pink
-
ఓటీటీలో టాప్-10 కోర్ట్ రూమ్ మూవీస్.. ప్రతి క్షణం థ్రిల్లో థ్రిల్
హీరో నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. లెక్కప్రకారం శుక్రవారం రావాలి కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల ప్రీమియర్లు వేయగా స్పందన బాగా వచ్చింది. పోక్సో కేసు గురించి చర్చిస్తూ తీసిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా గురించి అప్పుడే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ)సరే 'కోర్ట్' మూవీ గురించి కాసేపు పక్కనబెడితే ఇంతకుముందు కూడా ఇలా కోర్ట్ బ్యాక్ డ్రాప్ కథలతో పలు అద్భుతమైన సినిమాలు వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైనవి ప్రస్తుతం పలు ఓటీటీల్లో ఉన్నాయి. అలాంటి వాటిలో టాప్-10 గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.జై భీమ్ - సూర్య స్వయంగా నటించి, నిర్మించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులోనే ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీశారు. చూస్తుంటే అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది.పింక్ - తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో దీన్ని రీమేక్ చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి చెడగొట్టేశారు. హిందీలో తీసిన ఒరిజినల్ మూవీ 'పింక్'. చూస్తే మాత్రం మంచి హై ఇస్తుంది. హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ ఉంది. ముల్క్ - హిందీలో తీసిన అవార్డ్ విన్నింగ్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ. టెర్రరిస్టుల వల్ల ఓ ముస్లిం కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందనేదే స్టోరీ. అమెజాన్ ప్రైమ్ లో హిందీలో చూడొచ్చు.నెరు - తెలుగులో డబ్ అయిన మలయాళ మూవీ ఇది. ఓ అంధురాలిపై అత్యాచారం జరుగుతుంది. అసలు అవకాశమే లేని చోట.. నిందితుడిని ఎలా శిక్షించారనేదే స్టోరీ. మోహన్ లాల్, ప్రియమణి ఉంటారు. హాట్ స్టార్ లో తెలుగులోనే ఉంది.జనగణమన - కోర్ట్ రూం డ్రామాల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఒక్కో ట్విస్టు రివీల్ అయ్యే టైంలో మతిపోతుంది. పృథ్వీరాజ్ యాక్టింగ్ కేక. నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోనే చూడొచ్చు.ఓ మై గాడ్ 2 - సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ముఖ్యమో చెప్పే సినిమా. కోర్ట్ సీన్స్ బాగుంటాయి. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది.సెక్షన్ 375 - రేప్ కేసు, దీన్ని ఎలా చెడు కోసం ఉపయోగించుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తీశారు. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లో హిందీలో సినిమా చూడొచ్చు.జాలీ ఎల్ఎల్ బీ - ఓ సాధారణ లాయర్.. బాగా వైరల్ అయిన ఓ హిట్ అండ్ రన్ కేసుని వాదిస్తాడు. అవతల పేరు మోసిన లాయర్. చివరకు ఏమైందనేదే స్టోరీ. హిందీలో హాట్ స్టార్ లో ఉంది. నాంది - అల్లరి నరేశ్ కమ్ బ్యాక్ మూవీ ఇది. చేయని నేరానికి జైలుపాలైన ఓ సామాన్యుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కోర్టులో వాదనలు ఎలా జరిగాయనేదే స్టోరీ. హాట్ స్టార్ లో తెలుగులోనే ఉంది.బంగారు తల్లి - 15 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ ని ఓపెన్ చేసి, కోర్ట్ లో వాదోపవాదాలు జరుగుతాయి. ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామాలో జ్యోతిక లాయర్. ఆహా ఓటీటీలో తెలుగులోనే చూడొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్) -
‘బైక్ పింక్ సర్వీస్': ఓన్లీ మహిళా డ్రైవర్లే..!
ఒకరోజు శ్రీరంజనికి తప్పనిసరి పరిస్థితుల్లో బైక్ ట్యాక్సీ బుక్ చేయాల్సి వచ్చింది. పురుష డ్రైవర్ వెనుక కూర్చొని ప్రయాణించడానికి ఆమె పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. ‘ఎవరైనా చూస్తారేమో...ఏమైనా అనుకుంటారేమో’ ‘ఈ డ్రైవరు ఉన్నట్టుండీ అసభ్యంగా ప్రవర్తిస్తాడేమో...’ ఇలా ఎన్నో ఆలోచనలతో ఆమె ప్రయాణం అత్యంత భారంగా గడిచింది. ఇప్పుడు శ్రీరంజనిలాంటి మహిళలకు బైక్ ట్యాక్సీ ప్రయాణం భారం కాబోదు...‘పింక్’ యాప్‌లో బుక్ చేసుకుంటే మహిళా డ్రైవర్లు మాత్రమే వస్తారు. ‘పింక్’ ద్వారా మహిళల సౌకర్యం, భద్రతా అనేది ఒక కోణం అయితే ఎంతోమంది మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారనేది మరో కోణం. చెన్నై నగరంలో ఎంటీసీ బస్సులు, ఎలక్ట్రిక్ రైళ్లు, ఎంఆర్టీఎస్ రైళ్లు, మెట్రో రైలులాంటి రవాణా సేవలు ఉన్నా, ఆటో, ట్యాక్సీల మీద ఆధారపడే ప్రయాణీకులు కూడా ఎక్కువే. ఆయా సంస్థల యాప్‌లలో బైక్ టాక్సీ కోసం బుక్ చేస్తే పురుషు డ్రైవర్లే ఎక్కువగా వచ్చేవారు. వారి వెనుక కూర్చుని ప్రయాణించడం మహిళలకు అసౌకర్యంగా ఉండేది. ఈ నేపథ్యంలో ‘పింక్’ బైక్‌లు వారి చింతను దూరం చేసి నిశ్చింతగా ప్రయాణం చేసేలా చేస్తున్నాయి. ప్రముఖ బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ‘ర్యాపిడో’ చెన్నైౖలో ‘బైక్ పింక్’ను ప్రారంభించింది. ‘బైక్ పింక్ సర్వీస్ అనేది మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించాం. ఇది మహిళా ప్రయాణికులకు భద్రతను ఇవ్వడమే కాదు, ఎంతో మంది మహిళలకు డ్రైవర్లుగా ఉపాధిని ఇస్తుంది’ అని ‘ర్యాపిడో’ ప్రకటించింది. మహిళా డ్రైవర్లను ‘వుమెన్ కెప్టెన్’గా వ్యవహరిస్తారు. ర్యాపిడోతోపాటు ఉబర్, వోలలాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీల ద్వారా మహిళలు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు.అనకాపుత్తూరుకు చెందిన మంగ ఉమెన్ కెప్టెన్. ఆమెకు ఐదేళ్ల కుమార్తె ఉంది. పాపను ఉదయం స్కూల్‌కు బైక్‌పై డ్రాప్ చేసిన తర్వాత ఆమె పని మొదలవుతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు బైక్ రైడింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత ఇంటి పనుల్లో నిమగ్నమైపోతుంది. కొన్నిసార్లు రాత్రి 9 గంటల వరకు బైక్ రైడింగ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో పాపను తన తల్లి ఇంటి దగ్గర వదలి పెట్టి వస్తుంది. తొమ్మిది గంటలకు రైడింగ్ యాప్‌ను ఆఫ్ చేస్తుంది. ఒక క్లాత్‌స్టోర్‌లో పనిచేసిన శ్వేత జీతం సరిపోకపోవడంతోబైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. రోజుకు రూ. 1000 వరకు సంపాదిస్తోంది. ‘మొదట్లో నేను చేయగలనా? అని భయపడ్డాను. ఎంతోమంది ఉమెన్ బైక్ ట్యాక్సీ డ్రైవర్లతో మాట్లాడాను. వారు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు’ అంటుంది శ్వేత. ఇక మహిళా డ్రైవర్ల దారి రహదారేనా! కావచ్చేమో కాని... ఆ దారిలో రకరకాల అడ్డంకులు వస్తుంటాయి. ‘ఒక ప్రయాణికుడు కావాలని పద్నాలుగు సార్లు నా బైక్ బుక్ చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి సంస్థకు ఫిర్యాదు చేస్తే తక్షణం అతడి ఖాతాను రద్దు చేశారు’ అంది ఒక మహిళా డ్రైవర్. ‘డ్రైవింగ్ సమయంలో మేము అభద్రతగా ఫీల్ అయితే సంస్థకు ఫిర్యాదు చేసే, పోలీసులను సంప్రదించే వీలు ఉంది’ అంటుంది మరో మహిళా డ్రైవర్. కొందరు పురుష ప్రయాణికులు మహిళా డ్రైవర్‌ను చూడగానే తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. ‘డ్రైవర్ మహిళ అనే విషయం తెలియక బుక్ చేశాను. సారీ’ అంటూ ప్రయాణాన్ని ఆకస్మికంగా రద్దు చేసుకుంటున్నారు. మహిళలు సరిగ్గా డ్రైవ్ చేయరనేది అనేది వారి అపోహ. ఇలాంటి అపోహల అడ్డుగోడలను కూల్చేస్తూ, లింగ వివక్షతను సవాలు చేస్తూ విమెన్ కెప్టెన్ల బండి వేగంగా దూసుకుపోతోంది.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై (చదవండి: అగ్గిపుల్లలాంటి ఆడపిల్లకు ఫైర్‌తో భయం ఏమిటి..?) -
Krithi Shetty: పింక్ కలర్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న కృతి శెట్టి (ఫోటోలు)
-
Aditi Rao Hydari: పింక్ డ్రస్‌లో మెరిసిపోతున్న అదితీ రావ్ హైదరీ (ఫొటోలు)
-
Tejaswini Gowda: తేజు అందాన్ని రెట్టింపు చేసేది ఆ నవ్వే! (ఫోటోలు)
-
అమ్మ బాబోయ్.. యాంకర్ రష్మీ అందాల అరాచకం చూశారా! (ఫోటోలు)
-
Shraddha Kapoor: పింక్ డ్రెస్‌లో అదరగొట్టిన సాహో హీరోయిన్ (ఫోటోలు)
-
ఐఫోన్ ఫింగర్ అంటే ఏంటీ? ఇది ప్రమాదకరమా..?
స్మార్ట్ ఫోన్ అడిక్షన్తో పలు సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పిల్లలను వాటికి అడిక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు కూడా. కానీ ఇప్పుడు ఏకంగా వాటి వాడకం వల్లే వేళ్ల సంబంధ సమస్యలొస్తున్నాయంటూ పలువురు ఊదరగొడుతున్నారు. నిపుణులు మాత్రం అది సాధారణ సమస్య అని కొట్టిపారేస్తున్నారు. ఈస్మార్ట్ ఫోన్లను అలా ఉపయోగిస్తేనే సమస్యలు వస్తాయంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు వైద్యులు. మరీ ఇంతకీ ఏంటీ ఐఫోన్ ఫింగర్..ఐఫోన్ ఫింగర్ అంటే..ఐఫోన్ ఫింగర్"ని "స్మార్ట్‌ఫోన్ పింకీ" అని కూడా అంటారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు పెద్దపెద్ద సైజుల్లో వస్తున్నాయి. వాటిని అరచేతిలో పట్టుకునేటప్పుడు ఫోన్ కింద చిటికెన వేలుతో నొక్కి పట్టుకోవడం సహజం. కానీ అలా గంటల తరబడి చిటికెన వేలు మీద భారం పడటం వల్ల, వేలు వంకరపోతోందని ఆందోళన చేస్తున్నారు కొందరూ. దీన్నే 'స్మార్ట్ ఫోన్ పింకీ' లేదా 'ఐఫోన్ ఫింగర్' అని అంటారు. ఈ ఆపిల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నప్పుడు భారం చిటికెన వేలుపై పడటంతో ఉంగరం వేలుకి దీనికి గ్యాప్ రావడం లేదా వంకరపోవడం వంటివి జరుగుతున్నాయని పలువురు టెక్ ఔత్సా హికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇది సాధారణ సమస్యే అని కొట్టిపారేస్తున్నారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌కి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పీటర్ ఎవాన్స్ చిటికెన వేళ్ల మధ్య గ్యాప్‌లు, వంకరపోవడానికి అదే కారణమని చెప్పలేమని అన్నారు. దీన్ని సాధారణ పింకీ అనాటమీ(చిటికెన వేలు సమస్య)గా చెబుతున్నారు. అలాగే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఏప్రిల్ హిబ్బెలర్, రోలినాకు చెందిన హ్యాండ్ సర్జన్ డాక్టర్లిద్దరు సదరు సర్జన్ డాక్టర్ ఎవాన్స్ మాటలతో ఏకీభవించారు. ఐఫోన్, స్మార్ట్ పోన్ల వల్లే ఇది వస్తుందని అధికారిక నిర్థారణ కాలేదని అన్నారు. కానీ వారంతా ఫోన్‌కు సంబంధించిన కొన్ని అనారోగ్య పరిస్థితుల గురించి హెచ్చరించారు. అవేంటంటే..ఫోన్ సంబంధిత వైద్య పరిస్థితులుస్మార్ట్ వాడకం వల్ల "స్మార్ట్‌ఫోన్ ఎల్బో" వస్తుందని అన్నారు. వైద్యపరంగా దీన్ని క్యూబిటల్ టన్నెల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. టక్స్ట్ టైప్ చేయడానికి ఎక్కువ వ్యవధిలో మోచేతిని 90 డిగ్రీలకు మించి వంచితే ఇది వస్తుందని వివరించారు. బహుశా ఇదే చిటికెన వేలుపై వస్తున్న మార్పులకు సంకేతాలు కూడా కాడొచ్చని అన్నారు. అందువల్లే నరాలు దెబ్బ తిని ఇలా చిటికెన వేలు వంకరపోవడం లేదా గ్యాప్ రావడం జరగుతుండవచ్చు అని అన్నారు. విపరీతంగా బొటనవేలుతో టెక్స్టింగ్ చేసేవాళ్లు మెడ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని స్మార్ట్ ఫోన్ వినియోగదారులను కోరారు. రోజంతా బొటనవేలుతో స్వైపింగ్, టైప్ చేయడం వంటివి చేస్తే ఈ సమస్యలు అధికమవుతాయని, పైగా అంతర్గతంగా ఆర్థరైటిస్ వంటి సమస్యలను తీవ్రతరం చేసి బొటనవేలు స్నాయువులలో కొత్త సమస్యలను కలిగిస్తుందని తెలిపారు. ఇక్కడ మనిషి తల బరువు కనీసం 10 నుంచి 12 పౌండ్లు వరకు ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ చూసేందుకు ఎప్పుడైతే తలను వంచుతామో అప్పుడు ఆ భారం అంతా మెడ కండరాలపై పడుతుంది. ఈ అదనపు ఒత్తిడి కండరాల నొప్పికి దారితీసి ఆర్థరైటీస్ వంటి సమస్యల్లో పెడుతుందని వివరించారు సర్జన్ ఎవాన్స్. (చదవండి: ఆశకు స్ఫూర్తి ఆమె'!..ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు నుంచి విమానం కూలినా..!) -
Kiara Advani: పింక్ ఔట్ఫిట్లో కియారా అద్వానీ.. అదరహో (ఫోటోలు)
-
ఇన్కమ్ ట్యాక్స్ ఓకే.. మీకు ఈ ‘పింక్ ట్యాక్స్’ గురించి తెలుసా?
బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుందార్ షా ‘పింక్ ట్యాక్స్’ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషులు తమ అందం కోసం వినియోగించే ప్రొడక్ట్‌ల ధరల కంటే మహిళల ఉపయోగించే ప్రొడక్ట్‌ల ధరలు ఎక్కువ ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అంతేకాదు ఆ తరహా వస్తువుల్ని కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకారం..లింగ ఆధారిత ధరల అసమానతలు అనేక రంగాలలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అధికం. ఉదాహరణకు, మహిళలకు, పురుషుల కోసం ప్రత్యేకంగా విక్రయించే సబ్బులు, లోషన్లు, డియోడరెంట్ ప్రొడక్ట్‌లు ఉన్నాయి. ఈ అంశాన్ని లేవనెత్తుతూ సోషల్‌మీడియాలో వైరలవుతున్న వీడియోపై మంజుదార్ షా స్పందించారు. ఆ వీడియోని 1.5లక్షల మంది వీక్షించారు. ప్రభుత్వం విధించే పన్నుకాదు పింక్ ట్యాక్స్ అనేది అసలు ప్రభుత్వ పన్ను కాదు. ఇది మహిళలకు విక్రయించబడే వస్తువుల ధరను పెంచే వివక్షతతో కూడిన ధరలను సూచిస్తుంది. Pink Tax! A shameful gender bias that women must respond to by shunning such products! pic.twitter.com/U3ZQm2s7W9 — Kiran Mazumdar-Shaw (@kiranshaw) March 12, 2024 పింక్ టాక్స్ అంటే ఏమిటి? ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసు. మరి ఈ పింక్ ట్యాక్స్ అంటే? ఉదాహరణకు సమ్మర్ సీజన్లో మహిళలు చర్మం పాడవుకుండా పలు స్కిన్ కేర్ ప్రొడక్ట్‌లు వాడుతుంటారు. అలాగే పురుషులు కూడా. అయితే మహిళలు కొనుగోలు చేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్ ధర రూ.100 ఉంటే, పురుషుల స్కిన్ కేర్ ప్రొడక్ట్ దర రూ.80 ఉంటుంది. అంటే పురుషులు - మహిళలు వినియోగించే ధరల మధ్య వ్యత్యాసం. అలా ధరల మధ్య వ్యత్యాసం ఎందుకనే మంజుదార్ షా అడుగుతున్నారు. ఇలా ఒక్క మంజుదార్ షానే కాదు ఐక్యరాజ్య సమితి సైతం పింక్ ట్యాక్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పింక్ ట్యాక్స్‌ను తొలగించాలి మహిళలు ఆర్థిక వ్యవస్థలో పూర్తి, సమాన భాగస్వామ్యాన్ని సాధించేలా పింక్ ట్యాక్స్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. పింక్ టాక్స్ వల్ల ఆర్థిక భారం డబ్ల్యూఈఎఫ్ ప్రకారం.. వివక్షతతో కూడిన ధరల వల్ల మహిళలపై ఆర్థిక భారం పడుతోంది. పురుషుల కంటే మహిళలు తక్కువ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా, పింక్ ట్యాక్స్ విధించే ఉత్పత్తులను కొనుగోలు చేయడం మహిళలపై ఆర్ధిక భారం పెరుగుతోంది. -
లేత గులాబీ చీరలో కుందనపు బొమ్మలా సచిన్ కూతురు!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ముద్దల తనయ సారా టెండుల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటి కప్పుడూ తన లేటెస్ట్ స్టన్నింగ్ లుక్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. అలానే ఈసారి చీర కట్టులో ముగ్ద మనోహరంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అందులో చమీ అండ్ పాలక్ శారీస్ బ్రాండ్‌కి చెందిన పింక్ జార్జెట్ చీరలో తళుక్కుమంది. ఈ చీరకు తగ్గట్టు ఎంబ్రాయిడరీ నెక్ బ్లౌజ్‌తో చాలా అద్భుతంగా కనిపించింది. ఆ ఫ్యాషన్‌కు తగ్గట్టుగా చెవిపోగులు, పాపిడి బోట్టు, మ్యాచింగ్ గాజులతో కుందనపు బొమ్మలా ఉంది. చక్కగా తెలుగింటి వారి ఆడపడుచులా జడ వేసుకుని కనిపించింది. ఆ లేత గులాబి చీరలో ఉన్న మరో అందమైన గులాబీ ఏమో అనేంత అందంగా ఉంది. ఇక సారా ధరించి ఈ లేత గులాబీ జార్జెట్ చీర ధర రూ. 37,000/-. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు సారా మీరు అద్భుతంగా ఉన్నారని ఒకరూ, కళ్లు చెదిరే అందం మీ సొంతం అని మరోకరూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) (చదవండి: 'నా సామిరంగ’ మూవీ హీరోయిన్ చుడిదార్‌లో లుక్ మాములుగా లేదుగా!) -
ఏసీబీ అధికారులు గులాబీ రంగు సీసా: ఈ లాజిక్ ఏంటో తెలుసా?
సాధారణంగా కొంతమంది ప్రభుత్వ అధికారులు, కొందరు ఉద్యోగులు, సిబ్బంది లంచాలు తీసుకుంటూ పట్టుబడిన కథనాలు చూస్తూఉంటాం కదా. ఈ సమయంలో కరెన్సీ నోట్లతో పాటు పింక్ రంగులో ద్రావణం ఉండే సీసాలను కూడా ఉంచుతారు అధికారులు. అవేంటో వాటి కథ ఏంటో ఎపుడైనా ఆలోచించారా? అయితే అసలు ఆ సీసాలు ఏమిటి? అందులో పింక్ రంగులో ద్రావణం ఎందుకు ఉంటుంది ? దానికి లంచానికి సంబంధం ఏమిటి ? ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజల కోసంపనిచేయాల్సిన కొందరు అక్రమార్కులు లంచం ఇస్తేనే పని స్థాయికి దిగజారుతారు. లబ్దిదారులు, బాధితులకు అందాల్సినవి అందకుండా, చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తూ జలగల్లా పీడించుకు తింటారు. నిజానికి లంచం తీసుకోవడం, ఇవ్వడమూ రెండూ నేరమే. కానీ కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా, వాళ్లకు ఎంతోకొంత ముట్టజెప్పి తమ పని కానిచ్చుకుంటారు. కానీ కొంతమంది అలాకాదు. అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదిస్తారు. వారికి ఫిర్యాదు చేస్తారు. ఈ మేరకు లాంచావతార ఉద్యోగుల ఆటకట్టించేందుకు అవినీతి నిరోధక శాఖ (యాంటీ కరప్షన్ బ్యూరో) రంగంలోకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని శిక్షించడమే ఈ శాఖ పని. ఈ క్రమంలోనే ఫిర్యాదు, లేదా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు బాధితులకు ముందుగానే కొన్ని నోట్లిచ్చి వాటిని లంచం డిమాండ్ చేస్తున్న అధికారి లేదా ఉద్యోగికి ఇవ్వమంటారు. అయితే దీనికంటే ముందే ఏసీబీ అధికారులు ఆ కరెన్సీ నోట్లకు ముందుగా ఫినాల్ఫ్తలీన్ అనే పౌడర్‌ను రాస్తారు. నిజానికి ఈ పౌడర్ కళ్లకు కనిపించదు,గుర్తించలేం.ఆ నోట్లను ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వగానే ఏసీబీ ఆఫీసర్లు దాడి చేసి సదరు ఉద్యోగులను అదుపులోకి తీసుకుంటారు. అనంతరం ముందుగా వేసిన వల ప్రకారం వారి దగ్గర్నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంటారు. ఇక్కడే అసలు స్టోరీ మొదలవుతుంది. లంచం తీసుకున్న అధికారి చేతులను సోడియం బైకార్బొనేట్ మిశ్రమంలో ముంచుతారు. అంతకుముందే లంచంగా తీసుకున్న నోట్లకు ఉండే ఫినాల్ఫ్తలీన్ పౌడర్ వారి చేతులకు అంటుకుంటుంది. ఎపుడైతే ఈ ద్రావణంలో చేతులు ముంచుతారో, సోడియం బైకార్బొనేట్ మిశ్రమం కాస్తా పింక్ రంగులోకి మారుతుంది. దీంతో వారు లంచం తీసుకున్నారని ధృవీకరించుకుంటారు. పింక్ రంగులోకి మారిన ఆ మిశ్రమమే కీలక సాక్ష్యంగా ఉంటుంది. -
పెళ్లి చూపులు భామ ధరించిన గూలబీ రంగు చీర ఎంతంటే..
రితు వర్మకు నటన ఒక ప్యాషన్. అందుకే రాశి కన్నా వాసికే విలువ ఇస్తుంది. మంచి పాత్రలతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్ విషయంలో కూడా స్టయిల్ కన్నా సౌకర్యానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇండస్ట్రీలో పనిచేస్తున్నామంటే మన లుక్‌ను పర్ఫెక్ట్గా మెయిన్టేన్ చేయాల్సిందే! అలాగయితేనే ఇండస్ట్రీలో నెగ్గుకురాగలం అంటోంది రితు వర్మ. ఇక ఆమె కంఫర్ట్‌గా ఫీలయ్యే బ్రాండ్స్‌లో ఓ రెండిటి గురించి.. మద్దిన్ మధురిత దత్తా, స్తాంజిన్ డాజిస్.. బిజినెస్ పార్ట్‌నర్సే కాదు మంచి స్నేహితులు కూడా! ఫ్యాషన్ పై వారికి ఉన్న అభిరుచి, ఆలోచనలు ఏకమవడంతో ఇద్దరూ కలసి కెరీర్‌ను స్టార్ట్ చేశారు. ముంబైలోని ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి, 2012లో తమ ఇద్దరి పేరుతోనే ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. ఎక్కువగా చేనేత కళాకారులు నేసిన ఫ్యాబ్రిక్‌నే ఉపయోగిస్తారు. ప్రకృతి నుంచి ప్రేరణ పొందిన, సంప్రదాయ డిజైన్స్‌లో వీరిది పెట్టింది పేరు. ఈ బ్రాండ్ వేర్ ధర కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటుంది. శీతల్ జవేరి జ్యూయెల్స్.. నాటి.. ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో శీతల్ జవేరి జ్యూయెల్స్ ఒకటి. నాణ్యత, నైపుణ్యమే దీని బ్రాండ్ వాల్యూ. సంప్రదాయ నగలతోపాటు మోడర్న్ డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర క్వాలిటీ, డిజైన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఈ శీతల్ జవేరి జ్యూయెల్స్ బ్రాండ్ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: క్యూట్‌లుక్‌తో కట్టిపడేసే కృతి సనన్ ధరించిన గులాబీ రంగు చీర ఎంతంటే..) -
క్యూట్‌లుక్‌తో కట్టిపడేసే కృతి సనన్ ధరించిన గులాబీ రంగు చీర ఎంతంటే..
కృతి సనన్.. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదురయ్యాయి. అయినా ఎక్కడా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే సినిమా చాన్స్‌ల కోసం ట్రై చేశాను, సాధించాను. అందుకే ముందు మనల్ని మనం నమ్మాలి అని చెబుతోంది. ఆమె గ్లామర్‌కే కాదు అభినయానికీ అంతే ప్రాధాన్యం ఇస్తుంది. అందుకు కనిపించే ఉదాహరణ.. ‘మిమీ’ మూవీ. ఆ తపన, అభిరుచి ఆమె ఫ్యాషన్ స్టయిల్లోనూ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఈ బ్రాండ్సే.. మసాబా గుప్తా... మసాబా.. ప్రముఖ నటి నీనా గుప్తా, క్రికెట్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్‌ల కూతురు అని తెలుసు కదా! కానీ పేరెంట్స్ పేరుప్రఖ్యాతులను తన కెరీర్‌కి పునాదిగా మలచుకోలేదు. కేవలం తన క్రియేటివిటీనే పెట్టుబడిగా పెట్టి కీర్తినార్జిస్తోంది. ఇప్పుడున్న టాప్ మోస్ట్ డిజైనర్స్లలో మసాబా గుప్తానే ఫస్ట్. 2009లో ‘హౌస్ ఆఫ్ మసాబా’ పేరుతో బ్రాండ్‌ను ప్రారంభించింది. సృజన, నాణ్యతే బ్రాండ్ వాల్యూగా సాగిపోతోంది. అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తోంది. ఎందరో సెలబ్రిటీలు ఆమె డిజైన్స్‌కు వీరాభిమానులు. ధర కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఇక్కడ కృతి సనన్ ధరించి మసాబా గుప్తా కాస్ట్యూమ్ ధర రూ. 18,000/- కళ్యాణ్ జ్యూయెలర్స్... బంగారు, ముత్యాలు, వజ్రాల వ్యాపారంలో వందేళ్లకు పైగా చరిత్ర గల సంస్థ కళ్యాణ్ జ్యూయెలర్స్. దేశంలోనే కాదు గల్ఫ్, యూరోప్, అమెరికా దేశాల్లోనూ శాఖలను తెరిచింది. స్వచ్ఛత, నాణ్యత, నాజూకైన డిజైన్లే దీని బ్రాండ్ వాల్యూ. ధర ఆభరణాల డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. కళ్యాణ్ జ్యూయెలర్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. దీపిక కొండి (చదవండి: విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్ ధర వింటే షాకవ్వుతారు!) -
హైదరాబాద్ : బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్.. గులాబీ వర్ణంలో కట్టడాల వెలుగులు (ఫోటోలు)
-
Ananya Panday : బీచ్‌లో పింక్ బికినీలో లైగర్ హీరోయిన్ (ఫొటోలు)
-
డేంజర్:వాట్సాప్‌లో పొరపాటున కూడా ఆ లింక్‌ను క్లిక్ చేయొద్దు
వాట్సప్‌లో ఓ కొత్త మోసం వేగంగా వ్యాపిస్తోంది. ఈ వాట్సాప్ పింక్ స్కామ్ ఇప్పటికే చాలా మంది వ్యక్తులను మోసగించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు విభాగాలు, సైబర్ నిపుణులు ఈ మోసాలకు వ్యతిరేకంగా ఇప్పటికే హెచ్చరించారు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ ‘పింక్ రెడ్ అలర్ట్’తో హెచ్చరించింది. ఇంతకీ వాట్సాప్ పింక్ అంటే ఏంటి? ఈ స్కామ్ ఎలా వ్యాపిస్తోంది. మీరు బాధితులైతే ఏం చేయాలి?! తప్పనిసరిగా తెలుసుకోవాలి. పింక్ వాట్సాప్ అంటే..? స్కామర్లు ‘అదనపు ఫీచర్లతో ఉన్న పింక్ వాట్సాప్‌ను డౌన్లోడ్ చేసుకోమని వినియోగదారులకు మెసేజ్‌లు పంపుతారు.’ ఈ యాప్ నిజానికి ప్రమాదకరమైన మాల్వేర్. వాట్సాప్ పింక్‌ని డౌన్లోడ్ చేయడంతో స్కామర్లు ఫోన్ డేటాకు యాక్సెస్ పొందుతారు. దీంతో ఈ యాప్ మన ఫోన్ డేటాను పూర్తిగా దొంగిలించడానికి వీలు కల్పిస్తోంది. బ్యాంక్ వివరాలు, కాంటాక్ట్ నంబర్లు, ఫొటోగ్రాఫ్స్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని స్కామర్లు దొంగిలించి ఉండవచ్చు. అనుమానాస్పద లింక్‌ల పట్ల జాగ్రత్త తెలియని లేదా అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలి. ప్రత్యేకించి అవి కొత్త ఫీచర్లు లేదా హానికరమైన లింక్‌లపై క్లిక్ చేసేలా ఆకట్టుకునే మెసేజ్‌లు ఉంటే అనుమానించాలి. వాట్సాప్ లేదా ఏదైనా ఇతర అధికారిక సంస్థ నుండి వచ్చినట్లు క్లెయిమ్ చేసే మెసేజ్‌ను యాక్సెస్ చేస్తే ముందు దాని ప్రామాణికతను ధ్రువీకరించాలి. సమాచారం చట్టబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వాట్సాప్ వెబ్సైట్, సోషల్‌మీడియా అకౌంట్స్, విశ్వసనీయ వార్తా సమాచారాల నుంచి చెక్ చేయాలి. పేరొందిన యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా మీ మొబైల్ పరికరాన్ని సురక్షితంగా ఉంచచ్చు. ఇవి హానికరమైన యాప్‌లు లేదా లింక్‌లను గుర్తించి అడ్డుకోవడంలో సహాయపడతాయి. వాట్సాప్, ఇతర యాప్‌లను ఎప్పటికప్పుడు తాజా వెర్షన్లకు అప్డేట్ చేయాలి. సేఫ్టీ అప్డేట్ వల్ల బెదిరింపుల నుండి రక్షించుకోవడానికి సహాయపడుతుంది. వాట్సాప్ మీ బ్యాంకింగ్ వివరాల వంటి సెన్సిటివ్ సమాచారాన్ని మెసేజ్‌ల ద్వారా ఎప్పటికీ అడగదు. తెలియని లేదా నమ్మదగని అకౌంట్స్‌తో ఎప్పుడూ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. వాట్సాప్ కూడా రెండు దశల ప్రామాణికతతో ఉంటుంది. దీనిని సెట్ చేసుకోవడానికి పిన్ నంబర్ ఉంటుంది. కొత్త ఫోన్లో మీ ఫోన్ నంబర్ యాక్సెస్ అవ్వాలంటే ఈ పిన్ నెంబర్ అవసరం అవుతుంది. మీ అకౌంట్ సేఫ్టీని మెరుగుపరచడానికి వాట్సాప్ సెట్టింగ్‌లలో ఈ ఫీచర్‌ని ఇప్పుడే ప్రారంభించవచ్చు. వినియోగదారులకు వచ్చే మెసేజ్‌లు ఇలా ఉంటాయి.. ‘న్యూ పింక్’ వాట్సాప్ కొత్త ఫీచర్లతో అధికారికంగా ప్రారంభించారు. న్యూ పింక్ లుక్ కొత్త ఫీచర్లతో మీ వాట్సాప్‌ను ఇప్పుడే అప్డేట్ చేయండి. ఈ కొత్త వాట్సాప్‌ని ఇప్పుడే ప్రయత్నించండి అనే మెసేజ్‌లు వస్తుంటాయి. ఫోన్ హైజాక్ చేసిన వాళ్లు మీ కాంటాక్ట్ నుండి వచ్చే మెసేజ్‌లను కూడా డౌన్లోడ్ చేయవచ్చు. యాప్ నకిలీ వెర్షన్ వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేయడమే కాదు, ఇది యాప్‌ను డౌన్లోడ్ చేయమని మీ పూర్తి కాంటాక్ట్‌లోని జాబితాకు మెసేజ్‌లు కూడా పంపుతుంది. వాట్సాప్ పింక్ అనేది హానికరమైన మాల్వేర్. మొబైల్ ఫోన్లను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ఓ నకిలీ సాఫ్ట్వేర్. ఓటీపీలు, కాంటాక్ట్స్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇతర ఆర్థిక విషయాలతో సహా వినియోగదారుల పరికరాల నుండి పూర్తి సమాచారాన్ని దొంగిలించడానికి హ్యాకర్లు దీనిని ఉపయోగిస్తారు. వ్యక్తులు లింక్‌లు ఓపెన్ చేసినప్పుడు వారి డిజిటల్ పరికరాలలో హానికరమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. థర్డ్–పార్టీ యాప్ స్టోర్లు లేదా APK ఫైల్స్ నుండి ప్రోగ్రామ్‌లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఆపిల్ ఫోన్లో అయితే యాక్సెస్ ఉండదు. వాట్సాప్ పింక్ స్కామ్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. థర్డ్‌పార్టీ యాప్ స్టోర్లు, ఏపీకే ఫైల్స్ ద్వారా ఇది వ్యాపిస్తుంది. తమ అక్రమ కార్యకలాపాలకోసం హ్యాకర్లు ఫోన్ గ్యాలరీలో వ్యక్తిగత ఫొటోలను తీసి, బ్లాక్ మెయిలింగ్‌కు ఉపయోగించుకుంటున్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థలు, చట్టాన్ని అమలు చేసే అధికారులు హెచ్చరిస్తున్నారు. మీ ఫోన్లో వాట్సాప్ పింక్ యాప్ డౌన్లోడ్ చేసి ఉంటే ఇప్పుడే దానిని అన్ ఇన్స్టాల్ చేయండి. ఆ తర్వాత, మీ ఫోన్‌ని బ్యాకప్ చేసి ఫార్మాట్ లేదా రీసెట్ చేయండి. మీరు ఈ వాట్సాప్ పింక్ గురించి ఇతరులకు అవగాహన కల్పించండి. తాజా స్కామ్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకోండి. స్నేహితుల, కుటుంబ సభ్యులతో సమాచారాన్ని పంచుకోండి. అవగాహన పెంపొందించడం ద్వారా ఇతరుల స్కామ్‌ల బారిన పడకుండా మీరు సహాయం చేయవచ్చు. మోసానికి గురైతే బాధితులు జ్టి్ట https://www. cybercrime.gov.in/ పోర్టల్‌లో రిపోర్ట్ చేయవచ్చు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తు.. ‘పింక్ వాట్సాప్’!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ద్వారా ప్రజల నుంచి భారీగా డబ్బు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త మార్గాలను తెరపైకి తెస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల వినియోగదారుల్లో అత్యధికం మంది ఉపయోగించే వాట్సాప్ ద్వారా మాల్వేర్లను చొప్పించే ప్రణాళికను ఇటీవల కాలంలో అమలు చేస్తున్నారు. ఆకుపచ్చ రంగులో కనిపించే వాట్సాప్... సరికొత్త ఫీచర్లతో గులాబీ రంగులో (పింక్) వచ్చిందంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇందుకోసం వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోవాలంటూ సైబర్ నేరగాళ్లు లింక్‌లు పంపుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాధారణ ఎస్ఎంఎస్లతోపాటు వాట్సాప్ మెసేజ్‌ల రూపంలో ఈ లింక్‌లు పంపుతున్నట్లు తెలిపారు. ఎవరైనా ఈ లింక్‌లను క్లిక్ చేసి అది అడిగే అప్డేట్ కోసం ఫోన్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేస్తే ఫోన్లోని ఫొటోలు, కాంటాక్ట్ నంబర్లు, బ్యాంకుల పాస్‌వర్డ్‌ల వంటి వివరాలన్నీ సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఆయా వ్యక్తులు సభ్యులుగా ఉండే వాట్సాప్ గ్రూప్లలోకి ఆటోమేటిక్‌గా పింక్ వాట్సాప్ పేరిట లింక్‌లు షేర్ అవుతాయని పేర్కొన్నారు. కీబోర్డ్ ఆధారిత మాల్వేర్లను పింక్ వాట్సాప్‌లోకి చొప్పించడం ద్వారా బ్యాంకు పాస్‌వర్డ్‌లను తస్కరించి సైబర్ నేరగాళ్లు డబ్బు కొట్టేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పింక్ వాట్సాప్ పేరిట వచ్చిన లింక్‌లను ఓపెన్ చేసి ఎవరైనా ఇన్స్టాల్ చేసుకొని ఉంటే వాటిని వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలని సూచిస్తు న్నారు. అన్ఇన్స్టాల్ చేస్తేనే ఆ నకిలీ లింక్‌లను షేర్ కాకుండా ఆపగలుగుతామని చెబుతున్నారు. ఒకవేళ మనకు తెలిసిన వారి నుంచి ఇలా పింక్ వాట్సాప్ పేరిట ఏవైనా మెసేజ్‌లు వస్తే వారిని వెంటనే అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. -
పింక్ డ్రెస్ లో మతి పోగోడుతున్న ప్రియమణి (ఫోటోలు)
-
పింక్ విల్లా అవార్డ్స్ సీజన్-2 లో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
స్త్రీ శక్తి: లండన్ మ్యూజియానికి పింక్ శారీ!
ఎగరడానికి రెక్కలు సవరించిన కాలం అది. ‘పోనీలే’ అని రాజీపడే జీవులు సమరశంఖం కోసం గొంతు సవరించిన కాలం అది. ‘గులాబీ గ్యాంగ్’ అంటే పోరాట చరిత్ర. ఇప్పుడు ఆ చరిత్ర లండన్ మ్యూజియానికి చేరనుంది. ప్రపంచంలోని ప్రఖ్యాత మ్యూజియంలలో లండన్ ‘డిజైన్ మ్యూజియం’ ఒకటి. ప్రపంచ నలుమూలలకు సంబంధించి భిన్నమైన డిజైన్లకు ఇదో వేదిక. ఈ వేదికపై స్త్రీ శక్తిని ప్రతిఫలించే, ప్రతీకగా నిలిచే గులాబీ రంగు చీర సగర్వంగా రెపరెపలాడనుంది. 2006లో.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాలో ఏ కొద్దిమందో మహిళలలో తప్ప ఎవరూ ప్రశాంతంగా లేరు. పట్టపగలు రోడ్డు మీదికి వెళ్లాలన్నా భయపడే రోజులు. మరోవైపు కట్నపు వేధింపులు, గృహహింస! అలాంటి సమయంలో ‘మనం ఏం చేయలేమా!’ అనే నిస్సహాయతలో నుంచి పుట్టుకు వచ్చిందే గులాబీ గ్యాంగ్! ‘నువ్వు నేను కాదు... మనం’ అనే నినాదంతో బృందంగా ముందుకు కదిలారు. పింక్ శారీని యూనిఫామ్‌గా చేసుకున్నారు. ఈ బృందానికి సంపత్‌పాల్‌దేవి నాయకత్వం వహించింది. పదుల సంఖ్యతో మొదలైన గులాబీ గ్యాంగ్‌లో ఇప్పుడు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది సభ్యులు ఉన్నారు. తాజాగా... లండన్ ‘డిజైన్ మ్యూజియం’ క్యూరేటర్ ప్రియా ఖాన్చందాని నుంచి సంపత్పాల్దేవికి ఇమెయిల్ వచ్చింది. అందులో ఉన్న విషయం సంక్షిప్తంగా...‘ప్రియమైన గులాబీ గ్యాంగ్ సభ్యులకు, మీ ధైర్యసాహసాలకు సంబం«ధించిన వార్తలను ఎప్పటికప్పుడు చదువుతూనే ఉన్నాను. నాకు అవి ఎంతో ఉత్తేజాన్ని, బలాన్ని ఇస్తుంటాయి. మీ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే గులాబీ రంగు చీరను ఆఫ్‌బీట్ శారీ టైటిల్‌తో మ్యూజియంలో ప్రదర్శించాలనుకుంటున్నాం. ఈ అవకాశాన్ని గర్వంగా భావిస్తున్నాము’ ‘మా పోరాట స్ఫూర్తి విదేశీగడ్డపై అడుగు పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. మా సభ్యులలో ఒకరు ధరించిన చీరను పంపబోతున్నాం’ అంటుంది సంపత్‌పాల్‌దేవి. -
గులాబీ కలర్ వేసినందుకు ఏకంగా రూ. 19 లక్షలు జరిమానా
ఇంటి ముందర తలుపులకు ఎలాంటి కలర్లు ఉండాలో కొన్ని దేశాల్లో షరతులు ఉంటాయి. ఆయా దేశాల్లో ఏ కలర్ పడితే అది వేస్తే అక్కడ అధికారులు అంగీకరించారు. ఐతే ఒక మహిళ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటి ముందర తలుపులకు తనకు నచ్చిన రంగు వేసింది. దీంతో సదరు కౌన్సిల్ అధికారులు ఈ విషయమై అభ్యంతర వ్యక్తం చేస్తూ సుమారు 19 లక్షలు జరిమానా విధించారు. ఈ వింత ఘటన స్కాట్లాండ్లో చోటు చేసుకుంటుంది. వివరాల్లోకెళ్తే...స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో ఉన్న మిరాండా డిక్సన్ అనే మహిళ తన ఇంటి ముందర తలుపులకు పింక్(గులాబీ) కలర్ వేసింది. దీంతో ఆ సిటీ కౌన్సిల్ ప్లానర్లు ఈ కలర్‌పై అభ్యంతరరం వ్యక్తం చేస్తూ... తెలుపు రంగు వేయాలని ఆదేశించారు. కానీ ఆ మహిళ మాత్రం తన ఇంటికి ఆ రంగు ఎంతో అందాన్ని ఇచ్చిందని, చూడముచ్చటగా ఉందని చెబుతోంది. ఆమెకు ఈ ఇల్లు 2019లో తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా లభించింది. ఈ ఇంటిని రెండేళ్లపాటు మరమత్తులు చేయించింది. ఐతే చివర్లో ఫినిషింగ్ టచ్‌గా ఇంటి ముందు ఉండే తలుపులకు మాత్రం గూలాబి రంగు వేసింది. యూకేలోని బ్రిస్టల్, నాటింగ్‌హిల్, హారోగేట్ వంటి నగరాల్లో ఇంటి ముందు తలుపులు ముదురు రంగులో ఉంటే నా ఇంటి ముఖ ద్వారం మాత్రం ఇలా భిన్నంగా గులాబీ రంగులో ఉండటం తనకు ఆనందంగా ఉంటుందని చెబుతోంది. అదీగాక చాలామంది తన ఇంటి ముందు ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతుంటారని, చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుందని అంటోంది. అంతేగాదు పలువురు తనకు మద్దతు తెలిపారని, ఈ రంగు చాలా బావుటుందంటూ సిటీ కౌన్సలర్లకు నచ్చచెప్పే ప్రయత్నం కూడా చేసింది. కానీ కౌన్సలర్ ప్లానర్లు మాత్రం ససేమిరా అంటూ తెలుపు రంగు వేయాలని ఆదేశించారు. అంతేగాదు ఒకవేళ తలుపులకు రంగు మార్చనట్లయితే సుమారు రూ. 19 లక్షల వరుకు జరిమాన ఎదుర్కోవాల్సి ఉంటుందని తెగేసి చెప్పారు. (చదవండి: లాక్డౌన్ అంటే హడలిపోతున్న చైనా...కంచెలు, గోడలు దూకి పారిపోతున్న జనం) -
గులాబీ రంగునీళ్లు బాటిలే మెయిన్ ఎవిడెన్స్.. దీని వెనుక కథ తెలుసా?
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): అవినీతి నిరోధక శాఖ(యాంటీ కరప్షన్ బ్యూరో) పలు ఆకస్మిక దాడుల్లో లంచావతారాలను పట్టుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయా అధికారులు లంచాలు తీసుకునే క్రమంలో ముందస్తు పథకం ప్రకారం ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. అయితే ఇలా అవినీతిపరులను పట్టుకున్నప్పుడు కామన్‌గా కనిపించే ఒక ఇమేజ్ ఎప్పుడైనా గుర్తించారా.? అదే కరెన్సీ నోట్లపై గులాబీ రంగు నీళ్ల బాటిళ్లు ఉంచే ఫొటో. అయితే దీని వెనుక కథ ఏంటో ఎప్పుడైనా తెలుసుకోవాలని ప్రయతనించారా? చదవండి: చెంప ఛెళ్లుమనిపించిన మహిళా హెచ్ఎం.. అసలు ఏం జరిగిందంటే? నిజానికి ఈ రంగు నీళ్ల బాటిలే ఆ నేరంలో ప్రధాన సాక్షమని మీకు తెలుసా.? అయితే రండి తెలుసుకుందాం. లంచం డిమాండ్‌తో విసుగుపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించినప్పుడు ఆయనకు ఇవ్వబోయే కరెన్సీ నోట్లకు ఏసీబీ అధికారులు ముందుగా కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఆ నోట్లపై ఫినాప్తలీన్ అనే తెల్లని రసాయన పొడిని ఆ నోట్లపై చల్లి బాధితుడి చేత అవినీతి అధికారికి ఇప్పిస్తారు. బాధితుడి నుంచి అధికారి ఆ నోట్లు తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేస్తారు. లంచగొండి అధికారి తీసుకున్న ఆ నోట్లను గుర్తించి వాటిని తొలుత ఆ అధికారి ఎదుటే చేతులతో తాకుతారు. అనంతరం చేతులను సోడియం కార్బోనేట్‌తో ఓ బౌల్లో కడిగినప్పుడు రసాయన చర్య జరిగి నీళ్లు గులాబీ రంగులోకి మారతాయి. దీంతో ఆ అధికారి లంచం తీసుకున్నట్టు శాస్త్రీయంగా నిర్ధారించడంతో పాటు ఈ ద్రావణాన్ని బాటిళ్లలో సేకరించి నోట్లపై ప్రదర్శిస్తారు. ఆ అవినీతి ఘటనలో ఆ బాటిళ్లలో ద్రావణాన్ని ప్రధాన సాక్షంగా తీసుకుంటారు. -
రంగులు అద్దిన చిత్రం కాదండోయ్.. ప్రకృతి దిద్దుకున్న మనోహర దృశ్యం
ఇది కాన్వాస్‌పై రంగులు అద్దిన చిత్రం కాదు.. వినీలాకాశంపై ప్రకృతి దిద్దుకున్న ముగ్ధ మనోహర దృశ్యం. దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా వద్ద గులాబీ, ఊదా, నారింజ రంగుల మిశ్రమంతో ఆకాశంపై పరుచుకున్న వర్ణమాలిక. అంటార్కిటికాలోని న్యూజిలాండ్ పరిశోధన కేంద్రం టెక్నీషియన్ స్టువర్ట్ షా ఈ చిత్రాలను క్లిక్‌మనిపించారు. గగనతల రంగుల వెనకున్న కారణం విచిత్రమైనదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది జనవరి 15న అంటార్కిటికాకు సుమారు 7 వేల కిలోమీటర్ల దూరంలోని టోంగా దీవుల్లో ఉన్న సముద్రగర్భ అగ్నిపర్వతం బద్దలై ఏకంగా 58కి.మీ. ఎత్తుకు బూడిద, దుమ్ము, ధూళిని ఎగజిమ్మిందని చెప్పారు. దీంతో భూ వాతావరణంలోనే నేటికీ కలియతిరుగుతున్న ధూళి తుంపరల్లో కొన్ని సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో కాంతిని అడ్డుకున్నప్పుడు ఆకాశంలో ఇలా రంగురంగుల దృశ్యాలు కనిపిస్తాయని వివరించారు. ఇప్పటికే ఇలాంటి దృశ్యాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వద్ద గగనతలంపై కనిపించినట్లు చెప్పారు. ఈ అగ్నిపర్వత ధూళి తుంపరలు సుమారు రెండేళ్లపాటు భూ వాతావరణంలో ఉంటాయని పేర్కొన్నారు. చదవండి: India: అత్యధిక బిలియనీర్లు ఏ రంగం నుంచి ఉన్నారో తెలుసా? The sky over Antarctica turned pink due to the January eruption of the Hunga-Tonga-Hunga-Haapai volcano in the Pacific Ocean. pic.twitter.com/AhPwWv0Gp1 — Spriteer (@spriteer_774400) July 17, 2022 -
చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప..!
Rare Pink Hand Fish Spotted In Australia: ఆస్ట్రేలియాలో టాస్మానియన్ తీరంలో తొలిసారిగా అరుదైన చేతులతో నడిచే గులాబీ చేప(పింక్ హ్యాండ్ ఫిష్) కనిపించింది. అయితే ఈ పింక్ హ్యాండ్ ఫిష్‌ను గతంలో 1999లో సముద్రం అడుగున ఈత కొట్టే ఒక డైవర్ గుర్తించారు. అయితే ఇప్పుడు తాజాగా టాస్మానియా దక్షిణ తీరానికి 120 మీటర్ల లోతులో ఈ పింక్ హ్యాండ్ ఫిష్‌ని ఆస్ర్టేలియా పరిశోధకులు గుర్తించినట్లు తెలిపారు. (చదవండి: పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి లక్షల్లో రుణాలు!) ఈ క్రమంలో యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంటార్కిటిక్ అండ్ మెరైన్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్ నెవిల్లే బారెట్ అతని బృందం పగడపు పీతలు, చేప జాతులు గురించి సర్వే చేయడానికి మెరైన్ పార్క్ సముద్రగర్భంలో ఒక కెమెరాను ఉంచింది. అయితే ఆ మెరైన్ స్టడీస్ రీసెర్చ్ అసిస్టెంట్ యాష్లీ బాస్టియాన్సెన్ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నప్పుడు ఆమె ఈ పింక్ హ్యాండ్‌ఫిష్‌ను గుర్తించింది. అంతేకాదు ఆ ఫుటేజ్‌లో ఈ పింక్ ఫిష్ పీతలో దాడి నుంచి తప్పించేకునే నిమిత్తం కంగారుగా వెళ్లుతున్నట్లుగా కనిపించింది. ఈ అత్యధునిక సాంకేతికతో కూడిన కెమెరా తమకు మంచి చిత్రాలతో కూడిన అరుదైన జాతులను గురించి తెలియజేసింది అని ప్రొఫెసర్ బారెట్ అన్నారు. అంతేకాదు ఇలాంటి అరుదైన జాతులు లోతైన ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పరుచుకుంటాయని చెప్పారు. పైగా ఈ పింక్ ఫిష్‌లు అధిక-పరిమాణ చేతులు కలిగి ఉంటాయని అవి సముద్రగర్భం వెంబడి నడవడం, ఈత కొట్టడం వంటివి చేస్తాయని పేర్కొన్నారు. (చదవండి: పూజారి వేషంలో మాదక ద్రవ్యాల వ్యాపారం... 7 కిలోల గంజాయి పట్టివేత!!) -
పింక్ వాట్సాప్'తో జర జాగ్రత్త.. లింక్ క్లిక్ చేస్తే ఇక అంతే..!
రోజు రోజుకి సైబర్ క్రైమ్ భారీన పడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ మధ్య ఫేక్ లింకులు వాట్సాప్ లో ఎక్కువగా తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో లింకు కూడా వైరల్ అవుతుంది. వాట్సాప్ థీమ్‌ను డిఫాల్ట్ ఆకుపచ్చ రంగు నుంచి గులాబీ రంగులోకి మార్చుకోండి అనే లింక్ పేరుతో సందేశం వస్తుంది. అయితే, ఈ లింకులను ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయవద్దు అని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేల ఆ లింక్‌పై క్లిక్ చేస్తే సైబర్ క్రైమినల్స్ మీ ఫోన్‌ను హ్యాక్ చేయవచ్చు. మీరు మీ వాట్సాప్ ఖాతాలో లాగిన్ కావడానికి అవకాశం కోల్పోవచ్చు. అలాగే ఫోన్లోని ఫొటోలు, సందేశాలు, కాంటాక్ట్స్ వంటి సమాచారమంతా సైబర్ కేటుగాళ్ల చేతికి వెళ్లిపోతుందని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రాజశేఖర్ రాజహరియా తెలిపారు. వాట్సాప్ అధికారిక యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాప్‌స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ వోయగర్ ఇన్ఫోసెక్ డైరెక్టర్ జితెన్ జైన్ పేర్కొన్నారు. పింక్ వాట్సాప్, గోల్డ్ వాట్సాప్ తదితర యాప్స్ నకిలీవని తెలిపారు. నకిలీ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: వాట్సాప్ వినియోగదారులకి హెచ్చరిక! -
అబ్బాయిలూ.. ‘ప్రెట్టీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్’
మనసును తాకండి. అందమే అంతా కాదు. అబ్బాయిలూ.. ‘ప్రెట్టీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్’. ఆశల్ని తుంచేయకండి. నవ్వుల్ని ఆర్పేయకండి. అమ్మాయిల్ని.. జబ్బున పడేయకండి. కొత్త కొరియన్ ‘పాప్’! గర్ల్ బ్యాండ్ పాడుతోంది. ప్రపంచం ఇష్టంగా వింటోంది. ‘‘నీ కళ్ల ముందే కూలిపోతున్నా.. పాతాళంలోకి జారిపోతున్నా.. అయినా రెండు చేతులతో నా ఆశను పట్టుకుని పైకి ఎగబాకుతున్నా.’’పాడుతున్నారు ‘బ్లాక్‌పింక్’ గర్ల్స్. ‘‘నన్ను చూడు, నీకు ఏమనిపిస్తోంది?’’ అని.. కొనసాగింపుగా అడుగుతున్నారు జెన్నీ, జిసూ, లిసా, రోజ్. ఎవరిని అడుగుతున్నారు! ఆడపిల్లకు ఆశలు కల్పించి పారిపోయే మగధీరుడొకడు ఉంటాడు కదా, అతడిని. కొరియన్ గర్ల్ పాప్ బ్యాండ్ ‘బ్లాక్‌పింక్’ కొత్త ఆల్బమ్ ‘ది అల్బమ్’ లోని ఎనిమిది పాటల్లో ఒకటైన ‘హౌ యు లైక్ దట్’ లోని కూలిన ఆశల గీతమిది. అక్టోబర్ 2న ఈ నలుగురమ్మాయిల బ్యాండ్ విడుదల చేసిన ‘ది ఆల్బమ్’ అక్టోబర్ 26 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల 20 వేల కాపీలకు పైగా అమ్ముడై చరిత్ర సృష్టించింది. దక్షిణ కొరియా అంటే ఇంతవరకు ఆ ఏడుగురు అబ్బాయిల బి.టి.ఎస్. బాయ్ బ్యాండ్ మాత్రమే. వారే పాప్ హీరోలు, వారే పాప్ కింగులు. ఇప్పుడీ గర్ల్ బ్యాండ్ ‘బ్లాక్‌పింక్’ ధాటికి ఆ ఏడుగురు 2013 నుంచీ నిర్మించుకుంటూ వస్తున్న ‘పాప్’ లోక దుర్భేద్య మహా సామ్య్రాజ్యం బీటలు వారబోతున్న దృశ్యం లీలగా ఆవిష్కృతం కాబోతున్నట్లే ఉంది. బ్లాక్‌పింక్ వరుసగా మూడో వారం ‘బిల్బోర్డ్ 200’ లిస్టులో తొలి పదిస్థానాలలో ఉంటూ వస్తోంది! ‘ది ఆల్బమ్’లోని రెండో ట్రాక్ ‘ది ఐస్ క్రీమ్’! ‘దాహంగా ఉన్నట్లున్నావు.. కొంచెం దగ్గరకు రా..’ అని కోన్ల లా మూతిని తెరిచి మూడు నిముషాల మూడు సెకన్లలో అబ్బాయిల్ని ఫ్రీజ్ చేసేసే బ్లాక్‌పింక్ గర్ల్స్.. మూడో ట్రాక్ ‘ప్రెట్టీ శావేజ్’లో ‘బాయ్స్.. మేం వైలెంట్గానే ఉంటాం. తట్టుకోగలిగితే ఉండండి’ అని కొంచెం రూడ్గానే చెబుతారు. ‘రూడ్ కాదు, అందరికన్నా రూడ్’ అని ఇప్పటికే, ఈ నాలుగేళ్లలో ఈ నలుగురు పిల్లలకు పేరొచ్చేసింది! 2016లో ప్రారంభించారు బ్లాక్‌పింక్ పాప్ బ్యాండ్‌ని. ఈ ఎనిమిది ట్రాక్‌లకు ముందు ఐదు సింగిల్స్ ఉన్నాయి. అసలు వాటితోనే వాళ్లేమిటో చూపించారు. ఆ ఎనర్జీని తట్టుకోవాలంటే మళ్లీ వాళ్ల దగ్గరికే వెళ్లాలి ‘ది ఐస్ క్రీమ్’ కోసం! మొత్తం 174 సౌత్ కొరియన్ గర్ల్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిల్లో పది లక్షల ఆల్బమ్ కాపీలు అమ్ముడై రికార్డు నెలకొల్పిన తొలి బ్యాండ్ ‘బ్లాక్‌పింక్’! ఏమిటి బ్లాక్‌పింక్ అంటే?! ఈ అమ్మాయిలు కల్పించిన అర్థం.. ‘అందమే అంతా కాదు’ అని! అమ్మాయిల్ని అందమైన పింక్ గులాబీతో పోలుస్తాం. ‘అందాన్నే చూడకండి’ అంటూ పింక్‌కి బ్లాక్‌ని జోడించి బ్లాక్‌పింక్ అని తమ బ్యాండ్‌కి పేరు పెట్టుకున్నారు. బ్లాక్‌పింక్ అని కాకుండా, పింక్బ్లాక్ అంటే మళ్లీ అది బ్లాక్‌కి పింక్ అందాన్ని అంటు కట్టినట్లు. అందుకే బ్లాక్‌ని ముందుకు తీసుకున్నారు. తెలివైన అమ్మాయిలే. ‘లవ్సిక్ గర్ల్స్’ ఐదో ట్రాక్. అమ్మాయిల్ని ప్రేమ సతాయింపులు ఎంత జబ్బున పడేస్తాయో చూడండి. ‘ప్రేమ మనల్ని వలపన్ని కిటీకీలు లేని గదిలో బంధించింది. ప్రతిసారీ బాధిస్తోంది. గుండెలు పగిలి ఏడ్చేలా చేస్తోంది. చివరికి ఏడుపు కూడా రానంతగా మొద్దుబారుతున్నాం..’’ అని పాడతారు. ‘బెట్ యు వాన్నా’, ‘క్రేజీ ఓవర్ యు’, ‘లవ్ టు హేట్ మీ’, ‘యూ నెవర్ నో’ మిగతా నాలుగు ట్రాక్స్. ‘ఎక్కడికెళదామో చెప్పు, అన్నీ సర్దుకుని నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను..’ (బెట్ యు వాన్నా), ‘నువ్వంటే నాకు పిచ్చి. నీ మనసులోనూ నేను ఉన్నానని తెలుసు. అయినా కానీ నువ్వు గీసుకున్న గీతను దాటి రానులే’ (క్రేజీ ఓవర్ యు), ‘నెగిటివ్ డేస్, నెగిటివ్ నైట్స్. బేబీ యు ఆర్ వేస్టింగ్ ఆల్ యువర్ టైమ్’ (లవ్ టు హేట్ మీ), ‘నేను ప్రకాశవంతంగా నవ్వుదామని ప్రయత్నించిన రోజు.. చీకటి మరింతగా గాఢమైన నన్ను మింగేయాలని చూస్తుంటుంది ఎందుకనో..’ (యూ నెవర్ నో).. అని జెన్నీ, జిసూ, లిసా, రోజ్.. అమ్మాయిలు ఎంతగా ప్రేమిస్తారో, ఆ ప్రేమ వల్ల అంతగా హర్ట్ అవుతూ ఉంటారని ‘ది అల్బమ్’ ట్రాకులలో పాడతారు. ‘ప్రెట్టీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్’ అని చెబుతారు. అందుకే ‘బ్లాక్‌పింక్’ ఇంతగా హిట్ అయినట్లుంది. -
మానసిక విజయం
సుప్రీంకోర్ట్‌లో చంద్రచూడ్గారికి అసిస్టెంట్గాపనిచేయడమంటే ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను గడించడమే.ముఖ్యంగా ఆ మూడు తీర్పులప్పుడు చేసినపరిశోధనతో చాలా నేర్చుకున్నాను. ఆ చారిత్రాత్మకతీర్పులకు నేను ప్రత్యక్ష సాక్షిని. ఇంతకు మించినఆనందం ఏం ఉంటుంది? ఆ మూడు సందర్భాల్లోకోర్టు హాలులో వినిపించిన చప్పట్లు.. కోర్ట్ బయట మీడియాతో సహా సామాన్య జనం జరుపుకున్నసంబరాలు ఎప్పటికీ మరిచిపోలేను. – మానసి హైదరాబాద్.. 2017 సంవత్సరం.. ఒకరోజు రాత్రి పదిగంటల సమయం.. పని ముగించుకొని ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరారు అడ్వకేట్ మానసి చౌదరి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 దగ్గర సిగ్నల్స్ దగ్గర తన కారును ఎవరో ఢీ కొట్టినట్టని పించింది ఆమెకు. పరిస్థితి అర్థమయ్యేలోపే ఇద్దరబ్బాయిలు కారు దిగి ఆమె కారు దగ్గరకు వచ్చి.. కారు అద్దాలను పగలకొట్టారు విండోస్, రేర్ వ్యూ మిర్రర్స్ సహా. ఈ బీభత్సాన్ని చూసి గట్టిగా అరిచారు మానసి. దాంతో ఆమెకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లిపోయారు ఆ ఇద్దరూ. వాళ్ల కారు నంబర్ ప్లేట్‌ను ఫొటో తీసుకొని షీ టీమ్స్‌కి సమాచారమందించి, దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారామె. తెల్లవారి.. ఆ కుర్రాళ్లిద్దరినీ పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు పోలీసులు. ఆ అబ్బాయిలిద్దరి నుంచి బేషరతుగా క్షమాపణ రాయించుకున్నారు మానసి. ‘నిజానికి వాళ్ల మీద కంప్లయింట్ చేయాలనేమీ అనుకోలేదు. కాని అలాగే వదిలేస్తే.. ఏం చేసినా ఆడవాళ్లు నోరు మెదపరు, ఏం చేసినా చెల్లుతుంది అనే రాంగ్ మెసేజ్ పోతుంది. అందుకే కంప్లయింట్ ఇచ్చా’ అని జరిగిన సంఘటనను ఒకసారి గుర్తు చేసుకున్నారు ఆమె. అసలు ఈ ప్రస్తావన ఇప్పడు ఎందుకు? రాజ్యాంగం మహిళలకు ఇచ్చిన హక్కులు, కల్పించిన సమస్త చట్టాలన్నిటినీ ఒక దగ్గర చేర్చి‘పింక్ లీగల్’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు మానసి, మొన్న ఎనిమిదో తారీఖు.. అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున (8 మార్చి, 2020). ఈ సందర్భమే పైన ప్రస్తావనకు కారణం. ముందు ఆమెను పరిచయం చేసుకుందాం. ఆమె ముంబైలో పుట్టారు.హైదరాబాద్‌లో పెరిగారు. ఢిల్లీలోని జిందాల్ గ్లోబల్ లా కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత హైదరాబాద్ వచ్చేసి హైకోర్ట్ లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. యేడాది తర్వాత అంటే 2018లో మళ్లీ ఢిల్లీ వెళ్లారు సుప్రీంకోర్ట్ లాయర్‌గా అనుభవం గడించడానికి. జస్టీస్ చంద్రచూడ్ అసిస్టెంట్లలో ఒకరిగా చేరారు. ఎల్జీబీటీ సంబంధాలు (ఐపీసీ 377పై సడలింపు) నేరం కాదని, అడల్ట్రీ నేరం కాదని (ఐపీసీ 497), శబరిమల ఆలయంలోకి మహిళలకూ ప్రవేశం ఉండాలని వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుల్లో జస్టీస్ చంద్రచూడ్ కృషి ఉంది. అందులో మానసికీ భాగస్వామ్యం ఉంది. 2019లో మళ్లీ హైదరాబాద్ హైకోర్ట్‌కి వచ్చేశారు ఆమె. పింక్ లీగల్ ఆలోచన.. ‘లా చదువుతున్నప్పుడే అనుకున్నాను.. మహిళలకు సంబంధించిన అన్ని విషయాలను ఒక్కచోటకు చేర్చే ప్రయత్నమేదో చేయాలని. ఆ ఆలోచన హైదరాబాద్ వచ్చాక కూడా కొనసాగింది. అందుకే 2017లో నల్సార్ లా కాలేజ్ స్టూడెంట్స్‌తో కలిసి ఆన్ లైన్ సర్వే ఒకటి చేశాను. తమకున్న హక్కులేంటి? తమకోసం ఎన్ని రకాల చట్టాలున్నాయి? అని ఎంతమంది ఆడవాళ్లు తెలుసు అనే విషయం మీద. 80 శాతం మందికి తెలియదని తేలింది సర్వేలో. ఆశ్చర్యం ఏంటంటే వాళ్లలో చాలామంది చదువుకున్న, పట్టణాలు, నగరాల్లో ఉంటున్న మహిళలే! అప్పుడు అనిపించింది నా ఆలోచనను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆచరణలో పెట్టాలని. అయితే ఇతర బాధ్యతల్లో పడి ఆలస్యమై.. ఇప్పటికి సాధ్యమైంది’ అంటూ పింగ్ లీగల్ నేపథ్యం చెప్పుకొచ్చారు ఆమె. ప్రాంతీయ భాషల్లో కూడా.. ప్రస్తుతం పింక్ లీగల్ ఇంగ్లిష్‌లో ఉంది. త్వరలోనే దేశంలోని ప్రాంతీయ భాషలన్నిటిలోకి అనువదించనున్నారు. ఈ వారం, పదిరోజుల్లోనే రెండువేల మందికి పైగా సబ్‌స్క్రైబ్ చేశారట. వీళ్లలో అబ్బాయిలూ ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులు అంటారామె. ‘చదువురాని, గ్రామీణ ప్రాంతం వాళ్లకూ తేలికగా అర్థమయ్యేలా ఈ హక్కులు, చట్టాలను వివరిస్తూ యూ ట్యూబ్ చానెలూ పెట్టాలనుకుంటున్నాను. నా ఈ ప్రాజెక్ట్‌కు లా స్టూడెంట్స్ సహకారం చాలా ఉంది. మహిళల హక్కులు, చట్టాల మీద మహిళలకే కాదు పురుషులకూ అవగాహన అవసరం. అది హైస్కూల్ స్థాయి నుంచే ఆరంభిస్తే మరీ మంచిది. దీనిని పాఠ్యాంశాల్లో చేర్చాలి’ అంటున్నారు మానసి.– సరస్వతి రమ -
టైటిల్స్ కుదిరాయి
సినిమా ప్రేక్షకుడి దాకా వెళ్లాలన్నా, ప్రేక్షకుడు థియేటర్ దాకా రావాలన్నా ప్రచారం కీలకం. సినిమా ప్రచారంలో మొట్టమొదటి చాప్టర్ సినిమా టైటిల్. పేరు ఎంత బావుంటే, ఎంత క్యాచీగా ఉంటే సినిమాకి అంత ప్లస్సు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ సినిమాలకు టైటిల్స్ ఫిక్స్ అయ్యాయని తెలిసింది. ఆ వివరాలు... ఆచార్య చిరంజీవి చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. సామాజిక అంశాలతో కూడుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కి ‘ఆచార్య’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్‌ని బట్టి గమనిస్తే చిరంజీవి ఈ సినిమాలో ఫ్రొఫెసర్ పాత్రలో కనిపిస్తారని ఊహించవచ్చు. డియర్ ప్రభాస్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ముందు ‘జాన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ‘ఓ డియర్’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అలాగే ‘రాధే శ్యామ్’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారని టాక్. వకీల్ సాబ్ హిందీ చిత్రం ‘పింక్’ తెలుగు రీమేక్‌ను తన రీ ఎంట్రీ కోసం ఎంచుకున్నారు పవన్ కల్యాణ్. ఇందులో లాయర్ పాత్రలో నటిస్తున్నారాయన. ఈ సినిమా కోసం ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ రిజిస్టర్ చేశారట. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మే 15న విడుదల కానుంది. -
పవన్ కల్యాణ్ హీరోయిన్ ఫిక్స్!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వేగం పెంచాడు. రాజకీయాలతో బిజీగా మారడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పవన్.. తాజాగా వరుస సినిమాలతో దూకుడు పెంచాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘పింక్’రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తమిళంలో కూడా హిట్ సాధించిన పింక్ రిమేక్‌ను పవన్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంజలి, నివేదా థామస్, అనన్య పాండేలు నటిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నారట. కాగా, ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే మరో చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లె పనిలో పవన్ ఉన్నట్లు సమాచారం. ఎప్పటినుంచో ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో పవన్ సరసన ‘కంచె’ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేసినట్లు అనధికారిక సమాచారం. చారిత్రక నేపథ్యంతో పాటు ఓ ఎమోషనల్ విప్లవాత్మకమైన పాయింట్‌ను కూడా టచ్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్. అంతేకాకుండా ఈ చిత్రంలో మంచి కోసం పరితపించే ఓ దొంగ పాత్రలో పవన్ నటించనున్నట్లు సమాచారం. ఇక ఈ రెండు చిత్రాలతో పాటు పూరి జగన్నాథ్ చిత్రం కూడా లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల్లోకి పవన్ రీఎంట్రీతో అయన అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్?
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచింది. ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలతో బిజీ అయిన పవన్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. అయితే పవర్ స్టార్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ‘పింక్’ను తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఓ మై ఫ్రెండ్, ఎమ్సీఏ’ చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక హిందీ ‘పింక్’లో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై పవన్ వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను పరిశీలిస్తే.. షూటింగ్లో భాగంగా హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో పవన్ పాల్గొన్నారని తెలుస్తోంది. సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు మరోటాక్. అయితే ఈ చిత్ర విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ ఈ ఫోటోలు నిజమై ఆయన షూటింగ్లో పాల్గొంటే పవన్ ఫ్యాన్స్‌కు నిజంగా పండగే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్‌కు ఇది 26వ చిత్రం కావడంతో ట్విటర్లో ‘#PSPK26’ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ఇక పింక్ రిమేక్‌తో పాటు క్రిష్, పూరి జగన్నాథ్‌లతో కూడా సినిమాలు చేసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారని సమచారం. -
పింక్ రీమేక్‌లో అంజలి?
రెండేళ్ల క్రితం బాలీవుడ్లో విడుదలైన ‘పింక్’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. అనిరుద్ధ రాయ్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, తాప్సీ, కృతీ కల్హరీ, ఆండ్రియా టారియంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత బోనీకపూర్ ‘పింక్’ చిత్రాన్ని గత ఏడాది తమిళంలో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేశారు. ఇప్పుడు ‘పింక్’ చిత్రం తెలుగులో రీమేక్ కానుంది. ‘దిల్’ రాజు, బోనీ కపూర్ నిర్మించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ‘ఓ మై ఫ్రెండ్, ఎమ్సీఏ’ చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. తమన్ స్వరకర్త. ఈ సినిమాలో కథ రీత్యా ముగ్గురు అమ్మాయిల పాత్రలు ఉంటాయి. వీరిలో ఇద్దరు అమ్మాయిలుగా అంజలి, నివేదా థామస్ నటించబోతున్నారని లేటెస్ట్ టాక్. ఇక హిందీ ‘పింక్’లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. -
తెలుగు పింక్
ఇక పవన్ కల్యాణ్ సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేశారా? అని చాలామంది అనుకుంటున్న తరుణంలో ఓ వార్త తెరమీదకు వచ్చింది. హిందీ హిట్ చిత్రం ‘పింక్’ తెలుగు రీమేక్‌లో ఆయన నటించబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. గత ఏడాది ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ మరో సినిమాలో నటించని సంగతి తెలిసిందే. ఇక హిందీ ‘పింక్’ని తమిళంలో అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేసిన బోనీకపూరే తెలుగు రీమేక్‌ను నిర్మించబోతున్నారు. ‘దిల్’ రాజు మరో నిర్మాత. ‘ఓ.. మై ఫ్రెండ్, ఎమ్సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)’ చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడు. హిందీ హిట్ ‘బదాయి హో’ తెలుగు రీమేక్ నిర్మాణానికి తొలిసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న బోనీ కపూర్, ‘దిల్’ రాజు తాజాగా ‘పింక్’ తెలుగు రీమేక్‌ను కూడా నిర్మించబోతుండటం విశేషం. ‘బదాయిహో’ తెలుగు రీమేక్‌లో ఎవరు నటించబోతున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరి.. ‘పింక్’లో పవన్ నటిస్తారా? లేదా? -
నా జీవితం తలకిందులైంది : తాప్సీ
నో మీన్స్ నో. ఈ పదాన్ని బాలీవుడ్ బిగ్‌బీ నోట, కోలీవుడ్ స్టార్ కథానాయకుడు అజిత్ నోట సినీ ప్రియులు వినే ఉంటారు. ఎందుకుంటే హిందీ చిత్రం పింక్‌లో నటుడు అమితాబ్ బచ్చన్, దాని తమిళ రీమేక్ నేర్కొండ పార్వై చిత్రంలో అజిత్ చెప్పిన డైలాగ్ నో మీన్స్ నో. ఈ చిత్రాల్లో న్యాయస్థానంలో మహిళల విషయంలో నో అంటే చిన్న విషయం కాదని, అందులో చాలా భావం ఉందని స్ట్రాంగ్‌గా చెప్పారీ స్టార్స్. కాగా పింక్ హిందీ చిత్రంలో నటి తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు దక్షిణాదిలో గ్లామరస్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఆమె బాలీవుడ్లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో రాణిస్తోంది. కాగా తాప్సీ తాజాగా ఒక భేటీలో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకున్నారు. ‘జీవితంలో నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. సెలబ్రెటీని కావడంతో నేను పుట్టి పెరిగిన ఢిల్లీలో కూడా బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి. ఒకవేళ ధైర్యం చేసి వెళ్లినా నాకే కాదు, నాతో వచ్చేవారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నో మీన్స్ నో అన్నది ప్రజలు ఇంకా అర్థం చేసుకోవడం లేదు. ఇలాంటి సమస్యల కారణంగానే నేను ఏదైనా షాపింగ్ చేయాలంటే విదేశాల్లోనే చేసుకుంటున్నాను. నిజానికి నాకు మాల్స్‌కు వెళ్లి షాపింగ్ చేయడం చాలా ఇష్టం. అయితే ఇండియాలో అలా చేయలేకపోతున్నాను. ప్రజలు నేనంటే అభిమానం చూపిస్తున్నారన్నది సంతోషకరమైన విషయమే. అయితే హద్దులు దాటి నా వ్యక్తిగత జీవితంలోకి రావడం నన్ను బాధకు గురి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో సెలబ్రిటిని అయిన తరువాత నా జీవితం తలకిందులైంది’ అని అంటోంది తాప్సీ. -
ప్రతి 20 నిమిషాలకు ఓ మహిళపై లైంగిక దాడి
న్యాయం కావాలి అని అడగడం ప్రతి పౌరుడి హక్కు! జరుగుతోంది అన్యాయం అని తెలిస్తే కదా.. న్యాయం గురించి అడిగేది!! ముందు న్యాయం ఏమిటో చెప్పే కన్నా.. అన్యాయం ఏంటో చూపించాలి! దానికి బాలీవుడే దిక్సూచీ!! న్యాయం కావాలంటే .. న్యాయం చూడాలని ఎన్నో సినిమాలను ఆవిష్కరించింది!! నాలుగైదేళ్ల కిందట అనుకుంటా.. హైదరాబాద్‌లోని ‘లామకాన్’లో ఎల్జీబీటీక్యూ ఫెస్టివల్ ఏదో జరుగుతోంది. లోపలికి వెళ్లే ముందు ఆ ఇంటి ప్రహరీ గేట్‌కు.. ‘‘ప్లీజ్ లీవ్ యువర్ ప్రిజుడీస్ హియర్’’ అని రాసున్న బోర్డ్ ఉంది. అంటే భ్రమలు, భ్రాంతులు తొలగించుకొమ్మని అర్థం. ఇప్పుడు బాలీవుడ్ అదే చేస్తోంది. నాలుగు ఫైట్లు, ఆరు డ్యుయెట్లు, ఐటమ్ సాంగ్, ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్, ఒక వ్యాంప్ వంటి స్టీరియో టైప్ ఫార్ములాను కత్తిరించింది. సమకాలీన సమస్యల మీద ఫోకస్ చేసింది. హీరోయిన్ అయినా.. హీరో అయినా.. ఆఖరకు విలన్ అయినా కథే! కథావసరంగా పాత్రలు పుట్టుకు రావాలి కాని పాత్రల కోసం కథ అల్లట్లేదు. సమకాలీన ఆలోచనా ధోరణులు, అనుబంధాలు, సామాజిక అంశాలనే థీమ్‌గా తీసుకుంటోంది. అలా తెరకెక్కి కమర్షియల్ హిట్లయినవి ఉన్నాయి. క్రిటిక్స్ ప్రశంసలు పొందినవి ఉన్నాయి. విదేశీ ఫిల్మోత్సవ్లలో సందడి చేసి భారతీయ సినిమా పట్ల గౌరవాన్ని పెంపొందించనవీ ఉన్నాయి. థియేటర్ల నుంచి సైలెంట్‌గా ప్రేక్షకుల మెదళ్లకెక్కి చెరగని ముద్ర వేసినవీ ఉన్నాయి. అలాంటి సినిమాల గురించి ప్రస్తావించుకోకపోతే మార్పును స్వాగతించనట్టే! పైగా వాటి గురించి చెప్పుకోవాల్సిన సందర్భం కూడా. కిందటి నెలలోనే ‘ఆర్టికల్ 15’ సినిమా విడుదలై టాక్ ఆఫ్ ది కంట్రీ అయింది. సెప్టెంబర్ 13న ‘‘సెక్షన్ 375’’ చిత్రం రిలీజ్‌కానుంది. ట్రయిలర్స్తో అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. సెక్షన్ 375.. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ‘సెక్షన్ 375’ రేప్ గురించి తెలియజేస్తుంది. స్త్రీ ఇష్టం లేకుండా, ఆమె అనుమతి లేకుండా ఆమె పట్ల ఎలాంటి సెక్సువల్ యాక్ట్ జరిగినా దాన్ని రేప్ కిందే పరిగణిస్తుందీ సెక్షన్. దీనికి సంబంధించి ఆరు రకాల వివరాలనూ ఇందులో పొందుపర్చారు. ఆమెకు ఇష్టం లేకుండా, ఆమె అనుమతి లేకుండా, ఆమెను బెదిరించి, భయాందోళనలకు గురి చేసి ఆమె అనుమతి తీసుకున్నా, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, పెళ్లికి ముందే ఆమెతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నా, ఆమె మానసిక స్థితి బాగా లేనప్పుడు ఆమె నుంచి అనుమతి తీసుకున్నా, దాని పర్యవసానాలు తెలియక ఆమె అనుమతి ఇచ్చినా, పద్దెనిమిదేళ్ల లోపున్న అమ్మాయి ఇష్టపడి, అనుమతి ఇచ్చినా.. జరిగిన సెక్సువల్ యాక్ట్ రేప్ కిందకే వస్తుందని ఈ సెక్షన్లో ఉంది. అలాగే ఎలాంటి సెక్సువల్ యాక్ట్‌ను రేప్‌గా పరిగణిస్తారో కూడా వివరిస్తోందీ సెక్షన్. నిజ జీవితంలోని రేప్ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ ఐపీసీ 375ను చర్చించే కోర్ట్ రూమ్ మూవీయే‘సెక్షన్ 375’. ట్రైలర్‌ను బట్టి ఒక దళిత కాస్ట్ అసిస్టెంట్‌ను సినిమా డైరెక్టర్ రేప్ చేసిన కేస్‌ను డిఫెన్స్, ప్రాసిక్యూట్ అడ్వకేట్స్ వాదిస్తూంటారు. డిఫెన్స్ లాయర్‌గా అక్షయ్ ఖన్నా, ప్రాసిక్యూటర్‌గా రిచా చద్దా నటించారు. ఈ దేశంలో ప్రతి 20 నిమిషాలకు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక మహిళ లైంగిక దాడిని ఎదర్కోవాల్సి వస్తోందని, ప్రతి లక్షమంది మహిళల్లో 1.8 మంది మహిళలు రేప్ జరిగే పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, రేప్ చేసిన వాళ్లలో కేవలం 25 శాతం మంది నేరస్తులకు మాత్రమే శిక్ష పడ్తోందని, దాదాపు 75 శాతం కేసుల్లో నిందితులు శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారని ఈ సినిమాకు సంబంధించిన ఒక ట్రైలర్ లెక్క చెప్తోంది. ‘‘సెక్షన్ 375’’కు అజయ్ బహెల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్టికల్ 15.. కుల మత జాతి ప్రాంత లింగ వివక్ష లేకుండా దేశంలోని పౌరులంతా సమానమే. అన్నిచోట్లా అందరికీ ప్రవేశం ఉంటుంది. అలాగని స్త్రీలు, పిల్లలు, వెనకబడిన వర్గాల వాళ్ల కోసం ప్రభుత్వాలు ప్రత్యేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలనుకున్నప్పుడు ఈ ఆర్టికల్ 15 వర్తించదు. వెనకబడిన వర్గాలను మిగిలిన పౌరులతో సమానంగా చేయడానికి ఈ ఆర్టికల్ సహకరిస్తుంది. 2014, ఉత్తరప్రదేశ్‌లోని బదాన్లో ఇద్దరు దళిత అమ్మాయిలను రేప్ చేసి, చంపి అదే ఊళ్లో చెట్టుకు ఉరేసిన సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. స్వతంత్రం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా ఇంకా కుల వ్యవస్థ గురించి, అది చేసే దారుణాల గురించి మాట్లాడుకునే స్థితిలో ఉండడమే విషాదం. తమ కూలి మూడు రూపాయలు పెంచమని అడిగిన పాపానికి ఇద్దరు దళిత అమ్మాయిలను రేప్ చేసి, చంపి.. వాళ్ల ఔఖాద్ అంటే వాళ్ల స్థానం ఏంటో చూపించామని విర్రవీగిన ఆ ఊరి కామందుతో తలపడిన ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ పోరాటమే ‘ఆర్టికల్ 15’. పాతుకుపోయిన నాలుగంచెల కుల వ్యవస్థ, ఓట్ల కోసం దాన్ని కాపాడుకుంటున్న రాజకీయ వ్యవస్థ.. అధికారం కోసం అట్టడుగు వర్గాలను చీలుస్తున్న పాలనా వ్యవస్థను సినిమాటిక్‌గా షో చేయకుండా వాస్తవానికి దగ్గరగా చూపించిన సినిమా. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీన్ అయి ఆడియెన్స్ అవార్డ్‌నూ అందుకుంది. ఆయుష్మాన్ ఖురానా, ఈషా తల్వార్, సయానీ గుప్తా ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు అనుభవ్ సిన్హా దర్శకుడు. ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్కానున్నట్టు అంచనా. అలీగఢ్.. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్ నిజ జీవిత కథే ‘అలీగఢ్’ మూవీ. స్వలింగ సంపర్కం నేరమని.. తర్వాత జరిగిన ఎన్నో ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలు, ధర్నాల ఫలితంతో నేరం కాదని చెప్పిన ఆర్టికల్ 377ను ఇండికేట్ చేసిన సినిమా ఇది. కథేంటంటే.. ప్రొఫెసర్ శ్రీనివాస్ రాంచంద్ర్ సిరాస్ హోమోసెక్సువల్ రిలేషన్‌షిప్స్‌ను వీడియో తీసి బయటపెడ్తారు కొందరు. దాంతో సిరాస్‌ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తారు. కుటుంబ సభ్యులూ అతణ్ణి ఇంట్లోంచి వెళ్లగొడ్తారు. హ్యూమన్ ఇంటరెస్ట్ స్టోరీ ఇది. ఎల్జీబీటీ హక్కుల గురించి డిస్కస్ చేసిన చలన చిత్రం. ‘‘ఎవరి వ్యక్తిగత జీవితంలోకైనా జొరబడే హక్కు ఎవరికీ లేదు.. ఆ మనిషి సమాజానికి హాని తలపెడితే తప్ప. అలాగే స్వలింగ సంపర్కం అనేది ఒక ధోరణి కాదని, నేచురల్ సెక్స్లాగే అదీ బయాలాజికల్ ఇన్స్టింక్ట్’’ అని అర్థం చేయించే సినిమా. హన్సల్ మెహతా దర్శకత్వం వహించారు. ప్రొఫెసర్ పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ నటించారు. ఇరోస్ నౌ, అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఆర్టికల్ 377 సడలింపు తర్వాత ఎల్జీబీటీ రైట్స్ మీద వచ్చిన మరో సినిమా ‘‘377’’. ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది. పింక్... అమ్మాయి కట్టూబొట్టూ తీరు, వెళ్లే పార్టీలు, కలుసుకునే మనుషులను బట్టి ఆ అమ్మాయి మీద ఫలానా అని లేబుల్ వేసి.. చొరవ తీసుకొని ఒంటి మీద చేయి వేసే మగవాళ్లకు లెంప కాయ ‘పింక్’. అమ్మాయి ‘‘నో’’ అంటే ‘‘నో’’ అనే .. దానికి ఇంకా ఏ అర్థాలు ఉండవనీ.. వెదకొద్దని హెచ్చరించిన సినిమా. స్త్రీల లైంగిక హక్కులు, ఇష్టాయిష్టాల స్వేచ్ఛ గురించి మొదటి సారి స్క్రీన్ మీద చర్చించిన చిత్రం. ఆధునిక దుస్తుల్లో, అంతే ఆధునిక జీవనశైలితో ఉన్న అమ్మాయిలు మగవాళ్లతో చనువుగా మాట్లాడినంత మాత్రాన వాళ్లు పడగ్గదికి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కాదని.. తీర్పునిస్తుంది. మురికి తలపులతో ఉన్న మనసులను శుభ్రంగా కడిగేస్తుంది పింక్. నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. పాడ్‌మన్... బహిష్టు.. అనే మాటను గట్టిగా అనడానికి ఆడవాళ్లే సాహసించని సమాజంలో ఓ భర్త.. ఆ క్రమం చుట్టూ ఉన్న అనారోగ్య వాతావరణాన్ని గూర్చి మథనపడి.. ఒక ఆరోగ్యకరమైన పరిష్కారం కనిపెడ్తాడు. అదే ‘పాడ్‌మన్’ సినిమా. నిజ జీవిత గాథ. రుతుక్రమం పట్ల ఉన్న అపోహలు, అంధవిశ్వాసాలకు చెక్ పెట్టి.. సైలెన్స్‌ను బ్రేక్ చేసింది. ఇదీ సినిమాకు కథాంశమే అని నిరూపించింది. నెట్‌ఫ్లిక్స్, జీ5ల్లో ఉంది. టాయ్‌లెట్.. సేమ్ అండ్ షేమ్.. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా.. గ్రామీణ భారతం.. ఆ మాటకొస్తే నగరాల్లోని స్లమ్స్‌లో కూడా మరుగుదొడ్లు లేని పరిస్థితి. రియల్‌లైఫ్‌లోని ప్రియాంక అనే నవ వధువే ఈ సినిమాకు ప్రేరణ. ఓ ఇంటి కోడలు అత్తింట్లో మరుగుదొడ్డి కట్టించుకోవడమే కథ.. అదే హీరోయిన్.. హీరో అన్నీ! ఇదీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. న్యూ బిగినింగ్.. ఇలా దాదాపు 2000 సంవత్సరం నుంచీ బాలీవుడ్ కొత్త స్క్రీన్‌ను షేర్ చేస్తోంది. మనుషులనే పాత్రలుగా మలిచి జీవితాలను ఆవిష్కరిస్తోంది. కళ్లముందు కనిపిస్తున్నా మెదడుకు ఎక్కించుకోని విషయాలెన్నిటినో కథలుగా రాసుకుంటోంది. అందరికీ తెలియాల్సిన రాజ్యాంగ అధికరణల నుంచి అందరికి కావాల్సిన మరుగుదొడ్ల వరకు ఏ చిన్న డిటైల్నూ మిస్ చేయట్లేదు. ఇలాంటి సినిమాలతో బాలీవుడ్ న్యూ బిగినింగ్‌ను స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. అక్షరం లేని, రాని చోట దృశ్యమే ఆయుధం అవుతుంది. సమస్యల అవగాహనకు సినిమాను మించిన మాధ్యమం ఏముంటుంది? అందుకే వీటిని మల్టీప్లెక్స్‌లకే కాకుండా గ్రామాల్లోని టాకీసులకూ పంపాలి. అందరూ చూసేలా చేయాలి. ఔర్ కు .. ‘ఉరి’ తీసిన కెమెరాతోనే ఇస్లామాఫోబియా ఇతివృత్తంగా ‘ముల్క్’ను, ‘హమీద్’, ‘నో ఫాదర్స్ ఇన్ కశ్మీర్’అంటూ కశ్మిరీల పోరాటాన్నీ చూపించింది బాలీవుడ్. కశ్మీరియత్ ఉనికి అవసరాన్ని చెప్పింది. ‘నిల్ బట్టి సన్నాటా’తో స్త్రీ చదువును ప్రోత్సహిస్తూనే ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’, ‘వీరే దీ వెడ్డింగ్’లతో మహిళా సాధికారత మరో కోణాన్నీ పరిచయం చేసింది. ‘ఆలిఫ్’, ‘సూపర్ థర్టి’తో అందరికీ చదువుకునే రైట్ ఉందని డాల్బీ డిజిటల్ సౌండ్‌తో నినదించింంది. వీటన్నిటినీ నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, జీ5, ఇరోస్ నౌల్లో వీక్షించొచ్చు. ఇలాంటి కొత్త ట్రెండ్‌తో సెట్స్ మీద ఇంకెన్ని సినిమాలున్నాయో! వేచి చూద్దాం.. ఈ చేంజ్‌కు వెల్కమ్ చెప్దాం!– సరస్వతి రమ -
‘లాయర్ సాబ్’గా బాలయ్య!
ఒకప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ బయోపిక్‌ల తరువాత స్లో అయ్యాడు. కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు డిజాస్టర్లు కావటంతో తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టేందుకు చాలా సమయం తీసుకున్నాడు. ఇటీవల కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు బాలయ్య. ఈ సినిమా తరువాత ఓ రీమేక్ సినిమాలో నటించే ఆలోచనలో బాలయ్య ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాను తమిళ్లో అజిత్ హీరోగా రీమేక్ చేశారు. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో బాలయ్య హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో రూపొందించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు లాయర్ సాబ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ఆ రీమేక్‌లో బాలయ్యా!
‘యన్.టి.ఆర్’ బయోపిక్‌ల ఎఫెక్ట్ నందమూరి బాలకృష్ణ మీద గట్టిగానే కనిపిస్తుంది. ఎప్పుడూ గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలు చేసే బాలయ్య, ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ తరువాత ఆలోచనలో పడ్డాడు. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించినా ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. తాజాగా బాలయ్యతో మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలు హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా పింక్. ఈ సినిమాను తమిళ్లో అజిత్, శ్రద్ధా శ్రీనాథ్‌లతో రీమేక్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో బాలకృష్ణ ప్రధాన పాత్రలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ను సెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి బాలకృష్ణ, బిగ్ బీ నటించిన పాత్రలో సెట్ అవుతాడా..? లేక బాలకృష్ణకు తగ్గట్టుగా కథలో మార్పులు చేస్తారా? అన్న విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఎవరూ పిలవడం లేదు!
తననెవరూ పిలవడం లేదు అని అంటోంది నటి తాప్సీ. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ ఉత్తరాది బ్యూటీ ఒకప్పుడు ఐరెన్‌లెగ్ నటిగా ముద్రవేసుకున్నా, ప్రస్తుతం క్రేజీ నటిగా రాణిస్తున్నారు. అయితే తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాల కోసం పోరాడినా పెద్దగా సాధించలేకపోయారు. అలాంటిది బాలీవుడ్ ఈ అమ్మడిలోని టాలెంట్‌ను గుర్తించింది. అక్కడ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ సక్సెస్‌లు అందుకుంటున్నారు. టాలీవుడ్‌లోనూ ఆనందోబ్రహ్మ చిత్రంతో విజయాన్ని చవిచూసిన తాప్సీ తాజాగా తమిళం, తెలుగు భాషల్లో నటించిన గేమ్ఓవర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీన తెరపైకి రానుంది. వైనాట్ ప్రొడక్షన్ పతాకంపై శశికాంత్ నిర్మించిన ఈ చిత్రానికి మాయ చిత్రం ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. రోన్ ఈత్తాన్ యోహాన్ సంగీతాన్ని అందించిన ఇందులో నటి వినోదిని, రమ్య, కాంచన నటరాజన్, అనిల్ కురువిల్లా ముఖ్య పాత్రల్లో నటించారు. గేమ్ఓవర్ చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి తాప్సీ మాట్లాడుతూ గేమ్ఓవర్ తన కెరీర్లో చాలా ముఖ్యమైన చిత్రం అని పేర్కొన్నారు. ఈ మూవీలో తాను వీడియో గేమ్ డిజైనర్‌గా నటించానని, ఒక ప్రమాదంలో కాలు విరగడంతో వీల్ చైర్లోనే కూర్చుని గేమ్ డిజైన్ చేస్తానని చెప్పారు. అలాంటి సమయంలో ఆ ఇంట్లో మరో ఆపద ఎదురవుతుందని, దాని నుంచి తాను గేమ్‌తో ఎలా బయట పడ్డానన్నది గేమ్ ఓవర్ చిత్రం అని తెలిపారు. తమిళంలో తాను నటించి చాలా కాలమైంది, నిజం చెప్పాలంటే ఇక్కడ తననెవరూ నటించడానికి పిలవడం లేదన్నారు. పింక్ చిత్ర రీమేక్‌లో నటించమని తనను ఎవరూ అడగలేదని, ఒకవేళ అడిగితే కచ్చితంగా నటించేదానిన్ననారు. ప్రస్తుతం నటుడు జయంరవికి జంటగా నటించే చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, దీని గురించి చిత్ర నిర్మాతల నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపారు. తన నటిగా పెంచి పోషించిన తమిళ సినిమాను ఎప్పటికీ మరచిపోనని తెలిపారు. కాగా ఈ అమ్మడికి హిందీలోనూ మార్కెట్ ఉండడంతో గేమ్ఓవర్ చిత్రాన్ని అక్కడ అనువాదం చేసి విడుదల చేయనున్నట్లు నిర్మాత శశికాంత్ తెలిపారు. గేమ్ఓవర్ చిత్రం హాలీవుడ్ చిత్రాల తరహాలో చాలా వేగంగా థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఆయన తెలిపారు. -
ఆయన మాటలు వేదవాక్కు
సినిమా: ఆయన మాటలు వేదవాక్కు అని పేర్కొంది నటి శ్రద్ధా శ్రీనాథ్. ఈమె తాజాగా నటించిన తమిళ చిత్రం నేర్కొండ పార్వై.అజిత్ ప్రధాన పాత్రలో నటించిన ఇది హిందీలో అమితాబ్‌బచ్చన్,తాప్సీ నటించిన పింక్ చిత్రానికి రీమేక్. బాలీవుడ్ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ఇందులో అజిత్ న్యాయవాదిగా నటించారు. హెచ్.వినోద్ దర్శకతక్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇందులో అజిత్ నటించిన కోర్టు సన్నివేశాలు పేలతాయంటున్నారు చిత్ర వర్గాలు. స్నేహంగా మెలిగే యువకుల వల్ల అత్యాచారాలకు బలైన యువతుల ఇదివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం నేర్కొండ పార్వై. హిందీలో ఈ చిత్రం విమర్శకులు, నెటిజన్ల ప్రశంసలను పొందింది. ఈ చిత్రం గురించి నటి శ్రద్ధాశ్రీనాథ్ తెలుపుతూ ఒక సంబంధానికి ఇరువురు సమ్మతం అవసరం అన్నది చాలా మందికి తెలియకపోవడం బాధాకరం అని పేర్కొంది. ఇందుకు కారణం చదువు లేనితనం, పురుషాధిక్యం, మనసు విప్పి మాట్లాడుకోకపోవడం వంటివి కావచ్చునని అంది. అలాంటి అంశాలతో కూడిన నేర్కొండ పార్వై చిత్రం హిందీ చిత్రం స్థాయిలో ఉండాలన్నది ఒక విషయం అయితే, తాను మాత్రం దీన్ని రీమేక్‌లా చూడలేదని చెప్పింది. ఒక అమ్మాయిగా తన పాత్రకు ఎంత నిజాయితీగా నటించగలనో అంతగా నటించానని చెప్పింది. ఇందులో ముఖ్య అంశం ఏమిటంటే అజిత్ ప్రధాన పాత్రలో నటించడం అని పేర్కొంది. చిత్రంలో ఆయన చెప్పే విషయాలను వినడానికి అభిమానులు రెడీగా ఉంటారని అంది. ఆయన మాటలు వేదవాక్కుగా ఉంటాయని చెప్పింది. సమాజంలోని చేదు విషయాలను ఒక స్టార్ నటుడు తెరపై చెబితే అవి చర్చనీయాంశంగా మారతాయని నటి శ్రద్ధా శ్రీనాథ్ పేర్కొంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. -
రాజకీయాల్లోకి అజిత్!
నటుడు అజిత్ రాజకీయాలకు ఆసక్తి చూపుతున్నారా? ఈయన్ని రాజకీయాల్లోకి దింపాలని పలు ప్రముఖ రాజకీయ పార్టీలు ప్రయత్నించి విఫలం అయ్యాయి. ఇటీవల ఒక రాజకీయ పార్టీ ఈయనకు గాలం వేసే ప్రయత్నం చేసినా, తనను రాజకీయాల్లోకి లాగొద్దు అని స్పష్టం చేశారు. అలాంటిది ఇప్పుడు కొత్తగా రాజకీయాలపై ఆసక్తి అని అంటారేమిటనేగా మీ ప్రశ్న. నిజమే అజిత్ నిజ జీవితంలోనే కాదు, సినిమాల్లోనూ ఇప్పటి వరకూ రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రంలో నటించలేదు. నటుడు విజయ్ కత్తి, మెర్శల్, సర్కార్ లాంటి రాజకీయ అంశాలతో కూడిన చిత్రాల్లో నటించి విజయాలతో పాటు, విమర్శలు కొని తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన తాజాగా రాజకీయాలకు దూరంగా జాలీగా సాగే చిత్రం చేస్తుంటే, ఆయన సహ నటుడైన అజిత్ రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రంలో నటించడానికి సై అన్నట్లు తాజా సమాచారం. అజిత్ విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఇప్పుడు నర్కొండ పార్వవై అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది హిందీ చిత్రం పింక్‌కు రీమేక్ అన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. హిందీ చిత్రం పింక్‌ను చిన్న చేర్పులు, మార్పులు చేసి తమిళంలో రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం తరువాత నిర్మాత బోనికపూర్ సంస్థలోనే అజిత్ మరో చిత్రం చేయనున్నారు. ఇది ఈజిప్ట్ చిత్రం హెప్టా లాస్ట్ లెక్చర్ అనే చిత్రానికి రీమేక్ అని సమాచారం. హెప్టా లాస్ట్ లెక్చర్ చిత్రాన్ని చూసిన అజిత్ దాని రీమేక్‌లో నటించడానికి ఆసక్తి చూపినట్లు తెలిసింది. దాని రీమేక్ హక్కులను బోనీకపూర్ పొందారట. దీనికి శివ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రం తరువాత అజిత్ విశ్వాసం చిత్ర నిర్మాత సత్యజ్యోతి ఫిలింస్ సంస్థకు మరో చిత్రాన్ని చేయనున్నట్లు తాజా సమాచారం. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందట. దీనికి నర్కొండ పార్వై చిత్రాన్ని తెరకెక్కిస్తున్న హెచ్.వినోద్‌నే దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే. ఆ విధంగా అజిత్ సినీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారన్నమాట. -
మాట మార్చిన తాప్సీ
బాలీవుడ్ ఆశలతో సౌత్ సినిమాను పక్కన పెట్టేసిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ ఇప్పుడు మాట మార్చింది. బాలీవుడ్లో లక్కీగా పింక్, నామ్ సభానా వంటి చిత్రాలు సక్సెస్ అవడంతో దక్షిణాదిపై తాప్సీ తీరు మారిపోయింది. ముఖ్యంగా ఇక్కడి దర్శకులను పరిహసించే వ్యాఖ్యలు చేసే స్థాయికి చేరుకుంది. అలాంటిది ఇప్పుడు తనను పరిచయం చేసింది దక్షిణాది సినిమానే అని కాబట్టి దాని నుంచి దూరం కానని చెబుతోంది. ప్రస్తుతం ఈభామ గేమ్ ఒవర్ అనే దక్షిణాది చిత్రంలో నటిస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. ఈ సందర్భంగా నటి తాప్సీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కథానాయకిగా పరిచయమైంది దక్షిణాది చిత్రాలతోనే అని, పెద్ద సక్సెస్‌లు రాకపోయినా హీరోయిన్ అనిపించుకున్నది ఇక్కడేనని అంది. దక్షిణాది ప్రేక్షకులు తనను తమ ఇంటి ఆడపడుచుగా ఆదరిస్తున్నారని చెప్పింది. హిందీ చిత్రాల్లో నటించే అవకాశం రావడంతో అక్కడ మంచి చిత్రాల్లో నటిస్తున్నానని, పేరు, ప్రఖ్యాతలు లభించాయని పేర్కొంది. అయితే హిందీలో ఎన్ని చిత్రాల్లో నటించినా తమిళం, తెలుగు చిత్రాలను మాత్రం వదులు కోనని చెప్పింది. ఎందుకంటే తన సినీ జీవితానికి శ్రీకారం చుట్టింది దక్షిణాది సినిమానేనని పేర్కొంది. హిందీలో బిజీగా నటిస్తున్నా, తమిళ్, తెలుగు భాషల్లో మంచి అవకాశాలు వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పింది. అందుకు ఎన్ని కాల్షీట్స్ కావాలన్నా కేటాయిస్తానని అంది. -
పింక్ రీమేక్ మొదలైంది.!
బాలీవుడ్ లో సూపర్‌హిట్ అయిన పింక్ సినిమాను అజిత్ హీరోగా సౌత్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించిన పాత్రలో సౌత్‌లో అజిత్ నటించనున్నాడు. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉత్తరాది నటి విద్యాబాలన్ మరో కీలక పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో అజిత్ కూడా పాల్గొననున్నాడు. కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు. -
ఆ వార్తలు నిజమే
‘‘అజిత్ కొత్త సినిమాలో నేను హీరోయిన్గా చేస్తున్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం అని చెప్పడానికి సంతోషిస్తున్నా’’ అని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికైనట్టు పేర్కొన్నారు శ్రద్ధా. ‘‘ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం కోసం ఇన్ని రోజులు మౌనంగా ఉండటం కష్టంగా అనిపించింది. అజిత్ సార్‌తో నటించడం సంతోషంగా ఉంది. నా కెరీర్లో చాలెంజింగ్ రోల్ ఇది. హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్‌గారు నిర్మిస్తారు. ప్రస్తుత సమాజానికి చెప్పాల్సిన కథ ఇది. హిందీలో తాప్సీ పోషించిన పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు శ్రద్ధా. ఈ చిత్రం మే 1న రిలీజ్ కానుంది. -
మిస్ శ్వేత
ఇటీవల అజిత్ పూర్తి చేసిన ‘విశ్వాసం’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ హిట్ ‘పింక్’ తమిళ రీమేక్‌లో ఆయన లాయర్‌గా నటించనున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో నజ్రియా, కల్యాణీ ప్రియదర్శన్, శ్రద్ధాశ్రీనాథ్ నటించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో శ్వేత అనే పాత్రను నజ్రియా చేయబోతున్నట్లు కోలీవుడ్ సమాచారం. బోనీకపూర్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుందని టాక్. ఈ సినిమాకు ‘ఖాకి’ ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తారు. -
న్యాయాన్ని గెలిపిస్తారు
ముగ్గురు ఆకతాయిల వల్ల లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ముగ్గురు అమ్మాయిలు న్యాయం కోసం పోరాడతారు. వీరికి ఓ లాయర్ అండగా నిలబడతాడు. న్యాయం గెలిచేట్టుగా కలసి పోరాడతారు. ఈ కథాంశంతో బాలీవుడ్లో రూపొందిన చిత్రం ‘పింక్’. అమితాబ్ బచ్చన్ లాయర్ పాత్ర పోషించారు. లైంగిక వేధింపుల బాధితురాలుగా తాప్సీ నటించారు. ‘పింక్’ చిత్రం సూపర్ హిట్. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు నిర్మాత బోనీ కపూర్. అమితాబ్ పోషించిన పాత్రను అజిత్ చేయనున్నారు. ఇందులో ముగ్గురు అమ్మాయిల్లో మలయాళ నటి నజ్రియా నజీమ్, ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్, కన్నడ భామ శ్రద్ధా శ్రీనాద్ నటించనున్నారని కోలీవుడ్ టాక్. నటుడు ఫాహద్ ఫాజిల్‌తో వివాహం అయ్యాక సినిమాలకు దూరంగా ఉన్నారు నజ్రియా. ఈ చిత్రంతో మళ్లీ తమిళ సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇవ్వనున్నారు. అలాగే కల్యాణీ ప్రియదర్శన్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారని సమాచారం. మరి ఈ ముగ్గురిలో తాప్సీ పాత్రను ఎవరు పోషిస్తారనే సంగతి తెలియాలి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రాన్ని ‘ఖాకీ’ ఫేమ్ హెచ్. వినోద్ డైరెక్టర్. మే 1 అజిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
సినిమా శాశ్వతం కాదు : తాప్సీ
స్నేహితులతో సన్నిహితంగా ఉంటే కష్టమే అంటోంది నటి తాప్సీ. నటన, అవకాశాల మాట అటుంచితే ఏదో ఒక అంశంతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి తాప్సీ. మొదట్లో దక్షిణాదిలోనే రాణించాలని ఆశ పడినా అది పెద్దగా తీరలేదు. ముఖ్యంగా కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకోవాలన్నది తాప్సీ తపన. అయితే అలాంటి అవకావాలు ఇక్కడ పెద్దగా రాలేదు. కాంచన లాంటి ఒకటీ అరా వచ్చినా, ఆ చిత్రాలు విజయం సాధించినా, తాప్సీని మాత్రం పట్టించుకోలేదు. ఇక టాలీవుడ్లో ఈ అమ్మడిని గ్లామర్‌కే వాడుకున్నారని చెప్పవచ్చు. అక్కడ ఆశించిన స్థాయికి చేరుకోలేకపోవడంతో తాప్సీ ముంబైకి మకాం మార్చేసింది. అక్కడ పింక్, నామ్ షబానా వంటి చిత్రాలు తాప్సీ కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేశాయి. దీంతో ఉత్తరాది సినిమాలతో బిజీ అయిపోయింది. మరో విషయం ఏమిటంటే నిర్మాతగానూ అవతారమెత్తేసింది. అవును తాప్సీ నటిస్తున్న ద్విభాషా చిత్రం గేమ్ ఓవర్‌కు ఈ బ్యూటీ ఒక నిర్మాత అట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. ఈ సందర్భంగా తాప్పీ ఏమంటుందో చూద్దాం. అధిక చిత్రాల్లో నటించడం కంటే మంచి కథా బలమున్న చిత్రాలు కొన్ని చేసినా చాలు అని పేర్కొంది. తమిళ ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకోవాలన్నదే తన చిరకాల కోరిక అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నటిస్తున్న గేమ్ ఓవర్ చిత్రం తన కోరిక నెరవేర్చుతుందనే నమ్మకం ఉంది. ఇది తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం అని తెలిపింది. ఈ చిత్రానికి తానూ ఒక నిర్మాతనని చెప్పింది. విభిన్న గేమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది అని పేర్కొంది. తన తొలి తెలుగు చిత్ర నిర్మాత అయిన నటి లక్ష్మీమంచు మాత్రమే తనకు అత్యంత సన్నిహితురాలు అని పేర్కొంది. స్నేహితులతో ఎక్కువ సన్నిహిత సంబంధాలను పెట్టుకుంటే సినిమాను వదిలి వెళ్లడం కష్టం అని అంది. అందుకే తాను స్నేహితులకు అధిక ప్రాధాన్యతనివ్వడం లేదని పేర్కొంది. సినిమా నిరంతరం కాదని, ఎప్పుడైనా దీన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుందని, అందుకే స్నేహితులతో పెద్దగా అటాచ్మెంట్ పెట్టుకోనని తాప్సీ చెప్పుకొచ్చింది. -
కోర్టుకు టైమ్ అయ్యింది!
అమ్మాయిలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి లాయర్‌గా మారనున్నారు అజిత్. ‘ఖాకి’ ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందనున్న సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. బాలీవుడ్ హిట్ ‘పింక్’ చిత్రానికిది రీమేక్. ఇందులో అమితాబ్ పోషించిన లాయర్ పాత్రలో నటించడానికి అజిత్ రెడీ అవుతున్నారు. అంటే.. లాయర్‌గా కోర్టులోకి దిగటానికి టైమ్ అయ్యిందన్నమాట. బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. అంతేకాదు అజిత్ నెక్ట్స్ చిత్రానికి కూడా బోనీ కపూర్‌నే నిర్మాత. ‘‘పింక్’ రీమేక్ కాకుండా అజిత్ నెక్ట్స్ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాను. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలైలో ప్రారంభిస్తాం. ‘పింక్’ని వచ్చే ఏడాది మే 1న, అజిత్‌తో నిర్మించాలనుకుంటున్న మరో చిత్రాన్ని 2020 ఏప్రిల్ 10న రిలీజ్ ప్లాన్ చేశాం’’ అని పేర్కొన్నారు బోనీ కపూర్. ఇక అజిత్ నటించిన తాజా చిత్రం ‘విశ్వాసం’ జనవరి 10న విడుదల కానుందని కోలీవుడ్ టాక్. -
అతిథులుగా...
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య పాత్రల్లో అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పింక్’. 2016లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌లో వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో అమితాబ్ పాత్రలో అజిత్ నటించనున్నారు. ‘చదురంగవేట్టై’ ఫేమ్ వినోద్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నటి విద్యాబాలన్‌లను అతిథి పాత్రల్లో నటింపజేసేందుకు బోనీకపూర్ చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అజిత్ తాజా చిత్రం ‘విశ్వాసం’ సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత ‘పింక్’ సినిమా రీమేక్‌కి కొబ్బరికాయ కొట్టనున్నారు. అమితాబ్, విద్యా ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? కూసింత ఓపిక పడితే తెలుస్తుంది. అమ్మ విద్యాబాలన్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో 3 సినిమాలు తెరకెక్కనున్నాయి. తమిళ ప్రజలు ‘అమ్మ’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే జయలలితను ఎవరు ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో ఇప్పటికే షూటింగ్ మొదలెట్టేశారు. ఇందులో జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. సీనియర్ దర్శకులు భారతీ రాజా కూడా ఈ విప్లవ నాయకురాలు పై ఓ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరితో పాటు మరో దర్శకుడు ఏఎల్ విజయ్ కూడా జయలలిత బయోపిక్‌ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో అమ్మ పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటి విద్యాబాలన్ నటించనున్నార ట. ఈ సినిమా కోసం ఆమె బరువు పెరగనున్నారని భోగట్టా. ఇక జయలలిత రాజకీయ జీవితంలో ముఖ్యులైన ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేశారని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా జయలలిత జయంతి రోజున (ఫిబ్రవరి 24) ప్రారంభం కానుందట. -
మరో సౌత్ సినిమాలో విద్యాబాలన్!
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం పింక్. ఈ మూవీ అక్కడ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళ్లో అజిత్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి మరో న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ పింక్ చిత్రాన్ని అజిత్ రీమేక్ చేయబోతున్నాడని.. కాదు అవన్ని రూమర్సే అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని అజిత్ రీమేక్ చేయనున్నాడు. ఇందులో ఓ ప్రముఖ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటి విద్యాబాలన్ నటించబోతోందని తెలుస్తోంది. అజిత్ ప్రస్తుతం ‘విశ్వాసం’ సినిమాతో బిజీగా ఉన్నారు. విద్యాబాలన్ ఇప్పటికే యన్.టి.ఆర్ బయోపిక్‌లో బసవతారకం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
‘పింక్’ రీమేక్‌తో రీ ఎంట్రీ
ఒక్కసారి సినీరంగంలోకి ఎంటర్ అయితే దాని నుంచి బయటకు వెళ్లడం కష్టం. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో వైదొలగినా, శాశ్వతంగా దూరం అవడమూ సాధ్యం కాదు. ఇలా చాలా మంది తారలు ఏదో కారణంగా మధ్యలో నటనకు దూరమైనా మళ్లీ రీఎంట్రీ అవుతుంటారు. నటి నజ్రియా కూడా ఇందుకు అతీతం కాదు. నేరం చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ బ్యూటీ నజ్రియా. ఆ తరువాత రాజా రాణి, నైయాండి, తిరుమణం ఎనుమ్ నిక్కా చిత్రాల్లో హీరోయిన్గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత కొన్ని మలయాళ చిత్రాల్లో నటించిన నజ్రియా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కెరీర్ మంచి స్వింగ్‌లో ఉండగానే పెళ్లి చేసుకోవడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. అంతే కాదు ఇక నటనకు టాటా అనేయడాన్ని కూడా ఎవరూ ఊహించలేదు. అలా ఈ అమ్మడు కోలీవుడ్‌లో చివరగా 2014లో తిరుమణం ఎనుమ్ నిక్కా చిత్రంలో నటించింది. అంటే దాదాపు ఐదేళ్లు అవుతోంది. అంతే గోడకు కొట్టిన బంతిలా ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అయ్యిపోతోంది. నజ్రియా ఇప్పటికే మలయాళంలో రీఎంట్రీ ఇచ్చింది. తన భర్త నిర్మాతగా రూపొందుతున్న రెండు చిత్రాల్లో నటించేస్తోంది. ఇప్పుడు కోలీవుడ్‌లో అవకాశం వచ్చిందనేది తాజా సమాచారం. అయితే ఈ సారి ఏకంగా అల్టిమేట్ స్టార్ అజిత్‌తోనే నటించే అవకాశాన్ని కొట్టేసిందంటున్నారు. అజిత్ ప్రస్తుతం విశ్వాసం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో అజిత్ కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. హిందీలో సంచలన విజయన్ని సాధించిన పింక్ చిత్ర రీమేక్‌లో అమితాబ్‌బచ్చన్ పాత్రను పోషించనున్నారు. దీనికి చతురంగవేట్టై చిత్రం ఫేమ్ హెచ్.వినోద్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ద్వారా నటి నజ్రియా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ భామ నటి తాప్సీ పాత్రను పోషించనుందా, వేరే పాత్రా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా నజ్రియా రీఎంట్రీ మాత్రం పక్కా అని తెలిసింది. -
బిగ్ బితో మరోసారి..!
సౌత్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఢిల్లీ భామ తాప్సీ తరువాత బాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామ మరో గోల్డెన్ చాన్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల జుడ్వా 2తో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న తాప్సీ బేబి, నాహ్ షబానా లాంటి సినిమాలతో నటిగానూ పేరు తెచ్చుకున్నారు. పింక్ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన తాప్సీ మరోసారి ఆ లెజెండరీ నటుడితో కలిసి నటించే చాన్స్కొట్టేశారు. స్పానిష్ సినిమా ద ఇన్విజిబుల్ ఘోస్ట్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న బాలీవుడ్ లో మూవీతో అమితాబ్, తాప్సీలు కలిసి నటించనున్నారు. ఈచిత్రానికి సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించనున్నారు. తాను అమితాబ్ తో మరోసారి కలిసి నటించనున్న విషయాన్ని తాప్సీ ప్రకటించారు. ‘ప్రతీ భారతీయ నటుడు అమితాబ్ తో ఒక్కసారైనా కలిసి నటించాలని కోరుకుంటారు కానీ నాకు ఆ అవకాశం రెండోసారి కూడా వచ్చింది’ అన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నాలుగు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. -
కథ చెప్పడానికి వెళితే..
తమిళ సినిమా: అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే, విజయాలను అందుకోవడం మరో ఎత్తు. ముందు ఒక్క అవకాశం అంటూ కాళ్లు అరిగేలా దర్శక, నిర్మాతల చుట్టూ తిరిగిన వాళ్లే, ఆ ఒక్క అవకాశం విజయాన్ని అందిస్తే, ఒక్కసారిగా గర్వం తలకెక్కేస్తుంది. ఇక గతం మరచిపోతారు. అందరూ అలా కాకపోయినా, నటి తాప్సీ లాంటి చాలా మంది ఇలానే ప్రవర్తిస్తుంటారు. ఆడుగళం చిత్రంలో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ. ఆ చిత్రం సక్సెస్ అయినా అమ్మడికిక్కడ వరుసగా అవకాశాలను రాబట్టుకోలేకపోయింది. అప్పట్లో అవకాశాలు రావడం లేదని తెగ మదన పడిపోయింది. అదే విధంగా తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటించినా అక్కడా స్టార్‌డమ్‌ను పొందలేకపోయింది. అలాంటి సమయంలో లక్కీగానో నటించిన పింకూ చిత్రం సక్సెస్ అయి తాప్సీకి మంచి పేరు తెచ్చి ఎట్టింది. ఆ తరువాత నటించిన నామ్ షబానా చిత్రం కూడా హిట్ అనిపించుకోవడంతో ఇప్పుడు బాలీవుడ్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. పింకూ చిత్రం తరువాత మరోసారి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో నటించే అవకాశం తాజాగా వరించింది. అంతే ఈ బ్యూటీ కళ్లాలు లేని గుర్రంలా ఎగసి పడుతోంది. మొదట్లో కోలీవుడ్‌లో అవకాశాల కోసం పాట్లు పడిన ఈ అమ్మడు ఇప్పుడు వచ్చినా ఒప్పుకునే స్థితిలో లేదు. ఇటీవల ఒక తమిళ దర్శకుడు తాప్సీకి కథ చెప్పడానికి వెళితే అది వినడానికి కూడా ఇష్టపడలేదట. సారీ హిందీలో నేను చాలా బిజీగా ఉన్నాను. కథానాయకి పాత్రకు ప్రాధాన్యత ఉన్న అవకాశాలు వరిస్తున్నాయి. అందుకే కోలీవుడ్‌లో చెట్లు, పుట్టలు తిరిగి హీరోలతో ఆడి పాడే పాత్రల్లో నటించడం ఇష్టం లేదు అని నిర్మోహమాటంగా చెప్పిందట. ఓడ దాటే వరకూ ఓడన్న, దాటిన తరువాత బోడన్నా అన్న చందాన తాప్సీ ప్రర్తిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతాన్నాయి. -
ఎం3 ఈవీఎంలు.. పింక్ బూత్‌లు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈసారి కొన్ని ప్రయోగాలకు వేదికగా నిలిచాయి. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా ‘పింక్ బూత్’లు ఏర్పాటు చేయడంతో పాటు.. అత్యాధునిక మూడో తరం ఈవీఎంలను కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం వినియోగించింది. కర్ణాటకలో 75 శాతం ఓటింగ్ నమోదు లక్ష్యంగా ఈ చర్యలకు ఈసీ అధికారులు శ్రీకారం చుట్టారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ట్యాంపరింగ్ చేసేందుకు వీలులేని ‘ఎం3 ఈవీఎం’ల్ని బెంగళూరు నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఎవరైనా ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నిస్తే ఈ సరికొత్త ఈవీఎంలు వాటంతటవే పనిచేయడం మానేస్తాయని ఈసీ అధికారులు తెలిపారు. బెంగళూరులోని శివాజీ నగర్, శాంతి నగర్, గాంధీ నగర్, రాజాజీ నగర్ నియోకవర్గాల్లో వీటి పనితీరును పరీక్షించారు. ఏవైనా లోపాలుంటే హెచ్చరించేలా ‘ఎం3’ ఈవీఎంల్లో ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేలా సఖి పేరుతో 450 పింక్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మహిళా సాధికారతను చాటిచెప్పేలా మొత్తం మహిళా అధికారులే ఈ బూత్‌లను నిర్వహించడం విశేషం. -
మనసంతా నువ్వే!
తమిళసినిమా: సంచలన తారల్లో తాప్సీ ఒకరు. ఈ భామ వివాదాస్పద నటిగా కూడా పేరు గాంచింది. అప్పుడెప్పుడో ఆడుగళం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ ఢిల్లీ భామ ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్నా, ఎందుకనో ఇక్కడ పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది.అదే విధంగా టాలీవుడ్‌లోనూ ప్రముఖ స్టార్స్‌తో నటించినా స్టార్ ఇమేజ్ను పొందలేకపోయింది. అలాంటి సమయంలో బాలీవుడ్ ఈ బ్యూటీని ఆదుకుంది. అక్కడ నామ్ షబానా చిత్రం మంచి విజయాన్ని సాంధించింది. ఇక అమితాబ్‌బచ్చన్‌తో నటించిన పింక్ చిత్రం మంచి సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలు తాప్సీ చేతిలో ఉన్నాయి. మళ్లీ దక్షిణాదిలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకు ఏదో ఒక ప్రయత్నం చేసే తాప్సీ తనకు వచ్చిన ఓ ప్రేమలేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాంటి వాటిలో ఇటీవల ఒక అభిమాని రాసిన ప్రేమ, పెళ్లి ప్రపోజల్ లేఖ తాప్సీని విస్మయం పరచిందట. ఈ లేఖను ఈ అమ్మడు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ అందులో ఏముందంటే నేను మద్యం తాగను, మాంసాహారం భుజించను. అన్నింటికంటే ముఖ్యం నేను చాలా నిజాయితీపరుడ్ని. నీపై నాకున్న ప్రేమను నిరూపించుకోవడానికి ఎలాంటి పరిక్షలకైనా సిద్ధం. నా విన్నపాన్ని పరిశీలించడం మరచిపోవద్దు. నా మనసంతా నువ్వే నిండిపోయావు అని రాశాడు. ఈ ప్రేమలేఖ నటి తాప్సీని ఎంతగానో ఆకట్టుకుందట. తనకు వచ్చిన వాటిలో ఇదే ఉత్తమప్రేమలేఖ అని తాప్సీ పేర్కొంది. ఇప్పుడీ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఇప్పట్లో ఆ ముచ్చట లేదు: తాప్సీ
సాక్షి, ముంబై: ఒకవైపు సీరియస్ పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు కామెడీ రోల్స్లతో ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నట్టు నటి తాప్సీ తెలిపింది. ఆమె ప్రస్తుతం రొమాంటిక్ కామెడీ ‘దిల్ జంగ్లీ’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా బుధవారం విలేకరులతో మాట్లాడింది. సీరియస్ సినిమాలను పక్కనబెట్టి.. కమర్షియల్ సినిమాలు, కామెడీ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నారా? అని ప్రశ్నించగా.. ‘అదేమీ లేదు. జుడ్వా-2 తర్వాత నేను చేస్తున్న లైట్‌హార్ట్‌డ్ సినిమా ఇది. ఈ సినిమా తర్వాత నేను మళ్లీ పవర్ఫుల్ పర్ఫాన్మెన్స్ జోన్లోకి వెళ్లిపోతాను. ’పింక్’ సినిమా తర్వాత ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్నాను. ఏదైనా మళ్లీమళ్లీ చేయడం నాకు నచ్చదు. ఇది (దిల్ జంగ్లీ) కామెడీ సినిమానే అయినా ఇందులో నా పాత్ర, సినిమా కథ.. ప్రతిదీ భిన్నంగా ఉంటుంది’ అని తాప్సీ వివరించింది. ఇక, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగితే.. ఇప్పుట్లో ఆ ఆలోచన లేదని తెలిపింది. ‘నేను ఎక్కడికో వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకోను. ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తే ఆ విషయాన్ని మీడియాకు చెప్తాను. ఇందులో దాచేందుకు ఏముంది’ అని తాప్సీ పేర్కొంది. -
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అరుదే!
తమిళసినిమా: హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల రాక అరుదైపోయిందని నటి తాప్సీ అంటోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ మధ్య తరచూ వార్తల్లో ఉంటున్న ఈ ఢిల్లీ బ్యూటీని ఇప్పుడు దక్షిణాదిలో దాదాపు మరిచిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో ఫ్రీ పబ్లిసిటీ పొందే ప్రయత్నంలో పడింది తాప్సీ. అయితే ఈ జాణకు బాలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది. అక్కడ పింక్, నామ్ షబానా వంటి చిత్రాల్లో తాప్సీ నటనకు మంచి ప్రశంసలు లభించడంతో పాటు ఆ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందడంతో బాలీవుడ్లోనే మకాం పెట్టేసింది. నామ్ షబానా చిత్ర కథ ఒక రకంగా చెప్పాలంటే తాప్సీ చుట్టూనే తిరుగుతుంది. అలాంటి మంచి కథా చిత్రాలు మరిన్ని రావాలని అంటున్న తాప్సీని హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న నటీమణులు హీరోలకు సమానంగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం గురించి ప్రశ్నించగా నిజం చెప్పాలంటే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు అరుదుగానే వస్తున్నాయని, వాటిలోనూ ఒకటీ అరా చిత్రాలే విజయం సాధిస్తున్నాయని పేర్కొంది. అదీ గాక హీరోల చిత్రాల స్థాయిలో హీరోయిన్ల చిత్రాలకు ఓపెనింగ్స్ రావడం లేదన్నది నిజం అంది. హీరోల చిత్రాలకు ధీటుగా హీరోయిన్ల చిత్రాలకు ఓపెనింగ్స్ వచ్చి సక్సెస్ అయితే సమాన పారితోషికం డిమాండ్ చేసే హక్కు ఉంటుందని అంది. ఆ ఏడాదిలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో తాను నటించిన చిత్రం ఒక్కటే భారీ ఓపెనింగ్స్ సాధించిందని పేర్కొంది. అయితే హీరోల చిత్రాల ఓపెనింగ్స్‌తో తన చిత్రాన్ని పోల్చకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
ఐఫా విజేతలు వీరే..!
బాలీవుడ్ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ (ఐఫా) వేడుక న్యూయార్క్ లో ఘనంగా జరుగుతోంది. బాలీవుడ్ తారాలోకం అంతా పాల్గొంటున్న ఈ షోలో అలియా భట్, కత్రినా కైఫ్, వరుణ్ ధావన్, ఏఆర్ రెహమాన్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్, కరణ్ జోహార్ లు వ్యాఖ్యతలుగా వ్యవహరిస్తున్నారు. అందరూ ఊహించినట్టుగానే ధోని, పింక్, నీర్జా చిత్రాలు అవార్డుల పంట పండించాయి. ఇప్పటి వరకు ప్రకటించినా విజేతల వివరాలు... ఉత్తమ దర్శకుడు : అనిరుద్ధా రాయ్ చౌదరి (పింక్) ఉత్తమ సహాయ నటుడు : అనుపమ్ ఖేర్ (ఎమ్ ఎస్ ధోని : అన్‌టోల్డ్ స్టోరీ) ఉత్తమ సహాయ నటి : షభానా అజ్మీ(నీర్జా) ఉత్తమ ప్రతినాయకుడు : జిమ్ స్రభ్(నీర్జా) ఉత్తమ హాస్యనటుడు : వరుణ్ ధావన్ (ఢిష్యుం) ఉత్తమ సంగీత దర్శకుడు : ప్రీతం ( ఏ దిల్ హై ముష్కిల్) ఉత్తమ గాయకుడు : అమోత్ మిశ్రా ( బుల్లయ - ఏ దిల్ హై ముష్కిల్) ఉత్తమ గాయని : కనీకా కపూర్ ( దా దా దాస్సే - ఏ దిల్ హై ముష్కిల్), తులసీ కుమార్ (సోచ్ నా సకే - ఎయిర్‌లిఫ్ట్) ఉత్తమ తొలి చిత్ర నటుడు : దిల్జిత్ దొసాంజ్ ( ఉడ్తా పంజాబ్) ఉత్తమ తొలి చిత్ర నటి : దిశా పటానీ (ఎమ్ ఎస్ ధోని : అన్‌టోల్డ్ స్టోరీ) ఉత్తమ కథ : శకున్ బాట్రా, అయేషా (కపూర్ అండ్ సన్స్) స్టైల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ : అలియా భట్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ : తాప్పీ పన్ను (పింక్) 25 ఏళ్లుగా భారతీయ సంగీతాన్ని సేవలందిస్తున్న ఏఆర్ రెహమాన్‌కు స్పెషల్ జ్యూరి అవార్డ్. -
సాగర్ డ్యాంకు గులాబీ రంగు
అభ్యంతరం తెలిపిన ఏపీ వాసులు నాగార్జునసాగర్: రెండు రాష్ట్రాల మధ్య గులాబీ చిచ్చు రగిలింది. ఆంధ్రా–తెలం గాణ రాష్ట్రాల సరిహద్దులోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిధులతో ఆధునికీకరణలో భాగంగా రంగులు వేస్తున్నారు. డ్యాంపై రోడ్డుకు ఇరువైపులా గోడలకు గులాబీ రంగు వేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రంగు గులాబీ కావడంతో డ్యాం అవతల వైపునఉన్న ఆంధ్రా వాసులు శుక్రవారం డ్యాం మీదకు వచ్చి రంగులు వేసిన గోడలను పరిశీలించారు. సాగర్‌కు గులాబీ రంగు వేయడం ఏమిటని నిలదీ శారు. పాత రంగునే వేయాలని తెలంగాణ ఇంజనీర్లతో గొడవకు దిగారు. ఈ విష యమై సాగర్ డ్యాం సీఈ సునీల్‌ను వివ రణ కోరగా.. ఇది చర్చనీయాంశమే కాదని, రంగు నాణ్యమైనదా కాదా అని చూడాలి తప్ప.. ప్రాజెక్టుకు వేసే రంగు ఏదైతే ఏముందన్నారు. మొదట తెల్లరంగు, తర్వాత ఈ రంగు వేశామని.. పైన కింద బార్డర్ డార్క్ బ్లూ వస్తుందని తెలిపారు. -
మిస్ లాయర్
తాప్సీ కూల్ గాళ్. ఎంత పెద్ద విషయాన్నైనా కూల్‌గా డీల్ చేస్తారు. వాదించడం ఇష్టం ఉండదు. నిజజీవితంలో తాప్సీ స్వభావం ఇలానే ఉంటుంది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే రియల్ లైఫ్‌లో కాదు. ఓ సినిమా కోసం తాప్సీ తన మనస్తత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించనున్నారు. అది హిందీ సినిమా.అభినయ్ డియో డైరెక్షన్లో రూపొందనున్న చిత్రంలో ఆమె లాయర్‌గా నటించనున్నారు. కోర్టులో ఎలా వాదిస్తారో తాప్సీకి తెలుసు. ‘పింక్’లో బోలెడన్ని కోర్టు సీన్లు ఉన్నాయనే విషయం గుర్తుండే ఉంటుంది. అయితే అందులో బాధితురాలిగా కోర్టు బోనులో నిలబడ్డారు. తాజా చిత్రంలో బాధితుల పక్షాన వాదించనున్నారు. లాయర్లు ఎలా వాదిస్తారో చూసినప్పటికీ, స్వయంగా ఆ పని చేయాలంటే కొంత అనుభవం కావాలి కదా. అందుకే ఈ సినిమా స్టార్ట్ కాబోయే నెల రోజుల ముందే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం తాప్సీ నార్వేలో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చే నెలలో పోర్చుగల్‌లో జరుగునున్న ‘జుడ్వా’ మూవీ షెడ్యూల్లో పాల్గొననున్నారు. మరోవైపు లాయర్‌గా శిక్షణ తీసుకుంటారట. -
చెంప చెళ్లుమనేదే! కానీ...
