thorrur
-
కుప్పకూలిన వేదిక.. కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డికి గాయాలు
సాక్షి, మమహబూబాబాద్ జిల్లా: తొర్రూరు పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సీ రెడ్డి, సినీనటి ప్రియాంక మోహన్‌లు విచ్చేశారు.అయితే షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదిక పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. వేదిక పైకి ఎక్కువ మంది ఎక్కడంతో కుప్పకూలింది. దీంతో వేదికపైఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కాలుకు గాయమవ్వగా.. వెంటనే కార్యకర్తలు, అనుచరులు ఆమెను పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ ఘటనలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి గానీ, నటి ప్రియాంకమోహన్‌కు గానీ ఎలాంటి గాయాలవ్వలేదు. వారు సురక్షితంగా ఉన్నారు.తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతికుప్పకూలిన స్టేజ్.. ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సి రెడ్డికి తీవ్ర గాయాలుప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీనటి ప్రియాంక మోహన్ మరియు పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సి… pic.twitter.com/S3vPX4c1Ag— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024Video Credits: Telugu Scribe -
మా జోలికి రావొద్దు.. మేం ఖాళీచేయం
జనగామ, సాక్షి: పాలకుర్తి మండలం తొర్రూరు(జే) గ్రామంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అక్రమంగా చొరబడి ఉంటున్న కొన్ని కుటుంబాలను ఖాళీ చేయించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. వాళ్లు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమను ఖాళీ చేయించొద్దని పాలకుర్తి రెవెన్యూ సిబ్బందిని వాళ్లు వేడుకున్నారు. అయినా అధికారులు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో.. పెట్రోల్ బాటిల్‌తో ఆత్మహత్యాయత్నం చేస్తామని బెదిరింపులకు దిగారు. తమలోనూ అర్హులైన వాళ్లం ఉన్నామని, తక్షణమే గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని కొందరు మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అయినా అధికారులు పోలీసుల సాయంతో వాళ్లను అడ్డుకుని ఖాళీ చేయించాలని యత్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ 20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించినట్లు తెలుస్తోంది. -
TSPSC Group 4 Exam: పోలీసుల మానవత్వం.. 3 నెలల చిన్నారిని లాలిస్తూ
తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష కొనసాగుతోంది. పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనుండగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 అయిపోయింది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. కాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో భార్యభర్తలు ఇద్దరు గ్రూప్- 4 పరీక్ష రాయడానికి వచ్చారు. దీంతో సదరు దంపతుల 3 నెలల చిన్నారిని పోలీసులు లాలించారు. కురవి మండల పెద్దతండాకు చెందిన జగ్గులాల్, సబితా దంపతులిద్దరికి గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యారు. వారి చిన్నారిని నాన్నమ్మ దగ్గర ఉంచగా పాప బాగా ఏడుస్తుండటంతో మహిళ కానిస్టేబుల్ శ్రీలత చిన్నారిని దగ్గర తీసుకొని లాలించారు. మంచం తెప్పించి చెట్టుకింద పడుకోబెట్టారు. తొర్రురులో 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా పలువురు చిన్నపిలల తల్లులు కూడా పరీక్షకు హాజరయ్యారు. వారి పిల్లలకు పోలీసులు అరటిపండ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అందించి మానవత్వం చాటుకున్నారు. మానవత్వం చూపిన పోలీస్ సిబ్బందిని తొర్రురు డీఎస్పీ రఘు, తొర్రురు సీఐ సత్యనారాయణ ఎస్సై సతీష్, ఎస్సై రాంజీ నాయక్ అభినందించారు. -
Hyderabad: మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో స్థలాలు
సాక్షి, సిటీబ్యూరో: సర్కారు భూముల వేలానికి సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రీబిడ్ సమావేశాలకు ఆసక్తిగల కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమైంది. హెచ్ఎండీఏ పరిధిలోని బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ, తుర్కయంజాల్, తొర్రూరులతో పాటు, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని అమిస్తాపూర్‌లో ప్రభుత్వ స్థలాలను ఈ– వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో గతంలో నిర్వహించిన ఈ– వేలం ద్వారా కొన్ని ప్లాట్లను విక్రయించగా మిగిలిన వాటిని రెండో దశలో విక్రయించేందుకు అధికారులు తాజాగా చర్యలు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న స్థలాలు కావడంతో సాధారణ, మధ్యతరగతి వర్గాల నుంచి రియల్టర్లు, బడా బిల్డర్ల వరకు కూడా ప్రభుత్వ స్థలాల కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకొనే మధ్యతరగతి వర్గాలకు బహదూర్‌పల్లి, తొర్రూరులలో 197 చదరపు గజాల నుంచి 267 చదరపు గజాల విస్తీర్ణం వరకు కూడా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బహదూర్‌పల్లి, తుర్కయంజాల్, కుర్మల్‌గూడ, తొర్రూరు, తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల కోసం 325 చదరపు గజాల నుంచి గరిష్టంగా 1,145 చదరపు గజాల వరకూ గరిష్ట విస్తీర్ణంలో కొన్ని ప్లాట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి 23 వరకు ప్లాట్లకు ఈ– వేలం నిర్వహించనున్నారు. ఆదాయ మార్గాల అన్వేషణలో.. ► ఆదాయ సముపార్జన కోసం ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల విక్రయానికి చర్యలు చేపట్టింది. హెచ్ఎండీఏ పరిధిలోని స్థలాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఈసారి సుమారు రూ.500 కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు అంచనా. కుర్మల్‌గూడ, తొర్రూర్‌లలో చదరపు గజానికి రూ.10 వేల చొప్పున కనీస ధర నిర్ణయించగా, తుర్కయంజాల్‌లో కనీస ధర రూ.40 వేలుగా నిర్ణయింంచారు. బహదూర్‌పల్లిలో కనీస ధర రూ.25వేల చొప్పున ఉంటుంది. అన్నిచోట్లా ఈసారి భారీ డిమాండ్ ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ► ఒకవైపు భూముల విక్రయం ద్వారా ఆదాయం కోసం చర్యలు తీసుకొంటూనే మరోవైపు గతంలో నిలిచిపోయిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా కూడా ఫీజుల రూపంలో ఖజానా నింపుకొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని సుమారు 633 వెంచర్లను అధికారులు గుర్తించారు. వీటికి ఎల్ఆర్ఎస్ జారీ చేస్తే మరో రూ.500 కోట్ల వరకు ఫీజుల రూపంలో లభించే అవకాశం ఉంది. (క్లిక్ చేయండి: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్.. ఎయిర్‌పోర్ట్‌కు సాఫీగా జర్నీ) -
పీఈటీ సార్ కొడతారనే భయం.. సైకిల్‌పై 65 కిలోమీటర్లు వెళ్లి..
సాక్షి, వరంగల్, ఖమ్మం: పాఠశాలకు ఆలస్యంగా వెళ్తే పీఈటీ కొడతారనే భయంతో సైకిల్‌పై 65 కిలోమీటర్లు ప్రయాణించిన ఒక బాలుడిని పోలీసులు తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ గండ్రాతి సతీష్ తెలిపిన వివరాలివి. ఖమ్మానికి చెందిన 12 ఏళ్ల కుషాల్ రాజా అదే ప్రాంతంలోని వండర్ కిడ్స్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. రోజూ సైకిల్‌పై పాఠశాలకు వెళ్లే రాజా బుధవారం ఆలస్యం అయ్యాడు. దీంతో పీఈటీ దండిస్తారని భయపడి పాఠశాలకు వెళ్లకుండా ఖమ్మం నుంచి సైకిల్ తొక్కుతూ 65 కిలోమీటర్లు ప్రయాణించి తొర్రూరు మండలం మాటేడుకు బుధవారం రాత్రి చేరుకున్నాడు. చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తున్న బాలుడిని చూసి స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. కానిస్టేబుల్ రాజు బాలుడి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని వారికి సమాచారం అందించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సతీష్ బాలుడికి కౌన్సెలింగ్ చేసి అల్పాహారం పెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. -
దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకే ‘దళిత బంధు’: ప్రవీణ్‌కుమార్
తొర్రూరు/నాగారం: దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకే సీఎం కేసీఆర్ ‘దళితబంధు’కుట్ర పన్నారని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులకే ‘దళిత బంధు’పథకం ద్వారా లబ్ధి జరుగుతోందని ఆరోపించారు. బీఎస్పీ రాజ్యాధికార యాత్ర మంగళవారం తొర్రూరు పట్టణానికి చేరుకుంది. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నిర్వహించిన కాన్షీరాం జయంతి వేడుకల్లో ప్రవీనమార్ ప్రసంగించారు. రైతుబంధు పథకం కింద పంపిణీ చేసిన రూ.50వేల కోట్లలో రూ.10వేల కోట్లు మాత్రమే చిన్న, సన్నకారు రైతులకు అందాయని అన్నారు. రూ.2.50లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో బలహీన వర్గాలు, దళిత, గిరిజనుల వాటా స్వల్పమన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారి ప్రజలను బలిగొంటోందని, గ్రామాల్లో ఐదు ఇళ్లకు ఒక వితంతువు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు... సూర్యాపేట జిల్లా, నాగారం మండలం, ఫణిగిరిలోని బౌద్ధక్షేత్రం వద్ద స్వేరోస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన భీమ్ దీక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జ్ఞానసమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, పవిత్ర జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, ఓటును వజ్రాయుధంగా భావించాలని, రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని స్వేరోలకు పిలుపునిచ్చారు. -
భళా.. భారతి!
తొర్రూరు: పురుషులకు మాత్రమే పరిమితమైన విద్యుత్ లైన్మెన్ పోస్టును తొలిసారి ఓ గిరిజన యువతి చేజిక్కించుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం బోజ్యా తండా పంచాయతీ పరిధిలోని దేశ్యా తండాకు చెందిన వాంకుడోతు భారతి దేశంలోనే తొలి జూనియర్ లైన్ వుమెన్‌గా ఎంపికై రికార్డు సృష్టించింది. 2019లో రాష్ట్ర ప్రభుత్వం లైన్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. మహబూబాబాద్ జిల్లా నుంచి భారతి దరఖాస్తు చేసుకుంది. అయితే, ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులని, మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించలేమని అధికారులు సెలవిచ్చారు. అయినా వెనక్కు తగ్గని భారతి హైకోర్టును ఆశ్రయించగా.. మహిళలను కూడా లైన్ వుమెన్ ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీం తో అధికారులు మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో క్లిష్టమైన స్తంభాలు ఎక్కే పరీక్షలో కూడా ప్రతిభ కనబరిచిన భారతి జూనియర్ లైన్ వుమెన్ ఉద్యోగానికి ఎంపికైంది. ఈమెతో పాటు సిద్దిపేట జిల్లాకు చెందిన బబ్బూరి శిరీష కూడా ఉద్యోగాన్ని సాధించింది. లంబాడ సామాజిక వర్గానికి చెందిన తనకు చెట్లు ఎక్కడం, వ్యవసాయ పనులు చేయడం అలవాటేనని, ఆ ధైర్యంతోనే తాను స్తంభాలు ఎక్కగలనని కోర్టుకు, ప్రభుత్వానికి విన్నవించుకున్నానని భారతి చెప్పారు. తాను ఉద్యోగానికి ఎంపికైనట్లు ఇప్పటికే సమాచారం అందిందని, ప్రభుత్వం నుంచి నియామక పత్రం రాగానే ఉద్యోగంలో చేరి విధులు నిర్వర్తిస్తానని తెలిపింది. కాగా, భారతి భర్త మోహన్ ప్రైవేటు ఉద్యోగి. వీరికి ఎనిమిదేళ్ల సాయితేజ, నాలుగేళ్ల శాన్విశ్రీ సంతానం. -
మంత్రి ఎర్రబెల్లి కారు తనిఖీ
సాక్షి, తొర్రూరు: మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో శనివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. తొర్రూరు నుంచి కొడకండ్ల వైపు వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కారును ఆపి తనిఖీ చేశారు. సిబ్బంది వాహనం వద్దకు చేరుకున్నాక మంత్రిని గుర్తించి వెనక్కి తగ్గే ప్రయత్నం చేశారు. అయితే.. వాహనాన్ని తనిఖీ చేయాలని మంత్రి సూచించడంతో పరిశీలించారు. మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతం గా జరగాలని.. అందుకు తాను సహకరిస్తానని మంత్రి తనిఖీ బృందంతో చెప్పారు. -
ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి, తొర్రూరు(వరంగల్) : ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. మహబూబాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య ఘటన మరువకముందే తొర్రూరు మండలంలోని సోమారంలో గురువారం ఓ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని సోమారం గ్రామానికి చెందిన మేకల లక్ష్మీనారాయణ అనే ఆర్టీసీ డ్రైవర్ 2004 సంవత్సరంలో అనారోగ్యంతో విధుల్లో ఉండి మృతి చెందాడు. ఈక్రమంలో వారసత్వంగా గత రెండేళ్ల క్రితం తొర్రూరు ఆర్టీసీ డిపోలో తన కుమారుడు మేకల అశోక్ (30) శ్రామిక్‌గా విధుల్లో చేరాడు. ఇప్పటికే చాలీచాలని వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నక్రమంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు. కార్మికుల సమస్యల పరిష్కరం పట్ల ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడం, విధులు లేక, రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, అసలు తమ సమస్యలు పరిష్కరం అవుతాయో లేదేమోనాని ఆందోళన చెందిన అశోక్ మనస్థాపంతో ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి, తన కుటుంబానికి సన్నిహితుడైన ఓ వ్యక్తికి ఫోన్ చేసి తెలియజేశాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు అశోక్ ఇంటి వద్దకు వెళ్లి చూసి, వెంటనే ఓ ప్రైవేట్ వాహనంలో తొర్రూరులోని సాయిమల్టీ స్పెషలిటీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అశోక్‌కు భార్య స్రవంతి, కుమారుడు లక్ష్మిపతి, కుమారై లక్ష్మిప్రసన్న ఉన్నారు. అధికారుల పరామర్శ.. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఆర్టీసీ కార్మికుడు మేకల అశోక్‌ను తొర్రూరు ఆర్డీఓ ఈశ్వరయ్య, డీఎస్పీ మదన్‌లాల్, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరాం,, డిప్యూటి డీఎంహెచ్ఓ డాక్టర్ కోటచలం, తహసీల్దార్ రమేష్‌బాబు, సీఐ చేరాలు, ఎస్సై నాగేష్, ఆర్ఐ భాస్కర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, సర్పంచ్‌లు సంపత్, రవీందర్‌రెడ్డి, వామ పక్ష పార్టీల నాయకులు వెంకటయ్య, కొత్తపెల్లి రవి, బొల్లం అశోక్, ముంజంపెల్లి వీరన్న, తమ్మెర విశేశ్వర్‌రావు, గట్టు శ్రీమన్నారాయణ, ఆర్టీసీ నాయకులు పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. -
శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాం :ఎర్రబెల్లి
సాక్షి, మహబూబాబాద్ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించేలా ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. తొర్రూరులో తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధర్వ్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. చదువు పూర్తి చేసుకుని.. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువత.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలి. నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం శిక్షణ ఇప్పించనున్నది’ అని దయాకర్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషాదయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కాగా మెగా జాబ్ మేళాలో జియో, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, హెటిరో ఫార్మా, కార్వీ లాంటి 80పైగా కంపెనీలు, 40కి పైగా ఉచిత శిక్షణ కల్పించే ట్రైనింగ్ కంపెనీలు పాల్గొన్నాయి. -
జననేతకు బ్రహ్మరథం పట్టిన ఓరుగల్లు
-
జననేతకు బ్రహ్మరథం పట్టిన ఓరుగల్లు
తొర్రూర్: వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తొలిరోజు ఆయన ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. హైదరాబాద్ నుంచి పాలకుర్తి చేరుకున్న జననేతకు ఘన స్వాగతం లభించింది. తర్వాత భారీ జనసందోహం నడుమ ఆయన రోడ్ షో నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జఫర్ గఢ్ నుంచి వర్ధన్నపేట మండలంలోకి ప్రవేశించారు. దమ్మన్నపేట వద్ద పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, మహిళలతో ఆయన మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెడ్డిపాలెం గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో మాట్లాడారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో తొర్రూర్ చేరుకున్నారు. జననేత సభకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్ ప్రసంగానికి అద్భుత స్పందన వచ్చింది. ఆయన ప్రసంగిస్తున్నంతసేపు హర్షధ్వానాలు మిన్నంటాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడాన్ని ఎత్తిచూపారు. కాంగ్రెస్ పార్టీ కపట కుట్రలపై ధ్వజమెత్తారు. ఓటు అడిగే హక్కు తమ పార్టీకే ఉందని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ గుర్తు 'సీలింగ్ ఫ్యాన్'కు ఓటు వేయాలని ఓరుగల్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
అథ్లెటిక్స్ ఆణిముత్యం
తొర్రూరు, న్యూస్‌లైన్ : అథ్లెటిక్స్‌లో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తూ క్రీడా ఆణిముత్యంగా పలువురి అభినందనలు అందుకుంటున్నాడు ధరావత్ జగదీష్. తొర్రూరు శివారు దుబ్బతండాకు చెందిన ధరావత్ భీమ, సామ్‌కి దంపతుల కుమారుడైన జగదీష్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే జగదీష్ క్రీడలపై ఎంతో ఆసక్తి చూపేవాడు. స్కూల్ దశలోనే పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడు. ఇంటర్, డిగ్రీకి చేరుకునే సరికి క్రీడల్లో మరింత ప్రావీణ్యం సంపాదించాడు. పాల్గొన్న ప్రతీ పోటీలోనూ పతకాలు సాధిస్తూ జిల్లా నుంచి జాతీయస్థాయికి ఎదిగి అటు పుట్టిపెరిగిన గ్రామానికి ఇటు చదువుకుంటున్న యూనివర్సిటీకి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నాడు. ప్రతిభకు పతకాలు గుంటూరు జిల్లా బాపట్లలో 2011 డిసెంబర్లో జరిగిన రాష్ట్రస్థాయి 100, 200 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానం కైవసం చేసుకున్నాడు. లాంగ్‌జంప్, త్రిబుల్జంప్లోనూ ప్రథమస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాక ఎక్కువ ప్రథమస్థానాలు సాధించిన ందుకు చాంపియన్‌షిప్ దక్కించుకున్నాడు. 2012 ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని అఖోలాలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయాల స్థాయి పోటీల్లో 100, 200 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానం సాధించి రెండు బంగారు పతకాలు అందుకున్నాడు. అదే ఏడాది అక్టోబర్‌లో చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లోనూ ప్రతిభ చూపి 100, 200 మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్, త్రిబుల్‌జంప్, డిస్కస్‌త్రోలో ప్రథమస్థానాలు సొంతం చేసుకుని ఓవరాల్ చాంపియన్‌గా నిలిచాడు. ఈ ఏడాది మార్చిలో కర్ణాటకలోని బీదర్‌లో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో 49 యూనివర్సిటీలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో వంద మీటర్ల పరుగులో బంగారు పతకం, 200మీటర్ల పరుగు, త్రిబుల్జంప్లో ద్వితీయస్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. పోటీ ఏదైనా పతకాల వేటలో ముందుంటున్న జగదీష్‌ను పలువురు అభినందిస్తున్నారు. అంతర్జాతీయస్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని ఆకాంక్షిస్తున్నారు.