ఐఫా విజేతలు వీరే..! | iifa Awards winners list | Sakshi
Sakshi News home page

ఐఫా విజేతలు వీరే..!

Published Sun, Jul 16 2017 12:13 PM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

ఐఫా విజేతలు వీరే..!

ఐఫా విజేతలు వీరే..!

బాలీవుడ్ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ (ఐఫా) వేడుక న్యూయార్క్ లో ఘనంగా జరుగుతోంది. బాలీవుడ్ తారాలోకం అంతా పాల్గొంటున్న ఈ షోలో అలియా భట్, కత్రినా కైఫ్, వరుణ్ ధావన్, ఏఆర్ రెహమాన్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్, కరణ్ జోహార్ లు వ్యాఖ్యతలుగా వ్యవహరిస్తున్నారు. అందరూ ఊహించినట్టుగానే ధోని, పింక్, నీర్జా చిత్రాలు అవార్డుల పంట పండించాయి. ఇప్పటి వరకు ప్రకటించినా విజేతల వివరాలు...

ఉత్తమ దర్శకుడు : అనిరుద్ధా రాయ్ చౌదరి (పింక్)
ఉత్తమ సహాయ నటుడు : అనుపమ్ ఖేర్ (ఎమ్ ఎస్ ధోని : అన్టోల్డ్ స్టోరీ)
ఉత్తమ సహాయ నటి : షభానా అజ్మీ(నీర్జా)
ఉత్తమ ప్రతినాయకుడు : జిమ్ స్రభ్(నీర్జా)
ఉత్తమ హాస్యనటుడు : వరుణ్ ధావన్ (ఢిష్యుం)
ఉత్తమ సంగీత దర్శకుడు : ప్రీతం ( ఏ దిల్ హై ముష్కిల్)
ఉత్తమ గాయకుడు : అమోత్ మిశ్రా ( బుల్లయ - ఏ దిల్ హై ముష్కిల్)
ఉత్తమ గాయని : కనీకా కపూర్ ( దా దా దాస్సే - ఏ దిల్ హై ముష్కిల్), తులసీ కుమార్ (సోచ్ నా సకే - ఎయిర్లిఫ్ట్)
ఉత్తమ తొలి చిత్ర నటుడు : దిల్జిత్ దొసాంజ్ ( ఉడ్తా పంజాబ్)
ఉత్తమ తొలి చిత్ర నటి : దిశా పటానీ (ఎమ్ ఎస్ ధోని : అన్టోల్డ్ స్టోరీ)
ఉత్తమ కథ : శకున్ బాట్రా, అయేషా (కపూర్ అండ్ సన్స్)
స్టైల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ : అలియా భట్
ఉమెన్ ఆఫ్ ద ఇయర్ : తాప్పీ పన్ను (పింక్)
25 ఏళ్లుగా భారతీయ సంగీతాన్ని సేవలందిస్తున్న ఏఆర్ రెహమాన్కు స్పెషల్ జ్యూరి అవార్డ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement