వృశాలి, యశస్విని ఓటమి | vrishali and yashaswini lose in quarters | Sakshi
Sakshi News home page

వృశాలి, యశస్విని ఓటమి

Published Sun, Jul 24 2016 9:33 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

వృశాలి, యశస్విని ఓటమి

వృశాలి, యశస్విని ఓటమి

ఆలిండియా జూ. ర్యాంకింగ్ బ్యాడ్మింటన్
 
సాక్షి, హైదరాబాద్: ఓషాన్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయిలు వృశాలి, యశస్విని క్వార్టర్ ఫైనల్లో కంగుతిన్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన అండర్-19 బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ వృశాలి 18-21, 21-13, 14-21తో మూడో సీడ్ ఆకర్షి కశ్యప్ (చత్తీస్‌గఢ్) చేతిలో పరాజయం చవిచూసింది.

ఇతర మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ శిఖ (కర్ణాటక) 21-15, 19-21, 21-13తో అనుర (ఎయిరిండియా)పై, ప్రాశి జోషి (ఎయిరిండియా) 21-15, 20-22, 21-19తో తనిష్క్ (ఏపీ)పై, ఇరా శర్మ (హరియాణా) 21-17, 17-21, 21-13తో కనిక కాన్వల్ (ఎయిరిండియా)పై విజయం సాధించారు. అండర్-17 క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ నందనూరి యశస్విని 12-21, 19-21తో నాలుగో సీడ్ ఉన్నతి బిస్త్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడింది. మిగతా మ్యాచ్‌ల్లో సామియా ఇమద్ ఫారుఖి (టీఎస్) 17-21, 13-21తో పూర్వ భవే (మహారాష్ట్ర) చేతిలో ఓడింది. అండర్-17 బాలుర డబుల్స్‌లో శ్రీకృష్ణ(టీఎస్)-సాయి పవన్ (ఏపీ) జంట సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో ఈ జోడి 21-9, 21-19తో సుధిశ్ వెంకట్ (ఏపీ)-తరుణ్ (టీఎస్) జోడీపై నెగ్గింది.

కాగా విష్ణువర్ధన్-ఖదీర్ (టీఎస్) జోడి 20-22, 15-21తో సిద్ధార్థ మిశ్రా-సిద్ధాంత్ సలార్ (ఉత్తర ప్రదేశ్) జంట చేతిలో కంగుతింది. అండర్-17 బాలికల క్వార్టర్‌ఫైనల్లో సృష్టి జూపుడి-ప్రీతి (టీఎస్) జోడి 21-10, 21-14తో అనన్య-మేధా (కర్ణాటక) జంటపై గెలిచి సెమీస్‌లో ప్రవేశించింది. అండర్-17 బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కార్తికేయ (ఎయిరిండియా) 21-18, 13-2తో వేదవ్యాస్ (రిటైర్డ్‌హర్ట్)పై, రాహుల్ (కర్ణాటక) 21-6, 21-11తో అలాప్ మిశ్రా (మధ్యప్రదేశ్)పై, మైస్నమ్ మెరాబా (మణిపూర్) 21-15, 21-18తో కిరణ్ జార్జ్ (కేరళ)పై అమన్ సంజయ్ (మహారాష్ట్ర) 21-15, 19-21, 21-15తో జగదీశ్ (ఏపీ)పై గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement