badminton
-
Singapore International Challenge Tourney: రన్నరప్‌గా భారత యువ షట్లర్
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ ఉన్నతి హుడా సింగపూర్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ ఉన్నతి 17–21, 16–21 పాయింట్ల తేడాతో రుజానా (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. 42 నిమిషాల్లో ముగిసిన పోరులో ఉన్నతి వరుస గేమ్‌ల్లో ఓడింది. టోర్నీ ఆసాంతం రాణించిన ఉన్నతి... రెండో రౌండ్లో ఆసియా క్రీడల పతక విజేత సయిన కవాకమి (ఆ్రస్టేలియా)ను ఓడించింది. సెమీఫైనల్‌కు చేరే క్రమంలో చైనీస్ తైపీకి చెందిన ఇద్దరు షట్లర్లు సైయాంగ్ స్యూన్ లిన్, యీ టింగ్‌పై కూడా ఉన్నతి విజయాలు సాధించింది. సెమీఫైనల్లో ఉన్నతి 18–21, 21–19, 22–20తో థి ట్రాంగ్ వు (వియత్నాం)ను చిత్తు చేసింది. తొలి గేమ్‌లో పరాజయం పాలైన తర్వాత తిరిగి పుంజుకున్న ఉన్నతి... హోరాహోరీ పోరులో చక్కటి విజయంతో ఫైనల్ చేరింది. అయితే తుదిపోరులో యువ షట్లర్ అదే జోరు కనబర్చలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇదే టోర్నీలో భారత్‌కు చెందిన మరో యువ షట్లర్ దేవిక సిహాగ్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. -
ఖేలో.. అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్
ఎన్నో విశిష్టతలున్న భాగ్యనగరం అంతర్జాతీయ క్రీడల్లోనూ తన ప్రశస్తిని కొనసాగిస్తుంది. ముఖ్యంగా క్రికెట్, టెన్నిస్ వంటి ప్రజాధరణ ఉన్న క్రీడలతో పాటు బ్యాడ్మింటన్ వంటి క్రీడలతో దేశానికి ఒలింపిక్స్ మెడల్స్ అందించిన ఘనత నగరానికి ఉంది. ఇదే కోవలో మరిన్ని అంతర్జాతీయ క్రీడలు నగరంలో రాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ ఫుట్‌బాల్ సైతం ఈ మధ్య తన ప్రశస్తిని పెంచుకుంటుంది. నగరవాసులు అమెరికన్ ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ ఆదరణ దృష్ట్యా తెలంగాణ అమెరికన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రారంభమై ఈ క్రీడ అభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది. అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడను నగరంతో పాటు రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేసేందుకు అమెరికన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన తెలంగాణ అమెరికన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (టాఫా) కృషి చేస్తుంది. ఇందులో భాగంగా 2025–28 మధ్య కాలానికి అధ్యక్షుడిగా చాగన్ల బల్వీర్ందర్ నాథ్‌ను నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో అమెరికన్ ఫుట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ ప్రోత్సహించి, ఒలింపిక్స్ వేదికల పై మన క్రీడాకారుల నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా ఈ అమెరికన్ ఫుట్‌బాల్ ప్రసిద్ధి చెందింది. సాకర్, రగ్బీ నుంచి వచ్చిన ఈ గేమ్ 2022లో లీగ్ వార్షిక ఆదాయం 18.6 బిలియన్ డాలర్లుగా నమోదు చేసి ప్రపంచంలోనే విలువైనస్పోర్ట్స్ లీగ్‌లో భాగంగా చేరింది. రాష్ట్ర వ్యాప్త గుర్తింపు దిశగా..ఈ క్రీడను హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. దీని కోసం ప్రత్యేకంగా అన్ని పట్టణాల్లో, జిల్లాల్లో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి, వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను కల్పిస్తాం. ఈ ప్రయత్నంలో భాగంగా అసోసియేషన్స్, క్లబ్స్ ఏర్పాటు చేయనున్నాం. మరో రెండేళ్లలో నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా అంతర్జాతీయ స్థాయి లీగ్‌ను నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందులో దాదాపు 22 దేశాలను భాగం చేస్తున్నాం. యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్‌లో ఔత్సాహిక క్రీడాకారులకు, యువతకు ప్రత్యేక శిక్షణ అందించనున్నాం. టాఫా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు నడిపల్లి, ఏఎఫ్ఎఫ్ఐ సీఈఓ సందీప్ చౌదరి వంటి దార్శనికుల ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందించాలని కొరనున్నాం. – చాగన్ల బల్వీర్ందర్ నాథ్, టాఫా అధ్యక్షులు.అమెరికన్ ఫుట్‌బాల్ గేమ్‌లో కాంటాక్ట్, నాన్‌కాంటాక్ట్ అనే ఈ విభాగాల్లో పోటీ ఉంటుంది. నాన్ కాంటాక్ట్ విభాగంలోని ఫ్లాగ్ గేమ్ ఇక్కడ అభివృద్ధిలో ఉంది. రగ్బీలా ఇందులో మ్యాన్ పుల్లింగ్ ఉండదు. నేను 13 ఏళ్ల నుంచి ఈ గేమ్ ఆడుతున్నాను. అంతేకాకుండా ఇండియన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాను. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం నాలుగు నేషనల్స్ గెలిచింది. 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రస్తుతం సన్నద్ధమవుతున్నాం. ఇందులో స్థానిక క్రీడాకారులను భాగం చేసేందుకు టాఫా ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయి మాదిరిగా ఇక్కడ కూడా ఈ క్రీడకు పాపులారిటీ తీసుకురానున్నాం. – జీవీ మణికంఠ రెడ్డి, ఇండియన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ కెప్టెన్ -
ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ పుల్లెల గోపీచంద్(Pullela Gopichand) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధనవంతులు మాత్రమే తమ పిల్లలను క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని సూచించాలన్నాడు. లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుందని హెచ్చరించాడు. క్రీడాకారులకు తగినంత గుర్తింపు, దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో తాను ఇలా మాట్లాడుతున్నట్లు తెలిపాడు.కాగా భారత్‌లో బ్యాడ్మింటన్(Badminton) సూపర్ పవర్‌గా మారడంలో కీలక పాత్ర పోషించిన పుల్లెల గోపిచంద్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. క్రీడలను ప్రొఫెషన్‌గా ఎంచుకునే యువత సంఖ్య పెరుగుతుండటం సంతోషాన్ని ఇస్తుందన్నాడు. అయితే, అదే సమయంలో క్రీడాకారులలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మంది కెరీర్ మాత్రమే సాఫీగా సాగిపోవడం కాస్త ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాడు.ధనవంతులకు మాత్రమే..‘‘ధనికులై ఉండి లేదంటే.. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మాత్రమే స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలన్నది నా అభిప్రాయం. నేను మాత్రం సాధారణ కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు మాత్రం వారి పిల్లలను క్రీడల్లోకి పంపవద్దనే సలహా ఇస్తాను.క్రికెట్లో రాణించిన వాళ్లు అన్నిరకాలుగా కొంతమేర సక్సెస్ అవుతారు. కానీ ఇతర క్రీడల్లో రాణించే వాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. వారి త్యాగాలు, సేవలకు తగినంత మూల్యం అందుకోగలుగుతున్నారా?సర్, మేడమ్ అని సంబోధిస్తూ ఒలింపిక్ మెడల్స్ సాధించిన వాళ్లలో చాలా మంది రైల్వేస్, ఆర్బీఐ , ఇన్కమ్ టాక్స్, పోలీస్ ఉద్యోగాలు.. లేదంటే అంతకంటే తక్కువ కేడర్ కలిగిన జాబ్స్ చేస్తున్నారు. అయితే, ఓ సివిల్ సర్వెంట్ మాత్రం అరవై ఏళ్ల వరకు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. కానీ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్లు మాత్రం వారిని సర్, మేడమ్ అని సంబోధిస్తూ జీవితం గడపాలి.వారి దయాదాక్షిణ్యాల మీదే అంతా ఆధారపడి ఉంటుంది. కొంతమంది మాత్రమే క్రీడాకారులకు గౌరవం ఇస్తారు. అయితే, ఆటగాళ్ల పట్ల ప్రతికూల భావనలు ఉన్నవారు మాత్రం సులువుగా ఉద్యోగానికి వచ్చేశారని చులకనగా చూసే అవకాశం ఉంది. గత ఇరవై ఏళ్లలో దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందో చూశారా?ఈరోజు వారి సంపాదన ఎంత?వివిధ క్రీడల్లో వారు పతకాలు సాధించారు. కానీ ఈరోజు వారి సంపాదన ఎంత? వారి భవిష్యత్తు ఏమిటి? దేశానికి పతకాలు సాధించిపెడుతున్న వారికి అంతే స్థాయిలో రివార్డులు దక్కుతున్నాయా? మరి అలాంటప్పుడు పిల్లలను స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని ఎలా చెప్పగలం?ఒకవేళ మీరు స్పోర్ట్స్‌పర్సన్ కావాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే... అప్పుడు ఇంగ్లిష్ భాషలో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం కూడా సంపాదించండి. అదే విధంగా రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా ముందుగానే డిసైడ్ చేసుకోండి. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం మాత్రం మర్చిపోకూడదు’’ అని ఆటలతో పాటు చదువు, కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల శ్రద్ధ చూపాలని వర్దమాన క్రీడాకారులకు గోపీచంద్ దిశానిర్దేశం చేశాడు. కాగా గోపీచంద్ అకాడమీ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ఒలింపిక్ మెడలిస్టులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక గోపీచంద్ కుమార్తె గాయత్రి కూడా డబుల్స్ విభాగంలో ప్రతిభను నిరూపించుకుంటోంది.చదవండి: శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ పోస్ట్ -
పెళ్లైన తర్వాత బ్యాడ్మింటన్ స్టార్ తొలి బర్త్‌డే.. ఫొటోలు చూశారా?
-
భారత్ X జపాన్
కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కాంస్య పతకాన్ని నిలబెట్టుకునేందుకు విజయం దూరంలో నిలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్ జట్టుతో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటుంది. గురువారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో ద్వయం 21–11, 12–21, 15–21తో కి డాంగ్ జు–జియోంగ్ నా యున్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో మాళవిక బన్సోద్ 9–21, 10–21తో సిమ్ యు జిన్ చేతిలో పరాజయం పాలైంది. దాంతో భారత్ 0–2తో వెనుకబడింది. మూడో మ్యాచ్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్ 17–21, 21–18, 21–19తో చో జియోన్‌యోప్‌పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 19–21, 21–16, 21–11తో కిమ్ ఇన్ జి–కిమ్ యు జుంగ్ జంటను ఓడించడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో సాతి్వక్ సాయిరాజ్–అర్జున్ జంట 14–21, 21–23తో జిన్ యోంగ్–నా సుంగ్ సెయోంగ్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది. -
మకావును మట్టికరిపించి...
కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. మకావు జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–0 తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టుకు క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియా చేతిలో ఓడిన మకావు జట్టు వరుసగా రెండో ఓటమితో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన దక్షిణ కొరియా నేడు భారత జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ ‘డి’ టాపర్‌గా నిలుస్తుంది. తొలి మ్యాచ్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్యా వరియత్ జోడీ 21–10, 21–9తో లోక్ చోంగ్ లియోంగ్–వెంగ్ చి ఎన్జీ జంటను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21–16, 21–12తో పాంగ్ ఫాంగ్ పుయ్‌పై గెలవడంతో భారత ఆధిక్యం 2–0కు పెరిగింది.మూడో మ్యాచ్‌లో రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ 21–15, 21–9తో హావో వాయ్ చాన్‌ను ఓడించడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది.నాలుగో మ్యాచ్‌లో చిరాగ్ శెట్టి–అర్జున్ ద్వయం 21–15, 21–19తో చిన్ పోన్ పుయ్–కోక్ వెన్ వోంగ్ జోడీపై... ఐదో మ్యాచ్‌లో ట్రెసా జాలీ–పుల్లెల గాయత్రి జంట 21–10, 21–5తో ఎన్జీ వెంగ్ చి–పుయ్ చి వా ద్వయంపై గెలుపొందడంతో భారత విజయం 5–0తో సంపూర్ణమైంది. 2023లో దుబాయ్‌లో జరిగిన ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. -
PV Sindhu: కీలక టోర్నీకి దూరం.. భర్తతో ‘మ్యాచీ మ్యాచీ’!
ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పతకావకాశాలకు దెబ్బ పడింది. భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు(PV Sindhu) కండరాల గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. క్రితంసారి 2023లో దుబాయ్(Dubai)లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో సింధు సభ్యురాలిగా ఉన్న భారత జట్టు కాంస్య పతకాన్ని(Bronze Medal) సాధించింది. గువాహటిలో ఈనెల నాలుగో తేదీన మొదలైన జాతీయ శిక్షణ శిబిరం సందర్భంగా సింధు ప్రాక్టీస్ సమయంలో గాయపడింది.ఎంఆర్ఐ స్కాన్ తీయగా సింధు కండరాల గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని తేలింది. దాంతో సింధు ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఈనెల 11 నుంచి 15 వరకు చైనాలోని కింగ్డావో నగరంలో జరుగుతుంది. గ్రూప్ ‘డి’లో ఉన్న భారత్ ఈనెల 12న మకావు జట్టుతో, 13న దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల (పురుషుల, మహిళల సింగిల్స్, పురుషుల, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) చొప్పున జరుగుతాయి. భారత బ్యాడ్మింటన్ జట్టు: లక్ష్య సేన్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, అర్జున్, సతీశ్ కుమార్, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ఆద్య. మ్యాచీ మ్యాచీఇదిలా ఉంటే.. గాయం కారణంగా ఆటకు దూరమైన పీవీ సింధు వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించింది. భర్త వెంకట దత్తసాయితో కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ చాక్లెట్ కలర్ దుస్తులు ధరించిన ఉన్న ఫొటోను షేర్ చేసిన సింధు.. ‘మ్యాచీ మ్యాచీ’ అంటూ మురిసిపోయింది.శభాష్ మానస్ న్యూఢిల్లీ: భారత పురుషుల టెన్నిస్ రైజింగ్ స్టార్ మానస్ ధామ్నే తన కెరీర్లో తొలి ప్రొఫెషనల్ టైటిల్ సాధించాడు. ట్యూనిషియాలో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఎం15 టోర్నీలో 17 ఏళ్ల మానస్ విజేతగా నిలిచాడు. ఐటీఎఫ్ ర్యాంకింగ్స్‌లో 64వ స్థానంలో ఉన్న ఈ మహారాష్ట్ర కుర్రాడు ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 2–6, 6–0, 6–2తో ఇటలీకి చెందిన లొరెంజో కార్బోనిపై గెలుపొందాడు.తద్వారా భారత్ నుంచి ఐటీఎఫ్ టైటిల్ నెగ్గిన రెండో అతి పిన్న వయస్కుడిగా మానస్ గుర్తింపు పొందాడు. ఈ రికార్డు యూకీ బాంబ్రీ (16 ఏళ్ల 10 నెలలు; 2009లో న్యూఢిల్లీ ఫ్యూచర్స్ టోర్నీ) పేరిట ఉంది. క్వాలిఫయర్‌గా ట్యూనిషియా ఎం15 టోర్నీలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టిన మానస్ వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి చాంపియన్‌గా అవతరించడం విశేషం. ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ మాజీ కోచ్ రికియార్డో పియాటి వద్ద మానస్ శిక్షణ తీసుకుంటున్నాడు. -
15 పాయింట్లతో మూడు గేమ్‌లు!
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా మెరుపు వేగంలో ముగిసే ఆటలపై పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా బ్యాడ్మింటన్ కూడా అటువైపే పయనించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్ ) 21 పాయింట్లతో మూడు గేముల (బెస్టాఫ్ త్రీ) స్కోరింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. ఆయా దేశాల్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇదే స్కోరింగ్‌తో టోర్నీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆట మరింత రసవత్తరంగా జరిగేందుకు, మ్యాచ్ చకచకా ముగిసిపోయేందుకు కొత్త స్కోరింగ్ విధానం అమలు చేసేందుకు బీడబ్ల్యూఎఫ్ సిద్ధమైంది. ఇప్పుడున్న మూడు గేమ్‌లను 15 పాయింట్లతో ముగించి ఆటలో వేగం పెంచనుంది. తద్వారా కొత్తతరం ప్రేక్షకుల్ని ఆకర్శించాలని, సుదీర్ఘంగా సాగదీయకుండా, నిమిషాల్లో మ్యాచ్ ఫలితం వచ్చేలా కొత్త స్కోరింగ్ విధానాన్ని ఈ ఏప్రిల్ నుంచే అమలు చేయాలని బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ నిర్ణయించింది. నవంబర్‌లో కౌలాలంపూర్‌లో జరిగే బీడబ్ల్యూఎఫ్ అత్యున్నత సమావేశానికి ముందు ఆరు నెలల పాటు ఈ స్కోరింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాక... ఆ సమావేశంలో సమీక్షించి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. ‘కాంటినెంటల్ చాంపియన్‌షిప్‌లు, గ్రేడ్–3 టోర్నమెంట్లు, జాతీయ, అంతర్జాతీయ లీగ్‌లు, జాతీయ టోర్నీల్లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ కొత్త స్కోరింగ్ పద్ధతిని అవలంభిస్తారు’ అని బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త విధానం వల్ల మ్యాచ్‌ల్లో పోటీ మరింత పెరుగుతుందని, ప్రతీ పాయింట్ కోసం ప్రత్యర్థులు దీటుగా సన్నద్ధమై బరిలోకి దిగుతారని, మ్యాచ్ త్వరగా ముగియడం కాదు... పోటాపోటీగా జరగడం ఖాయమని బీడబ్ల్యూఎఫ్ వివరణ ఇచ్చింది. నిజానికి 15 పాయింట్ల ‘బెస్టాఫ్ త్రీ’ గేమ్‌లు కొత్తేం కాదు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో గతంలో ఏళ్ల తరబడి ఈ స్కోరింగ్ పద్ధతిలో మ్యాచ్‌లు జరిగాయి. తర్వాత 7 పాయింట్లతో ‘బెస్టాఫ్ ఫైవ్’ పద్ధతిలోనూ కొన్నాళ్లు జరిగాయి. క్రమానుగతంగా మారుతుండగా 2014లో తొలిసారి 11 పాయింట్లతో ‘బెస్టాఫ్ ఫైవ్’ స్కోరింగ్ పద్ధతి తెరపైకి వచ్చింది. కానీ బీడబ్ల్యూఎఫ్లోని సభ్యదేశాలు సమ్మతించకపోవడంతో ఆ ఏడాది, తర్వాత 2021లో బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్లో కనీస మద్దతు లభించక మరోసారి ఇలా రెండుసార్లూ ప్రతిపాదన దశలోనే ఆ స్కోరింగ్ (11 పాయింట్ల బెస్టాఫ్ ఫైవ్) పద్ధతిని ఉపసంహరించుకున్నారు. దీంతో 2006 నుంచి స్థిరంగా ప్రస్తుత 21 పాయింట్ల స్కోరింగే కొనసాగుతోంది. -
కిదాంబి శ్రీకాంత్‌తో హండ్రెడ్ స్పోర్ట్స్ భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ లెజెండ్, మాజీ ప్రపంచ నెంబర్ వన్ శ్రీకాంత్ కిదాంబితో హండ్రెడ్ స్పోర్ట్స్ జట్టు కట్టింది. అంతర్జాతీయ వేదికగా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన హండ్రెడ్ స్పోర్ట్స్.. తమ బ్రాండ్ ఉనికిని బలోపేతం చేయాలనే లక్ష్యంలో శ్రీకాంత్‌తో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ప్రతిష్టాత్మక ఇండోనేషియా మాస్టర్స్-2025 టోర్నీలో అధికారికంగా మొదలుకానుంది. ఇది భవిష్యత్ తరం బ్యాడ్మింటన్ ఔత్సాహికులను ప్రేరేపించడానికి, ప్రోత్సాహం అందించడానికి హండ్రెడ్ నిబద్ధతకు ప్రతీకగా నిలవనుంది.కాగా 2024లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గూగుల్-డెలాయిట్ థింక్ స్పోర్ట్స్ నివేదిక.. 'ప్రస్తుతం భారత్ లో Gen Zలో బ్యాడ్మింటన్ క్రీడ రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ'గా వెల్లడించింది. దేశంలో క్రికెట్ తర్వాత రెండవ స్థానంలో బ్యాడ్మింటన్ ఉంది. ఇలాంటి తరుణంలో శ్రీకాంత్ కిదాంబి హండ్రెడ్ తో కొనసాగనున్న అనుబంధం భారతదేశంలోని క్రీడాభివృద్ధిని పెంపొందించడానికి, యువ ప్రతిభను పెంపొందించడానికి బ్రాండ్ కనబరుస్తున్న అంకితభావాన్ని నొక్కి చెబుతుంది.బ్యాడ్మింటన్‌తో సహా భారతదేశంలోని అన్ని క్రీడా విభాగాలలో ఆధిపత్యం చెలాయించడం, అభివృద్ధి చేయడంతో పాటు ప్రపంచ వారసత్వ ఆటగాళ్లతో పోటీ పడటం హండ్రెడ్ లక్ష్యాలు. ఈ ప్రయాణంలో ప్రస్తుత భాగస్వామ్యం నూతన ఆవిష్కరణలతో కొత్త ప్రమాణాలను నెలకొల్పడమే ధ్యేయంగా ముందుకు సాగుతుంది.ఆనందంగా ఉందిఇక హండ్రెడ్ స్పోర్ట్స్ తో భాగస్వామ్యం, అనుబంధం గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ.., "నా ప్రదర్శన పట్ల, నా క్రీడా ప్రయాణాన్ని ప్రతిబింబించగలిగే బ్రాండ్ అయిన హండ్రెడ్‌తో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ గొప్ప కలయికతో తదుపరి తరం బ్యాడ్మింటన్ ఆటగాళ్లను ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము" అని తెలిపారు.హండ్రెడ్ సింగపూర్ డైరెక్టర్ మనక్ కపూర్ మాట్లాడుతూ.., "శ్రీకాంత్‌ను హండ్రెడ్ కుటుంబంలోకి స్వాగతించడం ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్మింటన్ మూలాలను మరింత ముందుకు తీసుకెళ్లాలననే మా నిబద్ధతకు నిదర్శనం. ఈ మిషన్‌ను నడిపించడంలో శ్రీకాంత్‌ను కీలకమైన వ్యక్తిగా మేము చూస్తున్నాము.ముఖ్యంగా భారతదేశంలో అతడి క్రీడా వారసత్వం, ప్రభావం యువ ఆటగాళ్లను బ్యాడ్మింటన్ క్రీడను స్వీకరించడానికి ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా తమ క్రీడా ప్రయాణాన్ని అత్యున్నత స్థాయిలలో పోటీ పడటానికి బాటలు వేస్తుంద"ని పేర్కొన్నారు.వ్యూహాత్మకంగా ముందుకుహండ్రెడ్ ఇండియా డైరెక్టర్ విశాల్ జైన్ మాట్లాడుతూ.., “గత దశాబ్ద కాలంలో భారతదేశంలో బ్యాడ్మింటన్ అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఈ క్రమంలో యువతరంలో రెండవ అత్యధికంగా ఆడే క్రీడగా మారింది. హండ్రెడ్‌లో అధిక పనితీరు గల ఉత్పత్తులను అందించడం ద్వారా మాత్రమే కాకుండా, క్రీడా రంగ పరిశ్రమను చురుకుగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఈ వృద్ధిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నామని" వివరించారు.ఎలైట్ "క్లబ్ హండ్రెడ్" బృందం:👉లైన్ క్జార్స్ఫెల్డ్ట్ (డెన్మార్క్)👉 రాస్మస్ గెమ్కే (డెన్మార్క్)👉మాడ్స్ క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్)👉అలెగ్జాండ్రా బోజే (డెన్మార్క్)👉 డెజాన్ ఫెర్డినాన్సియా (ఇండోనేషియా)👉గ్లోరియా ఎమాన్యుయెల్ విడ్జాజా (ఇండోనేషియా).చదవండి: వారానికి రూ. 5 కోట్లు.. జాక్‌పాట్ కాదు! అంతకు మించి.. -
మహారాణిలా పీవీ సింధు : బ్యాడ్మింటన్-ప్రేరేపిత డిజైనర్ లెహంగా విశేషాలు
భారత బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధు పెళ్లి వేడుక లేటెస్ట్ సెన్సేషన్ అని చెప్పవచ్చు. చాలా సాదాసీదాగా, ఆట తప్ప, మరో ధ్యాస లేదు అన్నట్టుగా కనిపించే సింధు ఫ్యాషన్‌లో కూడా పర్ఫెక్ట్ అనిపించుకుంది. నిశ్చితార్థం మొదలు, ప్రీ-వెడ్డింగ్ షూట్, హల్దీ, సంగీత్, మూడు ముళ్ల ముచ్చట, రిసెప్షన్ ఇలా ప్రతీ వేడుకలో చాలా ఎలిగెంట్‌గా, సూపర్ స్టైలిష్‌గా మెరిసిపోయింది.తన చిరకాల స్నేహితుడు వెంకట దత్త సాయితో పీవీ సింధు వివాహ వేడుక (డిసెంబర్ 22)అత్యంత సుందరంగా, స్టైలిష్‌గా జరిగింది. గ్లామరస్ బ్రైడల్ లుక్‌తో అందర్ని కట్టి పడేసిందీ జంట. 'మాచీ-మ్యాచీ' లుక్స్‌తో స్వీట్ అండ్ క్యూట్ కపుల్ అనిపించుకున్నారు. తాజాగా ప్రీవెడ్డింగ్ షూట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో సీ గ్రీన్ డిజైనర్ లెహంగాలో అందంగా కనిపించింది. మరొక సెట్ చిత్రాలలో, బ్యాడ్మింటన్-ప్రేరేపిత పాస్టెల్ బ్లూ లుక్‌లో మెరిసారు.ఈ ఎథ్నిక్ పాస్టెల్ కలర్ లెహంగా డిజైనర్ మసాబా కలెక్షన్లోనిది. అంబర్ బాగ్ టిష్యూ లెహంగా సెమీ-షీర్ స్టైల్‌తో గోల్డ్-టోన్డ్ ఫాయిల్ ప్రింట్లతో వచ్చింది. దీని జతగా ఎంబ్రాయిడరీ దుపట్టా మరింత అందంగా అమిరింది. ఇక ఆభరణాల విషయానికి వస్తే లేయర్డ్ నెక్లెస్‌లు, స్టేట్మెంట్ చెవిపోగులు అతికినట్టు అమరాయి. మహారాణిలాంటి ఆమె లుక్‌తో సమానంగా దత్త సాయి మ్యాచింగ్ లుక్‌లో అదిరిపోయాడు. గోల్డ్ టోన్ ప్రింట్లతో కూడిన 'అంబర్ బాగ్' కుర్తా సంప్రదాయ పంచెకట్టుతో స్పెషల్‌గా కనిపించాడు. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta)ఇంకా చాలా విశేషాలుఈ కస్టమ్ క్రియేషన్‌లో బ్యాడ్మింటన్ రాకెట్లు, షటిల్ కాక్స్, బంగారు పతకాలు (టోక్యో , రియో ఒలింపిక్స్‌లో సింధు సాధించిన విజయాలకు ప్రతీక) ఉంగరాలు, పేపర్ ఎయిర్‌ప్లేన్ మోటిఫ్స్, సొగసైన జడ స్టైల్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. -
తల్లితో కలిసి బుట్టబొమ్మలా.. మంచులో భర్త ప్రేమలో తడిసి ముద్దవుతూ ఇలా (ఫొటోలు)
-
PV Sindhu: తన ప్రేమ కథను బయట పెట్టిన సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు(Pv Sindhu) వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయితో సింధు వివాహం ఆదివారం(డిసెంబర్ 22) అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన తమ పెళ్లి ఫోటోలను సింధు సోషల్ మీడియాలో షేర్ చేసింది.అందుకు హృదయం’ ఎమోజీని జత చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరలవుతున్నాయి. అయితే తాజాగా సింధు ఓ ఇంటర్వ్యూలో వెంకట సాయితో తన లవ్ స్టోరీని బయటపెట్టింది. ఓ విమాన ప్రయాణం తమద్దరిని కలిపిందని సింధు తెలిపింది. వోగ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. అక్టోబర్ 2022లో తొలిసారి వెంకట దత్త సాయిని సింధు కలిసినట్లు తెలుస్తోంది.రెండేళ్ల కిందట మేమిద్దరం కలిసి ఒకే విమానంలో ప్రయాణించాం. ఆ ప్రయాణంతో అంతామారిపోయింది. ఆ జర్నీ మమ్మల్ని మరింత దగ్గర చేసింది. అదంతా లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా అన్పించింది. అప్పటి నుంచి మా లవ్ జర్నీ మొదలైంది. మా నిశ్చితార్థం కూడా అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది.మాజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. అది చాలా భావోద్వేగభరిత క్షణం. ఒక ప్రొఫెషనల్ అథ్లెట్‌గా నాకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికి.. నా జీవితంలో జరిగే ముఖ్యమైన ఘట్టం కోసం అన్ని ముందే ప్లాన్ చేశాను. అందుకు దత్తా కూడా తనవంతు సాయం చేశాడని ఓ ఇంటర్వ్యూలో సింధు పేర్కొంది.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
పీవీ సింధు పెళ్లి బాజాకు మూహూర్తం ఫిక్స్.. వరుడు ఇతడే (ఫొటోలు)
-
ప్యాడెల్ టెన్నిస్ ఆడేద్దాం..!
ఎప్పుడైనా ప్యాడెల్ టెన్నిస్ గురించి విన్నారా? టెన్నిస్ గురించి తెలుసు.. బ్యాడ్మింటన్ గురించి తెలుసు.. ఇంకా స్క్వాష్ గురించీ తెలుసు కానీ కొత్తగా ప్యాడెల్ టెన్నిస్ అంటే ఏంటి అనుకుంటున్నారా..? అవును ఇది చాలా కొత్త గేమ్.. కాకపోతే చాలా ట్రెండీ గేమ్. మెక్సికోలో పుట్టిన ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. కానీ మన హైదరాబాదీయులకు మాత్రం ఇది కాస్త కొత్త గేమ్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఇటీవల కాలంలో ప్యాడెల్ టెన్నిస్‌పై నగరవాసుల్లో ముఖ్యంగా యువతలో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే ప్యాడెల్ టెన్నిస్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్యాడెల్ టెన్నిస్ అంటే ఏంటి? సాధారణ టెన్నిస్‌కు, ప్యాడెల్ టెన్నిస్‌కు మధ్య వ్యత్యాసాలేంటి? ఎలా ఆడుతారు..? ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుందాం..! ప్యాడెల్ టెన్నిస్ కూడా టెన్నిస్ లాంటి ఆటనే. 1969లో మెక్సికోకు చెందిన ఎన్రిక్ కార్క్యూరా అనే క్రీడాకారులు ఈ గేమ్ కనిపెట్టాడు. టెన్నిస్, స్క్వాష్ ఆటల కలయికనే ఈ ప్యాడెల్ టెన్నిస్. టెన్నిస్‌లో ఉన్నట్టే అన్ని రూల్స్ ఉంటాయి. కోర్టు, రాకెట్, వాడే బాల్ ఇలా చాలా విషయాల్లో కాస్త వ్యత్యాసాలు ఉన్నాయి. సాధారణంగా టెన్నిస్ కోర్టులు పెద్ద పరిమాణంలో, ఓపెన్‌గా ఉంటాయి. అయితే ప్యాడెల్ టెన్నిస్ కోర్టులు మాత్రం కాస్త చిన్న పరిమాణంలో మూసేసి ఉంటాయి. 20 మీటర్ల పొడవుతో, 10 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. అదే టెన్నిస్ కోర్టులు మాత్రం 23 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. ప్యాడెల్ గేమ్‌లో కాస్త ఫన్నీ అనిపించే అంశం ఏంటంటే.. చిన్నప్పుడు డబుల్ స్టెప్ ఔట్ అనుకునేవాళ్లం కదా.. అలాగే ఇక్కడ కూడా ఒక్కసారి వెనుక ఉన్న గోడకు తగిలి.. మరోసారి కోర్టులో బౌన్స్ అయినా కూడా ఆట కొనసాగించవచ్చు. చాలా మంది గోడకు బంతి తగిలేలా చేసి స్ట్రాటజీలా ఆడుతుంటారు. అదే టెన్నిస్‌లో మాత్రం ఒకసారే బౌన్స్ కావాల్సి ఉంటుంది. ఇక, వెనుక గోడలకు తగిలితే ప్రత్యరి్థకే పాయింట్ దక్కుతుంది. ఇదో సోషల్ గేమ్..ప్యాడెల్ టెన్నిస్‌ను సోషల్ గేమ్ అంటుంటారు. ఎందుకంటే దీన్ని కచి్చతంగా ఇద్దరు ఆటగాళ్లు జట్టుగా ఆడాల్సి ఉంటుంది. అదే టెన్నిస్ మాత్రం సింగిల్స్, డబుల్స్ కూడా ఆడొచ్చు. ఇక, రాకెట్ విషయంలో టెన్నిస్‌కు, ప్యాడెల్ టెన్నిస్‌కు చాలా తేడా ఉంటుంది. టెన్నిస్ రాకెట్లో స్ట్రింగ్స్ ఉంటాయి. అదే ప్యాడెల్ టెన్నిస్ రాకెట్లో స్ట్రింగ్స్ ఉండవు. పొడవు విషయంలో కూడా టెన్నిస్ రాకెట్ కన్నా ప్యాడెల్ రాకెట్ చిన్నగా ఉంటుంది. వెడల్పు ఎక్కువగా ఉంటుంది. అయితే వాడే బాళ్లు చూడటానికి ఒకేలా కనిపించినా.. కాస్త తేడా ఉంటుంది. టెన్నిస్ బాల్స్ గట్టిగా ఉంటాయి. అదే ప్యాడెల్ టెన్నిస్ విషయంలో కాస్త మెత్తగా, తక్కువ పీడనంతో ఉంటాయి. ఆడే విధానంలో కూడా రెండు గేమ్స్ మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ముఖ్యంగా బాల్ సరీ్వంగ్ విషయంలో చాలా రూల్స్ ఉంటాయి.ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్.. మనదేశంలో క్రికెట్ తర్వాత దాదాపు అదే స్థాయిలో ఆదరణ పొందుతోన్న గేమ్ టెన్నిస్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్యాడెల్ టెన్నిస్ ఆడుతున్నా.. చూస్తున్నా కూడా చాలా ఫన్ ఉంటుంది. ఉత్కంఠతో పాటు ఎంటర్టైన్మెంట్ పక్కా అంటున్నారు ప్యాడెల్ టెన్నిస్ శిక్షకులు. హైదరాబాద్‌లో కూడా పలు అకాడమీలు ఈ ప్యాడెల్ టెన్నిస్ నేరి్పస్తున్నారు.ఇప్పుడే ట్రెండ్ అవుతోంది.. హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే ప్యాడెల్ టెన్నిస్ గురించి అవగాహన పెరుగుతోంది. నేర్చుకునేందుకు యువత, పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. టెన్నిస్‌తో పోలిస్తే ప్యాడెల్ టెన్నిస్ గురించి చాలా మందికి తెలియదు. ప్యాడెల్ టెన్నిస్‌లో ఫిట్నెస్తో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. కొన్ని మెళకువలతో నేర్చుకుంటే ప్యాడెల్ టెన్నిస్ ఆడటం సులువే. – ఎన్.జగన్నాథం, టెన్నిస్ ట్రైనర్ -
భారత్‌కు పెద్ద దెబ్బ
ఒలింపిక్స్, ఆసియా క్రీడల తర్వాత మూడో మెగా ఈవెంట్ కామన్వెల్త్ క్రీడలు. ఇందులో భారత క్రీడాకారులు ప్రతీసారి పెద్ద సంఖ్యలో పతకాలు పట్టుకొస్తున్నారు. పతకాల పట్టికలోనూ క్రమంగా పుంజుకుంటూ టాప్–10, టాప్–5 స్థానాల్లో పదిలంగా నిలుస్తున్నారు. అలాంటి మెగా ఈవెంట్లో ఇకపై పతకాల వేట, పోడియం వద్ద మువ్వన్నెల పతాకం రెపరెపలాడటం కష్టంగా మారనుంది. భారత్ అత్యధికంగా గెలిచే అవకాశాలున్న క్రీడాంశాలను ఆతిథ్య దేశం పెద్ద సంఖ్యలో తొలగించడం మన క్రీడాకారులకు నిజంగా గుండెకోతనే మిగల్చనుంది. ఓవరాల్‌గా పతకాల వేటకు పెద్ద దెబ్బ తగలనుంది. లండన్: మరో రెండేళ్లలో జరగబోయే కామన్వెల్త్ క్రీడలు భారత శిబిరాన్ని ఇప్పటి నుంచే నిరాశలో ముంచేశాయి. భారత క్రీడాకారులు పతకాలు కచ్చితంగా గెలిచే క్రీడాంశాలను ఆతిథ్య దేశం స్కాట్లాండ్ తొలగించింది. గ్లాస్గోలో 2026లో జరిగే ప్రసిద్ధ కామన్వెల్త్ పోటీలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పరిమితంగా పదే పది క్రీడాంశాలతో మమ అనిపించేందుకు ఆర్గనైజింగ్ కమిటీ సిద్ధమైంది. గత బర్మింగ్‌హామ్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌ను 19 క్రీడాంశాలతో నిర్వహించారు. ఇప్పుడు ఇందులో 9 క్రీడాంశాలకు కోత పెట్టారు. హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, డైవింగ్, బీచ్ వాలీబాల్ క్రీడలను తప్పించారు. షూటింగ్‌ను బర్మింగ్‌హామ్‌లోనే పక్కన బెట్టారు. తాజా తొలగింపుతో హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు నిరాశే మిగిలింది. ఎందుకంటే భారత్ కచ్చితంగా ఈ ఐదు ఈవెంట్లలో పతకాలు గెలిచే అవకాశాలున్నాయి. బర్మింగ్‌హామ్‌లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 30 పతకాలు ఆ ఈవెంట్లలోనే గెలుపొందడం విశేషం. అంటే దాదాపు సగం పతకాలను ఇకపై భారత్ కోల్పోనుండటం ఎదురుదెబ్బగా భావించవచ్చు. బడ్జెటే ప్రతిబంధకమా? నిజానికి 2026 క్రీడలు ఆ్రస్టేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరగాలి. అయితే అంచనాలను మించిపోతున్న బడ్జెట్ కారణంతో విక్టోరియా వైదొలగింది. దీంతో నిర్వహణకు గ్లాస్గో (స్కాట్లాండ్) ముందుకొచ్చిం ది. అయితే ఈ దేశం కూడా వేల సంఖ్యలో వచ్చే అథ్లెట్లు, అధికారులు వారికి కల్పించాల్సిన వసతులు, సదుపాయాల గురించి పెద్ద కసరత్తే చేసింది.అధిక సంఖ్యలో క్రీడాంశాల్ని నిర్వహించాలంటే వేదికల సంఖ్య కూడా పెంచాలి. అంటే అక్కడికి అథ్లెట్లు, అధికారిక గణాన్ని తరలించేందుకు రవాణా (లాజిస్టిక్స్) తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని భారీ ఖర్చుల్ని తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చిం ది. ఓ పరిమిత బడ్జెట్‌తో నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందుకే 11 మందితో బరిలోకి దిగే పలు టీమ్ ఈవెంట్లతో పాటు మొత్తం 9 క్రీడాంశాలను తొలగించేసింది. కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య నియమావళి ప్రకారం ఆతిథ్య వేదికకు ఆ వెసులుబాటు ఎప్పటి నుంచో ఉంది. దీన్ని అనుసరించి కేవలం నాలుగే వేదికల్లో పది క్రీడాంశాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. తద్వారా స్కాట్లాండ్ ప్రభుత్వం మోపెడు ఖర్చును తగ్గించి అనుకున్న బడ్జెట్‌లోపే ఈవెంట్ ను నిర్వహించాలనుకుంటుంది. ఆడించే 10 క్రీడాంశాలు ఇవే... అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ఆరి్టస్టిక్ జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్, నెట్‌బాల్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, జూడో, లాన్ బౌల్స్, 3్ఠ3 బాస్కెట్‌బాల్ క్రీడాంశాలతోనే గ్లాస్గో ఈవెంట్ జరుగుతుంది. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, లాన్ బౌల్స్ క్రీడాంశాల్లో దివ్యాంగ అథ్లెట్ల కోసం కూడా పోటీలు ఉంటాయి. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతాయి. తొలగించిన క్రీడాంశాలు... హాకీ, క్రికెట్ టీమ్ ఈవెంట్లతో పాటు బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ (టీటీ), స్క్వాష్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, డైవింగ్, బీచ్ వాలీబాల్ క్రీడలను గ్లాస్గో నిర్వాహక కమిటీ పక్కన బెట్టింది.2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ గెలిచిన పతకాలు రెజ్లింగ్ (12), వెయిట్‌లిఫ్టింగ్ (10), అథ్లెటిక్స్ (8), టేబుల్ టెన్నిస్ (7), బ్యాడ్మింటన్ (6), జూడో (3), బాక్సింగ్ (7), హాకీ (2), లాన్ బౌల్స్ (2), స్క్వాష్ (2), క్రికెట్ (1), పారా పవర్‌లిఫ్టింగ్ (1).బ్యాడ్మింటన్‌ను తొలగించాలనే గ్లాస్గో నిర్ణయం నన్ను కలవరపాటుకు గురిచేసింది. తీవ్ర నిరాశలో ముంచింది. క్రీడల్లో ప్రగతి సాధించే భారత్‌లాంటి దేశాలకు ఇది గొడ్డలిపెట్టు. మన షట్లర్లు ఈ క్రీడాంశంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. అంతర్జాతీయ వేదికలో సత్తా చాటుకునే అవకాశాన్ని ఇలా కాలరాయడం నిజంగా దురదృష్టకరం. –పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ ఇంకెందుకు కామన్వెల్త్ గేమ్స్? పూర్తిగా ఈవెంట్‌నే పక్కన బెట్టేయండి. కేవలం ఒలింపిక్స్, ఆసియా క్రీడలతోనే సరిపెట్టుకుందాం. ఎందుకంటే కీలకమైన ఆటల్ని తొలగించడం వల్ల కామన్వెల్త్ ప్రభ కోల్పోతుంది. వారి నిర్ణయం నన్ను నిర్ఘాంత పరిచింది. ఇక మనం మన జట్టును కామన్వెల్త్ గేమ్స్‌కు పంపించాల్సిన అవసరమే లేదు. –విమల్ కుమార్, భారత బ్యాడ్మింటన్ కోచ్ గ్లాస్గో నిర్వహించే పది క్రీడల్లో టేబుల్ టెన్నిస్ లేకపోవడం బాధాకరం. ఇదొక్కటే కాదు, తొలగించిన అన్ని క్రీడాంశాల ఆటగాళ్లకు ఎదురుదెబ్బ. ముఖ్యంగా టీటీలో మనం ఎన్నో స్వర్ణాలు గెలిచాం. –శరత్ కమల్, భారత టీటీ దిగ్గజం -
పెళ్లి షాపింగ్ చేసిన భారత ప్రముఖ షట్లర్
భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. శ్రావ్య వర్మ అనే అమ్మాయిని శ్రీకాంత్ త్వరలో మనువాడనున్నాడు. శ్రావ్య.. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు ఆర్జీవీ బంధువని తెలుస్తుంది. శ్రీకాంత్ ఇటీవలే కాబోయే భార్యతో కలిసి పెళ్లి షాపింగ్ చేశాడు. నగరంలోని ప్రముఖ వెడ్డింగ్ కలెక్షన్ మాల్ అయిన గౌరీ సిగ్నేచర్స్లో శ్రీకాంత్, శ్రావ్య జోడీ సందడి చేశాడు. వీరిద్దరి షాపింగ్‌కు సంబంధించిన చిత్రాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ అయిన శ్రీకాంత్.. ప్రస్తుత వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో ఉన్నాడు. -
మాళవిక సంచలనం
చాంగ్జౌ (చైనా): భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని నమోదు చేసింది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సంచలన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 43వ ర్యాంకర్ మాళవిక 26–24, 21–19తో ప్రపంచ ఏడో ర్యాంకర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై గెలిచింది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మాళవిక తొలి గేమ్‌లో మూడు గేమ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్లో స్కాట్లాండ్ ప్లేయర్ క్రిస్టీ గిల్మోర్తో మాళవిక తలపడుతుంది. మహారాష్ట్రకు చెందిన 22 ఏళ్ల మాళవిక ప్రస్తుతం థానే బ్యాడ్మింటన్ అకాడమీలో కోచ్ శ్రీకాంత్ వాడ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. -
అన్మోల్కు తొలి అంతర్జాతీయ టైటిల్
భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ అన్మోల్ ఖరబ్ తన కెరీర్లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించింది. శనివారం ముగిసిన బెల్జియం ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో హరియాణాకు చెందిన 17 ఏళ్ల అన్మోల్ మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 222వ స్థానంలో ఉన్న అన్మోల్ 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 24–22, 12–21, 21–10తో ఏడో సీడ్ అమెలీ షుల్జ్ (డెన్మార్క్)పై గెలిచింది. -
ఎవరీ తులసిమతి మురుగేశన్? పుట్టుకతో వచ్చే వైకల్యం దాటుకుని..
మనం చిన్న సమస్యకే విలవిలలాడిపోతాం. కాస్త బాగోకపోతేనే చేస్తున్న పనిని వదిలేస్తాం. కానీ ఈ అమ్మాయి పుట్టుకతో వచ్చే లోపంతో పోరాడింది. అది ప్రాణాంతకంగా మారి పరిస్థితిని దారుణంగా దిగజార్చింది. ఏదోవిధంగా కోలుకుని బయటపడిందనుకున్నా..దివ్యాంగురాలిగా చేసి బాధపెట్టింది. అయితేనేం తగ్గేదే లే..! అంటూ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించడమేగాక పారాలింపిక్స్‌లో సత్తా చాటింది. రజత పతకంతో యావత్ దేశం గర్వపడేలా చేసింది. ఇంతకీ ఎవరీమె? ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తులసిమతి మురుగేశన్ సెప్టెంబర్ 2న జరిగిన పారిస్ పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె SU5 ఫైనల్లో మహిళల సింగిల్స్‌కు చేరుకుంది. అయితే చైనాకు చెందిన యాంగ్ క్విక్సియా చేతిలో ఓడిపోయింది. కేవలం 30 నిమిషాల్లో 21-17, 21-10తో యాంగ్ క్విక్సియా మ్యాచ్‌ను గెలుచుకుంది. చివర వరకు ఉత్కంఠను రేపేలా ఆడి రజత పతకంతో భారతదేశం గర్వించేలా చేసింది. పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న తొలి భారతీయ మహిళగా మురుగేషన్ చరిత్ర సృష్టించారు.ఎవరంటే ఆమె..?తులసిమతి మురుగేశన్ తమిళనాడులోని కాంచీపురానికి చెందింది. ఆమె పుట్టుకతో వచ్చే వైకల్యం తులసిమతి జీవితాన్ని అగాధంలోకి నెట్టిసింది. ఆ వైకల్యం కారణంగా బోటన వేలును కోల్సోవమే గాక ప్రాణాంతకమై ఆమె పరిస్థితిని దిగజార్చింది. ఏదోవిధంగా కోలుకున్నా.. ఎడమ చేయి చలనం కోల్పోయి దివ్యాంగురాలిగా చేసింది. అయితాన లెక్క చేయక క్రీడలపై దృష్టిసారించి. కక్రీడల పట్ల అమిత ఆసక్తిగల తండ్రి సాయంతో బ్యాడ్మింటన్ ఎంచుకుంది. సమర్థులైన క్రీడాకారులతో ఆడేలా నైపుణ్యం సంపాదించుకుంది. అంతేగాదు ఆమె వెటర్నరీ సైన్సు విద్యార్థి కూడా. ఆమె సోదరి కిరుత్తిమా కూడా బ్యాడ్బింటన్ క్రీడాకారిణి. ఆమె అనేక జిల్లా స్థాయి ఆటలను గెలుచుకుంది. అంతేగాదు తులసీమత్ ఐదవ ఫజ్జా దుబాయ్ పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ 2023లో మహిళల డబుల్స్ ిభాగంలో మానసి జోషితో కలిసి బంగారు పతకాన్ని సాధించింది. ఆమె అదే ఈవెంట్లో నితేష్ కుమార్‌తో కలిసి కాంస్య పతకాన్ని కూడా సాధించింది. ఆమె అకుంఠితమైన పట్టుదల, శ్రమ ఎన్నో అవార్డులను, గౌరవ సత్కారాలను తెచ్చిపెట్టాయి. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలిచింది. జీవితం ఇచ్చే పెట్టే పరీక్షకు తలొగ్గక నచ్చినట్లుగా నీ తలరాతను రాసుకునేలా దూసుకుపోవడం అంటే ఏంటో చేసి చూపింది.A moment of immense pride as Thulasimathi wins a Silver Medal in the Women's Badminton SU5 event at the #Paralympics2024! Her success will motivate many youngsters. Her dedication to sports is commendable. Congratulations to her. @Thulasimathi11 #Cheer4Bharat pic.twitter.com/Lx2EFuHpRg— Narendra Modi (@narendramodi) September 2, 2024 (చదవండి: కిమ్ కర్దాషియాన్‌లా కనిపించాలని ఏకంగా రూ. 8 కోట్లు..పాపం ఆమె..!) -
కీళ్లనొప్పులు.. ఆటకు గుడ్‌బై చెబుతా: సైనా నెహ్వాల్ (ఫొటోలు)
-
Paralympics 2024: రైలు ప్రమాదం నుంచి ఒలింపిక్ స్వర్ణం వరకు...
తండ్రి నేవీ ఆఫీసర్... ఆయనను చూసి తానూ అలాగే యూనిఫామ్ సర్వీస్‌లోకి వెళ్లాలనుకున్నాడు... కానీ అనూహ్య ఘటనతో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఐఐటీ వరకు వెళ్లాడు... కానీ శరీరం అక్కడ ఉన్నా మనసు మాత్రం ఆటలపై ఉంది... కానీ అనుకోని వైకల్యం వెనక్కి లాగుతోంది... అయినా సరే ఎక్కడా తగ్గలేదు... అణువణువునా పోరాటస్ఫూర్తి నింపుకున్నాడు. బ్యాడ్మింటన్ క్రీడలోకి ప్రవేశించి పట్టుదలగా శ్రమిస్తూ అంచెలంచెలుగా ముందుకు పోయాడు. ఇప్పుడు పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించి తన కలను పూర్తి చేసుకున్నాడు. పారా షట్లర్ నితేశ్ కుమార్ విజయగాథ ఇది. 2009... నితేశ్ కుమార్ వయసు 15 ఏళ్లు. అప్పటికి అతనికి ఆటలంటే చాలా ఇష్టం. ఫుట్‌బాల్‌ను బాగా ఆడేవాడు. అయితే ఆ సమయంలో జరిగిన అనూహ్య ఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. విశాఖపట్నం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో నితేశ్ తన కాలును కోల్పోయాడు. కోలుకునే క్రమంలో సుదీర్ఘ కాలం పాటు ఆస్పత్రి బెడ్‌పైనే ఉండి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితి మెరుగైనా ఆటలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేయాల్సి వచి్చంది. దాంతో చదువుపై దృష్టి పెట్టిన నితేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), మండీలో సీటు సంపాదించాడు. అక్కడ ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలోనే బ్యాడ్మింటన్ ఆటపై ఆసక్తి పెరిగింది. పారా షట్లర్ ప్రమోద్ భగత్‌ను చూసి అతను స్ఫూర్తి పొందాడు. ఆటగాడిగా ఉండాలంటే ఎంత ఫిట్‌గా ఉండాలనే విషయంలో కోహ్లి నుంచి ప్రేరణ పొందినట్లు నితేశ్æ చెప్పాడు. కోల్పోయిన కాలు స్థానంలో కృత్రిమ కాలును అమర్చుకునే క్రమంలో నితేశ్ పుణేలోని ‘ఆర్టిఫీషియల్ లింబ్స్ సెంటర్’కు చేరాడు. అక్కడ ఎంతో మంది తనకంటే వయసులో పెద్దవారు కూడా ఎలాంటి లోపం కనిపించనీయకుండా కష్టపడుతున్న తీరు అతడిని ఆశ్చర్యపర్చింది. ‘40–45 ఏళ్ల వయసు ఉన్నవారు కూడా కృత్రిమ అవయవాలతో ఫుట్‌బాల్, సైక్లింగ్, రన్నింగ్ చేయడం చూశాను. ఈ వయసులో వారు చేయగా లేనిది నేను చేయలేనా అనిపించింది. ఆపై పూర్తిగా బ్యాడ్మింటన్‌పై దృష్టి పెట్టాను’ అని హరియాణాకు చెందిన నితేశ్ చెప్పాడు. 2020లో జరిగిన పారా బ్యాడ్మింటన్ జాతీయ చాంపియన్‌షిప్‌లో తొలిసారి నితేశ్ బరిలోకి దిగాడు. తను ఆరాధించే భగత్‌తోపాటు మనోజ్ సర్కార్వంటి సీనియర్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకున్నాడు. దాంతో ఈ ఆటలో మరిన్ని సాధించాలనే పట్టుదల పెరిగింది. గత ఒలింపిక్స్‌లో భగత్ స్వర్ణం గెలుచుకోవడం చూసిన తర్వాత తానూ ఒలింపిక్స్ పతకం సాధించగలననే నమ్మకం నితేశ్‌కు కలిగింది. ఈ క్రమంలో గత మూడేళ్లుగా తీవ్ర సాధన చేసిన అతను ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. పారిస్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ విజయాలు అందుకొని స్వర్ణపతకంతో సగర్వంగా నిలిచాడు. –సాక్షి క్రీడా విభాగం -
భరించలేని వేదన: సైనా నెహ్వాల్ వ్యాఖ్యలు వైరల్
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది చివర్లో తాను ఆటకు స్వస్తి పలకనున్నట్లు తెలిపింది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నట్లు 34 ఏళ్ల సైనా నెహ్వాల్ వెల్లడించింది.కామన్వెల్త్లో రెండు పసిడి పతకాలుఒలింపిక్స్ చరిత్రలో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ఘనత సైనాది. లండన్-2012 విశ్వ క్రీడల్లో ఈ హైదరాబాదీ షట్లర్ కాంస్య పతకం గెలిచింది. గతంలో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును కూడా కైవసం చేసుకుంది సైనా. అంతేకాదు కామన్వెల్త్ 2010, 2018 ఎడిషన్లలో స్వర్ణాలు సొంతం చేసుకుంది. అయితే, గత కొంతకాలంగా ఆమె టోర్నీలకు దూరమైంది. గాయాల వల్లే ఆట విరామం తీసుకుంది.మోకాలి నొప్పి.. ఆర్థరైటిస్తాజాగా ఈ విషయాల గురించి సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. ‘‘నాకు మోకాలి నొప్పి ఉంది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నా. పరిస్థితి విషమంగానే ఉంది. ఇలాంటి స్థితిలో ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు ప్రాక్టీస్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటపుడు నేను ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో ఎలా పోటీపడగలను?తొమ్మిదవ ఏట మొదలుపెట్టానుఅందుకే.. వాస్తవాలు చేదుగా ఉన్నా ఆమోదించకతప్పదు. మోకాలి గుజ్జు అరిగిపోయే దశలో కోర్టులో ప్రత్యర్థులపై పైచేయి సాధించడం అంత తేలికేమీ కాదు. మనం అనుకున్న ఫలితాలు రాబట్టడం కష్టతరంగా మారుతుంది. అందుకే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. ఏదేమైనా.. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఆటగాళ్ల కెరీర్ త్వరగా ముగిసిపోతుంది. నేను తొమ్మిదేళ్ల వయసులో ఆట మొదలుపెట్టాను. 35వ ఏట రిటైర్ కాబోతున్నాను’’ అని సైనా వెల్లడించింది. గర్వంగా ఉందిసుదీర్ఘకాలం షట్లర్‌గా కొనసాగినందుకు గర్వంగా ఉందని.. ఈ ఏడాది చివరలోగా రిటైర్మెంట్పై నిర్ణయాన్ని వెల్లడిస్తానని సైనా నెహ్వాల్ స్పష్టం చేసింది. ఒలింపిక్ కాంస్య పతక విజేత, షూటర్ గగన్ నారంగ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ సైనా ఈ మేరకు విషయాలను వెల్లడించింది. సైనా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాగా క్రీడారంగానికి చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం సైనాను పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో పాటు అర్జున, ఖేల్‌రత్న అవార్డులతో సత్కరించింది.సైనా ఘనతలు ఇవీఒలింపిక్ కాంస్య పతకంవరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యంకామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలుఆసియా క్రీడల్లో కాంస్యం ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రజతంసూపర్ సిరీస్ ఫైనల్స్‌లో రజతం -
Paris Paralympics 2024: భారత్ ఖాతాలో రెండో స్వర్ణం
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎప్ఎల్-3 ఈవెంట్లో నితేశ్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇవాళ (సెప్టెంబర్ 2) జరిగిన ఫైనల్లో నితేశ్.. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బేతెల్పై 21-14, 18-21, 23-21 తేడాతో విజయం సాధించాడు. NITESH KUMAR - THE GOLD MEDAL MOMENT. 👌- One for the History of India in Paralympics. pic.twitter.com/kmhLrZAAV2— Johns. (@CricCrazyJohns) September 2, 2024ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇది తొమ్మిదో పతకం. ఈ రోజే పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56 కేటగిరీలో యోగేశ్ కథూనియా రజత పతకం సాధించాడు. ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు సాధించింది. -
తొలి రౌండ్ దాటలేకపోయారు
యోకోహామా: భవిష్యత్ ఆశాకిరణాలుగా భావిస్తున్న ముగ్గురు భారత యువ క్రీడాకారిణులకు జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ నిరాశను మిగిల్చింది. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ముగ్గురు భారత షట్లర్లు మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, అషి్మత చాలిహా తొలి రౌండ్‌ను దాటలేకపోయారు.అషి్మత 16–21, 12–21తో టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో... మాళవిక 21–23, 19–21తో పొలీనా బురోవా (ఉక్రెయిన్) చేతిలో... ఆకర్షి 13–21, 12–21తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్యా వరియత్ (భారత్) జోడీ 10–21, 18–21తో రెహాన్–లీసా కుసుమవతి (ఇండోనేసియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ భారత స్టార్స్ పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. -
ఊరించి... ఉసూరుమనిపించి
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలంటే అపార నైపుణ్యంతోపాటు, చెక్కు చెదరని విశ్వాసం, మానసిక దృఢత్వం కలిగి ఉండాలి. లేదంటే కచ్చితంగా మెడలో పతకం వేసుకోవాల్సిన చోట... కీలకదశలో ఒత్తిడికిలోనై... అనవసరపు ఆందోళనతో తడబడి... ప్రత్యరి్థకి పతకాలు అప్పగించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. పారిస్ ఒలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రెండు కాంస్య పతకాల వేటలో బరిలోకి దిగిన మనోళ్లు ముందుగా ఊరించి చివరికొచ్చేసరికి ఉసూరుమనిపించారు. బ్యాడ్మింటన్‌లో లక్ష్య సేన్... షూటింగ్లో మహేశ్వరి–అనంత్‌జీత్ జోడీ మంచి అవకాశాలను వదులుకున్నారు. ఫలితంగా రెండు పతకాలు రావాల్సిన చోట ఒక్క పతకమూ దక్కలేదు. ఇక మహిళల రెజ్లింగ్ 68 కేజీల విభాగంలో నిషా దహియా అయితే చివరి నిమిషంలో ఏకంగా తొమ్మిది పాయింట్లు సమర్పించుకొని ఓటమిని మూటగట్టుకుంది. పారిస్: ఒలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్‌లో పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించే అవకాశాన్ని లక్ష్య సేన్ వదులుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ కాంస్య పతక మ్యాచ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–13, 16–21, 11–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్ గెల్చుకున్నప్పటికీ అదే జోరును తర్వాత కొనసాగించలేకపోయాడు. లక్ష్య సేన్ ఓటమితో 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత బ్యాడ్మింటన్‌లో పతకం లేకుండానే భారత క్రీడాకారులు ఇంటిముఖం పట్టారు. 2012 లండన్‌లో సైనా నెహా్వల్ కాంస్యం సాధించగా... 2016 రియోలో పీవీ సింధు రజతం, 2020 టోక్యోలో పీవీ సింధు కాంస్యం గెలిచారు. ఈసారి పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీపై భారీ అంచనాలు ఉన్నా వారు క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. లీ జి జియాతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్య సేన్ శుభారంభం చేశాడు. దూకుడుగా ఆడుతూ తొలి గేమ్‌ను అలవోకగా దక్కించుకున్నాడు. రెండో గేమ్ ఆరంభంలోనూ లక్ష్య తన ఆధిపత్యం చాటుకొని 8–3తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో లక్ష్య సేన్ ఒక్కసారిగా గాడి తప్పాడు. వరుసగా తొమ్మిది పాయింట్లు సమరి్పంచుకున్నాడు. ఇక్కడి నుంచి లీ జి జియా జోరు మొదలైంది. 3–8తో వెనుకబడిన లీ జి జియా 12–8తో ఆధిక్యంలోకి వచ్చి చివరకు 21–16తో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో లీ జి జియా పూర్తి ఆధిపత్యం కనబరిచి 9–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కూడా మలేసియా ప్లేయర్ ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆడటంతో లక్ష్య సేన్ కోలుకోలేకపోయాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అక్సెల్సన్ 21–11, 21–11తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వితిద్సర్న్ కున్లావత్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్ సె యంగ్ (దక్షిణ కొరియా) 21–13, 21–16తో హి బింగ్జియావో (చైనా)పై విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫినిషింగ్ ‘గురి’ తప్పింది... షూటింగ్ పోటీల చివరిరోజు భారత్‌కు మరో పతకం వచ్చే అవకాశాలు కనిపించాయి. ఒలింపిక్స్‌లో తొలిసారి మెడల్ ఈవెంట్‌గా ప్రవేశపెట్టిన స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు చెందిన మహేశ్వరి చౌహాన్–అనంత్‌జీత్ నరూకా జోడీ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో మహేశ్వరి–అనంత్‌జీత్ ద్వయం 43–44 పాయింట్లతో జియాంగ్ యిటింగ్–జియాన్లిన్ లియు (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. ఒక్క పాయింట్ తేడాతో భారత జోడీకి కాంస్య పతకం చేజారడం గమనార్హం. ముందుగా 15 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో మహేశ్వరి–అనంత్‌జీత్.. జియాంగ్ యిటింగ్–జియాన్లిన్ (చైనా) జోడీలు 146 పాయింట్ల చొప్పున సాధించి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి కాంస్య పతక మ్యాచ్‌కు అర్హత సాధించింది. డయానా బకోసి–గాబ్రియెలా రొసెట్టి జోడీ (ఇటలీ; 149 పాయింట్లు), ఆస్టిన్ జెవెల్–విన్సెంట్ హాన్కాక్ ద్వయం (అమెరికా; 148 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ–రజత పతక మ్యాచ్‌కు అర్హత పొందాయి. ఫైనల్లో డయానా–రొసెట్టి ద్వయం 45–44తో జెవెల్–హాన్కాక్ జంటను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. చివరి నిమిషంలో ‘పట్టు’ కోల్పోయి... మహిళల రెజ్లింగ్ 68 కేజీల విభాగంలో భారత రెజ్లర్ నిషా దహియా క్వార్టర్ ఫైనల్లో 8–10 పాయింట్ల తేడాతో పాక్ సోల్ గుమ్ (ఉత్తర కొరియా) చేతిలో ఓడిపోయింది. బౌట్ ముగియడానికి ఒక నిమిషం ఉన్నంతవరకు నిషా 8–1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆఖరి 60 సెకన్లలో నిషా పట్టు కోల్పోయింది. ఉత్తర కొరియా రెజ్లర్ ధాటికి నిషా తొమ్మిది పాయింట్లు కోల్పోయి ఓటమి పాలైంది. అంతకుముందు నిషా తొలి రౌండ్లో 6–4తో తెతియానా సొవా (ఉక్రెయిన్)పై గెలిచింది. ఒకవేళ ఉత్తర కొరియా రెజ్లర్ ఫైనల్ చేరుకుంటే నిషాకు ‘రెపిచాజ్’ పద్ధతిలో కాంస్య పతకం సాధించే అవకాశం లభిస్తుంది. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఫైనల్లో అవినాశ్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే ఫైనల్‌కు అర్హత సాధించాడు. రెండో హీట్‌లో అవినాశ్ 8 నిమిషాల 15.43 సెకన్లలో గమ్యానికి చేరి ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. 12 మంది అథ్లెట్స్‌తో కూడిన మూడు గ్రూప్‌లకు హీట్స్ నిర్వహించారు. మూడు గ్రూపుల్లో టాప్–5 నిలిచిన వారు ఫైనల్‌కు చేరారు. గురువారం రాత్రి ఫైనల్ జరుగుతుంది. -
Olympics 2024: కాంస్య పతక పోరులో లక్ష్యసేన్ పరాజయం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. కాంస్యం కోసం ఇవాళ (ఆగస్ట్ 5) జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్.. మలేషియాకు చెందిన జెడ్ జే లీ చేతిలో 21-13, 16-21, 11-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ అలవోకగా నెగ్గిన సేన్.. రెండు, మూడు గేమ్‌లలో చేతులెత్తేశాడు. కాగా, ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత్ మూడు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. షూటింగ్లో మనూ భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం, మిక్సడ్ విభాగాల్లో కాంస్య పతకాలు (సరబ్జోత్ సింగ్‌తో కలిసి) సాధించగా.. స్వప్నిల్ కుసాలే పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పోజిషన్స్‌లో కాంస్యం నెగ్గాడు. -
మథియాస్ బో గుడ్‌బై
పారిస్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్ పదవి నుంచి మథియాస్ బో తప్పుకున్నాడు. సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి జోడీని గొప్పగా తీర్చిదిద్ది వారి విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతను పారిస్ ఒలింపిక్స్‌లో భారత ద్వయం వైఫల్యం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత కొంత కాలంగా అద్భుత ప్రదర్శనతో వరుసగా ట్రోఫీలు నెగ్గి పారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై ఆశలు రేపిన సాతి్వక్–చిరాగ్ జంట క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. 2012 లండన్ ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో రజతం గెలిచిన మథియాస్ భారత జట్టుకు నాలుగేళ్ల క్రితం డబుల్స్ స్పెషలిస్ట్ కోచ్‌గా వచ్చాడు. ‘నా కోచింగ్ రోజులు ముగిశాయి. ఇకపై నేను భారత్‌లో గానీ, మరెక్కడా గానీ కోచింగ్ ఇవ్వబోవడం లేదు. చాలా సమయం బ్యాడ్మింటన్ కోర్టుల్లో తీవ్ర ఒత్తిడి మధ్య గడిపిన నేను బాగా అలసిపోయాను. నాకు అండగా నిలిచిన, ఎన్నో జ్ఞాపకాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు’ అని మథియాస్ బో స్పష్టం చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కష్టపడి భారీ అంచనాలతో ఒలింపిక్స్ బరిలోకి దిగి పతకం సాధించలేకపోయిన సాత్విక్ –చిరాగ్‌ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నానని, భవిష్యత్తులో వారిద్దరు ఎన్నో విజయాలు సాధిస్తారని మథియాస్ ఆకాంక్షించాడు. డెన్మార్క్‌కు చెందిన 44 ఏళ్ల మథియాస్ ఈ ఏడాది మార్చిలోనే సినీ నటి తాప్సీని పెళ్లి చేసుకున్నాడు. -
అందమైన ప్రయాణం.. జీర్ణించుకోలేని ఓటమి.. ఇకపై: పీవీ సింధు
‘‘ప్యారిస్‌లో అందమైన ప్రయాణం.. కానీ... జీర్ణించుకోలేని ఓటమి. నా కెరీర్లో అత్యంత కఠినమైన సమయం. జరిగినదాన్ని నా మనసు అంగీకరించేందుకు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఏదేమైనా గతాన్ని మరిచి ముందుకు సాగాల్సిందే.ఈ ప్రయాణంలో ఓ యుద్ధమే చేయాల్సి వచ్చింది. రెండేళ్ల పాటు గాయాలతో సతమతమయ్యాను. సుదీర్ఘకాలం పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ సవాళ్లన్నంటినీ అధిగమించి.. ఇక్కడి దాకా వచ్చి.. విశ్వ క్రీడల్లో మూడోసారి నా అందమైన, అద్భుతమైన దేశానికి ప్రాతినిథ్యం వహించడం నిజంగా నాకు దక్కిన గొప్ప అదృష్టం.ఓ తరానికి స్ఫూర్తిగా నిలిచానంటూ మీరు పంపే సందేశాలు.. ఇలాంటి కష్టకాలంలో నాకెంతో ఊరట కలిగిస్తున్నాయి. ప్యారిస్ 2024లో నేను, నా జట్టు అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా కృషి చేశాం. ఎలాంటి పశ్చాత్తాపమూ లేదు.ఇక.. నా భవిష్యత్ ప్రణాళికల విషయానికొస్తే... ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను కచ్చితంగా ఆటలో కొనసాగుతా. అయితే, కొంతకాలం బ్రేక్ తీసుకుంటా. ఇది కేవలం చిన్న విరామం మాత్రమే.నా శరీరం.. ముఖ్యంగా నా మనసుకు ఇది చాలా అవసరం. ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటాను. నా కెరీర్ ప్లానింగ్ విషయంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వను. నాకెంతగానో ఇష్టమైన క్రీడను మరింతగా ఆస్వాదిస్తూ ముందుకు సాగుతాను’’ అని భారత బ్యాడ్మింటన్ పూసర్ల వెంకట సింధు ఉద్వేగపూరిత నోట్ షేర్ చేసింది.రెండుసార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిప్యారిస్ ఒలింపిక్స్‌లో తన ప్రయాణం అర్ధంతరంగా ముగిసిపోవడం పట్ల సింధు విచారం వ్యక్తం చేసింది. అయితే, ఓటమి తనను కుంగదీయలేదని.. వేగంగా తిరిగి వస్తానని.. ఆటను కొనసాగిస్తానని స్పష్టం చేసింది. కాగా తెలుగు తేజం పీవీ సింధు ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.పసిడి పతకం గెలుస్తానని ధీమారియో ఒలింపిక్స్-2016లో రజతం గెలిచిన ఈ స్టార్ షట్లర్.. టోక్యో ఒలింపిక్స్- 2020లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ క్రమంలో భారీ అంచనాల నడుమ ప్యారిస్ ఒలింపిక్స్ బరిలో దిగింది పీవీ సింధు. ఆమె గత రికార్డుల దృష్ట్యా మహిళల సింగిల్స్ విభాగంలో పతకం ఖాయమని విశ్లేషకులు భావించారు. సింధు సైతం ఈసారి పసిడి పతకం గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది.చేదు అనుభవంఅయితే, రౌండ్ ఆఫ్ 16లోనే ఆమె పోరాటం ముగిసిపోయింది. గురువారం నాటి ప్రిక్వార్టర్స్‌లో అనూహ్య రీతిలో 29 ఏళ్ల పీవీ సింధు ఓటమిపాలైంది. వరల్డ్ నంబర్ 13 ర్యాంకర్ అయిన సింధు.. రౌండ్ ఆఫ్ 16లో ప్రపంచ 9వ ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా)తో తలపడింది. ప్రత్యర్థి చేతిలో 19–21, 14–21తో ఓడిపోయింది. కాగా 2020 టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో హి బింగ్జియావోతోనే పోటీపడిన సింధు.. ఆమెను ఓడించి కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం బింగ్జియావో సింధుపై పైచేయి సాధించింది.Paris 2024: A Beautiful Journey but a Difficult Loss ❤️This loss is one of the hardest of my career. It will take time to accept, but as life moves forward, I know I will come to terms with it.The journey to Paris 2024 was a battle, marked by two years of injuries and long… pic.twitter.com/IKAKu0dOk5— Pvsindhu (@Pvsindhu1) August 2, 2024 -
భారత్‌కు ‘బ్యాడ్’మింటన్
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో గురువారం భారత్‌కు కలిసి రాలేదు. కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న పీవీ సింధు... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఓటమి చవిచూసి రిక్తహస్తాలతో రానున్నారు. పురుషుల సింగిల్స్‌లో సహచరుడు ప్రణయ్‌ను ఓడించి లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరి భారత్ ఆశలను నిలబెట్టాడు. పారిస్: ‘రియో’లో రజత పతకం. ‘టోక్యో’లో కాంస్యం... ‘పారిస్’లో మాత్రం నిరాశ... గత రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి వరుసగా మూడో ఒలింపిక్ పతకం లక్ష్యంగా ‘పారిస్’కు వచ్చిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 19–21, 14–21తో ప్రపంచ 9వ ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో హి బింగ్జియావోను ఓడించి కాంస్య పతకాన్ని గెల్చుకున్న సింధు ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. పోరాడినా... పురుషుల డబుల్స్‌లో ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ కూడా ముందంజ వేయలేకపోయింది. స్వర్ణ పతకంతో తిరిగి వస్తారనుకున్న సాత్విక్–చిరాగ్ ద్వయం క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ ద్వయం సాత్విక్–చిరాగ్ 21–13, 14–21, 16–21తో పరాజయం పాలైంది. ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌లతో తలపడిన గత మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన సాత్విక్–చిరాగ్ ఈసారి పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ రెండు టైటిల్స్ గెలిచి, నాలుగు టో ర్నీ ల్లో రన్నరప్‌గా నిలిచారు. అంతేకాకుండా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా అందుకున్నారు. కానీ వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకం గెలవలేకపోయారు. ప్రణయ్ అవుట్ సింధు, సాత్విక్–చిరాగ్ నిష్క్రమించడంతో భారత పతక ఆశలన్నీ లక్ష్య సేన్‌పై ఉన్నాయి. భారత నంబర్‌వన్, సహచరుడు హెచ్ఎస్ ప్రణయ్‌తో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–12, 21–6తో అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరాడు. పారుపల్లి కశ్యప్ (2012 లండన్), కిడాంబి శ్రీకాంత్ (2016 రియో) తర్వాత ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన మూడో భారత ప్లేయర్‌గా లక్ష్య సేన్ నిలిచాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ చో టిన్ చెన్ (చైనీస్ తైపీ)తో లక్ష్య సేన్ తలపడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే లక్ష్య సేన్ సెమీఫైనల్ చేరి పతకం రేసులో ఉంటాడు. -
Paris Olympics 2024: ప్రణయ్‌పై గెలుపు.. క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్
పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు చెందిన లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. ఇవాళ (ఆగస్ట్ 1) జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో లక్ష్యసేన్.. భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్‌పై వరుస సెట్లలో (21-12, 21-6) విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్ ప్రణయ్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. -
Olympics 2024: మనోళ్లకు భారీ షాక్.. సాత్విక్- చిరాగ్ అవుట్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పతకం ఖాయమనకున్న విభాగంలో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు.ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో విఫలమై ప్యారిస్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆద్యంతం ఆసక్తి రేపిన మ్యాచ్‌లో మలేషియా జోడీ చేతిలో 21-13, 14-21, 16-21తో ఓడి ఇంటిబాటపట్టారు. ఒత్తిడిని అధిగమించలేకకాగా ఒలింపిక్స్‌లో పతకం రేసులో నిలవాలంటే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన సమయంలో సాత్విక్- చిరాగ్ తడబడ్డారు. వాస్తవానికి మలేషియా జోడీతో ముఖాముఖి రికార్డులో సాత్విక్–చిరాగ్ ద్వయం 3–8తో వెనుకబడి ఉంది. ఒకదశలో మలేసియా జంట చేతిలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే, భారత జోడీ ఇటీవల ఈ ద్వయంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. కానీ.. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిలో చిత్తైంది. ఫలితంగా పతకం గెలవాలన్న కల చెదిరిపోయింది. కాగా.. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన ఆరోన్ చియా–సో వుయ్ యిక్ ఈసారీ సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లారు.ఇదిలా ఉంటే.. ఆరోరోజు పోటీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో మహారాష్ట్ర షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకం సాధించాడు. అయితే, 50 కేజీల మహిళల బాక్సింగ్ విభాగంలో నిఖత్ జరీన్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. తాజాగా సాత్విక్- చిరాగ్ జోడీ కూడా నిరాశపరిచింది.చదవండి:Olympics: ముగిసిన ప్రయాణం.. నిఖత్ జరీన్ కన్నీటి పర్యంతం -
ఒలింపిక్స్‌లో తాప్సీ సందడి.. ఆ తర్వాత అక్కడే మకాం!
బాలీవుడ్ నటి, హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీని తాప్సీ నటించిన హిట్ చిత్రం హసీన్ దిల్రూబాకు సీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. ఇందులో విక్రాంత్ మాస్సే, జిమ్మీ షెర్గిల్, సన్నీ కౌశల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 9 నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.అయితే ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు మథియాస్ బో పెళ్లాడిన సంగతి తెలిసిందే. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా మథియాస్ ప్రస్తుతం భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు పురుషుల డబుల్స్ కోచ్‌గా ఉన్నారు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా తాప్సీ సైతం పారిస్ చేరుతుంది. భారత టీమ్‌తో పాటు భర్తకు మద్దతు తెలిపేందుకు పారిస్ చేరుకుంది.అయితే తాప్సీ పన్ను, తన భర్త మథియాస్ బో డెన్మార్క్‌లో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. త్వరలోనే డెన్మార్క్ ఇంట్లో గృహప్రవేశం జరుగుతుందని తెలిపింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత తన భర్తతో పాటు డెన్మార్క్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తాప్సీ పేర్కొంది. సమ్మర్లో డెన్మార్క్ ఎక్కువ సమయం ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. -
Olympics 2024: ప్రి క్వార్టర్స్ చేరిన పీవీ సింధు
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ముందడుగు వేసింది. మహిళల సింగిల్స్ విభాగంలో గ్రూప్- ఎమ్ టాపర్‌గా రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. గ్రూప్ దశలో బుధవారం నాటి మ్యాచ్‌లో ఎస్టోనియా షట్లర్ క్రిస్టిన్ కౌబాను 21-5, 21-10తో ఓడించి ప్రి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.ఆది నుంచే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ ఆడుతూ పాడుతూ సింధు గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ కేవలం 34 నిమిషాల్లోనే ముగిసిపోవడం విశేషం. కాగా తన తొలి మ్యాచ్‌లో సింధు.. మాల్దీవుల షట్లర్ ఫాతిమాత్ నబాహ అబ్దుల్ రజాక్‌ను 21-9, 21-6తో ఓడించింది. ఇక ప్యారిస్ ఒలింపిక్స్ ప్రి క్వార్టర్స్‌లో సింధు.. గ్రూప్-ఎన్ టాపర్, చైనాకు చెందిన హి బింగో జియావోను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ గురువారం జరుగనుంది. ఇదిలా ఉంటే.. టోక్యోలో వీరిద్దరు కాంస్యం కోసం పోటీపడగా సింధు పైచేయి సాధించిన విషయం తెలిసిందే.కాగా తెలుగు తేజం పీవీ సింధు ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్-2016లో రజతం సాధించిన ఈ స్టార్ షట్లర్.. టోక్యో ఒలింపిక్స్-2020లో కాంస్య పతకం గెలిచింది. ముచ్చటగా మూడో మెడల్ మెడలో వేసుకోవాలని పట్టుదలగా ఉన్న పీవీ సింధు.. ఆ దిశగా వరుస విజయాలతో దూసుకుపోతోంది.చదవండి: మను మహరాణి -
క్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ
పారిస్: పతకమే లక్ష్యంగా పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తొలి లక్ష్యాన్ని పూర్తి చేసింది. గ్రూప్ ‘సి’ నుంచి సాత్విక్–చిరాగ్...ఫజర్–అర్దియాంతో (ఇండోనేసియా) జోడీలు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. గాయం కారణంగా గ్రూప్ ‘సి’లోని మార్క్ లమ్స్‌ఫుస్–మార్విన్ సిడెల్ (జర్మనీ) జోడీ వైదొలిగింది. ఇదే గ్రూప్‌లో ఉన్న లుకాస్ కోరి్వ–రొనాన్ లాబర్ (ఫ్రాన్స్) జంట ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. దాంతో ఒక్కో మ్యాచ్‌లో నెగ్గిన భారత్, ఇండోనేసియా జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. గ్రూప్ విజేతను నిర్ణయించే మ్యాచ్‌లో నేడు ఫజర్–అర్దియాంతోలతో సాతి్వక్–చిరాగ్ తలపడతారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సాతి్వక్–చిరాగ్ జోడీ గ్రూప్ దశలోనే ని్రష్కమించింది. అశ్విని–తనీషా అవుట్ మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడి క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్‌లో అశి్వని–తనీషా జోడీ 11–21, 12–21తో నామి మత్సుయామ–చిహారు షిదా (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎల్’ రెండో మ్యాచ్‌లో లక్ష్య సేన్ (భారత్) 21–19, 21–14తో జూలియన్ కరాగి (బెల్జియం)పై గెలిచాడు. గ్వాటెమాలాకు చెందిన కెవిన్ కార్డన్ గాయంతో వైదొలిగాడు. ఫలితంగా కార్డన్‌పై లక్ష్య సేన్ గెలిచిన ఫలితాన్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై నెగ్గితేనే లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంటాడు. బోపన్న జోడీ ఓటమి పారిస్ ఒలింపిక్స్‌లో భారత వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న నిరాశ పరిచాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–శ్రీరామ్ బాలాజీ జంట 5–7, 2–6తో వాసెలిన్–మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడింది. మ్యాచ్ అనంతరం బోపన్న మాట్లాడుతూ దేశం తరఫున ఇదే తన చివరి పోరు అని పేర్కొన్నాడు. ఇప్పటికే డేవిస్ కప్‌కు వీడ్కోలు పలికిన బోపన్న ఇకపై జాతీయ జట్టు తరఫున ఆడబోనని ప్రకటించాడు. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్లో బోపన్నకు ఒలింపిక్ పతకం అందని ద్రాక్షలాగే మిగిలింది. 2016 రియో ఒలింపిక్స్ మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి నాలుగో స్థానంలో నిలిచిన బోపన్న.. ఇంత సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఆనందించానని అన్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో భారత్‌కు టెన్నిస్‌లో ఏకైక పతకం 1996 అట్లాంటా క్రీడల్లో (లియాండర్ పేస్–కాంస్యం) దక్కింది. -
దూసుకుపోతున్న లక్ష్య సేన్.. వరుసగా రెండో మ్యాచ్‌లో గెలుపు
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ దూసుకుపోతున్నాడు. వరుసగా రెండో గ్రూపు స్టేజి మ్యాచ్‌లో లక్ష్యసేన్ విజయం సాధించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెల్జియంకు చెందిన జూలియన్ కరాగీని వరుస గేమ్‌లలో ఈ భారత స్టార్ షట్లర్ ఓడించాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న లక్ష్య సేన్ గ్రూప్ ఎల్ మ్యాచ్‌లో 21-19 21-14 తేడాతో కరాగీపై గెలుపొందాడు.తొలి సెట్లో ప్రత్యర్ధి నుంచి లక్ష్య సేన్‌కు పోటీ ఎదురైంది. ఆఖరిలో పుంజుకున్న లక్ష్య 21-19తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అనంతరం రెండో సెట్‌ను 21-14 తేడాతో అలోవకగా సేన్ కైవసం చేసుకున్నాడు. తన తర్వాత మ్యాచ్‌లో జోనాథన్ క్రిస్టీతో సేన్ తలపడనున్నాడు. కాగా లక్ష్యసేన్ గెలిచిన తొలి మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ప్రత్యర్ధి కెవిన్ గాయం కారణంగా తప్పుకోవడంతో మ్యాచ్‌ను డిలేట్ చేశారు. -
Paris Olympics: సాత్విక్- చిరాగ్ మ్యాచ్ రద్దు.. కారణం ఇదే!
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి రెండో మ్యాచ్ రద్దైంది. ప్రత్యర్థి ద్వయంలోని ఓ షట్లర్ గాయపడటంతో సోమవారం జరగాల్సిన మ్యాచ్ మొదలుకాకుండానే ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో తమ తదుపరి మ్యాచ్‌లో సాత్విక్- చిరాగ్ జోడీ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.పురుషుల డబుల్స్ విభాగంలో నంబర్ వన్‌గా ఎదిగిన సాత్విక్- చిరాగ్ ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్యారిస్ వేదికగా గ్రూపు దశలో తమ మొదటి మ్యాచ్‌లో గెలిచిన ఈ జోడీ శుభారంభం అందుకున్నారు. గ్రూపు-సి పోటీల్లో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన లుకాస్ కోర్వీ- రొనాన్ లాబార్ ద్వయాన్ని 21-17, 21-14తో ఓడించి శనివారం తొలి గెలుపు నమోదు చేశారు.మ్యాచ్ రద్దు.. కారణం ఇదేఈ క్రమంలో సోమవారం నాటి రెండో మ్యాచ్‌లో సాత్విక్- చిరాగ్ జంట జర్మనీ జోడీ మార్విన్ సీడెల్- మార్క్ లామ్స్ఫస్తో తలపడాల్సింది. అయితే, మార్క్ మోకాలి గాయం కారణంగా ఈ జోడీ పోటీ నుంచి తప్పుకొంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రద్దైపోయింది. ఈ విషయాన్ని నిర్వాహకులు నిర్ధారించారు.‘‘గ్రూప్-సిలో మ్యాచ్‌లో లామ్స్‌ఫస్- మార్విన్ సీడెల్ ఆడాల్సిన మ్యాచ్‌లు రద్దైపోయాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లు రీషెడ్యూల్ చేయాల్సి ఉంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం.. గ్రూప్-సి దశలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు, మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ డిలీట్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.తప్పక గెలవాలికాగా సాత్విక్- చిరాగ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఇండోనేషియా జంట ఫజర్ అల్ఫియాన్- మహమ్మద్ రియాన్ ఆర్టియాంటోతో మంగళవారం పోటీ పడనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సాత్విక్- చిరాగ్ జోడీ క్వార్టర్ ఫైనల్ మార్గం సుగమమవుతుంది. ఇక ఫజర్- రియాన్ మాజీ నంబర్ వన్ జోడీ. ప్రస్తుతం ఏడో ర్యాంకులో కొనసాగుతున్నారు.గతంలో సాత్విక్- చిరాగ్ - ఫజర్ రియాన్ జోడీలు ఐదుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. భారత జోడీ మూడుసార్లు గెలవగా.. ఇండోనేషియా జంట రెండుసార్లు విజయం సాధించింది. చివరగా కొరియన్ ఓపెన్-2023లో పోటీపడ్డ ఈ జోడీల్లో సాత్విక్- చిరాగ్ పైచేయి సాధించారు. ప్యారిస్ ఒలింపిక్స్‌లోనూ మన జోడీ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగింది.చదవండి: Paris Olympics: నిరాశపరిచిన బోపన్న-బాలాజీ జోడీ.. తొలి రౌండ్లోనే ఔట్ -
జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం: తాప్సీ పన్ను
హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం ఫీర్ ఆయి హాసిన్ దిల్రుబా చిత్రంలో కనిపంచనుంది. 2021లో హసీన్ దిల్రుబా మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, సన్నీ కె కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను పెళ్లాడిన సంగతి తెలిసిందే. బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా మథియాస్ ఇండియన్ ఆటగాళ్లు చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డికి 2021 నుంచి కోచ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు ఆటగాళ్లు పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.దీంతో తన భర్త కోసం నటి తాప్సీ పన్ను పారిస్ ఒలింపిక్ క్రీడలకు హాజరు కానున్నారు. ఈనెల 29న పారిస్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా ఒలింపిక్స్ చూసే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని పేర్కొన్నారు. తన భర్తతో పాటు.. మనదేశ ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు పారిస్ వెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది. కాగా.. ఇప్పటికే బాడ్మింటన్ క్రీడాకారులు చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్, తాప్సీ భర్త మథియాస్ బో పారిస్ చేరుకున్నారు. మథియోస్ను 2012లో ఒలింపిక్స్ పతకం గెలిచిన తర్వాత తొలిసారి కలుసుకున్నట్లు తాప్సీ వెల్లడించింది.కాగా.. తాస్పీ పన్ను తెలుగులో పలు చిత్రాలు చేసింది. బాలీవుడ్లో సూర్మ (2018), సాంద్ కి ఆంఖ్ (2019), రష్మీ రాకెట్ (2021), లూప్ లాపేట (2022), శభాష్ మిథు (2022) స్పోర్ట్స్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. తాను స్క్వాష్ గేమ్ మాత్రమే బాగా ఆడగలనని తాప్సీ తెలిపింది. -
Paris Olympics 2024: ‘హ్యాట్రిక్’పై సింధు గురి
బ్యాడ్మింటన్‌ను 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో, ఆ తర్వాత 1988 సియోల్ ఒలింపిక్స్‌లలో ఎగ్జిబిషన్ / డెమాన్‌్రస్టేషన్ స్పోర్ట్‌గా ఆడించారు. అంటే పోటీలు జరిపి విజేతలను ప్రకటించినా...ఆ విజయాలను పతకాల జాబితాలో కలపరు. 1992లో జరిగిన బార్సిలోనా ఒలింపిక్స్‌నుంచి అధికారికంగా బ్యాడ్మింటన్ ఒలింపిక్స్‌లో భాగమైంది. 1992 నుంచి 2008 వరకు భారత షట్లర్లు పోటీల్లో పాల్గొన్నా...ఈ ఐదు ప్రయత్నాల్లోనూ మనకు ఒక్క పతకం కూడా దక్కలేదు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో చెప్పుకోదగ్గ విజయాలతో అప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పుల్లెల గోపీచంద్, విమల్ కుమార్, మధుమిత బిష్త్, పీవీవీ లక్ష్మి, అపర్ణా పొపట్, అనూప్ శ్రీధర్‌లాంటి ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరడమే అప్పటి వరకు భారత అత్యుత్తమ ప్రదర్శన. వరుసగా మూడు సార్లు... 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ పరిస్థితి మారింది. అప్పటికే వరుస విజయాలు, సూపర్ సిరీస్ టైటిల్స్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్న సైనా నెహా్వల్ భారత్‌కు బ్యాడ్మింటన్‌లో తొలి ఒలింపిక్ పతకాన్ని అందించింది. సెమీ ఫైనల్లో యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిన సైనా...ప్లే ఆఫ్ మ్యాచ్‌లో గ్జిన్ వాంగ్ (చైనా)పై విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మరో వైపు పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్ వరకు రాగలిగాడు. నాలుగేళ్ల తిరిగే సరికి షటిల్లో భారత్ పతకం మరింత మెరుగైంది. అంతర్జాతీయ యవనికపై దూసుకొచ్చిన 21 ఏళ్ల యువ తార పూసర్ల వెంకట (పీవీ) సింధు రజత పతకాన్ని గెలుచుకొని భారత అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. పదునైన ఆటతో ఫైనల్ చేరిన సింధు...తుది పోరులో కరోలినా మరీన్ (స్పెయిన్) చేతిలో ఓడింది. ఈ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్ వరకు చేరినా...చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో ఓడి నిష్క్రమించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. ఈ సారి కూడా సింధునే పతకాన్ని గెలుచుకుంది. సెమీస్‌లో తై జు (తైపీ) చేతిలో ఓటమిపాలైన సింధు... ప్లే ఆఫ్ పోరులో బింగ్జియావో (చైనా)పై గెలిచి వరుసగా రెండో ఒలింపిక్ పతకాన్ని తన మెడలో వేసుకుంది. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీపై ఆ సమయంలో మంచి అంచనాలే ఉన్నా...దురదృష్టవశాత్తూ వాళ్లు గ్రూప్ దశకే పరిమితమయ్యారు. అనుకూలమైన ‘డ్రా’తో... ఒలింపిక్స్‌లో భారత్‌నుంచి వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు గెలుచుకున్న ఆటగాళ్లు ఇద్దరే ఉన్నారు. సుశీల్ కుమార్ (రెజ్లింగ్), సింధు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ పతకం గెలిచి ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచే అవకాశం సింధు ముందుంది. ఊహించినట్లుగానే గ్రూప్ దశలో రెండు సునాయాస మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా 2020లో కాంస్య పోరులో తాను ఓడించిన బింగ్జియావో, చెన్ యు ఫె, మరీన్‌లను దాటితే ఫైనల్ వరకు వెళ్లగలదు. గత కొంత కాలంగా గొప్ప ఫామ్‌లో లేకపోయినా...కీలక సమయంలో సత్తా చాటగల నైపుణ్యం సింధు సొంతం. అందుకే ఆమె పతకం గెలవడంపై అంచనాలున్నాయి. పురుషుల డబుల్స్‌లో కూడా సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి మంచి ‘డ్రా’నే లభించింది. గ్రూప్ ‘సి’లో విజేతగా ముందంజ వేస్తే ఈ జోడీకి నాకౌట్లోనూ తమకంటే బలహీన ప్రత్యర్థులే ఎదరు కావచ్చు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ఎంత వరకు వెళతాడనేది ఆసక్తికరం. జొనాథన్ క్రిస్టీలాంటి టాప్ ప్లేయర్‌ను ఓడిస్తే లక్ష్యసేన్ నాకౌట్‌కు వెళ్లే అవకాశం ఉంది. ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్, ప్రణయ్ ఎదురు కావచ్చు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప – తనీషా క్రాస్టో జోడి గ్రూప్ దశను దాటి నాకౌట్‌కు చేరడం కష్టమే. ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో గత మూడు ఒలింపిక్స్‌లలో వరుసగా పతకాలు వచ్చాయి. 2012లో సైనా నెహా్వల్ కాంస్యంతో మెరవగా...2016లో పీవీ సింధు రజతం సాధించింది. 2020లోనూ తన జోరును కొనసాగిస్తూ సింధు కాంస్యాన్ని అందుకుంది. –సాక్షి క్రీడా విభాగం -
రాష్ట్రపతితో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన సైనా నెహ్వాల్ (ఫొటోలు)
-
బ్యాడ్మింటన్ కోర్టులో పెను విషాదం.. కార్డియాక్ అరెస్ట్‌తో యువ షట్లర్ మృతి
బ్యాడ్మింటన్ కోర్టులో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా యువ షట్లర్ కోర్టులోనే ప్రాణాలు వదిలాడు. ఇండొనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 17 ఏళ్ల ఝాంగ్ జిఝి ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ టోర్నీలో భాగంగా జపాన్‌కు చెందిన కజుమా కవానోతో తలపడ్డాడు. మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుండగా.. ఝాంగ్ జిఝి ఒక్కసారిగా కుప్పకులిపోయాడు.పక్కనే ఉన్న సిబ్బంది ఝాంగ్ జిఝిను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఝాంగ్ జిఝిను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఈ విషయం తెలిసి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. इंडोनेशिया में एक टूर्नामेंट के दौरान कोर्ट पर गिर जाने के बाद 17 वर्षीय चीनी बैडमिंटन खिलाड़ी झांग झिजी की हृदयाघात से मौत हो गई।#ZhangZhijie #CardiacArrest pic.twitter.com/UoEx2ypjGf— Naval Kant Sinha | नवल कान्त सिन्हा (@navalkant) July 2, 2024 -
చెక్ రిపబ్లిక్ అందాలు ఆస్వాదిస్తున్న సైనా.. మరో బ్యూటీ ఎవరంటే? (ఫొటోలు)
-
ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి–ట్రెసా జోడీ
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–15, 21–11తో యు పె చెంగ్–యు సింగ్ సన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్ ముందంజ వేయగా... భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. లక్ష్య సేన్ 21–12, 21–17తో కెంటా సునెయామ (జపాన్)పై గెలుపొందగా... ప్రియాన్షు 21–17, 21–12తో ప్రణయ్‌ను బోల్తా కొట్టించాడు. కిరణ్ జార్జి 21–11, 10–21, 20–22తో హాంగ్ యాంగ్ వెంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–సిక్కి రెడ్డి (భారత్) ద్వయం 18–21, 21–16, 21–17తో విన్సన్ చియు–జెనీ గాయ్ (అమెరికా) జోడీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
ATA Convention 2024: అదరహో అన్నట్టుగా సాగుతున్న ‘ఆటా’ ఆటల పోటీలు
కన్వెన్షన్ అంటే సాంస్కృతిక, నృత్య, సాహిత్య, సంగీత కలాపాలు, కొత్త పరిచయాలు, ప్రముఖ వ్యక్తుల సందడి, మంచి ఆహారం, జ్ఞానాన్ని పెంపొందించే సదస్సుల వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాల సమూహం. ఈ ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారు మామూలు వాళ్ళు కాదండోయ్.. ఆటపాటలతో పాటు ఆరోగ్యమే మహా భాగ్యమన్న రీతిలో అమెరికాలోని పలు నగరాలలో మెగాఆటా కన్వెన్షన్(18వ) నిర్వహించనుంది.యూత్ కాన్ఫరెన్స్‌లో భాగంగా అసాధారణమైన ప్రతిభ, క్రీడాస్ఫూర్తి, సమాజ స్ఫూర్తిని ప్రదర్శించే థ్రిల్లింగ్ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొన్న వారికి.. అదే విధంగా ప్రేక్షకులకు చిరస్మరణీయమైన క్షణాలను అందిస్తోంది. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారమ్స్, క్రికెట్, చెస్ వంటి పురుషులు / బాలురు మరియు మహిళలు / బాలికల కోసం చేస్తున్న వివిధ క్రీడలు వైవిధ్యభరితంగా, ఉత్సాహ పూరితంగా సాగడం ఆటా వారి బహుముఖ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఈ కన్వెన్షన్ ఈవెంట్ జూన్ 7న మొదలుకానుంది. అందరూ ఆహ్వానితులే, మరిన్ని వివరాలకు, టికెట్లకు www.ataconference.org ని సందర్శించాలని ఆటా తెలిపింది.కాగా ఆటా స్పోర్ట్స్ టీమ్ నేతృత్వంలో సువానీలోని ఏబిసి సెంటర్లో జరిగిన ఆటా బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టోర్నమెంట్లో వివిధ విభాగాల్లో దాదాపు 160 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్, ఓపెన్ సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో పోటీ తీవ్రంగా ఉండటం క్రీడాస్ఫూర్తిని మరింత పెంచింది.ఇక షేఖరాగ్ పార్క్‌లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ సరే సరి.. అధిక సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొనడం.. మునుపెన్నడూ లేనన్ని జట్లు ముందుకు రావడం వల్ల ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.అదే విధంగా... పలు రాష్ట్రాల నుండి దాదాపు 200 మందికి పైగా పిల్లలు, పెద్దలు పాల్గొన్న చదరంగం టోర్నమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది చెస్ట్రోనిక్స్ ద్వారా సులభతరం చేయబడింది. ఆటా కన్వెన్షన్‌లో భాగంగా చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఫౌలర్ పార్క్ రెక్ సెంటర్లో జరిగిన ఆటా మహిళల పికిల్ 8బాల్ టోర్నమెంట్ అన్ని ఈవెంట్లలోకి హైలైట్ అని చెప్పవచ్చు. నీతూ చౌహాన్ నేతృత్వంలో ఆటా మహిళా స్పోర్ట్స్ టీమ్ నిర్వహించిన ఈ టోర్నమెంట్లో సింగిల్స్, డబుల్స్ విభాగాలు అన్ని స్కిల్ లెవెల్స్ ప్లేయర్లకు జరిగాయి.ఆటా మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విభిన్న నేపథ్యాలు మరియు నైపుణ్య స్థాయిల క్రీడాకారులను ఒకచోట చేర్చింది. ఈ ఈవెంట్ ప్రారంభ మరియు మధ్య స్థాయిలలో సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాలను కలిగి ఉంది, పాల్గొన్న వారికి వ్యక్తిగతంగా, జట్టులో భాగంగా పోటీ చేసే అవకాశాన్ని అందించింది.స్పోర్ట్స్ కమిటీ ఛైర్ అనంత్ చిలుకూరి, ఉమెన్స్ స్పోర్ట్స్ ఛైర్ నీతూ మాట్లాడుతూ.. ‘‘ ఇటీవలి స్పోర్ట్స్ ఈవెంట్ల విజయంతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆటగాళ్ల ప్రతిభ, క్రీడాస్ఫూర్తి స్థాయి నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ ఈవెంట్లను అద్భుతంగా విజయవంతం చేసినందుకు క్రీడాకారులు, నిర్వాహకులు, వాలంటీర్లు, స్పాన్సర్లతో సహా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటివి మున్ముందు మరిన్ని జరగబోతున్నాయి’’ అని తెలిపారు.కాగా స్పోర్ట్స్ కమిటీలు, రీజనల్ కోఆర్డినేటర్లు అనంత్ చిలుకూరి, నీతూ చౌహాన్, శ్రీకాంత్ పాప, వెంకట్ రోహిత్, రంజిత్ చెన్నాడి, హరికృష్ణ సికాకొల్లి, సుభాష్ ఆర్ రెడ్డి, , శ్రీనివాస్ పసుపులేటి, సతీష్ రెడ్డి అవుతు, దివ్య నెట్టం, సరిత చెక్కిల, వాసవి చిత్తలూరి వంటి ఎంతో మంది అంకితభావం మరియు కృషి వల్లే సాధ్యమైంది. ఖచ్చితమైన ప్రణాళిక మరియు పకడ్బందీగా అమలు చేయడం వల్ల అందరికీ గొప్ప అనుభూతిని మిగులుస్తోంది.ఆటా కాన్ఫరెన్స్ బృందం భవిష్యత్తులో మరింత ఆకర్షణీయమైన మరియు పోటీతత్వ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహించడం, సంఘంలో స్నేహపూర్వక మరియు ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉంటుంది. బహుమతుల పంపిణీ కన్వెన్షన్ లో విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో, భారీ జనసందోహం ముందు జరగబోతున్నది. అలానే, ఆటా వారు అందరికీ స్నాక్స్, బెవరేజెస్ మరియు భోజనం అందించారు. అందరూ తప్పకుండా రండి, కలిసి మెలిసి మన ఆటా కన్వెన్షన్ ని ఆడుతూ, పాడుతూ జరుపుకుందామని ఆటా పిలుపునిస్తోంది. -
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం!
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–13తో నూర్ మొహమ్మద్–తాన్ వీ కియోంగ్ (మలేసియా) జంటపై విజయం సాధించింది.పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. భారత రైజింగ్ స్టార్, ప్రపంచ 84వ ర్యాంకర్ మైస్నం మిరాబా లువాంగ్ వరుస గేముల్లో ప్రణయ్‌ను ఓడించి తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు.55 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో మిరాబా 21–19, 21–18తో ప్రణయ్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్‌కే చెందిన కిరణ్ జార్జి, సతీశ్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. కిరణ్ 15–21, 21–13, 17–21తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో... సతీశ్ 13–21, 17–21తో జేసన్ గుణవన్ (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యారు.అష్మిత మినహా...మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి ఐదుగురు బరిలోకి దిగగా... అష్మిత మినహా మిగతా నలుగురు ఉన్నతి హుడా, సామియా, మాళవిక, ఆకర్షి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. అష్మిత 19–21, 21–15, 21–14తో ఎస్తర్ నురిమి (ఇండోనేసియా) పై గెలిచింది. ఉన్నతి 21–14, 14–21, 19–21తో లియాన్ టాన్ (బెల్జియం) చేతిలో, సామియా 13–21, 13–21తో గావో ఫాంగ్ జి (చైనా) చేతిలో ... మాళవిక 11–21, 10–21తో హాన్ యువె (చైనా) చేతిలో, ఆకర్షి 13–21, 8–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
భారత జట్ల శుభారంభం
చెంగ్డు (చైనా): ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లు థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. థామస్ కప్‌లో భాగంగా గ్రూప్ ‘సి’లో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల టీమ్ 4–1 తేడాతో థాయిలాండ్‌పై విజయం సాధించింది. మహిళల టోర్నీ ఉబెర్ కప్ గ్రూప్ ‘ఎ’లో భారత్ 4–1 స్కోరుతోనే కెనడాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్‌పై కున్లావట్ వితిద్సన్ గెలుపొందాడు. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలు భారత్ ఖాతాలో చేరాయి. తీరారట్‌సకుల్ పై లక్ష్యసేన్, సరన్జమ్శ్రీపై కిడాంబి శ్రీకాంత్ విజయం సాధించారు. తొలి డబుల్స్‌లో సుక్ఫున్ – తీరారట్‌సకుల్ జంటపై సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్‌శెట్టి జోడి... పన్‌పనిచ్ – సొథోన్పై ఎంఆర్ అర్జున్ – ధ్రువ్ కపిల గెలిచారు. ఉబెర్ కప్‌లో తొలి సింగిల్స్‌లో మిచెల్ లిపై అస్మిత చాలిహ, కేథరీన్ – జెస్లీన్పై ప్రియ – శృతి, వెన్ జాంగ్‌పై ఇషారాణి బారువా గెలుపొందారు. అయితే రెండో డబుల్స్‌లో జాకీ డెంట్ – క్రిస్టల్ లాయ్ చేతిలో సిమ్రన్ సింఘీ – రితిక ఠాకర్ ఓడిపోగా... చివరి మ్యాచ్‌లో ఎలియానా జాంగ్‌పై అన్మోల్ ఖర్బ్ విజయం సాధించింది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (ఫొటోలు)
-
విజేత తరుణ్ మన్నేపల్లి
కజకిస్తాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన తరుణ్ మన్నేపల్లి విజేతగా నిలిచాడు. అస్తానాలో శనివారం జరిగిన ఫైనల్లో తరుణ్ 21–10, 21–19 స్కోరుతో ఎనిమిదో సీడ్, మలేసియాకు చెందిన సూంగ్ జూ విన్‌పై విజయం సాధించాడు. గత ఏడాది జాతీయ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన తరుణ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టైటిల్ కావడం విశేషం. మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్ అనుపమ ఉపాధ్యాయ టైటిల్ సాధించింది. ఫైనల్లో భారత్‌కే చెందిన ఇషారాణి బారువాపై 21–15, 21–16తో అనుపమ గెలుపొందింది. మరో వైపు మిక్స్డ్ డబుల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి కె.మనీషా రన్నరప్‌గా నిలిచింది. మనీషా – సంజయ్ శ్రీవత్స జోడి ఫైనల్లో 21–9, 7–21, 12–21తో వాంగ్ టిన్ సి – లిమ్ చూ సిన్ (మలేసియా) చేతిలో పరాజయంపాలైంది. టైటిల్ సాధించే క్రమంలో తరుణ్ సహచరుడు గగన్ బల్యాన్, 2022 వరల్డ్ జూనియర్ చాంపియన్íÙప్ రన్నరప్ శంకర్ ముత్తుసామి, దిమిత్రీ పనరియన్ (కజకిస్తాన్), ఏడో సీడ్ లీ డ్యూక్ (వియత్నాం)లను ఓడించాడు. -
వైదొలిగిన సాత్విక్-చిరాగ్ జోడీ
భుజం గాయం నుంచి సాత్విక్ పూర్తిగా కోలుకోకపోవడంతో... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ వైదొలిగింది. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. థామస్ కప్‌లో మాత్రం సాత్విక్–చిరాగ్ ద్వయం బరిలోకి దిగుతుందని భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. ఆసియా చాంపియన్‌షిప్ ఈనెల 9 నుంచి 14 వరకు చైనాలో జరుగుతుంది. -
Swiss Open 2024: క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–10, 21–12తో భారత్‌కే చెందిన ప్రియ–శ్రుతి మిశ్రా జంటను ఓడించింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ 17–21, 16–21తో రుయ్ హిరోకామి–యునా కాటో (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. -
తామిరి సూర్య చరిష్మాకు కాంస్య పతకం
జర్మన్ ఓపెన్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తామిరి సూర్య చరిష్మా కాంస్య పతకం గెలిచింది. బెర్లిన్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–19 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో చరిష్మా 21–15, 20–22, 17–21తో కిమ్ మిన్ జీ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు చరిష్మా క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సితి జులైఖా (మలేసియా)పై... రెండో రౌండ్ లో13వ సీడ్ పిచిత్ప్రిచాసెక్ (థాయ్‌లాండ్)పై సంచలన విజయాలు సాధించింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ షట్లర్
హైదరాబాద్‌కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను ఇన్‌స్టా వేదికగా ఇవాళ (మార్చి 4) వెల్లడించాడు. 31 ఏళ్ల సాయి ప్రణీత్ అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ఎన్ని పతకాలు సాధించిపెట్టాడు. 2019లో అతను వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ అనంతరం గాయాలతో సతమతమైన ప్రణీత్.. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. ప్రణీత్ తన కెరీర్లో సింగపూర్ ఓపెన్, కెనడా ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ టైటిళ్లను సాధించాడు. కెరీర్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రణీత్.. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించలేకపోయానని బాధపడ్డాడు. ప్రణీత్‌ను భారత ప్రభుత్వం 2019లో అర్జున అవార్డుతో సత్కరించింది. ప్రణీత్ రిటైర్మెంట్ సందేశంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. View this post on Instagram A post shared by Sai Praneeth (@saipraneeth92) ప్రణీత్ తన కెరీర్ మొత్తంలో 225 విజయాలు సాధించి, 151 పరాజయాలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 46 స్థానంలో ఉన్న ప్రణీత్.. 2019లో అత్యుత్తమంగా 10వ ర్యాంక్‌కు సాధించాడు. రిటైర్మెంట్ అనంతరం ప్రణీత్ కోచ్‌గా సేవలించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. యూఎస్‌లోని నార్త్ కరోలినా క్లబ్లో అతను కోచ్‌గా సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
German Open: గాయత్రి–ట్రెసా జోడీ ముందంజ
జర్మన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–10, 21–11తో సోనా హొరిన్కోవా–కాటరీనా జుజకోవా (చెక్ రిపబ్లిక్) జంటపై గెలిచింది. -
అంగ వైకల్యం అడ్డు కాలేదు.. ప్రపంచం మెచ్చిన స్పోర్ట్స్ స్టార్ అయ్యింది..!
ఆమె దృఢ సంకల్పానికి అంగ వైకల్యం అడ్డు కాలేదు. మొండి పట్టుదలతో అనుకున్నది సాధించింది. 22 ఏళ్లకే రోడ్డు ప్రమాదంలో కాలు పోయినా.. కృత్రిమ కాలితో తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ క్రీడలో సక్సెస్ సాధించింది. విధి వెక్కిరించినా సంచలనాలు సృష్టించింది. ఆమె ఆత్మ విశ్వాసం ముందు అంగ వైకల్యం ఓడిపోయింది. ఈ నిజమైన విజేత పేరే మానసి జోషి. గుజరాత్లో పుట్టి, ముంబైలో పెరిగిన 34 ఏళ్ల మానసి రోడ్డు ప్రమాదంలో కాలు పోయినా ఏమాత్రం అధైర్యపడకుండా జీవితంలో ముందడుగు వేసింది. కృత్రిమ కాలితో తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ క్రీడలో సక్సెస్ సాధించింది. శారీరక లోపాన్ని జయించి అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. ఈ క్రమంలో పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌గా, వరల్డ్ నంబర్ వన్ షట్లర్‌గా ఎదిగింది. ఆరేళ్ల వయసులోనే రాకెట్ పట్టుకున్న మానసి ఓవైపు ఉన్నత చదువులు చదువుతూనే.. క్రీడల్లో రాణించింది. ముంబైలో ఇంజినీరింగ్ పూర్తి చేశాక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన మానసి.. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయింది. 2011 డిసెంబర్ 2న ద్విచక్రవాహనంపై ఆఫీసుకు వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఆమె ఎడమ కాలు పూర్తిగా ఛిద్రమైంది. కాలు కోల్పోయాక కొద్ది రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయిన మానసి.. వైకల్యం తన ఎదుగుదలకు అడ్డుకాకూడని నిశ్చయించుకుని ముందడుగు వేసింది. కృత్రిమ కాలును అమర్చుకొని తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ బరిలోకి రీఎంట్రీ ఇచ్చింది. కఠోర శ్రమ అనంతరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన మానసి.. 2018లో హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరి తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుంది. గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన మానసి.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌తో పాటు మరెన్నో అంతర్జాతీయ పతకాలు సాధించింది. తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందింది. 2022లో మానసి వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్‌గా అవతరించింది. అమెరికాకు చెందిన బార్బీ కంపెనీ మానసి సాధించిన విజయాలకు గుర్తింపుగా ఆమె పోలికలతో బార్బీ బొమ్మను రూపొందించింది. తాజాగా చైనాలో జరుగుతున్న పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన మానసి.. సహచర క్రీడాకారిణిలతో కలిసి ఫోటోకు పోజిచ్చింది. With Para baddy girls in China 🇨🇳 pic.twitter.com/bkDNlDM5vl — Manasi Joshi (@joshimanasi11) February 29, 2024 -
చరిత్ర సృష్టించిన భారత్
భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌ను తొలిసారి కైవసం చేసుకుంది. మలేసియా వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన ఫైనల్లో (సింగిల్స్) పీవీ సింధు, అన్మోల్ ఖర్బ్ అద్భుత ప్రదర్శనతో భారత్ 3-2తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. ఈ కాంటినెంటల్ టోర్నీలో భారత్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌ల్లో (బెస్ట్ ఆఫ్ 5) సింధు, అన్మోల్తో పాటు గాయత్రి గోపీచంద్-జాలీ ట్రీసా జోడీ (డబుల్స్) విజయాలు సాధించారు. గాయం నుంచి కోలుకున్న అనంతరం తన మొదటి టోర్నీలో పాల్గొన్న సింధు.. ఫైనల్లో థాయ్ షట్లర్ సుపనిందా కతేథాంగ్‌ను కేవలం 39 నిమిషాల్లో 21-12, 21-12 తేడాతో ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆతర్వాత మూడు గేమ్‌ల పోరులో (21-16, 18-21, 21-16) గాయత్రి గోపీచంద్, జాలీ ట్రీసా జోడీ.. జోంగ్‌కోల్‌ఫామ్ కిటితారాకుల్, రవ్వింద ప్రజోంగ్‌జల్‌లను ఓడించడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం మూడు (అస్మిత చాలిహ), నాలుగు మ్యాచ్‌ల్లో (డబుల్స్) ఓటమి చవిచూసిన భారత్.. నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో గెలుపొంది, టైటిల్‌ను కైవసం చేసుకుంది. రసవత్తరంగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో 16 ఏళ్ల అన్మోల్ (472వ ర్యాంకర్).. ప్రపంచ 45వ ర్యాంకర్ పోర్న్‌పిచా చోయికీవాంగ్‌పై వరుస గేమ్‌లలో విజయం సాధించి, భారత జట్టు చారిత్రక గెలుపు భాగమైంది. -
మన మహిళలు ఫైనల్‌కు...
షా ఆలమ్ (మలేసియా): భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో రెండు సార్లు చాంపియన్ అయిన జపాన్ను కంగు తినిపించి తొలి సారి ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 3–2 స్కోరుతో మాజీ చాంపియన్ జపాన్‌పై ఆఖరి మ్యాచ్ దాకా పోరాడి గెలిచింది. రెండు ఒలింపిక్స్ పతకాల విజేత సింధు సింగిల్స్, డబుల్స్ రెండు మ్యాచ్‌ల్లో ఓడినా... మిగతా సహచరులెవరూ కుంగిపోకుండా జపాన్ ప్రత్యర్థులపై అసాధారణ విజయాలు సాధించారు. నేడు జరిగే టైటిల్ పోరులో భారత్... థాయ్‌లాండ్‌తో తలపడుతుంది. జోరు మీదున్న సింధుకు తొలి సింగిల్స్‌లో నిరాశ ఎదురైంది. ఆమె 13–21, 20–22తో అయ ఒహొరి చేతిలో పరాజయం చవిచూసింది. డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–17, 16–21, 22–20తో ప్రపంచ ఆరో ర్యాంకు నమి మత్సుయమ–చిహరు షిద జంటను ఊహించని రీతిలో కంగు తినిపించింది. దీంతో ఇరు జట్ల స్కోరు 1–1తో సమం కాగా.. రెండో సింగిల్స్‌లో ప్రపంచ 53వ ర్యాంకర్ అష్మిత 21–17, 21–14తో 20వ ర్యాంకర్ ఒకుహరపై సంచలన విజయం సాధించింది. దీంతో భారత్ ఆధిక్యం 2–1కు చేరింది. తనీషా క్రాస్టో గాయం వల్ల సింధు తప్పనిసరి పరిస్థితుల్లో అశ్విని పొన్నప్పతో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. కానీ ఈ ద్వయం 14–21, 11–21తో ప్రపంచ 11వ ర్యాంకు జంట రెనా మియవుర–అయాకొ సకురమొతో చేతిలో ఓడిపోయింది. మరో సారి ఇరుజట్లు 2–2తో సమవుజ్జీగా నిలువగా... నిర్ణాయక ఆఖరి సింగిల్స్ ఉత్కంఠ పెంచింది. ఇందులో అన్మోల్ ఖర్బ్ 21–14, 21–18తో నత్సుకి నిదయిరపై గెలుపొందడంతో భారత్ ఫైనల్ చేరింది. -
చైనాకు భారత మహిళల షాక్
షా ఆలమ్ (మలేసియా): బ్యాడ్మింటన్‌లో మేటి జట్టయిన చైనాకు భారత్ చేతిలో ఎదురుదెబ్బ తగిలింది.. ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో చక్కటి ప్రదర్శనతో భారత మహిళల జట్టు 3–2తో చైనా బృందాన్ని కంగు తినిపించింది. అన్నింటికి మించి భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు చాన్నాళ్ల తర్వాత విజయంతో ఈ సీజన్‌ను ప్రారంభించింది. గాయాలు వెన్నంటే వైఫల్యాలతో గత సీజన్ ఆసాంతం నిరాశపర్చిన ఆమె ఈ ఏడాది గట్టి ప్రత్యర్థిపై ఘనమైన విజయంతో సత్తా చాటుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సింధు 21–17, 21–15తో హన్ యుపై గెలిచి జట్టును 1–0తో ఆధిక్యంలో నిలిపింది. రెండు ఒలింపిక్ పతకాల విజేత అయిన సింధు కేవలం 40 నిమిషాల్లోనే తనకన్నా మెరుగైన ర్యాంకర్ ఆట కట్టించింది. రెండో గేమ్‌లో సింధు ఒక దశలో 10–13తో వెనుకబడినా...తర్వాతి 13 పాయింట్లలో 11 గెలుచుకొని విజేతగా నిలవడం విశేషం. అనంతరం జరిగిన డబుల్స్ పోటీల్లో అశ్విని పొన్నప్ప–తనీషా కాస్ట్రో జోడీ 19–21, 16–21తో లియు షెంగ్ షు–తన్ నింగ్ జంట చేతిలో ఓడటంతో స్కోరు 1–1తో సమమైంది. ఆ వెంటనే జరిగిన రెండో సింగిల్స్‌లో అషి్మత చాలిహ 13–21, 15–21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ వాంగ్ జి యి చేతిలో ఓడిపోవడంతో భారత్ 1–2తో వెనుకబడింది. ఈ దశలో మరో తెలుగమ్మాయి పుల్లెల గాయత్రి... ట్రెసా జాలీతో కలిసి డబుల్స్ బరిలో దిగి మ్యాచ్ గెలుపొందడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. గాయత్రి–ట్రెసా ద్వయం 10–21, 21–18, 21–17తో లి యి జింగ్–లు జు మిన్ జంటపై నెగ్గడంతో భారత్ 2–2తో చైనాను నిలువరించింది. దీంతో అందరి దృష్టి నిర్ణాయక పోరుపైనే పడింది. ఇందులో అంతగా అనుభవం లేని 472 ర్యాంకర్ అన్మోల్ ఖర్బ్ 22–20, 14–21, 21–18తో ప్రపంచ 149వ ర్యాంకర్ వు లు యుపై అసాధారణ విజయం సాధించి భారత్‌ను గెలిపించింది. తొలి సారి ఈ టోర్నీలో బరిలోకి జాతీయ చాంపియన్ అన్మోల్ తీవ్ర ఒత్తిడిని అధిగమించి విజయాన్ని అందుకోవడం విశేషం. ప్రణయ్ ఓడినా... పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్ 4–1తో హాంకాంగ్‌పై జయభేరి మోగించింది. తొలి సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ 18–21, 14–21తో ఎన్గ్ క లాంగ్ అంగుస్ చేతిలో ఓడినా... తుది విజయం మనదే అయింది. ప్రపంచ నంబర్‌వన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 21–16, 21–11తో లుయి చున్ వాయ్–యింగ్ సింగ్ చొయ్ ద్వయంపై అలవోక విజయం సాధించింది. రెండో డబుల్స్‌లో ఎమ్.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల జంట 21–12, 21–7తో చొ హిన్ లాంగ్–హంగ్ కుయె చున్ జోడీపై నెగ్గింది. 3–1తో విజయం ఖాయమవగా... ఆఖరి సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–14, 21–18తో జాసన్ గునవాన్‌పై గెలుపొందడంతో ఆధిక్యం 4–1కు పెరిగింది. మహిళల గ్రూప్ ‘డబ్ల్యూ’లో రెండే జట్లు ఉండటంతో భారత్, చైనా ఈ మ్యాచ్‌కు ముందే నాకౌట్‌కు అర్హత సాధించాయి. పురుషుల విభాగంలో మాత్రం గురువారం జరిగే పోరులో చైనాతో భారత్ తలపడుతుంది -
Badminton: కొత్త కెరటం... తీగల సాయిప్రసాద్
సాక్షి, హైదరాబాద్: అసోంలోని గువహటిలో గత ఏడాది ఆగస్టులో బ్యాడ్మింటన్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్సీఈ) ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతులైన కుర్రాళ్లను గుర్తించి వారిని భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడం కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రం ఇది. ముందుగా అండర్–17 స్థాయిలో సెలక్షన్స్ ప్రక్రియ జరిగింది. ఇందులో ఏకంగా 858 మంది యువ షట్లర్లుపాల్గొన్నారు. వీరిలో టాప్–4కి మాత్రమే అక్కడ చోటు లభించింది. ఈ సెంటర్లో మొదటి విద్యార్థిగా అడుగు పెట్టిన కుర్రాడే హైదరాబాద్‌కు చెందిన తీగల సాయిప్రసాద్. అప్పటికే తన ప్రతిభ తో ఆకట్టుకున్న సాయిప్రసాద్ ఎన్సీఈలో శిక్షణతో మరింత పదునెక్కాడు. తన ఆటలోని సత్తాను చూపిస్తూ ఇటీవల కీలక విజయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత నెలలో ఇరాన్లో జరిగిన ఫజర్ జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్‌లో సాయి టైటిల్ సాధించి షటిల్ వేదికపై కొత్త కెరటంలా వెలుగులోకి వచ్చాడు. తండ్రి ప్రోత్సాహంతో... సాయి తండ్రి సూర్యారావు జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆటగాడిగా కెరీర్‌ను ముగించిన తర్వాత ఆయన కోచ్‌గా మారారు. సుదీర్ఘ కాలం పాటు న్యూజిలాండ్‌లో వేర్వేరు క్లబ్‌లలో కోచింగ్ ఇచ్చిన సూర్య ఆ తర్వాత భారత్‌కు తిరిగొచ్చారు. చిన్నప్పటినుంచి తండ్రి ఆటను చూస్తూ వచ్చిన సాయి సహజంగానే షటిల్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. దాంతో సాయిని పూర్తిస్థాయిలో ఆటగాడిగా తీర్చిదిద్దాలని భావించిన సూర్య స్వయంగా తానే ఓనమాలు నేర్పించారు. ఆ తర్వాత మరింత మెరుగైన శిక్షణ కోసం ప్రతిష్టాత్మక పుల్లెల గోపీచంద్ అకాడమీలో సాయి చేరాడు. అదే అకాడమీలో తండ్రి సూర్య కూడా ఒక కోచ్‌గా ఉండటం సాయికి మరింత సానుకూలాంశంగా మారింది. అటు గోపీచంద్ మార్గనిర్దేశనం, ఇటు తండ్రి శిక్షణ వెరిసి సాయి మంచి ఫలితాలు సాధించాడు. అండర్–13 స్థాయిలో జాతీయస్థాయి నంబర్‌వన్ కావడంతోపాటు అండర్–15, అండర్–17లలో సాయిప్రసాద్ టాప్–5లో కొనసాగాడు. జాతీయ జూనియర్ ర్యాంకింగ్ టోర్నీలతో పాటు అండర్–13 స్థాయిలో సింగపూర్, థాయ్‌లాండ్‌లలో జరిగిన టోర్నీల్లో టైటిల్స్ సాధించాడు. అనంతరం కెరీర్లో ఎదుగుతున్న కీలక దశలో అతను గువహటి ఎన్సీఈలో ప్రవేశంతో తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు. కెరీర్లో కీలక విజయం... అగ్రశ్రేణి కోచ్‌లు, అత్యుత్తమ సౌకర్యాలతో ఉన్న ఎన్సీఈలో సాయిప్రసాద్ సాధనకు మరింత మంచి అవకాశం దక్కింది. ఈ క్రమంలో అతని పురోగతి వేగంగా సాగింది. గత ఏడాది ఆగస్టులో సాయి జూనియర్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 1043వ స్థానంలో ఉన్నాడు. అక్కడి నుంచి మెరుగైన ప్రదర్శనతో ఈ ఏడాది జనవరి తొలి వారంలో మొదటి సారి టాప్–100లోకి అడుగు పెట్టాడు. మంగళవారం ప్రకటించిన తాజా బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్‌లో అతను 37వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో జనవరిలో అతని కెరీర్లో చెప్పుకోదగ్గ విజయం దక్కింది. ఇరాన్లో జరిగిన జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్‌లో సాయిప్రసాద్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్ చేరడానికి ముందు చక్కటి ప్రదర్శనతో అతను వరుసగా మూడు మ్యాచ్‌లలో స్థానిక ఇరాన్ ఆటగాళ్లను ఓడించడం విశేషం. గత వారమే 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సాయి ఇకపై అండర్–19 స్థాయి టోర్నీల్లోనే పాల్గొనబోతున్నాడు. జూనియర్ విభాగంలో టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి చేరడంపై సాయి దష్టి పెట్టాడు. ఆపై జూనియర్ వరల్డ్‌లాంటి పెద్ద టోర్నీని గెలవడం అతని ముందున్న ప్రస్తుత లక్ష్యం. సాయి ప్రతిభకు తోడు ఎన్సీఈ శిక్షణ అతని ప్రదర్శన స్థాయిని పెంచింది. ఇదే ఆటను కొనసాగిస్తే మున్ముందు ఈ అబ్బాయి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అద్భుత ఫలితాలు సాధించడం ఖాయం. -
ఏడో ర్యాంక్‌కు ఎగబాకిన ప్రణయ్.. టాప్-100లో భారత్ నుంచి ఏకంగా..!
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్–100లో భారత్ నుంచి ఏకంగా 12 మంది చోటు సంపాదించారు. తాజా ర్యాంకింగ్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ఒక స్థానం పురోగతి సాధించి ఏడో ర్యాంక్‌కు చేరుకొని భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లక్ష్య సేన్ (20), శ్రీకాంత్ (24), ప్రియాన్షు (28), కిరణ్ జార్జి (36), సతీశ్ కుమార్ (49), మిథున్ మంజునాథ్ (63), శంకర్ ముత్తుస్వామి (70), సమీర్ వర్మ (77), సాయిప్రణీత్ (91), మెరాబా లువాంగ్ మైస్నమ్ (93), చిరాగ్ సేన్ (99) ఉన్నారు. -
శ్రమించి నెగ్గిన గాయత్రి–ట్రెసా జోడీ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 74 నిమిషాల్లో 16–21, 21–10, 21–18తో లోక్ లోక్ లుయ్–వింగ్ యంగ్ ఎన్జీ (హాంకాంగ్) జంటపై శ్రమించి గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టోలతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో అశి్వని–తనీషా ద్వయం 21–13, 21–17తో లింగ్ ఫాంగ్ హు–జియావో మిన్ లిన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. మరోవైపు భారత ఆటగాళ్లు సమీర్ వర్మ, శంకర్ ముత్తుస్వామి పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. -
22 ఏళ్లకే వరల్డ్ నంబర్ వన్‌గా! బ్యాడ్మింటన్‌లో ఎన్నో సంచలనాలు
దాదాపు ఏడాది క్రితం... దుబాయ్‌లో బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్ జరుగుతోంది. భారత్, కొరియా మధ్య పోరు... మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పీవీ సింధు... ఎదురుగా ప్రత్యర్థి ఒక వర్ధమాన షట్లర్... ఆమె ఆట గురించి సింధుకు కూడా బాగా తెలుసు. అందుకే తనదైన వ్యూహాలతో సన్నద్ధమై బరిలోకి దిగింది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌ను సింధు 21–18తో గెలుచుకుంది. కానీ అటు వైపు ఉన్న అమ్మాయి వెంటనే కోలుకుంది. అంతే ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. తర్వాతి రెండు గేమ్‌లను అలవోకగా 21–5, 21–9తో సొంతం చేసుకొని మ్యాచ్‌ను తన ఖాతాలో వేసేసుకుంది. సింధు ముఖంలో తీవ్ర నిరాశ... ఎందుకంటే ఆమె చేతిలో సింధు ఓడిపోవడం ఇది మొదటిసారి కాదు. ఇద్దరూ 6 మ్యాచ్‌లలో తలపడితే ఆరోసారి కూడా కొరియా ప్లేయరే విజయం సాధించింది. 2019 నుంచి ప్రయత్నిస్తున్నా ఒక్క మ్యాచ్‌లో కూడా సింధు గెలవలేకపోయిందంటే అతిశయోక్తి కాదు. రెండు ఒలింపిక్స్ పతకాల విజేత, వరల్డ్ చాంపియన్, పెద్ద సంఖ్యలో సూపర్ సిరీస్‌లు సాధించి వరల్డ్ బ్యాడ్మింటన్ గ్రేట్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సింధును కూడా ఒక ఆటాడుకుంటున్న ఆ అమ్మాయి పేరే ఆన్ సె యంగ్... టీనేజ్ దాటకముందే టాప్ షట్లర్లందరినీ ఓడిస్తూ దూసుకు వచ్చి ఆపై విశ్వ విజేతగా కూడా నిలిచిన 22 ఏళ్ల కొరియన్ స్టార్ షట్లర్. ‘కొరియాను ఆదుకున్న స్కూల్ గర్ల్’... ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్‌లో గ్రూప్ దశలో డెన్మార్క్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆన్ సె యంగ్ విజయం తర్వాత కొరియా అంతటా కనిపించిన హెడ్‌లైన్స్ ఇవి. ఈ పోరులో తొలి నాలుగు మ్యాచ్‌ల తర్వాత టీమ్ స్కోరు 2–2తో సమంగా ఉన్న దశలో ఆఖరి మ్యాచ్‌లో ఆమె బరిలోకి దిగింది. తీవ్ర ఒత్తిడి మధ్య సత్తా చాటిన యంగ్ తన డెన్మార్క్ ప్రత్యర్థి లైన్ క్రిస్టోఫర్‌సెన్‌ను ఓడించడంతో అందరి దృష్టీ ఆమెపై పడింది. ఈ టోర్నీలో కొరియా జట్టుకు కాంస్య పతకం అందించడంలో కూడా 16 ఏళ్ల యంగ్ కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో కొరియా సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి స్కూల్గర్ల్గా ఈ అమ్మాయి గుర్తింపు పొందింది. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఆపై ఇవే విజయాలను కొనసాగిస్తూ ఉన్నతస్థానానికి దూసుకుపోయింది. అంతకు ముందు ఏడాదే కొరియా జూనియర్ టీమ్ తరఫున ఆసియా చాంపియన్‌షిప్ గెలిచినప్పుడే ఈ టీనేజర్లో ఎంతో సత్తా ఉందని, సంచలనాలు సృష్టించడం ఖాయమని అంతా నమ్మారు. వాటిని వమ్ము చేయకుండా ఆన్ సె యంగ్.. నిజం చేసి చూపించింది. స్టార్ షట్లర్లను ఓడించి... కరోలినా మరీన్, అకీనా యమగూచి, సైనా నెహ్వాల్... బ్యాడ్మింటన్‌లో ఈ ముగ్గురూ సూపర్ స్టార్లు. ఎన్నో గొప్ప విజయాలు వీరి ఖాతాలో ఉన్నాయి. మరి ఈ ముగ్గురినీ ఒకే టోర్నమెంట్లో ఒక ప్లేయర్ ఓడగొడితే ఆ ప్లేయర్ స్థాయి ఏంటో ప్రపంచమంతటికీ అర్థమవుతుంది. ఆన్ సె యంగ్ విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఉబెర్ కప్‌లో సీనియర్ల చాటున జూనియర్‌గా టీమ్ ఈవెంట్లో మంచి ప్రదర్శన కనబరచిన యంగ్ 2019 ఆరంభం నుంచే వ్యక్తిగత టోర్నీల్లో ప్రదర్శనతో సత్తా చాటింది. సూపర్–100 నుంచి సూపర్–300 స్థాయి వరకు వరుసగా నాలుగు టోర్నీల్లో ఆమె విజేతగా నిలిచింది. ఇందులో ఒక టోర్నీలో 2012 ఒలింపిక్స్ విజేత లీ జురుయ్‌ని ఫైనల్లో ఓడించగలిగింది. అయితే ప్రతిష్ఠాత్మక, పెద్ద టోర్నీల్లో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750లో ఆటతో ఆన్ సె యంగ్ స్థాయి మరింత పెరిగింది. పై ముగ్గురు స్టార్లను ఓడించి టైటిల్ సొంతం చేసుకోవడంతో యంగ్‌కు ఎదురు లేకుండా పోయింది. 2019లో ఏకంగా ఐదు టైటిల్స్ గెలుచుకొని మరోదాంట్లో రన్నరప్‌గా నిలవడంతో సహజంగానే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అందించే ‘మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఆమె ఎంపికైంది. ఈ అవార్డు సాధించడం అంటే ఈ అసాధారణ ప్లేయర్ ఇక ముందు ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించేందుకు సిద్ధంగా ఉందని అర్థం. యంగ్ విషయంలోనూ అదే జరిగింది. తర్వాతి రెండేళ్లలో డెన్మార్క్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్, వరల్డ్ టూర్ ఫైనల్స్, ఆల్ ఇంగ్లండ్, కొరియా ఓపెన్, మలేసియా మాస్టర్స్, జపాన్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్... ఇలా వేదిక మారడమే తప్ప యంగ్ విజయాల్లో మార్పు లేదు. వరుసగా టోర్నీలు ఆమె ఖాతాలో చేరాయి. 2022 ముగిసే సరికి సీనియర్ కెరీర్లో అప్పటికే 11 బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ గెలుచుకొని మరో 5 టోర్నీల్లో సె యంగ్ రన్నరప్‌గా నిలవడం ఆమె ఆధిపత్యానికి నిదర్శనం. సూపర్ 2023... చాలామంది టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్లతో పోలిస్తే ఆన్ సె యంగ్ ఆట శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. సాధ్యమైనంత తక్కువ శారీరక కదలికలతోనే ప్రత్యర్థిని బోల్తా కొట్టించే తత్వం ఆమెది. కోర్టులో అన్ని వైపులా పరుగెత్తుతూ సమాధానమిచ్చే శైలికి యంగ్ దూరం. కెరీర్ తొలుతలో దూకుడుగా ఆడుతూ అటాకింగ్‌ను ఇష్టపడిన ఆమె ఇప్పుడు ఎక్కువ భాగం డిఫెన్స్‌తోనే పాయింట్లు రాబడుతోంది. అటు వైపు షట్లర్ ఎంత వేగంగా షటిల్‌ను సంధించినా ప్రశాంతంగా రిటర్న్ ఇవ్వగలదు. దాంతోనే వారి దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ ఒత్తిడిలోకి నెట్టడం, ఫలితంగా విన్నర్ల ద్వారానే పాయింట్లు రాబట్టగలగడం యంగ్ ఆటతీరులో కనిపిస్తుంది. ఇదే ఆట ఆమెకు 2023లో అద్భుతాలను అందించింది. తిరుగులేని ఆటతో ఒకటి, రెండు కాదు... ఏకంగా 9 బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ ఆమె గెలుచుకోగలిగింది. ఇందులో బ్యాడ్మింటన్‌లో అన్నింటికంటే అత్యున్నత స్థాయి అయిన సూపర్ 1000 టైటిల్స్ మూడు ఉన్నాయి. మరో రెండు టోర్నీల్లో యంగ్ రన్నరప్‌గా నిలిచింది. ఒక్కమాటలో చెప్పాలంటే మరో ప్లేయర్ ఎవరూ ఆమె దరిదాపుల్లోకి కూడా రాని విధంగా ఏకఛత్రాధిపత్యంతో ఈ కొరియా అమ్మాయి ఆటను శాసించింది. విశ్వవిజేతగా... నంబర్‌వన్‌గా... ఆన్ సె యంగ్ సత్తా, స్థాయి ఏమిటో ఇతర అగ్రశ్రేణి స్టార్ షట్లర్లతో ముఖాముఖీ సమరాల్లోనే తెలుస్తుంది. పీవీ సింధుపై ఏకపక్ష ఆధిపత్యం మాత్రమే కాదు... ప్రపంచ బ్యాడ్మింటన్‌లో రికార్డు స్థాయిలో 214 వారాల పాటు వరల్డ్ నంబర్ ఉన్న తై జు యింగ్, మరీన్, ఒకుహారాలపై విజయాలపరంగా ఆమెదే పైచేయి. 2016 నుంచి ఇటీవలి వరకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించిన తై జుపై 10–3 విజయాల ఆధిక్యం ఉందంటే ఆమె స్థానాన్ని యంగ్ అందుకొని కొత్త తరం ఘనతకు శ్రీకారం చుట్టినట్లే. 2023లో మరో మూడు ప్రత్యేకతలు యంగ్‌ను వరల్డ్ బ్యాడ్మింటన్‌లో హాట్ స్టార్‌ను చేశాయి. డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఆమె ఈ ఘనత సాధించిన తొలి కొరియా మహిళగా రికార్డులకెక్కింది. హాంగ్జూలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం సాధించి ఇక్కడా కొరియా తరఫున తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. ఇన్ని విజయాల తర్వాత సహజంగానే ర్యాంకింగ్స్‌లో శిఖరానికి చేరడం లాంఛనంగానే మిగిలింది. ఊహించినట్లుగానే ఆగస్టులో వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచి ఆపై వరుస టైటిల్స్‌లో తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఒలింపిక్స్‌లో అనూహ్యంగా క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగినా... ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ మాత్రం పతకం కోసం ఆమెను పిలుస్తోంది. యంగ్ ప్రస్తుత ఫామ్ చూస్తే అదేమీ పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ కొరియా ప్లేయర్ ఇప్పటికే సాధించిన ఘనతలే చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 22 ఏళ్ల వయసులోనే ఈ స్థాయిలో చెలరేగుతున్న ఆమె మున్ముందు ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీకి సాత్విక్ జోడీ దూరం
-
Indonesia Masters: మెయిన్ ‘డ్రా’కు కిరణ్ జార్జి అర్హత
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. జకార్తాలో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లోనూ ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి గెలుపొందాడు. కేరళకు చెందిన 23 ఏళ్ల కిరణ్ తొలి రౌండ్లో 12–21, 21–18, 22–20తో లానియర్ (ఫ్రాన్స్)పై, రెండో రౌండ్లో 21–17, 12–21, 21–15తో రుస్తావిటో (ఇండోనేసియా)పై నెగ్గాడు. -
ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ.. తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన శ్రీకాంత్
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలోని రెండో టోర్నమెంట్లోనూ భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ నుంచి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. 47 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 22–24, 13–21తో ప్రపంచ 18వ ర్యాంకర్ లీ చెయుక్ యి (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీకంటే ముందు మలేసియా ఓపెన్‌లో ఆడిన శ్రీకాంత్ రెండో రౌండ్లో ఓటమి చవిచూశాడు. మరోవైపు పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 78 నిమిషాల్లో 21–15, 19–21, 21–16తో ఫాంగ్ చి లీ–ఫాంగ్ జెన్ లీ (చైనీస్ తైపీ) జోడీపై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో తనీషా క్రాస్టో–అశి్వని పొన్నప్ప (భారత్) జంట 5–21, 21–18, 11–21తో జాంగ్కోల్ఫన్–ప్రజోంగ్‌జాయ్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
పీవీ సింధు పునరాగమనం
న్యూఢిల్లీ: మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న భారత మహిళా స్టార్ షట్లర్ పీవీ సింధు వచ్చే నెలలో జరిగే ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌తో పునరాగమనం చేయనుంది. ఫిబ్రవరి 13 నుంచి 19 వరకు మలేసియాలోని షా ఆలమ్‌లో జరిగే ఈ టోరీ్నలో పాల్గొనే భారత మహిళల, పురుషుల జట్లను మంగళవారం ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్‌లో ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొన్నాక సింధు మోకాలి గాయంతో ఆటకు దూరమైంది. ప్రస్తుతం బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో ఇండోనేసియా కోచ్ అగుస్ ద్వి సాంతోసో పర్యవేక్షణలో సింధు శిక్షణ తీసుకుంటోంది. భారత మహిళల జట్టు: సింధు, అన్మోల్, తన్వీ శర్మ, అష్మిత, ట్రెసా జాలీ, గాయత్రి గోపీచంద్, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ప్రియా దేవి, శ్రుతి మిశ్రా. భారత పురుషుల జట్టు: ప్రణయ్, లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, చిరాగ్ సేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, అర్జున్, సూరజ్ గోలా, పృథ్వీ రాయ్. -
Malaysia Open 2024: కిడాంబి శ్రీకాంత్ సంచలనం
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ సంచలన విజయంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 12–21, 21–18, 21–16తో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తదుపరి రౌండ్లో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో శ్రీకాంత్ తలపడతాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప–తనీషా (భారత్) జోడీ 21–13, 21–16తో ఫ్రాన్సెస్కా కోర్బి–అలీసన్ లీ (అమెరికా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
శ్రీకాంత్‌కు సవాల్.. నేటి నుంచి మలేసియా ఓపెన్
కౌలాలంపూర్: గత సీజన్ భారత స్టార్ షట్లర్లకు మిశ్రమ ఫలితాలిచి్చంది. కానీ ఇప్పుడు ఒలింపిక్ నామ సంవత్సరం కావడంతో మన బ్యాడ్మింటన్ ఆటగాళ్లంతా నూతనోత్సాహంతో కొత్త సీజన్‌కు శ్రీకారం చుట్టేపనిలో ఉన్నారు. నేటి నుంచి జరిగే మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో శుభారంభమే లక్ష్యంగా మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, ప్రపంచ 8వ ర్యాంకర్ ప్రణయ్, డబుల్స్‌లో అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కోటి ఆశలతో కొత్త ఏడాదిని విజయవంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. నేడు జరిగే తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో శ్రీకాంత్, వెంగ్ హాంగ్ యంగ్ (చైనా)తో లక్ష్య సేన్ తలపడతారు. -
ఏపీ క్రీడా సంబురం: టాలెంట్ హంట్‌లో CSK.. ఇంకా
సాక్షి, గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘ఆడుదాం ఆంధ్రా’’ పోటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి పట్టం కట్టేందుకు వీలుగా ప్రవేశపెట్టిన అతిపెద్ద క్రీడోత్సవాన్ని గుంటూరులో ఆరంభించారు. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ ఇందుకు వేదికైంది. దేశచరిత్రలోనే మైలురాయి పోటీల ప్రారంభం సందర్భంగా సీఎం వైస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ఈ క్రీడా సంబురాలు దేశ చరిత్రలోనే మైలురాయి. ఈ రోజు నుంచి... 47 రోజులపాటు ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను నిర్వహించనున్నాం. ఆడుదాం ఆంధ్రా గొప్ప పండుగ. మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి వ్యాయామం వల్ల బీపీ, డయాబెటిక్.. అదుపులో ఉంటాయి. గ్రామస్థాయిలో క్రీడలు ఎంతో అవసరం. అందుకే..గ్రామస్థాయి నుంచి అడుగులేస్తున్నాం. గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతికి .. దేశానికి అందిస్తాం. క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో.. తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో.. పోటీలు జరుగుతాయి. 9 వేల ప్లే గ్రౌండ్స్ రెడీగా ఉన్నాయి. 47 రోజుల్లో.. 5 దశల్లో పోటీల నిర్వహణ ఉంటుంది. ఈ క్రీడా సంబురాలు ప్రతి ఏడాది జరుగుతాయి. రూ.12 కోట్లకు పైగా నగదు బహుమతులు అందజేస్తాం’’ అని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో భాగంగా.. ►తొలి దశలో.. జనవరి 9వ తేదీ వరకు.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పోటీలు.. ►జనవరి 10 నుంచి 23 వరకు.. మండల స్థాయిలో పోటీలు.. ►జనవరి 24 నుంచి 30 వరకు.. నియోజకవర్గ స్థాయిలో పోటీలు.. ►ఫిబ్రవరి 6వ తేదీ నుంచి.. 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. అదే విధంగా ఉదయం 5 గంటల నుంచి.. సాయంత్రం 7 గంటల వరకు.. పోటీలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. ఆడుదాం ఆంధ్ర- మరిన్ని విశేషాలు ►రిఫరీలుగా.. 1.50 లక్షల మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ►పోటీ పడనున్న.. 34.19 లక్షల క్రీడాకారులు ►వీరిలో.. 10 లక్షల మందికిపైగా మహిళలు.. రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం ►గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను.. ప్రోత్సాహించాలనే లక్ష్యంతో.. రూ.119.19 కోట్లతో సీఎం జగన్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పోటీలను నిర్వహిస్తోంది. దాదాపు రూ.42 కోట్లతో..క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో.. కబడ్డీ క్రీడాకారులకు అవసరమైన.. 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లు ప్రతి సచివాలయానికి సరఫరా చేశారు. ►ప్రొఫెషనల్ టోర్నీ తరహాలో.. మండలస్థాయిలో 17.10 లక్షల .. టీ షర్టులు, టోపీలతో కూడిన కిట్లు. ప్రొఫెషనల్స్‌ను గుర్తించేందుకు..ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం ►క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్.. ఆంధ్రా క్రికెట్ ఆసోషియేషన్ ►బ్యాడ్మింటన్‌లో సింధు.. శ్రీకాంత్ బృందాలు ►వాలీబాల్‌లో ప్రైమ్ వాలీబాల్.. ►కబడ్డీలో- ప్రొకబడ్డీ ఆర్గనైజర్లు.. ►ఖోఖోలో- రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులు.. టాలెంట్ హంట్ చేయనున్నారు. ►ఆన్లైన్, ఆఫ్ లైన్లో.. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించేందుకు.. ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనంతరం.. వివిధ స్థాయిల్లో అంతర్జాతీయ శిక్షణ ఇప్పించి.. ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో.. అవకాశం కల్పించే దృక్పథంతో.. పోటీలను సీఎం జగన్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
క్వార్టర్స్‌లో అచ్యుతాదిత్య–హర్షవర్ధన్ జోడీ
గువాహటి: హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కీలకదశలో పాయింట్లు గెలిచిన దొడ్డవరపు అచ్యుతాదిత్య రావు–వెంకట హర్షవర్ధన్ (భారత్) జోడీ... గువాహటి ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణకు చెందిన అచ్యుతాదిత్య, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్షవర్ధన్ ద్వయం 24–22, 23–21తో నాలుగో సీడ్ వె చున్ వె–వు గువాన్ జున్ (చైనీస్ తైపీ) జంటను బోల్తా కొట్టించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయి సామియా 15–21, 21–18, 13–21తో రెండో సీడ్ వెన్ చి సు (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ 21–13, 19–21, 17–21తో చూంగ్ హోన్ జియాన్–గో పె కీ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–సుమీత్ జోడీ
గువాహటి: స్వదేశంలో జరుగుతున్న గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 20–22, 21–15, 21–16తో రఫ్లీ రమంద–ఇందా సరి జమీల్ (ఇండోనేసియా) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 21–14, 17–21, 7–21తో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో... తరుణ్ 11–21, 14–21తో జియా జెంగ్ జేసన్ (సింగపూర్) చేతిలో... ప్రణయ్ 12–21, 17–21తో కార్తికేయ (భారత్) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో హైదరాబాద్ అమ్మాయి సామియా 21–12, 21–11తో తెలంగాణకే చెందిన గద్దె రుత్విక శివానిపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
రన్నరప్ అశ్విని–తనీషా జోడీ
లక్నో: సయ్యద్ మోడి వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఈసారి భారత జట్టు క్రీడాకారులకు ఒక్క టైటిల్ కూడా లభించలేదు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అశ్విని–తనీషా ద్వయం 14–21, 21–17, 15–21తో రిన్ ఇవనాగ–కీ నకనిషి (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన అశ్విని–తనీషాలకు 7,980 డాలర్ల (రూ. 6 లక్షల 64 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో యు జెన్ చి (చైనీస్ తైపీ) 20–22, 21–12, 21–17తో ప్రపంచ 12వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)పై సంచలన విజయం సాధించి టైటిల్ దక్కించుకున్నాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) 21–19, 21–16తో లినె హొమార్క్ (డెన్మార్క్)ను ఓడించి విజేతగా నిలిచింది. -
శ్రీకాంత్ మరో పరాజయం
లక్నో: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. మాజీ ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఈ ఏడాది తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోతున్నాడు. సొంతగడ్డపై జరుగుతోన్న సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ టోర్నీలోనూ శ్రీకాంత్ ఆటకు మొదటి రౌండ్లోనే తెరపడింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ శ్రీకాంత్ 21–23, 8–21తో చైనీస్ తైపీకి చెందిన చియా హవొ లీ చేతిలో వరుస గేముల్లో పరాజయం చవి చూశాడు. ఇతర మ్యాచ్‌ల్లో కిరణ్ జార్జ్ 21–16, 14–21, 21–13తో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ చిరాగ్ సేన్‌పై గెలుపొందగా, సమీర్ వర్మ 9–21, 21–7, 17–21తో వాంగ్ జు వి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. ప్రియాన్షు రజావత్ 21–17, 21–19తో డిమిట్రి పనరిన్ (కజకిస్తాన్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో క్లిష్టమైన డ్రా ఎదురవడంతో మాల్విక బన్సోద్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఆమె 21–18, 17–21, 10–21తో జపాన్ స్టార్ నజొమి ఒకుహర చేతిలో ఓడిపోయింది. భారత సహచరుల మధ్య జరిగిన పోరులో ఉన్నతి హుడా 15–21, 21–19, 21–18తో ఆకర్షి కశ్యప్‌పై గెలుపొందగా, క్వాలిఫయర్ కేయూర 8–21, 16–21తో ఎనిమిదో సీడ్ సంగ్ షు యున్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్ గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో గాయత్రీ–ట్రెసా జాలీ జోడీ 21–9, 21–16తో భారత్‌కే చెందిన అపూర్వ –సాక్షి గెహ్లావత్ జంటపై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్ మొదటి రౌండ్లో కోన తరుణ్–శ్రీకృష్ణప్రియ జంటకు 14–21, 15–21తో నితిన్ కుమార్–నవధ మంగళం జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
China Masters: సెమీస్‌లో సాత్విక్–చిరాగ్..
షెన్జెన్: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి–చిరాగ్ శెట్టి జోడీ ఈ ఏడాది మరో టైటిల్‌పై కన్నేసింది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్‌సీడ్ భారత ద్వయం సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్‌కి క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 21–16, 21–14తో ఇండోనేసియాకు చెందిన లియో రాలీ కార్నడో–డానియెల్ మారి్టన్ జంటపై అలవోక విజయం సాధించింది. ప్రపంచ ఐదో ర్యాంకు జోడీ అయిన సాత్విక్–చిరాగ్ వరుస గేముల్లో 46 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించింది. తొలి గేమ్‌లో 14–14 స్కోరు దాకా ఇండోనేసియన్ జోడీ నుంచి కొంతవరకు పోటీ ఎదురైనా... ఆ తర్వాత భారత షట్లర్ల ధాటికి ప్రత్యర్థి జంట చతికిలబడింది. తర్వాత రెండో గేమ్‌ను సాత్విక్–చిరాగ్‌లు రెట్టించిన ఉత్సాహంతో మొదలుపెట్టారు. 5–2తో ఆధిక్యంలోకి వెళ్లారు. నెట్‌వద్ద పొరపాట్లతో కొన్ని పాయింట్లు కోల్పోయినప్పటికీ వెంటనే పుంజుకొని ఆడటంతో మళ్లీ ఆధిక్యం 11–6కు పెరిగింది. ఇండోనేసియన్ షట్లర్లు ఆ తర్వాత కోలుకోలేదు. 17–10తో గేమ్‌ను చేతుల్లోకి తెచ్చుకున్న భారత అగ్రశ్రేణి జంట నిమిషాల వ్యవధిలోనే 21–14తో మ్యాచ్‌ను మగించేశారు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న భారత జంట ఇండోనేసియా సూపర్–1000, కొరియా సూపర్–500, స్విస్ సూపర్–300 టైటిళ్లను సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో చైనాకు చెందిన జి తింగ్–రెన్ జియాంగ్ యు జంటతో సాత్విక్–చిరాగ్ జోడీ తలపడుతుంది. పురుషుల సింగిల్స్ ప్రపంచ 8వ ర్యాంకర్ ప్రణయ్‌కి క్వార్టర్స్‌లో ఏదీ కలిసిరాలేదు. 31 ఏళ్ల భారత షట్లర్ 9–21, 14–21తో జపాన్ ఆటగాడు, మూడో సీడ్ కొడయ్ నరవొక చేతిలో సులు వుగానే ఓడిపోయాడు. తొలిగేమ్‌లో నరవొకకు 9–8తో పోటీ ఇచ్చిన భారత ఆటగాడు తర్వాత వరుసగా అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ నరవొక తొలిగేమ్‌లో తన రాకెట్‌ను నెట్‌పై పరిధి దాటిరావడంతో చైర్ అంపైర్ అతని పాయింట్‌ను తిరస్కరించాడు. అయితే ప్రణయ్ అందివచ్చిన అవకాశాల్ని ఒడిసిపట్టలేక పదేపదే పొరపాట్లు చేసి మ్యాచ్‌ను అప్పగించాడు. -
శ్రీకాంత్ పరాజయం
షెన్జెన్: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్‌లకు నిరాశ ఎదురైంది. ఈ ముగ్గురూ తొలి రౌండ్‌ను దాటలేకపోయారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 15–21, 21–14, 13–21తో ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 19–21, 18–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ షి యు కి (చైనా) చేతిలో... 30వ ర్యాంకర్ ప్రియాన్షు 17–21, 14–21తో 13వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్) ద్వయం 15–21, 9–21తో షు జియాన్ జాంగ్–యు జెంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
పోరాడి ఓడిన ప్రణయ్
కుమమోటో: జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ ఓటమి చవిచూశాడు. ప్రపంచ 12వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 21–19, 16–21, 19–21తో పరాజయం పాలయ్యాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్ గెలిచినా ఆ తర్వాత తడబడి వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రణయ్ ఓ దశలో 4–12తో వెనుకబడినప్పటికీ పట్టువదలకుండా పోరాడి చివరకు స్కోరును 19–19తో సమం చేశాడు. అయితే చౌ తియెన్ చెన్ కీలకదశలో రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్‌కు 1,470 డాలర్ల (రూ. లక్షా 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 3600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్లో ప్రణయ్ విశేషంగా రాణించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించాడు. మలేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన ఈ కేరళ ప్లేయర్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. -
తొలి రౌండ్లోనే సాత్విక్–చిరాగ్ జోడీకి చుక్కెదురు
కుమమోటో: జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి టాప్ సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంక్ ద్వయం సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–16, 18–21, 16–21తో ప్రపంచ 21వ ర్యాంక్ జంట లూ చింగ్ యావో–యాంగ్ పో హాన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్, చిరాగ్ తొలి గేమ్ గెలిచినా ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకున్నారు. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కొడాయ్ నరోకా (జపాన్)తో లక్ష్య సేన్; లీ చెయుక్ యి (హాంకాంగ్)తో హెచ్ఎస్ ప్రణయ్; లిన్ చున్‌యి (చైనీస్ తైపీ)తో ప్రియాన్షు రజావత్ తలపడతారు. -
అమలాపురంలో ఆఖరి బెంచీలో కూర్చునే అబ్బాయి.. ఆటలో సత్తా చాటినవాడే మొనగాడు!
ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్‌ను చూస్తూ పెరిగాడు. ముందుగా తండ్రి ఆట అతడిని ఆకట్టుకుంది. ఆపై సోదరుడి ఆట తనలో మరింత స్ఫూర్తిని పెంచింది. ఏదో సరదా కోసం ఆడుతున్నామని గానీ లేదంటే మరో క్రీడ గురించి గానీ అతని మనసులో ఏనాడూ కనీసం ఆలోచన కూడా రాలేదు. బ్యాడ్మింటన్ తనను ప్రత్యేకంగా పిలిచినట్లే అతను భావించాడు. అందుకే ఓనమాలు నేర్చుకున్ననాటి నుంచి అదే లోకంగా బతికాడు. కఠోర సాధన కారణంగా ఆటలో పదును పెరగడమే కాదు అన్ని రకాల అండ కూడా లభించింది. దాంతో అద్భుతమైన ఆటతో దూసుకుపోయాడు. వరుస విజయాలు, టైటిల్స్ తన ఖాతాలో వేసుకోవడమే కాదు, ఇప్పుడు వరల్డ్ నంబర్‌వన్‌గా భారత బ్యాడ్మింటన్ డబుల్స్‌లో కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. ఆ కుర్రాడే రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్. సహచరుడు చిరాగ్ శెట్టితో కలసి వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకున్న సాత్విక్ 23 ఏళ్ల వయసులోనే తన సంచలన ప్రదర్శనతో ప్రపంచ ఖ్యాతినార్జించాడు. చాలా మంది కోచ్‌లు చెప్పే మాటే ‘కొద్ది రోజుల్లోనే మీ అబ్బాయి భారత్ తరఫున ఆడతాడు’... మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టి అడ్మిషన్ కోసం అకాడమీకి వెళ్లినప్పుడు సాత్విక్ తండ్రి విశ్వనాథ్‌తో అక్కడి కోచ్ చెప్పిన మాట. అయితే సహజంగానే ఒక టీనేజర్‌ను నిరాశపరచకుండా ఉత్సాహం పెంచేందుకు చాలా మంది కోచ్‌లు చెప్పే మాటే అది. కాబట్టి దానిని వర్ధమాన ఆటగాళ్లకు సంబంధించి భవిష్యవాణిగా భావించనవసరం లేదు. సాత్విక్ తండ్రి కూడా అలాగే అనుకున్నారు. కోచ్ మాటలకు ఉప్పొంగిపోకుండా ఆటలో.. తమ అబ్బాయి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదగాలని కోరుకున్నారు. కానీ సాత్విక్ వారందరి అంచనాలకు మించి రాణించాడు. ఊహించిన దానికంటే వేగంగా దూసుకుపోయి కొద్ది రోజుల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరాగ్ శెట్టితో జత కలసిన తర్వాత అయితే అతని ఖాతాలో అన్నీ ఘనతలే వచ్చి చేరాయి. సరిగ్గా చెప్పాలంటే వీరిద్దరూ ఎక్కడ విజయం సాధించినా అది భారత్ తరఫున కొత్త రికార్డుగా, ‘తొలి విజయం’గా నమోదవుతూ వచ్చింది. ఇంత తక్కువ వ్యవధిలో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తమదైన ముద్ర వేసి ప్రత్యర్థులకు సవాల్ విసరడం ఈ జోడీకే చెల్లింది. అండర్–13 నుంచే.. అమలాపురానికి చెందిన సాత్విక్ తండ్రి.. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. తల్లి రంగమణి కూడా ఉపాధ్యాయినే. వారిద్దరి ప్రోత్సాహం కారణంగా క్రీడల్లోకి రావడం సాత్విక్‌కి ఏం ఇబ్బంది కాలేదు. తండ్రి ఏపీ బ్యాడ్మింటన్ సంఘం పరిపాలనా వ్యవహారాల్లో కూడా పని చేస్తుండటంతో సరైన మార్గనిర్దేశనమూ లభించింది. అయితే నేపథ్యం ఎలా ఉన్నా ఆటలో సత్తా చాటినవాడే మొనగాడు. బేసిక్స్ నేర్చుకున్న తర్వాత సాత్విక్ వరుసగా స్థానిక, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించాడు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లోనూ అతనికి వరుసగా విజయాలు దక్కాయి. దాంతో తర్వాతి దశకు చేరడంపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. స్వస్థలంలో ఉంటే అది సాధ్యం కాదని, అత్యుత్తమ శిక్షణ అవసరమని సాత్విక్ తల్లిదండ్రులు గుర్తించారు. ఆ ప్రయత్నంలోనే వారి ప్రయాణం పుల్లెల గోపీచంద్ అకాడమీ వరకు సాగింది. అదే సాత్విక్ కెరీర్లో కీలక మలుపుగా మారింది. పదునెక్కిన ఆట.. సాత్విక్ కెరీర్‌కు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయం పూర్తిగా డబుల్స్పైనే దృష్టి పెట్టడం. సాధారణంగా కొత్త ఆటగాళ్లు ఎవరైనా సింగిల్స్‌లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తారు. గెలిచినా, ఓడినా అదే ఈవెంట్లో పోరాడటం కనిపిస్తుంది. కానీ సాత్విక్ కెరీర్లో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భారత ఆటగాళ్లలో సింగిల్స్‌లో తీవ్రమైన పోటీ ఉంది. అలాంటి సమయంలో మళ్లీ సింగిల్స్‌లో ప్రయత్నించడం కంటే డబుల్స్ వైపు మళ్లడమే సరైందని అతను భావించాడు. చివరకు అదే అతడిని అగ్రస్థానానికి చేర్చింది. ఇండియా ఇంటర్నేషనల్ జూనియర్లో జి.కృష్ణప్రసాద్‌తో కలసి వరుసగా రెండేళ్లు రన్నరప్, విన్నర్‌గా నిలిచిన సాత్విక్ సీనియర్ స్థాయికి వచ్చేసరికి భాగస్వామిని మార్చాల్సి వచ్చింది. ఇష్టం లేకపోయినా వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా టీమ్ అవసరాల కోసం అది తప్పలేదు. పురుషుల డబుల్స్‌లో భారత్ నుంచి ఒక అత్యుత్తమ జోడీని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్న గోపీచంద్ కోచింగ్ బృందానికి సాత్విక్ రూపంలో సరైన ఆటగాడు లభించాడు. అతనికి మరో మెరుపులాంటి చిరాగ్ శెట్టి తోడైతే ఫలితాలు బాగుంటాయని భావించి కొత్త ద్వయం కోర్ట్‌లో బాల్ వేశారు. అది అద్భుతమైన ఫలితాలను అందించింది. సాత్విక్–చిరాగ్ జంట ఆరు ఇంటర్నేషనల్ చాలెంజర్ టోర్నీలను గెలిచి తమపై పెట్టుకున్న అంచనాలకు తగిన న్యాయం చేసింది. ఆ తర్వాత చాలెంజర్ దశను దాటి పెద్ద విజయాలు సాధించడమే మిగిలింది. గోల్డ్కోస్ట్తో మొదలు.. సాధారణంగా డబుల్స్ జోడి మ్యాచ్ అంటే ఇద్దరూ దాదాపు సమ ఉజ్జీలుగా ఉండి మంచి సమన్వయంతో ఆడటం కనిపిస్తుంది. డబుల్స్ ఆడినా కూడా ఆ జంటలో ఒక ప్లేయర్ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకోవడం అరుదు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో సాత్విక్ ప్రదర్శన అందుకు చక్కటి ఉదాహరణ. ఈ టోర్నీ మూడో సీజన్లో హైదరాబాద్ హంటర్స్ టైటిల్ గెలవడంతో సాత్విక్ కూడా కీలక పాత్ర పోషించాడు. డబుల్స్ మ్యాచ్‌లలో తనదైన ప్రభావం చూపించడంతో అతని ఆట ఏమిటో బ్యాడ్మింటన్ ప్రపంచానికి బాగా తెలిసింది. ఆ తర్వాతే అందరి దృష్టి సాత్విక్‌పై పడింది. అయితే 2018.. అతని కెరీర్‌కు కావాల్సిన ఊపునిచ్చింది. సొంతగడ్డపై హైదరాబాద్ ఓపెన్ గెలిచి ఈ జంట తమ ఖాతాలో తొలి టైటిల్ వేసుకుంది. అదే ఏడాది అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ కూడా వీరి చెంతకే చేరింది. అనంతరం గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలు వీరి స్థాయిని అమాంతం పెంచేశాయి. ఈ ఈవెంట్లో పురుషుల డబుల్స్‌లో రజతం నెగ్గిన సాత్విక్–చిరాగ్ జోడి స్వర్ణం సాధించిన మిక్స్డ్ టీమ్‌లో కూడా భాగంగా ఉంది. ఆ తర్వాత నుంచి ఈ ద్వయం వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అన్నీ ఘనతలే.. ఐదేళ్ల క్రితం జరిగిన కామన్వెల్త్ క్రీడల తర్వాత సాత్విక్–చిరాగ్‌ల విజయ ప్రస్థానం జోరుగా సాగిపోయింది. గతంలో పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు ఎవరికీ సాధ్యం కాని ఘనతలన్నీ వీరు అందుకుంటూ పోయారు. ఎక్కడ గెలిచినా అది మన దేశం తరఫున తొలి ఘనతగానే నమోదైంది. సూపర్ 500, సూపర్ 750, సూపర్ 1000.. ఇలా ప్రతిసారీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకుంటూ పోయారు. థాయిలాండ్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్.. బీడబ్ల్యూఎఫ్ సర్క్యూట్లో సాత్విక్ అత్యుత్తమ విజయాలు నమోదయ్యాయి. 2022లో జరిగిన బర్మింగ్హమ్ కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణం, తాజాగా ఆసియా క్రీడల్లో స్వర్ణం వారి స్థాయిని తెలియజేశాయి. గత ఏడాది వరల్డ్ చాంపియన్ షిప్లో కాంస్యం దక్కడం కూడా సాత్విక్–చిరాగ్ అద్భుతమైన విజయాల్లో ఒకటి కాగా, ఇప్పుడు వరల్డ్ నంబర్‌వన్ కిరీటం కూడా వచ్చి చేరింది. ఇక మిగిలింది ఒలింపిక్స్‌లో స్వర్ణమే. వచ్చే ఏడాది అదీ సాధిస్తే 24 ఏళ్ల వయసులోనే సాత్విక్ కెరీర్ పరిపూర్ణం కావడం ఖాయం. కొడితే కొట్టాలిరా.. సాత్విక్ స్వయంగా చెప్పుకున్నట్లు అమలాపురంలో ఆఖరి బెంచీలో కూర్చునే అబ్బాయి ఇప్పుడు ప్రధానమంత్రి పక్కన కూర్చోవడం చాలా పెద్ద ఘనత. అదేమీ ఒక్కరోజులో సాధ్యం కాలేదు. దాని వెనుక ప్రతిభతో పాటు కఠోర శ్రమ, సంకల్పం, పట్టుదల ఉన్నాయి. సాధనలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా సుదీర్ఘ సమయం పాటు పడిన కష్టం ఉంది. సాత్విక్ ఫిట్నెస్ లెవెల్స్ అద్భుతం. అతని ఆట శైలిలో స్మాష్ ఒక ప్రధాన ఆయుధం. ఎగిరి స్మాష్ కొడితే ఎంతటి ప్రత్యర్థి అయినా రిటర్న్ చేయలేక తలవంచాల్సిందే. ఇదే స్మాష్‌తో అతను ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పడం విశేషం. యోనెక్స్ ఫ్యాక్టరీలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలో అతను కొట్టిన స్మాష్ గంటకు 565 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించడం విశేషం. ఇది గిన్నిస్ బుక్ రికార్డుగా నమోదైంది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
గౌస్–పూజ జోడీకి స్వర్ణం
సాక్షి, అమరావతి: జాతీయ క్రీడల్లో భాగంగా బ్యాడ్మింటన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణ పతకం లభించింది. గోవాలో జరుగుతున్న ఈ క్రీడల్లో మంగళవారం ముగిసిన మిక్స్డ్ డబుల్స్ విభాగంలో షేక్ గౌస్–పూజ (ఆంధ్రప్రదేశ్) జోడీ విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో షేక్ గౌస్–పూజ ద్వయం 21–8, 21–17తో బొక్కా నవనీత్–కె.మనీషా (తెలంగాణ) జంటను ఓడించింది. ఫైనల్లో ఓడిన నవనీత్–మనీషా జోడీకి రజతం దక్కింది. తరుణ్‌కు పసిడి పతకం సింగిల్స్ విభాగంలో తెలంగాణకు రెండు పతకాలు దక్కాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో మన్నేపల్లి తరుణ్ స్వర్ణ పతకాన్ని, మహిళల సింగిల్స్‌లో మారెడ్డి మేఘన రెడ్డి కాంస్య పతకాన్ని గెల్చుకున్నారు. ఫైనల్లో తరుణ్ 21–15, 16–21, 21–15తో సౌరభ్ వర్మ (మధ్యప్రదేశ్)పై నెగ్గగా... సెమీఫైనల్లో మేఘన రెడ్డి 21–7, 22–24, 16–21తో అదితి భట్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయింది. సౌరభ్ వర్మతో 70 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో నిర్ణాయక చివరి గేమ్‌లో తరుణ్ స్కోరు 15–15 వద్ద వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లో తరుణ్ 12–21, 21–14, 22–20తో జాతీయ చాంపియన్ మిథున్ (కర్ణాటక)ను ఓడించడం విశేషం. -
Asian Games 2023: చరిత్ర సృష్టించిన భారత్.. బ్యాడ్మింటన్‌లో తొలి స్వర్ణం
ఏషియన్ గేమ్స్-2023 పతకాల వేటలో భారత్ దూసుకుపోతుంది. పతకాలకు సంబంధించి ఇవాళ ఉదయమే సెంచరీ మార్కు తాకిన భారత్ తాజాగా మరో స్వర్ణం సాధించింది. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత జోడీ చిరాగ్ షెట్టి, సాత్విక్ సాయిరాజ్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం.. సౌతా కొరియా జోడీ కిమ్-చోయ్‌పై 21-18, 21-16 వరుస సెట్లలో విజయం సాధించి, చరిత్ర సృష్టించింది. FIRST BADMINTON GOLD FOR INDIA🇮🇳🇮🇳😭😭❤️❤️ History has been scripted in Hangzhou as @Shettychirag04 and @satwiksairaj become the first ever badminton players from India to win gold at the #AsianGames 🥇💯 The 'Brothers of Destruction' defeated South Korea's Kim-Choi in the… pic.twitter.com/X87O5owODf — The Bridge (@the_bridge_in) October 7, 2023 #AsianGames2023 #AsianGames #Cheer4India #IndiaAtAG22 #India 🇮🇳 #SatwiksairajRankireddy and #ChiragShetty after their historic #Badminton gold 🥇 FOLLOW LIVE: https://t.co/38IQLKfS9H@WeAreTeamIndia pic.twitter.com/80fk2YpHIX — TOI Sports (@toisports) October 7, 2023 ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. గతంలో భారత్ ఎన్నడూ ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ సాధించలేదు. ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు ఇది (బ్యాడ్మింటన్‌లో) మూడో పతకం. పురుషుల టీమ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్, పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ కాంస్య పతకం సాధించారు. బ్యాడ్మింటన్ గోల్డ్‌తో భారత్ పతకాల సంఖ్య 101కి (26 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు) చేరింది. India creates history at the #AsianGames in winning Gold in the men’s doubles in badminton! Congratulations to @satwiksairaj and @Shettychirag04 for their spectacular performance! Kudos to our very our very own @satwiksairaj for making me, all of Andhra Pradesh and India proud!… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 7, 2023 అభినందనలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏషియన్ గేమ్స్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం నెగ్గిన సాత్విక్‌సాయిరాజ్-చిరగ్ షెట్టి ద్వయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. సాత్విక్‌సాయిరాజ్‌ను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. సాత్విక్ నాతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ గర్వపడేలా చేశాడని కొనియాడాడు. -
సాత్విక్–చిరాగ్ జోడీ కొత్త చరిత్ర
ఈ ఏడాది తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారతీయ జోడీగా రికార్డు నెలకొల్పింది. హాంగ్జౌలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–17, 21–12తో మాజీ ప్రపంచ చాంపియన్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)పై గెలిచింది. 46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ కళ్లు చెదిరే స్మాష్‌లతో, చక్కటి డిఫెన్స్‌తో ప్రత్యర్థి జోడీ ఆట కట్టించారు. నేడు జరిగే ఫైనల్లో చోయ్ సోల్ జియు–కిమ్ వన్ హో (దక్షిణ కొరియా) జంటతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. తాజా ప్రదర్శనతో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ వచ్చే మంగళవారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్‌సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకునే అవకాశముంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ప్రణయ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. పూర్తి ఫిట్నెస్తో లేకుండానే సెమీఫైనల్ ఆడిన ప్రణయ్ 16–21, 9–21తో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
Asian Games 2023: అదే జోరు...
వంద పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడాకారుల బృందం ఆ దిశగా సాగుతోంది. పోటీలు మొదలైన తొలి రోజు నుంచే పతకాల వేట మొదలు పెట్టిన భారత క్రీడాకారులు దానిని వరుసగా తొమ్మిదోరోజూ కొనసాగించారు. ఆదివారం ఈ క్రీడల చరిత్రలోనే ఒకేరోజు అత్యధికంగా 15 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు సోమవారం ఏడు పతకాలతో అలరించారు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న అథ్లెట్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించగా... ఎవరూ ఊహించని విధంగా రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్య పతకాలు వచ్చాయి. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో సుతీర్థ–అహిక ముఖర్జీ సంచలన ప్రదర్శనకు కాంస్య పతకంతో తెరపడింది. ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, స్క్వా‹Ùలోనూ భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యం చాటుకొని పతకాల రేసులో ముందుకెళ్లారు. తొమ్మిదో రోజు తర్వాత ఓవరాల్‌గా భారత్ 13 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 60 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: షూటర్ల పతకాల వేట ముగిసినా వారిని స్ఫూర్తిగా తీసుకొని భారత అథ్లెట్స్ ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. సోమవారం భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. అందులో అథ్లెట్స్ మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి నాలుగు అందించారు. రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్యాలు, టేబుల్ టెన్నిస్‌లో ఒక కాంస్యం దక్కింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ఆసియా చాంపియన్, భారత స్టార్ పారుల్ చౌధరీ రజత పతకం నెగ్గగా... భారత్‌కే చెందిన ప్రీతి కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ చాంపియన్ యావి విన్‌ఫ్రెడ్ ముతిలె తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. కెన్యాలో జని్మంచిన 23 ఏళ్ల యావి విన్‌ఫ్రెడ్ 2016లో బహ్రెయిన్‌కు వలస వచ్చి అక్కడే స్థిరపడింది. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో బహ్రెయిన్ తరఫున పోటీపడుతోంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకం నెగ్గిన యావి విన్‌ఫ్రెడ్ ఈసారీ తన ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. యావి విన్‌ఫ్రెడ్ 9ని:18.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలువగా... పారుల్ 9ని:27.63 సెకన్లతో రెండో స్థానాన్ని... ప్రీతి 9ని:43.32 సెకన్లతో మూడో స్థానాన్ని సంపాదించారు. ఆన్సీ అదుర్స్... మహిళల లాంగ్‌జంప్‌లో కేరళకు చెందిన 22 ఏళ్ల ఆన్సీ సోజన్ ఇడపిలి రజత పతకంతో సత్తా చాటుకుంది. తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న ఆన్సీ సోజన్ 6.63 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. షికి జియాంగ్ (చైనా; 6.73 మీటర్లు) స్వర్ణం... యాన్ యు ఎన్గా (హాంకాంగ్; 6.50 మీటర్లు) కాంస్యం గెలిచారు. భారత్‌కే చెందిన శైలి సింగ్ (6.48 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచింది. రిలే జట్టుకు రజతం... 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టుకు రజత పతకం లభించింది. అజ్మల్, విత్యా రామ్రాజ్, రాజేశ్, శుభ వెంకటేశ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్ రేసును 3ని:14.34 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. శ్రీలంక జట్టు 3ని:14.25 సెకన్లతో రజతం గెలిచింది. అయితే రేసు సందర్భంగా శ్రీలంక అథ్లెట్ నిబంధనలకు విరుద్ధంగా వేరే బృందం పరిగెడుతున్న లైన్లోకి వచ్చాడని తేలడంతో నిర్వాహకులు శ్రీలంక జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో భారత జట్టు పతకం కాంస్యం నుంచి రజతంగా మారిపోయింది. నాలుగో స్థానంలో నిలిచిన కజకిస్తాన్‌కు కాంస్యం లభించింది. ఈ ఈవెంట్లో బహ్రెయిన్ జట్టు స్వర్ణం సాధించింది. పురుషుల 200 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ అమ్లాన్ బొర్గోహైన్ 20.60 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల పోల్‌వాల్ట్‌లో భారత క్రీడాకారిణి పవిత్ర వెంకటేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్‌లో ఐదు ఈవెంట్లు ముగిశాక భారత ప్లేయర్ తేజస్విన్ శంకర్ 4260 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.