
శాండల్‌వుడ్‌లో వివాదం మరింత ముదురుతోంది. ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు కన్నడకు చెందిన అగ్ర సినీతారలు హాజరు కాకపోవడం రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశంపై ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అందరికీ నట్లు, బోల్టులు ఎప్పుడు బిగించాలో తమకు తెలుసని మండిపడ్డారు. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే నేషనల్ క్రష్, పుష్ప భామ రష్మిక మందన్నాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఇటీవల జరిగిన బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రష్మిక హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గణిగ మండిపడ్డారు. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో తన కెరీర్‌ను ప్రారంభించిన రష్మిక తన మూలాలు మరిచిపోవడం సరైంది కాదని హితవు పలికారు. గతేడాది కూడా ఈవెంట్‌కు ఆహ్వానించగా నిరాకరించిందని వెల్లడించారు. తాను కెరీర్ ప్రారంభించిన ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్న రష్మికకు తగిన గుణపాఠం చెప్పకూడదా? అంటూ అని మాండ్యా నియోజకవర్గ ఎమ్మెల్యే రవి గణిగ ప్రశ్నించారు. కాగా.. రష్మిక 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో రక్షిత్ శెట్టి సరసన సినీ రంగ ప్రవేశం చేసింది.
(ఇది చదవండి: ఇలాగే ఉంటే నటీనటులకు నట్లు, బోల్టులు బిగిస్తాం: డిప్యూటీ సీఎం)
రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమను పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. అలాగే కన్నడ భాషను కూడా విస్మరించి అగౌరవపరిచేలా మాట్లాడిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమానికి రష్మిక మందన్నను చాలాసార్లు ఆహ్వానించినప్పటికీ.. బెంగళూరు రావడానికి సమయం లేదని సమాధానమిచ్చిందని అన్నారు. మా శాసనసభ్యురాలు ఒకరు ఆమెను ఆహ్వానించడానికి 10 నుంచి 12 సార్లు ఆమె ఇంటికి వెళ్లారని గుర్తు చేశారు. కానీ రష్మిక కన్నడ పరిశ్రమను పట్టించుకోలేదని.. ఇలాంటి వారికి వారికి గుణపాఠం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. రష్మిక ప్రవర్తనకు తగిన పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా.. ఇటీవల బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-16 వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు శాండల్‌వుడ్ అగ్రతారలు హాజరు కాకపోవడంపై డీసీఎం డీకే శివకుమార్ సైతం మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment