బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ అదరగొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో గత కొంతకాలంగా విశేషంగా రాణిస్తున్న అతను కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. తాజాగా (ఆగస్ట్ 29) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. 72437 పాయింట్లు సాధించిన అతను.. మూడు స్థానాలు ఎగబాకి, ఆరో ప్లేస్‌కు చేరుకున్నాడు.
ప్రణయ్ గతేడాది డిసెంబర్ నుంచి టాప్-10లో కొనసాగుతున్న ఏకైక భారత షట్లర్‌గా ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ తర్వాత లక్ష్యసేన్ (12) భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంకింగ్ దక్కించుకున్నాడు. ఇతని తర్వాత కిదాంబి శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
కాగా, ప్రణయ్ ఇటీవల ముగిసిన వరల్డ్ బ్యాడింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని, సూపర్-500 మలేసియా మాస్టర్స్ టైటిల్‌ను, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపర్చుకున్నాడు.
సింధుకు 14వ ర్యాంక్..
మహిళల విభాగంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తాజా ర్యాంకింగ్స్‌లో 14వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్ – త్రిసా జాలీ జంట రెండు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment