
ప్రముఖ బుల్లితెర నటి మాన్షి జోషి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. గతేడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాఘవ్‌ను పెళ్లాడింది. బెంగళూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, సన్నిహితులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాన్షికి అభినందనలు చెబుతున్నారు.
కన్నడలో పలు సీరియల్స్‌లో నటించిన మాన్షి జోషి.. తెలుగులో దేవత అనే సీరియల్‌లో కనిపించింది. ఈ సీరియల్‌లో అర్జున్ అంబటి, చంటిగాడు హీరోయిన్ సుహాసిని కీలక పాత్రల్లో నటించారు. అంతేకాకుండా కన్నడలో పారు సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. రాధ రమణ, అంబుదాన్ ఖుషీ, గీతాంజలి, రాధ రాఘవ్ లాంటి సీరియల్స్‌తో మెప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment