
ప్రముఖ బుల్లితెర నటి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'సీతారామ' సీరియల్ ఫేమ్ మేఘనా శంకరప్ప కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించింది. తన ప్రియుడు జయంత్‌తో ఏడడుగులు వేసింది. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన వధూవరులకు అభినందనలు తెలుపుతున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన మేఘనా శంకరప్ప సీతారామ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది.
కాగా.. ఇంజినీరింగ్ పూర్తి చేసిన మేఘనా శంకరప్ప నటనవైపు అడుగులు వేసింది. బెంగళూరుకు చెందిన జయంత్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.
ఇక నటన విషయానికొస్తే.. మేఘనా శంకరప్ప ప్రస్తుతం 'సీతారామ' సీరియల్‌లో నటిస్తోంది. గతంలో ఆమె కన్నడలోనే 'నమ్మనే యువరాణి', 'కిన్నెరి' లాంటి సీరియల్స్‌లో కనిపించింది. అంతేకాకుండా 'కృష్ణ తులసి', 'రత్నగిరి రహస్య', 'దేవయాని', 'సింధూర' లాంటి సీరియల్స్‌లో నటించారు. అంతేకాకుండా మేఘన ఓ ప్రైవేట్ ఛానల్ డ్యాన్స్ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఆమె డ్యాన్స్‌ను శివరాజ్‌కుమార్ లాంటి స్టార్ హీరో సైతం మేఘన నృత్యాన్ని మెచ్చుకున్నారు. కన్నడ టీవీ పరిశ్రమలో మేఘన ఇప్పటివరకు నటించిన సీరియల్స్‌లో పాజిటివ్, నెగటివ్ పాత్రల్లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment