
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ‘ఎ’ మహిళల క్రికెట్ జట్టుతో స్వదేశంలో జరిగే వన్డే, టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్లను ప్రకటించారు. రెండు ఫార్మాట్‌లలో అనూజా పాటిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ సబ్బినేని మేఘన వన్డే, టి20 జట్లలో స్థానాన్ని సంపాదించింది. 21 ఏళ్ల మేఘన ఇప్పటివరకు భారత్ తరఫున ఆరు టి20 మ్యాచ్‌ల్లో ఆడింది. ఇటీవలే బీసీసీఐ అండర్–19 టోర్నమెంట్‌లో డబుల్ సెంచరీ సాధించిన 16 ఏళ్ల ముంబై అమ్మాయి జెమీమా రోడ్రిగ్స్‌కు కూడా ఈ రెండు జట్లలో చోటు లభించడం విశేషం.
డిసెంబరు 2, 5, 7వ తేదీల్లో జరిగే మూడు వన్డేలకు హుబ్లీ... 12, 14, 16వ తేదీల్లో జరిగే మూడు టి20 మ్యాచ్‌లకు బెల్గామ్ ఆతిథ్యం ఇస్తాయి. అంతకుముందు ఈనెల 26, 28వ తేదీల్లో అలూర్‌లో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment