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను తీసుకెళ్లేందుకు రాత్రి 11:15 గంటలు దాటినా టీఎస్పీఎస్సీ అధికారులు ఎవరూ రాలేదు. దీనిపై పరీక్షల నిర్వాహణ అధికారి రమేష్‌రెడ్డి మాట్లాడుతూ గద్వాల, వనపర్తి జిల్లాలకు ఒక్కరే అధికారి ఉండటంతో ఆలస్యమైనట్లు చెప్పారు. -
TSPSC Group 4 Exam: పోలీసుల మానవత్వం.. 3 నెలల చిన్నారిని లాలిస్తూ
తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష కొనసాగుతోంది. పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనుండగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 అయిపోయింది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. కాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో భార్యభర్తలు ఇద్దరు గ్రూప్- 4 పరీక్ష రాయడానికి వచ్చారు. దీంతో సదరు దంపతుల 3 నెలల చిన్నారిని పోలీసులు లాలించారు. కురవి మండల పెద్దతండాకు చెందిన జగ్గులాల్, సబితా దంపతులిద్దరికి గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యారు. వారి చిన్నారిని నాన్నమ్మ దగ్గర ఉంచగా పాప బాగా ఏడుస్తుండటంతో మహిళ కానిస్టేబుల్ శ్రీలత చిన్నారిని దగ్గర తీసుకొని లాలించారు. మంచం తెప్పించి చెట్టుకింద పడుకోబెట్టారు. తొర్రురులో 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా పలువురు చిన్నపిలల తల్లులు కూడా పరీక్షకు హాజరయ్యారు. వారి పిల్లలకు పోలీసులు అరటిపండ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అందించి మానవత్వం చాటుకున్నారు. మానవత్వం చూపిన పోలీస్ సిబ్బందిని తొర్రురు డీఎస్పీ రఘు, తొర్రురు సీఐ సత్యనారాయణ ఎస్సై సతీష్, ఎస్సై రాంజీ నాయక్ అభినందించారు. -
గ్రూప్-4 ఎగ్జామ్: అభ్యర్థి కొంపముంచిన గూగుల్ మ్యాప్
సాక్షి, యాదాద్రి: తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-4 పరీక్షా ప్రశాంతంగా కొనసాగుతోంది. తొమ్మిదిన్నర లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్ -1 పరీక్ష మొదలవగా పరీక్ష ప్రారంభానికి 15 నిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసేశారు.. 9.45 తర్వాత అభ్యర్థులు ఎవరిని లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆలస్యంగా వచ్చిన పలువురిని లోపలికి అనుతించకపోవడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ అభ్యర్థిని గూగుల్ మ్యాప్ కొంపముంచింది. జిల్లాకు చెందిన శశిధర్ అనే అభ్యర్థికి చౌటుప్పల్‌లోని కృష్ణవేణి స్కూల్లో సెంటర్ పడింది. గూగుల్ మ్యాప్ ద్వారా కృష్ణవేణి స్కూల్ లొకేషన్ సెట్ చేసుకోగా.. అది పాత స్కూల్ అడ్రస్ వద్దకు తీసుకెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాకా పాఠశాలను మరోచోటుకు మర్చారని తెలియండంతో హుటాహుటిన అసలు కేంద్రం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో అధికారులు ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదు. చదవండి: Balagam Ts Group 4 Question: బలగం సినిమాపై గ్రూప్-4 పరీక్షలో అడిగిన ప్రశ్న ఇదే -
గ్రూప్-4 పరీక్షలో 'బలగం' సినిమాపై అడిగిన ప్రశ్న ఇదే!
చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై.. ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం 'బలగం'. 'పిట్టకు పెట్టుడు' అనే నేపథ్యంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు యెల్దండి ఈ చిత్రాన్ని నిర్మించారు.. టాలీవుడ్లో పలు అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఓటీటీలో సైతం ఈ సినిమాకు భారీగా ఆదరణను పొందింది. ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి కారణం. ఇందులోని పాత్రలు ప్రతి ఇంట్లో ఉండేవిగా.. మనుషుల బంధాలను, వారి మధ్య ప్రేమలను తెలిపేదిగా తెరకెక్కడమే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో బలగం సినిమాపై ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే ► 'బలగం' చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి? అనే ప్రశ్నకు... A. దర్శకుడు: వేణు యెల్దండి, B. నిర్మాత: దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి, C. సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, D. కొమరయ్య పాత్రను పోషించినారు: ఆరుసం మధుసుధన్ అనే ఆప్షన్స్‌ను జోడించారు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో సినిమా రావడంతో 'బలగం' మూవీకి ఇలాంటి ప్రాముఖ్యత దక్కింది అని చెప్పవచ్చు. గతంలో 'బలగం' నుంచి అడిగిన ప్రశ్న ఇదే ఇదే ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా ఒక ప్రశ్న అడిగారు.. ► 2023లో ఒనికో ఫిలిమ్స్ (ONYKO Films) అవార్డులలో 'బలగం' సినిమాకి ఏ విభాగంలో పురస్కారం (Award) లభించింది? అనే ప్రశ్నకు... 1. ఉత్తమ దర్శకుడు చలనచిత్ర విభాగం, 2. ఉత్తమ డాక్యుమెంటరీ చలనచిత్ర విభాగం, 3. ఉత్తమ నాటకం చలనచిత్ర విభాగం, 4. ఉత్తమ సంభాషణ చలనచిత్ర విభాగం.. అనే ఆప్షన్స్‌ను జోడించారు. ఆ సమయంలో ఇదే విషయాన్ని దర్శకుడు వేణు యెల్దండి ట్విటర్లో పోస్ట్ చేశాడు. అప్పుడు పలు విమర్శలు కూడా వచ్చాయి. సినిమాను మరో రెండుసార్లు అయినా చూస్తాం. కానీ ఈ పరీక్షకు గానీ, కానిస్టేబుల్ చేసే ఉద్యోగానికి గానీ అక్కడ అడిగిన ప్రశ్నతో ఏమైనా సంబంధం ఉందా? ఇలా ఎలా ఆలోచిస్తారు? అంటూ దర్శకుడి వాల్‌పై నెటిజన్లు కామెంట్లు చేశారు. వివాదాలు పక్కనపెడితే ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసేమో మీరు కూడా చెక్ చేసుకోండి. -
హైటెక్ కాపీయింగ్:సెల్‌ఫోన్‌తో గ్రూప్-4 పరీక్ష రాస్తూ పట్టుబడ్డ అభ్యర్థి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా శనివారం జరిగిన గ్రూప్-4 ఎగ్జామ్ సందర్భంగా ఓ అభ్యర్థి హైటెక్ కాపీయింగ్‌కు తెరలేపాడు. సెల్‌ఫోన్‌ను వెంట తెచ్చుకుని దాని సాయంతో ఎగ్జామ్ రాసేందుకు యత్నించి పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతినగర్‌లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్ష ప్రారంభమైన అరగంట అనంతరం ఒక అభ్యర్థి సెల్ ఫోన్‌తో హాజరైనట్లు గమనించిన ఇన్విజిలేటర్, అతని వద్ద గల సెల్ ఫోన్ సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేశారని జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. సదరు అభ్యర్థిని సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్ లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. -
2,878 పరీక్ష కేంద్రాలు... 39,600 మంది ఇన్విజిలేటర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్–4 ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఒకవైపు అత్యధిక సంఖ్యలో పోస్టులు... మరోవైపు అత్యధిక సంఖ్యలో అభ్యర్థులుండటంతో టీఎస్పీఎస్సీ వ్యూహాత్మక కార్యాచరణతో చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో 9 వేల గ్రూప్–4 ఉద్యోగ ఖాళీలున్నాయి. వీటికి 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... గురువారం రాత్రి వరకు 8.55 లక్షల మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 2,878 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్–4 పరీక్షల నిర్వహణకు కమిషన్ ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక లైజన్ అధికారి, ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు. ఈ పరీక్షా కేంద్రాల పరిధిలో దాదాపు 40 వేల పరీక్ష హాల్లలో అభ్యర్థులను సర్దుబాటు చేస్తారు. ఒక్కో పరీక్ష హాలులో గరిష్టంగా 24 మంది అభ్యర్థులుంటారు. పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్ల పాత్ర కీలకం. దీంతో ఇన్విజిలేటర్లకు ప్రత్యేకంగా శిక్షణ సైతం టీఎస్పీఎస్సీ ఇచ్చింది. జూలై 1న శనివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు. పరీక్ష కేంద్రంలో పక్కాగా పరిశీలన... గ్రూప్–4 ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆశావహులు సైతం భారీగా ఉన్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల పరిశీలన, నిర్ధారణకు టీఎస్పీఎస్సీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇన్విజిలేటర్లకు సైతం నిర్ధారణ బాధ్యతలు అప్పగించింది. తొలుత పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే సమయంలో అభ్యర్థి హాల్‌టిక్కెట్‌తో పాటు గుర్తింపు కార్డులు పరిశీలిస్తారు. ఆ తర్వాత అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. అభ్యర్థులకు కనీసం బెల్టు సైతం అనుమతించబోమని టీఎస్పీఎస్సీ ఇప్పటికే తేల్చి చెప్పింది. పరీక్ష హాలులో అభ్యర్థిని ఇన్విజిలేటర్ మరోమారు తనిఖీ చేస్తారు. హాల్ టికెట్‌లోని ఫోటో ద్వారా, అభ్యర్థి ఫోటో గుర్తింపు కార్డు ద్వారా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఓటీఆర్‌లో ఉన్న సంతకం ఆధారంగా అభ్యర్థి చేసిన సంతకాన్ని పరిశీలిస్తారు. నామినల్‌రోల్స్ పైన సంతకం తప్పనిసరి చేసింది. దీంతో పాటు అభ్యర్థి వేలిముద్రను పరీక్ష హాలులోనే సమర్పించాలి. ఐదు పద్ధతుల్లో ఎక్కడ పొరపాటు గుర్తించినా అభ్యర్థిని పరీక్షకు అనుమతించమని టీఎస్పీఎస్సీ తేలి్చచెప్పింది. గ్రూప్–4 పరీక్ష ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు కమిషన్ తెలిపింది. ఓఎంఆర్ జవాబు పత్రంలో అభ్యర్థి ముందుగా హాల్‌టిక్కెట్ నంబర్, ప్రశ్నపత్రం కోడ్‌ను బబ్లింగ్ చేయాలి. ఓఎంఆర్ జవాబు పత్రంపై అభ్యర్థి హాల్‌టిక్కెట్ నంబర్, ఫోటో ఉంటాయని వస్తున్న ఊహాగానాలను పట్టించుకోవద్దని కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. తాళి తొలగిస్తే ఊరుకోం టీఎస్పీఎస్సీకి వీహెచ్‌పీ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థినుల నుంచి మంగళ సూత్రాలను తొలగిస్తే ఊరుకునేది లేదని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) టీఎస్పీఎస్సీని హెచ్చరించింది. రకరకాల నిబంధనలతో హిందువులను అవమానిస్తే ఊరుకునేది లేదని, సంప్రదాయాలను మంటగలిపే దుర్మార్గమైన చర్యలకు పాల్పడితే తీవ్ర ప్రతిఘటన ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు గురువారం టీఎస్సీపీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వినర్ శివ రాములు తదితరులు కలిసి వినతి పత్రం సమర్పించారు. -
గ్రూప్-4 పరీక్ష.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు రోజుల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం (జులై 1) నిర్వహించే ఈ పరీక్షను రాసేందుకు లక్షలాది మంది విద్యార్థులు సన్నద్ధమై ఉన్నారు. ఈ పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కడ్భందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల చేశారు అధికారులు. ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 పోస్టులకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు. గ్రూప్-4 పరీక్ష అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఇటీవల జారీ చేసిన కొన్ని కీలక సూచనల్ని పరిశీలిస్తే ► గతంలో జరిగిన ఇబ్బందులను, లోపాలను పరిగణలోకి తీసుకున్న టీఎస్పీఎస్సీ పకడ్భందీగా ఎగ్జామ్స్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ►ఉదయం పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనుండగా.. 9.45 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరు. ►మధ్యాహ్నం పేపర్-2 పరీలో 2:30 గంటల నుంచి 5:00 గంటల వరకు నిర్వహించనుండగా.. 2.15 తరువాత ఎగ్జామ్ సెంటర్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. పేపర్-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్-2కు మధ్యాహ్నం ఒంట గంట నుంచి కేంద్రంలోకి అనుమతించనున్నారు. ► ఈ నిబంధన నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని కమిషన్ పేర్కొంది. చదవండి: లోకేశ్‌కుమార్ బదిలీ.. జీహెచ్ఎంసీ నెక్ట్స్ బాస్ ఎవరో? ►ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ తో కూడిన కారు తాళాలు, నిషేధిత, విలువైన వస్తువులు తీసుకురావద్దని కమిషన్ సూచించింది. ఇంకా షూ కూడా ధరించి రావొద్దని.. కేవలం చెప్పులతో మాత్రమే రావాలని తెలిపింది. ► అభ్యర్థులను తనిఖీ తరువాత కేంద్రంలోకి అనుమతించనున్నారు. దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో వేలిముద్ర తప్పనిసరి చేశారు. అభ్యర్థులు ప్రతీ సెషన్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్ కు అందించి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ► ఎగ్జామ్ సెంటర్లలోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్ కు అభ్యర్థులు ఫొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ.. అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమిషన్ స్పష్టం చేస్తోంది. అలాంటి వారిపై పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు సదరు అభ్యర్ధిని మిగతా అన్ని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటించనున్నట్లు తెలిపింది. ►ఓఎంఆర్ షీట్లో బ్లూ/బ్లాక్ పెన్ తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాల్సి ఉంటుందని కమిషన్ తెలిపింది. ► హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదని కమిషన్ స్పష్టం చేసింది. -
గ్రూపు 4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నస్పూర్: గ్రూపు 4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. సోమవారం ఆయన నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్ బి.రాహుల్, ట్రెయినీ కలెక్టర్ పి.గౌతమి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు వేణు, శ్యామలాదేవి, జిల్లా పంచాయితీ అధికారి వెంకటేశ్వర్రావులతో కలిసి గ్రూప్ 4 పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడతూ జిల్లాలో 94 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 27,801 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు నస్పూర్: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, ఆబ్కారీ శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ రవాణాకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య పాల్గొన్నారు. సికెల్ సెల్ నియంత్రణకు.. జిల్లాలో సికెల్ సెల్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుబ్బరాయుడుతో కలిసి సికెల్ సెల్ నిర్వహణ పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కాసిపేట, మందమర్రి, దండేపల్లి, తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిఽధిలో 18,436 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతీ ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు బృందాలు ఏర్పాటు చేసి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా ఆరోగ్య శాఖ ఉపవైద్యాధికారి డాక్టర్ ఫయాజ్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
TS: జూలై 1న గ్రూప్–4 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వరుసగా ఉద్యోగ భర్తీ ప్రకటనలతో రెండు నెలలపాటు హడావుడి చేసిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇక పరీక్షల నిర్వహణకు ఉపక్రమించింది. ఇటీవలే గ్రూప్–1 మెయిన్ పరీక్ష తేదీలను ఖరారు చేయగా.. అత్యధిక పోస్టులున్న గ్రూప్–4 పరీక్షల తేదీలను గురువారం ప్రకటించింది. ఈ ఏడాది జూలై ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో గ్రూప్–4 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తామని.. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూలలో ఉంటాయని పేర్కొంది. ఎక్కువ పోస్టులు చూపి.. కొన్ని తగ్గించి.. వివిధ ప్రభుత్వ శాఖల్లో 9,168 గ్రూప్–4 పోస్టులను భర్తీ చేస్తామని గత ఏడాది డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీనికి సంబంధించి డిసెంబర్ 30న పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేసినా.. 8,039 ఖాళీ పోస్టులను మాత్రమే చూపింది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. తర్వాత ఈ ఏడాది జనవరి 28న విడుదల చేసిన అనుబంధ నోటిఫికేషన్‌తో మరో 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను జత చేసింది. వీటితో కలిపి మొత్తంగా భర్తీ చేసే గ్రూప్–4 పోస్టుల సంఖ్య 8,180కి చేరింది. నేటితో గడువు పూర్తి గ్రూప్–4 పోస్టులకు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియనుంది. గురువారం సాయంత్రం వరకు 9 లక్షల మంది దర ఖాస్తు చేసుకున్నారు. అంటే దాదాపు ఒక్కో పోస్టుకు 110 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లు.. 300 మార్కులు.. గ్రూప్–4 పోస్టుల భర్తీకి రెండు పరీక్షలు ఉంటాయి. ఇందులో జూలై 1న ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం సెక్రటేరియల్ ఎబిలిటీ పరీక్షను నిర్వహించనున్నారు. ఒక్కో పరీక్షకు రెండున్నర గంటలు సమయం ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున ప్రతి పేపర్‌కు 150 మార్కులు.. రెండు పరీక్షలు కలిపి మొత్తం 300 మార్కులు ఉంటాయి. పరీక్షలకు సంబంధించిన సిలబస్ వివరాలను టీఎస్పీఎస్సీ తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనం.. ఈడీ చార్జ్‌షీట్ దాఖలు -
ఎగ్జిక్యూటివ్ పోస్టులపై సర్కారుదే నిర్ణయం
గ్రూపు-1బీలో ఉంచాలా.. గ్రూపు-2లో కొనసాగించాలా? ఇంటర్వ్యూల నిర్వహణపైనా ప్రభుత్వమే తేల్చాలి పోటీ పరీక్షల విధానంపై సమీక్షా కమిటీ నిర్ణయం గ్రూప్-1, గ్రూపు-4 పరీక్షల్లో మార్పులుండవ్ గ్రూప్-2లో డిస్క్రిప్టివ్ విధానానికి మొగ్గు తెలంగాణ సంబంధిత అంశాలతో సిలబస్ మార్పులు 5న టీఎస్పీఎస్సీకి తుది నివేదిక ఇచ్చేందుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టుల విషయంలో తుది నిర్ణయాన్ని రాష్ర్ట ప్రభుత్వానికే వదిలేయాలని పోటీ పరీక్షల విధానం(స్కీం)పై ఏర్పాటైన సమీక్షా కమిటీ నిర్ణయించింది. ఈ పోస్టులను గ్రూప్-1బీగా పరిగణిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఒకవేళ గ్రూప్-1బీగా కొనసాగిస్తే వాటికి ఇంటర్వ్యూలు నిర్వహించే అంశాన్నీ సర్కారుకే వదిలేయాలని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. గురువారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) కార్యాలయంలో ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలోని సమీక్ష కమిటీ సమావేశమైంది. టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించబోయే వివిధ పోటీ పరీక్షల విధానాన్ని ఈ భేటీలో దాదాపుగా ఖరారు చేసింది. గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ఇక గ్రూప్-2లో డిస్క్రిప్టివ్ విధానం ఉండాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ చివరకు ఆ విధానాన్ని పెడితేనే బాగుంటుందన్న ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. వివిధ అంశాలను మరోసారి సమీక్షించి, వచ్చే నెల 5న టీఎస్పీఎస్సీకి తుది నివేదిక అందజేయాలని నిర్ణయించింది. అలాగే అన్ని పోటీ పరీక్షల సిలబస్‌లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, రాజకీయ, భౌగోళిక, ఆర్థిక, చారిత్రక అంశాల స్థానంలో తెలంగాణ అంశాలను చేర్చాలని నిర్ణయించింది. పరీక్షల విధానం, సిలబస్‌పై ప్రభుత్వామోదం తీసుకున్న తర్వాత ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. కాగా, గతంలో గ్రూప్-2లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూల ద్వారా, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రాత పరీక్ష ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగేది. అయితే 2012లో అప్పటి సీసీఎల్ఏ జె.సత్యనారాయణ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలు ఏపీపీఎస్సీలో పలు సంస్కరణలు సూచించింది. ఈ నివేదిక ఆధారంగా గ్రూప్-2లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల కు ఇంటర్వ్యూలను తొలగిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదేసమయంలో మరో జీవో ద్వారా గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బీగా మార్పు చేసింది. వీటిని 2013 నుంచి అమలయ్యేలా ఉత్తర్వులిచ్చింది. అయితే ఆ తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఉత్తర్వులను అమలు చేయాలా.. లేక అంతకుముందున్న పాత విధానాన్నే కొనసాగించా లా అన్నది రాష్ర్ట ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. పరీక్ష విధానంలో మార్పులపై దృష్టి పోటీ పరీక్షల విధానంలో మార్పులపైనే తాము దృష్టి సారించామని సమీక్ష కమిటీ చైర్మన్ ప్రొ. హరగోపాల్ తెలిపారు. కమిటీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షల సిలబస్‌లో మార్పులకు సమయం పడుతుందని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణానికి అనుగుణంగా మార్పులు ఉంటాయని, నోటిఫికేషన్ల జారీ కంటే ముందే సిలబస్‌లో మార్పులను టీఎస్పీఎస్సీ ప్రకటిస్తుందని తెలిపారు. పరీక్షలు ఆలస్యమవుతున్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.