
హీరో నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. లెక్కప్రకారం శుక్రవారం రావాలి కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల ప్రీమియర్లు వేయగా స్పందన బాగా వచ్చింది. పోక్సో కేసు గురించి చర్చిస్తూ తీసిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా గురించి అప్పుడే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ)
సరే 'కోర్ట్' మూవీ గురించి కాసేపు పక్కనబెడితే ఇంతకుముందు కూడా ఇలా కోర్ట్ బ్యాక్ డ్రాప్ కథలతో పలు అద్భుతమైన సినిమాలు వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైనవి ప్రస్తుతం పలు ఓటీటీల్లో ఉన్నాయి. అలాంటి వాటిలో టాప్-10 గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
జై భీమ్ - సూర్య స్వయంగా నటించి, నిర్మించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులోనే ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీశారు. చూస్తుంటే అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది.
పింక్ - తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో దీన్ని రీమేక్ చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి చెడగొట్టేశారు. హిందీలో తీసిన ఒరిజినల్ మూవీ 'పింక్'. చూస్తే మాత్రం మంచి హై ఇస్తుంది. హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ ఉంది.

ముల్క్ - హిందీలో తీసిన అవార్డ్ విన్నింగ్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ. టెర్రరిస్టుల వల్ల ఓ ముస్లిం కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందనేదే స్టోరీ. అమెజాన్ ప్రైమ్ లో హిందీలో చూడొచ్చు.
నెరు - తెలుగులో డబ్ అయిన మలయాళ మూవీ ఇది. ఓ అంధురాలిపై అత్యాచారం జరుగుతుంది. అసలు అవకాశమే లేని చోట.. నిందితుడిని ఎలా శిక్షించారనేదే స్టోరీ. మోహన్ లాల్, ప్రియమణి ఉంటారు. హాట్ స్టార్ లో తెలుగులోనే ఉంది.
జనగణమన - కోర్ట్ రూం డ్రామాల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఒక్కో ట్విస్టు రివీల్ అయ్యే టైంలో మతిపోతుంది. పృథ్వీరాజ్ యాక్టింగ్ కేక. నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోనే చూడొచ్చు.
ఓ మై గాడ్ 2 - సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ముఖ్యమో చెప్పే సినిమా. కోర్ట్ సీన్స్ బాగుంటాయి. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది.
సెక్షన్ 375 - రేప్ కేసు, దీన్ని ఎలా చెడు కోసం ఉపయోగించుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తీశారు. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లో హిందీలో సినిమా చూడొచ్చు.
జాలీ ఎల్ఎల్ బీ - ఓ సాధారణ లాయర్.. బాగా వైరల్ అయిన ఓ హిట్ అండ్ రన్ కేసుని వాదిస్తాడు. అవతల పేరు మోసిన లాయర్. చివరకు ఏమైందనేదే స్టోరీ. హిందీలో హాట్ స్టార్ లో ఉంది.
నాంది - అల్లరి నరేశ్ కమ్ బ్యాక్ మూవీ ఇది. చేయని నేరానికి జైలుపాలైన ఓ సామాన్యుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కోర్టులో వాదనలు ఎలా జరిగాయనేదే స్టోరీ. హాట్ స్టార్ లో తెలుగులోనే ఉంది.
బంగారు తల్లి - 15 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ ని ఓపెన్ చేసి, కోర్ట్ లో వాదోపవాదాలు జరుగుతాయి. ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామాలో జ్యోతిక లాయర్. ఆహా ఓటీటీలో తెలుగులోనే చూడొచ్చు.
(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్)

Comments
Please login to add a commentAdd a comment