
వ్లాదివోస్తోక్: వరుస విజయాలతో మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పతకాలపై ఆశలు రేపిన హైదరాబాద్ అమ్మాయి మేఘన జక్కంపూడి పోరాటం సెమీస్‌తో ముగిసింది. రష్యా ఓపెన్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శనివారం కేవలం 27 నిమిషాల పాటు సాగిన మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ మేఘన–ధృవ్ కపిల జోడి 6–21, 15–21తో అద్నాన్ మౌలానా–మిచెల్లి క్రిస్టిన్ బండాసో (ఇండోనేషియా) జంట చేతిలో ఓడింది.
అనంతరం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో టాప్ సీడ్ మేఘన–పూర్విషా రామ్ జంట 10–21, 8–21తో నాలుగో సీడ్ మికి కషిహర–మియుకి కటో (జపాన్) ద్వయం చేతిలో కంగుతింది. కేవలం 33 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో భారత జోడి ఏమాత్రం పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసింది.
Comments
Please login to add a commentAdd a comment