film festival
-
సాయి పల్లవి కు ఉత్తమ నటిగా మరో అవార్డ్
-
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ లో నటి శ్రద్ధా కపూర్ సందడి (ఫొటోలు)
-
రెడ్ సీ ఫిలిం ఇంటర్నేషనల్ ఫెస్టివల్: కరీనా ఫ్యాషన్ లుక్స్ (ఫోటోలు)
-
ఇటీవలే గోవాకు వెళ్లిన శోభిత, సుదీర్
గచ్చిబౌలి: కన్నడ నటి శోభిత మృతదేహానికి సోమవారం ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని శ్రీరాంనగర్‌లో భర్త సు«దీర్ రెడ్డితో కలిసి నివాసం ఉంటున్న శోభిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె కుటుంబసభ్యులు గచ్చిబౌలి పీఎస్‌కు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి పోస్టు మార్టం పూర్తయిన తర్వాత శోభిత మృతదేహాన్ని బెంగళూర్‌కు తీసుకెళ్లారు. శోభిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టంలో నిర్ధారణ అయినట్లు ఉస్మానియా వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రోజు రాత్రి 10 గంటల సమయంలో శోభిత తన సోదరితో ఫోన్లో మాట్లాడిందని, తాము సంతోషంగా ఉన్నామని, కొద్ది రోజుల్లోనే ఇద్దరం కలిసి ఊరికి వస్తామని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా ‘ఎవ్రీ థింగ్ ఫర్ఫెక్ట్, చావాలనుకుంటే డూఇట్’ అని శోభిత రూమ్‌లో నోట్ రాసి ఉందని ఇన్స్పెక్టర్ హభీబుల్లాఖాన్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదని, శోభిత బంధువులు అనుమానాలు వ్యక్త చేయలేదని ఆయన పేర్కొన్నారు. భర్త అనుమానంతో డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా శోభిత ఉరి వేసుకుని కనిపించిందని, ఆ సమయంలోనూ గదిలో భక్తి పాటలు ప్లే అవుతున్నట్లు తెలిసింది. ఇటీవలే గోవాకు వెళ్లారు కొద్ది రోజుల క్రితమే గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌కు శోభిత, సుదీర్ వెళ్లినట్లు తెలిసింది. తిరిగి వచ్చిన తర్వాత కూడా భార్యాభర్తలు బాగానే ఉన్నారని ఇరుగు పొరుగు వారితో పాటు వారి కుటుంబ సభ్యులు పేర్కొనడం గమనార్హం. నటనకు అభ్యంతరం చెప్పలేదు: బుచ్చిరెడ్డి మ్యాట్రిమోని ద్వారా ఇరు కుటుంబాల అంగీకారంతోనే వివాహం చేశామని శోభిత మామ(భర్త తండ్రి) బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. సినిమాలు, సీరియల్స్‌లో నటించేందుకు తాము ఎప్పడు అభ్యంతరం చెప్పలేదన్నారు. ఆమె ఎప్పుడు భగవంతుని ధ్యానంలో ఉండేదని, తమ ఇంట్లో కూతురి లాగా మెలిగిందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యురాలిని కోల్పోయామని, సుధీర్ రెడ్డి డిప్రెషన్లో ఉన్నాడన్నారు. శోభిత కుటుంబసభ్యుల కోరిక మేరకు బెంగళూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
కసావు చీరలో సన్యా మల్హోత్రా..సరికొత్త స్టైల్ చీరకట్టు..!
-
మంజుమ్మెల్ బాయ్స్ మరో ఘనత.. ఏకైక భారతీయ చిత్రంగా!
మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా అదరగొట్టింది. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన ఘనత దక్కింది. రష్యాలో ప్రారంభమైన కినోబ్రావో ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీకి మంజుమ్మెల్ బాయ్స్ ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచిన ఏకైక భారతీయ చిత్రంగా ఘనత సాధించింది.కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ విడుదల చేయగా.. సూపర్ హిట్‌గా నిలిచింది. యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రాలలో ఒకటిగా ఘనత దక్కించుకుంది.(ఇది చదవండి: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ)తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 1న రష్యాలోని సోచిలో ప్రదర్శించనున్నారు. మంజుమ్మెల్ బాయ్స్‌తో పాటు ఎస్ఎస్ రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్, పాయల్ కపాడియా మూవీ ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రాలను వివిధ కేటగిరీలలో ప్రదర్శించనున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ అక్టోబర్ 4, 2024 వరకు కొనసాగనుంది. -
ఏయన్నార్ శత జయంతి సందర్భంగా కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్
ప్రముఖ దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు నటించిన కొన్ని క్లాసిక్ చిత్రాలు మళ్లీ థియేటర్స్‌లో ప్రదర్శితం కానున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 20న అక్కినేని నాగేశ్వరరావు నూరవ జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ‘ఏయన్నార్ 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్‌స్క్రీన్’ పేరుతో ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో సిటీస్‌తో ΄ాటు వరంగల్, కాకినాడ, తుముకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా సహా 25 నగరాల్లో సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు 10 క్లాసిక్స్ చిత్రాలను ఈ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఆయన ల్యాండ్‌మార్క్ సినిమాల ఫెస్టివల్‌తో జరుపుకోనుండటం ఆనందంగా ఉంది. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించి మార్గ దర్శకునిగా నిలిచారు. ఆయన లెగసీని కొనసాగించడం మాకు గర్వంగా వుంది. ఈ పండగను సాధ్యం చేయడంలో మాతో భాగస్వామ్యం అయినందుకు అక్కినేని కుటుంబం మొత్తం ఎన్ఎఫ్డీసీ–ఎన్ఎఫ్ఎఐ, పీవీఆర్–ఐనాక్స్కి ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘తెలుగు సినీ లెజెండ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ఈ ఫెస్టివల్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్పూర్. ‘‘ఒక దిగ్గజ నటుడికి నివాళులర్పించడం మాత్రమే కాదు, భారతీయ సినిమా యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రచారం చేయడానికే ఈ పండగ’’ అని తెలి΄ారు ఎన్ఎఫ్డీసీ–నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ పృథుల్ కుమార్. -
సినీమహోత్సవం! జాతీయ, అంతర్జాతీయ చిత్రాల ప్రదర్శన..
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రేక్షకాదరణ పొందిన సినిమా ఉత్సవాలకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్‌క్లబ్ 20 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకు బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో వివిధ భాషలకు చెందిన చిత్రాలను ప్రదర్శించనున్నారు.23వ తేదీ సాయంత్రం 4 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా సాయంత్రం 5.45 గంటలకు మరాఠీ కామెడీ చిత్రం ‘బైపన్ భారీ దేవ’ ప్రదర్శించనున్నారు. ప్రముఖ మరాఠీ సినీనటులు వందనాగుప్తా, సుకన్య కుల్కర్ణి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.24వ తేదీ రెండవ రోజు మరో అద్భుతమైన చిత్రం ‘ఆఫ్వాహ్’ ప్రదర్శించనున్నారు. ‘రాత్ కీ సుబ్హా నహీ’, ధారావి, చమేలి వంటి ఎన్నో అత్యుత్తమ చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు సు«దీర్ మిశ్రా ఈ చిత్ర ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అదేరోజు మధ్యాహ్నం అమల అక్కినేని, శార్వానంద్, రితూవర్మ తదితరులు నటించిన తమిళ చిత్రం ‘కనమ్’ ప్రదర్శన ఉంటుంది. చిత్ర దర్శకుడు శ్రీకార్తీక్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు.25న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అసీమ్ మిశ్రాతో ముఖాముఖి చర్చా కార్యక్రమం ఉంటుంది. పాన్‌సింగ్ తోమర్, న్యూయార్క్, బ్యాండ్ బాజా వంటి పలు చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాగే చివరి రోజు చిత్రాల్లో భాగంగా ‘కాడ్వి హవా’ (చేదు గాలి) సినిమాను ప్రదర్శించనున్నారు. ఎలాంటి టిక్కెట్లు లేవు, అర్ధవంతమైన స్ఫూర్తిదాయకమైన సినిమాలను ప్రేక్షకలోకానికి పరిచయం చేసే లక్ష్యంతో ఈ సినీమహోత్సవం నిర్వహిస్తున్నట్లు మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్‌క్లబ్ నిర్వాహకులు సంఘమిత్ర మాలిక్ తెలిపారు.ప్రదర్శనలు ఇలా..– 23వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు బైపన్ భారి దేవ మరాఠీ సినిమా ప్రదర్శన. – 24వ తేదీ ఉదయం 11.30 గంటలకు హిందీ సినిమా ఆఫ్వ్హా. మధ్యాహ్నం 3 గంటలకు తమిళ సినిమా కనమ్ ప్రదర్శన ఉంటుంది. – 25వ తేదీ ఉదయం 11.30 గంటలకు సినిమాటోగ్రాఫర్ అసీమ్ మిశ్రాతో చర్చా కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు కాడ్వి హవా సినిమా ప్రదర్శన.మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్‌క్లబ్ ప్రస్థానం..ప్రముఖ దర్శకులు బిమల్‌రాయ్ కూతురు అపరాజిత సిన్హా మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్క్లబ్ను 2004 ఆగస్టు 28వ తేదీన స్థాపించారు. ఉత్తమ చిత్రాలకు విశేషమైన ప్రాచూర్యం కలి్పంచే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ క్లబ్ ప్రముఖ కవి, రచయిత, దర్శకులు గుల్జార్ సాహెబ్ చేతులమీదుగా ప్రారంభమైంది. 20 ఏళ్లుగా కొనసాగుతున్న అత్యుత్తమ చిత్రాల ప్రదర్శనలో భాగంగానే ప్రస్తుతం 20 ఏళ్ల వేడుకలను నిర్వహిస్తున్నట్లు సంఘమిత్ర చెప్పారు. విభిన్న భాషలకు చెందిన సినీ దర్శకులు, రచయితలు, నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.ఇవి చదవండి: రెడీ.. సెట్.. గో..! మరో 4 రోజుల్లో.. హైదరాబాద్ మారథాన్! -
మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్లో రామ్ చరణ్.. భారత జెండా ఎగరేసి (ఫొటోలు)
-
గ్లోబల్ స్టార్‌కు అరుదైన గౌరవం.. ఆ వేడుకల్లో పాల్గొననున్న హీరో!
గోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని 15వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్‌కు రామ్ చరణ్‌కు ఆహ్వానం లభించింది. ఈ వేడుకలో గౌరవ అతిథిగా ఆయన పాల్గొననున్నారు. భారతీయ సినిమాకు చేసిన కృషికి గానూ ఈ వేడుకలో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్‌గా అవార్డ్ అందుకోనున్నారు. విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది ఆగస్టు 15-25 వరకు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఐఐఎఫ్ఎం తన ట్విటర్ ద్వారా వెల్లడించింది.ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్కు కూడా రామ్ చరణ్ గౌరవ అతిథిగా రానున్నారు. మీరు ఉత్సాహంగా ఉన్నారా? ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2024కి వస్తున్నారు. నాటు నాటుకు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో పాటు రామ్ చరణ్ ఫోటో ఉన్న పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్లో భారతీయ సినిమాకి ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ భారతీయ కళ, సంస్కృతికి అంబాసిడర్ అవార్డ్‌ను రామ్ చరణ్‌కు అందజేయనున్నారు. అంతర్జాతీయ వేదికపై జరుపుకునే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో భాగమైనందుకు నేను చాలా గౌరవంగా ఉందంటూ రామ్ చరణ్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది.కాగా.. చివరిసారిగా ఆర్ఆర్ఆర్లో కనిపించిన రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది చివర్లో గేమ్ ఛేంజర్ థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చెర్రీ నటించనున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్.. చెర్రీ సరసన కనిపించనుంది. Are you excited or ARE YOU EXCITED? Because Global Star Ram Charan is coming to the Indian Film Festival Of Melbourne 2024. Are we ready to dance to Naatu Naatu? pic.twitter.com/kFy7Z5zSdA— Indian Film Festival of Melbourne (@IFFMelb) July 19, 2024 -
ఐఫా స్టార్స్.. 2024–హోస్ట్స్‌గా రానా, తేజా సజ్జ
సాక్షి, హైదరాబాద్: అతిపెద్ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఐఫా అవార్డ్స్ 2024’కు సర్వం సిద్ధమైంది. సుదీర్ఘకాలం తర్వాత ‘ఐఫా’ ప్రారంభ కార్యక్రమం నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా మంగళవారం నిర్వహించారు. యూఏఈ అబుదాబిలోని యస్ ద్వీపం వేదికగా సెపె్టంబర్ 6, 7 తేదీల్లో జరగనుంది. నగరంలో ఏర్పాటు చేసిన ప్రారంభ వేడుకల్లో పలువురు తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ సినీ తారలతో పాటు అబుదాబి కల్చరల్ టూరిజం ప్రతినిధి అబ్దుల్లా యూసఫ్ మొహమ్మద్, ఫెస్టివల్ యూనిట్ హెడ్ డీటీసీ– నవాఫ్ అలీ అల్జాహ్దమీ తదితర ప్రతినిధులు సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే...ప్రపంచ స్థాయి గుర్తింపు భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కుతోంది. సినిమాకు ప్రాంతం, బాషతో సంబంధం లేదు. ప్రతీ రంగాన్ని ఆస్వాదిస్తున్నాను కాబట్టే సినిమా, టీవీ, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నాను. తెలుగులో తారక్ నటన అంటే చాలా ఇష్టం. అవకాశముంటే చిరు, బాలయ్య, తారక్ తో సినిమా చేయడాని సిద్ధంగా ఉన్నాను. – కుష్బూనెల రోజుల్లో కొత్త సినిమా ఈసారి అబుదాబి ఐఫా ఉత్సవం 2024ను నేను, తేజా సజ్జ కలిసి చేయబోతున్నాం. సినిమాను తెలుగు అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నంత మరెవరూ చేసుకోరేమో. మరో నెల రోజుల్లో కొత్త సినిమా గురించి వివరాలు చెబుతాను. – రానా దగ్గుపాటి రాశీ ఖన్నా– చివరి సారి జరిగిన ఐఫా ఉత్సవంలో పాల్గొన్నాను. ఇన్నేళ్ల తరువాత మళ్లీ జరుగుతుండటం సంతోషంగా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ – పుష్ప 2 కోసం అందరిలానే నేనూ ఎదురు చూస్తున్నారు. సుకుమార్ మరింత క్రేజీగా రెండో భాగాన్ని రూపొందించారు. రషి్మక ఇరగదీసింది. సినిమా ప్రయాణంలో హైదరాబాద్ ప్రత్యేకమైనది. శ్రీలీల– ఐఫా వేదికపై డ్యాన్స్ స్టెప్పులు వేయనున్నాను. కుర్చీ మడతపెట్టి ప్రజలకు బాగా చేరువైంది. ఇలాంటి వేదికల పై సినిమా కుటుంబాన్ని ఒకేసారి కలుసుకోవడం ఆనందంగా ఉంటుంది. తేజ సజ్జ– హనుమాన్ సక్సెస్ సంతోషాన్నిచి్చంది. మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. త్వరలో అప్డేట్ చేస్తాను. ఐఫా లో రానా తో పాటు హోస్ట్ గా చేస్తున్నాను. ఫరియా అబ్దుల్లా– కలి్కలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. షూటింగు సమయంలో ప్రభాస్ చేసిన అల్లరి మరచిపోలేను. మరో 3 సినిమాల్లో నటిస్తున్నాను. సిమ్రాన్– చాలా రోజుల తరువాత తెలుగు అభిమానులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. బాలయ్యతో నరసింహ రెడ్డి పాటలకు వేసిన స్టెప్పులు గుర్తొస్తున్నాయి. ప్రస్తుతం హిందీ, తమిళ్లో సినిమాలు చేస్తున్నాను. అవకాశాలను బట్టి తెలుగులోనూ చేయాలని ఉంది. అక్షర హాసన్– తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తున్నాను. హైదారాబాద్ ఎప్పుడు వచి్చనా మంచి అనుభూతి. తెలుగులోనూ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రగ్యా జైశ్వాల్– 2017లో ఐఫా ఉత్సవంలో కంచె సినిమా నేపథ్యంలో పాల్గొన్నాను. తెలుగు సినిమా ఎదిగిన తీరు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తెలుగులో మరో 2 సినిమాలు చేస్తున్నాను. నవదీప్– మొదటి ఐఫా అవార్డ్స్ కు హోస్ట్ గా చేశాను. నా నటన కన్నా నా మాటలను అభిమానులు బాగా ఆదరించారు. ఈ మధ్య కాలంలో ఓటీటీ లో మంచి సక్సెస్ ను అందుకున్నాను. -
బాలీవుడ్ బాద్షాకు ప్రతిష్టాత్మక అవార్డ్!
బాలీవుడ్ బాద్షా గతేడాది జవాన్, పఠాన్, డుంకీ చిత్రాలతో అభిమానులను అలరించాడు. జవాన్, పఠాన్ బ్లాక్‌బస్టర్ హిట్ కాదగా.. డిసెంబర్లో రిలీజైన రాజ్ కుమార్ హిరానీ చిత్రం డుంకీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే ప్రస్తుతం షారుక్ ఎలాంటి ప్రాజెక్ట్‌లోను నటించడం లేదు. తాజాగా మన బాలీవుడ్ హీరో అరుదైన ఘనత దక్కించుకున్నారు. లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ కెరీర్ అచీవ్మెంట్ అవార్డ్‌కు ఎంపికయ్యారు.ఈ విషయాన్ని ఫెస్టివల్ సైట్ అధికారికంగా ప్రకటించింది. భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసినందుకు అవార్డ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన జరగనున్న లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ అవార్డ్‌ను అందుకోనున్నారు. అంతేకాకుండా ఈ వేడుకలో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన దేవదాస్ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. గతంలో సాయ్ మింగ్-లియాంగ్, క్లాడియా కార్డినాలే, జానీ టో, ఫ్రాన్సిస్కో రోసీ, హ్యారీ బెలాఫోంటే, జేన్ బిర్కిన్ వంటి హాలీవుడ్ ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. -
కేన్స్ రెడ్ కార్పెట్‌పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్‌పై వివిధ రకాల గౌనులు, డిజైనర్‌వేర్‌లతో మెరిశారు. అయితే అస్సాంకి చెందిన ప్రఖ్యాత నటి ఐమీ బారుహ్ మాత్రం ఈ ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వించేలా చేసింది. దేశీ సంప్రదాయ చీర కట్టులో తళ్లుక్కుమని భారతీయలు ఆత్మగౌరవమే ఈ చీరకట్టు అని చాటి చెప్పింది. ఐమీ బారుహ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సాంప్రదాయ అస్సామీ దుస్తులు ధరించి రెడ్‌కార్పెట్‌పై వయ్యారంగా నడిచి వచ్చింది. ఆమె అస్సామీ సంప్రదాయ చీట్టు స్టైల్ చూపురులను చూపుతిప్పుకోనివ్వలేదు. అక్కడున్నవారంతా సంప్రదాయ అస్సామీ సంస్కృతికి కనెక్ట్ అయ్యేలా ఐమీ బారుహ్ ఆహార్యం ఉంది. ఆ చీర అహోం రాజవంశ కాలం నాటి ముగాట్టు. దానిపై పురాతన గోజ్ బోటా డిజైన్ నాటి సంస్కృతిని అద్దం పట్టేలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.అలాగే ఐమీ చేతికి ధరించిన గమ్ఖరు అనేది అస్సాం శ్రేయస్సు, రక్షణకు సాంప్రదాయ చిహ్నం. ఐమీ ఈ వేడుకలో అస్సాం చేనేత పరిశ్రమ కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ చీర పత్తి, గుణ నూలు మిశ్రమంతో తయారైన ఐదు వేర్వేరు రంగుల దారాలతో రూపొందించారు. ఈ మేరకు ఐమీ సోషల్ మీడియా పోస్ట్‌లో.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐకానిక్ రెడ్ కార్పెట్‌పై మూడవసారి అడుగుపెడుతున్నందుకు గర్వంగా భావిస్తున్నాను.ఒక అస్సామిగా గుర్తింపు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా మా వారసత్వాన్ని సూచించే రెండు వందల ఏళ్లనాటి సంప్రదాయ డిజైన్‌తో కూడిన చేనేత చీర, మణికట్టుపై గమ్ఖారు ధరించి ర్యాంప్‌పై నడవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యావాదాలు అని రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.(చదవండి: అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?) -
కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య.. ఫొటోస్ వైరల్! (ఫొటోలు)
-
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024..తారల సందడి (ఫొటోలు)
-
హాలీవుడ్‌కి హాయ్ చెప్తున్న మన హీరోయిన్స్
హాలీవుడ్లో చాన్స్ అంటే అంత సులభం కాదు. కానీ ప్రతిభ, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యం కూడా కాదు. దాంతో పాటు కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. అలా టాలెంట్‌తో పాటు హార్డ్‌వర్క్ చేస్తున్న కొందరు హీరోయిన్లను అదృష్టం కూడా వరించడంతో హాలీవుడ్ కబురు అందింది. హాలీవుడ్‌కి హాయ్ చెప్పిన ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం. ► శ్రుతీహాసన్‌కు గత ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. శ్రుతి హీరోయిన్గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్: సీజ్ఫైర్’ సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. అలాగే శ్రుతీహాసన్ ఓ లీడ్ రోల్లో చేసిన ఇంగ్లిష్ ఫిల్మ్ ‘ది ఐ’ గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ‘రివర్ సిటీ’, ‘ది లాస్ట్ కింగ్డమ్’ వంటి సిరీస్‌లలో నటించిన మార్క్ రౌలీ ఈ సినిమాలో శ్రుతీహాసన్‌కు జోడీగా నటించారు. దర్శకురాలు డాఫ్నే ష్మోన్ తెరకెక్కించారు. ‘ది ఐ’ సినిమాను త్వరలోనే థియేటర్స్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. సో.. శ్రుతీ హాసన్‌కు ఇదే తొలి ఇంగ్లిష్ మూవీ అవుతుంది. అలాగే ‘ది ఐ’ చిత్రం లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో పదర్శితం కానుంది. బెస్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఇదే జోష్‌లో ‘చెన్నై స్టోరీ’ అనే మరో ఇంగ్లిష్ ఫిల్మ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రుతీహాసన్. ‘ది ఆరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా ‘బాఫ్తా’ అవార్డు విజేత ఫిలిప్ జాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌కు లీడ్ పెయిర్‌గా అమెరికన్ నటుడు వివేక్ కల్రా నటిస్తారు. ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే అను (శ్రుతి పాత్ర) అనే యువతి నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. ఇండో–యూకే ్ర΄÷డక్షన్ నిర్మించనున్న ఈ చిత్రానికి యూకేకి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫండింగ్ చేయనుంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కానుంది. అయితే ఈ సినిమాలో తొలుత సమంత నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల సమంత తప్పుకోవడంతో శ్రుతీహాసన్ చేస్తున్నారు. ► తెలుగు మూలాలు ఉన్న నాయిక శోభితా ధూళిపాళ. ఈ బ్యూటీ అడివి శేష్ హీరోగా రూపొందిన ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించారు. మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశారు. అయితే శోభితకు హాలీవుడ్ నుంచి కబురొచ్చింది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ నటించి, దర్శకత్వం వహించిన ఇంగ్లిష్ మూవీ ‘మంకీ మ్యాన్’లో ఓ లీడ్ రోల్ చేశారు శోభిత. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. సినిమాను ఏప్రిల్ 5న థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. ‘‘నా తొలి హాలీవుడ్ మూవీకి మీ (అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి) ప్రేమ, అభిమానం కావాలి’’ అంటూ ఈ సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు శోభిత. ► దాదాపు నాలుగు దశాబ్దాలు వెండితెరపై వెలిగిన అలనాటి తార నూతన్ వారసురాలు ప్రనూతన్ బహల్. వెండితెరపై హిందీ చిత్రం ‘నోట్‌బుక్’ (2019)తో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టారు ప్రనూతన్. ఆ తర్వాత ‘హెల్మెట్’ (2021)లోనూ మెరిశారామె. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీకి హాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అమెరికన్ యాక్టర్ రహ్సాన్ నూర్ నటిస్తూ, దర్శకత్వం వహించనున్న ఓ రొమాంటిక్ డ్రామాలో ప్రనూతన్ హీరోయిన్గా నటించనున్నారు. ‘కోకో అండ్ నట్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్‌లో చికాగోలో ్రపారంభం కానుంది. ఇంగ్లిష్, ఇండియన్ నటులు ఈ సినిమాలో నటిస్తారు. ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది హీరోయిన్ల హాలీవుడ్ ఎంట్రీ జరిగే అవకాశం ఉంది. -
12th ఫెయిల్ చిత్రానికి అరుదైన గౌరవం.. !
ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్. గతేడాది అక్టోబర్ 27న బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ ఆ తర్వాత కేవలం మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ చిత్రం గతేడాది నవంబర్ 3న రిలీజైంది. తాజాగా ఓటీటీలోనూ రిలీజైన ఈ సినిమాకు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)లో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. ఇటీవలే మకావులో నిర్వహించిన ఆసియా-యూరప్ యంగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా ప్రదర్శించే సమయంలో అందరూ ఒక్కసారిగా లేచి నిలబడి అభినందించారు. 12th ఫెయిల్ స్టోరీ ఏంటి? ముంబై క్యాడర్(2005)కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ రాసిన కథ ఇది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సీవిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఆయన సీవిల్స్‌కి ప్రిపేర్ అయిన సమయంలో పడిన కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. భారతీయ విద్యావ్యవస్థలోని తీరుతెన్నులను స్పృశిస్తూనే.. ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థుల బాధలు, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. (12th ఫెయిల్ మూవీ రివ్యూ కోసం క్లిక్ చేయండి) ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే , మేధా శంకర్ , అన్షుమాన్ పుష్కర్ , అనంత్ జోషి , హరీష్ ఖన్నా , ప్రియాంషు ఛటర్జీ కీలక పాత్రలు పోషించారు. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 67 కోట్లను వసూలు చేసింది. డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఈ మూవీ కేలవం హిందీలోనే స్ట్రీమింగ్ కావడంతో మిగతా భాషల్లోనూ డబ్ చేయాలని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఓటీటీ సంస్థకు విజ్ఞప్తి చేస్తున్నారు. Such a memorable time @anupamachopra ! Thanks so much to #VidhuVinodChopra for bringing his fabulous #12Fail to #Macao #China for Asia-Europe Festival of Young Cinema.The universal theme really resonated with young Chinese audiences (& in our festival world #Restart is key! ) 👍 https://t.co/B6vlsZwMWF — Deepti DCunha (@deemelinda) January 12, 2024 -
Kolkata International Film Festival 2023: ఫిలిం ఫెస్టివల్లో మెరిసిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
Red Sea Film Festival 2023: కత్రినా కైఫ్.. అద్బుతమైన ఫోటోలు
-
ముంబై ఈవెంట్లో మెరిసిన ప్రియాంక.. వాచ్ ధర ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోయిన్గా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అమెరికా సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడింది. వీరిద్దరి మాల్టీ మేరీ అనే కూతురు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ 2023 హాజరైంది. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఫెస్టివల్లో ప్రియాంక చోప్రా తళుక్కున మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం అవీ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తన భార్య ఫోటోలు చూసిన నిక్ జోనాస్ కామెంట్ చేశారు. (ఇది చదవండి: నటి రోహిణి చిత్రానికి అరుదైన ఘనత..!) జియో మామి ముంబయి ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభింంచిన ప్రియాంక చోప్రా అనంతరం ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కమిటీకి అధికారిక అధ్యక్షురాలిగా హోదాలో అడుగుపెట్టారు. అద్భుతంగా డిజైన్ చేసిన గౌను ధరించి.. రెడ్ కార్పెట్‌పై అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈవెంట్లో బాలీవుడ్ భామ ధరించిన లగ్జరీ వాచ్‌పైనే అందరి దృష్టి పడింది. ఆమె వాచ్ విలువు దాదాపు రూ.1.5 కోట్ల విలువైనదిగా తెలుస్తోంది. ప్రియాంక ధరించిన వాచ్ 18 క్యారెట్ రోజ్ గోల్డ్ కేస్‌తో తయారు చేసినట్లు సమాచారం. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున ముంబై చేరుకుంది ప్రియాంక. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ వేడుకలో ప్రియాంకతో పాటు సోనమ్ కపూర్ అహుజా, రిచా చద్దా, అలీ ఫజల్, దియా మీర్జా, షానయా కపూర్, డయానా పెంటీ లాంటి బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు. కాగా.. ముంబయిలో జరుగుతున్న ఈ వేడుక అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. (ఇది చదవండి: శివాజీ ఎమోషనల్ వీడియో.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
‘జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ 2023’ తారల సందడి (ఫొటోలు)
-
ఆర్మూర్ హీరోకు అంతర్జాతీయ అవార్డు
ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లికి చెందిన అజయ్ వేద్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తాను హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా ‘మట్టి కథ’లో ఉత్తమ నటనకు గాను ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును కై వసం చేసుకున్నాడు. ఈమేరకు సదరు సంస్థ మంగళవారం అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఇప్పటి వరకు తమిళంలో మమ్మనీతం అనే సినిమాలో స్టార్ హీరో విజయ్ సేతుపతికి, బలగం సినిమాలో ప్రియదర్శికి మాత్రమే ద క్కింది. వీరి సరసన అజయ్ వేద్ నిలవడంతో మట్టి కథ సినిమాపై అటెన్షన్ బజ్ క్రియేట్ అయింది. సినీరంగంలో ప్రవేశం ఇలా.. ఆర్మూర్‌లోని మానస హైస్కూల్ కరస్పాండెంట్ గణేష్, పద్మ కుమారుడైన అజయ్ వేద్ తన బీటెక్, ఎంబీఏ పూర్తి చేసి రామానాయుడు స్టూడియోలో డిప్లొమా ఇన్ ఆక్టింగ్ పూర్తి చేసాడు. సినీ పరిశ్రమ లో అతనికి ఉన్న ఆసక్తితో పవన్ కడియాల దర్శకత్వంతో తెరకెక్కిన మట్టి కథ సినిమాలో హీరోగా అ వకాశం దక్కించుకున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రై లర్ ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్ర సాద్ విడుదల చేశారు. పల్లెటూరు అంటే పండు గలు, పబ్బాలకు ఇంటికి వచ్చి వెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో పల్లెటూరి కుర్రోడి ఆశ లు, ఆకాంక్షలు ఎలా ఉంటాయి, మట్టితో అనుబంధం, మట్టిలో మధురానుభూతి ఎలా ఉంటుంది అనే అంశంపై సినిమా నిర్మించారు మొదటి సినిమాలోనే అజయ్ వేద్ అంతర్జాతీయ అవార్డును కై వసం చేసుకోవడంతో తెలుగు సినిమా పరిశ్రమతో పాటు బంధువులు, తల్లిదండ్రులను అభినందిస్తున్నారు. -
న్యాయం కోసం రణం
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, బాధితుల న్యాయపోరాటం, పోరాటం చేసే క్రమంలో పడుతున్న కష్టాలు... అయినప్పటికీ వెనకడుగు వేయని పట్టుదలకు ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ అద్దం పడుతుంది. ఝార్ఖండ్‌లోని ఒక గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా నిషా పహుజా తీసిన ఈ చిత్రం టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచిపామ్ స్ప్రింగ్స్ ఫిల్మ్ ఫెస్టివల్(2023) వరకు ‘బెస్ట్ డాక్యుమెంటరీ’గా ప్రశంసలు అందుకుంటూనే ఉంది... పదమూడు సంవత్సరాల తన కూతురిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు రంజిత్ అనే రైతు. పోలీసుల స్పందన అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇక చుట్టాలు, పక్కాలు, గ్రామస్థుల విషయానికి వస్తే...‘జరిగిందేదో జరిగింది. పోయేది మీ కుటుంబ పరువే. కేసు వెనక్కి తీసుకోండి’‘మీ సంగతి ఏమిటోగానీ మన కులం పరువు పోయేట్లు ఉంది. కేసు వెనక్కి తీసుకోండి’‘మన జాగ్రత్తలో మనం ఉండకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతాయి. వారిని మనం ఏం చేయలేము. కేసు వెనక్కి తీసుకోండి’ఎవరు ఎలా స్పందించినా, ఆ స్పందనలో చివర గట్టిగా వినిపించే మాట... కేసు వెనక్కి తీసుకోండి. అయితే రంజిత్ వీరి ఉచిత సలహాలను పట్టించుకోలేదు. పోరాటదారిని వదలలేదు. ఈలోపు బెదిరింపులు పెరిగాయి. ‘కేసు ఉపసంహరించుకుంటావా లేదా?’ అని గ్రామస్థులనుంచి ఒత్తిడి పెరిగింది. రంజిత్ చేస్తున్న న్యాయపోరాటానికి శ్రీజన ఫౌండేషన్ అండగా నిలిచింది. మహిళల హక్కుల గురించి పనిచేస్తున్న స్వచ్ఛందసంస్థ ఇది. స్థూలంగా చెప్పాలంటే ‘టు కిల్ ఏ టైగర్’ అనే డాక్యుమెంటరీ కథ ఇది.అయితే ఇది కాల్పనిక కథ కాదు.ఝార్ఖండ్‌లోని బెరో జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటనల సమాహారం.డైరెక్టర్, రైటర్ నిషా పహుజా ‘టు కిల్ ఏ టైగర్’ రూపకర్త.కెనడియన్ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపుపొందిన నిషా దిల్లీలో పుట్టింది. కెనడాలోని టోరంటోలో పెరిగింది. చిన్నవయసులోనే తల్లిదండ్రులతోపాటు కెనడాకు వెళ్లిన నిషా తన భారతీయ మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు. బాలీవుడ్ సినిమాలు చూస్తూనే పెరిగింది.‘యూనివర్శిటీ ఆఫ్ టోరంటో’లో ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదువుకున్న నిషా రకరకాల సామాజిక ఉద్యమాల్లోపాల్గొంటోంది. డాక్యుమెంటరీ రీసెర్చర్‌గా పేరు తెచ్చుకుంది.కాలేజీ రోజుల నుంచే నిషాకు రచన, దర్శకత్వం అనేవి ఇష్టమైన సబ్జెక్ట్‌లు. కెరీర్ ప్రారంభంలో రీసెర్చర్‌గా కెనడియన్ ఫిల్మ్‌మేకర్స్ జాన్ వాకర్, అల్ కజిమ్లతో కలిసి పనిచేసిన నిషా చిత్ర నిర్మాణంపై కొంత అవగాహన, అనుభవం వచ్చాక డైరెక్టర్‌గా అడుగులు వేసింది. తక్కువ కాలంలో డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. కమర్షియల్ డైరెక్టర్‌గా రాణించాలనేది ఆమె కల కాదు. వాస్తవ సంఘటనలనే చిత్రాలుగా తీయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ‘చిత్రం ఎంత వాస్తవికంగా ఉంటే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవుతారు’ అంటుంది నిషా. 2012లో వచ్చిన ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ ఆమెలో రచన, దర్శకప్రతిభను ప్రపంచం దృష్టికి వచ్చేలా చేసింది. భారతీయ సమాజానికి చెందిన అమ్మాయిల జీవితంలో సంక్లిష్టతలు, వైరుధ్యాలను ఆధారంగా చేసుకొని తీసిన ఈ డాక్యుమెంటరీ వివాదాస్పదం కావడంతోపాటు ఎంతో చర్చను రేకెత్తించింది. ఇక ‘టు కిల్ ఏ టైగర్’ విషయానికి వస్తే మొదట ఈ చిత్రాన్ని తీయాలనుకోలేదు నిషా. ఝార్ఖండ్‌లోని ఒక స్వచ్ఛందసంస్థ చేపడుతున్న కార్యక్రమాల గురించి చిత్రం చేయాలని రంగంలోకి దిగినప్పుడు 13 సంవత్సరాల అమ్మాయి అత్యాచారానికి గురైన సంఘటన గురించి విన్నది. బాధితురాలు, ఆమె తండ్రితో మాట్లాడింది. మొదట తాను తీస్తున్న చిత్రంలో భాగంగానే బాధితురాలి గురించి చెప్పా లనుకుంది. అయితే ఆ తరువాత మాత్రం ఈ సంఘటననే చిత్రంగా తీయాలని నిర్ణయించుకుంది. టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్ నుంచి (హాట్ డాక్స్) కెనడియన్ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫెస్టివల్ వరకు ఎక్కడో ఒకచోట ‘టు కిల్ ఏ టైగర్’ గురించి ప్రస్తావన, ప్రశంస వినిపిస్తూనే ఉంది. ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తూనే ఉంది. -
సూపర్ స్టార్ బర్త్‌డే స్పెషల్... 9నుంచి రజనీ చిత్రోత్సవాలు
తమిళసినిమా: రజనీకాంత్ పుట్టినరోజు అంటే ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులకు పండగే. రజినీకాంత్ పుట్టినరోజున అభిమానులు ఆలయాల్లో పూజలు, అనాథాశ్రమాల్లో అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అలాంటిది ఈసారి ఇంకొంత స్పెషల్యాడ్ అవ్వడం విశేషం. రజనీకాంత్ ఈనెల 12న 71వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన గత 20 ఏళ్ల క్రితం కథ, కథనాన్ని సమకూర్చి నటించి నిర్మించిన చిత్రం బాబాను కొంత మార్పులు, చేర్పులతో సరికొత్త హంగులు చేర్చి విడుదల చేయడం ప్రత్యేకత అయితే రజనీకాంత్ చిత్రోత్సవాలు పేరుతో పీవీఆర్ సంస్థ ఈ నెల 9వ తేదీ నుం 15వ తేదీ వరకు ఆయన నటించిన హిట్ చిత్రాలను చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లో రీ రిలీజ్ చేయడం మరో విశేషం. బాబా, శివాజి, 2.ఓ, దర్బార్ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. కాగా సరికొత్త హంగులతో రూపొందిన బాబా చిత్ర ప్రీమియర్ చెన్నైలోని సత్య థియేటర్లో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోకు నిర్మాత కలైపులి ఎస్.థాను, లతా రజనీకాంత్, గీత రచయిత వైరముత్తు పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు. లతా రజనీకాంత్ మాట్లాడుత 20 ఏళ్ల క్రితం చూసిన దానికంటే పదిరెట్లు సంతృప్తిని బాబా చిత్రం కలిగింందని పేర్కొన్నారు. థియేటర్లో అభిమానుల చప్పట్లతో చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారన్నారు. వారికి తమ కుటుంబంపై ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని అన్నారు. -
బాబును ఎత్తుకొని కలెక్టర్ ప్రసంగం
చంకలో మూడేళ్ల బాబుతో ప్రసంగిస్తున్నది కేరళలోని పత్థనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్.అయ్యర్. ప్రైవేట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కుమారునితో పాటు హాజరైన ఆమె బాబును చంకలో ఎత్తుకునే ప్రసంగించారు. ఈ వీడియో వైరలైంది. అయ్యర్ తీరు ఐఏఎస్ వంటి ఉన్నతాధికారి బాధ్యతల నిర్వహణలో అనుసరించాల్సిన నైతిక విలువలకు తగ్గట్టుగా లేదంటూ విమర్శలు విన్పిస్తున్నాయి. దాంతో వీడియోను డిలీట్ చేశారు. మరోవైపు పలువురు కలెక్టర్ చర్యను సమర్థిస్తున్నారు. 2018లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి తన మూడేళ్ల కూతురితో హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అది అనధికారిక కార్యక్రమం కాబట్టే తన భార్య బాబును తీసుకెళ్లిందని కలెక్టర్ భర్త, కేరళ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కేఎస్ శబరినాథన్ చెప్పుకొచ్చారు. -
సమంతకు అరుదైన గౌరవం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సామ్
స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా వెళ్లేందుకు ఆమెకు ఆహ్వానం అందింది. కరోనా సంక్షభంతో రెండేళ్లు వాయిదా పడిన ఈ ఫెస్టివల్ దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. ఆగస్టు 12 నుంచి అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తనకు ఇన్విటేషన్ రావడం పట్ల సామ్ ఆనందం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. 'గతేడాది ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్‌లో భాగమయ్యాను ఇప్పుడు భారతీయ సినిమా ప్రతినిథిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిద్యం వహించడం నాకు గర్వంగా ఉంది. దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారతీయ సినిమాలను, భారతీయులు, సినీ ప్రేమికులు, ఇతరులందరిని ఇలా ఒక్కచోట చేర్చడం అనేది ఒక గొప్ప అనుభూతి'. అంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా నాగ చైతన్య నుంచి విడిపోయాక సామ్ కెరీర్ ముగిసినట్లేనని అందర భావించారు. అయితే అలాంటి వాటిని పట్టించుకోకుండా ఈ అమ్మడు తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం శాకుంతలం, యశోద అనే రెండు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు, విజయ్ దేవరకొండకు జంటగా ‘ఖుషి’లో నటిస్తున్నారు. -
Cannes Film Festival: గోస్ టు కాన్స్
పేదరికంతో ఇబ్బందులు పడే ఒక మహిళ కథ.. ఓ బాలుడి తీయని జ్ఞాపకాలు.. భారతీయ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాద బాధితుల ఇబ్బందులు.. ఇంటి కోసం వెతికే ఇద్దరు ట్రాన్స్‌జెండర్ మహిళల పాట్లు.. ఒక జర్నలిస్ట్ మరియు రెండు వర్గాల మధ్య సంఘర్షణ.. ఇవన్నీ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో వీక్షకుల ముందుకు రానున్నాయి. ఈ కథలతో రూపొందిన ఐదు భారతీయ చిత్రాలు కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ‘గోస్ టు కాన్స్’ విభాగంలో ప్రదర్శితం కానున్నాయి. ఈ నెల 17 నుంచి 28 వరకూ ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఫ్రాన్స్ దేశంలో జరగనున్న కాన్స్ ఉత్సవాలకు వెళ్లనున్న ఆ ఐదు చిత్రాల గురించి తెలుసుకుందాం. లైలా... రోషిణి... ఓ ఇల్లు జీవించడానికి ఒక ఇంటి కోసం ఆరాటపడుతుంటారు లైలా, రోషిణి అనే ఇద్దరు స్త్రీలు. ఆ ఇద్దరూ లింగ మార్పిడి చేయించుకున్నవారు కావడంతో అద్దెకు ఇల్లు దక్కించుకోవడం పెద్ద ప్రహసనం అవుతుంది. రిన్ చిన్, మహీన్ మీర్జా రూపొందించిన హిందీ చిత్రం ‘ఏక్ జగహ్ అప్నీ’ కథ ఇది. నిజమైన ఇద్దరు ట్రాన్స్ ఉమెన్ (లింగ మార్పిడి చేయించుకున్న మహిళలు) నటించిన చిత్రం ఇది. ఇద్దరికీ కూడా ఇది తొలి సినిమానే. కథ రాసేటప్పుడు వారి అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఓ బాలుడి జ్ఞాపకాలు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఛత్తీస్‌గఢ్‌లో చదువుకుంటాడు ఆ కుర్రాడు. ఆ నాలుగేళ్ల జీవితం ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ జ్ఞాపకాలకు కొన్ని కాల్పనిక అంశాలు జోడించి దర్శకుడు శైలేంద్ర సాహు తెరకెక్కించిన చిత్రం ‘బైలాడీలా’. శైలేంద్ర సాహు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ఛత్తీస్ గఢ్‌లో చదువుకున్నప్పటి అతని జ్ఞాపకాలే ఈ సినిమా. హిందీ, ఛత్తీస్‌గఢ్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి బడ్జెట్ నిర్ణయించలేదు. శేలైంద్ర స్నేహితులు నటించారు. వాళ్లతో పాటు టెక్నీషియన్లు ఎవరూ పారితోషికం తీసుకోలేదు. ఈ సినిమా ద్వారా డబ్బులొస్తే అప్పుడు ఇస్తానని ఫ్రెండ్స్‌కి మాటిచ్చారు శైలేంద్ర. కాన్స్ చిత్రోత్సవాల్లో తన చిత్రాన్ని మార్కెటింగ్ చేసుకోవాలనే ఆకాంక్షతో అక్కడికి వెళుతున్నారు. నిర్మాతలు ముందుకు రాని ‘ఫాలోయర్’ బెల్గామ్‌లోని ఓ పట్టణానికి చెందిన ఒక జర్నలిస్ట్, రెండు వర్గాల మధ్య సంఘర్షణ చుట్టూ సాగే చిత్రం ‘ఫాలోయర్’. హర్షద్ నలవాడే దర్శకత్వంలో హిందీ, కన్నడ, మరాఠీ, దఖినీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. బెల్గామ్ నేపథ్యం కావడంతో అక్కడి స్థానికులతోనే నటింపజేశారు. రెండు వర్గాల మధ్య సంఘర్షణ నేపథ్యంలోని సినిమా కావడంతో నిర్మాతలెవరూ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రాలేదు. దాంతో తమ పరిస్థితిని వివరిస్తూ ఈ సినిమా టీమ్ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూసి ఆర్థిక సహాయం చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. అలా ‘క్రౌడ్ ఫండెడ్’ మూవీగా ‘ఫాలోయర్’ రూపొందింది. సినిమా షూటింగ్ పూర్తి చేసి, రఫ్ కట్ చేస్తున్న సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఇద్దరు నిర్మాతలు సహాయం చేయడంతో ఈ సినిమా పూర్తయింది. పేదరికాన్ని జయించాలని... ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్నం భోజనం అందించే వంట మనిషి శివమ్మ జీవితం చుట్టూ సాగే కథ ‘శివమ్మ’ చిత్రం. పేదరికాన్ని జయించడానికి ఆమె రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. చివరికి కూతురి పెళ్లికి దాచిన డబ్బుని ఓ వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతుంది. నిజజీవితంలో జరిగిన కొన్ని ఘటనలను జోడించి అల్లిన కాల్పనిక కథతో దర్శకుడు జై శంకర్ ఈ కన్నడ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించినవారందరూ వృత్తిరీత్యా యాక్టర్లు కాదు. కానీ సినిమా సహజత్వానికి దగ్గరగా ఉండాలని నటింపజేశారు. దర్శక–నిర్మాత–నటుడు రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాగ్జాన్ 2020లో అస్సాంలోని తిన్సుకియా జిల్లాలో ఓ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. భారతదేశ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాదంగా నమోదైంది. గ్యాస్ లీకేజ్ కారణంగా చమురు బావిలో ఎగసిపడిన భారీ మంటలను అదుపు చేసేందుకు దాదాపు ఆరు నెలలు పట్టింది. ఈ ఘటన నేపథ్యంలో రూపొందిన అస్సామీ చిత్రం ‘బాగ్జాన్’. తిన్సుకియాలో నిజమైన లొకేషన్లలో చిత్రీకరించారు. అలాగే ఆ దుర్ఘటన బాధితులను కూడా నటింపజేశారు చిత్రదర్శకుడు జైచెంగ్ గ్జయ్. బలమైన కథాంశంతో రూపొందిన ఈ ఐదు చిత్రాలూ ప్రపంచ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటాయని ఊహించవచ్చు. ఇలా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కావడం ఆయా చిత్రబృందాలకు ఉపయోగపడే విషయం. తమ సినిమాని మార్కెటింగ్ చేసుకునే వీలు ఉంటుంది. అలాగే తదుపరి చిత్రానికి ఫండ్ సమకూరే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అప్పటికి సినిమా విడుదల కాకపోతే విడుదలకు సహాయం అందే అవకాశం ఉంది. మేకర్స్‌కి ఇలాంటి ప్రయోజనాలు ఉంటే.. నటీనటులకు అవకాశాలు పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. అందుకే కాన్స్ చిత్రోత్సవాలకు వెళ్లనున్న ఈ ఐదు చిత్రాల యూనిట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. -
'జై భీమ్' చిత్రానికి మరో రెండు అవార్డులు..
Suriya Jai Bhim Movie Got Indie Spirit Awards At Boston International Film Festival: కరోనా సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై అశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం 'జై భీమ్'. సూర్య హీరోగా టీజే. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల 'దాదా సాహేబ్ పాల్కే ఫిలీం ఫెస్టివల్'లో రెండు అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 'ఉత్తమ చిత్రం'గా నిలవగా, మూవీలో నటించిన మణికందన్‌కు 'బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్' అవార్డు వచ్చంది. తాజాగా 'జై భీమ్' సినిమా మరో రెండు అవార్డులను సాధించింది. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరిగిన 'బోస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'లో జై భీమ్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇందులో నటి లియోమోల్ జోస్‌కు 'ఇండీ స్పిరిట్ బెస్ట్ యాక్ట్రెస్' అవార్డు వరించగా, 'ఇండీ స్పిరిట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ' అవార్డును మూవీ కెమెరామెన్ ఎస్.ఆర్. కదీర్ సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్టైన్మెంట్' సంస్థ పేర్కొంది. సూర్య, జ్యోతిక కలిసి '2డీ ఎంటర్టైన్మెంట్' పతాకంపై 'జై భీమ్' చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మించారు. చదవండి: దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో సూర్య, అల్లరి నరేశ్ చిత్రాలకు అవార్డులు The Director of #JaiBhim, @tjgnan Sir handed over #BostonInternationalFilmFestival's Award for the Indie Spirit Best Cinematography to @srkathiir Sir 🥳@Suriya_offl #Jyotika @rajsekarpandian @BostonInterFF pic.twitter.com/M4l6z0jDUT — 2D Entertainment (@2D_ENTPVTLTD) May 6, 2022 #JaiBhim bags the Awards for Indie Spirit Best Actress & Indie Spirit Best Cinematography at the #BostonInternationalFilmFestival Congratulations @jose_lijomol & @srkathiir Sir on the Awards! Thank You @BostonInterFF for the honour@Suriya_offl #Jyotika @tjgnan @rajsekarpandian pic.twitter.com/zyfjdo7Sn2 — 2D Entertainment (@2D_ENTPVTLTD) May 5, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో సూర్య, అల్లరి నరేశ్ చిత్రాలకు అవార్డులు
Suriya, Naresh Movies Won DadaSaheb Phalke Film festival Award: తమిళ స్టార్ హీరో సూర్య ‘జై భీమ్’, అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాలకు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాయి. ప్రతి ఏడాది జరిగే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిగింది. 12వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ ప్రస్తుతం 2022లో జరగగా ఈ సారి జై భీమ్, నాంది సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి. సూర్య నటించిన జై భీమ్ సినిమా ఇప్పటికే చాలా అవార్డులని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Suriya’s ‘Jai Bhim’ bags two awards at the Dadasaheb Phalke International Film Festival 2022 "The film won the award for the Best Film and actor Manikandan won the Best Supporting Actor awards at the film festival reportedly on May 3." - TOI #JaiBhim pic.twitter.com/DZ5iL493i6 — ♂️ ᴿᵃᵗᵉᵈ®️ˢᵘᵖᵉʳ ˢᵗᵃʳ🌟 ᵀʰᵃˡᵃᵖᵃᵗʰʸ🥇MSD7️⃣⚓ (@VIIJAYism) May 4, 2022 చదవండి: వైరల్: ఎయిర్‌పోర్ట్‌లో పరుగెత్తుతూ కనిపించిన ఆలియా.. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సినిమాగా జై భీమ్ నిలిచింది. అంతే కాక ఈ సినిమాలో నటించిన మణికందన్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా వరించింది. దీనిపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక అల్లరి నరేశ్ నటించిన నాంది సినిమాని డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కించారు. ఈ సినిమాకి కాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును విజయ్ అందుకున్నారు. దీంతో నాంది చిత్ర యూనిట్, పలువురు టాలీవుడ్ ప్రముఖులు విజయ్‌కి అభినందనలు తెలుపుతున్నారు. This is the proud moment for me and my Naandhi team about my Darling @vijaykkrishna receiving the Dadasaheb Phalke Film Festival 2022 Award as the best Debut Director. In this joy, the responsibility of all our friends is further increased more.. @allarinaresh @varusarath5 pic.twitter.com/zd7rxxEKoq — Brahma Kadali (@brahmakadali) May 1, 2022 చదవండి: విశ్వక్ సేన్ అసలు హీరోనే కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో 'తెలుగు ఇండీ' సినిమా 'ముత్తయ్య'..
Telugu Indie Film Muthayya To Premiere In UK Asian Film Festival: 'పుష్ప: ది రైజ్', 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ బడ్జెట్ తెలుగు చిత్రాలు దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. గత కొన్నేళ్లుగా పలు ఇండీ-స్పిరిటెడ్ తెలుగు సినిమాలు సైతం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటున్నాయనేది. ప్రస్తుతం అంతర్జాతీయ సర్క్యూట్లో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్న కొత్త 'తెలుగు ఇండీ' చిత్రం 'ముత్తయ్య'. ఈ మూవీ 'యూకే ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్'లో ప్రదర్శించేందుకు తాజాగా ఎంపికైంది. మే 9న లండన్‌లోని రిచ్ మిక్స్‌లో ప్రీమియర్‌గా 'ముత్తయ్య' ప్రదర్శించబడనుంది. యూరప్‌లో సుధీర్ఘకాలం ప్రదర్శించబడుతున్న దక్షిణాసియా చలనచిత్రోత్సవాల్లో 'యూకే ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్' ఒకటి. 'ముత్తయ్య' సినిమా విషయానికొస్తే.. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చందమామ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేసింది. ఈ పోస్టర్లో థియేటర్లో వెండితెరను చూస్తూ ఒక పెద్దాయన నిలుచొని ఉండటం మనం చూడొచ్చు. ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో 'కొత్త పోరడు' వెబ్ సిరీస్ ఫేమ్ కె సుధాకర్ రెడ్డి నటించారు. ఆయనతోపాటు అరుణ్ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర వంటి కొత్తవారు కూడా కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఈ మూవీకి కొత్త డైరెక్టర్ భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్‌గా దివాకర్ మణి పనిచేశారు. ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్పై బృందా ప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా, హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవైట్ లిమిటెడ్‌కు చెందిన కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సమర్పిస్తున్నారు. చదవండి: హాలీవుడ్ మూవీలో ధనుష్ ఫస్ట్ లుక్ ఇదే.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే ? నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. తేలిగ్గా విడిచిపెట్టనంటూ లైవ్‌లో వార్నింగ్ IT’S NEVER TOO LATE TO DREAM BIG. AND HERE’S ONE SUCH HEARTWARMING STORY. PRESENTING THE FIRST LOOK OF #MUTHAYYA. CONGRATULATIONS TO THE TEAM FOR GETTING SELECTED AT UK ASIAN FILM FESTIVAL. #DREAMBIG @vrindaprasad #BHASKHARMAURYA #DIVAKARMANI @crhemanth @FictionaryEnt pic.twitter.com/VUMHE8dH9L — Kajal Aggarwal (@MsKajalAggarwal) April 26, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో హీరో ఆదిత్య ఓంకు అవార్డు
నటుడు, డైరెక్టర్ ఆదిత్య ఓం గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. 2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి తనలోని మరో టాలెంట్ బయటపెట్టారు.తాజాగా జరిగిన రెండు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటుడిగా ఆదిత్య ఓం అవార్డు గెలుచుకున్నారు. 'దహ్నం'. ఈ సినిమాలో బ్రాహ్మణ పూజారిగా ఆయన నటనకు గాను ప్రశంసలతో పాటు అవార్డ్స్ దక్కాయి.రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క ప్రతిష్టాత్మక ఎనిమిది ఎడిషన్లలో ప్రాంతీయ చలనచిత్ర విభాగంలో ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు ఆదిత్య ఓం. ఈ గ్రాండ్ ఫిల్మ్ ఫెస్టివల్లో రణధీర్ కపూర్ వంటి దిగ్గజాలకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులను అందించారు. మరోవైపు ఆదిత్య ఓంకు ముంబైలోని ప్రైమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. దీంతో ఆనందంలో మునిగిపోయిన ఆదిత్య ఓం.. తాను మళ్లీ మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఈ అవార్డులు ఎంతగానో దోహదపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక 'దహ్నం' చిత్రానికి రచన, దర్శకత్వం వహించిన మూర్తి అడారికి కూడా బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు లభించింది. -
'పలాస'కు అరుదైన గౌరవం.. ఆ ఫెస్టివల్‌కు ఎంపిక
Karuna Kumar Palasa 1978 Movie Selected For PK Rose Film Festival: 1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన ఈ చిత్రంతో కరుణ కుమార్ అనే నూతన దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రఘు కుంచె కీలక పాత్ర పోషిస్తూ సంగీతమందించాడు. మార్చి 6, 2020న విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షాదరణ పొందింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈనెల 9,10,11 తేదిలలో చెన్నైలో నిర్వహించే పికె. రోజ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కాబోయే సినిమాల్లో 'పలాస 1978' కూడా ఎంపికైంది. ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. 'ఎస్సీ, ఎస్టీల జీవనాన్ని, వారి జీవిత గాథలను కథా చిత్రాలుగా మలిచే డైరెక్టర్ పా రంజిత్. ఆయన 2018లో వానమ్ ఆర్ట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. కరోనా తర్వాత మళ్లీ ఈ వేడుక జరగనుంది. ఏప్రిల్ నెలను 'దళిత్ మంత్'గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ పుట్టినరోజు పురస్కరించుకొని చేస్తున్న ఈ ఫెస్టివల్లో సాహిత్యం, సినిమా రెండు కూడా ప్రధాన భూమికలు పోషిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ పాలిటిక్స్‌ను ఇతివృత్తంగా తెరకెక్కించిన సినిమాలను ఈ వేడుకలో ప్రదర్శిస్తారు. దేశం గర్వించే దర్శకుల సినిమాల పక్కన 'పలాస 1978' చిత్రానికి చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఫెస్టివల్లో భాగమైనందుకు నాకు గర్వంగా కూడా ఉంది. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని 'పలాస'తో నాకు అనుభవంలోకి వచ్చింది. దానితో పాటు ఇటువంటి వేదికలపై 'పలాస 1978 ' సినిమా ప్రదర్శించడం దర్శకుడుగా మరిచిపోలేని అనుభవం కాబోతుంది.' అని కరుణ కుమార్ తెలిపారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు.. -
బై ది ఉమెన్ ఫర్ ది ఉమెన్
‘ఫిల్మ్‌మేకర్ కావాలనుకుంటున్నాను’ అని మగవాళ్లు అంటే అభ్యంతర పెట్టేవాళ్లు, భయపెట్టేవాళ్లు పెద్దగా ఉండకపోవచ్చు. అదే మహిళల విషయానికి వచ్చేసరికి మాత్రం ‘ఎందుకు వద్దంటే...’ అంటూ చాంతాడంత జాబితా తయారవుతుంది. ఈ నేపథ్యంలో ‘మీరు విన్నవి అపోహ లు మాత్రమే. వాస్తవాలు కాదు’ అనే స్పష్టత ఇవ్వడానికి, ‘మీ ప్రతిభ నిరూపించుకోండి’ అని ధైర్యం చెప్పడానికి వ్యక్తులే కాదు వేదిక కూడా ముఖ్యమే అంటోంది ముంబైకి చెందిన రిషి నికమ్. చిత్రసీమలోని ఆయా విభాగాలలో స్త్రీలు ధైర్యంగా అడుగుపెట్టడానికి, తనలాగే ఆలోచించే మరికొద్దిమందితో కలిసి ‘బై ది ఉమెన్–ఫర్ ది ఉమెన్’ కాన్సెప్ట్ తో ‘కళాకారి’ వేదికకు ఊపిరి పోసింది. ఈ వేదిక తరపున మహిళల చేత రూపుదిద్దుకున్న ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రపంచంలోని పలు భాషల చిత్రాలను ప్రదర్శించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. నిజానికి ఇవి సినిమాలు కాదు తమను ఉత్తేజపరిచే పాఠాలు. çకళాకారి ఫిల్మ్ ఫెస్టివల్లో మహిళా దర్శకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. మహిళాదర్శకుల చిత్రాలను మాత్రమే ప్రదర్శిస్తారు. ‘ఇది మన ఫిల్మ్ ఫెస్టివల్’ అనే భావన కలుగుతుంది. ‘చైనీస్ ఫిమేల్ ఫిల్మ్ డైరెక్టర్ క్లోయే జావో తొలిరోజుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ తరువాత తనను తాను నిరూపించుకుంది. బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డ్ అందుకున్న జావోకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆమె తొలి ఫీచర్ ఫిల్మ్ ‘సాంగ్స్ మై బ్రదర్ టాట్ మీ’ అన్నాచెల్లెళ్ల్ల అనుబంధాన్ని అద్భుతంగా చూపింది. అది చైనీస్ ఫిల్మ్ అనిపించదు. అదేదో మన పక్కింట్లో జరుగుతున్నట్లు ఉంటుంది. డైరెక్టర్ గొప్పదనం అదే. అలాంటి డైరెక్టర్లు మన దగ్గర కూడా తయారుకావాలి’ అంటుంది రిషి. ‘ఫిల్మ్‌ఫెస్టివల్‌లో పాల్గొనడం వలన ఏమిటి ప్రయోజనం?’ అనే ప్రశ్నకు ‘మంచి అనుభూతి మిగులుతుంది’ అనేది సంతృప్తికరమైన జవాబు కాదు. ‘కళాకారి’ నిర్వాహకులలో ఒకరైన ప్రియా యాదవ్ మాటల్లో చెప్పాలంటే...‘అక్కడ చిత్రాలను చూడడం మాత్రమే కాదు...ఇరాన్ నుంచి చైనా వరకు తమను ఇన్స్పైర్ చేసే చిత్రదర్శకుల గురించి మాట్లాడు కుంటారు. కొత్త విషయాలెన్నో తెలుసుకుంటారు. ఆ తరువాత ప్రముఖ మహిళా దర్శకులు తమ అనుభవాలను వివరిస్తారు. ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, వాటిని ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నారు మొదలైన విషయాల గురించి మాట్లాడతారు. తర్వాత రకరకాల టాపిక్స్‌పై చర్చ జరుగుతుంది. నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత! ఏదో దయతలిచి సినిమారంగంలో మహిళలకు అవకాశం ఇవ్వమని అడగడం ఈ వేదిక ఉద్దేశం కాదు. చిత్రపరిశ్రమలో లింగవివక్షత ఉండకూడదు అని డిమాండ్ చేయడం మాత్రమే. సినిమా రంగంలో మహిళల ప్రతిభ గురించి చరిత్ర పుటలు తిరిగేస్తే తెలుస్తుంది’ ‘కళాకారి’ లక్ష్యం విజయవంతం కావాలని ఆశిద్దాం. -
ఒక్క నిమిషం వీడియో.. ఆస్కార్ ఆవకాశం
సాక్షి,సిటీబ్యూరో: సినిమానే జీవితాశయంగా మార్చుకుని, సినిమా రంగంలో అవకాశాల కోసం వినూత్న శైలిలో షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందిస్తున్న నేటి తరం సినిమా ప్రేమికులు ఎందరో... కానీ అలాంటి ఔత్సాహికుల కళను, ఆసక్తిని ప్రదర్శించే వేదిక ఇప్పటి వరకు లేదు. అలాంటి వారి కోసమే దేశంలో మొట్టమొదటిసారిగా అంతర్జాల వేదికగా ప్రఖ్యాతిగాంచిన జోష్ యాప్ ‘జేఎఫ్‌ఎల్‌ఐఎక్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో ఓ వేదికను రూపొందించింది. ఈ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన షార్ట్ ఫిల్మ్ ఏకంగా ఆస్కార్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడమేకాకుండా అక్కడి సెలబ్రిటీ స్క్రీనింగ్‌లో భాగం కానుంది. (చదవండి: భర్త మరో మహిళతో జిమ్‌లో ఉండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య) చిన్న సినిమా.. పెద్ద వేదిక... ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా కేవలం ఒకే ఒక్క నిమిషం నిడివి గల షార్ట్ ఫిల్మ్ రూపొందించాలి. దేశ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహాకులు తెలిపారు. రోమ్కామ్, మ్యూజికల్, కామెడీ, యాక్షన్, ఫ్యాషన్ మరేదైనా కథాంశంతో షార్ట్ ఫిల్మ్ రూపొందించి, నవంబర్ 1వ తేదీలోపు జోష్ యాప్‌లో సబ్మిట్ చేయాలని పేర్కొన్నారు. ఈ ఎంట్రీలలోని ఉత్తమమైన షార్ట్ ఫిల్మ్‌ను ఎంపిక చేయడానికి న్యాయనిర్ణేతలుగా ప్రముఖ తారలు ఫరాఖాన్, కునాల్ కోహ్లీ, ప్రభుదేవాలు వ్యవ్హరిస్తున్నారు. నవంబర్ 12న గోవాలో జరిగే గ్రాండ్ ఫినాలేలో బెస్ట్ షార్ట్ ఫిల్మ్‌ను ప్రకటించనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేలో ప్రముఖ తారలు వివేక్ ఒబేరాయ్, ఉర్వశి రౌతేల హోస్ట్‌గా.., సునీల్ శెట్టి, అలయా ఎఫ్, డినో మోరియా, సోనియా మెహరా, సోనాలి రౌత్ తదితరులు అతిథులుగా విచ్చేయనున్నారు. ‘జేఎఫ్‌ఎల్‌ఐఎక్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన షార్ట్ ఫిల్మ్ హాలీవుడ్ ఆస్కార్ సెలబ్రేషన్స్‌కు వెలుతుందని, అక్కడ జరిగే సెలబ్రిటీ స్క్రీనింగ్‌లో భాగమవుతుందని ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహాకులు తెలిపారు. (చదవండి: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్!) -
అంతర్జాతీయంగా మరో గుర్తింపు సాధించిన ‘ఆకాశమే నీ హద్దురా’
సూర్య హీరోగా నటించిన ‘శూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) చిత్రానికి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఎస్ఐఎఫ్ఐ)లో ప్రదర్శితం కానుంది. ఈ చిత్రోత్సవాలు ఈ ఏడాది జూన్ 11 నుంచి జూన్ 20 వరకు జరగనున్నాయి. పనోరమ విభాగంలో ‘శూరరై పోట్రు’ చిత్రం ఎంపికయింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని సుధ కొంగర తెరకెక్కించారు. ఆల్రెడీ 93వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌కు పరిశీలించిన చిత్రాల్లో ‘శూరరై పోట్రు’ ఉన్న విషయం తెలిసిందే. అయితే నామినేషన్ దక్కలేదు. మరో ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్‌కు కూడా ఈ చిత్రం వెళ్లింది. ఇప్పుడు షాంఘై చలన చిత్రోత్సవాలకు వెళ్లడం ఈ చిత్రానికి దక్కిన మరో గౌరవంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే... మలయాళ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ కూడా ప్రదర్శనకు ఎంపికైంది. కొత్తగా పెళ్లయిన యువతి అత్తింటివాళ్లు, భర్తకు తగ్గట్టుగా ఒదిగిపోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడిందనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. జో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు–తమిళ భాషల్లో కన్నన్ దర్శకత్వంలో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించనున్నారు. . @Suriya_offl - #SudhaKongara 's Blockbuster #AakaasamNeeHaddhuRa Enters Panorama Section Of Shanghai International Film Festival 2021. 🔥#PraiseTheBrave #SooraraiPottru @rajsekarpandian @Aparnabala2 @gvprakash @2D_ENTPVTLTD #Suriya #Suriya40 pic.twitter.com/JHy2TW7Aa8 — Telugu Film Producers Council (@tfpcin) May 13, 2021 చదవండి: సీఎం స్టాలిన్‌ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం -
మరో తెలుగు చిత్రానికి అరుదైన ఘనత
అది 2000 సంవత్సరం అప్పుడప్పుడే కంప్యూటర్ వచ్చిన రోజులవి. గ్రామంలోకి అప్పుడే అడుగులు వేసుకుంటూ వచ్చిందో వయ్యారి కంప్యూటర్. అమ్మాయి వెంట చూసే దిక్కులను కంప్యూటర్ వైపు చూసి, ఈ కంప్యూటర్ను ఎలాగైనా నేర్చుకోవాలనే తాపత్రాయంతో ఉండే ఓ అబ్బాయి. ఆ కంప్యూటర్లో వచ్చే ఒక మెయిల్‌తో మోసపోయే అబ్బాయిల అమాయకత్వం. ప్రతిసారి లాగా ఈ సారి తను నేర్పించే శిక్షణతో ఎవరు నాకు పొటీ రాకుండా నేర్చుకోవడానికి వచ్చిన వారికి ముందుగానే షరతు పెట్టి, తను మోసపోయానని చెప్పే అమాయకత్వం ఇంకోకరిది. ఇప్పటికీ మీ అందరికీ గుర్తువచ్చే ఉంటుంది. మాకు ఎందుకు తెలియదు..! మరీ ఇంతా అమాయకులు ఉంటారా..అని అనుకున్న చిత్రమే..కంబాలకథలు ‘మెయిల్’. ఈ చిత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకొని, అద్భుత విజయం సాధించింది. కాగా తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సృష్టించింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన కంబాలపల్లి కథలు ‘మెయిల్’ చిత్రం ‘న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021’ కు ఎంపిక చేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా తర్వాత న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవకాశం దక్కింది. ఈ విషయాన్ని నిర్మాతలు శనివారం తెలిపారు. జూన్ 4 న ప్రారంభమయ్యే న్యూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సంవత్సరం ఓటీటి ప్లాట్‌ఫాం ఆహాలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష, ప్రియ తదితరులు తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించగా, ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరించారు. #Mail has been now an 'Official selection at the New York Indian Film Festival'. A big thanks to each and everyone who made it possible♥️ #ReasonToSmile @SwapnaCinema @ahavideoIN #UdayGurrala pic.twitter.com/Rl2Y41q75N — Priyadarshi (@priyadarshi_i) May 8, 2021 -
