HS Prannoy
-
రూ. 1.5 కోట్లా?.. భారత బ్యాడ్మింటన్ స్టార్ ఫైర్
నిరాధార వార్తలు రాస్తే సహించే ప్రసక్తే లేదని భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024కు సన్నద్దమయ్యే క్రమంలో ప్రభుత్వం తనకు రూ. 1.5 కోట్లు కేటాయించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. విశ్వ క్రీడలకు సిద్దమయ్యేందుకు కేంద్ర క్రీడా శాఖ టార్గెట్ ఒలింపిక్ పోడియం ఫినిష్ స్కీమ్(TOPS) పేరిట టాప్ అథ్లెట్ల శిక్షణకై నిధులు కేటాయించింది.అయితే, అంచనాలకు అనుగుణంగా భారత క్రీడాకారులు రాణించలేకపోయారు. ప్యారిస్‌లో కేవలం ఆరు పతకాలు మాత్రమే గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చారు. భారత్‌కు ఈ సారి షూటింగ్లో మూడు, హాకీ పురుషుల జట్టు, రెజ్లింగ్‌లో ఒక్కో కాంస్యం, జావెలిన్ త్రోలో రజతం మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్లు పూర్తిగా నిరాశపరిచారు.పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ ఎస్ ప్రణయ్ తదితరులు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె సైతం భారత షట్లర్ల తీరును విమర్శస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగానూ ఓటములకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చురకలు అంటించారు.కోట్ల రూపాయల నిధులుఈ నేపథ్యంలో వార్తా సంస్థ పీటీఐ.. భారత షట్లర్లకు TOPS కేటగిరీలో కేంద్రం కేటాయించిన నిధులకు సంబంధించి ఓ కథనం వెలువరించింది. ఆ వివరాల ప్రకారం.. ‘‘2023 వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఆసియా క్రీడల కాంస్య పతక విజేత హెచ్ఎస్ ప్రణయ్ ఒలింపిక్స్‌కు సిద్దమయ్యేందుకు.. క్రీడా శాఖ 1.8 కోట్ల రూపాయలు కేటాయించింది.అయితే, చికున్‌గున్యా బారిన పడ్డ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన లక్ష్యసేన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టాడు. ఇక పీవీ సింధు జర్మనీ ట్రెయినింగ్ కోసం రూ. 26.60 లక్షలు, లక్ష్యసేన్‌కు ఫ్రాన్స్‌లో శిక్షణ కోసం రూ. 9.33 లక్షల నిధులు విడుదల చేసింది. ఇక ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు ప్రిపరేషన్ కోసం ఓవరాల్‌గా 3.13 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. అయితే, ఆమె కూడా ప్రిక్వార్టర్స్‌లో వెనుదిరిగింది.ఇక మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప, తానిషాలకు ఒక్కొక్కరికి 1.5 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేసింది. అయితే, వారు గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయిపోయారు. మరోవైపు.. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి కోసం ఏకంగా భారీ మొత్తంలో రూ. 5.62 కోట్ల నిధులు కేటాయించింది. ఈ జోడీ క్వార్టర్ ఫైనల్ కూడా దాటలేకపోయింది. ఓవరాల్‌గా బ్యాడ్మింటన్ బృందానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) రూ. 72.03 కోట్లు ఖర్చుపెట్టింది’’.ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా? ఈ మేర వివరాలను ఉటంకిస్తూ పీటీఐ ఇచ్చిన ఆర్టికల్‌పై అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆర్టికల్స్ ఎలా రాస్తారు? ఈ అబద్దాన్ని ఎందుకు రాశారు? ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా? ఎవరి నుంచి? ఎవరికి? ఎందుకు? నేను ఎవరి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదే! అసలు TOPS ఫండింగ్‌లో నా పేరు కూడా లేదు’’ అని ఎక్స్ వేదికగా అశ్విని పొన్నప్ప తనపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది.చదవండి: నీరజ్ చోప్రాతో మనూ పెళ్లి?.. స్పందించిన షూటర్ తండ్రి -
Paris Olympics 2024: ప్రణయ్‌పై గెలుపు.. క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్
పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు చెందిన లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. ఇవాళ (ఆగస్ట్ 1) జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో లక్ష్యసేన్.. భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్‌పై వరుస సెట్లలో (21-12, 21-6) విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్ ప్రణయ్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. -
Olympics 2024: సంచలనం.. ప్రి క్వార్టర్స్‌లో ఆకుల శ్రీజ
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఐదోరోజు భారత్‌కు అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు ప్రిక్వార్టర్స్ చేరగా.. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ సైతం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాడు.మూడో సీడ్ పై లక్ష్య గెలుపుబుధవారం నాటి మ్యాచ్‌లో ఇండోనేషియా షట్లర్, మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీని 21-18, 21-12తో ఓడించి లక్ష్య సేన్ ప్రి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఆరంభంలో క్రిస్టీ ఆధిపత్యం కనబరిచినా.. రెండో సెట్లో అన్‌సీడెడ్ లక్ష్య ఊహించని రీతిలో తిరిగి పుంజుకున్నాడు. వరల్డ్ నంబర్ 3 క్రిస్టీపై పైచేయి సాధించిన 22 ఏళ్ల లక్ష్య సేన్‌కు ఇవే తొలి ఒలింపిక్స్. Lakshya Sen 2️⃣ - 0️⃣ Jonatan ChristieSensational Sen has defeated World No.3 Christie 🇮🇩 in straight sets 21-18, 21-12Lakshya qualifies for Pre-QF, Well Done 🇮🇳♥️#Badminton #Paris2024 pic.twitter.com/q6klX0L0AY— The Khel India (@TheKhelIndia) July 31, 2024 ఆకుల శ్రీజ సంచలన విజయంమరోవైపు.. వుమెన్స్ టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కూడా రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. విశ్వ క్రీడల్లో పాల్గొన్న తొలి ప్రయత్నంలోనే ప్రిక్టార్టర్స్ చేరిన ప్లేయర్‌గా నిలిచింది. బుధవారం నాటి మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 16 శ్రీజ.. సింగపూర్‌కు చెందిన జియాన్ జెంగ్‌తో తలపడింది.తొలి గేమ్‌లో శ్రీజ వెనుకబడ్డా.. ఆ తర్వాత అదరగొట్టింది. ప్రత్యర్థిని 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10తో ఓడించి ప్రి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక భారత్ నుంచి మరో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా ఇప్పటికే ప్రిక్వార్టర్స్ చేరుకున్న విషయం తెలిసిందే.ఫైనల్లో స్వప్నిల్ కుసాలే50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్‌కు చేరుకున్నాడు. మొత్తంగా 590 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచిన అతడు.. టాప్-8లో చోటు దక్కించుకున్నాడు. తద్వారా మెడల్ఈవెంట్కు అర్హత సాధించాడు.ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ మాత్రం ఈ అడ్డంకిని అధిగమించలేక ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాడు. చదవండి: ‘పిస్టల్’తో పంట పండించాడు! -
ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్‌స్టార్? గుర్తుపట్టారా?
-
పారిస్ ఒలింపిక్స్‌కు ఏడుగురు భారత షట్లర్లు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వరుసగా మూడో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన సింధు...ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ కూడా అర్హత సాధించింది.సోమవారంతో ఒలింపిక్ క్వాలిఫయింగ్ గడువు ముగిసింది. భారత్ నుంచి ఏడుగురికి బెర్త్‌లు లభించాయి. నిబంధనల ప్రకారం పురుషుల, మహిళల సింగిల్స్‌లో టాప్–16లో నిలిచిన క్రీడాకారులకు ఒలింపిక్ బెర్త్‌లు అధికారికంగా ఖరారవుతాయి.ర్యాంకులు ఇలా..ప్రస్తుతం సింధు 12వ ర్యాంక్‌లో ఉంది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు ప్రణయ్ (9వ ర్యాంక్), లక్ష్య సేన్ (13వ ర్యాంక్) తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రెండోసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీకి ఒలింపిక్ బెర్త్ దక్కింది. అశ్వినికిది మూడో ఒలింపిక్స్‌కాగా, తనీషా తొలిసారి విశ్వ క్రీడల్లో పోటీపడనుంది. -
భారత జట్ల శుభారంభం
చెంగ్డు (చైనా): ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లు థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. థామస్ కప్‌లో భాగంగా గ్రూప్ ‘సి’లో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల టీమ్ 4–1 తేడాతో థాయిలాండ్‌పై విజయం సాధించింది. మహిళల టోర్నీ ఉబెర్ కప్ గ్రూప్ ‘ఎ’లో భారత్ 4–1 స్కోరుతోనే కెనడాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్‌పై కున్లావట్ వితిద్సన్ గెలుపొందాడు. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలు భారత్ ఖాతాలో చేరాయి. తీరారట్‌సకుల్ పై లక్ష్యసేన్, సరన్జమ్శ్రీపై కిడాంబి శ్రీకాంత్ విజయం సాధించారు. తొలి డబుల్స్‌లో సుక్ఫున్ – తీరారట్‌సకుల్ జంటపై సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్‌శెట్టి జోడి... పన్‌పనిచ్ – సొథోన్పై ఎంఆర్ అర్జున్ – ధ్రువ్ కపిల గెలిచారు. ఉబెర్ కప్‌లో తొలి సింగిల్స్‌లో మిచెల్ లిపై అస్మిత చాలిహ, కేథరీన్ – జెస్లీన్పై ప్రియ – శృతి, వెన్ జాంగ్‌పై ఇషారాణి బారువా గెలుపొందారు. అయితే రెండో డబుల్స్‌లో జాకీ డెంట్ – క్రిస్టల్ లాయ్ చేతిలో సిమ్రన్ సింఘీ – రితిక ఠాకర్ ఓడిపోగా... చివరి మ్యాచ్‌లో ఎలియానా జాంగ్‌పై అన్మోల్ ఖర్బ్ విజయం సాధించింది. -
ఏడో ర్యాంక్‌కు ఎగబాకిన ప్రణయ్.. టాప్-100లో భారత్ నుంచి ఏకంగా..!
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్–100లో భారత్ నుంచి ఏకంగా 12 మంది చోటు సంపాదించారు. తాజా ర్యాంకింగ్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ఒక స్థానం పురోగతి సాధించి ఏడో ర్యాంక్‌కు చేరుకొని భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లక్ష్య సేన్ (20), శ్రీకాంత్ (24), ప్రియాన్షు (28), కిరణ్ జార్జి (36), సతీశ్ కుమార్ (49), మిథున్ మంజునాథ్ (63), శంకర్ ముత్తుస్వామి (70), సమీర్ వర్మ (77), సాయిప్రణీత్ (91), మెరాబా లువాంగ్ మైస్నమ్ (93), చిరాగ్ సేన్ (99) ఉన్నారు. -
పోరాడి ఓడిన ప్రణయ్
కుమమోటో: జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ ఓటమి చవిచూశాడు. ప్రపంచ 12వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 21–19, 16–21, 19–21తో పరాజయం పాలయ్యాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్ గెలిచినా ఆ తర్వాత తడబడి వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రణయ్ ఓ దశలో 4–12తో వెనుకబడినప్పటికీ పట్టువదలకుండా పోరాడి చివరకు స్కోరును 19–19తో సమం చేశాడు. అయితే చౌ తియెన్ చెన్ కీలకదశలో రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్‌కు 1,470 డాలర్ల (రూ. లక్షా 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 3600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్లో ప్రణయ్ విశేషంగా రాణించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించాడు. మలేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన ఈ కేరళ ప్లేయర్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. -
చైనా ఓపెన్‌లో భారత షట్లర్లకు చుక్కెదురు.. తొలి రౌండ్లోనే ముగ్గురు ఇంటిముఖం
చైనా ఓపెన్‌లో భారత షట్లర్లకు భారీ షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లోనే ఏకంగా ముగ్గురు ఇంటిముఖం పట్టారు. వీరిలో స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, ప్రియాన్షు రజావత్ ఉన్నారు. ప్రపంచ ఆరో ర్యాంకర్ ప్రణయ్‌కు మలేసియా ఆటగాడు, వరల్డ్ నంబర్ 22 ప్లేయర్ జీ యంగ్ చేతిలో పరాభవం (21-12, 13-21, 21-18) ఎదురవగా.. లక్ష్యసేన్‌ను డెన్మార్క్ ఆటగాడు, వరల్డ్ నంబర్ 10 షట్లర్ ఆండర్స్ ఆంటన్సన్ 23-21, 16-21, 21-9 తేడాతో ఓడించాడు. గతేడాది జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించి జోరు మీదున్న ప్రణయ్‌ను జీ యంగ్ 66 నిమిషాల్లో ఓడించగా.. లక్ష్యసేన్‌ను ఆంటన్సన్ 78 నిమిషాల్లో మట్టికరిపించాడు. అంతకుముందు ప్రియాన్షు రజావత్‌ను ఇండొనేసియాకు చెందిన షెసర్ హిరెన్ వరుస సెట్లలో (21-13, 26-24) ఓడించాడు. మరోవైపు ఈ టోర్నీలో పాల్గొంటున్న ఏకైక భారత మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ కూడా ఇంటీబాట పట్టారు. ఈ జోడీ చైనా టాప్ సీడ్ పెయిర్ చెన్ కింగ్ చెన్-జియా ఇ ఫాన్ చేతిలో 18-21, 11-21 వరుస సెట్లలో ఓటమిపాలైంది. పురుషుల డబుల్స్ విభాగంలో అర్జున్-దృవ్ కపిల (భారత్) జోడీ.. జపాన్ ద్వయం కెయ్చిరో మట్సుయ్-యోషినోరి టెకుచీ చేతిలో పోరాడి ఓడింది (23-21, 21-19). కాగా, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీ నుంచి నిన్ననే నిష్క్రమించింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన హెచ్ఎస్ ప్రణయ్
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ అదరగొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో గత కొంతకాలంగా విశేషంగా రాణిస్తున్న అతను కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. తాజాగా (ఆగస్ట్ 29) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. 72437 పాయింట్లు సాధించిన అతను.. మూడు స్థానాలు ఎగబాకి, ఆరో ప్లేస్‌కు చేరుకున్నాడు. ప్రణయ్ గతేడాది డిసెంబర్ నుంచి టాప్-10లో కొనసాగుతున్న ఏకైక భారత షట్లర్‌గా ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ తర్వాత లక్ష్యసేన్ (12) భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంకింగ్ దక్కించుకున్నాడు. ఇతని తర్వాత కిదాంబి శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. కాగా, ప్రణయ్ ఇటీవల ముగిసిన వరల్డ్ బ్యాడింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని, సూపర్-500 మలేసియా మాస్టర్స్ టైటిల్‌ను, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపర్చుకున్నాడు. సింధుకు 14వ ర్యాంక్.. మహిళల విభాగంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తాజా ర్యాంకింగ్స్‌లో 14వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్ – త్రిసా జాలీ జంట రెండు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్‌కు చేరింది. -
అప్పుడు ఇండియా- ఇంగ్లండ్ సిరీస్... ఆనాటి అనుభూతి మళ్లీ ఇప్పుడు: గావస్కర్
మరో పది, పదిహేనేళ్లలో దేశం క్రీడా భారత్‌గా ఎదుగుతుందని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. చెస్‌లో ప్రజ్ఞానంద, బ్యాడ్మింటన్‌లో ప్రణయ్, అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా ప్రపంచ వేదికల్లో పతకాలతో మెరిశారు. ఈ విషయంపై స్పందించిన సునిల్ గావస్కర్.. ‘‘గతంలో కొన్ని క్రీడలే భారత్‌లో వెలుగొందేవి. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. చెస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ తదితర క్రీడలకు కవరేజీ, ప్రేక్షకాదరణ బాగా పెరిగాయి’’ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా చారిత్రాత్మక విజయాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘అప్పుడు ఇండియా- ఇంగ్లండ్ సిరీస్ నడుస్తోంది. నేను ఇంగ్లండ్ నుంచే నీరజ్ ఆటను చూశాను.. మేరే దేశ్ కీ ధర్తీ సోనా ఉగ్లే అని పాడుకునేంతలా అతడు నన్ను ఆకట్టుకున్నాడు. ఆదివారం నాటి జావెలిన్ త్రో ఫైనల్స్ సందర్భంగానూ అచ్చంగా అదే అనుభూతిని పొందాను. రెండేళ్ల క్రితం నీరజ్ ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచాడు. గతేడాది వరల్డ్ అథ్లెటిక్స్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే, ఈసారి తన అద్భుతమైన త్రోతో స్వర్ణం సాధించాడు’’ అని గావస్కర్ హర్షం వ్యక్తం చేశాడు. ఇక బ్యాడ్మింటన్ ప్రపంచంలో ప్రణయ్ అద్భుతంగా రాణిస్తున్నాడని గావస్కర్ ప్రశంసించాడు. చాలా మంది అమెరికా, ఆస్ట్రేలియాలను క్రీడా దేశాలుగా భావిస్తారని.. రానున్న 10- 15 ఏళ్లలో భారత్ కూడా స్పోర్టింగ్ కంట్రీగా ఎదుగుతుందని జోస్యం చెప్పాడు. -
సూపర్ ప్రణయ్..
థామస్ కప్... ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో ఒకటి.. టీమ్ ఈవెంట్‌గా ఈ మెగా టోర్నీకి ఉన్న ప్రత్యేకతే వేరు! 1949 నుంచి 2020 వరకు 31 సార్లు టోర్నమెంట్ జరిగితే భారత జట్టు కనీసం ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. కేవలం ఐదు దేశాలు చైనా, ఇండోనేసియా, మలేసియా, జపాన్, డెన్మార్క్ మాత్రమే వాటిని అందుకోగలిగాయి. కానీ ఏడాది క్రితం భారత జట్టు ఈ చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోగలిగింది. అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ తొలిసారి విజేతగా నిలిచింది. ఈ ఘనతలో అందరికంటే కీలక పాత్ర పోషించిన షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. సరిగ్గా చెప్పాలంటే అతను లేకపోతే ఈ టోర్నీలో విజయమే లేదు! సుదీర్ఘ కాలంగా ఎన్నో సంచలన ప్రదర్శనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రణయ్ ఇప్పుడు మరిన్ని పెద్ద విజయాలపై దృష్టిసారించాడు. మాజీ చాంపియన్ మలేసియాతో భారత జట్టు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్.. బలాబలాలు చూస్తే భారత్‌దే పైచేయిగా అనిపించింది. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్న లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్‌లో అనూహ్యంగా ఓటమిపాలు కావడంతో లెక్క మారిపోయింది. మూడు వరుస విజయాలు సరిపోతాయి అనుకుంటే రెండో డబుల్స్‌లో కూడా ఓటమి ఎదురైంది. దాంతో స్కోరు 2–2 వద్ద నిలిచింది. ఈ స్థితిలో చివరి సింగిల్స్‌లో ప్రణయ్ బరిలోకి దిగాడు. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగి వరుస గేమ్‌లలో మ్యాచ్‌ను ముగించాడు. దాంతో జట్టు సెమీస్‌కి చేరింది. సెమీ ఫైనల్లో మరో మాజీ ప్రత్యర్థి డెన్మార్క్ ఎదురైంది. మళ్లీ అదే పరిస్థితి. లక్ష్య సేన్‌తో పాటు పురుషుల రెండో డబుల్స్ మ్యాచ్‌లో ఓటమి. స్కోరు 2–2తో సమం. మరోసారి ప్రణయ్‌పైనే భారం.. అతను ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాడు. కానీ తొలిగేమ్లోనే షాక్! రిటర్న్ షాట్ ఆడబోయి కోర్టులో ముందుకు పడిపోవడంతో చీలమండలానికి తీవ్ర గాయం. తట్టుకోలేనంత నొప్పి. తొలి గేమ్ కోల్పోయాడు కూడా. ఇక తప్పుకోవడమే మిగిలింది. భారత్‌కు ఓటమి ఖాయమనిపించింది. కానీ ప్రణయ్ ఒప్పుకోలేదు. చివరి వరకు పోరాడేందుకు సిద్ధమయ్యాడు. కొంత బ్రేక్ తీసుకొని పెయిన్ కిల్లర్లతో ఆటకు సై అన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత గాయం తీవ్రమవుతుందా లేక ఇంకా పెద్ద సమస్యగా మారుతుందా అనేది ఆలోచించలేదు. ఎదురుగా టీమ్ గ్యాలరీలో తనపై ఆశలు పెట్టుకున్న సహచరులు కనిపిస్తుండగా బరిలోకి దిగాడు. తన శక్తియుక్తులను పూర్తిగా కేంద్రీకరించి ప్రత్యర్థిపై చెలరేగాడు. ఫలితంగా తర్వాతి రెండు గేమ్‌లలో విజయం! టోర్నీ చరిత్రలో తొలిసారి భారత్ ఫైనల్‌కి చేరింది. ప్రణయ్ సాగించిన ఈ సమరం బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ ఇండోనేసియాతో ఫైనల్ మ్యాచ్. ఇక ఈసారి తన వరకు వస్తే మళ్లీ అంతే పట్టుదల కనబరచాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఇతర భారత షట్లర్లు అలాంటి పరిస్థితి రానీయలేదు. అందరూ సత్తా చాటి 3–0తో మ్యాచ్‌ని ముగించి టీమ్‌ని చాంపియన్‌గా నిలిపారు. తండ్రి ప్రోత్సాహంతో.. తల్లిదండ్రుల పేర్లు హసీనా .. సునీల్ (హెచ్ఎస్) కలగలిపి ప్రణయ్ తన పేరుకు ముందు చేర్చుకున్నాడు. అతని స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. తండ్రి సునీల్‌కి బ్యాడ్మింటన్ అంటే బాగా ఇష్టం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా పనిచేసిన ఆయన తన టీమ్‌కి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. అదే ప్రణయ్నీ ఆట వైపు మళ్లించింది. తండ్రి వద్దే అతను ఓనమాలు నేర్చుకున్నాడు. అయితే మొదట్లో జూనియర్ స్థాయిలో ఆశించిన విధంగా ప్రణయ్ కెరీర్ సాగలేదు. చురుకుదనం ఎక్కువగా లేదంటూ అతనికి ఎక్కువగా అవకాశాలు రాలేదు. దాంతో సింగిల్స్ నుంచి డబుల్స్కీ మారి చూశాడు. అయితే కేరళలో తగిన కోచింగ్ సౌకర్యాలు కూడా లేకపోవడం అతనికి సమస్యగా మారింది. అదే మలుపు.. ప్రణయ్ కెరీర్లో కీలక మలుపు 15 ఏళ్ల వయసులో వచ్చింది. హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటైన పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరడమే అతను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. అప్పటి వరకు అద్భుత విజయాలేమీ లేకున్నా ప్రణయ్లోని ప్రతిభను గోపీచంద్ గుర్తించాడు. అతనికి తగిన విధంగా శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించి తన బృందంలో చేర్చకున్నాడు. అప్పటినుంచి అతని ఆట మారింది. షాట్లలో పదును పెరిగింది. స్మాష్‌లు, ర్యాలీలు.. ఇలా అన్ని రకాలుగా అతను మెరుగయ్యాడు. ఇక ఫలితాలు రావడమే తరువాయి అనిపించింది. నిజంగానే ప్రణయ్ తనపై నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. వరుస విజయాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ మొదలు.. 2010లో సింగపూర్‌లో యూత్ ఒలింపిక్స్ జరిగాయి. బాలుర బ్యాడ్మింటన్‌లో సత్తా చాటుతూ ప్రణయ్ ఫైనల్‌కి దూసుకెళ్లాడు. అక్కడ ఓటమి ఎదురైనా రజత పతకం అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నెల రోజులలోపే మెక్సికోలో జరిగిన వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్ అతనికి దక్కిన మరో మంచి అవకాశం. బాలుర సింగిల్స్‌లో ఇక్కడా కాంస్యం గెలవడంతో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అతనికి కొంత గుర్తింపు దక్కింది. 2014లో ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో విజేతగా నిలవడంతో జాతీయ స్థాయిలో అతను అగ్రశ్రేణి ఆటగాడయ్యాడు. చాలెంజర్ టోర్నీలతో మొదలై.. కెరీర్లో సీనియర్ స్థాయిలో అంతర్జాతీయ విజయాలు సాధించాల్సిన మలుపు వద్ద ప్రణయ్ నిలిచాడు. 22 ఏళ్ల వయసులో టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ గెలవడంతో అతని ఖాతాలో తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) చాలెంజర్ టోర్నీ చేరింది. తర్వాత ఇదే తరహాలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్‌లోనూ అతను రన్నరప్‌గా నిలిచాడు. అనంతరం మూడు ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌ప్రి టోర్నీలు ఇండోనేసియన్ మాస్టర్స్, స్విస్ ఓపెన్, యూఎస్ ఓపెన్లను గెలుచుకొని ప్రణయ్ దూసుకుపోయాడు. శాఫ్ క్రీడల్లో రజతం, ఆసియన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం వీటికి అదనం. అయితే ఒక్కసారిగా వచ్చిన అనూహ్య గాయాలు ప్రణయ్ కెరీర్‌ను దెబ్బ తీశాయి. అత్యుత్తమంగా ఆడుతున్న వేర్వేరు దశల్లో గాయాల కారణంగా అతని జోరుకు బ్రేక్ పడింది. ఒకసారి కోలుకొని మళ్లీ దారిలో పడే సమయానికి మరో గాయం అతడిని ఇబ్బంది పెట్టింది. దాంతో వరుస పరాజయాలు అతన్ని పోటీలో వెనక్కి తోశాయి. బలమైన ప్రత్యర్థులపై.. ప్రణయ్ కెరీర్లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా బలమైన ప్రత్యర్థులతో తలపడి వారిని చిత్తు చేశాడు. అతని జోరు ముందు తలవంచిన కొందరు స్టార్ ఆటగాళ్లలో ఆల్‌టైమ్ గ్రేట్ లిన్ డాన్, చెన్ లాంగ్, విక్టర్ అక్సెల్సన్, తౌఫీక్ హిదాయత్, టామీ సుగియార్తో, కెంటో మొమొటా, లీ చోంగ్‌వీ, కిడాంబి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. కానీ ఈ విజయాలు అతడిని చాలా సందర్భాల్లో టైటిల్ వరకు తీసుకుపోలేదు. దాంతో ఈ ఫలితాలకు తగినంత గుర్తింపు దక్కలేదు. అయితే పోరాటతత్వం, చివరి వరకు ఓటమిని అంగీకరించని శైలి అతను మళ్లీ కొత్తగా సిద్ధమయ్యేందుకు కావాల్సిన ప్రేరణను అందించాయి. మారిన ఆటతో దూసుకుపోతూ.. దాదాపు సంవత్సర క్రితం ప్రణయ్ కెరీర్ మెరుగైన స్థితిలోనే ఉంది. కానీ ఇంకా ఏదో లోపం, మరింత సాధించాలనే తపన మాత్రం వదల్లేదు. అప్పుడు కోచ్ గోపీచంద్‌తో అతను చర్చించాడు. ఇంకా ఎంతో ఎదిగే అవకాశం ఉన్నా ఎక్కడో లోపం ఉంటోందని తేలింది. దాంతో కొత్తగా ప్రయత్నించేందుకు సిద్ధమయ్యాడు. ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. గాయాల గేయాలు వినిపించకుండా ప్రత్యేక ట్రైనింగ్‌తో తన ఫిట్నెస్ను మెరుగుపరచుకున్నాడు. ఆటలో కూడా అక్కడక్కడ కనిపిస్తున్న చిన్న లోపాలను సరిదిద్దుకున్నాడు. కోర్టులో చురుకుదనం, స్మాష్‌లలో దూకుడు పెరిగింది. ప్రత్యర్థి ఎవరైనా ఆధిపత్యం ప్రదర్శించడం మొదలైంది. సర్క్యూట్లో బలమైన ఆటగాడిగా నిలబడ్డాడు. ఇందులో మొదటి ఫలితం థామస్ కప్ రూపంలో వచ్చింది. 2022లో ఈ మెగా టోర్నీతో పాటు స్విస్ ఓపెన్ అతని ఖాతాలో చేరింది. ఈ ఏడాదైతే మలేసియా మాస్టర్స్ సూపర్ 500 కెరీర్లో ప్రణయ్ చాంపియన్‌గా నిలిచాడు. ఇదే అతని కెరీర్లో అతి పెద్ద విజయం కావడం విశేషం. వారాల వ్యవధిలో ఇదే స్థాయి టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గానూ నిలిచాడు. వరల్డ్ ర్యాంకింగ్‌లో అత్యుత్తమంగా 7కు చేరుకున్నాడు. ఇప్పడు ప్రణయ్ భారత్ తరఫున నంబర్‌వన్. ఫామ్ పరంగా, ఆటపరంగా కూడా అత్యుత్తమ ఆటగాడు. దాంతో అతనిపై అన్ని వైపుల నుంచీ అంచనాలు పెరిగాయి. రాబోయే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ గెలవడం మొదటి లక్ష్యం కాగా, వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ పతకమే అతని అసలైన మజిలీ. ప్రణయ్ ఆటను చూస్తే ఈ రెండూ కూడా సాధ్యమే అనిపిస్తోంది. -
ప్రణయ్ అద్భుత పోరాటం.. టాప్ సీడ్ షట్లర్‌కు షాక్
ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్ సెమీస్‌కు దూసుకెళ్లారు. ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్రణయ్.. టాప్ సీడ్ ఆంథోని సినిసుకను, యువ షట్లర్ ప్రియాన్షు.. మాజీ వరల్డ్ నంబర్ 1, భారత్‌కే చెందిన కిదాంబి శ్రీకాంత్‌ను మట్టికరిపించారు. ఇటీవలి కాలంలో సూపర్ టచ్‌లో ఉన్న వరల్డ్ నంబర్ 9 ప్లేయర్ ప్రణయ్.. తొలి సెట్ కోల్పోయినప్పటికీ, అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి 16-21, 21-17, 21-14తో ప్రత్యర్ధి ఆట కట్టించాడు. మరో క్వార్టర్స్‌లో ఓర్లీయాన్స్ మాస్టర్స్ విజేత ప్రియాన్షు.. కిదాంబి శ్రీకాంత్‌ను వరుస సెట్లలో (21-13, 21-8) ఓడించాడు.క్వార్టర్స్‌లో తమ కంటే మెరుగైన ప్రత్యర్ధులపై విజయాలు సాధించిన ప్రణయ్, ప్రియాన్షులు సెమీస్‌లో ఎదురెదురుపడనున్నారు. ఇదే టోర్నీలో మహిళల విభాగానికి వస్తే.. భారత ఏస్ షట్లర్, ఐదో సీడ్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టింది. అమెరికన్ షట్లర్ బెయివెన్ జాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు వరుస సెట్లలో (21-12, 21-17) ఓటమిపాలైంది. కేవలం 39 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. జాంగ్ చేతితో సింధుకు ఇది ఐదో ఓటమి. -
క్వార్టర్స్‌లో పీవీ సింధు.. ఫామ్‌లోకి వచ్చినట్లేనా!
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతుంది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్‌లు క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో పీవీ సింధు మన దేశానికే చెందిన ఆకర్షి కశ్యప్‌ను 21-14, 21-10 తేడాతో మట్టికరిపించింది. కేవలం 38 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన సింధు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. సింధు ఆడిన గత మూడు టోర్నీల్లో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. తాజాగా మాత్రం క్వార్టర్స్‌కు చేరుకోవడంతో ఫామ్‌లోకి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఇక క్వార్టర్స్‌లో సింధు అమెరికాకు చెందిన నాలుగో సీడ్ బీవెన్ జాంగ్‌తో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లో అడుగుపెట్టడం ఇది మూడోసారి. రెండో రౌండ్లో శ్రీకాంత్.. చైనీస్ తైపీకి చెందిన సూ లీ యాంగ్‌ను 21-10, 21-17తో వరుస గేముల్లో ఓడించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇక మరో గేమ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ చైనీస్ తైపీకి చెందిన వై. చీని 21-19, 19-21, 21-13తో ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇక భారత్‌కే చెందిన మరో షట్లర్ ప్రియాన్షు రజావత్ ఆకట్టుకున్నాడు. రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ జూ వెయ్‌పై 21-, 13-21, 21-19తో కష్టపడి గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక ప్రియాన్షు రజావత్.. క్వార్టర్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌తో తలపడనున్నాడు. చదవండి: Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. Matthew Wade: కళ్లు చెదిరే ఫీల్డింగ్.. 35 ఏళ్ల వయసులో విన్యాసాలేంటి బ్రో? -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేసిన భారత షట్లర్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్‌లు మొదటి రౌండ్లో విజయం సాధించారు. జపాన్ ఓపెన్‌లో విఫలమైన ప్రణయ్ హాంకాంగ్‌కు చెందిన చెక్ యూను చిత్తు చేశాడు. మూడు సెట్లలో జోరుగా ఆడిన భారత షట్లర్ 21-18, 16-21, 21-15తో గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మరో మ్యాచ్‌లో 19వ ర్యాంకర్ శ్రీకాంత్ జపాన్ ఆటగాడైన కెంటా నిషిమొటోపై 21-18, 21-7తో అవలీలగా గెలుపొందాడు. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బోణీ కొట్టింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన ఆమె మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌కు చేరింది. 47వ ర్యాంకర్ అష్మితా చాలిహపై 21-18, 21-13తో సింధు విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లో ఆమె భారత్‌కే చెందిన ఆకర్షి కష్యప్‌ను ఢీ కొట్టనుంది. -
తొమ్మిదో ర్యాంక్‌కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం..
BWF world rankings: గతవారం జపాన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన ప్రణయ్, సెమీఫైనల్లో ఓడిన లక్ష్య సేన్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించారు. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో ర్యాంక్‌కు... లక్ష్య సేన్ రెండు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 19వ ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 17వ ర్యాంక్‌లో, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. సాకేత్–మార్టినెజ్ జోడీ శుభారంభం మిఫెల్ టెన్నిస్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో భారత ప్లేయర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో శుభారంభం చేశాడు. తన భాగస్వామి మార్టినెజ్ (వెనిజులా)తో కలిసి సాకేత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మెక్సికోలో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–మారి్టనెజ్ ద్వయం 6–3, 2–6, 10–5తో ఎర్నెస్టో ఎస్కోబెడో–రోడ్రిగో మెండెజ్ (మెక్సికో) జోడీపై గెలిచింది. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట మూడు ఏస్‌లు సంధించింది. -
సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి
భారత టాప్ షట్లర్ లక్ష్యసేన్ మరో టైటిల్‌కు దగ్గరయ్యాడు.జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా లక్ష్యసేన్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన లోకల్ ప్లేయర్ కోకి వతాన్బేను 21-15, 21-19 వరుస గేముల్లో చిత్తు చేశాడు. ఇక రేపు(శనివారం) జరగనున్న సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన జోనాథన్ క్రిస్టీతో తలపడనున్నాడు. Lakshya Sen enters semifinals of Japan Open, Satwik-Chirag out READ: https://t.co/XMwjavlFmc#LakshyaSen #Badminton #JapanOpen pic.twitter.com/oRgSxUuxR3 — TOI Sports (@toisports) July 28, 2023 వరల్డ్ నెంబర్ పదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం క్వార్టర్స్‌లో ముగిసింది. డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ నెంబర్‌వన్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో 21-19, 18-21,8-21తో ఓడిపోయాడు. అయితే తొలి గేమ్‌ను 21-19తో గెలిచి రెండో గేమ్‌లోనూ ఒక దశలో 7-1తో ఆధిక్యంలో కనిపించిన ప్రణయ్ ఆ తర్వాత అనవసర ఒత్తిడికి లోనయ్యాడు. ఆ తర్వాత 18-21తో రెండో గేమ్ కోల్పోయిన ప్రణయ్.. మూడో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి భారత డబుల్స్ టాప్ షట్లర్స్ సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి పోరాటం ముగిసింది. ఇటీవలే కొరియా ఓపెన్ నెగ్గి జోరు మీదున్న ఈ ద్వయం ఈ టోర్నీలో ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా గెలుస్తూ మరో టైటిల్ గెలిచేలా కనిపించింది. అయితే శుక్రవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన ఒలింపిక్ చాంపియన్స్ లీ యాంగ్- వాంగ్ చీ-లాన్ చేతిలో 15-21, 25-23, 16-21తో ఓటమి పాలయ్యారు. చదవండి: రోహిత్ చివరగా ఏడో స్థానంలో ఎప్పుడు బ్యాటింగ్‌కు వచ్చాడంటే? Major League Cricket 2023: డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫైనల్లో సీటెల్ ఓర్కాస్ -
క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ జోడి
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు అదరగొడుతున్నారు. సింగిల్స్ విభాగంలో హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్‌లు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. డబుల్స్ విభాగంలో టాప్ షట్లర్లు స్వాతిక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి జోరు కనబరుస్తూ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ లక్ష్యసేన్ జపాన్‌కు చెందిన కాంటా సునేయమాపై 21-14, 21-16 వరుస గేముల్లో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇక డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ జోడి డెన్మార్క్‌కు చెందిన జెప్ బే- లాసే మొల్హెగ్డే ద్వయంపై 21-17, 21-11 వరుస సెట్లలో ఖంగుతినిపించారు. Lakshya Sen 🇮🇳 sets the pace against Kanta Tsuneyama 🇯🇵.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/INyZMUO6HR — BWF (@bwfmedia) July 27, 2023 ఇక హెచ్ఎస్ ప్రణయ్.. ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో మన దేశానికే చెందిన కిడాంబి శ్రీకాంత్‌పై 19-21, 21-9, 21-9 తేడాతో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ప్రణయ్ తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికి ఆ తర్వాత ఫుంజుకొని రెండు వరుస గేములను గెలుచుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక మహిళల డబుల్స్ విభాగంలో భారత టాప్ జోడి ట్రీసా జోలీ-పుల్లెల గాయత్రి గోపిచంద్ జంట ప్రీక్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. జపాన్‌కు చెందిన నమీ మత్సయుమా-చిమారు షీడా చేతిలో 21-13, 19-21తో ఓటమిపాలయ్యారు. చదవండి: SL Vs PAK 2nd Test: ఏడు వికెట్లతో చెలరేగిన 36 ఏళ్ల పాక్ బౌలర్.. సిరీస్ క్లీన్‌స్వీప్ Kylian Mbappe: మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె! -
తొలి రౌండ్లోనే ఓడిన సింధు, కిడాంబి శ్రీకాంత్
యోసు (కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత స్టార్, ప్రపంచ 17వ ర్యాంకర్ పీవీ సింధు 18–21, 21–10, 13–21తో 22వ ర్యాంకర్ పాయ్ యుపో (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తస్నీమ్, మాళవిక, ఆకర్షి, తాన్యా, అష్మిత కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–12, 22–24, 17–21తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మొమోటా చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా 12వ ఓటమి. భారత నంబర్‌వన్ ప్రణయ్ 21–13, 21–17తో జూలియన్ (బెల్జియం)పై, ప్రియాన్షు 21–15, 21–19తో చోయ్ జి హున్ (కొరియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సిక్కి రెడ్డి జోడీ గెలుపు మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సిక్కిరెడ్డి–రోహన్ కపూర్ 21–17, 21–17తో అలి్వన్ మోరాదా–అలీసా లియోన్ (ఫిలిప్పీన్స్)లపై గెలి చారు. సుమీత్ రెడ్డి–అశి్వని పొన్నప్ప 21–23, 21–13, 12–21తో సాంగ్ హున్ చో–లీ జంగ్ హున్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
పారుపల్లి కశ్యప్ అవుట్.. క్వార్టర్స్‌లో ప్రణయ్
Taipei Open 2023- తైపీ: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత నంబర్‌వన్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–9, 21–17తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్ కథ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. కశ్యప్ 16–21, 17–21తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 13–21, 18–21తో చియు సియా సియె–లిన్ జియావో మిన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తాన్యా హేమంత్ (భారత్) 11–21, 6–21తో తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. పోరాడి ఓడిన శ్రీజ న్యూఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఆకుల శ్రీజ, దియా చిటాలె తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... అహిక ముఖర్జీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీజ 6–11, 11–4, 5–11, 11–2, 7–11తో హువాంగ్ యిహువా (చైనీస్ తైపీ) చేతిలో, దియా 11–9, 7–11, 2–11, 1–11తో మియు కిహారా (జపాన్) చేతిలో ఓడిపోయారు. అహిక 11–8, 11–3, 11–2తో జియోటాంగ్ వాంగ్ (చైనా)పై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సత్యన్–మనిక బత్రా (భారత్) ద్వయం 11–3, 11–3, 11–6తో అబ్దుల్ బాసిత్ చైచి–మలీసా నస్రి (అల్జీరియా) జంటను ఓడించిం -
సెమీస్‌లోనే నిష్క్రమించిన ప్రణయ్.. టైటిల్‌కు అడుగుదూరంలో సాత్విక్- చిరాగ్
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో... ఆసియా చాంపియన్‌షిప్‌లో... కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో అతి గొప్ప టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. వరల్డ్ టూర్ సూపర్–1000 స్థాయి టోర్నీలో ఈ జంట టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. జకార్తా: అంచనాలకు మించి రాణిస్తూ భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఇండోనేసియా ఓపెన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 67 నిమిషాల్లో 17–21, 21–19, 21–18తో మిన్ హిక్ కాంగ్–సియో సెంగ్ జె (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జోడీతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. అయితే ఇప్పటి వరకు ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌లతో ఎనిమిదిసార్లు తలపడిన సాత్విక్–చిరాగ్ జంట ఒక్కసారి కూడా గెలవలేదు. తొమ్మిదో ప్రయత్నంలోనైనా సాత్విక్–చిరాగ్ విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి. భారత కాలమానం ప్రకారం సాత్విక్–చిరాగ్ జోడీ ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే అవకాశముంది. ఫైనల్ మ్యాచ్‌లన్నీ స్పోర్ట్స్–18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ముగిసిన ప్రణయ్ పోరాటం మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన సెమీఫైనల్లో ప్రణయ్ 15–21, 15–21తో ఓడిపోయాడు. సెమీఫైనల్లో నిష్క్రమించిన ప్రణయ్‌కు 17,500 డాలర్ల (రూ. 14 లక్షల 33 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 8400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్లో గొప్ప ఫామ్‌లో ఉన్న సాత్విక్–చిరాగ్ మరోసారి మెరిశారు. కొరియా జోడీపై గతంలో రెండుసార్లు నెగ్గిన సాత్విక్–చిరాగ్‌కు ఈసారి గట్టిపోటీ లభించింది. తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జంట రెండో గేమ్‌లో నెమ్మదిగా తేరుకుంది. ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసి ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని గేమ్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభంలో రెండు జోడీలు ప్రతి పాయింట్‌కు హోరాహోరీగా పోరాడాయి. స్కోరు 5–5తో సమంగా ఉన్నపుడు సాత్విక్–చిరాగ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 12–5తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే కొరియా జంట పట్టుదలతో ఆడి స్కోరును 16–16 వద్ద సమం చేసింది. ఈ దశలో సాత్విక్–చిరాగ్ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 19–16తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత రెండు పాయింట్లు కోల్పో యిన భారత జోడీ వెంటనే రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఎనిమిదోసారి కాగా బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీలలో సాత్విక్–చిరాగ్ జోడీ ఫైనల్ చేరడం ఇది ఎనిమిదోసారి. ఐదు టోర్నీలలో నెగ్గిన సాత్విక్–చిరాగ్, రెండు టోర్నీలలో రన్నరప్‌గా నిలిచారు. చదవండి: Ashes 1st Test: తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేసిందా..? -
Malaysia Masters: చరిత్ర సృష్టించిన హెచ్ఎస్ ప్రణయ్
మలేసియా మాస్టర్స్ సూపర్-500 టోర్నీ విజేతగా భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ నిలిచాడు. 30 ఏళ్ల ప్రణయ్‌కు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కావడం విశేషం. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ 21-19, 13-21, 21-18 తేడాతో చెనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించాడు. గంటా 31 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం కోసం ప్రణయ్ తీవ్రంగా శ్రమించాడు. వెంగ్ హంగ్ యాంగ్, హెచ్ ప్రణయ్ మధ్య మొదటి గేమ్ హోరాహోరీగా జరిగింది. ఒకానొక దశలో వెంగ్ హంగ్ 5-7 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లినా ప్రణయ్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి 9-9 తేడాతో స్కోర్లను సమం చేశాడు. ఆ తర్వాత 15-12 తేడాతో 3 పాయింట్లు ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్, దాన్ని నిలుపుకోలేకపోయాడు. దీంతో 15-15 తేడాతో స్కోర్లు మరోసారి సమం అయ్యాయి. అయితే వరుసగా రెండు పాయింట్లు సాధించి 17-16 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్, మొదటి సెట్‌ని 21-19 తేడాతో సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో ప్రణయ్ పూర్తిగా తేలిపోయాడు. ప్రణయ్ చేసిన తప్పిదాలతో 11-17 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. దాన్ని కాపాడుకుంటూ 13-21 తేడాతో రెండో సెట్ సొంతం చేసుకుని, గేమ్‌ని 1-1 తేడాతో సమం చేశాడు.. దీంతో మూడో సెట్ కీలకంగా మారింది. మూడో సెట్లో 10-10 తేడాతో ఇద్దరు ప్లేయర్లు సమంగా నిలిచారు. అయితే ఆ తర్వాత దూకుడు చూపించిన హెచ్ఎస్ ప్రణయ్, వరుస పాయింట్లు సాధించి చైనా ప్లేయర్‌పై ఒత్తిడి పెంచాడు. 19-18 తర్వాత వరుసగా 3 పాయింట్లు సాధించి, సెట్‌తో పాటు మ్యాచ్‌ని కూడా కైవసం చేసుకున్నాడు.. మలేషియా మాస్టర్స్ ఉమెన్స్ సింగిల్స్‌లో 2013, 2016 సీజన్లలో పీవీ సింధు, 2017లో సైనా నెహ్వాల్ టైటిల్స్ గెలవగా.. పురుషుల సింగిల్స్‌లో టైటిల్ గెలిచిన మొదటి భారత షట్లర్‌గా హెచ్ఎస్ ప్రణయ్ చరిత్రకెక్కాడు. WATCH: Moments when HS Prannoy won his first ever BWF World Tour Title! via Sports 18#Badminton #MalaysiaMasters2023 pic.twitter.com/qVuqwmYvWL — Sayak Dipta Dey (@sayakdd28) May 28, 2023 𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡 🏆🏆🏆 HS Prannoy has done it!! 🫡😍 The WR 9 Indian beats Weng Hong Yang of China 21-19, 13-21, 21-18 in #MalaysiaMasters2023 men's singles final to win his maiden BWF World Tour title. 🇮🇳#MalaysiaMasters #HSPrannoy pic.twitter.com/Kc3YfHnFdu — Khel Now (@KhelNow) May 28, 2023 చదవండి: శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం -
ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్.. సింధు కథ ముగిసే
మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో తెలుగుతేజం పీవీ సింధు కథ ముగిసింది. మహిళల సింగిల్స్‌లో పతకంపై ఆశలు రేపిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు(PV Sindhu) ఇంటిదారి పట్టింది. శనివారం జరిగినసెమీఫైనల్లో ఆమె జార్జియా మరిస్కా తుంజంగ్(ఇండోనేషియా) చేతిలో 14-21,17-21తో ఓటమిపాలైంది. అయితే పురుషుల విభాగంలో మాత్రం స్టార్ షట్లర్ హెచ్‌హెస్ ప్రణయ్(HS Prannoy) మలేషియా మాస్టర్స్ సూపర్ 500 ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఈ తెలుగు కుర్రాడు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఈ ఏడాది అతడికి ఇదే తొలి ఏటీపీ ఫైనల్ కావడం విశేషం. ఫామ్‌లో ఉన్న ప్రణయ్ సెమీఫైనల్లో క్రిస్టియన్ ఆదినాథ(ఇండేనేషియా)తో తలపడ్డాడు. అయితే.. క్రిస్టియన్ మోకాలి గాయంతో ఆట మధ్యలోనే తప్పుకున్నాడు. 19-17 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న క్రిస్టియన్ మ్యాచ్ మధ్యలో జంప్ చేసి వెనక్కి తిరుగుతుండగా మోకాలి నొప్పితో విలవిలలాడాడు. దాంతో, వెంటనే ప్రణయ్, భారత కోచ్ అతడి వద్దకు పరుగెత్తుకెళ్లారు. ఆట కొనసాగించేందుకు క్రిస్టియన్ సిద్ధంగా లేకపోవడంతో అడిని వీల్ చైర్ సాయంతో కోర్టు బయటకు తీసుకెళ్లారు. దాంతో నిర్వాహకులు ప్రణయ్‌ని విజేతగా ప్రకటించారు. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో వెంగ్ హాంగ్ యాంగ్(చైనా), లిన్ చున్ యీ(చైనీస్ తైపీ) మ్యాచ్ విన్నర్‌తో అతడు తలపడనున్నాడు. sportsmanship 👏🏻 hopefully it’s nothing serious ;( have a good recovery cea! pic.twitter.com/sEVL2eP8Di— bobe (@bobeside) May 27, 2023 Former champion Pusarla V. Sindhu 🇮🇳 faces Gregoria Mariska Tunjung 🇮🇩.#BWFWorldTour #MalaysiaMasters2023 pic.twitter.com/sbDIsKZ1lq— BWF (@bwfmedia) May 27, 2023 #BWF | Komentar dan pesan menyentuh dari Prannoy H.S. yang jadi saksi tumbangnya Christian Adinata karena cedera. Prannoy juga yang pertama datang untuk menenangkan CeA setelah terjatuh di lapangan. Respect Prannoy! Good luck for the final!! 🙏🏼❤️ pic.twitter.com/JP2LZSwVwo— SPOTV Indonesia (@SPOTV_Indonesia) May 27, 2023 చదవండి: 'త్వరలో మిమ్మల్ని కలుస్తా'.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్ -
Malaysia Masters: సెమీస్‌లో సింధు, ప్రణయ్.. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శ్రీకాంత్
కౌలాలంపూర్: తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్స్ పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం హోరాహోరీగా సాగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 74 నిమిషాల్లో 21–16, 13–21, 22–20తో యి మన్ జాంగ్ (చైనా)పై గెలుపొందగా... ప్రణయ్ 91 నిమిషాల్లో 25–23, 18–21, 21–13తో కెంటా నిషిమోటో (జపాన్)ను ఓడించాడు. అయితే భారత మరో స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. 57 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–16, 16–21, 11–21తో ప్రపంచ 57వ ర్యాంకర్ క్రిస్టియన్ అడినాటా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో గ్రెగోరియా టున్‌జంగ్ (ఇండోనేసియా)తో సింధు; అడినాటాతో ప్రణయ్ తలపడతారు. -
Malaysia Masters: ప్రపంచ ఐదో ర్యాంకర్‌కు షాకిచ్చిన కిదాంబి శ్రీకాంత్
కౌలాలంపూర్: వ్యక్తిగత విదేశీ కోచ్‌ను నియమించుకున్న తర్వాత భారత స్టార్ షట్లర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఆటతీరులో మార్పు కనిపిస్తోంది. మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ప్రపంచ 23వ ర్యాంకర్ శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 5వ ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)తో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–19, 21–19తో అద్భుత విజయం సాధించాడు. 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ ఒకదశలో వెనుకబడి పుంజుకున్నాడు. కున్లావుత్‌పై శ్రీకాంత్‌కిదే తొలి గెలుపు కావడం విశేషం. గతంలో కున్లావుత్‌తో ఆడిన మూడుసార్లూ శ్రీకాంత్ వరుస గేముల్లో ఓడిపోవడం గమనార్హం. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌పై నెగ్గిన ప్రణయ్ భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్ మరో గొప్ప విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. తొలి రౌండ్లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ను ఓడించిన ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, ప్రపంచ 11వ ర్యాంకర్ షి ఫెంగ్ లీని బోల్తా కొట్టించాడు. 70 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 13–21, 21–16, 21–11తో షి ఫెంగ్ లీపై గెలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 7–5తో వద్ద ప్రణయ్ వరుసగా తొమ్మిది పాయింట్లు నెగ్గి 16–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన లక్ష్య సేన్ 14–21, 19–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓటమి చవిచూశాడు. సింధు వరుసగా 13వసారి... మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ ర్యాంకర్ సింధు 21–16, 21–11తో ప్రపంచ 28వ ర్యాంకర్ అయా ఒహోరి (జపాన్)పై గెలిచింది. తొలి గేమ్‌లో ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసిన సింధు వెనుదిరిగి చూడలేదు. రెండో గేమ్‌లోనూ ఆమెదే పైచేయిగా నిలిచింది. ఒహోరిపై సింధుకిది వరుసగా 13వ విజయం కావడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో జాంగ్ యి మాన్ (చైనా)తో సింధు; నిషిమోటో (జపాన్)తో ప్రణయ్; క్రిస్టియన్ అడినాటా (ఇండోనేసియా)తో శ్రీకాంత్ తలపడతారు.