IIFA Awards
-
ఐఫా కాంట్రవర్సీ.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: తేజ సజ్జా
‘ఐఫా’ అవార్డుల వేడుకలో రానా-తేజ సజ్జ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు వ్యాఖ్యాతలుగా చేసిన రానా-తేజ స్టార్ హీరోల సినిమాలపై జోకులు వేశారు. అయితే ఫ్యాన్స్ దానికి సంబంధించిన క్లిప్పులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..రానా-తేజలను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా దీనిపై తేజ సజ్జ క్లారిటీ ఇచ్చారు. ఐఫా వేడుకలో తాము సరదా కోసమే అలా మాట్లాడామని, ఫుల్ వీడియో చూస్తే ఆ విషయం అందరికి అర్థమవుతుందని చెప్పారు. ‘ఐఫా అవార్డులు అనేది ఒక జాతీయ స్థాయి వేడుకు. దాని కోసం చాలా మంది స్క్రిప్ట్ రైటర్స్ పని చేస్తుంటారు. అన్ని విధాల చెక్ చేసుకున్న తర్వాతే మాకు స్క్రిప్టులు అందిస్తారు. మేము అదే ఫాలో అవుతాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్పులన్నీ కట్ చేసినవి మాత్రమే. ఫుల్ వీడియో చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. రానా నాపై జోకులు వేశాడు. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. అందరి హీరోలతో కలిసి పని చేశాను. స్టార్ హీరోలందరితోనూ నాకు మంచి అనుబంధం ఉంది. వారిని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. మా వ్యాఖ్యలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలా కాంట్రవర్సీ చేస్తున్నారు’అని తేజ సజ్జ అన్నారు. కాగా, ఈ ఏడాది ఐఫా అవార్డుల వేడుక అబుదాబిలో నిర్వహించారు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ వేడుకలో రానా-తేజ సజ్జ హోస్ట్‌గా వ్యవహరించారు. పలువురు టాలీవుడు స్టార్ హీరోహీరోయిన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
అలాంటప్పుడు ఈ వేడుకకు నన్నెందుకు పిలిచారు: మీనా
సీనియర్ నటి మీనా సౌత్ ఇండియా ప్రేక్షకులతో మంచి అనుబంధమే ఉంది. బాలనటిగా రంగ ప్రవేశం చేసిన ఆమె స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్గా అబుదాబిలో జరిగిన ఐఫా-2024 అవార్డ్స్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఆ వేదిక మీద మీనా తమిళ్ మాట్లాడుతుండగా తనపై బాషా విభేదం చూపించారు.ఒకప్పడు స్టార్ నటిగా కొనసాగిన మీనా.. ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెండ్ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐఫా చిత్రోత్సవాల్లో మీనా మాట్లాడుతుండగా.. ఆ సమయంలో ఒక యాంకర్ హిందీ భాషలో మాట్లాడమని చెప్పడంతో నటి మీనాకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఇది హిందీ వేడుకనా, అయితే తనని ఎందుకు ఆహ్వానించారు..? తాను ఇది దక్షిణాది వేడుక అని భావించానంటూ అసంతప్తి వ్యక్తం చేశారు. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. ఐఫా వేడుకల్లో హీరోయిన్ మీనా (ఫొటోలు)దక్షిణాది చిత్రాలు, దక్షిణాది నటీనటులు చాలా ఉత్తమ కళాకారులని, తాను దక్షిణాది నటినని చెప్పుకోవడానికి గర్వపడతానన్నారు. అదేవిధంగా ఐఫా చిత్రోత్సవ వేడుక దక్షిణాదికే కాకుండా భారతీయ కళాకారులను కలుపుతూ ఘనంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఇలా నటి మీనా మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
#IIFAUtsavam2024 : ఐఫా అవార్డుల వేడుక మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
ఐఫా వేడుకల్లో హీరోయిన్ మీనా.. బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయింది! (ఫొటోలు)
-
ఐఫా వేదికపై ఆర్జీవీకి కృతజ్ఞతలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) (IIFA Awards-2024) అవార్డుల కార్యక్రమం తాజాగా అబుదాబిలో జరిగింది. ఆ వేదికపై దర్శకులు రామ్‌గోపాల్ వర్మ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమాకు తొమ్మిది విభాగాల్లో ఐఫా నుంచి అవార్డులు అందాయి. దీంతో ఈ సినిమాను తెరకెక్కించిన సందీప్‌పై భారీగా ప్రశంసలు అందాయి.యానిమల్ చిత్రానికి గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను సందీప్ రెడ్డి వంగా అందుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు సందీప్ థ్యాంక్స్ చెప్పారు. రామ్‌గోపాల్ వర్మ సినిమాలు చూసి తాను ఎడిటింగ్ నేర్చుకున్నానని అబుదాబి వేదికగా సందీప్ అన్నారు. వర్మ సినిమాలకు తాను పని చేయకపోయినప్పటికీ ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే 'థాంక్యూ ఆర్జీవీ సర్' అని సందీప్ చెప్పారు. ఇప్పటికే పలు వేదికల మీద ఆర్జీవీ పట్ల తనకున్న గౌరవాన్ని సందీప్ చాటుకున్నారు. తాజాగా మరోసారి తన అభిమానాన్ని ఇలా పంచుకున్నారు.సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన మాటలను రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తనదైన స్టైల్లో ఆయన ఇలా స్పందించారు. 'సార్.. సందీప్ రెడ్డి వంగా గారు. ఇప్పుడు మీ నుంచి నేను సినిమా తీయడం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మియా మాల్కోవా, దావూద్ ఇబ్రహీం, అయాన్ రాండ్తో పాటు మీపై ఒట్టేసి చెబుతున్నా.' అని ఆర్టీవీ ట్వీట్ చేశారు.యానిమల్ చిత్రం 2023లో విడుదలైంది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్వీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి నటించారు. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 917 కోట్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. యానిమల్ చిత్రానికి దర్శకుడిగానే కాకుండా ఎడిటర్‌గానూ సందీప్ తన ప్రతిభను చూపించారు. అలా బాలీవుడ్లో తన సత్తా ఏంటో చూపించారు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రానికి సందీప్ దర్శకత్వం వహించనున్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుంది.Sirrrrrrr @imvangasandeep I now want to LEARN film making from YOU and I SWEAR this on Mia Malkova, Dawood Ibrahim ,Ayn Rand and YOU pic.twitter.com/sY0MtdJ7KG— Ram Gopal Varma (@RGVzoomin) September 30, 2024 -
#IIFAAwards2024 : అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక (ఫొటోలు)
-
ఐఫా- 2024 విజేతలు.. అవార్డ్స్ అందుకున్న బాలీవుడ్, సౌత్ ఇండియా స్టార్స్
బాలీవుడ్ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ (ఐఫా) వేడుక అబుదాబిలో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి షారుక్ ఖాన్, కరణ్ జోహార్, విక్కీ కౌశల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మొదటిరోజు దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన సినిమాలు, సినీ ప్రముఖులకు అవార్డులు అందించారు. రెండోరోజు బాలీవుడ్ సినిమాలకు సంబంధించి అవార్డ్స్ అందించారు. అయితే, బాలీవుడ్ విభాగంలో తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా సత్తా చాటింది. కానీ, జవాన్ సినిమాకు గాను షారుక్ ఖాన్‌కు ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కింది. అయితే, సౌత్ ఇండియా నుంచి ఉత్తమ చిత్రంగా జైలర్ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా నాని (దసరా) అవార్డ్ అందుకున్నారు. అయితే, నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ చిత్రానికి పలు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి.ఐఫా 2024 విజేతలు (సౌత్ ఇండియా)ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా- మెగాస్టార్ చిరంజీవిఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా – ప్రియదర్శన్ఐఫా వుమెన్ ఆఫ్‌ది ఇయర్ – సమంతఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు – బాలకృష్ణఐఫా ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టిఉత్తమ చిత్రం (తమిళం) - జైలర్ఉత్తమ చిత్రం (తెలుగు)- దసరాఉత్తమ నటుడు (తెలుగు)- నాని (దసరా)ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – బ్రహ్మానందం(రంగమార్తాండ)ఉత్తమ నటి (తమిళం) – ఐశ్వర్యారాయ్ (పీఎస్ 2)ఉత్తమ విలన్ (తెలుగు) - షైన్ టామ్ (దసర)ఉత్తమ విలన్ (తమిళం) - ఎస్జే సూర్య (మార్క్ ఆంటోనీ)ఉత్తమ విలన్ (కన్నడ) - జగపతి బాబుఉత్తమ విలన్ (మలయాళం) – అర్జున్ రాధాకృష్ణన్ఉత్తమ దర్శకుడు (తమిళం) – మణిరత్నం (పీఎస్ 2)ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టిఉత్తమ నటి (కన్నడ) – రుక్మిణి (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)ఉత్తమ నటుడు (కన్నడ) – రక్షిత్ శెట్టి (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)ఉత్తమ సహాయ నటుడు (తమిళం) – జయరామ్ (పీఎస్ 2)ఉత్తమ లిరిక్స్ – జైలర్ (హుకుం)ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) – ఏఆర్ రెహమన్ (పీఎస్ 2)ఉత్తమ నేపథ్య గాయకుడు – చిన్నంజిరు (పీఎస్ 2)ఉత్తమ నేపథ్య గాయని – శక్తిశ్రీ గోపాలన్ (పీఎస్ 2)ఐఫా 2024 విజేతలు (బాలీవుడ్)ఉత్తమ చిత్రం : యానిమల్ఉత్తమ దర్శకుడు: విదు వినోద్ చోప్రా (12th ఫెయిల్)ఉత్తమ నటుడు: షారుక్ ఖాన్ (జవాన్)ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)ఉత్తమ సహాయ నటుడు: అనిల్ కపూర్ (యానిమల్)ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ )ఉత్తమ విలన్: బాబీ డియోల్(యానిమల్)ఉత్తమ సంగీతం: యానిమల్ ఉత్తమ లిరికల్స్: యానిమల్ (సిద్ధార్థ్-గరిమే, సత్రన్యాగ)ఉత్తమ గాయకుడు: భూపిందర్ బబ్బల్, అర్జన్ వ్యాలీ (యానిమల్)ఉత్తమ గాయని: శిల్పారావు (చెలియా-జవాన్)ఉత్తమ కథ: రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీఅచీవ్మెంట్ ఆన్ కంప్లీటింగ్ 25 ఇయర్స్ ఇన్ సినిమా : కరణ్ జోహార్ -
#IIFAUtsavam2024 : అబుదాబిలో ఘనంగా ఐఫా.. మెరిసిన తారలు (ఫొటోలు)
-
IIFA అవార్డ్స్ 24వ ఎడిషన్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఐఫా అవార్డ్స్-2024 షెడ్యూల్ ప్రకటన.. రానా, తేజను తప్పించారా..?
ఈ ఏడాదిలో జరగనున్న ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐఫా) పురస్కారాల వేడుకకు అబుదాబి వేదిక కానుంది. 24వ ‘ఐఫా’ వేడుకలు అబుదాబిలోని యస్ ఐల్యాండ్‌లో సెప్టెంబర్ 27-29 వరకు జరగనున్నట్టు తాజాగా నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్‌తో పాటు నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా వెలువడింది.ఐఫా అవార్డ్స్ వేడుకలో షాహిద్ కపూర్‌తో సహా బాలీవుడ్ ప్రముఖులు తమ ఆకర్షణీయమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డ్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. సెప్టెంబర్ 27న ఐఫా ఉత్సవం పేరుతో అద్భుతమైన ఈవెంట్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 28న అవార్డ్స్, 29న ఐఫా రాక్స్ గాలాతో ఈ కార్యక్రమం ముగుస్తోంది.రేసులో ఈ సినిమాలే టాప్ఈ సంవత్సరం నామినేషన్లు ఇప్పటికే సంచలనం సృష్టించాయి. రణబీర్ కపూర్ 'యానిమల్' అత్యధికంగా 11 నామినేషన్లను దక్కించుకుంది. రణవీర్ సింగ్, అలియా భట్ నటించిన రాకీ ఔర్ రాణి కియ్ ప్రేమ్ కహానీ 10 నామినేషన్లను పొందింది. 2023 ఏడాదిలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్‌తో పాటు జవాన్ రెండూ పాపులర్ కేటగిరీలో ఏడు నామినేషన్లను పొందగా, విక్రాంత్ మాస్సే చిత్రం 12th ఫెయిల్ ఐదు నామినేషన్లను సాధించింది. ఈసారి ఐఫా అవార్డ్స్ కోసం గట్టిపోటీ ఎదురుకానుంది.రానాను తప్పించారా..?ఐఫా అవార్డ్స్2024'కి హోస్ట్‌గా రానాతో పాటు యంగ్ హీరో తేజ సజ్జ వ్యవహరించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ మేరకు హైదరబాద్‌లో ముందస్తు వేడుక(కర్టెన్ రైజర్ ఈవెంట్)లో కూడా వారు సందడి చేశారు. అయితే, ఇప్పుడు సడెన్‌గా షారూఖ్ ఖాన్, కరణ్ జోహార్లు తెరపైకి వచ్చారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలను ఈసారి నిర్వాహుకులు తప్పించారా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే, గతంలో కరణ్ ఐఫా హోస్ట్‌గా పనిచేసిన అనుభవం ఉంది. -
ఐఫా-2024 ప్రెస్మీట్లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)
-
ఐఫా స్టార్స్.. 2024–హోస్ట్స్‌గా రానా, తేజా సజ్జ
సాక్షి, హైదరాబాద్: అతిపెద్ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఐఫా అవార్డ్స్ 2024’కు సర్వం సిద్ధమైంది. సుదీర్ఘకాలం తర్వాత ‘ఐఫా’ ప్రారంభ కార్యక్రమం నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా మంగళవారం నిర్వహించారు. యూఏఈ అబుదాబిలోని యస్ ద్వీపం వేదికగా సెపె్టంబర్ 6, 7 తేదీల్లో జరగనుంది. నగరంలో ఏర్పాటు చేసిన ప్రారంభ వేడుకల్లో పలువురు తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ సినీ తారలతో పాటు అబుదాబి కల్చరల్ టూరిజం ప్రతినిధి అబ్దుల్లా యూసఫ్ మొహమ్మద్, ఫెస్టివల్ యూనిట్ హెడ్ డీటీసీ– నవాఫ్ అలీ అల్జాహ్దమీ తదితర ప్రతినిధులు సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే...ప్రపంచ స్థాయి గుర్తింపు భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కుతోంది. సినిమాకు ప్రాంతం, బాషతో సంబంధం లేదు. ప్రతీ రంగాన్ని ఆస్వాదిస్తున్నాను కాబట్టే సినిమా, టీవీ, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నాను. తెలుగులో తారక్ నటన అంటే చాలా ఇష్టం. అవకాశముంటే చిరు, బాలయ్య, తారక్ తో సినిమా చేయడాని సిద్ధంగా ఉన్నాను. – కుష్బూనెల రోజుల్లో కొత్త సినిమా ఈసారి అబుదాబి ఐఫా ఉత్సవం 2024ను నేను, తేజా సజ్జ కలిసి చేయబోతున్నాం. సినిమాను తెలుగు అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నంత మరెవరూ చేసుకోరేమో. మరో నెల రోజుల్లో కొత్త సినిమా గురించి వివరాలు చెబుతాను. – రానా దగ్గుపాటి రాశీ ఖన్నా– చివరి సారి జరిగిన ఐఫా ఉత్సవంలో పాల్గొన్నాను. ఇన్నేళ్ల తరువాత మళ్లీ జరుగుతుండటం సంతోషంగా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ – పుష్ప 2 కోసం అందరిలానే నేనూ ఎదురు చూస్తున్నారు. సుకుమార్ మరింత క్రేజీగా రెండో భాగాన్ని రూపొందించారు. రషి్మక ఇరగదీసింది. సినిమా ప్రయాణంలో హైదరాబాద్ ప్రత్యేకమైనది. శ్రీలీల– ఐఫా వేదికపై డ్యాన్స్ స్టెప్పులు వేయనున్నాను. కుర్చీ మడతపెట్టి ప్రజలకు బాగా చేరువైంది. ఇలాంటి వేదికల పై సినిమా కుటుంబాన్ని ఒకేసారి కలుసుకోవడం ఆనందంగా ఉంటుంది. తేజ సజ్జ– హనుమాన్ సక్సెస్ సంతోషాన్నిచి్చంది. మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. త్వరలో అప్డేట్ చేస్తాను. ఐఫా లో రానా తో పాటు హోస్ట్ గా చేస్తున్నాను. ఫరియా అబ్దుల్లా– కలి్కలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. షూటింగు సమయంలో ప్రభాస్ చేసిన అల్లరి మరచిపోలేను. మరో 3 సినిమాల్లో నటిస్తున్నాను. సిమ్రాన్– చాలా రోజుల తరువాత తెలుగు అభిమానులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. బాలయ్యతో నరసింహ రెడ్డి పాటలకు వేసిన స్టెప్పులు గుర్తొస్తున్నాయి. ప్రస్తుతం హిందీ, తమిళ్లో సినిమాలు చేస్తున్నాను. అవకాశాలను బట్టి తెలుగులోనూ చేయాలని ఉంది. అక్షర హాసన్– తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తున్నాను. హైదారాబాద్ ఎప్పుడు వచి్చనా మంచి అనుభూతి. తెలుగులోనూ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రగ్యా జైశ్వాల్– 2017లో ఐఫా ఉత్సవంలో కంచె సినిమా నేపథ్యంలో పాల్గొన్నాను. తెలుగు సినిమా ఎదిగిన తీరు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తెలుగులో మరో 2 సినిమాలు చేస్తున్నాను. నవదీప్– మొదటి ఐఫా అవార్డ్స్ కు హోస్ట్ గా చేశాను. నా నటన కన్నా నా మాటలను అభిమానులు బాగా ఆదరించారు. ఈ మధ్య కాలంలో ఓటీటీ లో మంచి సక్సెస్ ను అందుకున్నాను. -
IIFA 2023: అట్టహాసంగా ఐఫా అవార్డ్స్ 2023 వేడుక (ఫొటోలు)
-
ఐఫా ఈవెంట్లో హోయలు పోయిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
ఐఫా ఈవెంట్లో హోయలు పోయిన ముద్దుగుమ్మలు (ఫోటోలు)
-
కత్రినా కైఫ్ భర్తను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్..
-
IIFA Awards 2022: ఈ సినిమాకు అత్యధికంగా అవార్డులు..
చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కరాల్లో ఒకటి ‘ఐఫా’ అవార్డ్స్. 22వ 'ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ' (IIFA Awards 2022)) అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం (జూన్ 4) రాత్రి ముగిసింది. జూన్ 3న అబుదాబిలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలో సినీ అతిరథుల మధ్య పురస్కారాలను అందజేశారు. ఈ వేడకకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, మనీష్ పాల్ హోస్ట్‌గా వ్యవహరించారు. అలాగే షాహిద్ కపూర్, నోరా ఫతేహీలా డ్యూయెట్ సాంగ్ కనులవిందు చేసింది. ఐఫా అవార్డ్స్ గ్రీన్ కార్పెట్‌లో సినీ తారలు సందడి చేశారు. హీరోయిన్స్ తమ గ్లామర్‌తో కట్టిపడేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదిలా ఉంటే ఉత్తమ నటీనటులకు, చిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. అత్యధికంగా కియరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర నటించిన 'షేర్షా' మూవీ అత్యధిక పురస్కరాలు సాధించింది. ఉత్తమ చిత్రం: షేర్షా (హిరో యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షబ్బీర్ బాక్స్‌వాలా, అజయ్ షా, హిమాన్షు గాంధీ) ఉత్తమ దర్శకుడు: విష్ణువర్ధన్ (షేర్షా) ఉత్తమ నటుడు: విక్కీ కౌషల్ (సర్దార్ ఉద్ధమ్) ఉత్తమ నటి: కృతి సనన్ (మిమి) ఉత్తమ నటుడు (డెబ్యూ): అహన్ శెట్టి (తడప్ 2) ఉత్తమ నటి (డెబ్యూ): శర్వారీ వాఘ్ (బంటీ ఔర్ బబ్లీ 2) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (లూడో) ఉత్తమ సహాయ నటి: సయూ తమ్హాంకర్ మ్యూజిక్ డైరెక్షన్ (టై): ఏఆర్ రెహమాన్ (ఆత్రంగి రే), తనిష్క్ బగ్చీ, జస్లీన్ రాయల్, జావేద్-మోసిన్, విక్రమ్ మాంత్రోస్, బి ప్రాక్, జానీ (షేర్షా) ఉత్తమ నేపథ్య గాయకుడు: జుబిన్ నటియాల్ (రాతాన్ లంబియాన్-షేర్షా) ఉత్తమ నేపథ్య గాయకురాలు: అసీస్ కౌర్ (రాతాన్ లంబియాన్-షేర్షా) ఉత్తమ కథ (ఒరిజినల్): అనురాగ్ బసు (లూడో) ఉత్తమ కథ (అడాప్టెడ్): (కబీర్ ఖాన్, సంజయ్ పురాన్ సింగ్ చౌహన్ ఐసీసీ వరల్డ్ కప్ 1983 ఆధారంగా వచ్చిన 83) సాహిత్యం: కౌసర్ మునీర్ (లెహ్రే దో పాట-83) -
ఐఫా గ్రీన్ కార్పెట్‌పై బాలీవుడ్ తారల తళుకులు (ఫొటోలు)
-
వైరల్: వీధి కుక్కను ఇంటర్వ్యూ చేసిన నటి
ముంబై : ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (ఐఫా) 2019, 20వ ఎడిషన్ వేడుకల్లో ఓ వీధి కుక్క తళుక్కుమంది. ఓ నటి ఆ కుక్కను ఇంటర్వ్యూ చేయటం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం ఐఫా వేడుకలు జరుగుతున్న ప్రదేశంలోకి ఓ వీధి కుక్క చొరబడింది. గ్రీన్ కార్పెట్ మీద అటు ఇటు పచార్లు చేయటం మొదటుపెట్టింది. అక్కడ కుక్కు తిరుగుతుండటం నటి అదితి భాటియా కంటపడింది. దీంతో ఆమె మైక్ పట్టుకుని ఆ కుక్కను ఇంటర్వ్యూ చేశారు. మొదట ఆ కుక్కను పలకరించగానే అది ప్రేమగా ఆమెతో కరచాలనం! చేసింది. అనంతరం ఆమె కొన్ని ప్రశ్నలు అడగ్గా మౌనంతోనే సమాధానం చెప్పింది. అదితి ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. షేర్ చేసిన రెండు రోజుల్లోనే ఈ వీడియో 6 లక్షల వ్యూస్ సంపాదించుకుంది. -
ఐఫా అవార్డ్స్ 2019
-
ఫోటోలు వారివి, కష్టం నాది
-
వీడియో నాది.. ఫోటోలు వారివి
‘ఐఫా’ వేదిక మీద అందాల నటి శ్రీదేవికి ఘన నివాళి అర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీదేవి ఫోటోలు, పాటలు కలిపి రూపొందించిన అద్భుతమైన వీడియోను ప్రదర్శించారు. ఆ వీడియో చూసిన వారికి ఒక్క క్షణం అలనాటి జ్ఞాపకాలన్ని కళ్ల ముందు మెదిలాయి. శ్రీదేవి అభిమానులనే కాకా సిని ప్రియులందరి హృదయాలను దోచుకున్న ఈ వీడియో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ‘ఐఫా’ వేడుకల అనంతరం ఢిల్లీకి చెందిన సబా అరీఫ్ అనే శ్రీదేవి అభిమాని తాను కష్టపడి రూపొందించిన వీడియోను తన అనుమతి లేకుండా ‘ఐఫా’ వాడుకుందని ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై బోనీ కపూర్ స్పందిస్తూ ‘శ్రీదేవికి సంబంధించిన ఫోటోలపై హక్కులన్ని నావే. వాటిని వాడుకునే అధికారం నాకు ఉంది. ఈ వీడియో నాకు ఎంతో నచ్చింది. ఐఫాలో శ్రీదేవికి నివాళులు సమర్పించే సమయంలో ఈ వీడియోను వాడితే బాగుంటుందని అనిపించింది. అందుకే యశ్‌రాజ్ ఫిలిమ్స్‌తో కలిసి ఈ వీడియోను నేనే ఓకే చేశాను. ఇంకా చెప్పాలంటే నాకు సంబంధించిన ఫోటోలను ఆమె వాడుకుంది. అంతే కాక ఈ వీడియో తనదని చెప్పుకుంటుంది. ఇది కరెక్ట్ కాదు. అయినా ఆమెకు ఏదైనా సమస్య ఉంటే నన్ను కలవాల్సింది. అంతే తప్ప ఇలా ఆరోపణలు చేయడం సరికాద’న్నారు. బోనీ వ్యాఖ్యలపై సబా స్పందిస్తూ ‘ఈ వీడియోలో ఉన్న ఫోటోలు ఆయనవే ఒప్పుకోంటాను. కానీ నేను ఎంతో శ్రమించి ఈ వీడియో తయారు చేశాను. పాటలు, అందుకు తగ్గట్లుగా ఫోటోలను సెలక్ట్ చేసి వీడియో తయారు చేయడానికి నాకు మూడు రోజులు పట్టింది. ఫోటోలు వారివి, కష్టం నాది. నా అనుమతి లేకుండా నేను రూపొందించిన వీడియోను ఎలా వాడతారు. ఈ వీడియోను పోస్టు చేస్తున్నప్పుడు ఇంత గుర్తింపు వస్తుందని అనుకోలేదు. ఇప్పటికి చెప్తున్నా ఆ వీడియో నాదే. ఈ విషయంలో నన్ను గుర్తించాలి’ అని కోరింది. -
కంటతడి పెట్టుకున్న బోనీ కపూర్!
శ్రీదేవి మరణానంతరం బోనీ కపూర్ పలు సందర్భాల్లో భావోద్వేగానికి లోనయ్యారు. జాతీయ చలన చిత్ర అవార్డు వేడుకల్లో బోనీ కపూర్ శ్రీదేవి తరుపున అవార్డు తీసుకుంటూ.. ఎమోషనల్ అయ్యారు. తాజాగా ఐఫా వేడుకల్లో బోనీ కపూర్ స్టేజ్‌పైనే కన్నీటిపర్యంతమయ్యారు. శ్రీదేవి గతేడాది నటించిన మామ్ చిత్రానికి ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అయితే ఈ అవార్డును శ్రీదేవి తరుపున బోనీ కపూర్ అందుకుంటూ భావోద్వేగానికి లోనవుతూ.. ‘నిన్ను ప్రతీక్షణం మిస్సవుతున్నాను’ అంటూ కళ్లు చెమర్చగా... అర్జున్ కపూర్, అనిల్ కపూర్లు వచ్చి బోనీ కపూర్‌ను ఓదార్చుతూ.. ప్రపంచం, భారతదేశం..మా కుటుంబాలు శ్రీదేవీని ఎప్పటికీ మరిచిపోలేమని అనిల్ కపూర్ అన్నారు. దుబాయ్‌లో పెళ్లి వేడుకకు హాజరైన శ్రీదేవి ప్రమాదావశాత్తు బాత్రూం టబ్‌లో పడి ఫిబ్రవరి 24న మరణించిన సంగతి తెలిసిందే. -
ఐఫా-2018 సంబరాలు
-
ఐఫా అవార్డులు-2018
ప్రతిష్టాత్మక ఐఫా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. గత రాత్రి(ఆదివారం) బ్యాంకాక్‌లో జరిగిన 19వ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల(ఐఫా) కార్యక్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. తుమ్హారి సులు చిత్రం అత్యధికంగా ఆరు కేటగిరీల్లో నామినేట్ కాగా, ఐదు అవార్డులతో తర్వాతి స్థానంలో రాజ్‌కుమార్ రావ్ నటించిన న్యూటన్ నామినేట్ అయ్యింది. పెద్ద చిత్రాలేవీ అవార్డులను కొల్లగొట్టకపోగా.. చిన్న చిత్రాలు సత్తా చాటాయి. అవార్డుల విషయానికొస్తే... ఉత్తమ చిత్రంగా తుమ్హారి సులు, ఉత్తమ దర్శకుడిగా సాకేత్ చౌదరి(హిందీ మీడియం), ఉత్తమ నటిగా మామ్ చిత్రానికి గానూ దివంగత నటి శ్రీదేవి(భర్త బోనీకపూర్ అందుకున్నారు), ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్ ఖాన్(హిందీ మీడియం) అవార్డులు దక్కించుకున్నారు. అవార్డుల పూర్తి జాబితా... ఉత్తమ చిత్రం- తుమ్హారి సులు ఉత్తమ దర్శకుడు- సాకేత్ చౌదరి(హిందీ మీడియం) ఉత్తమ నటుడు- ఇర్ఫాన్ ఖాన్ (హిందీ మీడియం) ఉత్తమ నటి-శ్రీదేవి(మామ్) ఉత్తమ సహయ నటుడు-నవాజుద్దీన్ సిద్ధిఖీ (మామ్) ఉత్తమ సహయ నటి-మెహర్ వీఐజే (సీక్రెట్ సూపర్‌స్టార్) ఉత్తమ కథ- న్యూటన్ చిత్రం(అమిత్ వీ మసూర్కర్) ఉత్తమ సంగీత దర్శకుడు -అమాల్ మాలిక్, తనిష్క్ బాగ్చి, అఖిల్ సచ్దేవ-బద్రీనాథ్ కీ దుల్హానియా బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ -ప్రీతమ్ (జగ్గా జసూస్ చిత్రానికి) బెస్ట్ స్క్రీన్ ప్లే -నితీశ్ తివారీ, శ్రేయస్ జైన్ (బరేలీ కీ బర్ఫీ) ఉత్తమ కొరియోగ్రఫీ-విజయ్ గంగూలీ, రూలె దౌసన్ వరిందని (జగ్గా జసూస్ చిత్రంలోని గల్తీ సే మిస్టేక్ పాటకు) ఉత్తమ డైలాగులు-హితేష్ కేవల్య(సుభ మంగళ్ సావధాన్) ఉత్తమ సినిమాటోగ్రఫీ-మార్కిన్ లస్కవైక్, యూఎస్సీ(టైగర్ జిందా హై చిత్రానికి గానూ...) ఉత్తమ ఎడిటింగ్- శ్వేత వెంకట్ మాథ్యూ (న్యూటన్) ఉత్తమ సింగర్(మహిళా)- మేఘనా మిశ్రా(సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రంలోని మైన్ కౌన్ హూ పాటకు) ఉత్తమ సాహిత్యం - మనోజ్ ముంటషిర్ (బాద్షావో చిత్రంలోని మెరే రష్కే ఖమర్ పాటకు...) ఉత్తమ సింగర్ (మేల్)- అర్జిత్ సింగ్( జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రంలోని హవాయెన్ పాటకు) ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ - కోంకణ్ సేన్ శర్మ అవుట్‌స్టాండింగ్ అఛీవ్మెంట్ అవార్డు- సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఉత్తమ స్టైల్ ఐకాన్- నటి కృతి సనన్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు - ఎన్వై వీఎఫ్‌ఎక్స్‌వాలా (ప్రసాద్ వసంత్ సుటార్ -జగ్గా జసూస్ చిత్రం) ఉత్తమ సౌండ్ డిజైన్ - దిలీప్ సుబ్రమణియమ్-గణేశ్ గంగాధరన్(వైఆర్ఎఫ్ స్టూడియోస్).. టైగర్ జిందా హై చిత్రం ఇక ఈవెంట్ మధ్యలో రణ్‌బీర్ కపూర్, వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, లూలియా వంటూర్, కృతి సనన్, బాబీ డియోల్, అర్జున్ కపూర్ తమ ఫెర్ఫార్మెన్స్‌తో ఆహతులను ఆకట్టుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సీనియర్ నటి రేఖ స్టేజీపై నృత్య ప్రదర్శన ఇవ్వటం కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచింది.