yashaswini
-
కుప్పకూలిన వేదిక.. కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డికి గాయాలు
సాక్షి, మమహబూబాబాద్ జిల్లా: తొర్రూరు పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సీ రెడ్డి, సినీనటి ప్రియాంక మోహన్‌లు విచ్చేశారు.అయితే షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదిక పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. వేదిక పైకి ఎక్కువ మంది ఎక్కడంతో కుప్పకూలింది. దీంతో వేదికపైఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కాలుకు గాయమవ్వగా.. వెంటనే కార్యకర్తలు, అనుచరులు ఆమెను పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ ఘటనలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి గానీ, నటి ప్రియాంకమోహన్‌కు గానీ ఎలాంటి గాయాలవ్వలేదు. వారు సురక్షితంగా ఉన్నారు.తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతికుప్పకూలిన స్టేజ్.. ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సి రెడ్డికి తీవ్ర గాయాలుప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీనటి ప్రియాంక మోహన్ మరియు పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సి… pic.twitter.com/S3vPX4c1Ag— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024Video Credits: Telugu Scribe -
నాన్న ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నా..
పాలకుర్తి: నా జీవిత ప్రయాణంలో నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. మేం ఇద్దరం అక్కాచెల్లెళ్లం. నాన్న హైదరాబాద్‌లో బీటెక్ వరకు చదివించారు. వివాహం తర్వాత అమెరికాలో మేనేజర్‌గా పనిచేశా. మా అత్తమ్మ ఝాన్సీరెడ్డి ఆహ్వానంతో రాజకీయాల్లోకి వచ్చా. ఇందులో మా నాన్న మామిడాల తిరుపతిరెడ్డి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాన్న వెన్నంటి ఉండి నడిపించారు. ఆయన ప్రోత్సాహంతో సభలు, సమావేశాల్లో పాల్గొన్నా. ఘన విజయం సాధించా. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.– మామిడాల యశస్వినిరెడ్డి, ఎమ్మెల్యే, పాలకుర్తి -
ఎన్నారైల ఆధ్వర్యంలో ఘనంగా జీటీఏ తొలి వార్షికోత్సవం వేడుకలు
ఎన్నారైల ఆధ్వర్యంలో జీటీఏ తొలి వార్షికోత్సవం వేడుకలు హైదరాబాద్‌లోని మారియట్ హోటల్లో ఘనంగా జరిగాయి. ప్రవాస తెలంగాణ వాసులతో కలిపి ఏర్పాటుచేసిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫోరం ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బండి సంజయ్‌తో పాటు పలువురు ఎమ్మేల్యేలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. శక్తివంతమైన భారత్‌ను నిర్మించడంలో GTA భాగస్వామం కావాలని కోరారు. వివిధ దేశాల్లోని తెలంగాణ వారందరిని ఒక్కచోటకు చేర్చుతున్న GTAను ఆయన అభినందించారు. తనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, ఎంతోమంది ఎన్నారైలు డబ్బు లేకపోయినా కష్టపడి పైకి వచ్చిన వాళ్లేనన్నారు. ఎక్కడో విదేశాల్లో ఉంటూ భారత్ అభ్యున్నతికి కృషి చేస్తున్న ఎన్నారైల సేవలు మరువలేనివన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి ఇతర దేశాల్లో చాటుతుంది తామేనని జీటీఏ ఫౌండర్, ఇండియా ఛైర్మన్ మల్లారెడ్డి తెలిపారు. ఎన్నారై తలుచుకుంటే.. ఒక రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా అభివృద్ధి చేసి చూపించగలడని ఆయన చెప్పారు. ఎన్నారైలు అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి కుటుంబాన్ని కలిసే వాళ్లు మాత్రమే కాదని జీటీఏ నిరూపించిందని ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి అన్నారు. ఎన్నారైలు తలుచుకుంటే దేన్నైనా సాధించి చూపిస్తారని, వాళ్లను తక్కువ అంచనా వేయొద్దని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భారత్‌కు చెందిన 150 మంది బోర్డు సభ్యులు హాజరయ్యారు. వీరిలో గ్రేట్ అండ్ మీట్ కార్యక్రమం చైర్మన్ మల్లాడరెడ్డి, జీటీఏ అడ్వజర్ ఛైర్ రవీందర్ రెడ్డి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యోయో మీడియా సీఈవో నవీన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు బండిసంజయ్, యశశ్విని, పాయల్ శంకర్, రాకేష్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ ఎన్నారైలు గ్రేట్ అండ్ మీట్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి స్పాన్సర్లకు జీటీఏ ఫౌండర్, ఇండియా ఛైర్మన్ మల్లారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
అనూహ్యంగా వచ్చి మంత్రినే ఓడించిన యశస్విని
జనగామ/తొర్రూరు/దేవరుప్పుల: రాజకీయాలతో ప్రత్యక్షంగా అనుభవం లేని యువతి అసెంబ్లీ ఎన్ని కల్లో విజయ దుందుభి మోగించారు. తొలి ఎన్నికలోనే 66 ఏళ్ల రాజకీయ నేత ఎర్రబెల్లిని 26 ఏళ్ల యశస్వినిరెడ్డి మట్టి కరిపించి.. విజయకేతనం ఎగురవేశారు. పాలకుర్తి నుంచి భారీ మెజార్టీతో గెలుపొంది చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. 2018లో బీటెక్ పూర్తి చేసిన మామిడాల యశస్వినిరెడ్డి వివాహం అనంతరం అమెరికాకు వెళ్లారు. అక్కడ కొంతకాలం అత్తామామలకు సహకారంగా సొంత వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారు. వాస్తవానికి పార్టీ అధిష్టానం తొలుత యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. పౌరసత్వం విషయంలో అడ్డంకులు రావడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. అనూహ్యంగా ఆమె కోడలు యశస్వినిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆమె స్థానంలో కోడలు యశస్వినిరెడ్డికి అవకాశమివ్వాలని ఝాన్సీరెడ్డి పార్టీని కోరడంతో అధిష్టానం టికెట్ ఇచ్చింది. పాలకుర్తి అసెంబ్లీ చరిత్రలో తొలిసారి 26 ఏళ్ల పిన్న వయస్కురాలిగా యశస్విని గెలుపొందారు. పాత చెన్నూరు ప్రస్తుత పాలకుర్తి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలుపొందిన రెండో మహిళగా యశస్వినిరెడ్డి నిలిచారు. నాడు 26.. నేడూ 26 పాలకుర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నిక చిత్రవిచిత్రాలకు నెలవుగా మారింది. గెలిచినా, ఓడినా అభ్యర్థులకు 26 సంఖ్యతో అనుబంధం ఉంది. 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొంది 40 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా దయాకర్‌రావు రాజకీయం నడిపారు. ఆయనపై 26 ఏళ్ల యువతి గెలుపొంది చరిత్ర సృష్టించారు. 66 ఏళ్ల రాజకీయ ఉద్ధండుడు 26 ఏళ్ల యువతి చేతిలో ఓడడం, ఏ వయసులో రాజకీయం ప్రారంభించాడో అదే వయసు యువతిపై ఓటమి పాలవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
పాలకుర్తిని వీడాలని ఝాన్సీరెడ్డికి నోటీసులు
పాలకుర్తి: ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో స్థానికేతరులు పాలకుర్తి నియోజకవర్గాన్ని వీడాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం రాత్రి డీఎస్పీ వెంకటేశ్వరబాబు తొర్రూరు పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఝాన్సీరెడ్డి పోలీసులను ప్రశ్నించారు. తన కోడలు యశస్వినిరెడ్డిని బరిలో నిలిపానని, తాను నియోజకవర్గంలోని చెర్లపాలాన్ని దత్తత తీసుకున్నానని, ఇక్కడ పన్నులు కడుతున్నానని, తనను నియోజకవర్గం వీడాలనడం సరికాదన్నారు. కుట్ర పూరితంగా తనకు నోటీసులు జారీ చేశారన్నారు. దీనికి మంత్రి దయాకర్‌రావు బాధ్యత వహించాలన్నారు. కనీసం ఆడవాళ్లు అని చూడకుండా ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. -
ఎర్రబెల్లికి చుక్కలు చూపిస్తున్న హనుమాండ్ల ఫ్యామిలీ
పాలకుర్తి/పాలకుర్తి టౌన్/కొడకండ్ల/పెద్దవంగర : ఆడబిడ్డగా మీ ముందుకొచ్చాను.. ఆశీర్వదించి గెలిపించండి.. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది అభివృద్ధి మార్క్ చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా సోమవారం కొడకండ్ల మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. మా అత్త మామ హనుమాండ్ల రాజేందర్‌రెడ్డి ఝాన్సీరెడ్డి ముప్పై ఏళ్లుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం.. దోచుకొవడానికి దాచుకొవడానికి కాదు.. అది మా కుటుంబ నైజం కాదు.. దగాకోరు దయాకర్‌రావు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనుయాయులకే కట్టబెట్టారు.. తనను గెలిపిస్తే అర్హులందరి కీ అందేలా చూస్తానన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకురాలి గా పనిచేస్తానని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే వేతనాన్ని కూడా ప్రజల అభివృద్ధికే వెచ్చిస్తానని అన్నా రు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను రూపొందించింద ని, అధికారంలోకి రాగానే అమలు చేస్తుందని తెలి పారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది.. ప్రజలు అండగా నిలిచి పాలకుర్తిలో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ప్రవీణ్‌కుమార్, పార్టీ మండల కోఆప్షన్ సభ్యుడు నసీరుద్దీన్, నాయకులు అబ్దుల్లా, పులి గణేష్, వెంగల్రావు, సురేష్‌నాయక్, రాజేష్‌నాయక్, ఉప్పల చిన్నసోమయ్య, వనం మోహన్, మనోహర్, వంశీకృష్ణ, సోమనర్సయ్య, భిక్షపతి, యాకేష్ పాల్గొన్నారు. కేసీర్ కుటుంబమే బాగుపడింది పాలకుర్తి మండల పరిధి అయ్యంగారిపల్లి, గోపాలపురం, రాఘవాపురం, కిష్టాపురంతండా, పెద్దతండా, బమ్మెర గ్రామాల్లో యశస్వినిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం యశస్వినిరెడ్డి మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాల బీఎస్ఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి, దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు వంటి పేర్లు చెప్పి కేసీఆర్ ప్రజలను వంచించారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, ఎర్రబెల్లి రాఘవరావు, తిరుమలగిరి, సర్పంచ్‌లు బక్క పుల్లయ్య, జలగం నాగభూషనం, మంద కొమురయ్య, సోమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని టీపీసీసీ సభ్యురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. సోమవారం పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన 5వ వార్డు మెంబర్ బొమ్మెర స్వరూప, 10వ వార్డు సభ్యులు రాంపాక లావణ్య, బీఆర్ఎస్ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ జలగం ప్రభాకర్ తదితరులు యాసారపు కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఆమె కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సంర్భంగా ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. ఇక నుంచి కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే సహించేంది లేదని హెచ్చరించారు. పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్వినిరెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అశోక్, శేఖర్, యాకయ్య, రంజాన్, రజిత, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. -
TS Elections: బరిలో ఎన్నారైలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైలు తమ ప్రత్యేకతను చాటుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే గీతారెడ్డి, చెన్నమనేని రమేష్ లాంటి ఎన్నారై బ్యాక్‌డ్రాప్ ఉన్న సీనియర్లు పూర్తిగా పోటీకి దూరం కాగా.. ఇప్పుడు కొత్తగా బరిలోకి దిగుతూ చర్చనీయాంశంగా మారారు కొందరు. మామిడాల యశస్వినీరెడ్డి అమెరికాలో స్థిరపడిన ఝాన్సీరెడ్డి.. తెలంగాణ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాలకుర్తి(జనగామ) నుంచి పోటీ చేయాలనుకున్నారు. అందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం చొరవ చూపి.. టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె అమెరికా పౌరసత్వ కారణంతో అది వీలుపడలేదు. బదులుగా తన కోడలు యశస్వినిరెడ్డి(26)ని పోటీలో నిలిపాలనుకోగా.. కాంగ్రెస్ అధిష్టానం అందుకు ఒప్పుకుంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత యువ అభ్యర్థి యశస్వినే కావడం విశేషం. ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్ మీద మామిడాల యశస్వినీరెడ్డి పాలకుర్తిలో పోటీకి దిగింది. యశస్వినీరెడ్డి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆపై ఝాన్సీరెడ్డి కొడుకు రాజారామ్ మోహన్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. పాలకుర్తిలో సేవాకార్యక్రమాల ద్వారా ఝాన్సీరెడ్డికి మంచి గుర్తింపు ఉంది. ఆ కార్యక్రమాలనే తన కోడలి ప్రచారం కోసం ఝాన్సీరెడ్డి ఉపయోగించుకుంది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈ యువ అభ్యర్థి కోసం ప్రచారం కూడా చేశారు. గెలుపుపై యశస్విని ధీమాతో ఉంది. చల్లా శ్రీలత బీజేపీ హుజూర్ నగర్ అభ్యర్థిని చల్లా శ్రీలతారెడ్డి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ఆమె స్వస్థలం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించి.. ఆపై వివాహ తదనంతరం యూఏఈ వెళ్లిపోయారు. ఆమె భర్త విజయ భాస్కర్‌రెడ్డి అక్కడి ప్రభుత్వంలో సలహాదారుగా పని చేశారు. లాయర్‌గానే కాకుండా.. 2009 సమయంలో అబుదాబిలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు కార్యక్రమాలు శ్రీలత నిర్వహించారు. ఉద్యమానికి మద్దతుగా యూఏఈలో ఎన్నారై కమ్యూనిటీని కూడగట్టి సంఘీభావ కార్యక్రమాలు రూపొందించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. స్వస్థలానికి వచ్చిన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గానూ ఆమె పని చేశారు. ప్రస్తుతం ఆమె నేరేడుచర్ల వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో ఈ మధ్య చేరిన ఆమె.. ఈసారి హుజూర్నగర్ బరిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్), సైదిరెడ్డి(బీఆర్ఎస్)లతో పోటీ పడుతున్నారు. స్థానికతే తనను గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారామె. ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డి గతంలో విదేశాల్లో పనిచేస్తూ స్వదేశానికి వచ్చి రాజకీయ రంగప్రవేశం చేశారు. భూక్యా జాన్సన్ నాయక్ ఖానాపూర్(నిర్మల్) బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్. ఈయన చదివింది నిజాం కాలేజీలో. ఆ సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈయన క్లాస్మేట్. అంతేకాదు.. గతంలో కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు.. అప్పటికే అక్కడ కంపెనీ నడుపుతున్న జాన్సన్ నాయక్ ఆతిథ్యం ఇచ్చారు. మొదటి నుంచి ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త.. జాన్సన్‌ను రాజకీయాల్లోకి రప్పించింది. అలా.. ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రేఖా నాయక్‌ను(సీటు రాలేని ఆమె కాంగ్రెస్‌లో చేరారు) కాదని బరిలోకి దించారు. ఈ సారి ఎన్నికల్లో తన ప్రియ మిత్రుడిని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో కేటీఆర్ ఖానాపూర్ లో ఎన్నికల ప్రచారం సైతం చేశారు. మధుయాష్కీ గౌడ్ ఎన్నారైల లిస్ట్‌లో సీనియర్ మోస్ట్ లీడర్. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన మధు యాష్కీ తొలిసారిగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎల్బీ నగర్(రంగారెడ్డి) నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు. గతంలో రెండుసార్లు(2004, 2009) నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడిగా ప్రజలు ఈయన్ని ఎన్నుకున్నారు. న్యాయ విద్యను అభ్యసించిన మధు యాష్కీ.. న్యూయార్క్‌లో లాయర్‌గా పని చేశారు. ఆయనకు న్యూయార్క్, అట్లాంటాలో లీగల్ కన్సల్టెన్సీలు ఉన్నాయి. దేశంలో రైతుల ఆత్మహత్యల పరిణామాలు తనను సొంత దేశానికి రప్పించాయని తరచూ చెప్తుంటారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత అయినప్పటికీ.. ఎల్బీ నగర్ ఓటర్లను ఆయన ఏమేర ప్రభావితం చేస్తారనేది తెలియాలంటే కౌంటింగ్ దాకా ఆగాల్సిందే. ఈసారి తెలంగాణ ఎన్నికల కోసం 2,780 ఎన్నారైలు ఓటేయబోతున్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక.. 2014లో ఎన్నారై ఓటర్ల సంఖ్య కేవలం 05గా ఉంది. అదే 2018లో ఈ సంఖ్య 244కి పెరిగింది. ఇప్పుడు ఏకంగా 2,780కి చేరింది. వీరిలో 2,248 మంది పురుషులు, 531 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. -
మంత్రి ఎర్రబెల్లిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ యశస్విని రెడ్డి
-
నాపై పోటీకి అభ్యర్థులే లేరు
రాయపర్తి: ‘నాపై పోటీకి అభ్యర్థులే కరువయ్యారు.. అమెరికా నుంచి టూరిస్టులను తీసుకువచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టిండ్లు’ అని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నా రు. శుక్రవారం మండలంలోని తిర్మలాయపల్లి, రాయపర్తి, గన్నారం, కొండూరు, బురహాన్‌పల్లి, కాట్రపల్లి, మొరిపిరాల, కిష్టాపురం, మహబూబ్‌నగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలినడకన ప్రజలను పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ అని తేల్చిచెప్పారు. తాను 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశా రు. సేవ చేశానే తప్ప అవినీతి పేరు తెచ్చుకోలేదు.. దయాకర్‌రావు హామీ ఇచ్చాడంటే చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉందన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేశాను.. కొత్తగా చేర్చిన హామీల ప్రకారం ప్రతి గ్రామంలో వంద డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తా.. పదివేల మంది మహిళలకు కుట్టుశిక్షణ ఇప్పించి సంగెం టెక్స్టైల్ పార్కులో ఉద్యోగ అవకాశం కల్పిస్తా.. తిర్మలాయపల్లి, తొర్రూరులో ఆయిల్‌పాం మిల్లు పెట్టిస్తున్నాను.. అందులో వెయ్యిమందికిపైగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. గ్రామాలను, ఆలయాలను అభివృద్ధి చేశాను.. కొడకండ్లలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయించాను.. గ్రామాల్లో ఉన్న కోతులను పట్టించి ఏటూరునాగారం అడవుల్లో వదలడమే కాకుండా అక్కడ కోతులకోసం పండ్ల మొక్కలను నాటించానని వివరించారు. ఆదరించి గెలిపిస్తే మీముందుకు వచ్చి మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్‌రావు, బీఆర్ఎస్ మండల ఎన్నికల ఇన్చార్జ్ గుడిపూడి గోపాల్‌రావు, మండల అధ్యక్షుడు మూనావత్ నర్సింహానాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, పార్టీ అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఆకుల సురేందర్‌రావు, పూస మధు, వనజారాణి, ఎండీ.నయీం, గబ్బెట బాబు, సర్పంచ్, ఎంపీటీసీలు గారె నర్సయ్య, గజవెల్లి అనంత, రాధిక, ఐత రాంచందర్, కర్ర సరితరవీందర్రెడ్డి, కుక్కల భాస్కర్, గాదె హేమలత పాల్గొన్నారు. పద్మశాలి సంఘం మద్దతు కొడకండ్ల: బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మండల పద్మశాలి సంఘం మద్దతు తెలిపింది. అధ్యక్షుడు పసునూరి మధుసూదన్ ఆధ్వర్యంలో శుక్రవారం కులస్తులు మంత్రిని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సొంత గూటికి చేరిన కార్యకర్తలు పాలకుర్తి : మండలం నుంచి కాంగ్రెస్‌లో చేరిన పలువురు కార్యకర్తలు కళాకారుడు చిరుపాటి ఎల్ల్ల స్వామి, రాజు మరో 20 మంది తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు శుక్రవారం వారిని మంత్రి దయాకర్‌రావు సతీమణి, ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదేవి స్వాగతించి కండువాలు కప్పారు. పాలకుర్తి వార్డు సభ్యుడు వీరమనేని హన్మంతరావు, ముదిరాజ్ సంఘం నాయకుడు మామిండ్ల శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు దేవరుప్పుల : పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజయం సాధించాలని కోరుతూ.. కామారెడ్డిగూడెం మసీదులో శుక్రవారం ముస్లింలు మతగురువు ఇనాయత్ రసూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఖాసీం, జాకీర్, ఖలీల్, షబ్బీర్, మీరాన్, అర్జుమాన్, మౌలానా, పాషా, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ కు జై కొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్
-
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా హనుమాండ్ల యశశ్విని రెడ్డి
-
టార్గెట్ ఎర్రబెల్లి.. ఝాన్సీరెడ్డి బదులు యశస్వినీ!
సాక్షి, హన్మకొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం గడుస్తున్న కొద్దీ కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం మరోసారి హైలైట్ అయ్యింది. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో పాలకుర్తి విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. పాలకుర్తి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బరిలో దిగుతారని అందరూ ఆశించారు. అయితే. చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో స్క్రీనింగ్ కమిటీ ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి పౌరసత్వం విషయంలో సమస్య కారణంగా ఆమెకు బదులుగా ఝాన్సీ కోడలు యశస్వినీ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు స్క్రీనింగ్ కమిటీ యశస్వినీ పేరును ప్రతిపాదించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్న ఎర్రబెల్లికి ఈసారి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ భారీ కసరత్తే చేస్తోంది. ఆయనను ఈసారి ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబసభ్యులను బరిలోకి దింపనున్నారు. ఝాన్సీరెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతోపాటు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సహకారం కూడా ఉంది. మంత్రి ఎర్రబెల్లికి సైతం జనం నుంచి వ్యతిరేక ఉండడంతో నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. మీరా నీతులు చెప్పేదంటూ.. -
వాస్తవ ఘటనలతో...
అనిరుధ్, యశస్విని జంటగా భిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో చంద్రకళ పందిరి నిర్మించిన చిత్రం ‘యాద్గిరి అండ్ సన్స్’. మే 5న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ‘భీమ్లా నాయక్’ చిత్రదర్శకుడు సాగర్ కె. చంద్ర ట్రైలర్‌ని ఆవిష్కరించారు. అనంతరం సాగర్ కె. చంద్ర మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్ కొత్తగా ఉండటంతో దర్శకుడిని కథ అడిగాను. వాస్తవ ఘటనలతో మంచి ప్రయత్నం చేశారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి’’ అన్నారు. ‘‘హీరోగా నాకిది తొలి సినిమా’’ అన్నారు అనిరుధ్. ‘‘యాద్గిరి అండ్ సన్స్’ ఇంటెలిజెంట్ మూవీ. చాలా సిన్సియర్‌గా మ్యూజిక్ చేశాను’’ అన్నారు విజయ్ కురాకుల. ‘‘ప్రేక్షకులకు మంచి సినిమా ఇస్తున్నాం. చూసి, నచ్చితే మరో పది మందికి చెప్పి, సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు భిక్షపతి రాజు. -
బ్రేక్‌ఫాస్ట్‌తో స్కూల్ స్టార్ట్..
ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే ఓ మంచి ఆలోచన కొన్ని సమూహాలకు చేరువ చేస్తుంది. అది సమాజానికి మేలు చేసే ఆలోచన అయితే ఎంతో మందికి స్ఫూర్తి సందేశాన్ని అందిస్తుంది. హైదరాబాద్ తిరుమలగిరిలో ఉంటున్న లతా మారవేణి ఆలోచన ఇప్పుడు వందలాది పేద పిల్లల ఉదయాలను ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మార్చుతుంది. అదెలాగో తెలియాలంటే ఆమె చెప్పే విషయాలను మనమూ వినాలి.. ఆచరణలో పెట్టిన ఆలోచనలను తప్పక తెలుసుకోవాలి. ఆకలి, ఆనందం, వికాసం సహజంగా సర్కారు బడుల్లోనే పిల్లల ముఖాల్లో లభిస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. లతా మారవేణి తనకు వచ్చిన చదువును పిల్లలకు పంచేందుకు స్వచ్ఛందంగా స్కూళ్లకు వెళ్లడం మొదలుపెట్టారు. అక్కడ గమనించిన విషయాలు ప్రశ్నగా మదిలో మెదిలితే తనే పరిష్కారం కూడా వెదికారు. హైదరాబాద్‌లోని అల్వాల్, యాప్రాల్‌లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలోని 500 మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నారు లత మారవేణి. వాలంటీర్ల సాయంతో పిల్లలకు ప్రత్యేక క్లాసులు కూడా తీసుకుంటున్నారు. మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న లత హైదరాబాద్ సీఆర్పీఎఫ్లో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శేఖర్ మారవేని అర్ధాంగి. పరిచయమైన పాఠం ‘‘మా స్వస్థలం రాజన్న సిరిసిల్లలోని గంభీరావ్‌పేట. మా వారి ఉద్యోగరీత్యా అస్సామ్‌కి వెళ్లాం. తన డ్యూటీ రోజూ పధ్నాలుగు గంటలపైనే ఉండేది. నాకు రోజంతా ఒంటరిగా అనిపించేది. అప్పుడు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలకు వెళ్లాను. స్వచ్ఛందంగా చదువు చెబుతానని అనడంతో స్కూల్ వాళ్లు కూడా సంతోషంగా ఆహ్వానించారు. అలా రోజూ కొన్ని గంటలు స్కూల్లోనే గడిపేదాన్ని. మొదట్లో పుస్తకాలు, పెన్నులు పిల్లలకు ఇస్తుండేదాన్ని. రోజూ అలా వెళుతున్నప్పుడు గమనించిన విషయం – పిల్లల్లో చాలా మంది ఉదయం ఏమీ తినకుండానే బడికి వస్తున్నారు. మధ్యాహ్నం స్కూల్లోనే భోజనం ఉంటుంది. కొంతమంది పిల్లలు ఆ భోజనం కోసమే స్కూల్‌కి వస్తున్నారని కూడా తెలిసింది. కొన్నాళ్లు బిస్కెట్లు వంటివి ఇచ్చాను. నాతో పాటు అక్కడ పరిచయం అయినవారితో కలిసి కొంత ఎక్కువ మొత్తంలో ఉదయం పూట పిల్లలకు తినడానికి పండు, బిస్కెట్, ఎగ్ వంటివి ఇస్తుండేదాన్ని. అక్కడ రెండేళ్లు ఉన్న తర్వాత ఛత్తీస్‌గడ్‌కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ చూశాను. ఎక్కువ మంది గిరిజన పిల్లలు. పైగా అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అయినా నా కార్యక్రమాలూ అక్కడి స్కూళ్లలోనూ కొనసాగించాను. కొన్నిసార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ, ఆపలేదు. పిల్లలకు స్కూల్ అయిపోయాక కూడా చదువులు చెప్పడం కొనసాగించాను. అల్పాహారం తప్పనిసరి నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాం. ఓరోజు అల్వాల్, యాప్రాల్ ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లకు వెళ్లాను. డీఈఓ పర్మిషన్ తీసుకున్నాను. ఇక్కడ కూడా పిల్లల పరిస్థితి గమనించాక ఉదయం అల్పాహారం తప్పనిసరి అనిపించింది. ముందు కొన్ని రోజులు పిల్లలందరికీ పాలు ఇప్పించాను. కానీ, అవి కొందరికి పడేవి కావు. కొందరు పిల్లలు ఇష్టపడటం లేదు. దీంతో రాగి జావ, పాలు, బాదంపప్పు పొడి కలిపి ఒక్కొక్కరికి ఒక గ్లాసు చొప్పున ఇవ్వడం మొదలుపెట్టాను. దీనిని స్కూల్లో పిల్లలకు అప్పటికప్పుడు తయారుచేసి ఇస్తుంటాం. ఇది పిల్లలకు బలవర్ధకం. నాలుగు గంటలసేపు వారి ఆకలికి తట్టుకునే శక్తికూడా ఉంటుంది. ఇది క్రమంగా పెంచుతూ వచ్చాం. స్కూల్ ప్రిన్సిపల్ పిల్లల శారీరక ఎదుగుదల బాగుందని గ్రోత్ రిపోర్ట్ ఇచ్చారు. శారీరక ఎదుగుదల బాగుంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మేడ్చల్‌లోని కొన్ని స్కూళ్ల నుంచి మా దగ్గర కూడా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించమని అడుగుతున్నారు. నా ఈ ఆలోచన నచ్చిన వారితో కలిసి ‘వైట్’ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాం. ఇప్పుడు మేడ్చల్‌లోని అన్ని స్కూళ్లకు చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. ఈ యేడాది 1500 మందికి ఉదయం పూట బాలామృతం అందించాలని నిర్ణయించుకున్నాను. వాలంటీర్లతో కలిసి పిల్లలకు ఇంగ్లిష్, పెయింటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం అందించడానికి క్లాసులు తీసుకుంటున్నాం. ఐటి సెక్టార్ నుంచి కూడా కొందరు స్వచ్ఛందంగా వచ్చి మా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీటితో పాటు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లి వ్యసనాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ మా వారూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. స్కూల్ బ్రేక్ ఫాస్ట్ తోనే మొదలవుతుంది... అనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వానికి కూడా సబ్మిట్ చేశాం’’ అని వివరించారు లతామారవేణి. – నిర్మలారెడ్డి -
యశస్విని ‘పసిడి’ గురి
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో రెండో రోజు భారత షూటర్లు అదరగొట్టారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో యశస్విని సింగ్ స్వర్ణం... మనూ భాకర్ రజతం గెల్చుకున్నారు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్స్‌లో యశస్విని 238.8 పాయింట్లు... మనూ 236.7 పాయింట్లు స్కోరు చేశారు. ఇప్పటికే వీరిద్దరు ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. భారత్‌కే చెందిన మరో షూటర్ నివేథా 193.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరీ (243.2 పాయింట్లు) రజతం... అభిషేక్ వర్మ (221.8 పాయింట్లు) కాంస్యం దక్కించుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో దివ్యాంశ్ సింగ్ పన్వర్ (228.1 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అంజుమ్ మౌద్గిల్ 187.8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. టోర్నీ ప్రారంభానికి ముందు ఇద్దరు భారత పిస్టల్ షూటర్లతో సహా మరొక విదేశీ షూటర్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దాంతో ఈ ముగ్గురు షూటర్లు టోర్నీ నుంచి వైదొలిగారు. -
యశస్విని సింగ్ పసిడి గురి...
ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న ఈ ఈవెంట్లో శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత అమ్మాయి యశస్విని సింగ్ స్వర్ణం సాధించింది. ఫైనల్లో యశస్విని 236.7 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. అదే క్రమంలో భారత్‌కు ఈ విభాగంలో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించింది. ఒలీనా (ఉక్రెయిన్–234.8 పాయింట్లు) రజతం, జాస్మీనా (సెర్బియా –215.7 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఈ టోర్నీలో భారత్‌కు ఇలవేనిల్, అభిషేక్ వర్మ స్వర్ణాలు అందించారు. -
వృశాలి, యశస్విని ఓటమి
ఆలిండియా జూ. ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ సాక్షి, హైదరాబాద్: ఓషాన్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయిలు వృశాలి, యశస్విని క్వార్టర్ ఫైనల్లో కంగుతిన్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన అండర్-19 బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ వృశాలి 18-21, 21-13, 14-21తో మూడో సీడ్ ఆకర్షి కశ్యప్ (చత్తీస్‌గఢ్) చేతిలో పరాజయం చవిచూసింది. ఇతర మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ శిఖ (కర్ణాటక) 21-15, 19-21, 21-13తో అనుర (ఎయిరిండియా)పై, ప్రాశి జోషి (ఎయిరిండియా) 21-15, 20-22, 21-19తో తనిష్క్ (ఏపీ)పై, ఇరా శర్మ (హరియాణా) 21-17, 17-21, 21-13తో కనిక కాన్వల్ (ఎయిరిండియా)పై విజయం సాధించారు. అండర్-17 క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ నందనూరి యశస్విని 12-21, 19-21తో నాలుగో సీడ్ ఉన్నతి బిస్త్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడింది. మిగతా మ్యాచ్‌ల్లో సామియా ఇమద్ ఫారుఖి (టీఎస్) 17-21, 13-21తో పూర్వ భవే (మహారాష్ట్ర) చేతిలో ఓడింది. అండర్-17 బాలుర డబుల్స్‌లో శ్రీకృష్ణ(టీఎస్)-సాయి పవన్ (ఏపీ) జంట సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో ఈ జోడి 21-9, 21-19తో సుధిశ్ వెంకట్ (ఏపీ)-తరుణ్ (టీఎస్) జోడీపై నెగ్గింది. కాగా విష్ణువర్ధన్-ఖదీర్ (టీఎస్) జోడి 20-22, 15-21తో సిద్ధార్థ మిశ్రా-సిద్ధాంత్ సలార్ (ఉత్తర ప్రదేశ్) జంట చేతిలో కంగుతింది. అండర్-17 బాలికల క్వార్టర్ఫైనల్లో సృష్టి జూపుడి-ప్రీతి (టీఎస్) జోడి 21-10, 21-14తో అనన్య-మేధా (కర్ణాటక) జంటపై గెలిచి సెమీస్‌లో ప్రవేశించింది. అండర్-17 బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కార్తికేయ (ఎయిరిండియా) 21-18, 13-2తో వేదవ్యాస్ (రిటైర్డ్‌హర్ట్)పై, రాహుల్ (కర్ణాటక) 21-6, 21-11తో అలాప్ మిశ్రా (మధ్యప్రదేశ్)పై, మైస్నమ్ మెరాబా (మణిపూర్) 21-15, 21-18తో కిరణ్ జార్జ్ (కేరళ)పై అమన్ సంజయ్ (మహారాష్ట్ర) 21-15, 19-21, 21-15తో జగదీశ్ (ఏపీ)పై గెలుపొందారు.