సాక్షి, హైదరాబాద్: అతిపెద్ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఐఫా అవార్డ్స్ 2024’కు సర్వం సిద్ధమైంది. సుదీర్ఘకాలం తర్వాత ‘ఐఫా’ ప్రారంభ కార్యక్రమం నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా మంగళవారం నిర్వహించారు. యూఏఈ అబుదాబిలోని యస్ ద్వీపం వేదికగా సెపె్టంబర్ 6, 7 తేదీల్లో జరగనుంది. నగరంలో ఏర్పాటు చేసిన ప్రారంభ వేడుకల్లో పలువురు తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ సినీ తారలతో పాటు అబుదాబి కల్చరల్ టూరిజం ప్రతినిధి అబ్దుల్లా యూసఫ్ మొహమ్మద్, ఫెస్టివల్ యూనిట్ హెడ్ డీటీసీ– నవాఫ్ అలీ అల్జాహ్దమీ తదితర ప్రతినిధులు సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే...
ప్రపంచ స్థాయి గుర్తింపు
భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కుతోంది. సినిమాకు ప్రాంతం, బాషతో సంబంధం లేదు. ప్రతీ రంగాన్ని ఆస్వాదిస్తున్నాను కాబట్టే సినిమా, టీవీ, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నాను. తెలుగులో తారక్ నటన అంటే చాలా ఇష్టం. అవకాశముంటే చిరు, బాలయ్య, తారక్ తో సినిమా చేయడాని సిద్ధంగా ఉన్నాను.
– కుష్బూ
నెల రోజుల్లో కొత్త సినిమా
ఈసారి అబుదాబి ఐఫా ఉత్సవం 2024ను నేను, తేజా సజ్జ కలిసి చేయబోతున్నాం. సినిమాను తెలుగు అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నంత మరెవరూ చేసుకోరేమో. మరో నెల రోజుల్లో కొత్త సినిమా గురించి వివరాలు చెబుతాను.
– రానా దగ్గుపాటి
రాశీ ఖన్నా– చివరి సారి జరిగిన ఐఫా ఉత్సవంలో పాల్గొన్నాను. ఇన్నేళ్ల తరువాత మళ్లీ జరుగుతుండటం సంతోషంగా ఉంది.
దేవీ శ్రీ ప్రసాద్ – పుష్ప 2 కోసం అందరిలానే నేనూ ఎదురు చూస్తున్నారు. సుకుమార్ మరింత క్రేజీగా రెండో భాగాన్ని రూపొందించారు. రషి్మక ఇరగదీసింది. సినిమా ప్రయాణంలో హైదరాబాద్ ప్రత్యేకమైనది.
శ్రీలీల– ఐఫా వేదికపై డ్యాన్స్ స్టెప్పులు వేయనున్నాను. కుర్చీ మడతపెట్టి ప్రజలకు బాగా చేరువైంది. ఇలాంటి వేదికల పై సినిమా కుటుంబాన్ని ఒకేసారి కలుసుకోవడం ఆనందంగా ఉంటుంది.
తేజ సజ్జ– హనుమాన్ సక్సెస్ సంతోషాన్నిచి్చంది. మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. త్వరలో అప్డేట్ చేస్తాను. ఐఫా లో రానా తో పాటు హోస్ట్ గా చేస్తున్నాను.
ఫరియా అబ్దుల్లా– కలి్కలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. షూటింగు సమయంలో ప్రభాస్ చేసిన అల్లరి మరచిపోలేను. మరో 3 సినిమాల్లో నటిస్తున్నాను.
సిమ్రాన్– చాలా రోజుల తరువాత తెలుగు అభిమానులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. బాలయ్యతో నరసింహ రెడ్డి పాటలకు వేసిన స్టెప్పులు గుర్తొస్తున్నాయి. ప్రస్తుతం హిందీ, తమిళ్‌లో సినిమాలు చేస్తున్నాను. అవకాశాలను బట్టి తెలుగులోనూ చేయాలని ఉంది.
అక్షర హాసన్– తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తున్నాను. హైదారాబాద్ ఎప్పుడు వచి్చనా మంచి అనుభూతి. తెలుగులోనూ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
ప్రగ్యా జైశ్వాల్– 2017లో ఐఫా ఉత్సవంలో కంచె సినిమా నేపథ్యంలో పాల్గొన్నాను. తెలుగు సినిమా ఎదిగిన తీరు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తెలుగులో మరో 2 సినిమాలు చేస్తున్నాను.
నవదీప్– మొదటి ఐఫా అవార్డ్స్ కు హోస్ట్ గా చేశాను. నా నటన కన్నా నా మాటలను అభిమానులు బాగా ఆదరించారు. ఈ మధ్య కాలంలో ఓటీటీ లో మంచి సక్సెస్ ను అందుకున్నాను.
Comments
Please login to add a commentAdd a comment