అరుదైన గౌరవం..మురిసిపోతున్న అనసూయ
టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు అరుదైన గౌరవం లబించింది. ‘తెలంగాణ చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్’ ఆమెను తన సొంత పోస్టల్ స్టాంప్‌తో సత్కరించింది. అంతేగాక అనసూయ ఫోటోకి ఎర్రకోటని జోడించడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా అనసూయ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా అనసూయ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చిత్రపురికి కృతజ్ఞతలు తెలియజేశారు. స్టాంప్ అందుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘జీవితంలో అంతకు మించిన గౌరవం ఏం ఉంటుంది. నా సొంత పోస్టల్ స్టాంపులు. ఇందుకు అర్హురాలు అయ్యేందుకు నేనేం చేశానో నాకు తెలీదు. చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ !! ఈ విలాసానికి ముందే నేను మీ గురించి గర్వపడుతున్నాను. ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న గొప్ప ప్రయత్నమిది. మీరు చేస్తున్న గొప్ప పనుల కోసం నేను చేయగలిగినదంతా చేస్తానని మాటిస్తున్నాను’ అని ఉద్వేగానికి లోనయ్యారు అనసూయ. కాగా చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ ఈ సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా స్పూర్తిని నింపే ఎంతో మంది మహిళల ఘనతకు సంబంధించిన కథలను వెల్లడించనుంది. అంతగా ఏం సాధించానో తెలియదని అనసూయ అనడం తన నిరాడంబరతను వ్యక్తం చేస్తోంది. అయితే ఓ సక్సెస్ఫుల్ వుమెన్‌గా అనసూయకు ఈ గౌరవం లభించడం సరైనదేనని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: నోరుపారేసుకున్న నెటిజన్.. అనసూయ గట్టి కౌంటర్ స్పెషల్ సాంగ్ కోసం అనసూయ భారీ రెమ్యునరేషన్ -
థియేటర్లో మీరొక్కరే.. తోడుగా 60 సినిమాలు
థియేటర్ మొత్తానికి ఒక్కళ్లమే కూర్చొని సినిమా చూస్తే కలిగే ఫీలో, థ్రిల్లో ఎలా ఉంటుందో ఇటీవల కొందరు ప్రేక్షకులు ఢిల్లీలో, ముంబైలో, ఇంకా కొన్ని మెట్రోల్లో.. ఆఖరికి మన హైదరాబాద్‌లో కూడా విధిలేక అనుభూతి చెందారు. కొందరైతే కూర్చోలేక మధ్యలోనే హాల్ బయటికి వచ్చేశారు. కరోనా లేని నార్మల్ టైమ్‌లో కూడా ఒకరిద్దరితో నడిచిన సినిమాలు అక్కడక్కడా ఆడలేక పోలేదు. చాలాకాలం క్రితం ఓ నిర్మాత ప్రేక్షకులకు ఛాలెంజ్ విసిరారు. అతడు నిర్మించినది దెయ్యం సినిమా. ఆ దెయ్యం సినిమాను ఒంటరిగా ఒక్కరే హాల్లో కూర్చొని సినిమా మొత్తం చూస్తే ఎన్ని లక్షలో ఇస్తానని ఆయన ప్రకటించారు. ఫలితం ఏమైందన్నది ఇప్పుడు టాపిక్ కాదు. వందల సీట్ల మధ్య ఒక్కరమే కూర్చొని గంటా గంటన్నరసేపు సినిమా చూడ్డం ఎలా ఉంటుంది అన్నదీ కాదు. ఎవరికైనా అలా సింగిల్‌గా, ఏకాంతగా సినిమా చూడాలని ఉంటే వాళ్ల కోసం స్వీడన్ ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్లు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఏమిటా ఏర్పాట్లు, ఎలా వాళ్లను సమీపించాలి, టిక్కెట్ ధర ఎంత.. ఇలాంటివన్నీ నెట్లో వెదికితే దొరకుతాయి. ఏమైనా మీరు జనవరి 17 లోపు వెదకాలి. ఇప్పుడిక ఒంటరిగా సినిమా చూడాలని లేకపోయినా.. ఈ ఒంటరిగా సినిమా చూడ్డం ఏంటని తెలుసుకునేవాళ్ల కోసం ఈ స్టోరీ అంతా. సంగతేంటంటే ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు స్వీడన్లో ఎర్తెబోజియే ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఎర్తెబోజియే అనేది బాల్టిక్ సముద్ర తీర ప్రాంతంలోని ఒక స్వీడన్ పట్టణం. ఆ పేరును ఫిల్మ్ ఫెస్టివల్‌కు పెట్టనైతే పెట్టారు గానీ, సినిమాల స్క్రీనింగ్‌లన్నీ జరుగుతున్నది చాలా వరకు అక్కడికి సమీపంలోని పేటర్ నోస్టర్ దీవిలో. అందులో కొన్ని స్క్రీన్స్ ఉన్నాయి. కొన్ని ఆ దీవిలోనే మరోచోట ఉంటాయి. మొత్తం 60 సినిమాలను ప్రదర్శిస్తారు. యేటా ఎర్తెబోజియే ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతూ వస్తున్నదే కానీ ఈ ఏడాది ఫెస్టివల్ ఒక్కటే జరుగుతుంది. ప్రేక్షకులు ఉండరు. ఉండరంటే ఉండరని కాదు. స్క్రీన్‌కి ఒక్కరు, సినిమాకు ఒక్కరు, సినిమా వేళలకు ఒక్కరు ఇలా ఆ వారం రోజులూ వేర్వేరు కాల మాన స్థల పరిస్థితుల్లో సినిమాల ప్రదర్శన ఉంటుంది. ఇక ఆ సినిమాలు తీసిన వాళ్లు, నటించినవాళ్లు, ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్లు, విమర్శకులు వీళ్లుంటారు కదా స్క్రీనింగ్ బ్రేక్‌లో.. వాళ్లందరితో ఆన్లైన్లో వర్చువల్ టాక్ ఉంటుంది. సరే, ఇప్పుడివన్నీ మామూలే. సోషల్ డిస్టెన్స్ కాబట్టి ఎర్తెబోజియే కూడా ప్రేక్షకులకు డిస్టెన్స్ పాటిస్తోంది. స్వీడన్‌లోని పేటర్ నోస్టర్ దీవి (ఇందులో కనిపిస్తున్నవి ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఏర్పాటు చేసిన థియేటర్లు); ఆ చివర ఉన్నది బాల్టిక్ సముద్రంలోని పేటర్ నోస్టర్ లైట్ హౌస్. ఒంటరివాడను నేను సింహం సింగిల్‌గా వస్తుంది అన్నట్లు ఈ ఫెస్టివల్ సినిమాలకు సింగిల్‌గా వచ్చేందుకు అర్హత సాధించినవాళ్లకు రెడ్ కార్పెట్ పరిచి ఉంటుంది. ఉదాహరణకు ఎలాగంటే.. ఎర్తెబోజియేలో స్కాండినేవియమ్ ఇండోర్ ఎరీనా ఉంది. (ఫొటో చూడండి) అందులో కొన్ని స్క్రీన్లు ఉంటాయి. అలాంటి ఎరీనాలు, థియేటర్లు పేటర్ నోస్టర్ దీవిలోనూ మరికొన్ని ఉంటాయి. ఎర్తెబోజియే పట్టణం, పేటర్ నోస్టర్ దీవి ఆనుకునే ఉంటాయి. ఎవరికి ఏ సినిమాకు, ఏ ఆటకు, ఏ వేళకు లాటరీ తగిలితే (ఇవన్నీ ఆన్లైన్లోనే అయిపోతాయి. టికెట్ ధర మొదలు.. రానుపోను ఖర్చులన్నీ ‘ఒంటరివాడను నేను’ అని సరదాగా పాడుకుంటూ వెళ్లివాళ్లవే). ఆ సంగతి తెలీసీ వెళ్తారు కనుక, వెళ్లాక ఏం జరుగుతుందో చూద్దాం. రెడ్ కార్పెట్‌పై మీదుగా నడిచి థియేటర్లోకి వెళ్లగానే.. ‘వెల్కమ్ ఫలానా గారూ.. ఫిల్మ్ ఫెస్టివల్‌ను చూసేందుకు వచ్చిన మీకు మా స్వాగతం. ఈ సినిమాను ప్రత్యేకంగా మీకోసమే వేస్తున్నాం’ అని అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. తర్వాతేముంది? సినిమా చూడ్డమే. రెడ్ కార్పెట్ వరకు వెళ్లేందుకు మాత్రం దీవిలో పడవ దిగాక.. మరికొన్ని నీళ్లను, రాళ్లను, రప్పల్నీ, కప్పల్నీ, గాలుల్ని దాటుకుని వెళ్లాలి. అదొక అనుభూతి. పేటర్ నోస్టర్ దీవిలోని ఇండోర్ ఎరీనా (ఇందులో కొన్ని సినిమాలు మీ కోసం స్క్రీన్ అవుతాయి). కరోనా వచ్చి కొత్త కొత్త అనుభవాల్ని చూపించి వెళుతోంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఐసోలేటెడ్ సినిమా’ కూడా అలాంటి అనుభవమే. చివరిగా ఒక మాట. టిక్కెట్ గెలుచుకున్నవారు ఆ షో ముగిసేవరకు కొన్నిటిని కోల్పోవలసి ఉంటుంది. ముందుగా సెల్ ఫోన్. తర్వాత ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు. అక్కడ ఉన్న వారం రోజులూ పూర్తిగా ఆ ఒంటరి వాళ్లవే. పూర్తిగా వాళ్లు ఒంటరి వాళ్లే. -
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ షురూ
కోవిడ్ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్నీ వాయిదా పడ్డాయి. మే నెలలో జరగాల్సిన కాన్స్ చిత్రోత్సవాలు జరగలేదు. వచ్చే ఏడాది జరిగే గోల్డెన్ గ్లోబ్స్, ఆస్కార్ అవార్డులను కొన్ని వారాలు వెనక్కి జరిపారు. ఈ ఏడాది జరగాల్సిన కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ ను వర్చువల్ గా (ఆన్ లైన్ లో) జరపడానికి నిశ్చయిం చారు. అయితే వెనిస్ చిత్రోత్స వాలను కోవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ జరపబోతున్నట్టు ప్రకటించారు నిర్వాహకులు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు జరిగే ఈ ఫెస్టివల్లో సుమారు 50 దేశాలు పాల్గొన బోతున్నాయి. ఈ సంబరానికి హాజరుకానున్న వాళ్లందరికీ ఉష్ణోగ్రత చూసే లోపలికి అనుమతి స్తారట. ప్రతీ రెండో సీట్ ఖాళీగా ఉండేలా చూసుకుంటారట. ఈ ఫెస్టివల్‌కి హాజరు కావాలను కున్నవాళ్లు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని కూడా తెలిపారు. -
ఫెస్టివల్ క్యాన్సిల్
ప్రఖ్యాత ఫిల్మ్ ఫెస్టివల్ కాన్స్ వాయిదా పడింది. ఈ ఏడాది కాన్స్ చిత్రోత్సవాలు కరోనా కారణంగా జరుగుతాయా? లేదా? అనుకుంటున్న సందర్భంలో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించబోవడం లేదని కాన్స్ నిర్వాహకులు ప్రకటించారు. ప్రతి ఏడాది ఫ్రాన్స్‌లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. కాన్స్‌లో గెలుపొందిన సినిమాల నుంచే ఆస్కార్ రేసు కూడా మొదలవుతోంది. ఈ ఏడాది మే 12 నుంచి 23 వరకు ఈ ఫెస్టివల్‌ను నిర్వహించాలని ముందు అనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో జరగడంలేదని ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాన్స్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. జూన్ చివర్లోనో లేదా జూలై ప్రారంభంలోనో కాన్స్ ఫెస్టివల్‌ని నిర్వహించాలనుకుంటున్నాం’’ అని చిత్రోత్సవాల నిర్వాహకులు పేర్కొన్నారు. -
‘బంగ్లా’ సినిమా చూద్దాం రండి
సాక్షి, శ్రీనగర్‌కాలనీ: సినిమా..సినిమా...ఈ మాధ్యమం ద్వారా విజ్ఞానాన్ని, వినోదాన్ని, విలువలను, వాస్తవాలను తెలుసుకోవచ్చు. ఒక్కో భాషకు, ఒక్కో ప్రాంతానికి భిన్నమైన సంస్కృతి–సంప్రదాయాలు ఉంటాయి. ప్రపంచంలోని సినిమాలను చూసి పలు భిన్న కోణాలను తెలుసుకోవాలనే తపన కొందరికి ఉంటుంది. అయితే తీరిక దొరకదు.. దొరికినపుడు సినిమాలు దొరకవు. అందుకే సినిమాలను చూపిస్తూ, సినిమా అభిమానుల మనోగతాన్ని తెలుసుకొని ఆ దిశగా హైదరాబాద్ ఫిలిం క్లబ్ తన ఆశయాలను కొనసాగిస్తోంది. విభిన్న సంస్కృతి– సంప్రదాయాలు, జీవనవిధానంతో కూడిన బంగ్లాదేశ్ ఫిలిం ఫెస్టివల్‌ను నగరవాసులకు అందిస్తున్నారు. 1999లో యునెస్కో ప్రాంతీయ భాషా చిత్రాలను పోత్సహించేందుకు ఫిబ్రవరి 21వ తేదీని ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమీర్‌పేటలోని సారథి స్టూడియోలో హైదరాబాద్ ఫిలిం క్లబ్– సారథి స్టూడియోస్ సంయుక్త ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌కు చెందిన చిత్రాలను ప్రదర్శించనున్నారు. భావోద్వేగాలు మనుషుల మధ్య బంధాలు, సమాజంలోని ప్రధానాంశాలు, సుఖాలు, దుఃఖాలు, కళాత్మక జీవనాన్ని, సృజనాత్మకతను ప్రస్తావిస్తూ వైవిధ్యమెన చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈనెల 21వ తేదీనుంచి నాలుగు రోజులపాటు 4 బంగ్లాదేశీ చిత్రాలను ప్రదర్శించనున్నారు. రోజూ సాయంత్రం 6 గంటలకు ప్రదర్శన ఉంటుంది. ఇన్ స్ప్రింగ్ బ్రీజ్, కోమల రాకెట్, స్క్రీన్ ప్లే యువర్స్ ఢాకా, ఆల్ఫా సినిమాలను ప్రదర్శిస్తారు. ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తాం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే సందర్భంగా బంగ్లాదేశ్ ఫిలిం ఫెస్టివల్‌ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్ ఫిలిం క్లబ్– సారథి స్టూడియోస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వివిధ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తున్నాం. అకాడమీ అవార్డులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలను ప్రదర్శిస్తున్నాం. æహైదరాబాద్ ఫిలిం క్లబ్ మొదలై 46 సంవత్సరాలు అయింది. భవిష్యత్‌లో తెలుగు ఫిలిం ఫెస్టివల్స్‌ను ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో నిర్వహిస్తాం. – ప్రకాష్‌రెడ్డి, హైదరాబాద్ ఫిలిం క్లబ్ సెక్రటరీ -
రోహిత్ వేములపై చిత్రానికి ‘నో ఎంట్రీ’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ దళిత విద్యార్థి నాయకుడు రోహిత్ వేములపై తీసిన చిత్రంతోపాటు ఇప్పటికే విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న పలు డాక్యుమెంటరీ చిత్రాలకు ముంబైలో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు ఫిల్మ్ డివిజన్ ఆధ్వర్యంలో కొనసాగనున్న ద్వైవార్షిక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఎంట్రీ దొరకలేదు. 2016లో రోహిత్ వేముల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ‘వియ్ హావ్ నాట్ కమ్ ఇయర్ టు డై’ పేరిట దీపా ధన్‌రాజ్ డాక్యుమెంటరీని నిర్మించారు. 2018లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన అంతర్జాతీయ డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో ‘బెస్ట్ ఫీచర్ లెన్త్ డాక్యుమెంటరీ అవార్డు’ను అందుకున్న ‘రీజన్’ చిత్రానికి కూడా ఎంట్రీ దొరక లేదు. కమ్యూనిస్టు నాయకుడు గోవింద్ పన్సారే, హేతువాది నరేంద్ర దాభోల్కర్ హిందుత్వ వాదులు హత్య చేయడంపై ప్రముఖ దర్శకుడు ఆనంద్ పట్వర్ధన్ ఈ డాక్యుమెంటరీని తీశారు. పట్వర్ధన్కు 2014లో ‘శాంతారామ్– జీవితకాలం పురస్కారం’ అవార్డు లభించిన విషయం తెల్సిందే. విశాఖపట్నంలో జన్మించి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తూ ప్రశంసలు అందుకుంటున్న గాయకురాలు, గేయ రచయిత్రి, మ్యూజిక్ కంపోజర్ సోన మొహాపాత్రపై దీప్తి గుప్తా తీసిన ‘షటప్ సోనా’కు, కళాకారుడు కౌషిక్ ముఖోపాధ్యాయ్పై అవిజిత్ ముకుల్ కిషోర్ తీసిన ‘స్క్వీజ్ లైమ్ ఇన్ యువర్ ఐ’ చిత్రానికి ఎంట్రీ లభించలేదు. రోహన్ శివకుమార్ తీసిన ‘లవ్లీ విల్లా’, అర్చనా పాడ్కే తీసిన ‘అబౌట్ లవ్’ చిత్రాలకు కూడా ఎంట్రీ దొరకలేదు. ఎంపిక చేసిన 800 డాక్యుమెంటరీల్లో విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాలకు ఎందుకు ఎంపిక చేయలేదని ఫిల్మ్స్ డివిజన్ డైరెక్టర్ జనరల్, ముంబై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ స్మితా వాట్స్ శర్మను మీడియా ప్రశ్నించగా, తమ ఎంపిక నిష్మక్షపాతంగా జరిగిందని, అందులో ఎలాంటి రాజకీయం లేదని సమాధానం చెప్పారు. -
త్వరలో టిక్‌టాక్ ఫిల్మ్ ఫెస్టివల్
ఫిల్మ్ ఫెస్టివల్ చూశాం. కానీ ఎక్కడైనా టిక్‌టాక్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను చూశారా అంటే ఇప్పటి వరకు చూడలేదనే సమాధానమే వినిపిస్తుంది. కానీ ఇప్పడు కళ్లారా చూడబోతున్నాం. నమ్మట్లేదా! నిజమేనండి. చైనా సామాజిక మాధ్యమమైన టిక్‌టాక్‌లో పెట్టే వీడియోలలో బెస్ట్‌ను సెలెక్ట్ చేసి వారికి అవార్డులు ఇస్తాం అంటూ పూణేకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రకటించారు. దీంతో పూణే టిక్‌టాక్ ఫెస్టివల్‌కు మొదటి కేంద్రం అయింది. ఇందులో మొత్తం 12 కేటగిరీలుగా విభజించి విజేతలను ప్రకటిస్తామన్నారు. సామాజిక బాధ్యత, భావోద్యోగం, హాస్యం, ప్రేమ జంటలకు ప్రాధాన్యం ఇస్తామని వీరు తెలిపారు. మొదటి బహుమతిగా రూ.33,333, రెండవ బహుమతిగా రూ.22,222 అలాగే 3,4,5 బహుమతులు ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులలో ఒకరైన ప్రకాశ్ యాదవ్ మాట్లాడుతూ ‘ టిక్‌టాక్ ఇప్పుడు ట్రెండింగ్ అని, ఇది రాత్రికి రాత్రి ఎంతో మందిని స్టార్లను చేసిందని తెలిపారు. చాలామంది ప్రతిభ టిక్‌టాక్ ద్వారా వెలుగులోకి వచ్చిందని, వారికోసం ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకొనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆగస్టు 20న ఎంపిక అయిపోతుందని, ఆ తర్వాత విజేతలను నిర్ణయిస్తామన్నారు. కాగా సామాన్యుడిలోని ప్రతిభ వెలికితీతకు స్వయం వేదికగా మొదట్లో పేరుతెచ్చుకున్న టిక్‌టాక్ వీడియోలు తర్వాత శృతిమించి పలువురి మరణానికి కారణం అయ్యాయి. దీంతో టిక్‌టాక్‌ను నిషేదించాలని ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయంటే ఇవి ఎంత ప్రమాదకరంగా మారాయో తెలుస్తుంది. వీటిలో వీడియోలు పోస్టు చేయడం సులభంగా ఉండటంతో ప్రజలకు కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ ఫెస్టివల్ నిర్వహణ విజయవంతం అయితే మరెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి. -
మా ఊరిని చూపించాలనుంది
‘‘కెమెరా, చక్కటి కథనం చాలు అద్భుతాలు సృష్టించడానికి’’ అంటారు సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణు. ఇంతకీ ఎవరీ వేణు అంటే షాంగై ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డ్ అందుకున్న తొలి భారతీయ కెమెరామేన్. అనుభవం ఒక్క సినిమానే. అదీ గారో భాషలో తీసిన మేఘాలయ సినిమా. రాజయ్యపల్లి, వరంగల్‌లో పుట్టిన వేణు ఆచార్యకి పదో తరగతి నుంచి కెమెరామేన్ అవాలనే కోరిక ఉండేది. ‘‘చిన్నప్పటి నుంచే నాకు డ్రాయింగ్ మీద ఆసక్తి ఉండేది. గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పను కానీ నాకు ఆర్ట్స్ మీద ఆసక్తి ఉందని అర్థమైంది. ఓసారి హైదరాబాద్ జెయన్‌టీయూ నుంచి కొందరు స్టూడెంట్స్ మా ఊరు వచ్చారు. ఆసక్తి ఉంటే ఆర్ట్స్ కాలేజీలో చేరి సినిమాటోగ్రాఫర్ కావచ్చని సలహా ఇచ్చారు. అలాగే చేశాను’’ అని బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ షాంగై ఫిల్మ్‌ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 15 నామినేషన్లలో ‘మా.అమా’ అనే చిత్రానికి వేణు ఈ అవార్డు పొందారు. ‘‘మేఘాలయా చూడటానికి అద్భుతంగా ఉంటుంది. కానీ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఏం మా సినిమాలో లేవు. కేవలం 8 లక్షల్లో సినిమా తీశాం. డోమ్నిక్ సంగ్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అందరూ కెమెరాకు కొత్తవాళ్లే కావడం విశేషం. ఇంతకుముందు ‘జెర్సీ’ సినిమాకు సెకండ్ యూనిట్ కెమెరామేన్‌గా కూడా చేశాను. త్వరలోనే దర్శకత్వం కూడా చేయాలని, మా ఊరిని, అక్కడి ప్రజలను చూపించాలనుంది. అవార్డు తీసుకొని ఇంటికి వెళ్లగానే అమ్మ చిన్నగా నవ్వి ఇంతకీ తిన్నావా? అని అడిగింది. జీవితంలో కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు అనిపించింది నాకు’’ అన్నారు వేణు. -
‘మనూ’కు అరుదైన అవకాశం
రాయదుర్గం: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి అరుదైన అవకాశం దక్కింది. గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయంలోని ఇన్సస్ట్రక్సనల్ మీడియా సెంటర్ (ఐఎంసీ) నిర్మించిన మూడు చిత్రాలు జాతీయ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్–2019కు ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా ఐఎంసీ డైరెక్టర్ రిజ్వాన్ అహ్మద్ మాట్లాడుతూ.. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో 9వ జాతీయ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను జనవరి 27 నుంచి 31 వరకు నిర్వహిస్తారన్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను చండీగఢ్‌లోని మొహాలీలో నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేçస్తున్నారన్నారు. ఈ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ఇంటర్ఫేస్ కేటగిరీలో 15 చిత్రాలతో తుది జాబితాను విడుదల చేయగా.. అందులో మూడు ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందినవి కావడం గర్వకారణమన్నారు. ఉర్దూ యూనివర్సిటీ నుంచి ఎంపికైన చిత్రాల్లో ‘భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్’ (డైరెక్టర్–ఒబైదుల్లా రైహన్), ‘ప్రొఫసర్ యూ ఆర్ రావు (డైరెక్టర్–మహ్మద్ ముజాహిద్ అలీ), స్టీఫెన్ హాకింగ్ (డైరెక్టర్–ఒమర్ ఆజ్మీ) చిత్రాలు ఉన్నాయన్నారు. మూడు చిత్రాలు జాతీయ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక కావడం పట్ల యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ మహ్మద్ అస్లామ్ ఫర్వేజ్, విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, మీడియా సెంటర్‌ను అభినందించారు. మూడు చిత్రాలు కూడా ఉర్దూ భాషలో చిత్రీకరించినవి ఎంపిక కావడం విశేషమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆలోచింపజేసే, సాంకేతికతను చాటే చిత్రాలను రూపొందించాలని ఆయన సూచించారు. -
‘పక్కింటావిడకు నేనే టార్గెట్’
తనలో నటుడు దాగున్నాడన్న విషయాన్ని మొదట గుర్తించింది మా అమ్మే అంటున్నాడు బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ. గువాహటిలో జరుగుతున్న బ్రహ్మపుత్ర వ్యాలీ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న బొమన్ ఇరానీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పొటాటో చిప్స్ షాప్ ఓనర్ స్థాయి నుంచి సినిమా నటుడిగా ఎదిగే క్రమంలో తాను ఎదుర్కొన్నఅనుభవాల నుంచి వెల్లడించాడు. పక్కింటావిడకు నేనే టార్గెట్... ‘చిన్నపుడు చాలా బిడియంగా ఉండేవాడిని. భయం కారణంగా నత్తి కూడా వచ్చేది. దీంతో ఎక్కువగా మాట్లాడే వాడిని కూడా కాదు. అందుకే మా పక్కింట్లో ఉండే ఆవిడ ఎప్పుడూ నన్ను టార్గెట్ చేసేవారు. వాళ్ల పిల్లలు నాకంటే చాలా బెటర్ అని నిరూపించేందుకు.. నా ఈ లోపాన్ని మా అమ్మ ముందు ప్రస్తావించేవారు. పాపం బొమన్.. ఇలా అయితే కష్టం అంటూ నన్ను కామెంట్ చేసేవారు. దీంతో మా అమ్మకు నా భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుంది అని బొమన్ వ్యాఖ్యానించాడు. అలా ధైర్యవంతుడిగా మారాను ‘నాకు చదువుపై శ్రద్ధ లేదని మా అమ్మ ముందుగానే గుర్తించింది. అందుకే సినిమాలు చూడమని ప్రోత్సహించేది. అల్ఫ్రెడ్ హిచ్‌కాక్ సినిమాలు చూడమని ఓ రోజు డబ్బులు ఇచ్చింది. అప్పుడు నా వయసు పదకొండేళ్లు. దీంతో ఆ థియేటర్ వాళ్లు నన్ను లోపలికి రానివ్వడం లేదని చెప్పాను. మా అమ్మ వెంటనే ఆ థియేటర్ మేనేజర్‌కు లేఖ రాసింది. నన్ను సినిమా చూడనివ్వాలని కోరింది. అలా అప్పటి నుంచి ఒంటరిగా బయటికి వెళ్లడం మెల్లగా మెల్లగా అలవాటైంది. ముద్దపప్పులా ఉండే నేను చాలా ధైర్యవంతుడిగా మారాను. ఆ తర్వాత నాటకాలు చూసేందుకు వెళ్లేవాడిని. ఆర్టిస్టుల హావభావాలు క్షుణ్ణంగా పరిశీలించేవాడిని. అమ్మ కూడా కొన్ని చిట్కాలు చెప్పేది. అలా అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో సుమారు 14 ఏళ్లు థియేటర్ ఆర్టిస్టుగా కొనసాగాను. ఆ తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టాను. ప్రస్తుతం విజయవంతమైన నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నా’ అని బొమన్ చెప్పుకొచ్చాడు. ఆర్థిక కారణాల దృష్ట్యా కొన్నాళ్లు పొటాట్ చిప్స్ షాప్ ఓనరుగా, మరికొన్నాళ్లు ముంబై తాజ్ హోటల్లో వెయిటర్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. -
తారలు దిగివచ్చిన వేళ..
-
జపాన్ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం
సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఈయన నటించిన తాజా చిత్రాల్లో సర్వం తాళ్ మయం ఒకటి. ఇంతకు ముందు మిన్సార కనవు, కండుకొండేన్ కండుకొండేన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ సుమారు 18 ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం సర్వం తాళ మయం. ఇందులో జీవీకి జంటగా అపర్ణా బాలమురళి నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం జపాన్, టోక్యో నగరంలో జరుగుతున్న 31వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని జీవీ.ప్రకాశ్‌కుమార్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
రాజావారి ఇంటి దగ్గర...
నవలలో నుంచి నడిచొచ్చిన సినిమా కథ ఇది. దృశ్యంలో కవిత్వం పలుకుతుంది. పాటల్లో దృశ్యం వినిపిస్తుంది. జాతీయ అవార్డ్లు దక్కించుకోవడంతో పాటు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (1984), ‘మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్’, ‘ఏషియన్ ఫిల్మ్‌ఫెస్టివల్’లో ప్రదర్శితమైన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలివి. ఈ సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘టుక్కు టుక్కు టుక్కు’ అని సౌండ్ చేస్తూ గోదావరిలో లాంచి పరుగెడుతుంది. లాంచీ లోపల ఉన్న వీరాస్వామి తన పక్కన ఉన్న నాంచారి కళ్లలోకి చూస్తూ అప్పటికప్పుడు కవిగా మారిపోయాడు...‘నాంచారి...ఇలా వెన్నెల్లో గోదారిని చూస్తుంటే నా గుండె ఐసుముక్కలా కరిగిపోతుందనుకో’వీరాస్వామి భావుకత్వానికి నాంచారికి మండిపోయింది. ‘‘ఎండమండి పోతుంటే వెన్నెలంటావేంటి?’’ కళ్లతోనే కడిగేసింది. అంతమాత్రనా వీరాస్వామి సైలెన్సైపోతాడా ఏమిటి? ‘‘నువ్వు నా పక్కన కూర్చుంటే ఈ వీరాస్వామికి ఎండే వెన్నెల. ఈ లాంచే ఊయల’’ అంటూ కవిత్వాన్ని కంటిన్యూ చేశాడు. ‘‘నువ్వు మాత్రం నా పక్కన కూర్చుంటే ఈ బల్ల ముళ్లకంప...ఆ రేవే వల్లకాడు’’ అని చురక వేసింది నాంచారి. సరే వీళ్ల సంగతి వదిలేద్దాం. అదిగో అటు చూడండి... అక్కడ ఎవరిదో తల ‘ఇంతై...అంతై’ అన్నట్లు సైజ్ పెరిగిపోతుంది. పక్కన కూర్చున్నాయన నాలిక అనే సుత్తితో తెగ బాదుతున్నాడు.... ‘‘అసలు వేదకాలం నుంచే మా పగటి వేషగాళ్లు వచ్చారు. ఆ తరువాత బుర్రకథల వాళ్లు వచ్చారు. ఆ తరువాత నాటకాల వాళ్లు వచ్చారు. ఆ తరువాత సినిమావాళ్లు వచ్చారు. ఆ తరువాత...’’ ఈ వాక్ దాడికి అడ్డుపడిన ఆ తలవాచినాయన... ‘‘అసలు రేవు ఎప్పుడూ వస్తుంది?’’ అడిగాడు దీనంగా. ఈయన దీనత్వాన్ని ఖాతరు చేయని ఆ మహాస్పీకరుడు ‘‘అడ్డుపడకండలా’’ అని విసుక్కున్నాడు. అంతే...ఆ తలవాచినాయనకు మహా కోపం వచ్చింది. అది ఇలా కట్టలు తెంచుకుంది... ‘‘పగటి వేషాలు కాదు...అసలు నువ్వు ఏ వేధవ వేషాలేస్తే నాకేంటటా? దురదగొండాకులా హింసిస్తున్నావు. అయ్యో...వర్జ్యంలో బయలుదేరవద్దని మా ఆవిడ చెప్పినా వినలేదు. కొరివితో తలగోక్కున్నాను...’’ ‘‘ఏంట్రా గొడవ’’ అని ఆరా తీశాడు అక్కడికి వచ్చిన వీరాస్వామి. ‘‘చూడండి వీరాస్వామిగారూ...’’ అని ఆ బాధితుడు ఏదో చెప్పేలోపే... ‘‘నాపేరు నీకెలా తెలుసు?’’ ఆశ్చరంగా అడిగాడు వీరాస్వామి. ‘‘తెలుసండీ...తెలుసు. మీ పేరే కాదు....మీ గురువు గురుమూర్తి. ఆయన కూతురు పేరు నాంచారి. మీలో కొత్తగా చేర్చుకున్న కుర్రాడి పేరు రాజా. రాత్రి నుంచే ఒకటే సొద. వద్దన్న కొద్దీ అన్నీ చెబుతాడు. బుర్ర హీటెక్కిపోయింది. గోదాట్లో మునిగి తేలితేగాని నా వివరాలు నాకు తెలియవు. అబ్బ...రేవొచ్చింది...నేను వెళ్తాను’’ అని ఒక లాంగ్‌జంప్ చేశాడు తలవాచినాయన. పొద్దు పొద్దున్నే లాంచీ దిగిన పగటివేషగాళ్లు రాజావారి ఇంటికి వెళ్లారు. తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. ‘‘గొంతు ఎంత చించుకున్నా గుమ్మం తలుపులు తెరవరు’’ చిన్నగా విసుక్కోన్నాడు ట్రూప్‌లో కొత్తగా చేరిన రాజా. ‘‘ష్...తప్పుమంది. మన లాంచి పెందరాళే వచ్చింది. రాజావారు స్నానం చేసే వేళ ఇది’’ అని రాజా విసుగుపై నీళ్లు చల్లే ప్రయత్నం చేశాడు ట్రూప్ లీడర్ గురుమూర్తి. ‘‘ఆయన స్నానం సంగతి సరే....ఇంట్లో పనివాళ్లు ఉండరా? వాళ్లు ఏంచేస్తారు?’’ అమాయకంగా అడిగాడు రాజా. ‘‘కాళ్లకు గజ్జెలు కట్టుకొని గెంతులు వేస్తారు. రాజావారు స్నానం చేయడమంటే మామూలు విషయం కాదు. కొత్తోడివి నీకేం తెలుసు!’’ అంటూ ఇంచుమించు రాజా మీద కన్నెర్ర చేశాడు ట్రూప్ సీనియర్లలో ఒకౖడైన వీరాస్వామి. అయినప్పటికినీ మరో డౌటు అడగానే అడిగాడు రాజా... ‘‘ఇంతటి బంగ్లాలోనూ దాసీలు ఉండరా! వాళ్లేం చేస్తారు?’’ ‘‘రాణిగారు నిద్ర లేచే సమయంరా ఇది. దాసీలు ఆమె ఎటు వెళితే అటూ కాలు కింద పడకుండా... ముఖమల్ వస్త్రాలు పరుస్తారు’’ అని రాజా డౌటు తీర్చాబోయాడు గురుమూర్తి. రాజా చిటపటలాడుతుండగానే చందర్రాజావారు రానే వచ్చారు. నల్లటి కోటు ధరించి పైప్ పీలుస్తున్న ఆయనలో రాజఠీవి ఉట్టిపడుతోంది. ‘‘అయ్యగారికి దండలేట్రా’’ రాజాను మెల్లిగా గిల్లాడు గురుమూర్తి. ఉలుకూ లేదు. పలుకూ లేదు. పైగా అటువైపు తిరిగి అసహనంగా అటు ముఖం పెట్టాడు రాజా. ఇలాంటి దృశ్యం గతంలో ఎన్నడూ చూడనిది. చందర్రాజావారి దగ్గరికి వచ్చే కళాకారులు పొగడడమే తమ పని అన్నట్లుగా ఉంటారు. ‘‘ఇతడేమిటి నన్ను చూసి అలా కోపంగా ముఖం తిప్పుకున్నాడు!’’ తనలో తాను అనుకుంటూనే... ‘‘ఏం వీరాస్వామి బాగున్నావా?’’ అని అడిగారు. అంతే!వీరాస్వామి ఎక్కడికో వెళ్లిపోయాడు. ‘‘చూశావా! అంత పెద్ద రాజావారు నన్ను పేరు పెట్టి మరీ పిలిచారు’’ అన్నట్లు గర్వం నిండిన కళ్లతో గాలిలో గంతులు వేశాడు. ‘‘ఎవరు?’’ అంటూ రాజాను కళ్లతో చూపిస్తూ అడిగాడు చందర్రాజావారు. ‘‘కొత్తాడండీ’’ అని కళ్లతోనే రాజాను తేలిగ్గా తీసేస్తూ చందర్రాజావారికి సమాధానం ఇచ్చాడు వీరాస్వామి. ‘‘మా వాడు శివుడి వేషం కడితే చూడ్డానికి రెండు కళ్లు...’’ అని ట్రూప్ సభ్యుడొకరు రాజా గురించి కాస్త గొప్పగా చెప్పేలోపే ఆయన కాలు తొక్కాడు వీరాస్వామి. దీంతో ‘కళ్లు’ అనబోయి ‘కాళ్లు’ అని నోరుజారాడు ఆయన. ‘‘వేషాలతో తమ దర్శనం చేసుకుంటామండీ’’ అని చెప్పి రాజావారి దగ్గర సెలవు తీసుకున్నాడు గురుమూర్తి. ఆతరువాత... ‘‘అసలు ఆ పొగరేమిటి నీకు? రాజాగారికి దండమెట్టమంటే అంత ఇదై పోతున్నావు. ఆయన ఈ ఊరి వాళ్లకు దేవుడిలాంటి వాడు’’ అని చందర్రాజావారి గొప్పతనం, కీర్తి గురించి గురుమూర్తి ఘనంగా చెప్పబోతుండగానే రాజా అడ్డుపడి.... ‘‘ఊరి వాళ్లు ఎలా కొలిస్తే నాకేం. నేను దణ్ణం పెట్టను. గొప్పమనసు అని తెలిస్తే ముష్ఠివాడికి కూడా పాదాభివందనం చేస్తాను’’ అన్నాడు స్పష్టంగా... కోపంగా. -
1133 ఏళ్ల ఆచారం
‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో అకాడమీ అవార్డ్ అందుకున్న సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి. లేటెస్ట్గా ‘ది సౌండ్ స్టోరీ’ అనే సినిమా కోసం తెర వెనుక నుంచి తెర మీదకు వచ్చారాయన. ప్రసాద్ ప్రభాకరన్ దర్శకత్వంలో రసూల్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ది సౌండ్ స్టోరీ’. హిందీ, మలయాళ భాషల్లో రూపొందించారు. తమిళంలో ‘ఒరు కథ సొల్లటుమా’ టైటిల్‌తో రిలీజ్ కానుంది. కేరళలోని తిరుచ్చూర్‌లో ప్రతి ఏడాది ‘పూరమ్’ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆచారం 1133 సంవత్సరాల పురాతనమైనదట. ఆ ఉత్సవాల్లోని సౌండ్‌ను రికార్డ్ చేయాలనుకునే పాత్రలో రసూల్ కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 11న కెనడా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ కానుంది. ‘‘1133 సంవత్సరాలుగా ఉన్న ఆచారాన్ని ఆగస్ట్ 11న ‘సీట్ ఆఫ్ కల్చర్’గా కెనడా చలన చిత్రోత్సవాల్లో సెలబ్రేట్ చేసుకోనున్నాం’’ అన్నారు రసూల్. -
ఆ రాష్ట్రంలో నిర్భయంగా శ్వాస తీసుకుంటాను!
నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను చెప్పే నటుడు ప్రకాశ్ రాజ్. దేశంలో నెలకొన్న పరిణామాలపై గొంతు విప్పుతున్న ఆయన తాజాగా కేరళ రాష్ట్రాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. తాను నిర్భయంగా శ్వాస తీసుకోగలిగే రాష్ట్రం ఏదైనా ఉంటే అది కేరళనే అని ఆయన పేర్కొన్నారు. కేరళ అంతర్జాతీయ చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్కే) ప్రారంభోత్సవంలో ప్రకాశ్ రాజ్ ప్రసంగించారు. 'నేను కేరళకు వచ్చినప్పుడు స్కిప్ట్ తీసుకొని రాను. ఎందుకంటే సెన్సార్ భయం ఉండదు. నాకు కేరళ అంటే చాలా ఇష్టం. నేను నిర్భయంగా శ్వాస తీసుకోగలిగే రాష్ట్రం కేరళనే' అని ఆయన అన్నారు. దర్శకుడు సనాల కుమార్ శశిధరన్ తెరకెక్కించిన 'సెక్సీ దుర్గ' సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారిపై ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. 'ఎస్ దుర్గ సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వ్యక్తులకు 'దుర్గ వైన్‌షాప్, దుర్గ బార్' వంటి పేర్లతో ఎలాంటి అభ్యంతరం లేనట్టు ఉంది. నన్ను బెదిరించే వారిని చూసి నవ్వుతాను. నా నోరు మూయించాలనుకునేవారిని చూసి గట్టిగా పాడుతాను. నా హక్కులను వారు దూరం చేయలేరు' అని చెప్పారు. తనకు ఎలాంటి రాజకీయ సంస్థలతో సంబంధం లేదని, సమాజంలో జరుగుతున్న పరిణామాలపై గొంతెత్తడం ఒక కళాకారుడిగా తన బాధ్యత అని ఆయన అన్నారు. -
ఎస్ దుర్గ
గోవాలో వారం రోజులుగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఫెస్టివల్ రేపటితో ఎండ్ అవుతోంది. మలయాళీ చిత్రం ‘ఎస్ దుర్గ’ ను స్క్రీనింగ్‌కి ఒప్పుకోం అంటే ఒప్పుకోం అన్నవాళ్లు.. ఈ వారం రోజులు ఆ సినిమా డైరెక్టర్ శశిధరన్ సెంట్రల్ గవర్నమెంట్‌తో ఫైట్ చేస్తే చివరికి ఓకే అన్నారు. ఇవాళ సాయంత్రమే స్క్రీనింగ్. మగలోకం ఎలా ఉందీ ఈ సినిమాలో చూపించారు. ఎలా ఉండకూడదో కూడా చెప్పారు. సంప్రదాయవాదులకు కోపం వచ్చింది. ఒత్తిడి తెచ్చి బ్యాన్ చేయించారు. డైరెక్టర్ గట్టిగా నిలబడి స్క్రీన్ చేయించుకుంటున్నాడు. నార్త్ ఇండియన్ అమ్మాయి, కేరళ అబ్బాయి కలిసి ఒక అర్ధరాత్రి ఊరి నుంచి పారిపోతారు. ఆ జర్నీలో దుర్గ (రాజశ్రీ దేశ్‌పాండే) అనే ఆ అమ్మాయి పరిస్థితులతో పోరాడ్డం సినిమా. మరి మన హీరో పోరాడడా? మగాళ్ల ప్రపంచంలో మగాళ్లు పోరాడ్డం ఏమంత కష్టం చెప్పండి. స్త్రీగా నెగ్గుకు రావడమే.. లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. -
ఆ మూవీలో చాన్స్ అనేసరికి ఎగిరి గంతేశా: తరుణ్
కెమెరాకు ఎప్పుడూ భయపడలేదు. సినీఫీల్డ్‌లో అవకాశాలు రావడం నా అదృష్టం. వచ్చిన వాటిని నిలబెట్టుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. చిరంజీవి, రజనీకాంత్ మాదిరిగా సినిమాలు చేయలేను. ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయండి. అప్పుడే విజయం సాధిస్తారని సినీనటుడు తరుణ్ అన్నారు. అమరావతి ఫిలిమ్ ఫెస్టివల్ –2017 రెండోరోజు సినీనటుడు తరుణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో కలిసి తాను నటించిన అంజలి సినిమా చూశారు. హాయ్.. చెబుతూ విద్యార్థుల మధ్యకు వెళ్లి అల్లరి చేశారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. విద్యార్థి : అంజలి సినిమా చేసినప్పుడు మీ వయసు ఎంత? చాన్స్ ఎలా వచ్చింది? తరుణ్ : అప్పుడు నా వయసు ఏడేళ్లు. కో–డైరెక్టర్ పాణి తాత అంజలిలో నటిస్తావా అని అడిగారు. మణిరత్నం నా అభిమాన డైరెక్టర్. ఆయన్ను కలిస్తే చాలు అనుకునేవాడ్ని. ఆయన మూవీలో చాన్స్ అనే సరికి ఎగిరి గంతేశా. విద్యార్థి : ఆ సినిమాలో నటిస్తున్నప్పుడు ఎలా ఫీలయ్యారు? తరుణ్ : సమ్మర్ హాలిడేస్‌లో రెండు నెలలు షూటింగ్ చేశారు. పిల్లలందరినీ ఒకచోట ఆడుకోమనే వారు. షాట్ అనగానే పరుగెత్తుకెళ్లే వాళ్లం. షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశా. విద్యార్థి : కెమెరాను చూసి ఎప్పుడైనా భయపడ్డారా? తరుణ్ : అస్సలు భయపడలేదు. ఫస్ట్ షాట్ అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ తరువాత మామూలే. విద్యార్థి : మీ ఫెవరేట్ మూవీ? ఈ జనరేషన్లో ఏ హీరో అంటే ఇష్టం? తరుణ్ : ‘నువ్వేనువ్వే’ అంటే నాకు చాలా ఇష్టం. రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ నా ఫేవరేట్ స్టార్స్ విద్యార్థి : చైల్డ్ ఆర్టిస్ట్, హీరో ఈ రెండింటిలో ఏది బాగుంది? తరుణ్ : చైల్డ్ ఆర్టిస్టుగా అంటే స్కూల్ మానేసి షూటింగ్‌కు వెళ్లడం సరదాగా ఉండేది. హీరో అంటే బాధ్యతగా పనిచేయాలి. రెండూ బాగున్నాయి. విద్యార్థి : చాలా గ్యాప్ తీసుకున్నారు? మీ కొత్త సినిమా విశేషాలు చెప్పండి? తరుణ్ : నా సినిమా వచ్చి ఏడాది అయింది. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేశా. ‘ఇది నా లవ్’ మూవీ పూర్తయింది. డిసెంబర్ మొదటివారంలో రిలీజ్ చేస్తున్నాం. విద్యార్థి : మీరు ఎలాంటి సినిమాల్లో నటించేందుకు ఇష్టపడతారు? తరుణ్ : నాకు సరిపోయే కథలనే ఎంచుకుంటా. రజనీకాంత్, చిరంజీవి లాంటి సినిమాలు నేను చేయలేను. విద్యార్థి : మీకు క్రికెట్ అంటే ఇష్టం కదా? యాక్టింగ్‌ను ఎందుకు ఎంచుకున్నారు? తరుణ్ : నాకు క్రికెట్ అంటే ఇష్టమే. సినీ అవకాశాలు అతికొద్దిమందికి మాత్రమే వస్తాయి. అందుకే యాక్టింగ్‌ను ఎంచుకున్నా. విద్యార్థి : మీ రోల్ మోడల్ ఎవరు? తరుణ్ : సచిన్ టెండూల్కర్ విద్యార్థి : సినీనటుడిగా మీ అమ్మగారి ప్రభావం మీపై ఎంతవరకు ఉంది? తరుణ్ : అమ్మ, నేను ఇద్దరం చైల్డ్ ఆర్టిస్టుల నుంచే ఇండస్ట్రీకి వచ్చాం. సినిమాల విషయంలో ఎప్పుడూ అమ్మ జోక్యం చేసుకోలేదు. మంచి సినిమాలు చేయమని చెబుతుంది అంతే. -
రారండోయ్..సినిమా చూద్దాం
నల్లగొండ కల్చరల్ : అంతర్జాతీయ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్‌కు జిల్లాకేంద్రం ముస్తాబైంది. ఉత్సవంలో భాగంగా నల్లగొండ పట్టణంలోని నటరాజ్ (సినిమాహాల్) థియేటర్లో ఈనెల 8 (బుధవారం) నుంచి 14వ తేదీ వరకు పలు బాలల చిత్రాలను ప్రదర్శించనున్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా వారం రోజులపాటు రోజూ 3 సినిమాలు పిల్లలను కనువిందు చేయనున్నాయి. వీటిని పిల్లలకు ఉచితంగా చూయించొచ్చు. వీటిలో 15 హిందీ, 6 తెలుగు సినిమాలు ఉంన్నాయి. సినిమాలన్నీ సాహసవంతమైనవి, బాల బాలికల, మానసిక ఉల్లాసాన్ని కలిగించేవి. రాష్ట్ర చలన చిత్ర అభివృద్ది సంస్థ ద్వారా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ ఫిలిం ఫెస్టివల్‌ను బుధవారం ఉదయం 10గంటలకు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఇతర అధికారులు ప్రారంభిస్తారు. ప్రదర్శించే సినిమాలు.. మొదటిరోజు బుధవారం‘‘ఎక్‌థా భుజంగ్ (ఒకపాము ఉండేది), 12గంటలకు ‘ఫొటో’, 2గంటలకు ‘ఛూలేంగే ఆకాశ్ (ఆకాశాన్ని అందుకుంటాను) హిందీ సినిమాలను ప్రదర్శిస్తారు. 9వ తేదీన 8 ‘సిక్సర్’, 12గంటలకు ‘హాలో’ హిందీ సినిమాలు, 2గంటలకు ‘ఫూర్ణ’ అనే తెలుగు చిత్రం ఉంటుంది. 10న ఉదయం 10గంటలకు ‘పప్పుకిపుగ్–డండి’’, 12గంటలకు ‘ఫింటీకా సాబూన్’ (ఫింటి అనే పిల్లవాడి సబ్బు), 2గంటలకు ‘చదువుకోవాలి’ అనే చిత్రాలు ప్రదర్శితమవుతాయి. 11న ఉదయం 10గంటలకు ‘హెడా–హోడా’, 12గంటలకు ‘కౌరామతికోటు’, మధ్యాహ్నం 2గంటలకు ‘‘హ్యాపీ మదర్స్–డే’ హిందీ చిత్రాలు వేయనున్నారు. 12వ తేదీ ఉదయం 10గంటలకు ‘అమూల్య’, 12గంటలకు ‘ఎక్ అజూబా’, మధ్యాహ్నం 2గంటలకు ‘ఆదిత్య’ చిత్రాలు ప్రదర్శిస్తారు. 13న ఉదయం 10గంటలకు ‘షాను ద ఆప్టిమెస్ట్’ 12గంటలకు ‘బండూభాస్కర్’, 2గంటలకు ‘చూలేంగ్ ఆకాశ్’ సినిమాలు వేస్తారు. 14న ఉదయం 10గంటలకు ఛోటా సిఫాయి’ (చిన్న సైనికుడు) 12గంటలకు ‘ఛుట్కన్కి మహౠభారత్’, 2గంటలకు ‘‘అప్పుదక్రేజీబాయ్’ తెలుగు చిత్రం ప్రదర్శితమవుతాయి. హిందీ చిత్రాలన్నీ తెలుగుసబ్ టైటిల్స్‌లో ప్రదర్శిస్తారు. దాదాపు సినిమాలకు సంబంధించిన కథాంశాన్ని సంక్షిప్తంగా పొందుపర్చిన కరపత్రాలు అందుబాటులో ఉంచారు. నేటి కార్యక్రమాలు.. ఉదయం 10గంటలకు నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధులు, 12గంటలకు సందీప్, జేబీఎస్ పాఠశాలల విద్యార్థులు, 2గంటలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల (డైట్) విద్యార్ధులకు సినిమాలను ప్రదర్శిస్తారు. వారం రోజుల పాటు ఉంటే ఈ చిత్రపదర్శనలు ఉంటాయని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల యాజమాన్యం పిల్లలకు ఈ సినిమాలు చూపించి విజయవంతం చేయాలని కోరారు. -
ఎస్వీఆర్ తరువాత బ్రహ్మానందానికే..!
ప్రముఖ హాస్యనటుడు బ్రహానందానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏసియా సెంటర్ వారు బ్రహ్మీని సత్కరించనున్నారు. అక్టోబర్ 6న జరగనున్న ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. 1964లో జకార్తాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో మహానటుడు ఎస్వీ రంగారావుకు ఇదే తరహా సత్కారం దక్కింది. తరువాత ఇన్నేళ్లకు అదే సత్కారం బ్రహ్మానందం అందుకోనుండటం విశేషం. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో పాటు మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న ఆచారి అమెరికా యాత్ర సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బ్రహ్మానందం. -
టోక్యో ఫిలిం ఫెస్టివల్ కు 'విక్రమ్ వేదా'
విలక్షణ నటులు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్రమ్ వేదా. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్ లో జరుగనున్న ప్రతిష్టాత్మక 30వ టోక్యో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో విక్రమ్ వేదా చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. కోలీవుడ్ లో ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. ఈ సినిమాలో మాధవన్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ గా నటించాడు. సినిమా కథా కథనాలతో పాటు క్లైమాక్స్ విషయంలో కూడా చిత్రయూనిట్ కొత్తగా ప్లాన్ చేసింది. ఎలాంటి ముగింపు ఇవ్వకుండా కథను అర్థాంతరంగా ఆపేయటంతో సీక్వల్ నిర్మిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. The big news is here! We are happy to inform that #VikramVedha has been selected at Tokyo International Film Festival. — Y Not Studios (@StudiosYNot) 26 September 2017 -
కోల్‌కతాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్
-
ఇండియన్ పనోరమాకు ‘బాహుబలి’
సాక్షి, న్యూఢిల్లీ: గోవాలో జరిగే 47వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు గాను ఇండియన్ పనోరమాలో తెలుగు నుంచి బాహుబలి విజేతగా నిలిచింది. వివిధ భాషల్లో మొత్తం 230 నామినేషన్లు రాగా 22 సినిమాలు ఎంపికయ్యాయి. 13 సభ్యులు గల జ్యూరీ నెల రోజుల పాటు ఎంపిక ప్రక్రియలో పాల్గొందని కేంద్ర సమాచార శాఖ వెల్లడించింది. ఈ జ్యూరీలో తెలుగు చిత్ర నిర్మాత, దర్శకుడు సి.వి.రెడ్డి కూడా ఉన్నారు. 63వ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైనందున బాహుబలి చిత్రానికి నిబంధనల ప్రకారం పనోరమ-2016లో కూడా చోటు కల్పించారు. హిందీ భాష నుంచి బాజీరావు మస్తానీ, ఎయిర్ లిఫ్ట్, సుల్తాన్ చిత్రాలు ఎంపికయ్యాయి. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 198 ఎంట్రీలు రాగా 21 చిత్రాలను ఎంపిక చేశారు. -
మాజీ భార్యకు నటుడు రణవీర్ గ్రీటింగ్స్
ముంబై: బాలీవుడు నటుడు రణవీర్ షోరే తన మాజీ భార్య, నటి కొంకనాసేన్ శర్మకు అభినందనలు తెలిపాడు. నటి కొంకనాసేన్ దర్శకురాలిగా మారి తీసిన తొలిచిత్రం 'ఏ డెత్ ఇన్ ద గంజ్'. అయితే తన తొలి ప్రయత్నంలోనే కొంకనాసేన్ ఉత్తమ మహిళా దర్శకురాలు అవార్డు సొంతం చేసుకున్నారు. ముంబైలో జరుగుతున్న 18వ జియో ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆమె అవార్డు అందుకున్నారు. తనకు బెస్ట్ ఫీమేల్ డైరెక్టర్ అవార్డు వచ్చిందని నటి కొంకనాసేన్ ట్విట్ చేయగా, ఆమె మాజీ భర్త, నటుడు రణవీర్ షోరే ఆమెను అభినందిస్తూ రీట్వీట్ చేశారు. రణవీర్, విక్రాంత్ మస్సీ, కల్కి కొచ్లిన్ ఆ మూవీలో కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. మామి16లో తనకు అవార్డు రావడంతో ఎంతో థ్రిల్ అయ్యాయని కొంకనా తన ట్వీట్ లో పేర్కొన్నారు. రణవీర్, కొంకనాలు ఐదేళ్ల దాంపత్య జీవితం తర్వాత 2015లో తాము విడిపోయినట్లు ప్రకటించారు. ఈ దంపతులకు హరూన్ అనే బాబు ఉన్నాడు. -
ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం
సీతంపేట : తెలుగు టాకీ సినిమా 85 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైజాగ్ ఫిల్మ్ సొసైటీ నిర్వహిస్తున్న మూడు రోజుల ఫిల్మ్ ఫెస్టివల్ పౌరగ్రంథాలయంలో బుధవారం ప్రారంభమయింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమాకు ప్రాణం పోసి, సినిమా అభివృద్ధికి త్యాగాలు చేసిన ఎందరో మహానుభావులను గుర్తుపెట్టుకోవడంలో మనం విఫలమయ్యామన్నారు. భక్తప్రహ్లాద తొలి తెలుగుటాకీ సినిమాగా సెప్టెంబర్ 15, 1931లో విడుదలైనపుడు సినిమాకు దర్శకత్వం వహించి, నిర్మించిన హెచ్.ఎం.రెడ్డిని అందరూ ఎంతో అభినందించారన్నారు. నేడు అలాంటి మహనీయులను మర్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగం అభివృద్ధికి కృషి చేసిన మహనీయులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా 1939లో నిర్మించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాను ప్రదర్శించారు. కార్యక్రమంలో విశాఖ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు, సహాయ కార్యదర్శి పి.వి.రమణ, రచయిత డి.వి.సూర్యారావు పాల్గొన్నారు. -
చిన్నారుల చిత్రోత్సవం
-
భాగ్యనగరంలో చిన్నారుల సినిమా పండగ
-
బాలలచిత్రోత్సవానికి విశేష స్పందన
-
ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
-
ఐమ్యాక్స్ కేంద్రంగా చిల్డ్రన్స్ ఫిలిమ్ ఫెస్టివల్
సాక్షి,సిటీబ్యూరో: 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 14 నుంచి 20 వరకు హైదరాబాద్ నగరం ఈ ఫెస్టివల్‌కు వేదికకానున్నది. ది చిల్డ్రన్స్ ఫిల్మ్ సోసైటీ అందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. 13 మల్టీప్లెక్సుల్లో 200 సినిమాలు ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బాలల చిత్రాలు ప్రదర్శించనున్నారు. చిల్డ్రన్స్ జ్యూరీలో పిల్లలు కూడా జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఐమ్యాక్స్ లో మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేయనున్నారు. చివరిరోజు కేఎం రాధాక్రిష్ణన్‌తో డిజైన్ చేయించిన స్పెషల్ థీమ్ సాంగ్స్ ఫెస్టివల్‌కి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. దేశ నలుమూలల నుంచి 500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గోనున్నారు. బాలల చలనచిత్రోత్సవాలకు ప్రసాద్ ఐ మ్యాక్స్ ప్రధాన క్రేందం కానున్నది. ఫెస్టివల్ పర్యవేక్షణ కోసం 25 మంది ప్రముఖులతో ఓ కమిటీ కూడా వేశారు. భారతీయ సినిమా వందేళ్ల పేరుతో ఒక ఎగ్జిబిషన్‌ను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. -
అవే లేకుంటే... తీపి గుర్తులు ఎక్కడివి..?
నిద్రలేని రాత్రులు ఆ నిద్రలేని రాత్రులే లేకుంటే, చెప్పుకోవడానికి తీపి గుర్తులెక్కడివి..? బహు భాషా నటిగా వరుస షూటింగ్‌లతో నిద్రలేని రాత్రులు చాలానే ఉన్నాయి. అలాంటి నిద్రలేని రాత్రులలో ముఖ్యంగా చెప్పుకోదగినవి ముచ్చటగా మూడున్నాయి. హీరోయిన్గా నాకు బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో ఒకటైన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’లో నేనే చేయాలని దర్శక నిర్మాతలు పట్టుబట్టారు. అప్పటికే వాణిశ్రీ రంగస్థలంపై 150 సార్లు విజయవంతంగా ప్రదర్శించిన క్యారక్టర్ అది. ఆ నాటకం ఆధారంగా తయారవు తున్న చిత్రం కావడంతో ఆసక్తి కలిగింది. అప్పటికే ‘ప్రయాణంలో పదనిసలు’ చిత్రానికి కేటాయించిన కాల్షీట్స్ నుంచి పదహారు రోజులు మాత్రమే సర్దగలనని చెప్పాను. సరేనన్నారు. యానాం తీరంలో గోదావరి ఒడ్డున గుడిసె సెట్లో షెడ్యూల్ మొదలైంది. అదే సమయంలో గోదావరి మరో ఒడ్డున జరుగుతున్న ‘ప్రయాణంలో పదనిసలు’ షూటింగ్లో పాల్గొనాల్సిన పరిస్థితి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు లాంచీలో తిరుగుతూ రెండు చిత్రాలకూ రాత్రింబవళ్లు పనిచేశాను. చెన్నై మహా లింగపురంలో ఇంటి నిర్మాణం పనుల్లో అమ్మ జయశ్రీ బిజీగా ఉండటంతో అమ్మమ్మ సుబ్బలక్ష్మిని తోడుగా పెట్టుకొని గడిపాను. ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’లో మాస్... ‘ప్రయాణంలో పదనిసలు’లో క్లాస్ వేషధారణ. గోదావరి రెండు తీరాల మధ్య లాంచీలో ప్రయాణించే సమయాన్నే మేకప్‌కు కేటాయించాను. లాంచీలో ఇటూ అటూ తిరుగుతూ మేకప్ మార్చుకుంటున్న సమయంలోనే నా చేతికి ఉన్న ఒక బంగారు గాజు గోదావరిలో పడి పోయింది. గోదావరి తల్లికి సమర్పించు కున్నానని సంతోషించాను. షూటింగ్ స్పాట్లో ఒక పెంకుటింట్లో బస. రాత్రి రెండు గంటల వరకు షూటింగ్ జరిగేది. మళ్లీ ఉదయాన్నే ఆరు గంటలకు షూటింగ్ కోసం వేకువన నాలుగు గంటలకే నిద్ర లేవాల్సి వచ్చేది. దాదాపు ఆ పదహారు రోజులూ నాకు నిద్రలేని రాత్రులే! ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ ఘనవిజయం ఆ కష్టాన్ని మరిపించింది. కర్ణాటకలో రామానంద్‌సాగర్ హిల్స్‌లో ‘హుళి హాలిన మేపు’ చిత్రం కోసం నాకు, ‘కన్నడ కంఠీరవ’ రాజ్‌కుమార్‌కు మధ్య డ్యూయెట్ చిత్రీకరిస్తున్నారు. ఆ షూటింగ్ పూర్తయ్యాక, మర్నాడే హైదరాబాద్‌లో హీరో కృష్ణతో ‘ముత్తైవ’ చిత్రం షూటింగ్‌కు హాజరు కావాల్సి ఉంది. అదే సమయంలో జోరున వర్షం మొదలైంది. రాత్రివేళ ఆ వర్షంలోనే ఊటీకి, ఊటీ నుంచి కోయంబత్తూరు, కోయంబత్తూరు నుంచి చెన్నై, అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకున్నాను. చెన్నైలో విమానం తలుపులు మూసేస్తున్న సమయంలో మైకులో అనౌన్స్ చేయించి, విమానంలోకి చేరుకోగలిగాను. హైదరాబాద్ చేరేలోగా విమానంలోనే రెడీ అయి, సకాలంలో షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నాను. మళ్లీ తెల్లారితే చెన్నై చేరుకోవాలి. నా తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన కె.ఎస్.గోపాలకృష్ణన్ ‘నాయకరిన్ మగళి’ ప్రారంభోత్సవం... అందులో నేనే హీరోయిన్. పైగా నాకది నూరో చిత్రం. హైదరాబాద్‌లో షూటింగ్ ముగించుకుని, తెల్లారేసరికి చెన్నై చేరుకుని, తమిళచిత్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను. కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల షూటింగ్లలో పాల్గొనేందుకు నిద్రలేని రాత్రులు గడిపాను. రష్యాలో 1976లో జరిగిన ఫిలిం ఫెస్టివల్‌కు ‘సోగ్గాడు’ చిత్ర బృందమంతా హాజరయ్యాం. మొత్తం పదిరోజులకు వారం రోజులే ఉండగలనని యూనిట్ పెద్దలకు చెప్పాను. ఎన్టీఆర్ హీరోగా ‘మాదైవం’ షూటింగ్‌కు రష్యా నుంచి బయలుదేరాను. ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా రష్యా నుంచి కాబూల్, ఢిల్లీ, చెన్నైల మీదుగా హైదరాబాద్‌కు సకాలానికి చేరుకున్నాను. అలాంటి నిద్రలేని రాత్రులే ఆ రోజుల్లో నాకు క్రమశిక్షణ గల నటిగా పేరుతెచ్చాయి. - కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్
-
నిజంగా విశేషమే!
సినిమా వేడుకలకు హీరోయిన్లు అతిథులుగా వెళ్లడం కామనే. కానీ... త్రిష, నయనతార కలిసి ఓ వేడుకకు అతిథులుగా వెళ్లడం మాత్రం నిజంగా విశేషమే. ఎందుకంటే... ఒకప్పుడు వీరిద్దరూ బద్ద శత్రువులు. ఇప్పుడేమో ప్రాణ మిత్రులు. తాము నటించిన సినిమాల వేడుకలకే వారు సరిగ్గా హాజరవ్వరు. ఆ విషయంలో త్రిష కొంచెం పర్లేదు. అగ్ర హీరోల సినిమా అంటే.. అలా కనిపించి ఇలా వెళ్లిపోతారు. కానీ నయన మాత్రం... ‘ఎవరి సినిమా అయితే ఏంటి? డోంట్‌కేర్’ అనే రకం. తను ప్రధాన పాత్ర పోషించిన ‘అనామిక’ సినిమానే పట్టించుకోని విశాల హృదయం నయనది. అలాంటి ఈ ఇద్దరూ కలిసి ఓ చిత్రానికి అతిథులుగా వెళ్లడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకెళ్తే- తన తమ్ముడు సత్యని హీరోగా పరిచయం చేస్తూ తమిళ స్టార్ హీరో ఆర్య ‘అమరకావ్యం’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక త్వరలో జరగనుంది. ఈ వేడుకకు త్రిష, నయన అతిథులుగా వస్తే... వేదిక గ్లామరస్‌గా ఉంటుందని, తన తమ్ముడికి కూడా వీరి రాక కలిసొస్తుందని ఆర్య భావించాడట. పైగా ఆర్యకు త్రిష, నయనతార మంచి ఫ్రెండ్స్. ఇంకేముంది! అడగడమే ఆలస్యం ఇద్దరూ ‘సై’ అనేశారట. తమ సినిమాల ప్రమోషన్లు పట్టించుకోరు కానీ, పరాయి సినిమాల వేడుకలకు అతిథులుగా వెళ్లడం నిజంగా విడ్డూరం అంటూ కోలీవుడ్డంతా చెవులు కొరుక్కుంటున్నారట. -
జనవరి నుంచి సినిమాల పండుగ
అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఈసారి నవీముంబై వేదిక కానుంది. వచ్చే జనవరి 31 నుంచి ఫిబ్రవరి రెండో వరకు నెరూల్‌లోని డి.వై.పాటిల్ ఆడిటోరియంలో దీనిని నిర్వహిస్తారు. పలు లఘుచిత్రాలు, సినిమాలను ఇందులో ప్రదర్శిస్తారు. భారత్‌తోపాటు ఫ్రాన్స్, అర్జెంటీనా, రొమేనియా, బ్రెజిల్, జర్మనీ, ఇటలీ, తుర్క్మిస్థాన్, అమెరికా, నెదర్లాండ్స్, సింగపూర్, ఇజ్రాయెల్, స్పెయిన్ తదితర దేశాల సినిమాలను చూడవచ్చు. ఇదివరకు జరిగిన అంతర్జాతీయ సినిమాల ఉత్సవాల్లో మన దేశానికి చెందిన 170 చిత్రాలకు ప్రవేశం లభించింది. నెరూల్‌లో మూడురోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి మహేశ్ మాంజ్రేకర్, డింపుల్ కపాడియా, నగేశ్ కుక్నూర్ తదితర దిగ్గజాలతోపాటు, ప్రముఖ నటీనటులు హాజరుకానున్నారు. నవీముంబైలో పలువురు సినీతారలు, కళాకారులు ఉన్నా, ఇంతవరకు ఇక్కడ సినీ ఉత్సవాలు జరగలేదు. నమీముంబై సినీ ప్రేమికులు సినిమా, కాలాఘోడా ఉత్సవాలను వీక్షించేందుకు ముంబైకి రావాల్సి వస్తోంది. అందుకే 2014లో ఇక్కడ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సచిన్ ఖన్నా, అశోక్ పురంగ్, సమీర్ వాలవ్కర్, బిశారద్, డాక్టర్ విక్రం పర్లీకర్ తదితర ప్రముఖులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నవీముంబై అన్ని రంగాల్లోనూ పురోగమిస్తోంది. ఇక్కడ భారీ భవనాలు,అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఊపందుకుంటున్నాయి. అయినప్పటికీ ఇంతవరకు అంతర్జాతీయస్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగలేదని సచిన్ ఖన్నా అన్నారు. వాషిలో విష్ణుదాస్భావే హాలు మినహా సినిమా థియేటర్లుగాని నృత్యశాలలుగాని లేవు. నవీముంబైలో శంకర్ మహదేవన్ వంటి గాయకులు, సినీకళాకారులు ఉంటున్నారు. ఇక్కడ కూడా సాంస్కృతిక వాతావరణం సృష్టించడానికే ఈ ప్రయత్నమని ఖన్నా వివరించారు. -
ముగిసిన చిన్నారుల చిత్ర సందడి
-
బాలల చిత్రోత్సవాల్లో చదువుకోవాలి
విద్య విలువను తెలియజేస్తూ స్వీయదర్శకత్వంలో మద్దాళి వెంకటేశ్వరరావు రూపొందించిన చిత్రం ‘చదువుకోవాలి’. సీత, బేబి ఆని, కోట శంకరరావు ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం పలు ప్రశంసలను దక్కించుకుంది. అలాగే, పలు అవార్డులను కూడా చేజిక్కించుకుంది. తాజాగా, ఈ చిత్రానికి మరో గౌరవం దక్కింది. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శితం కాబోతోంది. దర్శక, నిర్మాత చెబుతూ-‘‘చదువుపై వచ్చిన మంచి చిత్రంగా ఇప్పటికే విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి మంచి అభినందనలు అందుతున్నాయి. ఇప్పుడు బాలల చిత్రోత్సవాలకు ఈ చిత్రం ఎంపిక కావడం ఆనందంగా ఉంది. విద్యపై చైతన్యం రగిలించే కథాంశంతో రూపొందించిన ఈ చిత్రాన్ని బాలలందరూ చూసి, స్ఫూర్తి పొందాలన్నది నా ఆకాంక్ష’’ అన్నారు. -
చెన్నైలో ముగిసిన వందేళ్ల ఇండియన్ సినిమా వేడుకలు