badminton championship
-
వరుసగా 24వ ఏడాది టైటిల్ లేకుండానే...
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి వరుసగా 24వ ఏడాది భారత క్రీడాకారులు టైటిల్ లేకుండానే తిరిగి రానున్నారు. భారత్ నుంచి ఐదు విభాగాల్లో కలిపి మొత్తం 17 మంది క్రీడాకారులు ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగగా... ఒక్కరు కూడా క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయారు. సంచలన విజయాలతో ఆశలు రేకెత్తించిన లక్ష్య సేన్, పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్య సేన్ 10–21, 16–21తో ఆరో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను ఓడించిన లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లో అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు. మహిళల డబుల్స్‌లో 2022, 2023లలో సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ ఈసారి క్వార్టర్ ఫైనల్లో 14–21, 10–21తో రెండో సీడ్ లియు షెంగ్షు–టాన్ నింగ్ (చైనా) జంట చేతిలో ఓడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ 15–21, 21–18, 21–18తో ఎనిమిదో సీడ్ కిమ్ హై జియోంగ్–కాంగ్ హీ యోంగ్ (కొరియా) జంటను ఓడించిది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన లక్ష్య సేన్‌కు 7,975 డాలర్లు (రూ. 6 లక్షల 93 వేలు)... గాయత్రి–ట్రెసాలకు 9,062 డాలర్లు (రూ. 7 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2 గతంలో భారత్ నుంచి ప్రకాశ్ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్ (2001లో) మాత్రమే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో టైటిల్స్ సాధించారు. 2015లో సైనా నెహ్వాల్, 2022లో లక్ష్య సేన్ ఫైనల్ చేరుకున్నా రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. -
లక్ష్య సేన్ సంచలనం
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్య సేన్ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–13, 21–10తో ఇండోనేసియా స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీని బోల్తా కొట్టించాడు. లక్ష్య సేన్ ధాటికి తట్టుకోలేక జొనాథన్ క్రిస్టీ 36 నిమిషాల్లో చేతులెత్తేశాడు. ఈ గెలుపుతో గత ఏడాది ఇదే టోర్నీలో సెమీఫైనల్లో క్రిస్టీ చేతిలో ఎదురైన ఓటమికి లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. గతంలో క్రిస్టీ చేతిలో నాలుగుసార్లు ఓడిపోయిన లక్ష్య సేన్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చలాయించాడు. లక్ష్య ఆటకు జవాబివ్వలేక క్రిస్టీ అనవసర తప్పిదాలు చేశాడు. దాంతో తొలి గేమ్‌లో ఒక్కసారి కూడా ఇద్దరి స్కోర్లు సమం కాలేదు. రెండో గేమ్‌లోనూ లక్ష్య తన దూకుడు కొనసాగించాడు. స్కోరు 11–6 వద్ద లక్ష్య సేన్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 17–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. నేడు క్వార్టర్ ఫైనల్లో 6వ ర్యాంకర్ లీషి ఫెంగ్ (చైనా)తో లక్ష్య సేన్ ఆడతాడు. వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్‌లో ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. హావో నాన్ జియె–హాన్ జెంగ్ వె (చైనా)తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ తొలి గేమ్‌ను 16–21తో కోల్పోయారు. రెండో గేమ్‌లో స్కోరు 2–2 వద్ద ఉన్నపుడు చిరాగ్ వెన్ను నొప్పితో ఆటను కొనసాగించలేకపోయాడు. దాంతో సాత్విక్–చిరాగ్ ద్వయం మ్యాచ్ మధ్యలోనే వైదొలిగింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మాళవిక బన్సోద్ (భారత్) 16–21, 13–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 10–21, 12–21తో జె ఫెంగ్ యాన్–జిన్ వె యా (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. -
రన్నరప్ రుత్విక–రోహన్ జోడీ
బెంగళూరు: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని రన్నరప్‌గా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో రుత్విక శివాని (పీఎస్‌పీబీ)–రోహన్ కపూర్ (ఢిల్లీ) ద్వయం 17–21, 18–21తో ఆయుశ్ అగర్వాల్–శ్రుతి మిశ్రా (ఉత్తరప్రదేశ్) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణకే చెందిన శ్రియాంశి వలిశెట్టి కూడా రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో శ్రియాంశి 15–21, 16–21తో దేవిక సిహాగ్ (హరియాణా) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎం.రఘు (కర్ణాటక) 14–21, 21–14, 24–22తో మిథున్ మంజునాథ్ (రైల్వేస్)పై గెలిచి జాతీయ చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో రఘు ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకోవడం విశేషం. మహిళల డబుల్స్ ఫైనల్లో ఆరతి సారా సునీల్ (కేరళ)–వర్షిణి (తమిళనాడు) జోడీ 21–18, 20–22, 21–17తో ప్రియా దేవి (మణిపూర్)–శ్రుతి మిశ్రా (ఉత్తరప్రదేశ్) జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో అర్‡్ష మొహమ్మద్ (ఉత్తరప్రదేశ్)–సంస్కార్ సరస్వత్ (రాజస్తాన్) ద్వయం 12–21, 21–12, 21–19తో టాప్ సీడ్ నవీన్–లోకేశ్ (తమిళనాడు) జంటను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. -
విజయవంతంగా TAL జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ TAL జాతీయ బ్యాడ్మింటన్‌షిప్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. పశ్చిమ లండన్‌లోని ఆస్టర్లీ స్పోర్ట్స్, అథ్లెటిక్స్ సెంటర్లో మార్చి 16-, ఏప్రిల్ 6న పోటీలు నిర్వహించింది. లండన్‌తో పాటు యూకేలోని ఇతర సమీప కౌంటీల నుంచి ఔత్సాహిక తెలుగు ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మెన్స్ డబుల్స్, మెన్స్ 40+ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, విమెన్స్ డబుల్స్, విమెన్స్ 35+ డబుల్స్, అండర్-16.. ఇలా వివిధ కేటగిరీలలో కలిపి మొత్తంగా 250 మంది బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఇందులో భాగమయ్యారు. టాలీవుడ్ ప్రముఖ హాస్య నటులు అలీ విజేతలకు బహమతులు అందజేశారు. -
లక్ష్య సేన్ @13
న్యూఢిల్లీ: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్ చేరిన భారత స్టార్ లక్ష్య సేన్ ర్యాంక్ మెరుగైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ఐదు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రణయ్ ఎనిమిది నుంచి తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. ఏప్రిల్ 30వ తేదీలోపు టాప్–16లో ఉంటే ప్రణయ్, లక్ష్య సేన్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 11వ ర్యాంక్‌లో మార్పు లేదు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ మూడు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్‌తో భారత నంబర్‌వన్ జోడీగా అవతరించింది. పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం నాలుగు స్థానాలు పడిపోయి 26వ ర్యాంక్‌కు చేరుకుంది. -
BWF Championships: సింధుకు క్లిష్టమైన డ్రా.. ఆ రెండు అడ్డంకులు దాటితేనే
కౌలాలంపూర్: ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన భారత స్టార్ పీవీ సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 21 నుంచి 27 వరకు డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. దీనికి సంబంధించిన ‘డ్రా’ కార్యక్రమం గురువారం జరిగింది. మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి సింధు మాత్రమే బరిలో ఉంది. 16వ సీడ్‌గా బరిలోకి దిగనున్న సింధుకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. ఆ తర్వాత సింధుకు ప్రతి రౌండ్లో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశముంది. రెండో రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు ఆడే చాన్స్ ఉంది. మూడో రౌండ్లో మరో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) సిద్ధంగా ఉండవచ్చు. ఈ రెండు అడ్డంకులు దాటితే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆన్ సెయంగ్ (దక్షిణ కొరియా)తో సింధు ఆడే అవకాశముంది. ఆన్ సెయంగ్‌తో ఇప్పటి వరకు సింధు ఆరుసార్లు ఆడగా ఆరుసార్లూ ఓడిపోయింది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి ప్రణయ్, లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీకి... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
Badminton Asia Mixed Team Championships 2023: తొలిసారి సెమీస్‌లో భారత్
ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. దుబాయ్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–2తో హాంకాంగ్‌పై నెగ్గింది. 0–2తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–13, 21–12తో ఎన్జీ సాజ్ వైయు–ఎన్జీ వింగ్ యుంగ్ జోడీపై నెగ్గి భారత్‌కు సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇషాన్–తనీషా 24–26, 17–21తో లీ చున్ రెగినాడ్–ఎన్జీ సాజ్ వైయు చేతిలో... లక్ష్య సేన్ 22–20, 19–21, 18–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–చిరాగ్ శెట్టి జోడీ 20–22, 21–16, 21–11తో తాంగ్ చున్ మన్–యెంగ్ షింగ్ చోయ్ ద్వయంపై నెగ్గగా... నాలుగో మ్యాచ్‌లో పీవీ సింధు 16–21, 21–7, 21–9తో సలోని మెహతాను ఓడించడంతో భారత్ 2–2తో స్కోరును సమం చేసింది. -
Badminton: క్వార్టర్ ఫైనల్లో భారత్
Asia Mixed Team Badminton Championships 2023: దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. గ్రూప్ ‘బి’లో భారత జట్టు వరుసగా మూడో విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 4–1తో మలేసియాను భారత్ ఓడించింది. మహిళల సింగిల్స్‌లో సింధు 21–13, 21–17తో వాంగ్ లింగ్ చింగ్‌పై, పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ 18–21, 21–13, 25–23తో లీ జి జియాపై నెగ్గారు. పురుషుల డబుల్స్‌లో ధ్రువ్ కపిల–చిరాగ్ షెట్టి 16–21, 10–21తో అరోన్ చియా–సో వూయి యిక్‌ల చేతిలో ఓడగా, మహిళల డబుల్స్‌లో గాయత్రీ–ట్రెసా జాలీ 23–21, 21–15తో పియర్లీ టన్–తినా మురళీధరన్‌లపై, మిక్స్డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్–తనిషా క్రాస్టో 21–19, 19–21, 21–16తో చెన్ తంగ్ జి–తొ ఇ విపై గెలుపొందారు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్‌తో భారత్ తలపడుతుంది. చదవండి: Anderson- Stuart Broad: ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ సంచలనం.. 1000 వికెట్లతో.. Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా?! -
Badminton Championship: భారత్ శుభారంభం
Asia Mixed Team Badminton Championships 2023- దుబాయ్: ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. మంగళవారం గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో కజకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఇషాన్–తనీషా ద్వయం 21–5, 21–11తో మక్సుత్–నర్గీజా జోడీపై నెగ్గింది. రెండో మ్యాచ్‌లో ప్రణయ్ 21–9, 21–11తో పనారిన్ను ఓడించాడు. మూడో మ్యాచ్‌లో సింధు 21–4, 21–12తో కామిలాపై నెగ్గడంతో భారత విజయం ఖరారైంది. తర్వాతి మ్యాచ్‌ల్లో గరగ కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ 21–10, 21–6 తో కుల్మతోవ్–నియాజోవ్లను ఓడించగా.. పుల్లెల గాయత్రి –ట్రెసా జాలీ 21–5, 21–7తో నర్గీజా–ఐషా జుమ్బేక్లపై విజయం సాధించారు. చదవండి: Virat Kohli: రోహిత్‌పై ప్రేమ లేదు.. కానీ కోహ్లికి వ్యతిరేకం! బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కామెంట్స్ వైరల్ WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ షెడ్యూల్, వేదికలు.. ఫైనల్ అప్పుడే! Ind Vs Aus 2nd Test: ఆసీస్‌తో రెండో టెస్టు ప్రత్యేకం.. ప్రధాని మోదీని కలిసిన పుజారా -
ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీకి భారత జట్టు ప్రకటన
Asia Mixed Team Badminton Championship 2023: వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును బుధవారం ప్రకటించారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తారు. అదే విధంగా.. ►మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, ఆకర్షి కశ్యప్ ►పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ జోడీలు... ►మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, శిఖా గౌతమ్–అశ్విని భట్ జోడీలు.... ►మిక్స్డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. చదవండి: Ind Vs SL: సంజూ స్థానంలో జితేశ్ శర్మ.. ఉమ్రాన్‌కు బదులు అర్ష్‌దీప్! అక్కడ చెరో విజయం మ్యాచ్ మధ్యలో సిగరెట్ లైటర్ కావాలన్న లబూషేన్ -
BWF World Championships 2022: షటిల్ సమరం...
థామస్ కప్‌లో చారిత్రక విజయం... కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాల పంట... ఈ రెండు గొప్ప ప్రదర్శనల తర్వాత భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో ప్రతిష్టాత్మక పోరుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి జపాన్ రాజధాని టోక్యోలో మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాలలో కలిపి మొత్తం 26 మంది భారత క్రీడాకారులు సత్తా చాటుకునేందుకు సై అంటున్నారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధికంగా ఐదు పతకాలు గెలిచిన భారతీయ ప్లేయర్‌గా ఘనత వహించిన స్టార్ షట్లర్ పీవీ సింధు గాయం కారణంగా తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడం లేదు. 2011 నుంచి జరిగిన ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కనీసం ఒక్క పతకమైనా లభిస్తోంది. టోక్యో: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై గత పదిహేనేళ్లుగా నిలకడగా రాణిస్తూ... ‘బ్యాడ్మింటన్ పవర్‌హౌస్’గా భావించే చైనా, ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, కొరియా, జపాన్ దేశాలకు దీటుగా ఎదిగిన భారత క్రీడాకారులు మరో సమరానికి సిద్ధమయ్యారు. తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న జపాన్ గడ్డపై భారత ఆటగాళ్లు పతకాలు సాధించాలని పట్టుదలతో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు మినహా మిగతా అగ్రశ్రేణి క్రీడాకారులు భారత్ తరఫున బరిలో ఉన్నారు. గత ఏడాది స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ రజతం, లక్ష్య సేన్ కాంస్యం సాధించి సంచలనం సృష్టించగా... కేరళ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సాయిప్రణీత్‌తోపాటు ఈసారి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్‌లపై భారత్ ఆశలు పెట్టుకుంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో 20వ ర్యాంకర్ సాయిప్రణీత్... 39వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో 13వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్... 19వ ర్యాంకర్ విటింగస్ (డెన్మార్క్)తో 10వ ర్యాంకర్ లక్ష్య సేన్... 94వ ర్యాంకర్ లుకా వ్రాబెర్ (ఆస్ట్రియా)తో 18వ ర్యాంకర్ ప్రణయ్ తలపడనున్నారు. సాయిప్రణీత్ ‘డ్రా’ పై భాగంలో... శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ ముగ్గురూ ‘డ్రా’ కింది భాగంలో ఉన్నారు. దాంతో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్‌లలో ఒక్కరు మాత్రమే సెమీఫైనల్ చేరుకోగలరు. ఈ ముగ్గురికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. పతకాలు సాధించాలంటే వీరందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి లక్ష్య సేన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. చౌ తియెన్ చెన్‌తో ఆడిన నాలుగుసార్లూ సాయిప్రణీత్ ఓడిపోవడం... కొన్నాళ్లుగా ఫామ్‌లో లేకపోవడంతో సాయిప్రణీత్ తొలి రౌండ్ అడ్డంకి దాటడం అనుమానమే. డిఫెండింగ్ చాంపియన్ లో కీన్ యు (సింగపూర్), మాజీ చాంపియన్స్ కెంటో మొమోటా (జపాన్), అక్సెల్సన్ (డెన్మార్క్), జిన్‌టింగ్ (ఇండోనేసియా), లీ జి జియా (మలేసియా) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. సైనా మెరిసేనా... మహిళల సింగిల్స్‌లో ఈసారి భారత్ నుంచి ఇద్దరే బరిలో ఉన్నారు. గాయం కారణంగా పీవీ సింధు వైదొలగగా... సైనా నెహ్వాల్, మాళవిక బన్సోద్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. నేడు జరిగే తొలి రౌండ్లో లినె క్రిస్టోఫెర్సన్ (డెన్మార్క్)తో మాళివిక... మంగళవారం జరిగే తొలి రౌండ్లో చెయుంగ్ ఎన్గాన్ యి (వియత్నాం)తో సైనా ఆడతారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 12వసారి ఆడుతున్న సైనా 2015లో రజతం, 2017లో కాంస్యం గెలిచింది. అయితే ఈ ఏడాది సైనా గొప్ప ఫామ్‌లో లేదు. ఈ సీజన్లో ఆమె తొమ్మిది టోర్నీలలో ఆడితే ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ అకానె యామగుచి (జపాన్), రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), మూడుసార్లు చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), ఆన్ సె యంగ్ (కొరియా), చెన్ యు ఫె, హి బింగ్ జియావో (చైనా) టైటిల్ ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. ఆ ఇద్దరిపైనే... పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం రాలేదు. అంతా సవ్యంగా సాగితే ఈసారి సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం ఆ లోటు తీర్చే అవకాశముంది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన సాత్విక్–చిరాగ్ జోడీకి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. ఇక మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు అంతగా పతకావకాశాలు లేవు. భారత ఆటగాళ్ల వివరాలు పురుషుల సింగిల్స్: లక్ష్య సేన్, శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్. మహిళల సింగిల్స్: సైనా నెహ్వాల్, మాళవిక. పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి–మనూ అత్రి, అర్జున్–ధ్రువ్ కపిల, కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్. మహిళల డబుల్స్: సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప, దండు పూజ–సంజన, పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, అశ్విని భట్–శిఖా. మిక్స్డ్ డబుల్స్: ఇషాన్–తనీషా క్రాస్టో, వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్. మన పతక విజేతలు.. 1983: ప్రకాశ్ పడుకోన్ (పురుషుల సింగిల్స్‌లో కాంస్యం); 2011: గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప (మహిళల డబుల్స్‌లో కాంస్యం); 2013: సింధు (మహిళల సింగిల్స్‌లో కాంస్యం); 2014: సింధు (మహిళల సింగిల్స్‌లో కాంస్యం); 2015: సైనా (మహిళల సింగిల్స్‌లో రజతం); 2017: సింధు (మహిళల సింగిల్స్‌లో రజతం); 2017: సైనా (మహిళల సింగిల్స్‌లో కాంస్యం); 2018: సింధు (మహిళల సింగిల్స్‌లో రజతం); 2019: సింధు (మహిళల సింగిల్స్‌లో స్వర్ణం); 2019: సాయిప్రణీత్ (పురుషుల సింగిల్స్‌లో కాంస్యం); 2021: శ్రీకాంత్ (పురుషుల సింగిల్స్‌లో రజతం); 2021: లక్ష్య సేన్ (పురుషుల సింగిల్స్‌లో కాంస్యం). -
ఒకే పార్శ్వంలో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్
టోక్యో: గత ఏడాది జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు కిడాంబి శ్రీకాంత్ రజతం, లక్ష్య సేన్ కాంస్య పతకం అందించారు. అయితే ఈసారి మాత్రం భారత్‌కు మళ్లీ రెండు పతకాలు వచ్చే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈనెల 22 నుంచి టోక్యోలో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ ఒకే పార్శ్వంలో ఉండటమే దీనికి కారణం. ఈ ముగ్గురికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. మరో పార్శ్వంలో 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ ఉన్నాడు. సాయిప్రణీత్కూ కఠినమైన ‘డ్రా’నే పడింది. తొలి రౌండ్లో ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో శ్రీకాంత్; విటింగస్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్; లూకా వ్రాబర్ (ఆస్ట్రియా)తో ప్రణయ్; నాలుగో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్ తలపడతారు. చౌ తియెన్ చెన్‌తో ఇప్పటివరకు ఆడిన నాలుగుసార్లూ సాయిప్రణీత్ ఓడిపోయాడు. తొలి రౌండ్ అడ్డంకి దాటితే రెండో రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్)తో ప్రణయ్ ఆడతాడు. మూడో రౌండ్లో మొమోటా లేదా ప్రణయ్‌లతో లక్ష్య సేన్ ఆడే అవకాశముంది. మరోవైపు శ్రీకాంత్ రెండో రౌండ్లో చైనా ప్లేయర్ జావో జున్ పెంగ్.తో ఆడతాడు... ఈ మ్యాచ్‌లో గెలిస్తే మూడో రౌండ్లో ఐదో సీడ్ లీ జి జియా (మలేసియా)తో శ్రీకాంత్ ఆడవచ్చు. క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్‌కు లక్ష్య సేన్ లేదా ప్రణయ్ లేదా మొమోటాలలో ఒకరు ఎదురుపడతారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధుకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో హాన్ యు (చైనా) లేదా కి జుయ్‌ఫె (నెదర్లాండ్స్)లలో ఒకరితో సింధు ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్లో సింధుకు కొరియా స్టార్ ఆన్ సె యంగ్ ఎదురుకానుంది. భారత్‌కే చెందిన సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)తో... లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)తో మాళవిక తలపడతారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంటకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
Thomas Cup 2022: షటిల్ కింగ్స్
సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రపంచ షటిల్ సామ్రాజ్యంలో మన జెండా ఎగిరింది. ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌గా పేరున్న థామస్ కప్‌లో ఒకప్పుడు మనం ప్రాతినిధ్యానికే పరిమితమయ్యాం. ఒకట్రెండుసార్లు మెరిపించినా ఏనాడూ పతకం అందుకోలేకపోయాం. కానీ ఈసారి అందరి అంచనాలను పటాపంచలు చేశాం. ఏకంగా విజేతగా అవతరించాం. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ ఫైనల్లో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాకు విశ్వరూపమే చూపించాం. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో ఆఖరి మ్యాచ్‌లో ఫలితం తేలగా... టైటిల్ సమరంలో వరుసగా మూడు విజయాలతో ఇండోనేసియా కథను ముగించి మువ్వన్నెలు రెపరెపలాడించాం. భారత చరిత్రాత్మక విజయంలో తెలుగు తేజాలు కీలకపాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్ సింగిల్స్‌లో, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, గారగ కృష్ణప్రసాద్... తెలంగాణ ప్లేయర్ పంజాల విష్ణువర్ధన్ గౌడ్, కోచ్ సియాదతుల్లా ఈ చిరస్మరణీయ విజయంలో భాగమయ్యారు. బ్యాంకాక్: ఇన్నాళ్లూ వ్యక్తిగత విజయాలతో మురిసిపోయిన భారత బ్యాడ్మింటన్ ఇప్పుడు టీమ్ ఈవెంట్లోనూ అదరగొట్టింది. 73 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్ కప్ పురుషుల టీమ్ టోర్నమెంట్లో తొలిసారి భారత్ చాంపియన్‌గా అవతరించింది. ప్రకాశ్ పడుకోన్, సయ్యద్ మోడీ, విమల్ కుమార్, పుల్లెల గోపీచంద్‌లాంటి స్టార్స్ గతంలో థామస్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన వాళ్లే. కానీ ఏనాడూ వారు ట్రోఫీని ముద్దాడలేకపోయారు. ఎట్టకేలకు వీరందరి కలలు నిజమయ్యాయి. అసాధారణ ఆటతీరుతో ఈసారి భారత జట్టు థామస్ కప్ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3–0తో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాను చిత్తు చేసి థామస్ కప్‌ను సొంతం చేసుకుంది. ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ఇండోనేసియాకు షాక్ ఇచ్చింది. శుభారంభం... తొలిసారి థామస్ కప్ ఫైనల్ ఆడిన భారత్‌కు శుభారంభం లభించింది. ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆంథోనీ జిన్‌టింగ్‌తో జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 65 నిమిషాల్లో 8–21, 21–17, 21–16తో విజయం సాధించి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. తొలి గేమ్‌లో తడబడిన లక్ష్య సేన్ ఆ తర్వాత చెలరేగి ఆంథోనీ ఆట కట్టించాడు. డబుల్స్ విభాగంలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇండోనేసియా ప్రపంచ నంబర్‌వన్ కెవిన్ సంజయ సుకముల్యో, రెండో ర్యాంకర్ మొహమ్మద్ అహసాన్‌లను బరిలోకి దించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఆద్యంతం అద్భుత ఆటతీరుతో 73 నిమిషాల్లో 18–21, 23–21, 21–19తో సుకముల్యో–అహసాన్ జంటను బోల్తా కొట్టించి భారత్ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్‌గా జరిగిన రెండో సింగిల్స్‌లో 2018 జకార్తా ఆసియా క్రీడల చాంపియన్ జొనాథాన్ క్రిస్టీతో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ తలపడ్డాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 23–21తో గెలుపొంది భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. ఈ టోర్నీ ప్రారంభం నుంచి కళ్లు చెదిరే ఆటతో ఆకట్టుకుంటున్న శ్రీకాంత్ ఈ మ్యాచ్‌లోనూ దానిని కొనసాగించాడు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీతో ఈ ఏడాది ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే పైచేయి సాధించాడు. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన శ్రీకాంత్ రెండో గేమ్‌లో ఒకదశలో 13–16తో వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకున్న ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ స్కోరును సమం చేశాడు. అనంతరం 20–21తో వెనుకబడ్డ దశలో మళ్లీ కోలుకొని వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయా న్ని ఖాయం చేసుకున్నాడు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు. మనం గెలిచాం ఇలా... లీగ్ దశ: గ్రూప్ ‘సి’లో భారత జట్టు వరుసగా తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో జర్మనీపై 5–0తో... కెనడాపై 5–0తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. చివరి మ్యాచ్ లో భారత్ 2–3తో చైనీస్ తైపీ చేతిలో ఓడి గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్: ఐదుసార్లు చాంపియన్ మలేసియాపై భారత్ 3–2తో గెలిచింది. 1979 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి ప్రవేశించి తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్: 2016 విజేత డెన్మార్క్‌పై భారత్ 3–2తో నెగ్గి ఈ టోర్నీ చరిత్రలో మొదటిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. గెలుపు వీరుల బృందం... థామస్ కప్‌లో భారత్ తరఫున మొత్తం 10 మంది ప్రాతినిధ్యం వహించారు. సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్), లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్), హెచ్ఎస్ ప్రణయ్ (కేరళ), ప్రియాన్షు రజావత్ (మధ్యప్రదేశ్) పోటీపడ్డారు. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర)... పంజాల విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ)–గారగ కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)... ఎం.ఆర్.అర్జున్ (కేరళ)–ధ్రువ్ కపిల (పంజాబ్) జోడీలు బరిలోకి దిగాయి. నా అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. వ్యక్తిగత టోర్నీలతో పోలిస్తే టీమ్ ఈవెంట్లలో ఆడే అవకాశం తక్కువగా లభిస్తుంది. కాబట్టి ఇలాంటి పెద్ద ఘనతను అందుకోవడం నిజంగా గొప్ప ఘనతగా భావిస్తున్నా. మేం సాధించామని నమ్మేందుకు కూడా కొంత సమయం పట్టింది. జట్టులో ప్రతీ ఒక్కరు బాగా ఆడారు. ఏ ఒక్కరో కాకుండా పది మంది సాధించిన విజయమిది. టీమ్ విజయాల్లో ఉండే సంతృప్తే అది. –కిడాంబి శ్రీకాంత్ ‘అభినందనల జల్లు’ థామస్ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు. భారత్‌కు తిరిగి వచ్చాక తన ఇంటికి రావాలని ఆయన ఆహ్వానించారు. ‘భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. థామస్ కప్ గెలుపుపై దేశమంతా హర్షిస్తోంది. మన జట్టుకు అభినందనలు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలి. ఈ గెలుపు వర్ధమాన ఆటగాళ్లకు స్ఫూర్తినందిస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా తొలిసారి థామస్ కప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు తెలియజేశారు. తొలిసారి థామస్ కప్ గెలవడం భారత బ్యాడ్మింటన్‌కు చారిత్రాత్మక క్షణం. విజయం సాధించే వరకు పట్టు వదలకుండా, ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కిడాంబి శ్రీకాంత్, భారత బృందానికి అభినందనలు. ప్రతిష్ట, సమష్టితత్వం కలగలిస్తేనే విజయం. చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్, చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్, ప్రణయ్‌లకు కూడా అభినందనలు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి ఈ గెలుపు గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. మా ఆటగాళ్లపై కొంత ఆశలు ఉన్నా ఇంత గొప్పగా ఆడతారని ఊహించలేదు. భారత క్రికెట్‌కు 1983 ప్రపంచకప్ ఎలాంటిదో ఇప్పుడు బ్యాడ్మింటన్‌కు ఈ టోర్నీ విజయం అలాంటిది. –విమల్ కుమార్, భారత బ్యాడ్మింటన్ కోచ్ థామస్ కప్ విజయం చాలా పెద్దది. జనం దీని గురించి మున్ముందు చాలా కాలం మాట్లాడుకుంటారు. భారత బ్యాడ్మింటన్ గర్వపడే క్షణమిది. ఇకపై మన టీమ్ గురించి ప్రపంచం భిన్నంగా ఆలోచిస్తుంది. ఒకప్పుడు వ్యక్తిగత పతకాలు గెలవడం కలగా ఉండేది. ప్రిక్వార్టర్స్ చేరినా గొప్పగా అనిపించేది. ఇది వాటికి మించిన ఘనత. దానిని బట్టి చూస్తే ఈ టీమ్ ఎంత గొప్పగా ఆడిందో అర్థమవుతుంది. –పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ రూ. 2 కోట్ల నజరానా థామస్ కప్ గెలిచిన భారత జట్టుకు రూ. 2 కోట్లు నజరానా ప్రకటించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి రూ. 1 కోటి, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నుంచి రూ. 1 కోటి జట్టు సభ్యులకు ఇవ్వనున్నారు. -
లక్ష్యం చేరలేదు..!
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలిచిన మూడో భారతీయుడిగా నిలవాలని ఆశించిన భారత యువతార లక్ష్య సేన్‌కు నిరాశే ఎదురైంది. టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన లక్ష్య సేన్ బలమైన ప్రత్యర్థి ముందు నిలవలేక ఓటమి పాలయ్యాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) 21–10, 21–15 స్కోరుతో లక్ష్య సేన్‌పై విజయం సాధించి రెండోసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సాధించాడు. 2020లోనూ అక్సెల్సన్ ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. 53 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో కొన్నిసార్లు లక్ష్య సేన్ దీటుగా పోరాడినా తుది ఫలితం మాత్రం ప్రతికూలంగా వచ్చింది. గత ఏడాది ఇదే టోర్నీ ఫైనల్లో అనూహ్యంగా ఓటమి పాలై రన్నరప్‌గా సంతృప్తి చెందిన అక్సెల్సన్ ఈసారి తన స్థాయికి తగ్గ ఆటతో చాంపియన్ అయ్యాడు. విజేత అక్సెల్సన్కు 70 వేల డాలర్లు (రూ. 53 లక్షల 17 వేలు), రన్నరప్ లక్ష్య సేన్‌కు 34 వేల డాలర్లు (రూ. 25 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సుదీర్ఘ ర్యాలీలతో... ఫైనల్ పోరుకు ముందు అక్సెల్సన్తో ముఖాముఖి సమరాల్లో లక్ష్య 1–4తో వెనుకంజలో ఉన్నాడు. అయితే ఆ ఒక్క విజయం ఎనిమిది రోజుల ముందే జర్మన్ ఓపెన్‌లో సెమీఫైనల్లో వచ్చింది. దాంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న సేన్‌పై అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే విక్టర్ ఆరంభంలోనే సేన్‌ను దెబ్బ కొట్టాడు. వరుస పాయింట్లతో దూసుకుపోయిన అతను 6–0తో ముందంజలో నిలిచిన తర్వాత గానీ లక్ష్య తొలి పాయింట్ సాధించలేకపోయాడు. తొలి గేమ్ మొత్తం దాదాపు ఇదే తరహాలో సాగింది. అక్సెల్సన్ ఆధిపత్యం ముందు సేన్ జవాబివ్వలేకపోయాడు. 2–8 వద్ద 61 షాట్ల ర్యాలీ కూడా రావడంతో సేన్ బాగా అలసిపోయాడు. చక్కటి డిఫెన్స్ ప్రదర్శిస్తూ 11–2తో ముందంజ వేసిన డానిష్ ఆటగాడు దానిని కొనసాగిస్తూ అలవోకగా తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో సేన్ కొంత పోటీనిచ్చాడు. ముఖ్యంగా అతని స్మాష్‌లు మంచి ఫలితాలనిచ్చాయి. అయితే 4–4తో సమంగా ఉన్న స్థితి నుంచి అక్సెల్సన్ 11–5 వరకు తీసుకుపోగా, విరామం తర్వాత కోలుకొని వరుసగా మూడు పాయింట్లు సాధించి సేన్ 9–12తో అంతరాన్ని తగ్గించాడు. ఈ దశలో విక్టర్ మళ్లీ చెలరేగి 10–17తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ సమయంలో ఇద్దరు హోరాహోరీగా తలపడుతూ 70 షాట్ల ర్యాలీ ఆడగా, సేన్‌కు పాయింట్ దక్కి స్కోరు 11–17కు చేరింది. అయితే చివర్లో లక్ష్య మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకున్నా... అప్పటికే ఆలస్యమైపోయింది. అనుభవలేమి, ఒత్తిడిలో ఓటమి పాలైనా... వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలవడం 20 ఏళ్ల లక్ష్య సేన్ కెరీర్‌కు కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
గాయత్రి–త్రిషా జంట సంచలనం
ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... ఒత్తిడిని దరిచేరనీయకుండా సహజశైలిలో ఆడితే అద్భుతాలు చేయవచ్చని భారత బ్యాడ్మింటన్ టీనేజ్ జోడీ గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ నిరూపించింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షిప్లో గాయత్రి–త్రిషా ద్వయం నమ్మశక్యంకానీ రీతిలో ఆడి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో వందేళ్లపైబడిన చరిత్ర కలిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరిన తొలి భారతీయ జోడీగా గాయత్రి–త్రిషా జంట రికార్డు నెలకొల్పింది. బర్మింగ్హమ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం అద్భుతం జరిగింది. మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే భారత టీనేజ్ జోడీ గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ సంచలనం సృష్టించింది. ఓటమి అంచుల నుంచి విజయ తీరానికి చేరి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 67 నిమిషాలపాటు జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 46వ ర్యాంక్ జోడీ గాయత్రి–త్రిషా 14–21, 22–20, 21–15తో ప్రపంచ రెండో ర్యాంక్, రెండో సీడ్ ద్వయం లీ సోహీ–షిన్ సెయుంగ్‌చాన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. ఈ క్రమంలో 19 ఏళ్ల కేరళ అమ్మాయి త్రిషా జాలీ, 18 ఏళ్ల హైదరాబాద్ అమ్మాయి గాయత్రి 123 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షిప్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరుకున్న భారతీయ జంటగా రికార్డు నెలకొల్పింది. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం, టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన లీ సోహీ–షిన్ సెయుంగ్‌చాన్ జంటతో జరిగిన పోరులో గాయత్రి–త్రిషా అద్భుతంగా ఆడారు. తొలిసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడుతున్న గాయత్రి–త్రిషా తొలి గేమ్ కోల్పోయి రెండో గేమ్‌లో 18–20తో ఓటమి అంచుల్లో నిలిచారు. కొరియా జంట మరో పాయింట్ గెలిచిఉంటే గాయత్రి–త్రిషా ఇంటిదారి పట్టేవారే. కానీ అలా జరగలేదు. రెండు పాయింట్లు వెనుకంజలో ఉన్నప్పటికీ గాయత్రి–త్రిషా పట్టువదలకుండా పోరాడి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచారు. రెండో గేమ్‌ను 22–20తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో గేమ్‌లో గాయత్రి–త్రిషా స్కోరు 8–8తో సమంగా ఉన్న దశలో ఒక్కసారిగా విజృంభించారు. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13–8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కొరియా జోడీ తేరుకునే ప్రయత్నం చేసినా గాయత్రి–త్రిషా తమ దూకుడు కొనసాగించి ప్రత్యర్థి ఆట కట్టించారు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 276వ ర్యాంక్ జోడీ జెంగ్ యు–షు జియాన్ జాంగ్ (చైనా)లతో గాయత్రి–త్రిషా ద్వయం తలపడుతుంది. సెమీస్‌లో లక్ష్య సేన్... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత యువతార లక్ష్య సేన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్‌తో తలపడాల్సిన చైనా ప్లేయర్ లూ గ్వాంగ్ జు గాయం కారణంగా వైదొల గడంతో లక్ష్య సేన్‌కు వాకోవర్ లభించింది. ప్రకాశ్ పదుకొనె, పుల్లెల గోపీచంద్ తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరిన మూడో భారతీయ క్రీడాకారుడిగా లక్ష్య సేన్ గుర్తింపు పొందాడు. డిఫెండింగ్ చాంప్ లీ జి జియా (మలేసియా)–మాజీ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) మధ్య మ్యాచ్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్ ఆడతాడు. పురుషుల డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ జోడీ మార్కస్ గిడియోన్ –కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 22–24, 17–21తో ఓడింది. తొలి గేమ్‌లో భారత జంటకు ఆరు గేమ్ పాయింట్లు లభించినా ఫలితం లేకపోయింది. నిజానికి ఈ టోర్నీలో మాకు ఎంట్రీ లభిస్తుందని ఆశించలేదు. అయితే చివరి నిమిషంలో కొన్ని జోడీలు వైదొలగడంతో రిజర్వ్ జాబితా నుంచి మాతోపాటు వేరే జోడీలకూ ఎంట్రీ లభించింది. ప్రతి మ్యాచ్‌లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. క్వార్టర్ ఫైనల్లోని రెండో గేమ్‌లో 18–20తో వెనుకబడ్డా ఆందోళన చెందకుండా, ఒత్తిడికి లోనుకాకుండా ఆడి విజయాన్ని అందుకున్నాం. –గాయత్రి తల్లిదండ్రులకు తగ్గ తనయ గాయత్రి తండ్రి పుల్లెల గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించారు. తల్లి పీవీవీ లక్ష్మి 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. తల్లిదండ్రులు రాణించిన ఆటలోనే ఇప్పుడు కుమార్తె మెరి సింది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి గాయత్రి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది. -
Asia Team Championships 2022: లీగ్ దశలోనే భారత్ నిష్క్రమణ
ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించాయి. కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో భారత పురుషుల జట్టు 2–3తో ఇండోనేసియా చేతిలో... భారత మహిళల జట్టు 1–4తో జపాన్ చేతిలో ఓడిపోయాయి. ఇండోనేసియాతో పోటీలో భారత యువస్టార్స్ లక్ష్య సేన్, మిథున్ మంజునాథ్ రెండు సింగిల్స్‌లో గెలిచారు. చదవండి: Ind Vs Wi 3rd T20: మూడో టీ20కి స్టార్ ప్లేయర్లు దూరం... మరో కీలక సిరీస్‌కు కూడా డౌటే.. ఎందుకంటే! -
భారత్‌ను గెలిపించిన మిథున్.. క్వార్టర్స్‌కు చేరాలంటే మాత్రం..
Asia Badminton Team Championship 2022- షా ఆలమ్ (మలేసియా): ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు నాకౌట్ చేరే ఆశలు సజీవంగా నిలిచాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–2తో హాంకాంగ్‌పై గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌కిదే తొలి గెలుపు. భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాలంటే ఇండోనేసియాతో నేడు జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు హాంకాంగ్ చేతిలో దక్షిణ కొరియా ఓడిపోవాలి. కాగా హాంకాంగ్‌తో జరిగిన పోరులో నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో మిథున్ మంజునాథ్ 21–14, 17–21, 21–11తో జేసన్ గుణవాన్‌ను ఓడించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21–19, 21–10తో లీ చెయుక్ యుపై నెగ్గి భారత్‌కు 1–0 ఆధిక్యం అందించాడు. ఇక రెండో మ్యాచ్‌లో మంజిత్ సింగ్–డింకూ సింగ్ జంట ఓడిపోగా... మూడో మ్యాచ్‌లో కిరణ్ జార్జి కూడా ఓటమి పాలయ్యాడు. అయితే నాలుగో మ్యాచ్‌లో హరిహరన్–రూబన్ కుమార్ జోడీ 21–17, 21–16తో చౌ హిన్ లాంగ్–లుయ్ చున్ వాయ్ జంటపై నెగ్గి స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణాయక మ్యాచ్‌లో మిథున్ గెలుపొందడంతో భారత్ గట్టెక్కింది. చదవండి: Ishan Kishan-Rohit Sharma: ఇషాన్ కిషన్‌కు క్లాస్ పీకిన రోహిత్ శర్మ.. విషయమేంటి -
లక్ష్య సేన్‌కు రూ. 15 లక్షలు నజరానా
Lakshya Sen: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన భారత ప్లేయర్, ఉత్తరాఖండ్ క్రీడాకారుడు లక్ష్య సేన్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం అందించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా ఘనత వహించిన లక్ష్య సేన్‌ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ సన్మానించి రూ. 15 లక్షల చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌లో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. It was an honour to meet Uttarakhand Chief Minister @pushkardhami sir! Thank you for your kind and inspiring words sir! pic.twitter.com/YbdDF1xYk9 — Lakshya Sen (@lakshya_sen) December 27, 2021 -
తప్పులు సరిదిద్దుకోవాలి: గోపీచంద్
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ రన్నరప్ కిడాంబి శ్రీకాంత్‌పై చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రశంసలు కురిపించాడు. గాయం నుంచి కోలుకుని వరుస మ్యాచ్‌లలో విజయం సాధించడం శుభపరిణామం అన్నాడు. అయితే, ఈ ఏడాది ఆరంభంలో శ్రీకాంత్‌లో ఆత్మవిశ్వాసం తక్కువగా కనిపించిందన్న గోపీచంద్.. టోర్నీలు ఆడుతున్నకొద్దీ ఆట మెరుగు కావడంతో తనపై తనకు నమ్మకం పెరిగిందని తెలిపాడు. సరైన సమయంలో చెలరేగి విజయం సాధించాడని... అయితే వచ్చే ఏడాది మరిన్ని టోర్నీలు గెలవాలంటే శ్రీకాంత్ తాను చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలని గోపీచంద్ సూచించాడు. ఏదేమైనా ఈ టోర్నీలో శ్రీకాంత్‌తో పాటు లక్ష్య సేన్, ప్రణయ్‌ల ప్రదర్శన పట్ల కూడా చాలా సంతృప్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్ రజత పతకం సాధించగా.. లక్ష్యసేన్ కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IND Vs SA: అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే! Kidambi Srikanth 🇮🇳 and Loh Kean Yew 🇸🇬 are as cool as cucumbers in this spectacular rally.#TotalEnergiesBadminton #BWFWorldChampionships #Huelva2021 pic.twitter.com/0FS7OzBCb1 — BWF (@bwfmedia) December 20, 2021 -
వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నీలో దూసుకుపోతున్న సింధు..
PV Sindhu: స్పెయిన్‌లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021లో తెలుగు తేజం, డిఫెండింగ్ ఛాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన పాన్పావీ చోచువాంగ్‌తో గురువారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో 21-14, 21-18 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. 48 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సింధు తన తదుపరి మ్యాచ్‌లో(క్వార్టర్స్) చైనీస్ తైపీ క్రీడాకారిణి టైజు యింగ్‌తో తలపడనుంది. చదవండి: విరాట్‌లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్ సంచలన వ్యాఖ్యలు -
మూడో రౌండ్లోకి దూసుకెళ్లిన సింధు.. 24 నిమిషాల్లో ఖేల్ ఖతం
PV Sindhu: స్పెయిన్‌లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021లో తెలుగు తేజం, డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో స్లోవేకియాకి చెందిన మార్టినా రెపిస్కాను 21-7, 21-9 తేడాతో వరుస సెట్లలో చిత్తుగా ఓడించిన సింధు.. తొలి సెట్‌ను 10 నిమిషాల్లో, మ్యాచ్‌ను 24 నిమిషాల్లో ఖతం చేసింది. ఈ మ్యాచ్‌లో సింధు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించడంతో ప్రత్యర్ధి రెపిస్కా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కాగా, ఈ టోర్నీలో సింధు సహా కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్‌లు కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు. చదవండి: లంక ప్రీమియర్ లీగ్‌లో కోహ్లి.. శ్రీలంక క్రికెటర్ మనసులో మాట..! -
శ్రీవేద్యకు మహిళల డబుల్స్ టైటిల్..
మెక్సికో ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ అమ్మాయి గురజాడ శ్రీవేద్య డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. మెక్సికోలోని గ్వాడలహారా నగరంలో జరిగిన ఈ టోర్నీ మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీవేద్య (భారత్)–ఇషికా జైస్వాల్ (అమెరికా) జోడీ 20–22, 21–17, 21–16తో క్రిస్టల్ లాయ్–అలెగ్జాండ్రా మొకాను (కెనడా) జంటపై నెగ్గింది. 19 ఏళ్ల శ్రీవేద్య హైదరాబాద్‌లోని చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. చదవండి: Rohit Sharma- Virat Kohli: టెస్టులకు రోహిత్ దూరం.. వన్డే సిరీస్ నుంచి కోహ్లి అవుట్.. అసలేం జరుగుతోంది? -
లిన్ డాన్ గుడ్‌బై
బీజింగ్: రెండు దశాబ్దాలు బ్యాడ్మింటన్‌ను ఏలిన చైనా విఖ్యాత షట్లర్ లిన్ డాన్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. శనివారం తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రత్యర్థులకే కాదు... బ్యాడ్మింటన్‌కే ‘సూపర్ డాన్’గా చిరపరిచితుడైన లిన్ సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘2000 నుంచి 2020 వరకు ఇరవై ఏళ్లు ఆటలో కొనసాగిన నేను జాతీయ జట్టుకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నాను. ఇలా చెప్పడం నాకు చాలా క్లిష్టమైనా తప్పలేదు. నాకు ఇప్పుడు 37 ఏళ్లు. నా శారీరక సామర్థ్యం. గాయాలతో ఒకప్పటిలా నేను మా జట్టు సహచరులతో కలిసి పోరాడలేను. ఆటపై కృతజ్ఞత ఉంది. పైబడిన వయసుతో ఇబ్బంది ఉంది. అందుకే ఇక కుటుంబానికే అంకితమవ్వాలనుకుంటున్నా. జీవితంలో నాకిది కొత్త పోటీ’ అని వెటరన్ లిన్ డాన్ చైనా సోషల్ మీడియా యాప్ ‘వైబో’లో పోస్ట్ చేశాడు. ఆటనే ప్రేమించిన తను అంకితభావంతో నాలుగు ఒలింపిక్స్ ఆడానని చెప్పాడు. ఇన్నేళ్లుగా బ్యాడ్మింటనే లోకమైన తాను ఇలా రిటైర్మెంట్ చెబుతానని ఎప్పుడు అనుకోలేదని అన్నాడు. ర్యాంకింగ్ కంటే ఎక్కువగా ఆడటంపైనే దృష్టిపెట్టిన తనకు శారీరకంగా ఎన్నో సవాళ్లు ఎదురైనట్లు తెలిపాడు. ‘ఆటలో నన్ను ఉత్సాహంగా పోటీపడేలా స్ఫూర్తి పెంచిన నా మేటి ప్రత్యర్థులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని లిన్ డాన్ తనకెదురైన పోటీదారులను గౌరవించాడు. మేరునగధీరుడు... 666 మ్యాచ్‌లలో విజయాలు... 66 టైటిల్స్...ఇదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో డాన్ సాధించిన ఘనత. గ్లోబ్‌లోని దేశాలన్నీ చుడుతూ అతను టైటిళ్లన్నీ పట్టేశాడంటే అతిశయోక్తి కాదు. చైనీస్ సూపర్‌స్టార్ కచ్చితంగా చాంపియనే. ఏళ్ల తరబడి... దశాబ్దాలు తలపడి ఎవరికీ అనితర సాధ్యమైన టైటిళ్లన్నీ అతనొక్కడే సాధించాడు. రెండు సార్లు ఒలింపిక్ చాంపియన్. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్. ఐదు సార్లు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్. మరో ఐదుసార్లు ఆసియా గేమ్స్ విజేత. ఇంకో ఐదు సుదిర్మన్ కప్ విజయాలు. థామస్ కప్‌లో అరడజను బంగారు పతకాలు. 4 ఆసియా చాంపియన్‌షిప్ స్వర్ణాలు. 2 ప్రపంచకప్ విజయాలు. ఈ వేటలో రన్నరప్ రజతాలు, కాంస్యాలు చెప్పుకుంటూ పోతే డాన్ పతకాల జాబితా చాంతాడంత ఉంది. 2004లోనే వరల్డ్ నంబర్ వన్ అయ్యాడు అన్ని గెలుస్తూపోతూ 28 ఏళ్లకే ‘సూపర్ గ్రాండ్ స్లామ్’ సాధించాడు. అంటే బ్యాడ్మింటన్ చరిత్రలో ఉన్న 9 మేజర్ టైటిళ్లను సాధించిన ఏకైక షట్లర్‌గా చరిత్రకెక్కాడు. ఒలింపిక్ చాంపియన్‌షిప్ (2008, 2012) నిలబెట్టుకున్న తొలి, ఒకేఒక్క బ్యాడ్మింటన్ ఆటగాడు కూడా లిన్ డానే! 2004లో జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఇతని దెబ్బకు తలవంచిన పీటర్ గేడ్... చైనీస్ ఆటగాడిని ఉద్దేశిస్తూ ‘సూపర్ డాన్’గా కితాబిచ్చాడు. తర్వాత్తర్వాత అదే పేరు స్థిరపడిపోయేలా తన రాకెట్‌తో బ్యాడ్మింటన్ లోకాన్నే రఫ్ఫాడించాడు. 2002లో తన తొలి టైటిల్ సాధించినప్పటినుంచి ప్రతీ సంవత్సరం అతను కనీసం ఒక్క టోర్నీలోనైనా విజయం సాధించడం విశేషం. బ్యాడ్మింటన్‌లో దిగ్గజ చతుష్టయంగా గుర్తింపు తెచ్చుకున్న నలుగురిలో చివరగా డాన్ రిటైరయ్యాడు. మిగతా ముగ్గురు లీ చోంగ్ వీ, తౌఫీక్ హిదాయత్, పీటర్ గేడ్‌లతో పోలిస్తే సాధించిన ఘనతల ప్రకారం లిన్ డాన్ అందరికంటే గ్రేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వాయిదా
ఆక్లాండ్: కరోనా వైరస్ నేపథ్యంలో మెగా టోర్నమెంట్ల వాయిదాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చేరింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరగాల్సింది. అయితే కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ మెగా టోర్నీని వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 24 వరకు నిర్వహిస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. సెప్టెంబర్‌లో జరగాల్సిన టోర్నీకి అర్హత పొందిన క్రీడాకారులే వాయిదా పడిన టోర్నీలో ఆడతారని బీడబ్ల్యూఎఫ్ వివరించింది. -
సాయిప్రణీత్ విరాళం రూ. 4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనాపై పోరాటానికి మద్దతుగా భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి ఆటగాడు, హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ తనవంతుగా రూ. 4 లక్షలు విరాళం ఇచ్చాడు. గతేడాది ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన సాయిప్రణీత్... ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 3 లక్షలు... తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 1 లక్ష వితరణ చేశాడు. కరోనా కట్టడి కోసం ఇప్పటి వరకు బ్యాడ్మింటన్ క్రీడాంశం నుంచి చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ (రూ. 26 లక్షలు), పీవీ సింధు (రూ. 10 లక్షలు), శ్రీకృష్ణప్రియ (రూ. 5 లక్షలు), కశ్యప్ (రూ. 3 లక్షలు) విరాళాలు ఇచ్చారు. హాకీ ఇండియా (హెచ్ఐ) ఇప్పటికే పీఎం–కేర్స్ రిలీఫ్ ఫండ్ కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించగా... తాజా ఒడిశా సీఎం సహాయనిధికి రూ. 21 లక్షలు ఇచ్చింది. చెస్ క్రీడాకారుల దాతృత్వం కోవిడ్–19పై పోరాటానికి చెస్ క్రీడాకారులందరూ ఏకమయ్యారు. ఆన్లైన్ టోర్నీల్లో పాల్గొనడం, విరాళాల ద్వారా రూ. 3 లక్షలకు పైగా నిధుల్ని సమకూర్చారు. తమిళనాడుకు చెందిన చెస్ కోచ్ ఆర్బీ రమేశ్‌కు చెందిన చారిటబుల్ ట్రస్ట్ ‘చెస్ గురుకుల్’కు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రూ. 2 లక్షలు, కార్తికేయన్ మురళి రూ. 25,000 విరాళం ఇచ్చారు. -
సైనాకు చుక్కెదురు
బార్సిలోనా: బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ టోర్నమెంట్లో భారత షట్లర్ సైనా నెహ్వాల్‌కు చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సైనా 20–22, 19–21తో బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫాన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. పురుషుల విభాగంలో మాత్రం అజయ్ జయరామ్ (భారత్) సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్ పోరులో అతను 21–14, 21–15తో థామస్ రౌజెల్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ (భారత్) 21–17, 17–21, 12–21తో కున్లావుట్ విటిడ్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడాడు. -
శ్రీకాంత్‌కు షాకిచ్చిన జయరామ్
బార్సిలోనా: కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోన్న భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ మళ్లీ తడబడ్డాడు. బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ టోర్నమెంట్లో ప్రపంచ 12వ ర్యాంకర్ శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. భారత్‌కే చెందిన ప్రపంచ 68వ ర్యాంకర్ అజయ్ జయరామ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 28 నిమిషాల్లో 6–21, 17–21తో ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్ మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ (భారత్) 21–14, 16–21, 21–15తో కాయ్ షాఫెర్ (జర్మనీ)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహా్వల్ (భారత్) 21–10, 21–19తో మరియా ఉలిటినా (ఉక్రెయిన్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశి్వని (భారత్) జంట 18–21, 14–21తో గాబ్రియెలా–స్టెఫానీ (బల్గేరియా) జోడీ చేతిలో... మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 16–21, 21–16, 13–21తో సూన్ హువాట్–లాయ్ షెవోన్ జేమీ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయాయి. -
‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా సింధు
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్, భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది. ఈఎస్పీఎన్ గురువారం ప్రకటించిన అవార్డుల్లో సింధు ‘ఈ ఏటి మేటి మహిళా క్రీడాకారిణి’ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈఎస్పీఎన్ ఫిమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా నిలవడం సింధుకిది వరుసగా మూడోసారి. పురుషుల విభాగంలో యువ షూటర్ సౌరభ్ వర్మ ఈ అవార్డును అందుకున్నాడు. 2019 ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో సౌరభ్ ప్రదర్శన అతనికి ఈ అవార్డును తెచ్చి పెట్టింది. ఈ మెగా టోర్నీలో సౌరభ్ 5 స్వర్ణాలతో మెరిశాడు. 10మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగాల్లో రెండు పసిడి పతకాలను గెలుచుకున్న సౌరభ్... మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో 3 స్వర్ణాలను హస్తగతం చేసుకున్నాడు. అథ్లెటిక్స్‌లో సత్తా చాటుతూ యువతరానికి ఆదర్శంగా నిలుస్తోన్న ఒడిశా స్ప్రింటర్ ద్యుతీ చంద్‌కు ‘కరేజ్’ అవార్డు లభించింది. పునరాగమనంలో అద్భుత విజయాలు సాధిస్తోన్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ‘కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్ని అందుకుంది. బిడ్డకు జన్మనిచ్చాక రెండేళ్లు ఆటకు దూరమైన హంపి... గతేడాది డిసెంబర్లో రష్యా వేదికగా జరిగిన ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఆమె విశ్వ విజేతగా అవతరించింది. రెజ్లర్ దీపక్ పూనియా ‘ఎమర్జింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకోగా... బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్స్ పతక విజేతలను తయారు చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్ ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. సింధు ప్రపంచ చాంపియన్‌షిప్ గెలిచిన క్షణం ‘మూమెంట్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికైంది. 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆకట్టుకున్న మను భాకర్–సౌరభ్ చౌదరి జోడీకి ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కింది. మాన్సీ జోషికి ‘ పారా అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం దక్కగా... జీవిత కాల సాఫల్య పురస్కారం హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్‌కు దక్కింది. -
తెలంగాణ మాస్టర్స్ బ్యాడ్మింటన్ జట్టుకు సన్మానం
హైదరాబాద్: జాతీయ మాస్టర్స్ గేమ్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో రాణించిన తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఆదివారం ఘన సన్మానం జరిగింది. ఎల్బీ స్టేడియంలోని ఫతే మైదాన్‌లో నిర్వహించిన ఈ అభినందన కార్యక్రమంలో తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రావు, అఖిల భారత మాస్టర్స్ గేమ్స్ కన్వీనర్ సంజయ్‌ల క్రీడాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులు వేణు ముప్పాల, జ్ఞాన ప్రసాద్ మాట్లాడుతూ ఈ పోటీల్లో కాంస్యం నెగ్గడం ఆనందంగా ఉందని అన్నారు. వచ్చే ఏడాది జరుగబోయే పోటీల్లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతామని చెప్పారు. -
సింధు నిష్క్రమణ
జకర్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. స్టార్ షట్లర్ పీవీ సింధు గురువారం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 21–16, 16–21, 19–21తో సయాక తకహషి (జపాన్) చేతిలో భంగపడింది. తొలి గేమ్‌ను గెలుచుకున్న సింధు... అనంతరం మిగిలిన రెండు గేముల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకు ముందే బుధవారం మిగిలిన భారత షట్లర్లు టోర్నీనుంచి నిష్క్రమించారు. తొలి రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ 21–19, 13–21, 5–21తో సయాక తకహషి చేతిలో ఓడింది. కిడాంబి శ్రీకాంత్ 21–18, 12–21, 14–21తో హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా) చేతిలో, సాయి ప్రణీత్ 21–16, 18–21, 10–21తో షి యు కీ (చైనా) చేతిలో, సౌరభ్ వర్మ 21–17, 15–21, 10–21తో లు జుయాంగ్ జు (చైనా) చేతిలో, సమీర్ వర్మ 17–21, 21–19, 10–21తో టామీ సుగియార్తో (ఇండోనేసియా) చేతిలో, పారుపల్లి కశ్యప్ 14–21, 12–21తో ఆంథోని సినిసుక జింటింగ్ (ఇండోనేసియా) చేతిలో, హెచ్ఎస్ ప్రణయ్ 17–21, 14–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి 20–22, 15–21 స్కోరుతో మొహమ్మద్ – హెండ్రా సెటియావన్ జోడీ (ఇండోనేసియా) చేతిలో ఓడగా... మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా– సిక్కి రెడ్డి జంట 8–21, 14–21తో కో సుంగ్ హ్యూన్– యోమ్ హే వోన్ ద్వయం (దక్షిణ కొరియా) చేతిలో పరాజయాన్ని చవిచూసింది. -
సింధు సత్తాకు పరీక్ష
గ్వాంగ్జౌ (చైనా): గత ఆగస్టులో ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలిచాక... భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆడిన ఆరు టోర్నీల్లో కనీసం క్వార్టర్ ఫైనల్ దశ దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో టైటిల్ నిలబెట్టుకొని ఈ ఏడాదిని ఘనంగా ముగించాలనే లక్ష్యంతో సింధు ఉంది. వాస్తవానికి వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీకి సూపర్ టోర్నీల ర్యాంకింగ్స్‌లో టాప్–8లో ఉన్నవారికి మాత్రమే అవకాశం లభిస్తుంది. టాప్–8లో సింధు లేకపోయినా ప్రపంచ చాంపియన్ హోదాలో ఆమెకు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడేందుకు అవకాశమిచ్చారు. వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో సింధుకు మెరుగైన రికార్డు ఉంది. 2017లో ఆమె రన్నరప్‌గా నిలువగా... 2018లో విజేతగా అవతరించింది. ఈసారి సింధుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’లో సింధుతోపాటు ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్), రెండో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా), ఏడో ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా) ఉన్నారు. నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో యామగుచితో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 10–6తో ఆధిక్యంలో ఉంది. గ్రూప్ ‘బి’లో నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), ప్రపంచ మాజీ చాంపియన్స్ రచనోక్ (థాయ్‌లాండ్), ఒకుహారా (జపాన్), బుసానన్ (థాయ్ లాండ్) ఉన్నారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్ ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. 14న సెమీఫైనల్స్, 15న ఫైనల్స్ జరుగుతాయి. -
నవనీత్–సాహితి జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రెండోసీడ్ బి. నవనీత్–సాహితి (మెదక్) జంట సత్తా చాటింది. గచ్చిబౌలిలో జరిగిన ఈ టోర్నీలో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఈ జంట చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. ఫైనల్లో నవనీత్–సాహితి (మెదక్) ద్వయం 17–21, 21–13, 21–14తో టాప్‌సీడ్ శ్రీకృష్ణ సాయికుమార్ (రంగారెడ్డి)–గురజాడ శ్రీవేద్య (మెదక్) జోడీపై అద్భుత విజయాన్ని అందుకుంది. తొలి గేమ్‌లో వెనుకబడిన ఈ జోడీ తరువాతి రెండు గేముల్లో ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్ శ్రీకృష్ణ సాయికుమార్ (రంగారెడ్డి)–పి. విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) జోడీ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో శ్రీకృష్ణ–విష్ణువర్ధన్ జంట 19–21, 21–15, 21–14తో రెండోసీడ్ ఆకాశ్ చంద్రన్–సాయిరోహిత్ (హైదరాబాద్) జోడీపై నెగ్గింది. మహిళల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ అభిలాష (హైదరాబాద్)–శ్రీవేద్య (మెదక్) జోడీ 14–21, 21–18, 21–17తో టాప్ సీడ్ కె. భార్గవి–వైష్ణవి (రంగారెడ్డి) జంటకు షాకిచి్చంది. సింగిల్స్ విభాగంలో ఎం. మేఘనారెడ్డి (హైదరాబాద్), ఎం. తరుణ్ (ఖమ్మం) చాంపియన్లుగా నిలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో తరుణ్‌కు వాకోవర్ లభించగా... మహిళల ఫైనల్లో ఐదో సీడ్ మేఘన 21–11, 1–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో మూడోసీడ్ అభిలాష రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం (హెచ్‌డీబీఏ) అధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
పీవీ సింధుకు కారును బహూకరించిన నాగ్
-
పీవీ సింధుకు కారును బహూకరించిన నాగ్
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధును అన్ని రంగాల ప్రముఖులు అభినందిస్తున్నారు. బ్యాడ్మింటన్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు ప్రముఖులు నజరానాలు ప్రకటిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ సింధుకు ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహూకరించారు. శవివారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో సినీ హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా పీవీ సింధుకు కారును బహుమతిగా అందజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో రజతం గెలిచిన సందర్బంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా సింధుకు ఖరీదైన కారును బహుకరించిన విషయం తెలిసిందే. -
మరో బంగారం; ‘అదొక అద్భుతమైన రోజు’!
భారత బ్యాడ్మింటన్ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన తెలుగు తేజం పీవీ సింధు పేరు మారుమ్రోగిపోతోంది. భారత్‌కు ఒలంపిక్ పతకం సాధించిపెట్టడంతో పాటుగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచిన ఆమెకు భారతావని నీరాజనాలు పలుకుతోంది. నాలుగు దశాబ్దాల కలగా ఉన్న స్వర్ణాన్ని సాధించిన సింధు ‘మా బంగారం’ అంటూ మురిసిపోతోంది. ఆటలో అసాధారణ ప్రతిభ కనబరిచిన సింధు బ్రాండ్ వ్యాల్యూ కూడా అమాంతం పెరిగిపోయింది. స్విట్జర్లాండ్‌లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సింధుకు స్వదేశంలో అపూర్వ స్వాగతంతో పాటుగా పలు నజరానాలు లభించాయి. ఆమె గురువు బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ కూడా ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనదంటూ సింధుపై ప్రశంసలు కురిపించారు. ఇలా దేశమంతా సింధు విజయాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వంతో మునిగిపోయిన వేళ.. ఆదివారం నాడు స్విట్జర్లాండ్‌లో మరో భారత క్రీడాకారిణి కూడా స్వర్ణం సాధించారు. తన పేరు మానసి జోషి. పారా బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన 30 ఏళ్ల క్రీడాకారిణి ఆమె. తన ప్రత్యర్థి, ప్రపంచ నెంబర్ 1 పారుల్ పామర్ను మట్టికరిపించి తొలిసారి పారా వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అన్నట్లు ఇంకో విషయం ఈ ‘బంగారు’ తల్లి కూడా గోపీచంద్ అకాడమీలోనే శిక్షణ తీసుకోవడం విశేషం. విషాదం నుంచి తేరుకుని చాంపియన్‌గా.. ముంబైలో 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మానసి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆమె ఎడమ కాలు తెగిపడింది. ఎముకలు విరిగిపోవడంతో పాటు శరీరంలోని పలు కీలక భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన దాదాపు మూడు గంటల పాటు ఘటనాస్థలిలోనే పడి ఉన్నారు. దాదాపు పది గంటల తర్వాత ఆస్పత్రికి చేరిన ఆమెకు వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు. అయితే ఆమె కాలు మాత్రం తిరిగి అతికించే అవకాశం లేదని చెప్పారు. గ్యాంగ్రీన్ సోకిన కారణంగా దానిని తొలగించామనే చేదు నిజాన్ని మానసికి చెప్పారు. అయితే ఆ విషాదం నుంచి తేరుకున్న మానసి నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోలేదు. ఈ క్రమంలో దాదాపు ఏడాది తర్వాత కృత్రిమ కాలుతో నడవడం ప్రారంభించిన మానసి బ్యాడ్మింటన్‌పై ఆసక్తితో ఆట సాధన చేశారు. అదేవిధంగా స్కూబా డైవింగ్‌లో కూడా మెళకువలు నేర్చుకున్నారు. పారా ఏషియన్ గేమ్స్‌లో ఎంపిక కాకపోయినా పట్టుదల వదలక అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. ఇలా తనకు ఇష్టమైన బ్యాడ్మింటన్‌లో రాణిస్తూ.. దృఢ సంకల్పం ముందు వైకల్యం కూడా చిన్నబోతుందని నిరూపించారు. శరీరంలో ఒక భాగం కోల్పోయినంత మాత్రాన జీవితంలో ఇక ఏమీ సాధించలేమనే భావనను దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చాంపియన్‌గా నిలిచి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. 2014లో అంతర్జాతీయ క్రీడల్లో ప్రవేశించిన మానసి ప్రస్తుతం ‘పసిడి’ దక్కించుకుని తానేంటో ప్రపంచానికి చాటిచెప్పారు. మానసికంగా సన్నద్ధమయ్యా.. తన గెలుపు గురించి మానసి మాట్లాడుతూ...‘ ప్రపంచ చాంపియన్ అనిపించుకోవడం ఎంతో గర్వంగా ఉంటుంది. అయితే ఈ విజయం నాకు అలవోకగా దక్కలేదు. ఎన్నో సవాళ్లను అధిగమించి పసిడి కైవసం చేసుకున్నాను. ఎంతో మంది క్రీడాకారులు ఇలాంటి క్షణం కోసం నాలాగే ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. కెనడియన్ ఓపెన్‌లో నేను పారుల్(ఇండియా) చేతిలో ఓటమి చవిచూశా. అందుకే ఈ పోటీలకు మానసికంగా సన్నద్ధమయ్యా. ఫిట్నెస్తో పాటు ఆట తీరుపై మరింత దృష్టి పెట్టాను. ఎంతో మంది గొప్ప క్రీడాకారులు అసాధారణ విజయాలు సాధించిన ఇదే వేదికపై నేను కూడా నా కలను సాకారం చేసుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది’ అని హర్షం వ్యక్తం చేశారు. క్లియర్ స్ట్రోక్స్ సంధిస్తూ కేవలం ఆటపై మాత్రమే దృష్టి సారించాలనే గోపీ సర్ మాటలను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ పోటీకి రెండు నెలల ముందు అకాడమీలో జాయిన్ అయిన ఆమె గోపీచంద్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ‘ఇప్పటికైనా ఓ క్రీడాకారిణిగా నా జీవితం మారుతుందనుకుంటున్నా. ఈ పతకం సాధించడం కోసం నేను పడిన కఠోర శ్రమకు తగిన గుర్తింపు, సహాయం లభిస్తుందని ఆశిస్తున్నా. వచ్చే ఏడాది జరుగనున్న పారా ఒలంపిక్స్‌పైనే ప్రస్తుతం దృష్టి సారించాను’ అని తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు. అదే విధంగా తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న మానసి...‘టోక్యో పారా ఒలంపిక్స్‌కు ఓ ఏడాది ముందుగానే స్వర్ణం సాధించాను. ప్రపంచ బ్యాడ్మింటన్‌షిప్‌లో అద్భుతమైన రోజు అది. పీవీ సింధు నువ్వు చాలా గ్రేట్. శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో మానసికి ట్విటర్ వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మానసిపై ప్రశంసలు కురిపించారు. ‘ పారా బ్యాడ్మింటన్‌లో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిన మానసి జోషికి అభినందనలు. ఈ విజయంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన నీకు శుభాకాంక్షలు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇక మనం కూడా మానసి కోరుకున్నట్లుగా కాస్త ఆలస్యంగానైనా సరే ఆమె విజయానికి తగిన గుర్తింపు దక్కాలని ఆశిద్దాం. Many congratulations to #MansiJoshi on winning gold for India 🇮🇳 at the Para-Badminton World Championship 👏👏 Kudos to your spirit & achievement 👍 pic.twitter.com/qGU34X6IBN — KTR (@KTRTRS) August 28, 2019 -
సింధు, సైనాలకు ‘బై’
కౌలాలంపూర్ (మలేసియా): అందని ద్రాక్షగా ఉన్న స్వర్ణ పతకమే లక్ష్యంగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పోటీపడనున్న భారత మహిళా స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు ఒకింత క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 19 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్‌లోని బాసెల్ నగరంలో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి సోమవారం కౌలాలంపూర్‌లో ‘డ్రా’ విడుదల చేశారు. ఈ ఏడాది అంతగా ఫామ్‌లో లేని సింధు ఐదో సీడ్‌గా, సైనా ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగనున్నారు. సింధు, సైనాలతోపాటు సీడింగ్ పొందిన 16 మంది క్రీడాకారిణులకు తొలి రౌండ్లో ‘బై’ లభించడంతో వారందరూ నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడనున్నారు. పై పార్శ్వంలో ఉన్న సైనాకు రెండో రౌండ్లో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్), ప్రిక్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ మిచెల్లి లీ (కెనడా) లేదా ఫిత్రియాని (ఇండోనేసియా)లలో ఒకరు ఎదురుకావొచ్చు. ఈ అడ్డంకిని అధిగమిస్తే క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ చెన్ యు ఫె (చైనా) లేదా తొమ్మిదో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా)లలో ఒకరితో సైనా ఆడే అవకాశముంటుంది. సైనా సెమీస్ చేరితే అక్కడ ప్రపంచ నంబర్‌వన్ అకానె యామగుచి (జపాన్) లేదా ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)లలో ఒకరు ప్రత్యర్థిగా ఉంటారు. కింది పార్శ్వంలో ఉన్న సింధు తన స్థాయికి తగ్గట్టు ఆడితే క్వార్టర్ ఫైనల్‌కు సులువుగా చేరుకోవచ్చు. క్వార్టర్ ఫైనల్లోనే సింధుకు మాజీ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) రూపంలో అసలు పరీక్ష ఎదురయ్యే చాన్స్ ఉంది. ఈ అవరోధాన్ని అధిగమిస్తే సింధుకు సెమీస్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ ఒకుహారా (జపాన్) లేదా ఆరో సీడ్ హి బింగ్జియావో (చైనా)లలో ఒకరు ప్రత్యర్థిగా ఉండే అవకాశముంది. శ్రీకాంత్‌కు సదవకాశం: పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున నలుగురు ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఏడో సీడ్‌గా కిడాంబి శ్రీకాంత్, పదో సీడ్‌గా సమీర్ వర్మ, 16వ సీడ్‌గా సాయిప్రణీత్, అన్‌సీడెడ్‌గా ప్రణయ్ బరిలో ఉన్నారు. శ్రీకాంత్ సహజశైలిలో ఆడితే క్వార్టర్ ఫైనల్ చేరే చాన్స్ ఉంది. క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఉంటాడు. మారిన్ దూరం: మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) గాయం కారణంగా ఈ పోటీల నుంచి వైదొలిగింది. పురుషుల సింగిల్స్‌లో మాజీ విశ్వవిజేత అక్సెల్సన్ (డెన్మార్క్), రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) కూడా తప్పుకున్నారు. -
మొమోటా సిక్సర్...
టోక్యో: ఏడాది కాలంగా అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న జపాన్ బ్యాడ్మింటన్ స్టార్ కెంటో మొమోటా ఈ సీజన్లో ఆరో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సొంతగడ్డపై ఆదివారం ముగిసిన జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ మొమోటా టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ అయిన కెంటో మొమోటా 21–16, 21–13తో ఆరో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై అలవోకగా గెలుపొందాడు. 44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో మొమోటాకు ఏ దశలోనూ క్రిస్టీ పోటీనివ్వలేకపోయాడు. విజేత మొమోటాకు 52,500 డాలర్ల (రూ. 36 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది తొమ్మిది టోర్నీల్లో పాల్గొన్న మొమోటా ఆరు టోర్నీల్లో చాంపియన్‌గా నిలిచాడు. జపాన్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్, సింగపూర్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, జర్మన్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీల్లో మొమోటా టైటిల్స్ సాధించాడు. -
మనీషా జోడీకి డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: లాగోస్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ క్లాసిక్స్ టోర్నీలో తెలుగు అమ్మాయి మనీషా మిక్స్డ్ డబుల్స్‌లో విజేతగా నిలిచింది. ఫైనల్లో టాప్‌సీడ్ మనీషా–అర్జున్ (భారత్) జంట 21–16, 21–17తో శ్లోక్ రామచంద్రన్–రుతుపర్ణ (భారత్) జోడీని ఓడించింది. మరోవైపు మహిళల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ దండు పూజ–సంజన (భారత్) ద్వయం 21–18, 8–21, 21–14తో టాప్ సీడ్ ఎర్సెటిన్ బెంగిసు–ఇన్సి నజ్లికాన్ (టర్కీ) జోడీపై గెలుపొందింది. -
మనీషా జోడీకి డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: జేఈ విల్సన్ ఘనా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సిరీస్‌లో తెలుగు అమ్మాయి మనీషా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. మహిళల డబుల్స్‌లో రుతుపర్ణతో కలిసి చాంపియన్‌గా నిలిచిన మనీషా... మిక్స్డ్ డబుల్స్‌లో అర్జున్‌తో కలిసి రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఘనాలోని అక్రా వేదికగా జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో మనీషా–రుతుపర్ణ (భారత్) ద్వయం 21–11, 21–11తో డోర్కస్ అజోకే అడ్సోకన్–చెచువు డెబోరా ఉకెహ్ (నైజీరియా) జంటపై అలవోక విజయాన్ని సాధించింది. మిక్స్డ్ డబుల్స్ టైటిల్ పోరులో టాప్ సీడ్‌గా బరిలో దిగిన మనీషా–అర్జున్ (భారత్) జంట 19–21, 15–21తో శ్లోక్–రుతుపర్ణ (భారత్) జోడీ చేతిలో కంగుతింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అర్జున్–శ్లోక్ (భారత్) జోడీ 21–11, 21–12తో గోడ్విన్ ఓలోఫువా–అనౌలువాపో జువోన్ ఒపెయోరి (నైజీరియా) జంటపై నెగ్గింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిరణ్ జార్జ్ (భారత్) 25–23, 21–19తో అడె రెస్కీ వికాయో (అజర్బైజాన్)ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ ముగ్ధా ఆగ్రే (భారత్) 10–21, 6–21తో థి త్రాంగ్ వు (వియత్నాం) చేతిలో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. తొలిసారి జరిగిన ఈ టోర్నీలో భారత్ 4 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలను సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. -
ముగిసిన మేఘన పోరాటం
వ్లాదివోస్తోక్: వరుస విజయాలతో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పతకాలపై ఆశలు రేపిన హైదరాబాద్ అమ్మాయి మేఘన జక్కంపూడి పోరాటం సెమీస్‌తో ముగిసింది. రష్యా ఓపెన్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శనివారం కేవలం 27 నిమిషాల పాటు సాగిన మిక్స్డ్ డబుల్స్ సెమీస్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ మేఘన–ధృవ్ కపిల జోడి 6–21, 15–21తో అద్నాన్ మౌలానా–మిచెల్లి క్రిస్టిన్ బండాసో (ఇండోనేషియా) జంట చేతిలో ఓడింది. అనంతరం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో టాప్ సీడ్ మేఘన–పూర్విషా రామ్ జంట 10–21, 8–21తో నాలుగో సీడ్ మికి కషిహర–మియుకి కటో (జపాన్) ద్వయం చేతిలో కంగుతింది. కేవలం 33 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో భారత జోడి ఏమాత్రం పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసింది. -
హిమాన్షు, నమితలకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత ప్రభుత్వ రంగ సంస్థల బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) క్రీడాకారులు హిమాన్షు తివారీ, నమిత పథానియా విజేతలుగా నిలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో భాస్కర్ చక్రవర్తి (ఆర్బీఐ)పై హిమాన్షు... మహిళల తుది పోరులో లీనా ధాప్రే (ఎల్ఐసీ)పై నమిత గెలుపొంది టైటిళ్లను కైవసం చేసుకున్నారు. మరోవైపు డబుల్స్ విభాగంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్రీడాకారులు సత్తా చాటారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో అంజన్–రంజన్ బోర్గోహైన్ (ఆర్బీఐ) జోడీపై శివమ్ శర్మ–సంజిత్ (ఆర్బీఐ) జంట గెలుపొందగా... మహిళల డబుల్స్ తుదిపోరులో లీనా–వరద దీక్షిత్ (ఎల్ఐసీ) జంటపై మనీషా–రసిక రాజే (ఆర్బీఐ) ద్వయం నెగ్గి చాంపియన్లుగా నిలిచాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎల్ఐసీ సౌత్‌జోన్ మేనేజర్ మినీ ఐపే ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ప్రణవ్ రామ్‌కు సింగిల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సబ్ జూనియర్ (అండర్–13) ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు ఎన్. ప్రణవ్ రామ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో ప్రణవ్ బాలుర సింగిల్స్ విభాగంలో టైటిల్‌తో పాటు... డబుల్స్‌తో తన భాగస్వామి రామ్ ప్రసాద్‌తో కలిసి రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం బాలుర సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ ప్రణవ్ 21–11, 20–22, 21–19తో అంకరన్ శర్మ (హరియాణా)పై గెలుపొందాడు. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నవ్యకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో టాప్‌సీడ్ నవ్య 19–21, 19–21తో రెండో సీడ్ ఉన్నతి హుడా (హరియాణా) చేతిలో కంగుతింది. బాలుర డబుల్స్ విభాగంలో టాప్‌సీడ్ ప్రణవ్ రామ్–సాయిప్రసాద్ (తెలంగాణ) ద్వయం 13–21, 21–12, 12–21తో అహంథమ్ కాస్పరోవ్–బోరిశ్ సలామ్ (మణిపూర్) చేతిలో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. బాలికల డబుల్స్ టైటిల్ పోరులో నవ్య (ఆంధ్రప్రదేశ్)–శ్రీవన్షి (తెలంగాణ) జంట 15–21, 21–10, 21–16తో టాప్‌సీడ్ ఉన్నతి (హరియాణా)–దివిత (ఆంధ్రప్రదేశ్) జోడీకి షాకిచ్చింది. -
9 నుంచి జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: పీఎన్బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగనున్న జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 9 నుంచి ఐదో ఎడిషన్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టోర్నమెంట్ వివరాలతో పాటు ట్యుటోరియల్ ప్రోగ్రామ్ ‘జేబీసీ బూట్ క్యాంప్’ను టోర్నీ బ్రాండ్ అంబాసిడర్, భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు, కోచ్ యు. విమల్ కుమార్ ఆవిష్కరించారు. ఈనెల 9 నుంచి సెప్టెంబర్ 10 వరకు దేశంలోని 10 నగరాల్లో అండర్–9, 11, 13, 15, 17 బాలబాలికల విభాగాల్లో ఈ టోర్నీ జరుగుతుంది. తొలి దశ (జూలై 9–12) పోటీలకు చండీగఢ్ ఆతిథ్యమివ్వనుంది. అనంతరం ముంబైలో జూలై 21నుంచి 25వరకు, పుణేలో జూలై 27నుంచి 31వరకు, కొచ్చిలో ఆగస్టు 2నుంచి 5వరకు, బెంగళూరులో ఆగస్టు 7నుంచి 11వరకు, గువాహటిలో ఆగస్టు 10నుంచి 13 వరకు, హైదరాబాద్‌లో 16నుంచి 20వరకు, అహ్మదాబాద్‌లో ఆగస్టు 19నుంచి 22వరకు, లక్నోలో ఆగస్టు 30నుంచి సెప్టెంబర్ 1వరకు, ఢిల్లీలో సెప్టెంబర్ 3నుంచి 7వరకు పోటీలు జరుగుతాయి. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. -
మనీశ్ కుమార్ హ్యాట్రిక్ టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మనీశ్ కుమార్ సత్తా చాటాడు. యూసుఫ్‌గూడలో జరిగిన ఈ టోర్నమెంట్లో పురుషుల, అండర్–19 బాలుర సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలిచిన మనీశ్... అండర్–19 బాలుర డబుల్స్‌లో తన భాగస్వామి బి. నిఖిల్ రాజ్‌తో కలిసి టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మనీశ్ కుమార్ 19–21, 21–12, 21–14తో తరుణ్ రెడ్డిపై గెలుపొందగా, మహిళల సింగిల్స్ తుదిపోరులో కైవల్య లక్ష్మి 21–15, 21–12తో పూర్వీ సింగ్ సుచిత్రను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. డబుల్స్ విభాగంలో అబ్దుల్ రెహాన్–ఆదిత్య గుప్తా, పూర్వీ సింగ్ సుచిత్ర–ప్రణాళి జంటలు విజేతలుగా నిలిచాయి. పురుషుల డబుల్స్ ఫైనల్లో అబ్దుల్ రెహాన్–ఆదిత్య గుప్తా జంట 21–14, 21–18తో గోపీకృష్ణ–సందీప్ జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో పూర్వీ సింగ్ సుచిత్ర–ప్రణాళి జంటకు ప్రత్యర్థి జోడీ క్రాంతి–మౌన్యశ్రీ నుంచి వాకోవర్ లభించడంతో విజేతగా నిర్ణయించారు. అండర్–19 బాలుర సింగిల్స్ ఫైనల్లో మనీశ్ కుమార్ 21–14, 21–16తో తరుణ్ రెడ్డిపై గెలుపొందాడు. అంతకుముందు సెమీస్‌లో తరుణ్ 21–12, 21–16తో తారక్‌పై, మనీశ్ 21–10, 18–21, 21–10తో పృథ్వీపై గెలిచారు. అండర్–19 బాలుర డబుల్స్ తుది పోరులో మనీశ్–నిఖిల్ రాజ్ ద్వయం 21–15, 21–15తో పృథ్వీ–వర్షిత్ రెడ్డి జోడీపై విజయం సాధించింది. అండర్–17 సింగిల్స్‌లో ధరణ్, డబుల్స్‌లో ఉనీత్ కృష్ణ–వర్షిత్ రెడ్డి జంట చాంపియన్లుగా నిలిచాయి. అండర్–17 బాలుర ఫైనల్లో ధరణ్ 21–16తో ఆధిక్యంలో ఉన్న సమయంలో శశాంక్ సాయి గాయంతో వైదొలిగాడు. డబుల్స్ తుదిపోరులో ఉనీత్ కృష్ణ–వర్షిత్ రెడ్డి జంట 21–19, 21–15తో నిఖిల్ రాజ్–తారక్ జోడీని ఓడించి టైటిల్‌ను అందుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్ ఎండీ ఎ. దినకర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షులు నాగవాణి పాల్గొన్నారు. -
సెమీస్‌లో అభిరామ్, శ్రీకర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కె. అభిరామ్ రెడ్డి, బి. శ్రీకర్ రెడ్డి సెమీఫైనల్లో అడుగుపెట్టారు. యూసుఫ్‌గూడ కేవీబీఆర్ స్టేడియంలో గురువారం జరిగిన అండర్–13 బాలుర సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో అభిరామ్ రెడ్డి 22–20, 21–19తో అభినవ్ గార్గ్‌పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో శ్రీకర్ రెడ్డి 26–24, 18–21, 21–11తో సాయి శ్రేయాన్‡్షపై, శుభ్ కుమార్ 21–19, 21–16తో అభిషేక్‌పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నారు. డబుల్స్ విభాగంలో అభిరామ్, శ్రీకర్ జతగా సెమీస్‌కు చేరుకున్నారు. బాలుర డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో శ్రీకర్ రెడ్డి–అభిరామ్ రెడ్డి ద్వయం 21–13, 21–7తో అభిషేక్–వరుణ్ తేజ్ జోడీపై, అభిషేక్–సాయి శ్రేయస్ జంట 21–9, 21–12తో రాహుల్–రోహన్ జోడీపై, రామ్–సుబ్బు జోడీ 17–21, 21–8, 21–13తో యశ్వర్ధన్–సాయి సిద్ధార్థ్ ద్వయంపై, అభినవ్–మానవ్ ద్వయం 21–17, 13–21, 21–18తో వంశీకృష్ణ–జిష్ణు తేజ్ జంటపై గెలుపొంది సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. -
క్వార్టర్స్‌లో రాహుల్, సిరిల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: అనంత్ బజాజ్ స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారులు చిట్టబోయిన రాహుల్ యాదవ్, సిరిల్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రాహుల్ యాదవ్ 21–13, 23–21తో ధ్రువ్ రావత్ (ఉత్తరాఖండ్)పై, సిరిల్ వర్మ 21–11, 21–16తో చిరాగ్ సేన్ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా–ఏఏఐ)పై విజయం సాధించారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రాహుల్ యాదవ్ 21–13, 21–16తో సిద్ధార్థ్ ప్రతాప్ సింగ్ (ఛత్తీస్‌గఢ్)పై, సిరిల్ వర్మ 23–21, 21–16తో అమన్ కుమార్ (హరియాణా)పై గెలిచారు. తెలంగాణకే చెందిన పుల్లెల సాయివిష్ణు, గోపాలకృష్ణారెడ్డి, తరుణ్ రెడ్డి, ఆదిత్య గుప్తా, ఆదిత్య బాపినీడు తొలి రౌండ్లో ఓడిపోగా... అనికేత్ రెడ్డి, గంధం ప్రణవ్ రావు, కిరణ్‌కుమార్ రెండో రౌండ్లో ఓటమి పాలయ్యారు. సెమీస్‌లో గాయత్రి మహిళల సింగిల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి (తెలంగాణ) సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ గాయత్రి 16–21, 21–13, 21–15తో నాలుగో సీడ్ ఆకర్షి కశ్యప్ (ఏఏఐ)పై సంచలన విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో రీతూపర్ణ దాస్ (పెట్రోలియం)తో గాయత్రి ఆడుతుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో శిఖా గౌతమ్ 21–15, 8–5తో అష్మిత చాలిహా (అస్సోం–రిటైర్డ్ హర్ట్)పై, తన్వీ లాడ్ 21–23, 21–13, 21–11తో రియా ముఖర్జీపై, రీతూపర్ణ దాస్ 21–19, 21–6తో మోపాటి కెయూర (తెలంగాణ)పై గెలిచారు. తెలంగాణకే చెందిన ప్రాషి జోషి, సామియా ఇమాద్ ఫారూఖీ, మేఘన రెడ్డి రెండో రౌండ్లో ఓడిపోయారు. ఆర్బీఐకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగమ్మాయి శ్రీకృష్ణప్రియ రెండో రౌండ్లో 17–21, 10–21తో ఆకర్షి కశ్యప్ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో సాయి రోహిత్–ఆకాశ్ (తెలంగాణ); పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్–షేక్ గౌస్ (ఆంధ్రప్రదేశ్) జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాయి. -
మేఘన, మనీషాలకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ ప్లేయర్స్ మేఘన జక్కంపూడి, మనీషా ఆకట్టుకున్నారు. విజయవాడలో జరిగిన ఈ టోర్నమెంట్లో తన భాగస్వామి ధ్రువ్ కపిలతో కలిసి మేఘన మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను... రుతుపర్ణ (ఒడిశా)తో కలిసి మనీషా మహిళల డబుల్స్ టైటిల్స్‌ను హస్తగతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ ధ్రువ్ కపిల (ఎయిరిండియా)–మేఘన (ఆర్బీఐ) ద్వయం 17–21, 22–20, 21–16తో శ్లోక్ రామచంద్రన్ (ఏఏఐ)–రుతుపర్ణ పాండా (ఒడిశా) జోడీపై గెలుపొందింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మనీషా (ఆర్బీఐ)–రుతుపర్ణ (ఒడిశా) జంట 23–21, 21–10తో మూడో సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జోడీపై నెగ్గి విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో తెలంగాణ ప్లేయర్ సిరిల్ వర్మకు నిరాశ ఎదురైంది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన సిరిల్ వర్మ ఫైనల్లో బోల్తా పడ్డాడు. పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో ఎనిమిదో సీడ్ సిరిల్ వర్మ (తెలంగాణ) 9–21, 21–15, 11–21తో పన్నెండో సీడ్ కిరణ్ జార్జ్ (కేరళ) చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మహిళల విభాగంలో మూడో సీడ్ ఆకర్షి కశ్యప్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఆకర్షి కశ్యప్ (ఏఏఐ) 21–12, 21–16తో ఏడో సీడ్ అనురా ప్రభుదేశాయ్ (గోవా)పై గెలుపొందింది. పురుషుల డబుల్స్ విభాగంలో కృష్ణప్రసాద్ జంట టైటిల్‌ను కైవసం చేసుకుంది. తుదిపోరులో టాప్‌సీడ్ కృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)–ధ్రువ్ కపిల (ఎయిరిండియా) జంట 21–19, 21–16తో మూడోసీడ్ అర్జున్ (కేరళ)–శ్లోక్ రామచంద్రన్ (ఏఏఐ) జోడీపై గెలుపొందింది. -
కేయూర, ప్రాషి జోషి శుభారంభం
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు కేయూర మోపాటి, ప్రాషి జోషి శుభారంభం చేశారు. విజయవాడలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో కేయూర 21–19, 20–22, 21–17తో క్వాలిఫయర్ కె. వైష్ణవి (తెలంగాణ)పై పోరాడి గెలవగా... మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ ప్రాషి జోషి 21–10, 21–14తో అనురియా దాస్ (పశ్చిమ బెంగాల్)ను అలవోకగా ఓడించి ముందంజ వేసింది. ఇతర మ్యాచ్‌ల్లో నిషితా వర్మ (ఆంధ్రప్రదేశ్) 21–17, 21–15తో నిషిత డేంబ్లా (హరియాణా)పై గెలుపొందగా... సూర్య చరిష్మా (ఆంధ్రప్రదేశ్) 18–21, 21–18, 11–21తో ఆద్య వరియత్ (కేరళ) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో తొమ్మిదో సీడ్ డి. జశ్వంత్ (ఆంధ్రప్రదేశ్) ముందంజ వేశాడు. జశ్వంత్ 21–19, 21–8తో సిద్దేశ్ హుడేకర్ (మహారాష్ట్ర)ను ఓడించి రెండోరౌండ్లో అడుగుపెట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో విజేత (తెలంగాణ) 11–21, 8–14తో రిటైర్డ్‌హర్ట్‌గా శంకర్ ముత్తుస్వామి (తమిళనాడు) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ నవనీత్–సాహితి జోడీకి తొలిరౌండ్లోనే పరాజయం ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్ తొలిరౌండ్లో అర్జున్ (కేరళ)–మనీషా (ఆర్బీఐ) ద్వయం 22–20, 22–20తో నవనీత్–సాహితి జంటపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–కావ్య గాంధీ (ఢిల్లీ) జంట 21–15, 15–21, 21–13తో రెండో సీడ్ ఉత్కర్‡్ష అరోరా (ఢిల్లీ)–కరిష్మా వాడ్కర్ (మహారాష్ట్ర) జోడీపై, గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్)–మమూరి యాదవ్ (గుజరాత్) జంట 21–19, 17–21, 21–13తో హిమాన్షు సరోహా–అనురియా దాస్ (పశ్చిమ బెంగాల్) జంటపై నెగ్గి రెండోరౌండ్‌కు చేరుకున్నాయి. -
స్టార్ ఆటగాళ్లతో బరిలోకి
న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో నిరాశపరిచిన భారత బృందం... ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ సుదిర్మన్ కప్‌లో పతకంతో తిరిగి రావాలనే లక్ష్యంతో స్టార్ ఆటగాళ్లందరినీ బరిలోకి దించాలని నిర్ణయించింది. చైనాలోని నానింగ్ నగరంలో మే 19 నుంచి 26 వరకు జరిగే ఈ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) మంగళవారం ప్రకటించింది. మహిళల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, రెండో ర్యాంకర్ సమీర్ వర్మలను ఎంపిక చేశారు. 2017 సుదిర్మన్ కప్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొని చైనా చేతిలో ఓడిపోయింది. ఈసారి ఎనిమిదో సీడ్‌గా భారత్ పోటీపడనుంది. గ్రూప్ ‘డి’లో మాజీ చాంపియన్ చైనా, మలేసియాలతోపాటు భారత్‌కు చోటు కల్పించారు. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫలితంగా భారత్ ముందంజ వేయాలంటే లీగ్ దశలో కచ్చితంగా మలేసియాపై గెలవాల్సి ఉంటుంది. మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ గైర్హాజరీలో మలేసియా జట్టు బలహీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో భారత్‌కు ఈసారి కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకునే అవకాశాలున్నాయి. సుదర్మిన్ కప్‌లో భాగంగా ఒక మ్యాచ్‌లో పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ఒక్కో మ్యాచ్‌ను నిర్వహిస్తారు. పురుషుల జట్టు: శ్రీకాంత్, సమీర్ వర్మ (సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి, మనూ అత్రి, ప్రణవ్ చోప్రా (డబుల్స్). మహిళల జట్టు: పీవీ సింధు, సైనా నెహ్వాల్ (సింగిల్స్), నేలకుర్తి సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, మేఘన, పూర్వీషా రామ్ (డబుల్స్). -
శిఖాకు మూడు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: ఎంకే ఇంటర్ స్కూల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆతిథ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం) విద్యార్థి శిఖా సత్తా చాటింది. అండర్–13, అండర్–15 సింగిల్స్ కేటగిరీల్లో, అండర్–13 డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచి మూడు స్వర్ణాలను హస్తగతం చేసుకుంది. సోమవారం జరిగిన అండర్–13 బాలికల సింగిల్స్ ఫైనల్లో శిఖా 15–6, 15–7తో శ్రీవల్లి (కేంద్రీయ విద్యాలయ)పై గెలుపొందింది. డబుల్స్‌లో శిఖా–యోగ్య ద్వయం 15–8, 15–9తో అనూష రస్తోగి–జాహ్నవి జోడీని ఓడించింది. అండర్–15 బాలికల సింగిల్స్ టైటిల్‌పోరులో శిఖా 15–9, 15–14తో అమూల్య (సరస్వతి విద్యాలయ)ను ఓడించింది. డబుల్స్‌లో అమూల్య–దీపిక (డీపీఎస్) జంట 15–7, 15–8తో ఆపేక్ష–దివ్య జోడీని ఓడించి విజేతగా నిలిచింది. బాలుర సింగిల్స్ ఫైనల్లో చెన్నాపతి 15–8, 15–10తో కుషాల్ అగర్వాల్‌పై నెగ్గింది. డబుల్స్‌లో సెహ్వాగ్–చెన్నాపతి జంట 15–10, 15–12తో రిషి–శ్రీకర్ జోడిని ఓడించింది. అండర్–13 బాలుర సింగిల్స్‌లో రిషి 11–15, 15–9, 15–14తో వినయ్‌ని ఓడించగా... డబుల్స్‌లో యశ్వర్ధన్–సాయి సిద్ధార్థ్ జంట 15–10, 15–13తో వశిష్ట–శ్రీహాన్ జోడీపై గెలిచింది. అండర్–11 విభాగంలో మానవ్, లక్ష్మీ రిధిమ చాంపియన్లుగా నిలిచారు. ఫైనల్లో లక్ష్మీ రిధిమ 15–10, 15–13తో అనుసంజనపై, మానవ్ 30–8, 30–11తో సుహాస్‌పై గెలుపొందారు. డబుల్స్ కేటగిరీలో తనీషా–శ్రీరామ్ జంట 15–9, 15–8తో బ్రాహ్మిత్–సహిష్నాన్‌పై, అనుసంజన–యోగ్య ద్వయం 15–6, 15–8తో వైష్ణవి–శరణ్య (డీపీఎస్) జోడీపై గెలుపొంది టైటిళ్లను అందుకున్నారు. -
సెమీస్‌లో అభిషేక్, మురళీ
సాక్షి, హైదరాబాద్: ఎంకే ఇంటర్ స్కూల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అను సంజన, మురళీ, అభిషేక్ ముందంజ వేశారు. డీపీఎస్ నాచారంలో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరు ఆయా వయో విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. శనివారం జరిగిన అండర్–11 బాలికల తొలి మ్యాచ్‌లో అనన్య రాణే 30–12తో అన్యపై, రెండో మ్యాచ్‌లో 30–15తో వైష్ణవిపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో అను సంజన 30–9తో కునాలికను ఓడించింది. అండర్–13 బాలికల విభాగంలో అను సంజన 30–15తో స్మితపై, 30–22తో లహరిపై విజయం సాధించి ముందంజ వేసింది. బాలుర కేటగిరీలో అభిషేక్ ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లో 30–9తో సంజయ్ కుమార్‌పై గెలుపొందిన అభిషేక్, రెండో మ్యాచ్‌లో 30–20తో సాయి ప్రవీణ్‌ను ఓడించాడు. అండర్–15 బాలుర కేటగిరీలో అభిషేక్ 30–10తో ఆర్యవర్ధన్‌పై, రెండో మ్యాచ్‌లో 30–12తో సుదర్శన్‌పై నెగ్గి సెమీస్‌కు చేరుకున్నాడు. -
భారత్ ఖేల్ ఖతం
హాంకాంగ్: ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కథ ముగిసింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–3తో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌లో అష్మితా చాలిహ, పురుషుల డబుల్స్‌లో అరుణ్ జార్జ్–సన్యం శుక్లా జంట గెలుపొందినా... మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఓటమితో భారత్‌కు నిరాశ తప్పలేదు. తొలి మ్యాచ్‌లో అరుణ్ జార్జ్–సన్యం శుక్లా ద్వయం 21–17, 17–21, 21–14తో ప్రపంచ నెం.14 జోడీ లియో మిన్ చున్–చింగ్ హెంగ్‌ను కట్టడి చేసింది. రెండో మ్యాచ్‌లో 19 ఏళ్ల అష్మిత 21–18, 17–21, 21–19తో లియాంగ్ టింగ్ యును ఓడించడంతో భారత్ 2–0తో ముందంజ వేసింది. అయితే మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ 7–21, 21–16, 21–23తో వాంగ్ జు వీ చేతిలో, మహిళల డబుల్స్‌లో ఆరతి సారా సునీల్–రుతుపర్ణా పండా 19–21, 17–21తో చాంగ్ చింగ్ హు–యాంగ్ చింగ్ టున్ చేతిలో ఓడటంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లోనూ శిఖా గౌతమ్–శ్లోక్ రామచంద్రన్ జంట 15–21, 14– 21తో షీ పెయ్ షాన్–సెంగ్ మిన్ హావో జోడీ చేతిలో ఓడటంతో భారత్ వెనుదిరగాల్సి వచ్చింది. -
రాహుల్ యాదవ్ ముందంజ
గువాహటి: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. తెలంగాణకే చెందిన సిరిల్ వర్మ, ఎన్వీఎస్ విజేత మాత్రం రెండో రౌండ్లో నిష్క్రమించారు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఐదో సీడ్ రాహుల్ యాదవ్ రెండో రౌండ్లో 21–17, 21–8తో కరణ్ చౌదరీ (హిమాచల్‌ప్రదేశ్)పై గెలుపొందాడు. తొలి రౌండ్లో సిరిల్ వర్మ 21–7, 21–13తో మాల్‌స్వామ్‌సంగా (మిజోరం)పై నెగ్గి... రెండో రౌండ్లో 21–23, 17–21తో హర్షీల్ డాని (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో విజేత 21–12, 20–22, 21–9తో మయూఖ్ ఘోష్ (పశ్చిమ బెంగాల్)పై గెలిచి... రెండో రౌండ్లో 13–21, 21–14, 17–21తో ప్రియాన్షు రజావత్ (మధ్యప్రదేశ్) చేతిలో ఓటమి చవిచూశాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జశ్వంత్, జగదీశ్ కూడా మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో జశ్వంత్ 21–18, 17–21, 21–17తో రఘు (కర్ణాటక)పై, జగదీశ్ 23–21, 20–22, 21–16తో ధ్రువ్ రావత్ (ఉత్తరాఖండ్)పై గెలిచారు. మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు గుమ్మడి వృశాలి, కె.ప్రీతి మూడో రౌండ్‌కు చేరగా... పాకలపాటి నిశిత వర్మ రెండో రౌండ్లో ఓడిపోయింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన వృశాలి... రెండో రౌండ్లో 21–11, 21–5తో మైత్రేయి ఖత్రి (గుజరాత్)పై గెలిచింది. కె.ప్రీతి తొలి రౌండ్లో 21–12, 21–8తో దెబహుటి లహోన్ (అస్సాం)పై విజయం సాధించగా... రెండో రౌండ్లో ఆమెకు రేవతి దేవస్థలే (ఆలిండియా యూనివర్సిటీస్) నుంచి వాకోవర్ లభించింది. నిశిత తొలి రౌండ్లో 21–17, 21–14తో ఇషారాణి బారువా (అస్సాం)పై గెలిచి... రెండో రౌండ్లో 20–22, 10–21తో కవిప్రియ (పాండిచ్చేరి) చేతిలో ఓటమి చవిచూసింది. -
చాంపియన్ ఏఏఐ
గువాహటి: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జట్టు ఏడోసారి విజేతగా నిలిచింది. రైల్వేస్‌తో సోమవారం జరిగిన ఫైనల్లో ఏఏఐ 3–2తో విజయం సాధించింది. జోనల్ స్థాయిలో టోర్నీలు నిర్వహించి విజేత జట్లకు ఈసారి టీమ్ చాంపియన్‌షిప్‌లో అవకాశం కల్పించారు. డిఫెండింగ్ చాంపియన్ పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) ఈసారి టీమ్ విభాగంలో బరిలోకి దిగలేదు.రైల్వేస్‌తో జరిగిన ఫైనల్లో తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ (ఏఏఐ) 21–17, 21–17తో శుభాంకర్ డే (రైల్వేస్)పై... రెండో మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్ 21–12, 21–14తో అనురా ప్రభుదేశాయ్ (రైల్వేస్)పై నెగ్గడంతో ఏఏఐ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పురుషుల డబుల్స్‌లో హేమనాగేంద్ర బాబు–కబీర్ కంజార్కర్ (రైల్వేస్) జోడీ 21–18, 17–21, 21–18తో శ్లోక్ రామచంద్రన్–చిరాగ్ సేన్ జంటపై... మహిళల డబుల్స్ మ్యాచ్‌లో రియా ముఖర్జీ–అనురా ప్రభుదేశాయ్ (రైల్వేస్) ద్వయం 21–8, 21–8తో శ్రేయాన్షి పరదేశి–స్నేహ జంటపై గెలవడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక మిక్స్డ్ డబుల్స్‌లో శ్రేయాన్షి పరదేశి–శ్లోక్ రామచంద్రన్ జంట 21–9, 17–21, 21–8తో కనిక కన్వల్– అక్షయ్ రౌత్ జోడీపై గెలిచి ఏఏఐ జట్టుకు టైటిల్‌ను ఖాయం చేసింది. -
విష్ణు–సాయిలకు డబుల్స్ టైటిల్
లక్నో: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో తెలంగాణ జోడి పి.విష్ణువర్ధన్ గౌడ్– పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్ సత్తా చాటింది. విష్ణు–సాయి జంట అండర్–19 బాలుర డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో టాప్ సీడ్ సాయి కుమార్–విష్ణువర్ధన్ జోడి 21–11, 21–19తో రెండో సీడ్ మన్జీత్ సింగ్– డింకూ సింగ్ జంటపై గెలిచింది. అంతకుముందు సెమీస్‌లో 21–7, 22–20తో ఆలాప్ మిశ్రా–ధ్రువ్ రావత్‌పై, క్వార్టర్స్‌లో 21–17, 21–16తో అమన్– యశ్‌పై నెగ్గి తెలంగాణ ఆటగాళ్లు ఫైనల్‌కు చేరారు. -
విజేత అపర్ణ– మైత్రేయి జోడీ
సాక్షి, హైదరాబాద్: ‘రెడ్‌బుల్ షటిల్ అప్’ బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ టోర్నమెంట్లో అపర్ణ– మైత్రేయి జంట విజేతగా నిలిచింది. హైదరాబాద్ అంచెలో భాగంగా నిజాంపేటలోని జేఎస్కే బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం జరిగిన ఫైనల్లో అపర్ణ–మైత్రేయి జంట 11–1, 11–3తో హారిక రాథోడ్–హరిత దిలీప్ జోడీపై గెలుపొందింది. మహిళల బ్యాడ్మింటన్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ టోర్నీని... హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, గువాహటి వేదికల్లో జరుపుతున్నారు. ఫైనల్ రౌండ్‌ను ముంబైలో నిర్వహిస్తారు. ఇందులో విజేతగా నిలిచిన జోడీకి... భారత డబుల్స్ ప్లేయర్ అశ్విని పొన్నప్ప జంటతో తలపడే అవకాశం లభిస్తుంది. -
మహిళల సింగిల్స్ విజేత వృశాలి
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుమ్మడి వృశాలి సత్తా చాటింది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ వృశాలి (ఏపీ) 21–15, 21–18తో మూడోసీడ్ ద్రితి యతీశ్ (కర్ణాటక)పై విజయం సాధించింది. జూనియర్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ ఎం. తరుణ్, ఏపీ క్రీడాకారిణి కె. ప్రీతి విజేతలుగా నిలిచారు. బాలుర సింగిల్స్ టైటిల్ పోరులో ఎం. తరుణ్ (తెలంగాణ) 15–21, 21–14, 21–16తో టాప్ సీడ్ కె. సతీశ్ కుమార్ (తమిళనాడు)కు షాకిచ్చాడు. బాలికల సింగిల్స్ తుదిపోరులో ప్రీతి (ఏపీ) 21–13, 14–21, 21–15తో టాప్‌సీడ్ త్రిషా హెగ్డే (కర్ణాటక)ను ఓడించింది. బాలుర డబుల్స్‌లో తెలంగాణ జోడీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో శ్రీకృష్ణ సాయికుమార్–పి. విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ) జంట 21–14, 21–9తో భార్గవ్ గౌడ–శమంత్ రావు (కర్ణాటక) జోడీపై గెలుపొంది విజేతగా నిలిచింది. మరోవైపు పాండిచ్చేరికి ప్రాతినిధ్యం వహించిన తెలుగు అమ్మాయి కవిప్రియ రెండు టైటిళ్లను దక్కించుకుంది. సీనియర్స్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఎస్ కవిప్రియ–సంజయ్ శ్రీవత్స (పాండిచ్చేరి) జోడీ 21–11, 23–21తో లోకేశ్ విశ్వనాథ్–తనుశ్రీ (తమిళనాడు) జంటపై నెగ్గింది. జూనియర్ బాలికల డబుల్స్‌లో ఆగ్నస్ స్వప్న–కవిప్రియ (పాండిచ్చేరి) ద్వయం 21–15, 21–14తో జనని–శ్రుతి (కర్ణాటక) జంటపై గెలిచి విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో సతీశ్‌కుమార్–శ్వేత (తమిళనాడు) జంట టైటిల్‌ను సాధించింది. పురుషుల సింగిల్స్‌లో కర్ణాటకకు చెందిన నిఖిల్ శ్యామ్ శ్రీరామ్, డబుల్స్‌లో ప్రకాశ్ రాజ్–వైభవ్ (కర్ణాటక) జోడీ, మహిళల డబుల్స్‌లో హరిత–రిజా ఫర్హాత్ (కేరళ) జంట విజేతలుగా నిలిచాయి. -
తుది పోరుకు తెలంగాణ జట్లు
సాక్షి, హైదరాబాద్: యోనెక్స్ సన్‌రైజ్ సౌత్‌జోన్ అంతర్రాష్ట్ర బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ఫైనల్‌కు చేరుకున్నాయి. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో శుక్రవారం జరిగిన సీనియర్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ సెమీస్‌లో తెలంగాణ 3–0తో కేరళపై గెలుపొందింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో శ్రీకృష్ణ సాయికుమార్–సృష్టి జూపూడి (తెలంగాణ) ద్వయం 21–18, 21–13తో బాలసుబ్రమణియం–నఫీసా సారా సిరాజ్ (కేరళ) జోడీపై గెలిచి శుభారంభాన్ని అందించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో సిరిల్ వర్మ (తెలంగాణ) 21–19, 21–15తో మొహమ్మద్ మునావర్‌పై నెగ్గాడు. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో పుల్లెల గాయత్రి (తెలంగాణ) 16–21, 21–18, 21–13తో ఆద్య వరియత్‌ను ఓడించి జట్టుకు విజయాన్ని ఖాయం చేసింది. మ్యాచ్ ఫలితం తేలిపోవడంతో పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ మ్యాచ్‌లను నిర్వహించలేదు. జూనియర్స్ సెమీస్‌లో తెలంగాణ 3–1తో కేరళపై గెలుపొందింది. తెలంగాణ తరఫున బాలికల సింగిల్స్‌లో సామియా ఇమాద్ ఫరూఖీ, బాలుర డబుల్స్‌లో పి. విష్ణువర్ధన్–పి. శ్రీకృష్ణ సాయికుమార్, బాలికల డబుల్స్‌లో బండి సాహితి–సృష్టి జూపూడి జోడీలు విజయం సాధించాయి. మరో సెమీస్‌లో కర్ణాటక 3–2తో ఆంధ్రప్రదేశ్‌పై నెగ్గింది. -
విజేతలు సిరిల్‌వర్మ, అభిలాష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సిరిల్‌వర్మ (మెదక్), ఎ. అభిలాష (హైదరాబాద్) సత్తా చాటారు. కోదాడలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండోసీడ్ సిరిల్ వర్మ 21–17, 21–16తో టాప్‌సీడ్ సి. రాహుల్ యాదవ్ (హైదరాబాద్)కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన అభిలాష ఫైనల్లో 21–18, 21–17తో మూడోసీడ్ కె. వైష్ణవిని ఓడించి తన స్థాయిని ప్రదర్శించింది. మరోవైపు డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి సృష్టి జూపూడి మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను అందుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ సాహితి బండి (మెదక్)– సృష్టి జంట 21–12, 21–11తో శ్రీవిద్య– వై. సాయిప్రియ (మెదక్) జోడీపై... మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో టాప్‌సీడ్ పి. శ్రీకృష్ణ సాయికుమార్ (రంగారెడ్డి)– సృష్టి ద్వయం 21–18, 21–18తో మూడో సీడ్ బి. నవనీత్– సాహితి (మెదక్) జోడీపై విజయం సాధించాయి. పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండోసీడ్ బి. నవనీత్ (మెదక్)– సిద్ధార్థ్ (రంగారెడ్డి) జంట 21–11, 16–21, 24–22తో టాప్‌సీడ్ పి. శ్రీకృష్ణ సాయికుమార్ (రంగారెడ్డి)– పి. విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) జోడీకి షాకిచ్చింది. 65 ఏళ్ల కేటగిరీలో పురుషుల సింగిల్స్ ఫైనల్లో పి. రాయలింగు (ఆదిలాబాద్) 21–5, 21–16తో దస్తగిరి (నల్లగొండ)పై, 70 ఏళ్ల పురుషుల సింగిల్స్ తుదిపోరులో వీవీఆర్ రావు (మెదక్) 21–6, 17–21, 21–17తో సి. విజయ్ కుమార్ (హైదరాబాద్)పై విజయం సాధించారు. -
అభిలాష ‘హ్యాట్రిక్’ టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కేన్స్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్లేయర్ ఎ. అభిలాష సత్తా చాటింది. యూసుఫ్‌గూడలోని కేవీబీఆర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్లో అండర్–17, అండర్–19, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి మూడు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. ఆదివారం జరిగిన అండర్–17 బాలికల సింగిల్స్ ఫైనల్లో అభిలాష 15–10, 15–8తో ఎం. తేజస్విని (ఎస్ఎస్)పై గెలుపొందింది. అండర్–19 విభాగంలో 15–6, 15–13తో డి. శ్రేయ (స్పార్ధ)ను ఓడించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో అభిలాష 15–11, 15–12తో కె. ప్రణాలి (ఎల్బీ స్టేడియం)పై గెలుపొంది హ్యాట్రిక్ టైటిళ్లను సొంతం చేసుకుంది. మరోవైపు అండర్–13 బాలబాలికల విభాగంలో ఎస్. శ్రీరాగ్, కె. శ్రేష్టారెడ్డి చాంపియన్లుగా నిలిచారు. బాలుర సింగిల్స్ తుదిపోరులో శ్రీరాగ్ (ఫ్లయింగ్ లోటస్) 15–6, 15–7తో ఓంప్రకాశ్ రెడ్డి (కేన్స్)పై గెలుపొందగా... బాలికల కేటగిరీలో ఎ. సాయి చతుర (ఎంఎన్సీ)పై కె. శ్రేష్టారెడ్డి విజయం సాధించింది. బాలుర డబుల్స్ ఫైనల్లో బి. జశ్వంత్ రామ్–కె. జై ఆదిత్య (కేన్స్) జంట 15–7, 15–12తో ఓంప్రకాశ్ రెడ్డి– శ్రీరాగ్ (ఫ్లయింగ్) జోడీపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–13 బాలికల డబుల్స్: 1. కె. వెన్నెల–కె. రితిక (వీబీఏ), 2. సాయి చతుర–ఎ. చరిష్మా (వీబీఏ). అండర్–15 బాలుర సింగిల్స్: 1. ఎం. శశాంక్ (స్పార్ధ), 2. ధరణ్ కుమార్ (సీఏబీఏ). బాలుర డబుల్స్: 1. ధరణ్ కుమార్– పీవీఎస్ సుజ్వాల్ (సీఏబీఏ), 2. కె. ఉదయ్ తేజ్–శ్రవంత్ సూరి (సీఏబీఏ). బాలికల డబుల్స్: 1. డీవీ లయ–డీవీ శ్రుతి, 2. కె. వైష్ణవి– మృత్తిక షెనోయ్. అండర్–17 బాలుర సింగిల్స్: 1. ఎస్. సాయి పృథ్వీ, 2. బి. యశ్వంత్ రామ్. బాలుర డబుల్స్: 1. బి. నిఖిల్ రాజ్–మనీశ్ కుమార్, 2. లోకేశ్ రెడ్డి–కె. రోహిత్ రెడ్డి. బాలికల డబుల్స్: 1. డీవీ లయ–డీవీ శ్రుతి, 2. డి. అను సోఫియా–ఎస్. వైష్ణవి. అండర్–19 బాలుర సింగిల్స్: 1. కె. తరుణ్ రెడ్డి (కేన్స్), 2. బి. యశ్వంత్ (కేన్స్). బాలుర డబుల్స్: 1. కె. అనికేత్ రెడ్డి–సాయిపృథ్వీ (కేన్స్), 2. తరుణ్ రెడ్డి–మహితేజ (కేన్స్). బాలికల డబుల్స్: 1. కోమల్–లిఖిత, 2. బుష్రా ఫాతిమా–పూజిత. పురుషుల సింగిల్స్: 1. కె. అనికేత్ రెడ్డి (కేన్స్), 2. కె. తరుణ్ రెడ్డి (కేన్స్). పురుషుల డబుల్స్: 1. మజర్ అలీ–విఘ్నేశ్వర్ రావు, 2. హర్ష–సాయి గౌడ్. మహిళల డబుల్స్: 1. కె. ప్రణాలి (ఎల్బీఎస్)–చక్ర యుక్తారెడ్డి (కేన్స్), 2. పూర్వి సింగ్–కె. ప్రణాలి రెడ్డి (వీబీఏ). 35+ పురుషుల సింగిల్స్: 1. ఆర్. శేషు సాయి, 2. వీవీవీ ప్రసాద్. 35+ పురుషుల డబుల్స్: 1. ఆర్. శేషు సాయి–జి. హరీశ్ (మధురానగర్), 2. వీవీవీ ప్రసాద్– వినోద్ కుమార్ (ఆర్ఆర్ స్పోర్ట్స్). 45+ పురుషుల సింగిల్స్: 1. నాగ రవి శంకర్ (మధురానగర్), 2. సి. రవి (మధురా నగర్). 55+ పురుషుల సింగిల్స్: 1. ప్రకాశ్, 2. అంబ్రోస్. పురుషుల డబుల్స్: 1. పున్నారెడ్డి–రవీందర్ రెడ్డి (ఎర్రమంజిల్), 2. ప్రకాశ్ (ఎల్బీఎస్)–ఆంబ్రోస్ (ఎస్సీ క్లబ్). -
హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం
నాన్జింగ్(చైనా): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ శుభారం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో ప్రపంచ 11వ ర్యాంక్ ఆటగాడు ప్రణయ్ 21-12, 21-11 తేడాతో అభినవ్ మనోతా(న్యూజిలాండ్)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన ప్రణయ్.. రెండో గేమ్‌లో కూడా అదే ఆటను పునరావృతం చేసి మ్యాచ్‌లో విజయం సాధించాడు. ఇక పురుషుల డబుల్స్ పోరులో మనూ అత్రి- సుమీత్ రెడ్ది జోడి 21-13, 21-18 తేడాతో నికోలోవ్-రుసెవ్ జంటపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి గేమ్‌లో పెద్దగా పోరాడకుండానే గెలిచిన మనూ అత్రి ద్వయం.. రెండో గేమ్‌లో మాత్రం శ్రమించి విజయం సాధించింది. -
విజయీభవ!
గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం భారత బ్యాడ్మింటన్‌కు గొప్ప విజయాలు లభించలేదు. కామన్వెల్త్ గేమ్స్ ఫలితాలను మినహాయిస్తే అంతర్జాతీయ వేదికలపై మెగా టోర్నమెంట్లలో మనోళ్ల మెరుపులు అంతగా కనిపించలేదు. అయితే ఈ ప్రతికూల ఫలితాలను వెనక్కినెట్టే అవకాశం భారత అగ్రశ్రేణి షట్లర్లకు ప్రపంచ చాంపియన్‌షిప్ రూపంలో లభించింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు రజతం, సైనా కాంస్యం సాధించగా... అలాంటి ఫలితాలను ఈసారి పునరావృతం చేస్తారో లేదో వేచి చూడాలి. ఇక పురుషుల సింగిల్స్‌లో 35 ఏళ్ల పతక నిరీక్షణకు ముగింపు పలికేందుకు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్, సమీర్ వర్మ సిద్ధమయ్యారు. నాన్జింగ్ (చైనా): కొంతకాలంగా ప్రముఖ టోర్నమెంట్ ఫైనల్స్‌లో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించాలనే పట్టుదలతో పీవీ సింధు... మూడోసారి పతకం సాధించాలనే లక్ష్యం తో సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో మూడున్నర దశాబ్దాలుగా ఊరిస్తోన్న పతకాన్ని దక్కించుకోవాలనే తాపత్రయంతో శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్, సమీర్ వర్మ... ఈ నేపథ్యంలో సోమవారం మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు భారీ అంచనాలతో బరిలోకి దిగనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారత్ నుంచి పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ విభాగాలలో కలిపి మొత్తం 25 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సెమీఫైనల్ చేరిన వారికి కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించి పెను సంచలనం సృష్టించిన శ్రీకాంత్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ఈసారి అతని పార్శ్వంలో ఉన్న మలేసియా దిగ్గజం లీ చోంగ్ వీ చివరి నిమిషంలో గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో శ్రీకాంత్ తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబరిస్తే సెమీస్ చేరుకోవడం కష్టమేమీకాదు. మంగళవారం జరిగే తొలి రౌండ్లో ప్రపంచ 86వ ర్యాంకర్ ఎన్హాట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో శ్రీకాంత్ తలపడతాడు. అంతా సాఫీగా సాగితే రెండో రౌండ్లో పాబ్లో అబియాన్ (స్పెయిన్), ప్రిక్వార్టర్ ఫైనల్లో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా), క్వార్టర్ ఫైనల్లో లెవెర్డెజ్ (ఫ్రాన్స్)లతో శ్రీకాంత్ ఆడే అవకాశముంది. మరోవైపు తొలి రౌండ్లో సాయిప్రణీత్‌తో తలపడాల్సిన నాలుగో సీడ్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దాంతో సాయిప్రణీత్ నేరుగా రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగే రెండో రౌండ్లో లూయిస్ ఎన్రిక్ (స్పెయిన్)తో సాయిప్రణీత్ ఆడతాడు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ పీవీ సింధు, పదో సీడ్ సైనా నెహ్వాల్‌లకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. మంగళవారం జరిగే రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో దెమిర్బాగ్ (టర్కీ)తో సైనా... ఫిత్రియాని (ఇండోనేసియా), లిండా జెట్చిరి (బల్గేరియా) మ్యాచ్ విజేతతో సింధు తలపడతారు. ‘డ్రా’ ప్రకారం సైనాకు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ ప్రపంచ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్), క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)... సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా), క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) ఎదురుకావొచ్చు. భారత ఆటగాళ్ల నేటి షెడ్యూల్ ►పురుషుల సింగిల్స్: ప్రణయ్ గీ అభినవ్ (న్యూజి లాండ్); సమీర్ వర్మ గీ లుకాస్ కోర్వీ (ఫ్రాన్స్) ►పురుషుల డబుల్స్: సుమీత్, మనూ అత్రి గీ నికొలోవ్, రుసేవ్ (బల్గేరియా) ►మిక్స్డ్ డబుల్స్: సాత్విక్, అశ్విని గీ నిక్లాస్, సారా (డెన్మార్క్); సిక్కి రెడ్డి, ప్రణవ్ గీ బిట్మాన్, బసోవా (చెక్ రిపబ్లిక్); సౌరభ్, అనౌష్క గీ ఎనెజో, పీస్ (నైజీరియా); రోహన్, కుహూ గీ టోబీ, రాచెల్ (కెనడా) ►మహిళల డబుల్స్: సంయోగిత, ప్రజక్తా గీ నాజ్లికన్, బెంగిసు (టర్కీ) -
12 నుంచి జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: పీఎన్బీ మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఈనెల 12 నుంచి జరుగనుంది. హైటెక్ సిటీలోని గేమ్ పాయింట్ ఇండోర్ స్టేడియంలో 15వ తేదీ వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో అండర్–9, 11, 13, 15 బాలబాలికల విభాగాల్లో సిం గిల్స్ కేటగిరీలో పోటీలు జరుగుతాయి. ఆసక్తి గల వారు ఈనెల 30వ తేదీలోగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 90828 42009, 90828 42029 నంబర్లలో సంప్రదించాలి. -
చాంపియన్ శ్రీకృష్ణ–సృష్టి జంట
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ అండర్–19 ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుడు పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తమిళనాడులోని తిరుపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణకే చెందిన సృష్టి జూపూడితో కలిసి విజేతగా నిలిచిన శ్రీకృష్ణ... పురుషుల డబుల్స్‌లో విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ)తో కలిసి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ టైటిల్ పోరులో టాప్ సీడ్ శ్రీకృష్ణ–సృష్టి (తెలంగాణ) ద్వయం 21–17, 21–16తో ఎడ్విన్ జాయ్–నఫీషా సారా సిరాజ్ (కేరళ) జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ మంజిత్ సింగ్–డింకూ సింగ్ (మణిపూర్) జంట 21–13, 21–18తో టాప్‌సీడ్ విష్ణువర్ధన్–శ్రీకృష్ణ (తెలంగాణ) జోడీకి షాక్ ఇచ్చింది. మహిళల డబుల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ సృష్టి తన భాగస్వామితో కలిసి రన్నరప్‌గా నిలిచింది. తుది పోరులో మూడోసీడ్ సృష్టి (తెలంగాణ)–ప్రీతి (ఆంధ్రప్రదేశ్) జంట 16–21, 16–21తో టాప్‌సీడ్ సిమ్రన్–రితిక (మహారాష్ట్ర) జంట చేతిలో ఓటమి పాలైంది. మహిళల సింగిల్స్ విభాగంలో పాండిచ్చేరికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి ఎస్. కవిప్రియ 8–21, 11–21తో టాప్ సీడ్ ఆకర్షి కశ్యప్ (ఛత్తీస్‌గఢ్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రియాన్షు రావత్ (మధ్యప్రదేశ్) 21–14, 19–21, 21–16తో ఐదోసీడ్ కిరణ్ జార్జ్ (కేరళ)పై నెగ్గి చాంపియన్‌గా నిలిచాడు. -
లక్ష్యసేన్(vs) లిన్ డాన్
అక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్, సమీర్ వర్మ, లక్ష్యసేన్, అజయ్ జయరామ్ తొలి రౌండ్లో విజయం సాధించి ముందంజ వేశారు. పదిహేడేళ్ల లక్ష్యసేన్ రెండో రౌండ్లో బ్యాడ్మింటన్ దిగ్గజం, టాప్ సీడ్ లిన్ డాన్‌తో తలపడనున్నాడు. నేడు జరిగే పోరులో ఈ యువ షట్లర్ తన కెరీర్లోనే అతి పెద్ద మ్యాచ్ ఆడనున్నాడు. లక్ష్యసేన్ తొలి రౌండ్లో 21–11, 21–16తో జూన్ వెయి చీమ్ (మలేసియా)పై గెలుపొందాడు. సాయి ప్రణీత్ 21–11, 21–19తో మిశా జిబెర్మాన్ (ఇజ్రాయిల్)పై; సమీర్ వర్మ 21–8, 21–10తో సోని డి కున్కోరో (ఇండోనేసియా)పై; అజయ్ జయరామ్ 21–23, 21–12, 21–18తో జెన్ హో (తైవాన్)పై గెలుపొందారు. సౌరభ్ వర్మ 19–21, 21–14, 19–21తో అభినవ్ మనోత్ర (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వైష్ణవి రెడ్డి, సాయి ఉత్తేజిత ఓటమి పాలయ్యారు. వైష్ణవి 16–21, 19–21తో చు వెన్డీ చెన్ (ఆస్ట్రేలియా) చేతిలో, ఉత్తేజిత 14–21, 13–21తో యుకినో నకాయి (జపాన్) చేతిలో ఓడిపోయారు. -
ఆశలు ఆవిరి
మరో సుదీర్ఘ సమరం... కానీ ఫలితమే ప్రతికూలం... తొలి మూడు మ్యాచ్‌ల్లో మూడు గేమ్‌లపాటు ఆడి గెలుపొందిన సింధు కీలక సెమీఫైనల్లో మాత్రం ఒత్తిడికి తలొగ్గింది. పాయింట్లు సాధించాల్సిన సమయంలో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. బర్మింగ్‌హామ్: ఆఖరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన సమరంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోయింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం 79 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–19, 19–21, 18–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కే చెందిన ప్రపంచ చాంపియన్ ఒకుహారాపై అద్భుత విజయం సాధించిన సింధు అదే ఫలితాన్ని సెమీస్‌లో పునరావృతం చేయలేకపోయింది. యామగుచితో ముఖాముఖి రికార్డులో 6–3తో ఆధిక్యంలో ఉన్న సింధు ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో 5–0తో ఆధిక్యంలోకి వెళ్లి శుభారంభం చేసింది. ఆ తర్వాత ఇదే జోరు కొనసాగించి 17–10తో ముందంజ వేసింది. ఈ దశలో సింధు ఆటతీరు గతి తప్పింది. వరుసగా ఏడు పాయింట్లు కోల్పోయింది. దాంతో స్కోరు 17–17తో సమమైంది. ఈ సమయంలో సింధు వరుసగా రెండు పాయింట్లు నెగ్గి 19–17తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి గేమ్‌ను 20 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో యామగుచి తేరుకుంది. సింధు వ్యూహాత్మక ఆటతీరుకు సరైన సమాధానమిస్తూ నిలకడగా పాయింట్లు సాధించింది. సుదీర్ఘంగా సాగిన ర్యాలీలను సింధు పాయింట్లుగా మల్చుకోలేకపోయింది. ఆమె కొట్టిన షాట్లు నెట్‌కు తగలడమో లేదా బయటకు వెళ్లడమో జరిగాయి. ఫలితంగా యామగుచి రెండో గేమ్‌ను 21–19తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. పలుమార్లు సుదీర్ఘ ర్యాలీలు కనిపించాయి. ఒకదశలో సింధు 13–7తో ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించి విజయం దిశగా సాగింది. అయితే పట్టువదలని యామగుచి పోరాడింది. స్కోరు సమం చేసింది. సింధు 18–17తో ఒక పాయింట్ ఆధిక్యంలో ఉన్న దశలో యామగుచి ఒక్కసారిగా చెలరేగింది. వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొని సింధు ఆశలపై నీళ్లు చల్లింది. ప్రణయ్‌కు నిరాశ: శుక్రవారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 22–20, 16–21, 21–23తో హువాంగ్ యుజియాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
మూడో రౌండ్లో సాయివిష్ణు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాడు పుల్లెల సాయివిష్ణు ముందంజ వేశాడు. ఏపీలోని తెనాలిలో ఆదివారం జరిగిన అండర్–15 బాలుర సింగిల్స్ రెండో రౌండ్లో సాయివిష్ణు (తెలంగాణ) 21–12, 21–16తో జోయ్ చటర్జీ (జార్ఖండ్)పై గెలుపొందాడు. బాలికల విభాగంలో టాప్ సీడ్ మేఘనా రెడ్డి (తెలంగాణ) 21–7, 21–18తో సుజెన్ బుర్హాగోహెన్ (అస్సాం)ను ఓడించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. అండర్–13 బాలుర సింగిల్స్ మూడో రౌండ్లో నాలుగో సీడ్ లోకేశ్ రెడ్డి (తెలంగాణ) 21–12, 17–21, 24–22తో నీర్ నెహ్వాల్ (ఉత్తరప్రదేశ్)పై విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో అభినయ్ సాయిరాం (తెలంగాణ) 21–12, 21–9తో లక్షిత్ శ్రీవాస్తవ (ఢిల్లీ)పై, సాత్విక్ రెడ్డి (తెలంగాణ) 22–20, 21–14తో సాత్విక్ అవస్థి (రాజస్థాన్)పై, అక్షత్ రెడ్డి (తెలంగాణ) 21–13, 21–11తో ధ్రువ్ నేగి (ఉత్తరాఖండ్)పై విజయం సాధించారు. అండర్–15 బాలుర రెండో రౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు: హిమాన్షు (రాజస్థాన్) 21–5, 21–6తో జ్ఞాన హర్ష (తెలంగాణ)పై, అర్షద్ షేక్ (ఏపీ) 22–20, 21–19తో అయాన్ పాల్ (పశ్చిమ బెంగాల్)పై, అయాన్ రషీద్ (అస్సాం) 22–20, 21–13తో సాహస్ కుమార్ (తెలంగాణ)పై, ఉనీత్ కృష్ణ (తెలంగాణ) 21–12, 21–16తో జోయ్ చటర్జీ (జార్ఖండ్)పై, వరుణ్ (ఏపీ) 21–15, 21–13తో అయేశ్ గోస్వామి (జమ్ము, కశ్మీర్)పై, ప్రణవ్ రావు (తెలంగాణ) 21–9, 21–15లో అర్నమ్ జైన్‌పై గెలుపొందారు. బాలికలు: అభిలాష (తెలంగాణ) 21–10, 21–7తో విలింద చాను (మణిపూర్)పై, భార్గవి (తెలంగాణ) 21–14, 21–17తో సుతాన్షి సర్కార్ (పశ్చిమ బెంగాల్)పై నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరారు. -
చాంప్స్ సైనా, ప్రణయ్
నాగ్‌పూర్: పదేళ్ల తర్వాత జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సైనా 21–17, 27–25తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ పీవీ సింధు (ఆంధ్రప్రదేశ్)పై విజయం సాధించింది. తన శిక్షణ కేంద్రాన్ని మూడు నెలల క్రితం బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీకి మళ్లీ మార్చిన సైనా 2006, 2007లలో కూడా జాతీయ టైటిల్స్‌ను గెల్చుకుంది. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున బరిలోకి దిగిన సైనా విజేత హోదాలో రూ. రెండు లక్షల ప్రైజ్‌మనీని అందుకుంది. జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ముఖాముఖిగా తలపడిన సింధు, సైనా ప్రతీ పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. అయితే సింధు కీలక సమయంలో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ఇటీవలే డిప్యూటీ కలెక్టర్‌గా నియమితురాలైన సింధు ఈ టోర్నీలో ఏపీ తరఫున ఆడింది. మరోవైపు అత్యద్భుత ఫామ్‌లో ఉన్న కిడాంబి శ్రీకాంత్ జోరుకు కళ్లెం వేసి పీఎస్‌పీబీకి ప్రాతినిధ్యం వహించిన కేరళ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ తొలిసారి జాతీయ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో ప్రణయ్ 21–15, 16–21, 21–7తో ప్రపంచ రెండో ర్యాంకర్ శ్రీకాంత్‌ను ఓడించాడు. సిక్కి ఐదోసారి... పీఎస్‌పీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ సిక్కి రెడ్డి ఐదోసారి మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో సిక్కి–అశ్విని ద్వయం 21–14, 21–14తో సంయోగిత–ప్రాజక్తా జంటపై గెలిచింది. 2012లో అపర్ణా బాలన్‌తో, 2014, 2015, 2016లలో ప్రద్న్యా గాద్రెతో కలిసి సిక్కి జాతీయ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి (తెలంగాణ)–మనూ అత్రి (పీఎస్‌పీబీ) జంట 15–21, 22–20, 25–23తో సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)–చిరాగ్ శెట్టి జోడీని ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (పీఎస్‌పీబీ) జంట 21–9, 20–22, 21–17తో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీపై నెగ్గింది. -
శ్రీకాంత్ పై ప్రణయ్ గెలుపు..
సాక్షి,నాగ్‌పూర్: పురుషుల జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకు కిడాంబి శ్రీకాంత్‌పై హెచ్ఎస్ ప్రణయ్ విజయం సాధించి టైటిల్ అందుకున్నాడు. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ 21-15, 16-21, 21-7 లతేడాతో విజయం సాధించాడు. తొలి సెట్లో పైచేయి సాధించిన ప్రణయ్.. రెండో సెట్లో తడబడ్డాడు. ఇక మూడో సెట్లో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పై చేయి సాధించాడు. సెమీఫైనల్స్‌లో ప్రణయ్ 21–14, 21–17తో క్వాలిఫయర్ శుభాంకర్ డే (రైల్వేస్)పై గెలుపొందారు. 2013లో శ్రీకాంత్ జాతీయ చాంపియన్‌గా నిలువగా... ప్రణయ్ తొలిసారి ఈ టైటిల్‌ను సాధించాడు. -
నేడే ఫైనల్ ‘షో’
అనుకున్నదే నిజమైంది. ప్రతిష్టాత్మక జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు అద్భుత ముగింపు లభించబోతుంది. 2007 తర్వాత సైనా నెహ్వాల్... 2013 తర్వాత పీవీ సింధు ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగడమే కాకుండా టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయస్థాయిలో ఈ ఇద్దరూ ముఖాముఖిగా రెండుసార్లు తలపడగా... ఒక్కోసారి గెలిచి సమఉజ్జీగా ఉన్నారు. జాతీయ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఈ ఇద్దరూ అమీతుమీ తేల్చుకోనుండటంతో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. సైనా 2006, 2007లలో... సింధు 2011, 2013లలో విజేతగా నిలిచారు. నాగ్‌పూర్: ఒలింపిక్ పతక విజేతలు సైనా నెహ్వాల్, పీవీ సింధు జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి టైటిల్ కోసం ముఖాముఖిగా తలపడేందుకు రంగం సిద్ధమైంది. 2007 తర్వాత తర్వాత సైనా... 2013 తర్వాత సింధు ఈ దేశవాళీ అత్యున్నత టోర్నీలో బరిలోకి దిగారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో సైనా (పీఎస్‌పీబీ) 21–11, 21–10తో అనురా (ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా)పై గెలుపొందగా... సింధు (ఆంధ్రప్రదేశ్) 17–21, 21–15, 21–11తో రుత్విక శివాని (పీఎస్‌పీబీ)పై కష్టపడి విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (పీఎస్‌పీబీ), హెచ్ఎస్ ప్రణయ్ (పీఎస్‌పీబీ) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో శ్రీకాంత్ 21–16, 21–18తో లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్)పై, ప్రణయ్ 21–14, 21–17తో క్వాలిఫయర్ శుభాంకర్ డే (రైల్వేస్)పై గెలుపొందారు. 2013లో శ్రీకాంత్ జాతీయ చాంపియన్‌గా నిలువగా... ప్రణయ్ తొలిసారి ఈ టైటిల్‌ను సాధించేందుకు విజయం దూరంలో ఉన్నాడు. ‘డబుల్’పై సిక్కి రెడ్డి దృష్టి: పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఎన్.సిక్కి రెడ్డి రెండు విభాగాల్లో ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (పీఎస్‌పీబీ) జంట 21–10, 21–14తో అపర్ణ బాలన్ (పీఎస్‌పీబీ)–శ్రుతి (కేరళ) జోడిని ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 21–16, 22–24, 21–8తో ఆల్విన్ ఫ్రాన్సిస్ (కేరళ)–అపర్ణ బాలన్ (పీఎస్‌పీబీ) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) జోడీతో మనూ అత్రి (పీఎస్‌పీబీ)–సుమీత్ రెడ్డి (తెలంగాణ) జంట తలపడుతుంది. -
సాయిప్రణీత్‌కు షాక్
నాగ్‌పూర్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్, మూడో సీడ్ సాయిప్రణీత్‌కు చుక్కెదురైంది. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ హైదరాబాద్ ప్లేయర్ సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 21–13, 18–21, 20–22తో క్వాలిఫయర్ శుభాంకర్ డే (రైల్వేస్) చేతిలో ఓడిపోయాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీకాంత్ (పీఎస్‌పీబీ) 21–17, 23–21తో శుభమ్ ప్రజాపతి (మధ్యప్రదేశ్)పై, ప్రణయ్ (పీఎస్‌పీబీ) 22–20, 21–19తో కశ్యప్ (పీఎస్‌పీబీ)పై గెలుపొందారు. సెమీస్‌లో సింధు, సైనా: మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (ఆంధ్రప్రదేశ్), రుత్విక శివాని (పీఎస్‌పీబీ), సైనా (పీఎస్‌పీబీ), అనురా (ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా–ఏఏఐ) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 21–11, 21 – 17తో శ్రేయాన్షి (మధ్యప్రదేశ్)పై, రుత్విక 21–14, 21–8తో సాయి ఉత్తేజిత రావు (ఏఏఐ)పై, అనురా 21–19, 21–9తో శైలి రాణే (రైల్వేస్)పై, సైనా 21 – 17, 21–10తో ఆకర్షి కశ్యప్ (ఏఏఐ)పై గెలిచారు. -
కడప గడపలో..బ్యాడ్మింటన్ సంబరం !
కడప స్పోర్ట్స్ : జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు కడప నగరం మరోసారి వేదిక కానుంది. గతేడాది బ్యాడ్మింటన్ అసోసియేషన్, 62వ ఎస్జీఎఫ్ బ్యాడ్మింటన్ జాతీయస్థాయి పోటీలను అద్భుతంగా నిర్వహించడంతో మరోసారి జాతీయస్థాయి పోటీలను నిర్వహించే అవకాశం జిల్లాకు దక్కింది. దీంతో ఈ నెల 19 నుంచి 23 వరకు కడప నగరంలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ సందడి ప్రారంభం కానుంది. 63వ జాతీయస్థాయి ఎస్జీఎఫ్ అండర్–17 విభాగంలో బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నారు. 40 జట్లు.. 400 మంది క్రీడాకారులు ఈ జాతీయస్థాయి పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 40 జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. ఒక్కో జట్టు నుంచి బాలురు 5 మంది, బాలికలు 5 మంది చొప్పున మొత్తం మీద 400 మంది క్రీడాకారులు, మరో 100 మంది అఫిషియల్స్ ఈ టోర్నీకి విచ్చేయనున్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఏపీ నుంచి కూడా 5 మంది బాలురు, 5 మంది బాలికలు ఎంపికకాగా వీరిలో కడప నుంచి బాలుర విభాగంలో అబ్దుల్ రెహమాన్, బాలికల విభాగంలో కె. వెన్నెల ఏపీ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ టోర్నమెంట్లో టీం చాంపియన్‌షిప్‌తో పాటు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే బాలబాలి కల జట్లను ఎంపిక చేయనున్నారు. ఖేలోఇండియాకు అవకాశం.. కాగా ఈ ఏడాది జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు మరో అరుదైన అవకాశం లభించనుంది. జాతీయస్థాయి బ్యా డ్మింటన్ పోటీల్లో సత్తాచాటే క్రీడాకారులకు ఖేలోఇండియా జాతీయస్థాయి పోటీలకు నేరుగా వెళ్లే అవకాశం కల్పించారు. గతంలో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన తర్వాతే ఖేలోఇండియా జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉండేది. అయితే ఈ సారి నుంచి ఎస్జీఎఫ్ జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటే క్రీడాకారులను ^ నేరుగా జాతీయస్థాయి పోటీలకు పంపే అరుదైన అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. -
‘షటిల్’ స్టార్ వార్
నాగ్‌పూర్: చాలా రోజుల తర్వాత జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ స్టార్ క్రీడాకారులతో కళకళలాడనుంది. అంతర్జాతీయస్థాయిలో మెరిపిస్తున్న భారత అగ్రశ్రేణి క్రీడాకారులందరూ గురువారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్లో బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ పీవీ సింధు, 11వ ర్యాంకర్ సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్, భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్, అజయ్ జయరామ్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ, పారుపల్లి కశ్యప్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. స్టార్ ఆటగాళ్లందరూ నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్ దశ నుంచి పోటీపడతారు. వారం రోజులపాటు జరిగిన ఈ టోర్నమెంట్లో 29 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల జట్ల నుంచి 400 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; మనూ అత్రి–సుమీత్ రెడ్డి; అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జోడీలకు... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; సంజన–ఆరతి; మేఘన–పూర్వీషా రామ్ జంటలకు... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీలకు నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి చోటు కల్పించారు. మొత్తం రూ. 60 లక్షల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు రూ. 2 లక్షల చొప్పున అందజేస్తారు. -
ప్రిక్వార్టర్స్‌లో పుల్లెల గాయత్రి
యోగ్‌జకార్తా(ఇండోనేసియా): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి పుల్లెల గాయత్రి మహిళల సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి 19–21, 21–18, 21–17తో మిచెల్లి స్కోడ్‌స్ట్రప్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ కాయ్ యాన్యాన్ (చైనా)తో గాయత్రి తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో కార్తికేయ్ గుల్షన్ కుమార్, లక్ష్య సేన్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. నాలుగో రౌండ్లో కార్తికేయ్ 21–15, 21–12తో బ్రియాన్ యాంగ్ (కెనడా)పై, లక్ష్య సేన్ 21–16, 21–11తో లి షెఫెంగ్ (చైనా)పై గెలిచారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో గారగ కృష్ణప్రసాద్–ధ్రువ్ కపిల ద్వయం 21–12, 21–16 తే యాంగ్ షిన్–చాన్ వాంగ్ (కొరియా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
మూడో రౌండ్లో గాయత్రి
యోగ్‌జకార్తా (ఇండోనేసియా): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి పుల్లెల గాయత్రి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన తొలి రౌండ్లో గాయత్రి 21–8, 21–12తో విక్టోరియా (ఇండోనేసియా)పై, రెండో రౌండ్లో 21–4, 21–11తో అనికా బెస్ట్బీర్ (దక్షిణాఫ్రికా)పై విజయం సాధించింది. భారత్‌కే చెందిన ఆకర్షి కశ్యప్, అష్మిత చలియా కూడా మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఆకర్షి రెండో రౌండ్లో 21–9, 21–4తో హనా మొహమ్మద్ (ఈజిప్ట్)పై, అష్మిత 21–13, 14–21, 21–19తో థి ఫుంగ్ ట్రాన్ (వియత్నాం)పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో రాహుల్ భరద్వాజ్, కార్తికేయ్ గుల్షన్ కుమార్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. -
వైష్ణవికి బెల్జియన్ ఓపెన్ టైటిల్
న్యూఢిల్లీ: తెలుగమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి బెల్జియన్ జూనియర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిల్ చేజిక్కించుకుంది. మహిళల అండర్–19 సింగిల్స్ ఫైనల్లో ఆమె 21–19, 17–21, 21–12తో టాప్ సీడ్ వివియన్ సాండొర్హజి (హంగేరి)ని కంగుతినిపించింది. మరో వైపు ఇథియోపియా ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో భారత్‌కు చెందిన అర్జున్–రామచంద్రన్ శ్లోక్ జంట విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో ఈ జోడి 21–6, 21–19తో బహదిన్ అహ్మద్–మహ్మద్ నాసిర్ మన్సూర్ (జోర్డాన్) జంటపై గెలిచింది. -
శశిధర్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్ సీఎం శశిధర్ కాంస్య పతకాన్ని సాధించాడు. కొచ్చిలో ఆదివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో పురుషుల ప్లస్ 40 వయో విభాగంలో శశిధర్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో శశిధర్ 21–5, 21–4తో వెగర్ నెస్ (నార్వే)పై గెలుపొందగా... రెండో రౌండ్లో 21–8, 21–11తో టాప్ సీడ్ లార్స్ కిన్ట్రప్ (డెన్మార్క్)ను బోల్తా కొట్టించాడు. క్వార్టర్ ఫైనల్లో 21–10, 21–12తో ఐదో సీడ్ కొయెట్శ్రిపన్ (థాయ్‌లాండ్)పై నెగ్గిన శశిధర్... సెమీఫైనల్లో హొసెమారి ఫుజిమోటో (జపాన్) చేతిలో పరాజయం చవిచూశాడు. ఇటీవలే జాతీయ సీనియర్ పోటీల్లో శశిధర్ ప్లస్ 40 వయో విభాగంలో స్వర్ణం గెలిచిన భారత్ తరఫున ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అర్హత సంపాదిచాడు. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ చరిత్రలో శశిధర్కిది రెండో పతకం కావడం విశేషం. 2013లో ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ప్రపంచ పోటీల్లో శశిధర్ ప్లస్ 35 వయో విభాగంలో కాంస్యం సాధించాడు. -
క్వార్టర్స్‌లో లోకేశ్ రెడ్డి
రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కె. లోకేశ్ రెడ్డి ముందంజ వేశాడు. శేరిలింగంపల్లిలోని ఫిట్ ప్రొ బ్యాడ్మింటన్ హౌస్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన అండర్–15 బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో లోకేశ్ రెడ్డి (హైదరాబాద్) 21–9, 14–21, 21–5తో టి. విఘ్నేశ్ (రంగారెడ్డి)పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో లోకేశ్ 21–17, 21–15తో ధరణ్ కుమార్ (నిజామాబాద్)పై గెలుపొందాడు. బాలికల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన మేఘనా రెడ్డి, పల్లవి జోషి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. రెండోరౌండ్ మ్యాచ్‌ల్లో మేఘన 21–13, 21–8తో తేజస్విని (హైదరాబాద్)పై, పల్లవి 21–2, 21–3తో లలిత (మహబూబ్‌నగర్)పై గెలుపొందారు. అండర్–17 విభాగంలో నగరానికి చెందిన అనురాగ్, రోహిత్ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. తొలిరౌండ్లో అనురాగ్ 21–10, 21–8తో క్షితిజ్ (నిజామాబాద్)పై, కె. రోహిత్ రెడ్డి 14–21, 21–16, 21–9తో శ్రీజిత్ (నిజామాబాద్)పై విజయం సాధించారు. బాలికల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రణవి (హైదరాబాద్)– శ్రావ్య (వరంగల్) ద్వయం 21–12, 21–9తో కోమల్– శ్రీ అదితిపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ‘శాట్స్’ ఎండీ ఎ. దినకర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఇటీవల జాతీయ స్థాయిలో విజయాలు సాధించిన పి. లోకేశ్‌రెడ్డి, కె. సాత్విక్ రెడ్డిలకు రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ చెరో 10వేల ప్రోత్సాహకాన్ని అందించారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు అండర్–15 బాలుర రెండోరౌండ్: నిఖిల్ రాజ్ (హైదరాబాద్) 21–3, 21–13తో పవన్ కుమార్ (నల్లగొండ)పై, జి. ప్రణవ్ రావు (రంగారెడ్డి) 21–11, 21–9తో టి. రుష్యేంద్ర (మెదక్)పై, వెంకట్ సుహాస్ (రంగారెడ్డి) 21–3, 21–6తో దినేశ్ (ఆదిలాబాద్)పై, శశాంక్ (హైదరాబాద్) 21–4, 21–6తో నిమిత్ కుమార్ (కరీంనగర్)పై, పి. సాయి విష్ణు (రంగారెడ్డి) 22–20, 21–13తో వై. వెంకట్ (రంగారెడ్డి)పై, ఉనీత్ కృష్ణ (హైదరాబాద్) 21–11, 21–18తో సాహస్ (మెదక్)పై గెలుపొందారు. బాలికలు: పూజిత (రంగారెడ్డి) 21–4, 21–1తో అలంకృత (ఆదిలాబాద్)పై, అనుసోఫియా (హైదరాబాద్) 21–1, 21–0తో మోనిక (మహబూబ్‌నగర్)పై, దేవిశ్రీ 17–21, 21–18, 21–19తో అదితిపై, కె. శ్రేష్టారెడ్డి (హైదరాబాద్) 21–7, 21–4తో ఎన్. అశ్విత (ఆదిలాబాద్)పై, సంజన (రంగారెడ్డి) 21–5, 9–21, 21–16తో ఆశ్రిత (ఖమ్మం)పై, ఎ. అభిలాష (హైదరాబాద్) 21–13, 21–4తో రెహానా జబీన్ (హైదరాబాద్)పై విజయం సాధించారు. -
మెరిసింది ‘మన రాకెట్’
♦ తొలిసారి భారత్‌కు రెండు పతకాలు ♦ సెమీస్‌లో పోరాడి ఓడిన సైనా నెహ్వాల్ ∙ ♦ కాంస్య పతకంతో సంతృప్తి ♦ మూడోసారి సెమీస్‌లోకి సింధు ♦ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతోందనే సంకేతాన్ని భారత స్టార్స్ మరోసారి ఇచ్చారు. గ్లాస్గో వేదికగా జరుగుతోన్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. నాలుగు దశాబ్దాల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కు తొలిసారి రెండు పతకాలు లభించనున్నాయి. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు సెమీఫైనల్‌కు చేరుకొని పతకాలను ఖాయం చేసుకున్నారు. గాయం నుంచి కోలుకున్న సైనా అంచనాలకు మించి రాణించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకోగా... తెలుగు తేజం పీవీ సింధు మూడోసారి ఫైనల్ బెర్త్‌పై గురి పెట్టింది. గ్లాస్గో (స్కాట్లాండ్): అంచనాలు నిజమయ్యాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఈసారి భారత్ ఖాతాలో ఒకటికంటే ఎక్కువ పతకాలు చేరాయి. గత నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఒక్కో పతకం గెలిచిన మన షట్లర్లు ఈసారి రెండు పతకాలతో మురిపించారు. మహిళల సింగిల్స్‌లో తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు... హైదరాబాద్‌కే చెందిన సైనా నెహ్వాల్ సెమీఫైనల్‌కు చేరుకొని భారత్ కొత్త చరిత్ర సృష్టించడంలో కీలక పాత్ర పోషించారు. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచి రజత పతకం గెలిచిన సైనా నెహ్వాల్ ఈసారి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తొలి సెమీఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్ సైనా 21–12, 17–21, 10–21తో ప్రపంచ 12వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోవడంతో ఈ భారత స్టార్‌కు కాంస్య పతకం లభించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఒకుహారా గంటా 33 నిమిషాల్లో 21–18, 14–21, 21–15తో డిఫెండింగ్ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)పై సంచలన విజయం సాధించగా... సైనా 21–19, 18–21, 21–15తో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)పై, నాలుగో సీడ్ పీవీ సింధు 21–14, 21–9తో ఐదో సీడ్ సున్ యు (చైనా)పై గెలుపొందారు. సింధు, చెన్ యుఫీ (చైనా)ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో ఒకుహారా తలపడుతుంది. సూపర్ సింధు... 2013, 2014 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు గెలిచిన సింధు ఈసారీ సెమీఫైనల్‌కు చేరుకొని తన ఖాతాలో మూడో ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని వేసుకుంది. ఎన్గాన్ యి చెయుంగ్ (వియత్నాం)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అతికష్టమ్మీద గట్టెక్కిన సింధు... సున్ యుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మాత్రం తన విశ్వరూపం ప్రదర్శించింది. కేవలం 39 నిమిషాల్లో సున్ యు ఆట కట్టించిన సింధు ఏదశలోనూ ఈ చైనా స్టార్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. గత ఏడాది వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో సున్ యు చేతిలో వరుస గేముల్లో ఓడిపోయిన ఈ హైదరాబాద్ అమ్మాయి తాజా విజయంతో ఆ ఓటమికి బదులు తీర్చుకుంది. శ్రీకాంత్‌కు నిరాశ ప్రపంచ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు పతకం వచ్చి 31 ఏళ్లు గడిచాయి. ఈ ఏడాది అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న కిడాంబి శ్రీకాంత్ ఈ నిరీక్షణకు తెరదించుతాడని ఆశించినా నిరాశే ఎదురైంది. టాప్ సీడ్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 14–21, 18–21తో ఓడిపోయాడు. ఒత్తిడికి లోనై... గతంలో ఒకుహారాతో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరుసార్లు గెలుపొందిన సైనా ఈసారి మాత్రం తన ప్రత్యర్థి పోరాటపటిమ ముందు ఎదురు నిలువలేకపోయింది. గంటా 14 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా 22 నిమిషాల్లో తొలి గేమ్‌ను దక్కించుకుంది. అయితే రెండో గేమ్‌లో భారత స్టార్ తడబడింది. స్కోరు 17–17 వద్ద సైనా ఒత్తిడికిలోనై వరుసగా నాలుగు పాయింట్లు చేజార్చుకొని గేమ్‌ను కోల్పోయింది. తొలి రెండు గేముల్లో నెట్ వద్ద, సుదీర్ఘ ర్యాలీల్లో సైనా పలుమార్లు పైచేయి సాధించినా... మూడో గేమ్‌లో మాత్రం ఒకుహారా ఆటతీరుకు సైనా వద్ద సమాధానం లేకపోయింది. మొదట్లో సైనా 3–1తో ఆధిక్యంలోకి వెళ్లినా... ఒకుహారా తన వ్యూహాలు మార్చి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 6–3తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఒకుహారా మరింత జోరు పెంచగా... సైనా డీలా పడింది. ఒకదశలో ఒకుహారా 16–7తో తొమ్మిది పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. సైనా తేరుకునేందుకు ప్రయత్నం చేసినా ఒకుహారా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. -
సెమీస్‌లో సాత్విక్, మీనల్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కె. సాత్విక్ రెడ్డి, మీనల్ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. అమీర్‌పేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన అండర్–15 బాలుర సింగిల్స్ క్వార్టర్స్‌లో పుల్లెల గోపీచంద్ అకాడమీకి చెందిన సాత్విక్ 15–9, 15–10తో జి. అక్షిత్ రెడ్డి (జేఎస్కే)పై గెలుపొందాడు. బాలికల విభాగంలో మీనల్ (అపెక్స్) 15–13, 15–14తో పల్లవి జోషిని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో హృతిక షెనాయ్ (వీబీఏ) 15–10, 15–12తో టి. అనూష రెడ్డిపై, అను సోఫియా 15–13, 15–11తో శాన్వి (సీఏబీఏ)పై, శ్రేయాన్షి 15–12, 15–14తో శ్రీ అదితిపై విజయం సాధించారు. బాలుర మ్యాచ్‌ల్లో సుహాస్ 15–11, 15–9తో జనిత్పై, విఘ్నేశ్ 15–11, 15–9తో పునీత్ శర్మపై, ధరణ్ (సీఏబీఏ) 15–12, 15–13తో ఎన్. రాహుల్‌పై నెగ్గారు. అండర్–13 బాలుర క్వార్టర్స్ ఫలితాలు: జి. అక్షిత్ రెడ్డి (జేఎస్కే) 15–12, 15–13తో సీహెచ్ భవ్యాంక్పై, బి. అంకిత్ 15–11, 15–14తో జ్ఞాన దత్తు (సుచిత్ర)పై, సాత్విక్ రెడ్డి 15–9, 15–13తో వర్షిత్ (పీజీబీఏ)పై, ఆర్నవ్ (జీవీఎస్) 15–11, 15–9తో ప్రణవ్‌పై గెలిచారు. -
ప్రణవ్‌రావు ‘డబుల్’
రంగారెడ్డి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గోపీచంద్ అకాడమీకి చెందిన ప్రణవ్రావ్, సాయివిష్ణు అండర్–15 విభాగంలో చెరో రెండు టైటిల్స్ సాధించారు. సరూర్‌నగర్ స్టేడియంలో గురువారం ముగిసిన ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ప్రణవ్ విజేతగా నిలువగా సాయి విష్ణు రన్నరప్‌గా నిలిచాడు. డబుల్స్‌లో ప్రణవ్– సాయి విష్ణు జోడి.. విఘ్నేశ్– సుహాస్ ద్వయంపై గెలిచి టైటిల్ సాధించింది. మరోవైపు లోహిత్, ధనిక్ చెరో మూడు పతకాలు కైవసం చేసుకున్నారు. లోహిత్ (గోపీచంద్ అకాడమీ) అండర్– 19 బాలురు, పురుషుల విభాగంలో విజేతగా.. అండర్–19 డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. అండర్–19 సింగిల్స్‌లో ధనిక్ రన్నరప్‌గా.. డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. విజేతలకు ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యకమ్రంలో సరూర్ నగర్ కార్పొరేటర్ అనితా దయాకర్, అడిషనల్ ఎస్పీలు అమరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇతర పోటీల ఫలితాలు: అండర్: 13 బాలురు: 1. రవి ఉత్తేజ్ 2. భవ్యంత్ సాయి; డబుల్స్: 1. రవి ఉత్తేజ్– సుశాంత్ రెడ్డి 2. రోహన్ కుమార్– మిహిర్ శాస్త్రి; బాలికలు: 1. సంజన 2. అమూల్య జైస్వాల్; డబుల్స్: 1. సంజన– శిఖ 2. అమూల్య జైస్వాల్– కీర్తన. అండర్–15 బాలురు సింగిల్స్: 1. ప్రణవ్ రావు (గోపీచంద్ అకాడమీ) 2. సాయి విష్ణు (గోపీచంద్ అకాడమీ); డబుల్స్: 1. ప్రణవ్ రావు– సాయి విష్ణు, 2. విఘ్నేశ్– సుహాస్; బాలికలు సింగిల్స్: 1. నిథిల, 2. సంజన (గోపీచంద్ అకాడమీ); డబుల్స్: 1. శిక్ష– భార్గవి (వీబీఏ) 2. శ్రేయ (గోపీచంద్ అకాడమీ)– పూజిత(గోపీచంద్ అకాడమీ). అండర్–17 బాలురు సింగిల్స్: 1. ప్రణవ్ రావు 2. సూర్యకిరణ్ రెడ్డి; డబుల్స్: 1. శశాంక్– ఆదిత్య 2. వంశీ కృష్ణ– వెంకట్ నిహిత్ రావు; బాలికలు సింగిల్స్: 1. భార్గవి 2. పూజిత; డబుల్స్: 1. మైత్రేయి– అపర్ణ 2. నిధి– మేఘన. పురుషుల డబుల్స్: 1. సందీప్ (సీఆర్పీఎఫ్) – రాహుల్ (సీఆర్పీఎఫ్) 2. గోపాలకృష్ణా రెడ్డి– ఆదిత్య; మహిళల సింగిల్స్: 1. వైష్ణవి 2. వంశిక; డబుల్స్: 1. వైష్ణవి– మమత 2. వంశిక– సుప్రియ. పురుషులు 35+ సింగిల్స్: 1. సూర్యారావు 2. కార్తీక్; డబుల్స్: 1. వేణుగోపాలరావు– కార్తీక్ 2. వెంకట్ రెడ్డి– సోమేశ్వరరావు. పురుషులు 40+ సింగిల్స్: 1. ప్రభాకర్ రెడ్డి 2. ఆనంద్; డబుల్స్: 1. ఆనంద్– భార్గవ్ 2. కోటి– రవి ప్రకాశ్. పురుషులు 45+ సింగిల్స్: 1.రాజేశ్ 2. నరేందర్ రెడ్డి; డబుల్స్: 1. నరేందర్ రెడ్డి– ప్రవీణ్ గౌడ్ 2. రాజేశ్– వర్గీస్ . పురుషులు 50+ సింగిల్స్: 1. సుబ్రహ్మణ్యం 2. రవి గోవింద్; డబుల్స్: 1. సుబ్రహ్మణ్యం– రవి గోవింద్ 2. జయంత్– నాగేశ్వరరావు. పురుషులు 55+ సింగిల్స్: 1. సురేందర్ రెడ్డి 2. శంకర్ రావు, డబుల్స్: 1. బలరామిరెడ్డి– పీఎస్ రెడ్డి 2. శంకర్ రావు– సురేందర్ రెడ్డి. పురుషులు 60+ సింగిల్స్: 1. భిష రెడ్డి 2. నాగేశ్వర రావు. -
మేఘన, శ్రుతి ‘ట్రిపుల్’
సాక్షి, హైదరాబాద్: జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మేఘనా రెడ్డి (గోపీచంద్ అకాడమీ), డీవీ శ్రుతి మూడేసి టైటిళ్లు కైవసం చేసుకున్నారు. బాలికల సింగిల్స్ విభాగంలో మేఘన అండర్–15, 17, 19 టైటిళ్లు సాధించగా.. శ్రుతి అండర్–13 సింగిల్స్, డబుల్స్‌తోపాటు అండర్–15 డబుల్స్ టైటిళ్లు సొంతం చేసుకుంది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో మేఘన అండర్–15 విభాగంలో 21–14, 10–21, 21–16తో అభిలాష (వీబీఏ)పై, అండర్–19 ఫైనల్స్‌లో పూర్వీ సింగ్ (ఎల్బీ స్టేడియం)పై విజయం సాధించింది. అండర్–17 ఫైనల్ మ్యాచ్‌లో 21–14, 8–2తో మేఘన ఆధిక్యంలో ఉండగా... అభిలాష మ్యాచ్ నుంచి వైదొలిగింది. దీంతో మేఘన విజేతగా నిలిచింది. అండర్–13 సింగిల్స్ విభాగంలో శ్రుతి 15–21, 21–18, 24–22తో శ్రేష్ఠ రెడ్డి (ఎల్బీ స్టేడియం)పై గెలుపొందింది. శ్రుతి–డీవీ లయ జోడీ అండర్–13 డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో 21–13, 21–11తో తేజస్వి–శ్రేష్ఠ రెడ్డి జోడీపై, అండర్–15లో 21–19, 21–11తో వైష్ణవి– మృతిక జంటపై గెలిచి విజేతలుగా నిలిచింది. బాలికల అండర్–17 డబుల్స్ ఫైనల్స్‌లో కే. మేఘన–అను సోఫియా ద్వయం 25–23, 21–17తో వైష్ణవి–మృతికపై, అండర్–19 ఫైనల్స్‌లో పూర్వీ సింగ్–చక్రయుక్తారెడ్డి జోడీ 21–8, 21–11తో మౌన్య శ్రీ–నిపుణ జోడీపై విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో పూజ (ఎల్బీ స్టేడియం) 21–13, 11–21, 21–19తో ప్రణాలి కర్ణి (ఎల్బీ స్టేడియం)పై, మహిళల డబుల్స్ ఫైనల్లో పూజ–ప్రణాలి కర్ణి (ఎల్బీ స్టేడియం) జోడి 21–7, 21–7తో వైష్ణవి–వర్ణిత జోడీపై గెలిచి టైటిల్స్ సాధించారు. బాలుర ఫలితాలు: అండర్–13 సింగిల్స్: లోకేశ్ రెడ్డి (వీబీఏ) 21–7, 21–6తో జయ ఆదిత్యపై; డబుల్స్: మేఘాంశ్ ఆనంద్–శ్రావణ్ కుమార్ (వీబీఏ) జోడీ 21–16, 21–14తో రామ్–జయ ఆదిత్య (వీబీఏ) జంటపై గెలిచింది. అండర్–15 సింగిల్స్: లోకేశ్ రెడ్డి 18–21, 21–13, 21–8తో తారక్ శ్రీనివాస్‌పై; డబుల్స్: తారక్ శ్రీనివాస్–వర్షిత్ రెడ్డి జోడీ 15–21, 21–18, 21–20తో శశాంక్ సాయి–శ్రీనివాసరావు జోడీపై నెగ్గింది. అండర్–17 తరుణ్ రెడ్డి 21–19, 21–20తో మనీశ్ కుమార్ (గోపీచంద్ అకాడమీ)పై; డబుల్స్: అనికేత్ రెడ్డి–తరుణ్ రెడ్డి జోడీ 21–19, 18–21, 21–7తో సాయి పృథ్వీ–రోహిత్ రెడ్డి (వీబీఏ)జోడీపై విజయం సాధించింది. అండర్–19 ఆదిత్య గుప్తా (ఎల్బీ స్టేడియం) 21–11, 21–12తో అనికేత్ రెడ్డి (వీబీఏ)పై; డబుల్స్: సాయి రోహిత్–ఆకాశ్ చంద్రన్ (గోపీచంద్ అకాడమీ) జోడీ 21–11, 21–14తో భవధీర్–ప్రేమ్ చౌహాన్ జంటపై గెలిచింది. పురుషులు సింగిల్స్: ఎన్వీఎస్ వీజేత (ఎల్బీ స్టేడియం) 21–18, 21–18తో సాయం బోత్రా (ఎల్బీ స్టేడియం)పై; డబుల్స్: సాయి రోహిత్– ఆకాశ్ చందన్ర్ ద్వయం 21–10, 21–13తో నిఖిల్ రెడ్డి– సాయం బోత్రా జంటపై నెగ్గింది. పురుషులు 45+ సింగిల్స్: కమలాకర్ 21–6, 21–6తో వెంకటేశ్‌పై; డబుల్స్: రవి కిరణ్– వెంకటేశ్ జోడీ 21–6, 21–9తో శ్రీరామ్–ఆంజనేయులు జంటపై విజయం సాధించింది. -
ఫైనల్లో లోకేశ్, జయాదిత్య
సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వీబీఏకు చెందిన లోకేశ్‌రెడ్డి, జయాదిత్య ఫైనల్‌కు చేరుకున్నారు. కేవీబీఆర్ స్టేడియంలో సోమవారం జరిగిన అండర్–13 బాలుర సింగిల్స్ సెమీస్‌లో లోకేశ్ రెడ్డి (వీబీఏ) 21–15, 21–9తో టి. శ్రవణ్ కుమార్ (వీబీఏ)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో జయాదిత్య 21–20, 21–18తో ఎస్. సాయిపై నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. బాలుర డబుల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో బి. మేధాన్షు–శ్రవణ్ కుమార్ (వీబీఏ) ద్వయం 21–11, 18–21, 21–13తో ఏఎస్ చంద్రకౌశిక్–రోషన్ (హైదరాబాద్) జంటపై నెగ్గి ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీస్‌లో రామ్– ఆదిత్య జంట 21–8, 21–20తో ఓంప్రకాశ్–శర్వా (వీబీఏ) జోడీపై గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించింది. మరోవైపు బాలికల విభాగంలో చందన, స్నేహదత్త ముందంజ వేశారు. అమీర్‌పేట్‌లోని జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో జరుగుతోన్న అండర్–13 బాలికల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో చందన (కేవీబీఆర్) 21–11తో మహిమ (జేపీఎస్)పై గెలుపొందగా... స్నేహ దత్త (కేఆర్సీ) 21–11తో ఎస్. ప్రహస్థను ఓడించింది. ఇతరబాలికల సింగిల్స్ మ్యాచ్‌ల ఫలితాలు ఎ. చరిష్మా 21–6తో సాయి పల్లవిపై, కె. రిత్విక 21–10తో సానియాపై, హారిక 21–16తో శ్రావణిపై, ఉన్నతి 21–7 తేజస్వినిపై, జరీనా 21–16 తో ఆపేక్షపై, ప్రజ్ఞ 21–9తో మోక్షపై, ధ్రుతి 21–8తో జెమీనాపై, సిమ్రన్ జీత్ కౌర్ 21–9తో నందితపై, యోచన 21–3తో రుచితపై, రోహిత రెడ్డి 21–11తో సిరి సహస్రపై, తేజస్విని 21–3తో లాక్షణ్యపై, సాయి చతుర 21–8తో సాయి సమీక్షపై, దేవ్ అనుష్య 21–16తో సక్సేనాపై, సాన్వి సింగ్ 21–4తో సాయి వర్ధినిపై, లయ 21–3తో దేవి అనన్యపై విజయం సాధించారు. అండర్–15 బాలుర తొలి రౌండ్ ఫలితాలు బీఎన్వీఎస్ విఘ్నేశ్ 21–2తో కె. రోషన్ కుమార్‌పై, విఘ్నేశ్ కుమార్ 21–12తో సాహిత్ రెడ్డిపై, కేఎస్ఆర్ కార్తీ 21–6తో పి. సురాపై, శ్రీకర్ 21–10తో ఎం. హర్షపై, డి. అక్షయ్ 21–18తో బి. నిశాంత్‌పై, ఎం. సాయి వినయ్ 21–14తో ఎ. మనీశ్‌పై, ఫణి 21–14తో సాయి తనీశ్‌పై, అథర్వ్ 21–20తో అమిన్ సాంగ్విపై, ఆదిత్య 21–11తో రితేశ్ వర్మపై, మోనిశ్ రెడ్డి 21–15తో చౌదరీపై, కృతిక్ 21–5తో మనోజ్‌పై గెలుపొందారు. -
హైదరాబాద్ పరాజయం
హైదరాబాద్: అంతర్ జిల్లా జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ జట్టు ఓటమితో ప్రారంభించింది. అణుపురం గ్రౌండ్స్‌లో సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ బాలుర జట్టు 15–35, 18–35తో వరంగల్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఇతర మ్యాచ్‌ల్లో కరీంనగర్ జట్టు 35–23, 35–30తో మెదక్‌పై, ఖమ్మం 35–30, 35–29తో నల్లగొండపై, నిజామాబాద్ 35–17, 34–36, 35–18తో మహబూబ్‌నగర్‌పై, ఆదిలాబాద్ 35–26, 35–20తో మెదక్‌పై, నిజామాబాద్ 35–27, 35–16తో కరీంనగర్ జట్టుపై గెలుపొందాయి. బాలికల విభాగంలో ఖమ్మం జట్టు 35–22, 35–24తో నిజామాబాద్ జట్టుపై గెలిచి శుభారంభం చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో ఆదిలాబాద్ 35–9, 35–8తో రంగారెడ్డిపై, వరంగల్ 35–18, 35–19తో మెదక్‌పై నెగ్గి ముందంజ వేశాయి. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్. వేణుగోపాలాచారి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాప్రా మున్సిపాలిటీ కార్పొరేటర్ పావని రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, అణుపురం సొసైటీ అధ్యక్షులు జైపాల్‌రెడ్డి, రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి ఎ. రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
తుదిపోరుకు కేయూర జోడీ
సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కేయూర జోడీ ఫైనల్‌కు చేరుకుంది. విజయవాడలోని డీఆర్ఎంసీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన అండర్-15 బాలికల డబుల్స్ సెమీఫైనల్లో కేయూర మోపాటి (తెలంగాణ)-కవిప్రియ (పంజాబ్) జోడీ 21-16, 21-9తో భార్గవి -కైవల్య లక్ష్మి (తెలంగాణ) జంటపై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో భార్గవి -కైవల్య లక్ష్మి జోడీ 21-19, 21-16తో తన్య హేమంత్-కీర్తన (కర్ణాటక) జంటపై, కేయూర-కవిప్రియ జోడీ 21-18, 21-19తో అదితి-స్నేహ (ఉత్తరాఖండ్) జంటపై నెగ్గాయి. మరోవైపు బాలికల సింగిల్స్‌లో కేయూర పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. కవిప్రియ (పంజాబ్)తో జరిగిన క్వార్టర్స్ పోరులో 17-21, 21-19, 21-11తో కేయూర (తెలంగాణ) ఓడిపోయింది. అండర్-13 కేటగిరీలో ఆదివారం జరిగిన బాలుర క్వార్టర్స్‌లో ఉనీత్ కృష్ణ (తెలంగాణ) 21-19, 18-21, 21-15తో ప్రణవ్ శర్మ (ఉత్తరాఖండ్)పై, ప్రణవ్ రావు (తెలంగాణ) 21-13, 21-7తో తన్మయ్ బికాశ్ (అస్సాం)పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నారు. బాలికల విభాగంలో మేఘన (తెలంగాణ) 21-15, 21-18తో అవంతిక పాండే (ఉత్తరాఖండ్)పై నెగ్గింది. బాలుర డబుల్స్ క్వార్టర్స్‌లో ప్రణవ్ రావు- సారుు విష్ణు పుల్లెల (తెలంగాణ) జంట 21-12, 21-9తో ధర్మాంగన మండపాటి (తెలంగాణ)- రుషేంద్ర (ఏపీ) జోడీపై, వంశీకృష్ణ (ఏపీ)- ఉనీత్ కృష్ణ (తెలంగాణ) జంట 21-10, 21-12తో శంకరన్-రిషి (పంజాబ్) జోడీపై గెలిచాయి. బాలికల డబుల్స్‌లో మేఘన (తెలంగాణ)-తస్నీమ్ మీర్ (గుజరాత్) జంట 21-11, 19-21, 21-14తో నిఖిత-అదితి (మహారాష్ట్ర) జోడీపై నెగ్గి సెమీస్‌కు చేరింది. -
ఫైనల్లో శ్రేష్ట, శ్రావ్య
► హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బాలికల సింగిల్స్ (అండర్-13) విభాగంలో శ్రేష్ట రెడ్డి, శ్రావ్య ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రేష్ట 15-11, 11-15, 15-13 తేడాతో కె.వెన్నెలపై విజయం సాధించింది. మరో సెమీస్‌లో శ్రావ్య 17-15, 19-17తో పల్లవి జోషిని ఓడించింది. బాలుర విభాగం (అండర్-13)లో ఉన్నిత్ కృష్ణ, నికశిప్త శౌర్య తుది పోరుకు అర్హత సాధించారు. తొలి సెమీస్‌లో ఉన్నిత్ 15-8, 15-12తో ఎం. శశాంక్ సాయిపై గెలుపొందగా, మరో సెమీస్‌లో నికశిప్త శౌర్య 15-8, 15-13తో శ్రీమాన్ ప్రీతమ్‌ను చిత్తు చేశాడు. అంతకు ముందు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.చాముండేశ్వరీనాథ్, పాణీరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి
చండీగఢ్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. డబుల్స్‌లో మాత్రం సిక్కి రెడ్డి మహిళల, మిక్స్డ్ విభాగాలలో ఫైనల్‌కు అర్హత సాధించింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రుత్విక శివాని 21-10, 18-21, 18-21తో పి.సి.తులసీ (కేరళ) చేతిలో ఓడిపోగా... పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో గురుసాయిదత్ 21-15, 12-21, 14-21తో సమీర్ వర్మ (మధ్యప్రదేశ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె ద్వయం 21-17, 17-21, 22-20తో మేఘన-మనీషా (తెలంగాణ) జోడీపై గెలుపొందగా... మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జంట 21-9, 21-14తో నందగోపాల్-మేఘన జోడీని ఓడించింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్-కృష్ణ ప్రసాద్ ద్వయం 19-21, 20-22తో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ జంట చేతిలో ఓడిపోయింది. -
మహిళలకు సులువు... పురుషులకు క్లిష్టం
ఉబెర్ కప్, థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ‘డ్రా’ విడుదల న్యూఢిల్లీ: ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌గా పేరున్న థామస్ కప్, ఉబెర్ కప్ ‘డ్రా’ విడుదలైంది. థామస్ కప్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురుకాగా... ఉబెర్ కప్‌లో బరిలోకి దిగే భారత మహిళల జట్టుకు కాస్త సులువైన ‘డ్రా’ పడింది. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత పురుషుల జట్టు ఇప్పటివరకు ఎన్నడూ సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. మరోవైపు 2014లో న్యూఢిల్లీలో జరిగిన ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారి సెమీఫైనల్‌కు చేరుకొని కాంస్య పతకాన్ని సాధించి కొత్త చరిత్ర లిఖించింది. ఈసారి థామస్ కప్, ఉబెర్ కప్ పోటీలకు చైనాలోని కున్షాన్ పట్టణం మే 15 నుంచి 22 వరకు ఆతిథ్యం ఇవ్వనుంది. థామస్ కప్‌లో భాగంగా భారత పురుషుల జట్టుకు గ్రూప్ ‘బి’లో చోటు లభించింది. ఈ గ్రూప్‌లో భారత్‌తోపాటు ఇండోనేసియా, థాయ్‌లాండ్, హాంకాంగ్ జట్లున్నాయి. ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టుకు గ్రూప్ ‘డి’లో స్థానం దక్కింది. ఈ గ్రూప్‌లో భారత్‌తోపాటు జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ జట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా, జర్మనీలపై భారత్ కచ్చితమైన విజయావకాశాలు ఉండటంతో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకోవచ్చు. -
సైనా అలవోకగా...
క్వార్టర్స్‌లో భారత స్టార్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ బర్మింగ్‌హామ్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్ సైనా 21-16, 21-9తో బుసానన్ ఆంగ్బుమరాంగ్పాన్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. 41 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... హైదరాబాదీ సత్తాకు తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి గేమ్‌లో 10-10తో స్కోరు సమమైన తర్వాత సైనా వరుసగా మూడు, ఐదు పాయింట్లు సాధించింది. ప్రత్యర్థి కూడా ఒకటి, ఐదు పాయింట్లు నెగ్గడంతో స్కోరు 16-18గా మారింది. ఈ దశలో భారత క్రీడాకారిణి వరుసగా మూడు పాయింట్లతో గేమ్‌ను ముగించింది. రెండో గేమ్‌లో సైనా తిరుగులేని ఆధిక్యాన్ని చూపెట్టింది. 4-4 తర్వాత వరుసగా ఏడు పాయింట్లు నెగ్గింది. తర్వాత కూడా అదే జోరుతో గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు పి.వి.సింధుకు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. పోర్న్‌టిప్ బురాన్ప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో 21-18, 17-21, 12-21తో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సమీర్ వర్మ 21-10, 12-21, 19-21 తో 8వ సీడ్ తియాన్ హౌవీ (చైనా) చేతిలో, శ్రీకాంత్ 10-21, 13-21తో నాలుగోసీడ్ మొమోట కెంటో (జపాన్) చేతిలో ఓడారు. సాయి ప్రణీత్ సంచలనం మరోవైపు పురుషుల సింగిల్స్‌లో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన బొడ్డ సాయి ప్రణీత్ సంచలనం సృష్టించాడు. తొలి రౌండ్లో ప్రణీత్ 24-22, 22-20తో ప్రపంచ నంబర్‌వన్, రెండోసీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)పై విజయాన్ని సాధించాడు. 50 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు సంచలన ఆటతీరుతో కెరీర్లో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు. -
వరల్డ్ చాంపియన్ షిప్ మూడో రౌండ్ లోకి సింధు
జకార్తా: జకార్తాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పివీ సింధు మూడో రౌండ్ లోకి ప్రవేశించింది. మహిళ సింగిల్స్ రెండో రౌండ్ లో సింధు విజయం సాధించింది. మంగళవారం ఉదయం జరిగిన మ్యాచ్ లో సింధు 11-21, 21-17, 21-16 తో డెన్మార్క్ ఫ్లేయర్ లినీ జార్స్పెల్డ్ పై గెలుపొందింది. మూడో రౌండ్ లో చైనీ క్రీడాకారిణి లీ జూరీతో తలపడనుంది. -
పూర్తి ఫిట్నెస్ సాధిస్తా: కశ్యప్
ముంబై : జకర్తాలో ఆగస్టులో జరగనున్న బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని స్టార్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ చెప్పాడు. దీనికోసం ఏడు వారాల పాటు కఠినంగా శ్రమిస్తానని వెల్లడించాడు. సరైన ఫిట్నెస్ లేకపోవడం వల్లే ఇండోనేసియా ఓపెన్ సెమీస్‌లో ఓటమిపాలయ్యానన్నాడు. ‘క్వార్టర్స్‌లో చెన్ లాంగ్‌పై గెలవడం నా ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. టాప్-10 ఆటగాళ్లకు ఒక్కో రకమైన శైలి ఉంటుంది. వాళ్లతో తలపడేటప్పుడు ముందుకు ఎలా సాగాలనే దానిపై కచ్చితమైన ప్రణాళిక ఉండాలి. అందుకే రెండో గేమ్‌లో 10-6తో ఆధిక్యంలో ఉన్నా... అతనిపై ఒత్తిడి పెంచలేకపోయా. అలాంటప్పుడు మరింత ఫిట్నెస్ అవసరమని తెలుసుకున్నా’ అని కశ్యప్ పేర్కొన్నాడు. -
భారత్ ఖేల్‌ఖతం
►కొరియా చేతిలో 1-4తో ఓటమి ►సైనా మినహా అందరూ పరాజయం ►సుదిర్మన్ కప్ డాంగ్వాన్ (చైనా) : ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ కథ లీగ్ దశలోనే ముగిసింది. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. మూడుసార్లు చాంపియన్ దక్షిణ కొరియాతో బుధవారం జరిగిన గ్రూప్1-డి మ్యాచ్‌లో టీమిండియా 1-4 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ విజయం సాధించగా... పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు ఓటమి పాలయ్యారు. మలేసియాతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఈ గ్రూప్ నుంచి మలేసియా, దక్షిణ కొరియా క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు అర్హత పొందాయి. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ ద్వయం 10-21, 19-21తో కిమ్ జీ జంగ్-కిమ్ సా రాంగ్ జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 22-20, 17-21, 21-13తో బే యోన్ జూపై గెలుపొంది స్కోరును 1-1తో సమం చేసింది. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ 21-13, 12-21, 12-21తో సన్ వాన్ హో చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 21-18, 12-21, 12-21తో చాంగ్ యె నా -జంగ్ క్యుంగ్ ఎన్ జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్‌లో మనూ అత్రి-సిక్కి రెడ్డి జంట 12-21, 20-22తో కిమ్ హా నా-కో సుంగ్ హ్యున్ ద్వయం చేతిలో పరాజయం పాలైంది. గతంలో బే యోన్పై ఏడుసార్లు నెగ్గి, నాలుగుసార్లు ఓడిపోయిన సైనాకు ఈసారీ గట్టిపోటీనే ఎదురైంది. తొలి గేమ్‌లో గేమ్ పాయింట్ కాపాడుకున్న ఈ హైదరాబాద్ అమ్మాయి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 22-20తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. అయితే స్కోరు 13-14తో ఉన్న దశలో బే యోన్ వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 20-14తో ముందంజ వేసింది. అదే జోరులో రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా తేరుకొని ఆరంభంలోనే 7-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరును తర్వాత కూడా కొనసాగించి 68 నిమిషాల్లో విజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ శ్రీకాంత్‌ను కాదని అనుభవజ్ఞుడైన కశ్యప్‌ను బరిలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హోపై తొలి గేమ్ నెగ్గిన కశ్యప్ ఆ తర్వాత అదే దూకుడును కనబర్చలేకపోయాడు. మహిళల డబుల్స్‌లో ప్రపంచ 75వ ర్యాంక్ కొరియా జోడీపై జ్వాల-అశ్విని ద్వయం పైచేయి సాధించలేకపోయింది. -
కశ్యప్ శుభారంభం
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వుహాన్ (చైనా) : ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో భారత స్టార్ పారుపల్లి కశ్యప్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ 21-17, 21-13తో జిలియాంగ్ డెరెక్ వోంగ్ (సింగపూర్)పై గెలిచాడు. 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో కాస్త పోటీ ఎదుర్కొన్నా కశ్యప్‌కు రెండో గేమ్‌లో ఎదురులేకుండా పోయింది. రెండో గేమ్ ఆరంభంలో వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గిన ఈ హైదరాబాద్ ప్లేయర్ 9-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే జోరుతో మ్యాచ్‌ను ముగించాడు. బుధవారం జరిగే తదుపరి రౌండ్లో జెన్ హావో సు (చైనీస్ తైపీ)తో కశ్యప్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో కశ్యప్ 2-1తో ఆధిక్యంలో ఉన్నాడు. గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో జెన్ హావో సు చేతిలో ఓడిన కశ్యప్ ఈసారి ఆ ఓటమికి బదులు తీర్చుకుంటాడో లేదో వేచి చూడాలి. మరోవైపు మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం తొలి రౌండ్లోనే ఓడిపోయింది. జ్వాల-అశ్విని జంట 17-21, 21-15, 15-21తో యు పో పాయ్-యా చింగ్ సు (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
‘మన రాకెట్’ మళ్లీ మెరిసింది.
-
క్వార్టర్స్‌లో సైనా
జ్వాల జోడికి చుక్కెదురు ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ బర్మింగ్‌హామ్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 21-15, 21-15తో క్వాలిఫయర్ కిమ్ హో మిన్ (జపాన్)పై గెలిచింది. 46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయి ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్‌లో 12-7 ఆధిక్యంలో నిలిచింది. అయితే కిమ్ పుంజుకుని వరుసగా మూడు పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని 10-12కు తగ్గించింది. కానీ స్కోరు 15-11 వద్ద సైనా నాలుగు పాయింట్లు నెగ్గితే... కిమ్ రెండింటితో సరిపెట్టుకుంది. చివరకు మరో రెండు పాయింట్లతో హైదరాబాదీ గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ అదే జోరును కనబర్చిన సైనా 11-5 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత మరో మూడు పాయింట్లు నెగ్గింది. అయితే స్కోరు 20-12 వద్ద కిమ్ మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకున్నా.. విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో జ్వాల-అశ్విని జోడి 10-21, 13-21తో టాప్‌సీడ్ చైనీస్ జంట టియాన్ క్వింగ్-జాహో యునెలి చేతిలో కంగుతింది. ‘క్రికెట్ చూడడం మా హక్కు’ జైళ్లో పంతం నెగ్గించుకున్న ఖైదీలు గువాహటి: ప్రపంచకప్ క్రికెట్ ఎంతలా అందరినీ ఉర్రూతలూగిస్తుందో తెలిపేందుకు ఈ ఉదాహరణ చాలేమో... ‘క్రికెట్ చూడడం మా హక్కు’ అంటూ కొందరు ఖైదీలు గౌహతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి వాదనకు సానుకూలంగా స్పందించిన జస్టిస్ అనూప్ కుమార్ గోస్వామి ‘ఖైదీల మనస్సు ఆరోగ్యంగా ఉండేందుకు వినోదం చాలా అవసరం’ అని ఐదు రోజుల్లో జైళ్లో కేబుల్ కనెక్షన్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు. -
క్వార్టర్స్‌లో రీతుపర్ణ, రుత్విక
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయిలు రీతుపర్ణా దాస్, రుత్విక శివాని క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్ రీతుపర్ణ 21-15, 21-11తో సాయి ఉత్తేజిత (ఏపీ)పై, ఆరో సీడ్ రుత్విక 21-5, 21-2తో రుత్ మిశా (కర్ణాటక)పై విజయం సాధించారు. వృశాలి (టీఎస్) 21-10, 21-13తో కుహూ గార్గ్ (ఉత్తరాఖండ్)పై నెగ్గగా, కె.వైష్ణవి (టీఎస్) 15-21, 17-21తో శైలి రాణె (ఎయిరిండియా) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో పదో సీడ్ సిరిల్ వర్మ (టీఎస్) 21-16, 18-21, 21-16తో శ్యామ్‌ప్రసాద్ (కేరళ)పై, భమిడిపాటి సాయిప్రణీత్ (పీఎస్‌పీబీ) 21-13, 21-12తో ప్రతీక్ మహాజన్ (గోవా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. వికాస్ హర్ష (ఏపీ)కు 14-21, 9-21తో రోహిత్ యాదవ్ (ఏఏఐ) చేతిలో చుక్కెదురైంది. విజయవాడ క్లబ్లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన క్యాంప్ ఫైర్ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తున్న జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, పి.వి.సింధు, ఇతర క్రీడాకారిణులు. సీనియర్ నేషనల్స్ సందర్భంగా ఆటవిడుపు కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, పంజాబ్ పాటలకు క్రీడాకారులు స్టెప్లు వేశారు. -
భవధీర్, విష్ణు ముందంజ
ఏపీ స్టేట్ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్ సాక్షి, హైదరాబాద్: ఏపీ స్టేట్ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాళ్లు భవధీర్, విష్ణువర్ధన్ గౌడ్ ముందంజ వేశారు. వరంగల్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో అండర్-15 బాలుర సింగిల్స్‌లో భవధీర్ 21-18, 21-7తో సాయి హేమంత్ (అనంతపురం)పై, విష్ణు 21-6, 21-11తో ఉదయ్ కిరణ్ (నల్లగొండ)పై అలవోక విజయాలు సాధించారు. అనురాగ్ (రంగారెడ్డి) 16-21, 16-21తో చంద్రజ్ పట్నాయక్ (వైజాగ్) చేతిలో, సుధీశ్ వెంకట్ (రంగారెడ్డి) 19-21, 15-21తో నాగ సాయి దినేశ్ (కర్నూల్) చేతిలో పరాజయం చవిచూశారు. అనిల్ (వరంగల్) 21-15, 21-14తో ధనిక్ (రంగారెడ్డి)పై, రితిన్ (వరంగల్) 21-14, 21-12తో మనోజ్ (రంగారెడ్డి)పై గెలుపొందారు. బాలికల సింగిల్స్‌లో కావ్య రెడ్డి (హైదరాబాద్) 21-6, 21-9తో బ్రహ్మణి (నల్లగొండ)పై, వైష్ణవి రెడ్డి (రంగారెడ్డి) 21-14, 21-2తో వైష్ణవి (గంటూరు)పై, యశస్విని (వరంగల్) 21-2, 21-2తో ప్రియాంక (ఆదిలాబాద్)పై విజయం సాధించారు. -
రాష్ట్ర జట్టుకు మూడో స్థానం
భారత స్కూల్ బ్యాడ్మింటన్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ స్కూల్ అండర్-14 బాలుర బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు మూడో స్థానం లభించింది. బాలుర వ్యక్తిగత సింగిల్స్‌లో ప్రవీణ్ కృష్ణ సత్తా చాటాడు. ఆగ్రాలో ఇటీవల ఈపోటీలు జరిగాయి. బాలుర వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో టి.ప్రవీణ్ కృష్ణ (ఖమ్మం) రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. అలాగే బాలుర టీమ్ విభాగంలో ఖమ్మంకు చెందిన టి.ప్రవీణ్ కృష్ణ, కె.వరప్రసాద్, ఎం.తరుణ్‌లతో కూడిన జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకుంది. ప్రవీణ్ కృష్ణ చైనాలో జరిగే అంతర్జాతీయ స్కూల్ అండర్-14 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యాడు. పతకాలను గెల్చుకున్న క్రీడాకారులను రాష్ట్ర స్కూల్ విద్యా శాఖ కమిషనర్ ఎం.జగదీశ్వర్, జాయింట్ డెరైక్టర్ వి.ఎస్.భార్గవ్, రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్యదర్శి విజయారావులు అభినందించారు. -
భారత్‌కు ఊరట
చివరి లీగ్ మ్యాచ్‌లో జర్మనీపై 3-2తో గెలుపు కీలక మ్యాచ్‌ల్లో నెగ్గిన గురుసాయిదత్, శ్రీకాంత్ న్యూఢిల్లీ: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి... థామస్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో నాకౌట్ అవకాశాలను కోల్పోయిన భారత పురుషుల జట్టు చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం గెలిచింది. జర్మనీతో బుధవారం జరిగిన ఈ పోటీలో టీమిండియా 3-2తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 18వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 21-18, 18-21, 21-18తో ప్రపంచ 13వ ర్యాంకర్ మార్క్ జ్విబ్లెర్ను ఓడించి శుభారంభం అందించాడు. అయితే రెండో మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 15-21, 6-21తో మైకేల్ ఫుచస్-ష్కోట్లెర్ జోడి చేతిలో ఓడింది. దాంతో స్కోరు 1-1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో భారత కెప్టెన్, ప్రపంచ 21వ ర్యాంకర్ కశ్యప్ 21-23, 21-14, 14-21తో ప్రపంచ 59వ ర్యాంకర్ దితెర్ డోమ్కె చేతిలో అనూహ్యంగా ఓడిపోవడంతో భారత్ 1-2తో వెనుకబడింది. గతంలో డోమ్కెతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన కశ్యప్ ఈసారి ఓడిపోవడం గమనార్హం. నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో భారత జోడి అక్షయ్-ప్రణవ్ చోప్రా రాణించింది. 21-9, 17-21, 21-19తో పీటర్ కెస్బార్-జుర్వోని జంటపై నెగ్గి స్కోరును 2-2తో సమం చేసింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో గురుసాయిదత్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 62 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గురుసాయిదత్ 14-21, 21-19, 21-19తో ష్కెమిడ్ను ఓడించి భారత్‌కు 3-2తో విజయాన్ని అందించాడు. ఈ టోర్నీలో గురుసాయిదత్ ఒక్కడే భారత్ తరఫున సింగిల్స్ విభాగంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. గురువారం జరిగే ఉబెర్ కప్ మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ లేదా ఇండోనేసియా లేదా డెన్మార్క్ జట్టుతో భారత్ ఆడే అవకాశం ఉంది. -
భారత్ ‘హ్యాట్రిక్’
చివరి మ్యాచ్‌లో 3-2తో థాయ్‌లాండ్‌పై గెలుపు గ్రూప్ ‘వై’లో అగ్రస్థానం ప్రపంచ చాంపియన్‌పై నెగ్గిన సైనా సింధు, జ్వాల-అశ్విని జోడి విజయం న్యూఢిల్లీ: సొంతగడ్డపై జోరు కొనసాగిస్తూ భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గ్రూప్ ‘వై’లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 3-2తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. గ్రూప్ ‘వై’లో టాప్‌గా నిలిచిన భారత్‌కు క్వార్టర్ ఫైనల్లో గ్రూప్ ‘డబ్ల్యూ’లో రెండో స్థానంలో నిలిచే అవకాశమున్న ఇంగ్లండ్ లేదా చైనీస్ తైపీ ఎదురవుతుంది. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్ సైనా నెహ్వాల్ 22-20, 21-14తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, నాలుగో ర్యాంకర్ ఇంతనోన్ రత్చనోక్పై సంచలన విజయం సాధించింది. భారత్‌కు పి.వి.సింధు మరో విజయం అందించింది. ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21-19, 21-14తో 9వ ర్యాంకర్ పోర్న్టిప్పై నెగ్గింది. ఆ తర్వాత డబుల్స్ మ్యాచ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప ద్వయం 21-16, 21-13తో అరూన్కెసర్న్-సావిత్రి అమిత్రపాయ్ జోడిపై నెగ్గి భారత్‌కు 3-0తో స్పష్టమైన ఆధిక్యాన్ని అందించడంతోపాటు విజయాన్ని ఖాయం చేసింది. నాలుగో మ్యాచ్‌లో పి.సి.తులసీ 15-21, 10-21తో ప్రపంచ 17వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌పాన్ చేతిలో ఓడిపోయింది. ఐదో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో సైనా-సింధు జోడి 12-21, 21-18, 15-21తో కున్చాలా-సప్సిరీ జంట చేతిలో ఓటమి పాలైంది. -
మనీష్ కుమార్, అంకిత్ శుభారంభం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు అండర్-13 బాలుర సింగిల్స్‌లో రాష్ట్రానికి చెందిన మనీష్ కుమార్, పి.అంకిత్, సాయిచరణ్ శుభారంభం చేశారు. కడపలో మంగళవారం జరిగిన అండర్-13 బాలుర సింగిల్స్ తొలి రౌండ్లో మనీష్ కుమార్ (ఏపీ) 15-6, 15-6 స్కోరుతో యోగేందర్(మహారాష్ట్ర)పై విజయం సాధించాడు. పి.అంకిత్ (ఏపీ) 15-6, 7-15,15-10తో అనిరుధ్‌పై గెలిచింది. తొలి రౌండ్ ఫలితాలు: అండర్-13 బాలుర సింగిల్స్: సుధాంశు (మహారాష్ట్ర) 15-13, 15-7తో విజయ్ (ఏపీ)పై, రిత్విక్ సంజీవి (తమిళనాడు) 15-2,15-7తో రాంగోపాల్(ఏపీ)పై, శివం అగర్వాల్ (ఉత్తర ప్రదేశ్) 15-8,15-14తో అఖిలేష్ కౌశిక్(ఏపీ)పై, రాహుల్ (మహారాష్ట్ర) 15-5, 15-4తో జయకృష్ణ (ఏపీ)పై, వికాస్ ప్రభు (తమిళనాడు) 15-5, 15-5తో సుజాల్(కర్ణాటక)పై, ఎస్.గుప్త (తమిళనాడు) 15-11,15-10తో వంశీ కృష్ణ(ఏపీ)పై, సాయి చరణ్ (ఏపీ) 15-7,15-11తో అజయ్ అభిషేక్ (తమిళనాడు)పై, ఎం.అలీ ఖాన్ మీర్ (ఏపీ) 15-11, 15-8తో శివరామ్ (యూటీఆర్)పై, శశాంక్ రెడ్డి (ఏపీ) 15-5,15-4తో ఎం.కార్తికేయన్ (తమిళనాడు)పై, మయాంక్ రాణా (హర్యానా) 16-4, 15-8తో లీలా అభిరామ్(ఏపీ)పై గెలిచారు. అండర్-15 బాలుర సింగిల్స్: నవనీత్(ఏపీ) 15-6,15-11తో రోషన్ విక్టర్ (కేరళ)పై, తరుణ్ కుమార్ (ఏపీ) 15-7, 15-12తో శౌర్య (పశ్చిమ బెంగాల్)పై, వికాస్ యాదవ్ (ఢిల్లీ) 15-9,15-5తో టి.తేజ (ఏపీ)పై, అక్షయ్ శెట్టి (మహారాష్ట్ర) 15-9,16-14తో సాయినాథ్ రెడ్డి(ఏపీ)పై, జి.అరవింద్ (పీవై) 13-21,15-5, కె.అనికేత్ రెడ్డి(ఏపీ)పై, అనీష్ చంద్ర (ఏపీ) 15-8, 15-13తో అనిరుధ్(కేరళ)పై, ధీరజ్ రెడ్డి(ఏపీ) 21-16, 21-11తో శంకర్ ముత్తు స్వామి(తమిళనాడు)పై, ముఖేష్ రవి (ఏపీ) 15-5,15-8తో గోవింద్(కేరళ)పై నెగ్గారు. -
శ్రీకాంత్ x గురుసాయిదత్
న్యూఢిల్లీ: ఈసారి జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనున్నాడు. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆదివారం జరిగిన సెమీఫైనల్స్‌లో శ్రీకాంత్ 21-14, 21-19తో డిఫెండింగ్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ (పీఎస్‌పీబీ)ను బోల్తా కొట్టించగా... గురుసాయిదత్ 21-13, 21-19తో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు భమిడిపాటి సాయిప్రణీత్ (పీఎస్‌పీబీ)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ విభాగం టైటిల్ కూడా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణుల ఖాతాలోనే చేరనుంది. సెమీఫైనల్స్‌లో రెండో సీడ్, 2011 జాతీయ చాంపియన్ పి.వి.సింధు (పీఎస్‌పీబీ) 21-17, 21-14తో అరుంధతి పంతవానె (మహారాష్ట్ర)పై, రీతూపర్ణ దాస్ (ఆంధ్రప్రదేశ్) 13-21, 21-13, 21-14తో సయాలీ గోఖలే (ఎయిరిండియా)పై గెలిచారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె (ఏఏఐ); గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప (పీఎస్‌పీబీ) జోడిలు ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్)-మనూ అత్రి (ఏఏఐ); ప్రణవ్ చోప్రా (పీఎస్‌పీబీ)-అక్షయ్ దివాల్కర్ (ఎయిరిండియా) జంటలు టైటిల్ కోసం పోటీపడతాయి. మిక్స్డ్ డబుల్స్‌లో తరుణ్ కోనా-అశ్విని పొనప్ప (పీఎస్‌పీబీ), అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ (పీఎస్‌పీబీ) జోడిలు ఫైనల్లోకి చేరుకున్నాయి. అన్ని విభాగాల ఫైనల్స్ సోమవారం జరుగుతాయి. -
మూడో రౌండ్లో శ్రీకాంత్
న్యూఢిల్లీ: అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో డిపార్ట్మెంట్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు ఆంధ్రప్రదేశ్ అగ్రశ్రేణి క్రీడాకారులు ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున పోటీపడుతున్న రాష్ట్ర ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, గురుసాయిదత్, చేతన్ ఆనంద్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో... ఈ ఏడాది థాయ్‌లాండ్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ విజేత శ్రీకాంత్ 21-6, 21-5తో అమీర్ సుమారా (గుజరాత్)పై గెలిచాడు. ఇతర మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ కశ్యప్ 21-4, 21-7తో తేజన్ ఫలారే (గోవా)పై, రెండో సీడ్ గురుసాయిదత్ 21-4, 21-7తో సన్నీ సావంత్ (గోవా)పై, క్వాలిఫయర్, మూడుసార్లు జాతీయ మాజీ చాంపియన్ చేతన్ ఆనంద్ 21-5, 21-5తో హిరాక్ జ్యోతి (అస్సాం)పై నెగ్గారు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో ఏపీ ఆటగాడు అజయ్ కుమార్ 21-14, 21-9తో కేతన్ చహల్ (హర్యానా)ను ఓడించాడు. శ్రీ కృష్ణప్రియ ముందంజ మహిళల సింగిల్స్ విభాగంలో ఏపీ క్రీడాకారిణులు శ్రీ కృష్ణప్రియ, రుత్విక శివానిలతోపాటు పీఎస్‌పీబీకి ఆడుతోన్న తెలుగు అమ్మాయి పి.వి.సింధు మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడుతోన్న శ్రీ కృష్ణప్రియ రెండో రౌండ్లో 21-16, 17-21, 21-13తో కుహూ గార్గ్ (ఉత్తరాఖండ్)ను ఓడించగా... రుత్విక శివాని 21-12, 21-11తో రీతూ వినాయర్ (పంజాబ్)పై, రెండో సీడ్ సింధు 21-3, 21-5తో జైసీ బ్రిగెట్టి (పాండిచ్చేరి)పై విజయం సాధించారు. -
జాతీయ బ్యాడ్మింటన్ విజేత పీఎస్‌పీబీ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) హవా కొనసాగింది. ఇక్కడ జరుగుతున్న జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో టీమ్ టైటిల్‌ను పీఎస్‌పీబీ మళ్లీ గెలుచుకుంది. పెట్రోలియం జట్టు జాతీయ విజేతగా నిలవడం ఇది వరుసగా 15వ సారి కావడం విశేషం. గురువారం జరిగిన పురుషుల విభాగం ఫైనల్లో పీఎస్‌పీబీ జట్టు 3-1 తేడాతో ఎయిరిండియాపై విజయం సాధించింది. సౌరభ్‌వర్మ, శ్రీకాంత్, గురుసాయిదత్ సింగిల్స్‌లో గెలిచి జట్టుకు టైటిల్ అందించారు. మహిళల విభాగంలో పీఎస్‌పీబీ జట్టు 2-0తో ఎయిరిండియాను చిత్తు చేసింది. సింగిల్స్‌లో పీవీ సింధు, డబుల్స్‌లో అశ్విని-జ్వాల జోడీ విజయాలు సాధించారు. -
సెమీస్‌కు చేరిన రాహుల్
జింఖానా, న్యూస్‌లైన్: ఏపీ స్టేట్ జూనియర్ అండర్-17 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాడు రాహుల్ యాదవ్ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. చీరాలలో బుధవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో రాహుల్ 21-17, 21-11తో కృష్ణప్రసాద్ (తూర్పుగోదావరి)పై విజయం సాధించాడు. రంగారెడ్డికి చెందిన అనీత్ కుమార్, జీకే రెడ్డి కూడా సెమీస్‌కు అర్హత సాధించారు. అనీత్ కుమార్ 15-21, 21-17, 21-14తో సాగర్ (మెదక్)పై, జీకే రెడ్డి 21-18, 21-13తో ఆదిత్య బాపినీడు (ఖమ్మం)పై గెలుపొందారు. కినష్క్ (గుంటూరు) 21-16, 21-17తో చంద్రకుమార్ (తూర్పుగోదావరి)పై గెలిచాడు. బాలికల క్వార్టర్‌ఫైనల్స్‌లో హైదరాబాద్ క్రీడాకారిణి టాప్‌సీడ్ శ్రీకృష్ణప్రియ సెమీస్‌కు చేరుకుంది. శ్రీకృష్ణ ప్రియ 21-16, 21-15తో ప్రణవిపై నెగ్గింది. ఉత్తేజా రావు (విశాఖపట్నం) 21-16, 21-10తో వైష్ణవి (రంగారెడ్డి)పై, వృషాలిని (రంగారెడ్డి) 21-18, 21-19తో తనిష్క్ (గుంటూరు)పై, హాసిని (విశాఖపట్నం) 21-11, 21-18తో సిరి చందన (మెదక్)పై గెలుపొందారు. బాలుర డబుల్స్ క్వార్టర్‌ఫైనల్స్ రఘునాథ్ సాయి (గుంటూరు)-అనిత్‌కుమార్ (రంగారెడ్డి) జోడి 21-13, 21-14తో ఆదిత్య (ఖమ్మం)-జగదీశ్ (విశాఖపట్నం) జోడిపై, కృష్ణప్రసాద్-సాత్విక్ (తూర్పుగోదావరి)జోడి 21-13, 16-21, 21-18తో అఖిల్-నితిన్ (తూర్పుగోదావరి) జోడిపై, దత్తాత్రేయ-మనోహర్ రెడ్డి (కర్నూల్) జోడి 21-17, 18-21, 21-10తో ముత్తు-సాయి కుమార్ (నెల్లూరు) జోడిపై గెలుపొందాయి. -
రెండో రౌండ్లో సాయి శ్రేయ
అనంతపురం స్పోర్ట్స్, న్యూస్‌లైన్: ఏపీ సబ్ జూనియర్ అండర్-13 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హెదరాబాద్కు చెందిన సాయి శ్రేయ రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇక్కడి డీపీఓ ఇండోర్ స్పోర్ట్స్ సెంటర్లో గురువారం ప్రారంభమైన టోర్నీ మొదటి రౌండ్లో శ్రేయ 21-8, 21-14తో లహరి (చిత్తూరు)పై విజయం సాధించింది. మరోవైపు శ్వేత (హైదరాబాద్) 15-21, 19-21తో కేయూర (రంగారెడ్డి) చేతిలో ఓటమిపాలైంది. రంగారెడ్డి క్రీడాకారిణులు భార్గవి, అభిలాష కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు. తొలి రౌండ్లో భార్గవి 21-8, 21-9తో హర్షిత వర్మ (మెదక్)పై, అభిలాష 21-7, 21-6తో స్ఫూర్తి (నెల్లూరు)పై గెలుపొందారు. బాలుర విభాగం మొదటి రౌండ్లో హైదరాబాద్ క్రీడాకారులు స్వరూప్, కీర్తి శశాంక్, మనీశ్ కుమార్ పరాజయం పాలయ్యారు. స్వరూప్ 11-21, 27-25, 17-21తో సాయి చరణ్ (గుంటూరు) చేతిలో, కీర్తి శశాంక్ 15-21, 23-25తో వర్షాంత్ (మెదక్) చేతిలో, మనీష్ కుమార్ 13-21, 10-21తో ప్రసాద్ (కరీంనగర్) చేతిలో పరాజయం పొందారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేశ్ కుమార్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ టోర్నీలో వివిధ జిల్లాలకు చెందిన 250 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తల్లి సుబ్బారావమ్మను జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జొన్నా సత్యనారాయణ సన్మానించారు. -
వరల్డ్ పారా బ్యాడ్మింటన్ టోర్నీకి రామాంజనేయులు
ఎల్బీ స్టేడియం,న్యూస్‌లైన్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో జరిగే వరల్డ్ పారా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెం దిన రామాంజనేయులు ఎం పికయ్యాడు. బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫర్ చాలెంజ్డ్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. అతను సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో తలపడుతాడు. గత ఏడాది జరిగిన జాతీయ సీనియర్ చాలెంజ్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రామాంజనేయులు కనబరిచిన ప్రతిభ ఆధారంగా భారత జట్టులో చోటు దక్కింది. ఈ పోటీలు నవంబరు 4 నుంచి 10 దాకా జర్మనీలోని డార్ట్మండ్లో జరుగనున్నాయి. -
రుత్విక, బాలు మహేంద్రలకు టైటిల్స్
జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండర్-19 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బాలికల సింగిల్స్ టైటిల్‌ను గద్దె రుత్విక శివాని (ఖమ్మం), బాలుర టైటిల్‌ను బాలు మహేంద్ర గెలుచుకున్నారు. తణుకులో బుధవారం ఈ పోటీలు ముగిశాయి. బాలికల ఫైనల్లో స్కోరు 15-13 ఉన్న దశలో రుత్విక ప్రత్యర్థి, టాప్‌సీడ్ రితుపర్ణదాస్ మ్యాచ్ నుంచి తప్పుకుంది. దీంతో రెండోసీడ్ రుత్వికను విజేతగా ప్రకటించారు. సెమీఫైనల్స్‌లో రుత్విక 21-13, 21-15తో శ్రీ కృష్ణప్రియ (హైదరాబాద్)పై; రితుపర్ణదాస్ 20-22, 21-19, 21-11తో వృశాలి (రంగారెడ్డి)పై విజయం సాధించారు. బాలుర ఫైనల్లో రెండోసీడ్ బాలు మహేంద్ర (విశాఖపట్నం) 21-9, 20-11, 21-10తో అనీత్ కుమార్ (రంగారెడ్డి)పై నెగ్గాడు. సెమీఫైనల్స్‌లో బాలు మహేంద్ర 21-9, 21-18తో కిరణ్ కుమార్ (రంగారెడ్డి)పై; అనీత్ కుమార్ 21-18, 8-21, 21-5తో చంద్రకుమార్ (తూర్పు గోదావరి)పై విజయం సాధించారు. బాలికల డబుల్స్‌లో మేఘన-రితుపర్ణదాస్ జోడి 21-15, 21-19తో పూజ-సోనికా సాయిలపై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. బాలుర కేటగిరీలో చైతన్య-గంగాధర్ రావు జంట 21-13, 21-16తో ఉపేందర్-అనిత్ కుమార్ జోడిని ఓడించింది. విజేతలకు భారత బ్యాడ్మింటన్ చీఫ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రోఫీలను అందజేశారు. -
సైనాకు తొలి పరీక్ష
గ్వాంగ్జూ (చైనా): తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత స్టార్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బుధవారం తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. రష్యాకు చెందిన ఓల్గా గొలొవనోవాతో జరిగే రెండో రౌండ్ మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ప్రపంచ 66వ ర్యాంకర్ ఓల్గా మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 21-13, 21-14తో అలీసియా జైత్సావా (బెలారస్)ను ఓడించింది. ప్రపంచ మూడో ర్యాంకర్ సైనా, ఓల్గా ముఖాముఖిగా తలపడనుండటం ఇదే తొలిసారి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ పి.వి.సింధు నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడనుంది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సింధు రెండో రౌండ్లో ప్రపంచ 32వ ర్యాంకర్ కవోరి ఇమబెపు (జపాన్)తో తలపడుతుంది. గత ఏడాది జపాన్ ఓపెన్‌లో ఇమబెపుతో ఆడిన ఏకైక మ్యాచ్‌లో సింధు గెలిచింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో పీటర్ కౌకల్ (చెక్ రిపబ్లిక్)తో కశ్యప్; పాబ్లో ఎబియన్ (స్పెయిన్)తో అజయ్ జయరామ్ పోటీపడతారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో కోనా తరుణ్-అరుణ్ విష్ణు జంట ప్రపంచ 15వ ర్యాంక్ జోడి మార్కిస్ కిడో-యూలియాంతో చంద్ర (ఇండోనేసియా)తో ఆడుతుంది. -
మిక్స్‌డ్‌లో సంతోష్ జోడికి టైటిల్
కొచ్చి: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ అండర్-19 మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సంతోష్ రావూరి జోడికి టైటిల్ దక్కింది. ఇక్కడి రీజినల్ స్పోర్ట్స్ సెంటర్లో ఆదివారం ఈ టోర్నీ ముగిసింది. పూర్విషా (కర్ణాటక)తో కలిసి రెండో సీడ్‌గా సంతోష్ బరిలోకి దిగాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఈ జంట 21-12, 25-23 స్కోరుతో ఐదో సీడ్ వినయ్ కుమార్ సింగ్-ప్రజ్ఞా రాయ్ (ఉత్తరప్రదేశ్)పై విజయం సాధించారు. అయితే అండర్-19 బాలుర డబుల్స్‌లో సంతోష్‌కు చుక్కెదురైంది. ఫైనల్లో సంతోష్-చైతన్య రెడ్డి (ఏపీ) జంట 14-21, 19-21తో అరుణ్ జార్జ్ (కేరళ)-ఆదిత్య జోషి (ఎయిరిండియా) చేతిలో పరాజయం పాలైంది. అండర్-17 బాలికల డబుల్స్ ఫైనల్లో ఏపీకి చెందిన డి. పూజకు ఓటమి ఎదురైంది. పూజ-కరిష్మా (మహారాష్ట్ర) జంటపై 21-17, 21-12తో మహిమ అగర్వాల్ (కర్ణాటక)- శిఖా గౌతమ్ (మహారాష్ట్ర) జోడి గెలుపొంది టైటిల్ సొంతం చేసుకుంది.