
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ శుభారం చేశాడు.
నాన్‌జింగ్(చైనా): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ శుభారం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో ప్రపంచ 11వ ర్యాంక్ ఆటగాడు ప్రణయ్ 21-12, 21-11 తేడాతో అభినవ్ మనోతా(న్యూజిలాండ్)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప‍్రవేశించాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన ప్రణయ్.. రెండో గేమ్‌లో కూడా అదే ఆటను పునరావృతం చేసి మ్యాచ్‌లో విజయం సాధించాడు.
ఇక పురుషుల డబుల్స్ పోరులో మనూ అత్రి- సుమీత్ రెడ్ది జోడి 21-13, 21-18 తేడాతో నికోలోవ్-రుసెవ్ జంటపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. తొలి గేమ్‌లో పెద్దగా పోరాడకుండానే గెలిచిన మనూ అత్రి ద్వయం.. రెండో గేమ్‌లో మాత్రం శ్రమించి విజయం సాధించింది.