బాలీవుడ్ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ (ఐఫా) వేడుక అబుదాబిలో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి షారుక్ ఖాన్, కరణ్ జోహార్, విక్కీ కౌశల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మొదటిరోజు దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన సినిమాలు, సినీ ప్రముఖులకు అవార్డులు అందించారు. రెండోరోజు బాలీవుడ్ సినిమాలకు సంబంధించి అవార్డ్స్ అందించారు. అయితే, బాలీవుడ్ విభాగంలో తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా సత్తా చాటింది. కానీ, జవాన్ సినిమాకు గాను షారుక్ ఖాన్‌కు ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కింది. అయితే, సౌత్ ఇండియా నుంచి ఉత్తమ చిత్రంగా జైలర్ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా నాని (దసరా) అవార్డ్ అందుకున్నారు. అయితే, నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ చిత్రానికి పలు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి.
ఐఫా 2024 విజేతలు (సౌత్ ఇండియా)
ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా- మెగాస్టార్ చిరంజీవి
ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా – ప్రియదర్శన్
ఐఫా వుమెన్ ఆఫ్‌ది ఇయర్ – సమంత
ఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు – బాలకృష్ణ
ఐఫా ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టి
ఉత్తమ చిత్రం (తమిళం) - జైలర్
ఉత్తమ చిత్రం (తెలుగు)- దసరా
ఉత్తమ నటుడు (తెలుగు)- నాని (దసరా)
ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – బ్రహ్మానందం(రంగమార్తాండ)
ఉత్తమ నటి (తమిళం) – ఐశ్వర్యారాయ్ (పీఎస్ 2)
ఉత్తమ విలన్ (తెలుగు) - షైన్ టామ్ (దసర)
ఉత్తమ విలన్ (తమిళం) - ఎస్‌జే సూర్య (మార్క్ ఆంటోనీ)
ఉత్తమ విలన్ (కన్నడ) - జగపతి బాబు
ఉత్తమ విలన్ (మలయాళం) – అర్జున్ రాధాకృష్ణన్
ఉత్తమ దర్శకుడు (తమిళం) – మణిరత్నం (పీఎస్ 2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి
ఉత్తమ నటి (కన్నడ) – రుక్మిణి (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)
ఉత్తమ నటుడు (కన్నడ) – రక్షిత్ శెట్టి (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)
ఉత్తమ సహాయ నటుడు (తమిళం) – జయరామ్ (పీఎస్ 2)
ఉత్తమ లిరిక్స్ – జైలర్ (హుకుం)
ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) – ఏఆర్ రెహమన్ (పీఎస్ 2)
ఉత్తమ నేపథ్య గాయకుడు – చిన్నంజిరు (పీఎస్ 2)
ఉత్తమ నేపథ్య గాయని – శక్తిశ్రీ గోపాలన్ (పీఎస్ 2)
ఐఫా 2024 విజేతలు (బాలీవుడ్)
ఉత్తమ చిత్రం : యానిమల్
ఉత్తమ దర్శకుడు: విదు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ నటుడు: షారుక్ ఖాన్ (జవాన్)
ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)
ఉత్తమ సహాయ నటుడు: అనిల్ కపూర్ (యానిమల్)
ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ )
ఉత్తమ విలన్: బాబీ డియోల్(యానిమల్)
ఉత్తమ సంగీతం: యానిమల్
ఉత్తమ లిరికల్స్: యానిమల్ (సిద్ధార్థ్-గరిమే, సత్రన్యాగ)
ఉత్తమ గాయకుడు: భూపిందర్ బబ్బల్, అర్జన్ వ్యాలీ (యానిమల్)
ఉత్తమ గాయని: శిల్పారావు (చెలియా-జవాన్)
ఉత్తమ కథ: రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ
అచీవ్‌మెంట్ ఆన్ కంప్లీటింగ్ 25 ఇయర్స్ ఇన్ సినిమా : కరణ్ జోహార్
Comments
Please login to add a commentAdd a comment