TSPSC Group 4 Exam: పోలీసుల మానవత్వం.. 3 నెలల చిన్నారిని లాలిస్తూ | Police Caressed Group 4 Candidate 3 Months Baby Thorrur | Sakshi
Sakshi News home page

TSPSC Group 4 Exam: పోలీసుల మానవత్వం.. 3 నెలల చిన్నారిని లాలిస్తూ

Jul 1 2023 3:05 PM | Updated on Jul 1 2023 3:23 PM

Police Caressed Group 4 Candidate 3 Months Baby Thorrur - Sakshi

తెలంగాణలో గ్రూప్‌-4 పరీక్ష కొనసాగుతోంది. పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించ‌నుండ‌గా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1 అయిపోయింది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు.

కాగా  మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో భార్యభర్తలు ఇద్దరు గ్రూప్- 4 పరీక్ష రాయడానికి వచ్చారు. దీంతో సదరు దంపతుల 3 నెలల చిన్నారిని పోలీసులు లాలించారు. కురవి మండల పెద్దతండాకు చెందిన జగ్గులాల్, సబితా  దంపతులిద్దరికి గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యారు. వారి చిన్నారిని నాన్నమ్మ దగ్గర ఉంచగా పాప బాగా ఏడుస్తుండటంతో మహిళ కానిస్టేబుల్ శ్రీలత చిన్నారిని దగ్గర  తీసుకొని లాలించారు.

 మంచం తెప్పించి చెట్టుకింద పడుకోబెట్టారు. తొర్రురులో 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా పలువురు చిన్నపిలల తల్లులు కూడా పరీక్షకు హాజరయ్యారు. వారి పిల్లలకు పోలీసులు అరటిపండ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అందించి మానవత్వం చాటుకున్నారు. మానవత్వం చూపిన  పోలీస్ సిబ్బందిని తొర్రురు డీఎస్పీ రఘు, తొర్రురు సీఐ సత్యనారాయణ ఎస్సై సతీష్, ఎస్సై రాంజీ నాయక్ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement