
సాక్షి, మమహబూబాబాద్ జిల్లా: తొర్రూరు పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సీ రెడ్డి, సినీనటి ప్రియాంక మోహన్‌లు విచ్చేశారు.
అయితే షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదిక పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. వేదిక పైకి ఎక్కువ మంది ఎక్కడంతో కుప్పకూలింది. దీంతో వేదికపైఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆమె కాలుకు గాయమవ్వగా.. వెంటనే కార్యకర్తలు, అనుచరులు ఆమెను పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ ఘటనలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి గానీ, నటి ప్రియాంకమోహన్‌కు గానీ ఎలాంటి గాయాలవ్వలేదు. వారు సురక్షితంగా ఉన్నారు.
తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి
కుప్పకూలిన స్టేజ్.. ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సి రెడ్డికి తీవ్ర గాయాలు
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీనటి ప్రియాంక మోహన్ మరియు పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సి… pic.twitter.com/S3vPX4c1Ag— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024
Video Credits: Telugu Scribe
Comments
Please login to add a commentAdd a comment