meghana
-
తండ్రి మరణం.. బెంగతో కూతురి విషాదం!
నిజామాబాద్: తండ్రి మరణం, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. 15 ఏళ్ల క్రితం కూనమనేని శ్రీనివాస్ కుటుంబం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఎడపల్లిలో స్థిర పడింది. శ్రీనివాస్‌కు భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండేళ్ల క్రితం కూనమనేని శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుమార్తె మేఘన తండ్రిపై బెంగపెట్టుకొని మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదని తల్లి మాట్లాడుతుండగా విన్న మేఘన మనస్తాపానికి గురై సోమవారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలాన్ని బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ నరేశ్ పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇవి చదవండి: ప్రేమించి.. సహ జీవనం సాగించి -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
తెలుగమ్మాయిలకు జాక్ పాట్...బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు
-
కర్నూల్ అమ్మాయికి బంపరాఫర్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్
ముంబై: భారత మహిళల జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్న ఇద్దరు ఆంధ్రప్రదేశ్ క్రికెటర్లు సబ్బినేని మేఘన, అంజలి శర్వాణిలకు తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది. కొత్తగా ప్రకటించిన జాబితాలో వీరిద్దరికి గ్రేడ్ ‘సి’లో చోటు దక్కింది. బ్యాటర్ మేఘన ఇప్పటి వరకు భారత్ తరఫున 3 వన్డేలు, 17 టి20లు ఆడగా... లెఫ్టార్మ్ పేసర్ అంజలి 6 టి20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన 25 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేంట్రం చేసింది. ఇక మూడు గ్రేడ్లలో కలిపి మొత్తం 17 మందితో బోర్డు వార్షిక కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. గ్రేడ్ ‘ఎ’లో ఇప్పటి వరకు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన మాత్రమే ఉండగా కొత్తగా ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు అవకాశం లభించింది. మే 2021 తర్వాత మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్‌లు ప్రకటించడం ఇదే తొలిసారి. గత జాబితాలో ఉండి ప్రస్తుతం రిటైర్ అయిన మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలతో పాటు పూనమ్ యాదవ్‌ను కూడా తప్పించగా... ‘బి’ గ్రేడ్ జాబితాను 10నుంచి ఐదుకు కుదించారు. ప్రస్తుతం జట్టులో కీలకంగా మారిన రేణుకా ఠాకూర్, రిచా ఘోష్‌లకు ప్రమోషన్ దక్కగా, పూజ వస్త్రకర్ ‘బి’ నుంచి ‘సి’కి పడిపోయింది. కాంట్రాక్ట్‌ల జాబితా గ్రేడ్ ‘ఎ’ (రూ. 50 లక్షలు): హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ. గ్రేడ్ ‘బి’ (రూ. 30 లక్షలు): రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, రాజేశ్వరి గైక్వాడ్. గ్రేడ్ ‘సి’ (రూ. 10 లక్షలు): మేఘనా సింగ్, దేవిక వైద్య, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజ వస్త్రకర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యస్తిక భాటియా. చదవండి: NZ vs PAK: సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్.. న్యూజిలాండ్‌పై పాక్ ఘన విజయం -
అమ్మగా ఆలోచించి.. రూ. 50 కోట్లకు పైగా ఆదాయం..
ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై జనానికి స్పృహ పెరిగింది. పిల్లలు తినే ఆహారం గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. దీనికి పరిష్కారం కోసం ఆలోచించిన ఓ స్విమ్మింగ్ చాంపియన్ ఓ కంపెనీ పెట్టి పిల్లలకు మంచి ఆహారం అందిస్తోంది... మంచి లాభాలూ ఆర్జిస్తోంది. ఇదీ చదవండి: Pepsi New Logo: పెప్సీ కొత్త లోగో అదుర్స్! 15 ఏళ్ల తర్వాత... కూతురు కోసం చేసిన ప్రయత్నం.. పుణెకు చెందిన మేఘనా నారాయణ్‌కు పిల్లల పోషణ, ఆరోగ్యం పట్ల మక్కువ ఎక్కువ. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంపైనే ఆమె ఆలోచనలు ఎప్పుడూ ఉండేవి. ఈ నేపథ్యంలో శౌరవి మాలిక్, ఉమంగ్ భట్టాచార్య అనే మరో ఇద్దరితో కలిసి 2015లో పిల్లల కోసం ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తులను అందించే హోల్సమ్ ఫుడ్స్ (స్లర్ప్ ఫార్మ్ అండ్ మిల్లె) అనే కంపెనీని స్థాపించారు. తన పాపాయికి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడానికి ఆమె చేసిన ప్రయత్నాలే ఆమెను ఈ వ్యాపారం ప్రారంభించేలా చేశాయి. స్లర్ప్ ఫామ్ ప్రారంభించే ముందు మేఘనా మెకన్సీ అండ్ కంపెనీలో పబ్లిక్ హెల్త్ ప్రాక్టీస్‌కు నాయకత్వం వహించారు. స్లర్ప్ ఫార్మ్ సంస్థలో ప్రముఖ బాలివుడ్ నటి అనుష్క శర్మ కూడా పెట్టుబడి పెట్టడం విశేషం. ఈ సంస్థ 2022 ఫిబ్రవరి నాటికి రూ. 57 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? స్విమ్మింగ్‌లో చాంపియన్ మేఘనా నారాయణ్ అంతర్జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్. ఆమె 400 బంగారు పతకాలను గెలుచుకుంది. మేఘన ఎనిమిదేళ్ల పాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆసియా క్రీడలు సహా అనేక పోటీల్లో ఆమె పాల్గొని పతకాలు సాధించారు. ఒలింపిక్ క్రీడల్లో దేశానికి బంగారు పతకం సాధించాలనేది ఆమె కల. మేఘన విద్యాభ్యాసం మేఘన బెంగళూరు యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తి చేశారు. ఆ తర్వాత 2002లో ఆక్స్‌ఫర్డ్‌లోని ఓరియల్ కాలేజీకి రోడ్స్ స్కాలర్‌గా కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదవడానికి వెళ్లారు. 2007లో ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు -
మహిళా కాంగ్రెస్ నేత అరెస్ట్.. కారణం ఇదే..
గాంధీనగర్: గుజరాత్‌కు చెందిన మహిళా కాంగ్రెస్ నేత మేఘనా పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, విదేశీ మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో దాదాపు రూ. 10లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. విదేశీ మద్యం అక్రమ రవాణా కేసులో మేఘనా పటేల్‌ను గుజరాత్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే, ఆమె.. తన బొలెరో కారులో విదేశీ మద్యం స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పిప్లాడ్ రోడ్డు ప్రాంతంలో మేఘనా పటేల్ కారును ఆపి చెక్ చేశారు. ఈ సందర్బంగా కారు నడుపుతున్న వ్యక్తిని తనిఖీ చేయగా.. మేఘనా పటేల్ కోసం రూ.7.5 లక్షలకు పైగా విలువైన విదేశీ మద్యం తీసుకొచ్చినట్లు తేలింది.10 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో, విదేశీ మద్యాన్ని పోలీసులు సీజ్ చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, ఈ విదేశీ మద్యం ఎక్కడ నుంచి వచ్చింది.. దీన్ని ఎవరు విక్రయించారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మేఘనా పటేల్, కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, మేఘనా పటేల్ మాజీ మహిళా ఉపాధ్యక్షురాలుగా పని చేశారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ హాస్పిటల్స్ సీయివోగా మేఘన.. ఆమెనే ఎందుకు?
భారతీయ మూలాలు ఉన్న ప్రొఫెసర్ మేఘనా పండిత్ బ్రిటన్‌లోని ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ హాస్పిటల్స్ సీయివోగా నియమితురాలై ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకుంది. గత సంవత్సరం జులై నుంచి బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ హాస్పిటల్స్(వోయుహెచ్), నేషనల్ హెల్త్ సర్వీసెస్ ట్రస్ట్(ఎన్హెచ్ఎస్)కు తాత్కాలిక సీయివోగా బాధ్యతలు నిర్వహించిన మేఘన ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన ఆ బాధ్యత లు చేపట్టబోతోంది. ‘సీయివోగా మేఘన నియామకం సంతోషం కలిగిస్తుంది. విషయం మీద ఆసక్తి, అనురక్తి మాత్రమే కాదు అంకితభావం, క్రమశిక్షణ ఉంటే ఉన్నతస్థాయికి ఎదగవచ్చు అని చెప్పడానికి ఆమె ఉదాహరణ. ఉద్యోగులతో కలిసి పనిచేసే తీరు ఆమెలోని నాయకత్వ లక్షణాలకు అద్దం పడుతుంది. ట్రస్ట్‌కు సంబంధించిన విలువలు కాపాడడంలో, ట్రస్ట్ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆమె నాయకత్వ బలం ఉపయోగపడుతుంది’ అంటున్నారు ట్రస్ట్ చైర్పర్సన్ జోనాథన్. ‘ఎన్హెచ్ఎస్’కు బ్రిటన్‌లో ఎన్నో టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. యూరప్‌లో అత్యధిక సంఖ్యలో హాస్పిటల్స్ ఉన్నాయి. ట్రస్ట్ ఆధ్వర్యంలో విలువైన పరిశోధనలు జరుగుతున్నాయి. గతంలో ‘ఎన్హెచ్ఎస్’కు సంబంధించి చీఫ్ మెడికల్ ఆఫీసర్(సిఎంవో)గా విధులు నిర్వహించింది మేఘన. వార్విక్ యూనివర్శిటీ హానరరీ ప్రొఫెసర్‌గా నియామకం అయింది. ముంబైలో ఎంబీబీఎస్ చేసిన మేఘనా పండిత్ బోధన నుంచి నిర్వహణ వరకు తనదైన ప్రతిభతో ముందుకు దూసుకువెళ్తోంది. చదవండి: మీకంటే తోపు లేడనుకుంటున్నారా? అయితే సమస్యే..! -
ఘనంగా కొణిదెల హీరో పవన్ తేజ్ యాంకర్ మేఘన నిశ్చితార్థం (ఫోటోలు)
-
హీరోయిన్‌తో కొణిదెల హీరో నిశ్చితార్థం, ఫొటోలు వైరల్
కొణిదెల హీరో పవన్ తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి, యాంకర్ మేఘన మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. బుధవారం ఇరుకుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు చిరంజీవి సతీమణి సురేఖ, నటుడు సాయిధరమ్ తేజ్ సహా తదితరులు హాజరయ్యారు. తన ఎంగేజ్మెంట్ ఫొటోను పవన్‌తేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'నేను ఆమెను ప్రేమిస్తున్నాను, నాకు ప్రేమ అంటే ఏంటో ఆమె వల్లే తెలిసింది. మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని' రాసుకొచ్చాడు. అటు మేఘన కూడా.. 'నా ప్రేమను కనుగొన్నాను, అతడితో నిశ్చితార్థం కూడా జరిగింది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతోంది, కానీ నా చేతులు బరువెక్కుతున్నాయి. ఇక నా జీవితం అంతా నీకే సొంతం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. కాగా పవన్ తేజ్‌కు.. మెగాస్టార్ చిరంజీవి బాబాయ్ అవుతాడు. ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో హీరోగా ఆకట్టుకున్నాడు పవన్. ఇందులో హీరోయిన్గా మేఘన నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపడంతో త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. కాగా పవన్ తేజ నటుడిగా రాణించేందుకు ప్రయత్నిస్తుండగా మేఘన బుల్లితెర షో యాంకర్‌గా అలరిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Megganna (@m_y_megganna) View this post on Instagram A post shared by Pavan Tej Konidela (@pavantej_konidela) View this post on Instagram A post shared by Pavan Tej Konidela (@pavantej_konidela) చదవండి: తాప్సీ మూవీని నిషేధించి, గుణపాఠం చెప్దామంటున్న నెటిజన్లు ఘనంగా ప్రముఖ సీరియల్ నటి సీమంతం, ఫొటోలు వైరల్ -
Womens T20: మహిళల టి20 చాలెంజ్‌లో చెలరేగిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి!
పుణే: మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (47 బంతుల్లో 73; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో ట్రయల్‌బ్లేజర్స్ 16 పరుగుల తేడాతో వెలాసిటీపై గెలిచింది. అయితే రన్‌రేట్‌లో వెనుకబడిపోవడంతో బ్లేజర్స్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. శనివారం జరిగే ఫైనల్లో సూపర్‌నోవాస్‌తో వెలాసిటీ తలపడుతుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (44 బంతుల్లో 66; 7 ఫోర్లు, 1 సిక్స్) దంచేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (1) నిరాశపరిచినా... వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి మేఘన మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మేఘన 32 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా 36 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించాక మేఘన అవుటైంది. తర్వాత హేలీ మాథ్యూస్ (16 బంతుల్లో 27; 4 ఫోర్లు) ధాటిగా ఆడింది. అనంతరం వెలాసిటీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులకే పరిమితమైంది. కిరణ్ నవ్‌గిరే (34 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగినా లాభం లేకపోయింది. -
NZ W Vs Ind W: అదరగొట్టిన తెలుగమ్మాయి.. భారీ స్కోరు.. అయినా తప్పని ఓటమి.. సిరీస్ వాళ్లదే
NZ W Vs Ind W 3rd ODI: - క్వీన్స్టౌన్: మళ్లీ భారీ స్కోరు చేసినా... భారత మహిళల జట్టు న్యూజిలాండ్ చేతిలో వరుసగా మూడో వన్డేలోనూ ఓటమి చవిచూసి మరో రెండు వన్డేలుండగానే సిరీస్‌ను 0–3తో కోల్పోయింది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో మొదట మిథాలీ రాజ్ బృందం 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (41 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షఫాలీ వర్మ (57 బంతుల్లో 51; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 100 పరుగులు జోడించారు. మిడిలార్డర్లో దీప్తి శర్మ (69 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధసెంచరీ సాధించింది. 280 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 49.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. మహిళల వన్డే క్రికెట్లో ఇది రెండో అత్యుత్తమ ఛేజింగ్. అమెలియా కెర్ (67; 8 ఫోర్లు), అమి సాటెర్త్‌వైట్ (59; 6 ఫోర్లు), లారెన్ డౌన్ (52 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేటీ మారి్టన్ (37 బంతుల్లో 35) మెరిపించి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. జులన్ గోస్వామికి మూడు వికెట్లు దక్కాయి. చదవండి: Ind Vs Wi 2nd T20: ఆఖరి 2 బంతుల్లోనూ సిక్స్‌లు కొట్టాలి.. హర్షల్ ఆ అవకాశం ఇవ్వలేదుగా.. మనదే సిరీస్ -
Ind Vs NZ: తొలి వన్డేలో నిరాశే... ప్చ్... మన మేఘన కూడా...
Ind W Vs NZ W 1st ODI - క్వీన్స్టౌన్: వన్డే సిరీస్‌నూ భారత మహిళల జట్టు పరాజయంతోనే ప్రారంభించింది. తొలి వన్డేలో భారత్ 62 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. కెపె్టన్ మిథాలీ రాజ్ (73 బంతుల్లో 59; 6 ఫోర్లు) రాణించినా పరాజయం తప్పలేదు. శనివారం జరిగిన ఈ పోరులో మొదట న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 275 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ సుజీ బేట్స్ (111 బంతుల్లో 106; 10 ఫోర్లు) శతక్కొట్టింది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, పూజా వ్రస్తాకర్, రాజేశ్వరి, దీప్తి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 49.4 ఓవర్లలో 213 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (4) నిరాశపరిచింది. యస్తిక (41; 4 ఫోర్లు), మిథాలీ మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. వీళ్లిద్దరు ఔటయ్యాక మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోవడంతో భారత్ లక్ష్యానికి దూరమైంది. చదవండి: IPL Mega Auction 2022: రూ.15.25 కోట్లు.. ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు JENSEN STRIKES! @Jensen_Hayley digs one in and gets the wicket of Yastika Bhatia for 41. Good catch from @MaddyLGreen circling the boundary! Tune in LIVE to see the final quarter of our @kfcnz ODI on @sparknzsport 📲#NZvIND pic.twitter.com/jMzP5iW0LW — WHITE FERNS (@WHITE_FERNS) February 12, 2022 -
తగ్గద్దు.. వెనకడుగు వేయొద్దు
టంగుటూరు: పట్టుదల, ధైర్యం ఉంటే యువత ఏదైనా సాధించవచ్చని న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైన గడ్డం మేఘన చెప్పారు. విజయ సాధనలో ఎవరు నిరుత్సాహపరిచినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగితే విజయం తథ్యమని అన్నారు. భారత దేశంలో యువతకు చాలా అవకాశాలు ఉన్నాయని, అమ్మాయిల్లో చాలా నైపుణ్యాలు ఉంటాయని చెప్పారు. వారు పట్టుదల, ధైర్యంతో కష్టపడితే లక్ష్యాలను సునాయాసంగా చేరుకోవచ్చన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికై అరుదైన ఘనత సాధించారు. మేఘన తండ్రి గడ్డం రవికుమార్, తల్లి ఉష. వ్యాపార రీత్యా 21 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మేఘన కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్లో చదువు పూర్తి చేశారు. సంక్రాంతి సందర్భంగా ఆమె తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె చెప్పిన విషయాలు.. యువతకు చాలా ఐడియాలు ఉంటాయి. వీటిని న్యూజిలాండ్ పాలకులు గుర్తిస్తారు. మూడేళ్లకోసారి యూత్ పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్లో 120 మంది ఎంపీలు ఉంటారు. ప్రతి ఎంపీకి ఒక యూత్ ఎంపీ ఉంటారు. 16 నుంచి 18 ఏళ్ల వయస్సు వారు అర్హులు. వీరికి చదువు, నాయకత్వ లక్షణాలు ఉండాలి. నేను స్కూలు స్థాయిలోనే హెడ్‌గా ఎంపికయ్యాను. చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటు. స్నేహితులతో కలిసి అనాథ శరణాలయాలకు విరాళాలు సేకరిస్తాను. రిప్యూటీ సెంటర్ ద్వారా ఇరాన్, ఇరాక్, సిరియా తదితర దేశాల నుంచి వలస వచ్చిన శరణార్ధుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేపట్టాం. చిన్నారులకు చదువులో సాయం చేస్తాం. ఇవే నాకు ఈ అవకాశాన్ని కల్పించాయి. జూలైలో పార్లమెంటులో ప్రసంగం జూలైలో రెండు రోజులు మాకు పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం ఉంటుంది. లెజిస్లేటివ్, జనరల్ డిబేట్లో, సెలెక్ట్ కమిటీలో పాల్గొంటాం. పలు సూచనలు చేస్తాం. అక్కడి అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలను ఎత్తిచూపుతూ మంత్రులను, ప్రధానిని సైతం నిలదీయొచ్చు. మేము సభ దృష్టికి తెచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిపై మంత్రులు, ప్రధాని చర్చిస్తారు. వాటిని బిల్లులు చేసిన సందర్భాలూ చాలా ఉన్నాయి. న్యూజిలాండ్‌లో ఇళ్ల సమస్య ఎక్కువ. పేదలకు ఇళ్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సరిపోవడంలేదు. దీనిపైనే తొలి ప్రశ్న వేస్తాను. మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీకి విరాళం చీమకుర్తి మండలం పల్లామల్లిలోని మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీ బాలల కోసం చేస్తున్న మంచి పనులు చూసి రూ. 60 వేలు విరాళంగా ఇచ్చాను. పాఠశాలకు మరో రూ.2 లక్షలు ఇస్తాను. ఇంకా ఏదైనా అవసరం ఉంటే శాయశక్తులా చేస్తాను. తెలుగంటే బాగా ఇష్టం ప్రతి సంవత్సరం ఇండియాకు వస్తాను. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో రాలేదు. తెలుగంటే బాగా ఇష్టం. అందుకే ఇక్కడ తెలుగు బాగా నేర్చుకున్నాను. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాష చాలా గొప్పవి. అక్కడే పుట్టి పెరిగినా వీటిని మరిచిపోలేదు. యూత్ ఎంపీకి చేసుకున్న దరఖాస్తులో కూడా నేను ఎక్కడ నుంచి వచ్చాను, నా దేశ సంస్కృతి సంప్రదాయాలను పొందుపరిచాను. -
Gaddam Meghana: న్యూజిలాండ్ యువ ఎంపీగా 18ఏళ్ల తెలుగమ్మాయి..
-
న్యూజిలాండ్‌లో ఎంపీగా ప్రకాశం జిల్లా యువతి
టంగుటూరు: ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘనను న్యూజిలాండ్‌లో ‘సేవా కార్యక్రమాలు, యువత’ విభాగానికి ప్రాతినిథ్యం వహించే పార్లమెంట్ సభ్యురాలిగా అక్కడి ప్రభుత్వం నామినేట్ చేసింది. మేఘన తండ్రి రవికుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం రీత్యా 2001లో న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచే మేఘన సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేస్తుందని ఆమె తండ్రి తెలిపారు. -
Chiranjeevi Sarja Son: బాబాయి అందమైన వీడియో, నటి భావోద్వేగం
-
బాబాయి అందమైన వీడియో, నటి భావోద్వేగం
సాక్షి, ముంబై: దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా ఒక అందమైన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిరు, మేఘనా తనయుడు రాయన్ రాజ్‌తో ఆడుకుంటూ, ముద్దాడుతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. భార్య ప్రేరణతో కలిసి రాయల్ రాజ్‌ను ఎత్తుకున్న ఫోటోను, అలాగే బుజ్జి రాయన్ కాలితో ధృవను తన్నుతున్న ఫోటో కూడా యాడ్ చేశారు. దీనిపై తల్లి మేఘనా రాజ్ భావోద్వేగంతో స్పందించారు. అటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది. సోదరుడు అకాల మరణం తరువాత మేఘనను అక్కున చేర్చుకొని అన్నీ తానే అయి చూసుకున్నాడు ధృవ. ఈ క్రమంలో భర్తలేని లోటు తెలియనివ్వకుండా మేఘనాకు ఘనంగా సీమంతం కూడా జరిపించాడు. అంతేకాదు తన అన్నయ్యే మళ్లీ పుడతాడంటూ రూ. 10 లక్షల విలువ చేసే వెండి ఉయ్యాలను బహుమతిగా ఇవ్వడం అప్పట్లో విశేషంగా నిలిచింది. 2018లో చిరు సర్జా, నటి మేఘనా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతా హాయిగా సాగిపోతోంది అనుకుంటున్న తరుణంలో పెళ్లైన రెండేళ్లకే చిరు సర్జా మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. గతేడాది జూన్ 7న తీవ్ర గుండెపోటుతో 35 ఏళ్లకే కన్నుమూశారు. అప్పటికే గర్భవతిగా ఉన్న మేఘనాను ఈ సంఘటన హతాశురాలిని చేసింది. అయితే అక్టోబర్ 22న పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో ఈ విషాదంనుంచి మేఘనకు కాస్తంత ఊరట లభించింది. తరచూ తన భావాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునే మేఘనా తన చిన్నారి, జూనియర్ చిరు పేరును ‘‘రాయన్ రాజ్’’ అంటూ ఇటీవల ఒక బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేశారు. కాగా తెలుగులో బెండు అప్పారావు, లక్కీ తదితర చిత్రాల్లో నటించిన మేఘనా, చిరంజీవి సర్జాతో ‘ఆటగార’, ‘రామ్‌లీలా’ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. -
కరెంట్ షాక్‌తో చేతులు పోయాయి. భర్త వదిలేశాడు. కానీ..
‘‘జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే జీవితమంటే ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడమే. మామూలు వాళ్లైనా సరే.. వైకల్యం ఉన్న వాళ్లైనా సరే ఏదో ఒకటి సాధించాలని అందరికీ ఉంటుంది. అలాంటప్పుడు ముందుకెళ్లకుండా.. వెనక్కి తిరిగి చూడడం ఎందుకు? నా విషయంలో నేను చేస్తున్న పని ఎంతో ఆనందాన్ని ఇస్తోంది’’ అంటూ ముసిముసి నవ్వులతో చెబుతోంది టిక్‌టాకర్ మేఘనా గిమిరే. కరెంట్ షాక్‌తో రెండు చేతులు పొగొట్టుకున్న ఈమెలోని ఆత్మవిశ్వాసం.. అన్నీ ఉన్నా సాధించడానికి బద్ధకించేవాళ్లకు ఒక మంచి పాఠం. వెబ్‌డెస్క్: నేపాల్‌కు చెందిన మేఘనా గిమిరే. కొన్నేళ్ల క్రితం ప్రేమించిన వ్యక్తిని పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన పది నెలల తర్వాత ఓరోజు ఆమె ఘోర ప్రమాదానికి గురైంది. చేతికి ఇనుప గాజులు వేసుకోవడం, దగ్గర్లో ఉన్న హైటెన్షన్ వైరను పొరపాటున తాకడంతో ఆమె కరెంట్ షాక్‌కు గురైంది. చేతులు పూర్తిగా దెబ్బతినడంతో డాక్టర్లు సర్జరీ చేసి వాటిని తీసేశారు. అందమైన భార్య వికలాంగురాలు అయ్యేసరికి సహించలేక ఆ భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మేఘన ఇబ్బందుల్ని ఎదుర్కొంది. నడిపించిన తల్లి ప్రేమ భర్త వదిలేసినా.. కన్నపేగు మమకారం మేఘనను అక్కున చేర్చుకుంది. పుట్టింటికి తీసుకొచ్చింది. తినబెట్టడం, బట్టలు మార్చడం, స్నానం అన్నీ తల్లే దగ్గరుండి చేసింది. కొన్నాళ్లకు తనంతట తానుగా పనులు చేసుకోవడం ప్రారంభించింది గిమిరే. క్రమంగా కాళ్ల సాయంతో పనులు చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు సరదాగా మొబైల్‌ను కాళ్లను ఆపరేట్ చేస్తూ.. తన పాత టిక్‌టాక్ అకౌంట్‌ను చూసింది. సెల్ఫ్ వీడియోలతో టిక్‌టాక్‌లో వీడియోలు అప్లోడ్ చేసింది. ఆ వీడియోల్లో ఆమె ఆత్మవిశ్వాసానికి లక్షల మంది ఫిదా అయ్యారు. తక్కువ టైంలోనే మేఘన టిక్‌టాక్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం టిక్‌టాక్‌లో ఆమెకు ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ కాకముందు మన దగ్గరి నుంచి కూడా ఆమె వీడియోలకు మంచి స్పందనే దక్కేది. #Nepal #Tiktoker #Meghana pic.twitter.com/0VPf705VRK — ashwik (@ursashwik) June 3, 2021 అభిమానుల అండ సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ బాగా పెరిగింది. అయితే రాను రాను ఆ అభిమానులే.. ఆమె పట్ల దాతలుగా మారారు. వాళ్లు అందించిన డబ్బు సాయంతోనే ఆమె అమెరికా వెళ్లగలిగింది. అక్కడి డాక్టర్ల పర్యవేక్షణలో ప్రోస్తటిక్ చేతుల్ని అందుకుంది. కానీ, అవి ఆమెకు తాత్కాలిక ఊరట మాత్రమే అందించాయి. అయినప్పటికీ తనకు ఇప్పటిదాకా అందిన సాయం మరువలేనిదని చెబుతోంది మేఘన. చిరునవ్వుతో ఆమె చేసే సరదా వీడియోలే కాదు.. సందేశాలతో ఆమె మాట్లాడే మాటలు ఆకట్టుకునేలా ఉంటాయి. చదవండి: మీమ్స్‌లో కనిపించే ఇతగాడి గురించి తెలుసా? -
రెడ్ సారీలో హీటెక్కిస్తున్న బ్యూటీ
-
యాంకర్ మేఘనా అదిరే స్టిల్స్
-
పాట చాలా బాగుంది: వైఎస్ షర్మిల
‘‘ఈ కథలో పాత్రలు కల్పితం’ చిత్రంలోని రెండో పాట చాలా బాగుంది.. సినిమా కూడా మంచి విజయం సాధించాలి’’ అని వైఎస్ షర్మిల అన్నారు. పవన్ తేజ్ కొణిదెల, మేఘన జంటగా అభిరామ్ ఎమ్. తెరకెక్కించిన చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మాధవి సమర్పణలో రాజేశ్ నాయుడు నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని సెకండ్ లిరికల్ సాంగ్‌ను వైఎస్ షర్మిల విడుదల చేశారు. ‘‘ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యే ఎలిమెంట్స్‌కి ఎంటర్టైన్ మెంట్ జోడించి అభిరామ్ ఈ చిత్రాన్ని రూపొందించారు’’ అన్నారు రాజేశ్ నాయుడు. ‘‘పవన్ తేజ్ కొణిదెలకు ఇది పర్ఫెక్ట్ లాంచింగ్ అవుతుంది’’ అన్నారు అభిరామ్ ఎమ్. -
పాత్రలు కల్పితం
పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో మాధవి సమర్పణలో రాజేష్ నాయుడు నిర్మించారు. మేఘన హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలోని ‘కన్నయే కళ్లు..’ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మాట్లాడుతూ –‘‘థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. పవన్ తేజ్‌కి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ అవుతుందని భావిస్తున్నాం. మా చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సునీల్ కుమార్ విజువల్స్, తాజుద్దీన్ సయ్యద్ మాటలు మా చిత్రానికి హైలైట్’’ అన్నారు. ‘‘రాజేష్ నాయుడుగారి సహకారంతోనే సినిమాను రిచ్‌గా తీయగలిగాం. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని అభిరామ్.ఎమ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ పామర్తి. -
కల్పిత పాత్రలతో...
పవన్ తేజ్ కొణిదెల హీరోగా, మేఘన, లక్కీ హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. అభిరామ్ ఎం. దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. రాజేష్ నాయుడు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. టైటిల్ ప్రకటించినప్పటి నుంచి మా సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మంచి విజన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలతో అభిరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ తేజ్ కొణిదెలకి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ అవుతుంది. ‘జెస్సీ’, ‘ఓ పిట్టకథ’ సినిమాలకి పనిచేసిన సునీల్ కుమార్ విజువల్స్, ‘ఆర్ఎక్స్ 100’, ‘కల్కి’ చిత్రాల ఫేమ్ తాజుద్దీన్ సయ్యద్ మాటలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. త్వరలోనే టీజర్, పాటల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ పామర్తి, లైన్ ప్రొడ్యూసర్: దుర్గా అనీల్ రెడ్డి. -
పవర్ఫుల్ పోలీస్
పవన్ తేజ్ కొణిదెల హీరోగా, మేఘన, లక్కీ హీరోయిన్లుగా అభిరామ్ ఎం. దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘పెళ్లి’ సినిమా ఫేమ్ పృథ్వీరాజన్ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఆయన లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ జరుపుతున్నాం. పవన్ తేజ్‌కి తొలి సినిమా అయినా అనుభవం ఉన్నవాడిలా నటిస్తున్నాడు. అభిరామ్ మేకింగ్ ఫ్రెష్‌గా ఉంది. ‘జెస్సీ’ ఫేమ్ సునీల్ కుమార్ విజువల్స్, ‘ఆర్ఎక్స్ 100, కల్కి’ చిత్రాలకు డైలాగ్స్ రాసిన తాజుద్దీన్ సయ్యద్ మాటలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ పామర్తి, లైన్ ప్రొడ్యూసర్: దుర్గా అనిల్ రెడ్డి. -
‘ఈ కథలో పాత్రలు కల్పితం’లో మరో పాత్ర రివీల్
పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో రూపొందుతోన్న సినిమా 'ఈ కథలో పాత్రలు కల్పితం'. ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బేనర్‌పై అభిరామ్ ఎం. దర్శకత్వంలో రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. మేఘన హీరోయిన్. ఇటీవల విడుదలైన ఫస్ట్, సెకండ్ లుక్ పోస్టర్లకి మంచి స్పందన లభించింది. మొదటి రెండు పోస్టర్లలో హీరో లుక్‌ను మాత్రమే విడుదల చేసిన చిత్ర బృందం..ఇప్పుడు మిగతా పాత్రలు పోషించిన వారి లుక్స్‌ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం బబ్లూ పృథ్వీరాజ్ పాత్రను విడుదల చేసింది చిత్ర బృందం. రాజీవ్ కృష్ణ పేరుతో పోలీసు అధికారి పాత్రలో పృథ్వీరాజ్ సీరియస్‌గా కనిపించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి కార్తీక్ కొడకండ్ల సంగీతమందిస్తుండగా సునీల్ కుమారన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.