హిందీలో ‘బేబీ’, ‘పింక్’, ‘నామ్ షబానా’ సినిమాలు తాప్సీకి యాక్షన్ గాళ్ ఇమేజ్ తీసుకొచ్చాయి. ఈ నెల 31న విడుదల కానున్న ‘నామ్ షబానా’ ట్రైలర్లో అయితే పవర్ ప్యాక్డ్ పంచ్‌లతో చెలరేగారు. రియల్ లైఫ్‌లోనూ తాప్సీ తీరు పరిశీలిస్తే... ఫైర్ బ్రాండ్‌ను తలపిస్తుందనే చెప్పాలి. కానీ, ‘నేనంత ఫైర్‌బ్రాండ్‌ను కాదండీ బాబు’ అంటున్నారు తాప్సీ. కనీసం ఓ మనిషిని చెంపదెబ్బ కూడా కొట్టలేనన్నారు. ఆమె కాలేజీ రోజుల్లో జరిగిన ఓ ఘటన గురించి తాప్సీ మాట్లాడుతూ.. ‘‘కాలేజీలో ఈవ్ టీజింగ్ చేసేవారు. కొన్నిసార్లు ఎక్కడెక్కడో చేతులు వేసేవారు. అసభ్యంగా ప్రవర్తించేవారు. ఓసారి విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు ఓ అబ్బాయి చెంప గట్టిగా చెళ్లుమనేది. కానీ, నేను అంత సాహసం చేయలేకపోయా. బహుశా... భయపడి ఉంటాను’’ అన్నారు. -
మెగాస్టార్ సినిమాను చూడనున్న రాష్ట్రపతి
ముంబై: ఆధునిక మహిళపై సాగుతున్న అత్యాచారాలను, చూపుతున్న వివక్షతను ప్రశ్నిస్తూ రూపొందించిన సినిమా పింక్. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో , తాప్సీ మరో కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమాలో ఆండ్రియా తరియంగ్, కీర్తి కుల్హర్లు లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించటమే కాక విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడటమే కాక ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రదర్శించారు. తాజాగా ఈ సినిమాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీక్షించనున్నట్టు బిగ్ బీ తన బ్లాగ్‌లో వెల్లడించారు. శనివారం చిత్ర బృందంతో కలిసి ప్రణబ్ సినిమాను వీక్షించనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు సినిమా చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానని తాప్సి తెలిపారు. అమితాబ్ బైపోలార్ డిజార్డర్ తో ఇబ్బంది పడే లాయర్ గా నటించిన ఈ సినిమాకు అనిరుద్ రాయ్ చౌదరి దర్శకుడు. -
అదే లేకుంటే అవకాశాలు ఎందుకొస్తాయి
చిత్ర పరాజయానికి నేనా కారణం అంటూ నటి తాప్సీ దక్షిణాది దర్శక నిర్మాతలపై ఫైర్ అయ్యారు. తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈ ఢిల్లీ అమ్మడికిప్పుడు ఇక్కడ ఒక్క అవకాశం కూడా లేదు. వచ్చినా నటించడానికి భయం వేస్తోంది అంటున్నారు. అయితే బాలీవుడ్లో మాత్రం చిత్రాలు చేతి నిండానే ఉన్నాయి. అమితాబ్‌బచ్చన్ తో కలిసి నటించిన పింక్ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించడంతో హిందీ చిత్ర పరిశ్రమలో తాప్సీ సినీ పయనం చాలా జోరుగా సాగుతోంది. దీంతో దక్షిణాది చిత్ర దర్శకులపై అభాండాలు వేసేంత ధైర్యం వచ్చేసింది. ఇంతకీ ఈ భామ ఏమంటుందో చూద్దామా. దక్షిణాది చిత్ర దర్శక నిర్మాతలు నాకు నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఇవ్వలేదు. గ్లామర్ పాత్రలే ఇచ్చారు. చిత్రం పరాజయం పాలైతే బాధ్యులెవరు? నాకు రాశిలేని నటి అనే ముద్రవేశారు. నాలోని నటనా ప్రతిభను నిరూపించుకునే పాత్ర ఒక్కటీ రాలేదు. అందుకే నేను బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారించాను. హిందీలో నేను నటించిన పింక్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. నాకూ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒకరిని తిట్టడం, నేరం మోపడం చాలా సులభం. అందుకు ముందు కారణాన్ని ఆలోచించడం మరచిపోతున్నారు. నన్ను రాశిలేని నటిగా ఇక్కడ చిత్రీకరించినా, హిందీలో అరడజను చిత్రాలున్నాయి. చేతి నిండా సంపాదిస్తున్నాను. తాను రాశి లేని నటినైతే బాలీవుడ్లో ఇన్ని అవకాశాలు ఎలా వస్తాయి? అని ప్రశ్నిస్తోందీ భామ. -
నచ్చకపోతే వదిలేస్తా!
నచ్చకపోతే వదిలేస్తానంటోంది నటి తాప్సీ. తెలుగు, తమిళం భాషల్లో నాయకిగా ఒక రౌండ్ కొట్టేసిన ఈ ఉత్తరాది భామ తాజాగా బాలీవుడ్‌పై దృష్టి సారించింది. ఆ మధ్య బిగ్‌బీ అమితాబ్‌తో నటించిన పింక్ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు తాప్సీ నటనకు ప్రశంసలు అందాయి. దీంతో ఈ అమ్మడికక్కడ చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. ఒక తెలుగు చిత్రంలోనూ నటిస్తున్న తాప్సీ ఒక భేటీలో మాట్లాడుతూ తాను ఇష్టపడి సినిమాల్లోకి రాలేదన్నారు. మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంలోకి వచ్చానని, ఆ తరువాత ఆ రంగం ద్వారా సినిమా అవకాశాలు వచ్చాయని చెప్పింది. అప్పుడు కూడా చేతి ఖర్చుల కోసమే చిత్రాల్లో నటించానని అంది. అలాంటిది ఒక దశలో సినిమా బాగా నచ్చిందని, దాంతో నటనపై ప్రత్యేక దృష్టి సారించానని తెలిపింది. తనకు ఆత్మవిశ్వాసం అధికం అని పేర్కొంది. దేనికీ భయపడను. తాను మోడలింగ్ చేసేటప్పుడు తన తండ్రి కంటికి నిద్రలేకుండా బతికారని అంది. అందుకు కారణం తన గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారేమోనన్న భయమేనని చెప్పింది.ఆ తరువాత తన ప్రకటనలు ప్రసారం అవుతుండగా ఆయన స్నేహితులు ప్రశంసిస్తుంటే నమ్మకం కుదిరిందని తెలిపింది. చుట్టు పక్కల వారికి భయపడే తల్లిదండ్రులు ఆడపిల్లకు స్వేచ్ఛ లేకుండా పెంచుతున్నారని అంది. తాను అలాంటి కుటుంబం నుంచి వచ్చినదానినేనని పేర్కొంది. కట్టుబాట్లలో పెరిగినంత వరకూ తనకు బాహ్య ప్రపంచం గురించి ఏమీ తెలియదని అంది. సినీరంగ ప్రవేశం తరువాత స్నేహితులు, ఇతరుల సహచర్యంతో ప్రపంచాన్ని చూశానని చెప్పింది. ఇప్పుడు తన తల్లిదండ్రులు తాను చెప్పింది వినడంతో పాటు మహిళలకు కట్టుబాట్లు అవసరం లేదని నమ్మతున్నారని చెప్పింది. కట్టుబాట్లు అనేవి స్త్రీలను అణచి వేయకూడదని అంది. ఇతరుల గురించి ఆలోచించడం పట్టించుకోవడం వదిలి మనగురించి ఆలోచిస్తే సంతోషం కలుగుతుంది, మన గురించి కాకుండా వారి గురించి ఆలోచిస్తే ఆనందానికి దూరం అవుతామని అంది. తనకు నటిగా సంతోషం లభిస్తోందిని, ఇష్టం లేకపోతే నటనను వదిలేస్తానని చెప్పింది. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు తగ్గాయని, మంచి అవకాశాలు వస్తే ఆ భాషల్లో నటిస్తానని అంది. ఇకపోతే తాను పెళ్లికి తొందర పడడం లేదని, నచ్చిన వ్యక్తి తారస పడ్డప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని తాప్సీ చెప్పుకొచ్చింది. -
పింక్‌కి అవార్డుల బోణీ...
మనదేశంలో ‘మేరిటల్ రేప్’ గురించి అవగాహన పెద్దగా లేదు. వైవాహిక జీవితంలో భార్య ఎప్పుడైనా భర్తకు సరైన కారణాలతో ‘నో’ చెప్తే భర్త ఆమెను లైంగికంగా వేధించకూడదు. లైంగిక అనుభవం గురించి బలవంత పెట్టకూడదు. అనుభవం పొందకూడదు. కానీ అదేం పెద్ద విషయం కాదన్నట్టు చెల్లుబాటైపోతూ ఉంటుంది. అలాంటిది... పరిచితమైన అమ్మాయి చనువు ఉన్నా సరే ‘నో’ చెప్తే, ఆమెపై లైంగిక చర్య కోసం పట్టుపడటం రేప్‌తో సమానం అని చెప్పిన ‘పింక్’ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీనికి అవార్డుల బోణీ మొదలైంది కూడా. ‘స్టార్ స్క్రీన్ అవార్డ్స్’ వేడుక గత వారం జరుగగా 2016 ఉత్తమ చిత్రంగా ‘పింక్’ నిలిచింది. అంతే కాదు అమితాబ్ బచ్చన్ ఉత్తమ నటుడుగా అవార్డు పొందాడు. ఇంకా చాలా అవార్డుల వేడుకలు ఉన్నాయి. అన్నింటిలో కలిపి ‘పింక్’ ఎన్ని అవార్డులు గెలుచుకుంటుందో వేచి చూడాలి. -
మెగాస్టార్ సినిమాకు మరో అరుదైన ఘనత
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ పింక్. సమాజంలో మహిళ మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించటమే కాదు, విమర్శకుల ప్రశంసలు సైతం సొంతం చేసుకుంది. తాప్సీ మరో కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమాలో ఆండ్రియా తరియంగ్, కీర్తి కుల్హర్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింపబడిన ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. త్వరలో పింక్ సినిమాను ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రదర్శించనున్నారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో పింక్ సినిమాను ప్రదర్శించాల్సిందిగా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఆహ్వానించినట్టుగా అమితాబ్ ట్విట్టర్లో వెల్లడించారు. అమితాబ్ బైపోలార్ డిజార్డర్‌తో ఇబ్బంది పడే లాయర్‌గా నటించిన ఈ సినిమాకు అనిరుద్ రాయ్ చౌదరి దర్శకుడు.T 2453 - 'PINK' invited for a special screening of the film at UN Head Quarters, in New York .. by Assitant Secretary General .. honoured ! pic.twitter.com/aWHOYt1RIS— Amitabh Bachchan (@SrBachchan) 25 November 2016 -
గులాబీ ఆకాశం
మండల కేంద్రమైన సి.బెళగల్లో ఆదివారం ఉదయం ఆరుగంటల సమయంలో ఆకాశం గులాబి వర్ణంలో కనువిందు చేసింది. సరిగ్గా సూర్యోదయ సమయంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. ఆకాశం ఆహ్లాదకరంగా మారటంతో స్థానికులు సెల్ ఫోనులలో ఆ దృశ్యాలను బంధించారు. - సి.బెళగల్ -
హిందీలో తాప్సీ హలోబ్రదర్!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘పింక్’ చిత్రంలో నటించిన తాప్సీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమా హిట్ కావడంతో తాప్సీకి బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా తన కొడుకు వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ తెరకెక్కించనున్న ‘జుడ్వా-2’లో ఓ హీరోయిన్గా తాప్సీ ఎంపికయ్యారు. నాగార్జున, రమ్యకృష్ణ, సౌందర్య కాంబినేషన్లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హలో బ్రదర్’కు ఇది రీమేక్. 1994లో ‘హలో బ్రదర్’ విడుదలైన మూడేళ్లకు ‘జుడ్వా’ పేరుతో డేవిడ్ ధావన్ హిందీలో రీమేక్ చేశారు. ఆ రీమేక్‌లో సల్మాన్‌ఖాన్, కరీనా కపూర్, రంభ నటించారు. ఇటు తెలుగులో, అటు హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి హిందీలో సీక్వెల్ తీయనున్నారు డేవిడ్. తెలుగులో సౌందర్య, హిందీలో రంభ చేసిన పాత్రను తాజా సీక్వెల్లో తాప్సీ చేయనున్నారు. అలాగే తెలుగులో రమ్యకృష్ణ, హిందీలో కరీనా కపూర్ చేసిన పాత్రను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘జుడ్వా-2’గా రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నారు. -
తాప్సీ టాట్టుకు పిచ్చ క్రేజ్
సినిమా, అందులో నటించే తారల ప్రభావం యువతపై ఎంతగా పడుతుందో అనడానికి చిన్న ఉదాహ రణ నటి తాప్సీ వంటిపై పొడిపించుకున్న టాట్టు. నటి తాప్సీ ఇప్పుడు యమ ఖుషీగా ఉన్నారు. ఈ ముద్దుగుమ్మకు దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించినా లభించని విజయం బాలీవుడ్లో దక్కింది. నిజం చెప్పాలంటే తాప్సీ సాహసోపేతమైన పాత్రలో నటించి సక్సెస్ అయ్యార ని చెప్పవచ్చు. తను బిగ్‌బీ అమితాబ్‌తో కలిసి నటించిన చిత్రం పింక్. ఇందులో అత్యాచారానికి గురైన యువతిగా తాప్సీ నటించారు. ఇందులో అమితాబ్ బచ్చన్‌కు ఎంత పేరు వచ్చిందో అంతగా తాప్సీ నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. గత 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చిన పింక్ చిత్రం ఇప్పటికే రూ. 72.44 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. త్వరలోనే వంద కోట్ల క్లబ్లో చేరుతుందని కూడా అంచనాలు వేస్తున్నారు.ఈ చిత్రం కోసం నటి తాప్సీ మెడ కింద భాగంలో పక్షులు రెక్కలు విప్పి విహంగం చేసేలాంటి టాట్టును పొడిపించుకున్నారు. ఇది ఆమె పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తుంది. టాప్సీ టాట్టు బాహ్యప్రంచంలో యువతను విపరీతంగా ఆకర్శించేస్తోందట. ఆమెలా టాట్టు పొడిపించుకోవడానికి యువతులు టాట్టు దుకాణాల్లో బారులు తీరుతున్నారట. మెడ కింద టాట్టు పొడిపించుకోవడానికి చాల బాధగా ఉంటుంది. అయినా పర్వాలేదని అక్కడే టాట్టు కావాలంటున్నారట. నటి తాప్సీ టాట్టు యువతలో ఎంత పిచ్చిగా ప్రభావం చూపుతుందో చూశారా’ -
ఆ సినిమా చూసి ఫిదా అయిన సమంత!
అమిబాత్ బచ్చన్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'పింక్'. లైంగిక వేధింపులు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖులు పొగడ్తల్లో ముంచెత్తుతుండగా.. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా ఈ జాబితాలో చేరింది. సమంతను 'పింక్' సినిమా బాగా కదిలించింది. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లోనే 'పింక్' అత్యంత ముఖ్యమైన సినిమా అని ఆమె పేర్కొంది. 'ఈ ఏడాది సినిమాల్లో 'పింక్' అత్యంత కీలక సినిమాగా నిలిచిపోతుంది. ఇది నిజంగా గొప్ప సినిమా. చిత్ర యూనిట్‌పై గొప్ప గౌరవం కలిగింది' అని సామ్ ట్వీట్ చేసింది. నాయిక ప్రాధాన్యమున్న సినిమాలు దక్షిణాదిలో కూడా రావాలని సమంత చాలాకాలంగా కోరుతూ వస్తున్నది. 'పింక్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని వినిపిస్తోంది. ఈరకంగా సమంత కోరిక కొంతలో కొంత నెరవేరినట్టే. -
అప్పటివరకూ కంటి మీద కునుకు రాదు!
‘‘ఈ వయసులోనూ ఇంత బిజీ బిజీగా ఎలా సినిమాలు, యాడ్స్ చేయగలుగుతున్నారు సార్?’’... అమితాబ్ బచ్చన్‌ని ఓ వ్యక్తి అడిగారు... దానికి ఈ బిగ్ బి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ‘‘సంపాదన కోసం నేను వర్క్ చేస్తున్నాను. బతకడం కోసం అందరూ జాబ్ చేస్తున్నట్లే నేనూ చేస్తున్నా. అందులో గొప్పేం ఉంది? ఈ ఎనర్జీ ఎక్కణ్ణుంచి వస్తుందని మాత్రం అడగకండి. ఉదయం నిద్ర లేచేటప్పుడు రోజంతా ఎలా గడపాలా? అని ఆలోచించాల్సి వస్తే జీవితం బోర్ కొట్టేస్తుంది. చేతి నిండా పనితో నా లైఫ్ బ్రహ్మాండంగా ఉంది’’ అన్నారు. ప్రస్తుతం ‘పింక్’ సక్సెస్‌ని ఆస్వాదిస్తున్నారాయన. అత్యాచారానికి గురైన అమ్మాయిల కథ చుట్టూ తిరిగే సినిమా ఇది. ఈ సినిమాకి లభిస్తున్న స్పందన గురించి అమితాబ్ మాట్లాడుతూ -‘‘పింక్ అనేది సినిమా కాదు. ఒక మూమెంట్‌లా అయిపోయింది. ఇలాంటి మంచి సినిమాకి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేదు. ఈ సినిమాలో చూపించినట్లుగానే జరుగుతోంది. మా ఇంట్లో ఆడవాళ్లు రాత్రిపూట బయటికి వెళితే, వాళ్లు ఇంటికి తిరిగి వచ్చేవరకూ నాకు కంటి మీద కునుకు రాదు’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్నారాయన. తాజాగా ఒక యాడ్ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో ఆ యాడ్‌కి సంబంధించినదే. వెరైటీగా బాగుంది కదూ! -
లైంగిక వేధింపులకు గురయ్యాను!
యుక్త వయసులో తానూ లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పుకొచ్చారు నటి తాప్సీ. ఇప్పటివరకూ తాను చాలా ధైర్యవంతురాలిని అంటూ చెప్పుకొచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీ తన నిజజీవితంలోని మరో కోణాన్ని తాజాగా పేర్కొన్నారు. అది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా సంచలనం కలిగిస్తోంది. తాప్సీకిప్పుడు తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు లేవు. హిందీలో బిగ్‌బీ అమితాబ్‌తో నటించిన పింక్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. అందులో ఈ భామ అత్యాచారానికి గురైన అమ్మాయిగా నటించారు. ఈ పాత్ర గురించి ఇప్పటికే చాలాసార్లు ప్రచారం చేసుకున్న తాప్సీ.. తాజాగా ఈ పాత్రకు, తన నిజ జీవితానికి చాలా పోలికలు ఉన్నట్టు పేర్కొన్నారు. అదేమిటో చూద్దాం. ''నేను డిల్లీలో పెరిగాను. ఏదైనా ఉత్సవాల సమయంలో జనాల కూటమి అధికంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో అబ్బాయిలు అమ్మాయిలను అల్లరి చేస్తారు. కానిచోట్ల గిల్లుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. లైంగిక వేధింపులకు పాల్పడతారు. చాలా శాడిజం ప్రదర్శిస్తారు. అలాంటి క్లిష్టపరిస్థితులను నేనూ ఎదుర్కొన్నాను. ద్వంద్వార్థాలతో హింసిస్తుంటారు. వారి చూపులు కూడా చాలా క్రూరంగా ఉంటాయి. అందుకే అలాంటి చోట్లకు వెళ్లవద్దని, అలాంటి దుస్తులు ధరించవద్దని, అణిగిమణిగి ఉండాలని ఇంట్లో పెద్దలు హితవు పలికేవారు. అప్పట్లో లైంగిక వేధింపులను ఎదిరించకపోవడం నేను చేసిన తప్పు అని ఇప్పుడు అనిపిస్తోంది'' అని నటి తాప్సీ పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకూ ఈ విషయాల గురించి నోరు విప్పని ఈ అమ్మడు ఇప్పుడు వీటిని బహిర్గతం చేయడంలో ఆంతర్యం ఏమిటనే భావాన్ని సినీవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
'పింక్'ప్రీమియర్ షో లో సెలబ్రిటీలు
-
హీరోయిన్‌కూ తప్పని ఈవ్ టీజింగ్
అందరు అమ్మాయిల మాదిరిగానే హీరోయిన్ తాప్సీ కూడా కాలేజీ రోజుల్లో ఈవ్ టీజింగ్‌కు గురైందట. అయితే ఇది సాధారణమైన విషయమే అంటుంది. కానీ ఇటీవల ముంబైలో తను ఫేస్ చేసిన ఓ సంఘటన మాత్రం తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందంటోంది. ముంబైలో ఓ సాయంత్రం వేళ తన ఫ్రెండ్‌ని కలిసేందుకు బయలుదేరింది తాప్సీ. ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు మీద నడుస్తుండగా.. తనకు దగ్గరగా వచ్చి మరీ ఇద్దరు కుర్రాళ్లు నోటి దురుసును ప్రదర్శించారట. బైక్‌ని తాప్సీకి దగ్గరగా పోనిచ్చి ఆమెపై కామెంట్స్ చేసి వెకిలిగా నవ్వడం ప్రారంభించారు. గమనించిన తాప్సీ ఏమాత్రం తొణకకుండా వారినే సీరియస్‌గా చూడటం ప్రారంభించింది. కొన్ని సెకన్ల అనంతరం ఆ యువకుల ముఖాల్లో భయం మొదలవ్వడం స్పష్టంగా కనిపించిందని చెప్తుంది తాప్సీ. 'అప్పుడే తొలిసారి నాకర్థమయింది.. వాళ్ల కామెంట్లకి మనం సీరియస్‌గా స్పందించడం మొదలుపెడితే.. మగవాళ్లు మనతో సమానంగా భయపడతారని' అంటూ ఇటీవల తనకెదురైన సంఘటనను వివరించింది 'పింక్' స్టార్ తాప్సీ. లైంగిక వేధింపుల బాధితురాలిగా తాప్సి నటించిన 'పింక్' చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. తాప్సీ ఈ సినిమాలో తాను చేసిన పాత్ర.. ప్రస్తుత సమాజంలో లైంగిక దాడులకు బలైపోయిన చాలామంది యువతుల మానసిక సంఘర్షణను చూపిస్తుందని చెబుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రం తప్పకుండా తనకు సక్సెస్ తెచ్చిపెడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. -
'పింక్' మీదే తాప్సీ ఆశలు
తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, ఇక్కడ గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నా స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయింది. సౌత్ ఇండస్ట్రీలో చాలా రోజుల పాటు సక్సెస్ కోసం ఎదురుచూసిన ఈ ఢిల్లీ బ్యూటికి లక్ కలిసి రాకపోవటంతో బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్లో కూడా వరుసగా అవకాశాలు వస్తున్న నటిగా గుర్తింపు తీసుకువచ్చే పాత్రలు మాత్రం ఇంత వరకు చేయలేదు. తాజాగా పింక్ సినిమాతో అలాంటి అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చిన తాప్సీ, పింక్ సినిమాలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపించనుంది. అంతేకాదు ఈ సినిమాతో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌తో కలిసి నటిస్తుండటంపై కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది ఈ బ్యూటి. ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాతో అయినా తాప్సీకి స్టార్ స్టేటస్ అందుతుందేమో చూడాలి. -
స్మైలీ అండ్ స్టైలీ
తాప్సీ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. స్మైలింగ్ ఫేస్. తాప్సీ ఎప్పుడూ కొత్తగా కనబడతారు. స్టైలింగ్ లుక్. ఈ స్మైలింగ్, స్టైలింగ్... సినిమాలకు కొత్త ఫ్లేవర్‌ను తెచ్చాయి. ఇప్పుడు మరో కొత్త ఫ్లేవర్‌తో తాప్సీ స్క్రీన్ మీదకు వస్తున్నారు. వచ్చే శుక్రవారం ‘పింక్’ రిలీజ్. అందులో తాప్సీ స్మైల్‌ని, స్టైల్‌ని మించి... ఓ కొత్త యాంగిల్‌ని మీరు చూస్తారు. ఇంటర్వ్యూ చదవండి. ఆ కొత్తదనం ఏమిటో సినిమా రిలీజ్‌కు ముందే... మీకు తెలుస్తుంది! ♦ హలో తాప్సీ... చాన్నాళ్లయింది మిమ్మల్ని చూసి.. కొత్త హెయిర్ స్టైల్‌తో కొత్తగా కనిపిస్తున్నారు.. తాప్సీ: (నవ్వుతూ). ఈ స్టైల్ బాగుందనే అనుకుంటున్నా. ఓ సినిమా కోసం జుత్తుని కురచగా కత్తిరించు కున్నా. సినిమా కోసం ఏ హెయిర్ స్టైల్ అయినా నాకు ఓకే. అవసరమైతే డీ-గ్లామరైజ్డ్గా కూడా మారిపోతాను. ♦ చేసే క్యారెక్టర్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టే, ఈ మధ్య ఏ సినిమా పడితే అది చేయడం లేదేమో? నిజమేనండి. గ్లామరస్ రోల్స్ చాలా చేశా. ఇప్పుడూ అలాంటివి చేస్తా. కానీ, ఎక్కువగా నటనకు చాన్స్ ఉన్నవి మాత్రమే చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య హిందీలో చేసిన ‘బేబీ’ మంచి పేరు తెచ్చింది. ఇప్పుడీ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ‘పింక్’ ఇంకా మంచి పేరు తెస్తుంది. ♦ ‘పింక్’ అంత గొప్పగా ఉంటుందా? అమితాబ్ బచ్చన్‌గారి కాంబినేషన్ లో ఈ సినిమా చేయడం ఓ మరచిపోలేని అనుభూతి. ఇందులో నాది చాలెంజింగ్ రోల్. లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి క్యారెక్టర్. రియల్ లైఫ్‌లో నాకలాంటి అనుభవాలు లేవు. కనీసం నాకు తెలిసినవాళ్ల లైఫ్‌లోనూ జరగలేదు. అందుకే ఓ విక్టిమ్ (బాధితురాలు)లా నేను ఫీలవలేను. అందువల్ల, ఈ క్యారెక్టర్ చేయడం సవాల్‌గా అనిపించింది. కోర్ట్‌లో సాగే సీన్స్‌లో ఎక్కువగా ఎమోషన్ అవడం, ఎక్కువ సీన్స్‌లో ఏడవడం.. ఇలా రియల్ లైఫ్‌లో నేను కానిది చేశాను. బాగా చేశాననే అనుకుంటున్నా. ఆడియన్స్ బాగా అప్రిషియేట్ చేస్తారని నమ్ముతున్నా. ♦ రియల్ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నట్లే కనిపిస్తారు. సినిమా కోసం అందుకు విరుద్ధంగా చేసినప్పుడు ఏమనిపిస్తుంది? యాక్టర్స్‌కి బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే.. స్క్రీన్‌పై డిఫరెంట్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్గా కనిపించవచ్చు. కాకపోతే మా మనస్తత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు వచ్చినప్పుడు చేయడానికి ఈజీగా ఉంటుంది. ‘పింక్’లో నేను చేసిన అరోరా క్యారెక్టర్ నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుంది. ♦ అదేంటీ.. నిజజీవితంలో మీపై లైంగిక దాడులు జరగలేదన్నారు.. ఇప్పుడీ పాత్ర మీకు దగ్గరగా ఉందంటున్నారు? చదువుకునే రోజుల్లో భయం భయంగా ఉండేదాన్ని. ఆ తర్వాత మైండ్ సెట్ మారింది. నేనెలా బతకాలని కోరుకుంటున్నానో అలానే ఉంటున్నాను. సొసైటీ గురించి పట్టించుకోను. ‘మనం ఇలా ఉంటే వాళ్లేమనుకుంటారో’ అని నా ఇష్టాలను మానుకోను. అలాగని, నేను లెక్కలేనితనంగా, ఇష్టం వచ్చినట్లుగా ఉండను. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అన్నది నా అభిప్రాయం. ఈ సినిమాలో నేను చేసిన అరోరా పాత్ర ఫీలింగ్ కూడా అదే. న్యాయం కోసం పోరాడుతుంది. ♦ మీరు సినిమాలో పోరాడారు. రియల్‌గా లైంగిక దాడులు ఎదుర్కొనే అమ్మాయిలు పోరాటం చేస్తూనే ఉన్నారు.. అంతెందుకు మీ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన పెద్ద షాక్... నేను ఢిల్లీ అమ్మాయినే. కానీ, నా చేతిలో ఏం ఉంటుంది? ఒకవేళ ఉంటే మాత్రం క్రిమినల్స్‌కి టఫ్ పనిష్మెంట్ ఇచ్చేదాన్ని. యాక్చువల్లీ.. మొత్తం ఇండియాలో ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. కానీ, క్యాపిటల్ సిటీ కాబట్టి ఢిల్లీలో మాగ్జిమమ్ వెలుగులోకొచ్చేస్తాయ్. చదువు లేకపోవడంవల్లనా? సరిగ్గా పెరగకపోవడం వల్లనా? దేనివల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో అర్థం కావడంలేదు. కానీ, ఇలాంటి దారుణాల గురించి విన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. ♦ ఎప్పుడో అరవై ఏళ్ల క్రితం మన రాజ్యాంగంలో రాసినవే దాదాపు ఇప్పటికీ పాటిస్తున్నాం. చట్టంలో సవరణలు జరిగితే ఏదైనా ఉపయోగం ఉంటుందా? ‘లా’ గురించి మాట్లాడడానికి నేను చాలా చిన్న వ్యక్తిని. నా అభిప్రాయం ఏంటంటే... పట్టుబడితే పనిష్మెంట్ కఠినంగా ఉండాలి. అప్పుడు తప్పు చేయాలనే ఆలోచన వచ్చినవాళ్ల వెన్నులో వణుకు పుడుతుంది. కానీ, ఎక్కడ భయపడుతున్నారు? తప్పు చేసినవాళ్లు (నిర్భయ కేసులో దోషులు) చట్టానికి భయపడలేదు. మృగాల్లా ప్రవర్తించారు. ‘చట్టం మనల్ని ఏం చేస్తుందిలే. నచ్చింది చేసేద్దాం, ఏమీ జరగదు’ అని రెచ్చిపోయారు. తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరి ఆలోచనా ఇలానే ఉండి ఉంటుంది. చట్టానికి ఎప్పుడైతే భయపడతారో.. అప్పుడే వీటన్నిటికి అడ్డుకట్ట పడుతుంది. ♦ మీరు సెలబ్రిటీ కనుక చుట్టూ బాడీగార్డ్స్‌తో సేఫ్‌గా ఉంటారు.. నార్మల్ గాళ్స్‌కి సేఫ్టీ తక్కువే? ఏదైనా ప్రెస్మీట్స్, ఈవెంట్స్ అప్పుడే మాకు బాడీగార్డ్స్ ఉంటారు. విడిగా ఉండరు కదా. ముంబయ్, ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు బాడీగార్డ్స్ ఉండరు. నార్మల్ గాళ్లానే ఉంటాను. ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు ఒంటరిగానే వెళతాను. అప్పుడు సేఫ్టీ చాలా తక్కువ. ♦ సెలబ్రిటీలు బయటికొస్తే చాలు.. జనాలు గుమిగూడతారు. ఉదాహరణకు మొన్న మీరు బెంగళూరు వెళ్లినప్పుడు కొంతమంది చుట్టుముట్టేశారు... సెలబ్రిటీల లైఫ్‌లో ఇలాంటివి కామన్. మమ్మల్ని దగ్గరగా చూడాలనుకుంటారు. వీలైతే తాకాలనుకుంటారు. అదంతా అభిమానంతోనే అని నా ఫీలింగ్. ఫ్యాన్స్ ఎప్పుడూ హాని చేయాలనుకోరు. కానీ, కొంతమంది మాత్రం ఎక్కడెక్కడో టచ్ చేయాలని చూస్తారు. ఎగ్జైట్మెంట్ వలన వాళ్లను వాళ్లు కంట్రోల్ చేసుకోలేరు. అత్యుత్సాహంతో సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నామనే విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటారు. హద్దులు దాటనంతరవకూ మాకు బాగానే ఉంటుంది. అభిమానం హద్దులు దాటితేనే అసౌకర్యంగా ఉంటుంది. ♦ ఆ సమయాల్లో మీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు? కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకుంటా. ‘టికెట్ కొని నీ సినిమా చూసే ప్రేక్షకులు వీళ్లే. తిట్టకు. వీలైతే పెదాల పైకి నవ్వు తెచ్చుకో. కోపాన్ని కంట్రోల్ చేసుకో. వీళ్లంతా నీవాళ్లే’ అనుకుంటాను. కోపం ఎగిరిపోతుంది. ♦ నా కూతుర్ని అలా పెంచుతా! ఐదు, పదేళ్ల తర్వాత మీరు తల్లవుతారు కదా. అప్పుడు మీకు పాప కావాలా? బాబా? నాకు పాప కావాలి. బాబు ఇష్టం కాదని కాదు. పాపని ఎందుకు కోరుకుంటున్నానంటే నేను చేయలేనివన్నీ నా కూతురు చేయాలి. చాలా హ్యాపీగా ఉండాలి. ♦ ఏంటి మీరు చేయలేకపోయినవి? నా టీనేజ్‌లో నేను భయపడుతూ బతికాను. ఎవరైనా అబ్బాయిలు కామెంట్ చేస్తే, నన్ను తప్పుగా అనుకుంటారేమోనని సంకోచం. కానీ, నా కూతురు అలా భయపడకూడదు. ‘తప్పు చేసినవాడు భయపడాలి? మనం కాదు’ అని క్లియర్‌గా చెబుతాను. మా ఇంట్లో నాకు మా అమ్మానాన్న కొన్ని హద్దులు పెట్టారు. సమాజంలో పరిస్థితులకు భయపడి అలా చేశారు. నేను వాళ్లని తప్పు పట్టడంలేదు. కానీ, నా కూతురికి మాత్రం నేను లేని పోని హద్దులు పెట్టను. స్వేచ్ఛగా బతకమంటాను. తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తనే తీసుకునేంత కాన్ఫిడెన్స్‌గా పెంచుతాను. ♦ సెలబ్రిటీ కాకముందు ఎలా రియాక్ట్ అయ్యేవారు? భయపడేదాన్ని. బస్‌లో వెళుతున్నప్పుడో, పబ్లిక్ ప్లేసెస్లోనో ఎవరైనా టచ్ చేస్తే వణికిపోయేదాన్ని. ఎందుకంటే, ‘మనదే తప్పు, అందుకే ఇలా జరిగింది’ అనుకునేదాన్ని. స్టార్టింగ్ నుంచీ పేరెంట్స్ అమ్మాయిలకు ఆంక్షలు పెట్టడం వల్లే అమ్మాయిల్లో ఇలా భయం పెరుగుతుంది. అబ్బాయిలు తాకినప్పుడు ఆ అమ్మాయి మీద జాలిపడేవాళ్లు చాలా తక్కువ, అమ్మాయిదే తప్పనడానికి రెడీ అయ్యేవాళ్లు ఎక్కువ ఉంటారు. అందుకే, అబ్బాయి తప్పు చేసినా అమ్మాయి తాను తప్పు చేసినట్లుగా ఫీలవుతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే అమ్మాయిలు తిరగబడాలి. బుద్ధి చెప్పడం మొదలుపెడితే... తాకడానికి కాదు కదా.. కనీసం కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడతారు. ♦ అమ్మాయిలకు బోల్డన్ని హద్దులు.. అబ్బాయిలకు కావల్సినంత స్వేచ్ఛ. అబ్బాయిలకూ హద్దులు విధిస్తే బాగుంటుంది కదా? నిజంగా బాగుంటుంది. అమ్మాయిలపై దాడులు తగ్గుతాయని నా అభిప్రాయం. ఓ అమ్మాయి ఇవి చేయాలి. ఇవి చేయకూడదు. ఇక్కడికి వెళ్లాలి, అక్కడికి వెళ్లకూడదు. సన్‌సెట్ తర్వాత, లేట్ నైట్ పార్టీలకు వెళితే అంతే సంగతులు.. అంటూ అమ్మాయిలు ఏం చేయకూడదో పెద్ద లిస్ట్ ఉంది. ఇలాంటి లిస్ట్ అబ్బాయిలకు ఇవ్వలేదు. అబ్బాయిలకూ ఇస్తే, వాళ్లు విచ్చలవిడిగా తిరగరు. లేట్ నైట్స్‌లో ఇంటి పట్టునే ఉంటారు. చాలా సమస్యలు తగ్గుతాయి. ♦ ప్రొఫెషనల్‌గా హ్యాపీ. పర్సనల్‌గా సింగిల్‌గానే ఉన్నారు? పెళ్లి గురించే అడుగుతున్నారు కదా. బాలీవుడ్లో ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను. ఇంకా చాలా సాధించాలి. ♦ మ్యారేజ్‌కి రైట్ టైమ్ అనేది ఉంటుందేమో? నా దృష్టిలో పెళ్లికి టైమ్ అంటూ లేదు. ఎప్పుడనిపిస్తే అప్పుడు చేసుకోవాలి. నాకిప్పుడు అనిపించడంలేదు. ప్రొఫెషనల్‌గా బాగా వర్క్ చేశాం అనే తృప్తి లభించాక పెళ్లి చేసుకునేంత టైమ్ ఉంటుంది. అదే నాకు రైట్ టైమ్. ♦ అంటే.. పాతిక నుంచి 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం మంచిదంటారు కదా? ఆ ఆలోచనలో మార్పు రావాలి. ఏజ్ దాటుతోంది కదా అని బలవంతంగా పెళ్లి చేసుకున్నప్పుడు, అది వర్కవుట్ అయితే ఓకే. ఫోర్డ్స్ మ్యారేజెస్ ఎప్పుడూ సమస్యాత్మకంగానే సాగుతాయి. అది మంచిది కాదు. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే ఇష్టం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. ♦ ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నట్లుగా... ఇష్టం వచ్చినప్పుడు పిల్లల్ని కనేంతగా ఫిజికల్ సిస్టమ్ సపోర్ట్ చేయదు? ఇది ఒకప్పటి మాట. 20 ఏళ్లల్లోనే కాదు.. 60 ఏళ్లల్లోనూ పిల్లల్ని కనే సామర్థ్యం ఉంది. సైన్స్ పరంగా మంచి మార్పొచ్చింది. టెక్నాలజీ అభివృద్ధి చెందింది. సైన్స్, టెక్నాలజీ సపోర్ట్‌తో హ్యాపీగా తల్లి కావచ్చు. మొన్నీ మధ్యే ఓ అరవయ్యేళ్ల మహిళ తల్లయ్యారు. ♦ ఫైనల్లీ తెలుగుకి ఎందుకు దూరమయ్యారు? నేను దూరం కాలేదండి బాబూ. ప్లీజ్.. మంచి అవకాశాలివ్వండి. ఇప్పుడు నేను చేస్తున్నవాటిలో తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘ఘాజి’ అనే సినిమా ఒకటి. హైదరాబాద్ నా సెకండ్ హోమ్. నటిగా నాకు సవాల్‌గా నిలిచే క్యారెక్టర్స్ ఆశిస్తున్నా. ఎవరైనా ఇస్తే, తప్పకుండా చేస్తా. - డి.జి. భవాని -
గులాబీ రంగు పురుగుతో జాగ్రత్త
పోచమ్మమైదాన్ : జిల్లాలో సాగుచేసిన పత్తి పంటలో గులాబీ రంగు పురుగు తక్కువ మోతాదులోనే ఉంది.. రైతులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా గమనిస్తూ తగిన నివారణ చర్యలు తీసుకోవాలని ఏడీఆర్ డాక్టర్ పి.రఘురామిరెడ్డి అన్నారు. శాస్త్రవేత్తలు శుక్రవారం జనగామ, లింగాలఘన్పూర్, రఘునాథపల్లి, పరకాల, హన్మకొండ మండలాల్లో విస్తృతంగా పర్యటించి పత్తి పంటలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పత్తి పూత, కాయ పెరుగుదల దశలో ఉందన్నారు. సాధరణంగా గులాబీ రంగు పురుగు ఆశించిన పూలు గడ్డిపూలుగా మారతాయి. ఈ సారి మాములుగా ఉన్న పూలలో గులాబీ రంగు పురుగు ఆశించినట్లు గుర్తించామని చెప్పారు. నివారణకు పంటలో లింగాకర్షక బట్టలు అమర్చుకుని ఉధృతిని గమనించాలని సూచించారు. వరుసగా 3 రోజుల పాటు బుట్టకు 8 కంటే ఎక్కువ తల్లి పురుగులు పడితే థయోడైకార్బ్ 1.5 గ్రాములు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎరువాక కేంద్రం కోఆర్డినేటర్ ఉమారెడ్డి, పత్తి శాస్త్రవేత్త రాంప్రసాద్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
'అమితాబ్ ఇంటలిజెంట్ యాక్టర్'
బాలీవుడ్ షెహన్షా అమితాబ్, వయసైపోతున్నా విలక్షణ పాత్రలతో ఈ జనరేషన్ నటులకు పోటి ఇస్తున్నాడు. వరుసగా అవార్డ్ విన్నింగ్ క్యారెక్టర్లను ఎంచుకుంటున్న బిగ్ బి, మరోసారి అదే ప్రయోగం చేస్తున్నాడు. బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సూజిత్ సర్కార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న పింక్ సినిమాలో మానసిక రుగ్మతతో బాధపడుతున్న లాయర్‌గా నటిస్తున్నాడు. ఈ పాత్రకు అమితాబ్ ఎంపిక ఎలా జరిగిదన్న విషయాన్ని బయటపెట్టాడు సూజిత్ సర్కార్. 'పీకు సినిమా షూటింగ్ సమయంలోనే పింక్ సినిమాలోనే లాయర్ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలన్న చర్చ జరిగింది. అసలు ఆ పాత్రను యువ నటుడితో వేయించాలా..? లేదా మిడిల్ ఏజ్ ఆరిస్ట్‌తో చేయించాలా..? లేక సీనియర్‌ను ఎంపిక చేయాలా..? అని ఆలోచించాం. అదే సమయంలో అమితాబ్ ఆ పాత్రలో నటిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. వెంటనే బిగ్ బిని సంప్రదించాం. పింక్ సినిమాలోని పాత్ర గురించి ఆయనకు వివరించా... అమితాబ్ ఇంటలిజెంట్ ఆర్టిస్ట్. కేవలం ఐదు నిమిషాల పాటు కథ విని ఈ పాత్రకు అంగీకరించారు'. అని బిగ్ బి ఎంపిక వెనుక కథను తెలియజేశారు. అనిరుద్దా రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. -
ఢిల్లీ చూపిస్త భామ!
సెలవుల్లో సొంతూరికి స్నేహితులను తీసుకువెళితే ఆ మజానే వేరు. వాళ్లకి అతిథి మర్యాదలు చేయడం, ఊరంతా చూపించడం, ఊరు విశేషాలు చెప్పడం.. అచ్చంగా ఓ గైడ్‌లా అన్నీ దగ్గరుండి చూసుకుంటాం. ఇటీవల తాప్సీ కూడా గైడ్‌లా మారిపోయారు. అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పింక్’. ఈ సినిమా షూటింగ్ అంతా ఢిల్లీలోనే జరిగింది. తాప్సీది ఢిల్లీనే కదా. పుట్టి పెరిగింది, చదువుకుందీ అక్కడే. ప్రతి ఏరియా బాగా తెలుసు. సొంతూరిలో షూటింగ్ కావడంతో ఎంచక్కా ఇంటి నుంచి షూటింగ్‌కి వెళ్లడం.. రావడం.. ఫ్యామిలీతో కలసి బాగా ఎంజాయ్ చేశారట. అంతే కాదండోయ్.. తాప్సీతో కలసి సినిమాలో నటించిన మిగతా ఇద్దరు భామలు ఆండ్రియా తారింగ్, కీర్తీ కుల్హరిలది ఢిల్లీ కాదు. దాంతో ఢిల్లీ చూపిస్త భామ అంటూ వాళ్లిద్దరి కోసం తాప్సీ పార్ట్‌టైమ్ గైడ్ కింద మారారు. ఢిల్లీ సిటీ అంతా చూపించడంతో పాటు మెట్రో రైల్లో తిరగడం, సరోజినీ నగర్ మార్కెట్లో షాపింగ్.. పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశానన్నారు. దాంతో పాటు ఓ మంచి పని కూడా చేశారామె. ఆ విషయంలోకి వస్తే... నేనైతే ఒక్కటిస్తా! ఓ రోజు ఈ చిత్రం షూటింగ్ ముగించుకుని ఇంటి దారిపట్టారు తాప్సీ. కారు ఎక్కబోతుండగా.. కొంతమంది అబ్బాయిలు ఓ అమ్మాయిని విచిత్రమైన శబ్దాలతో వెక్కిరించడం ఈ బ్యూటీ కంటపడింది. దాంతో పాటు ద్వందార్థాలతో ఆ అమ్మాయిని ఏడిపించారట. అది భరించలేని తాప్సీ ఆ అబ్బాయిలను చురుగ్గా చూడటంతో వాళ్లు ఖంగు తిన్నారట. అప్పుడా అమ్మాయిని తన కారులో ఎక్కించుకుని, ఇంటి దగ్గర వదిలిపెట్టారట. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ - ‘‘ప్రతి అమ్మాయికీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు సిగ్గుపడకూడదు, భయపడకూడదు. ధైర్యంగా ఎదిరించాలి. నేనైతే ఒక్కటిస్తా’’ అన్నారు. -
కుప్పకూలిపోయాను!
‘అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు’ అని గాంధీజీ అన్నారు. ‘నిర్భయ’ వంటి ఘటనలు చూసిన తర్వాత దేశంలో అర్ధరాత్రి ఆడది తిరిగే పరిస్థితి ఉందా? అని ప్రశ్నిస్తే, జవాబు చెప్పడం కష్టమే. ‘అత్యాచారాల నుంచి మహిళలకు విముక్తి లభించినప్పుడే స్వాతంత్య్రం వచ్చినట్టు. అలాంటి భారతదేశాన్ని చూడాలనుకుంటున్నా’ అని అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానించారు. అమితాబ్, తాప్సీ ముఖ్య తారలుగా నటించిన ‘పింక్’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పై వ్యాఖ్యలు చేశారాయన. ఈ చిత్రంలో లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిగా తాప్సీ నటించారు. ‘‘వ్యక్తిగతంగా ఈ పాత్ర నాపై ప్రభావం చూపింది. భావోద్వేగాలు అదుపు చేసుకోవడం కష్టమైంది. ఏడుస్తూ పలుసార్లు సెట్లో కుప్పకూలా. పాత్రలో ఒదిగిపోయి నటించా. ఈ సినిమా షూటింగ్ జరిగిన రెండు నెలలు మరో సినిమా చేయలేదు’’ అని తాప్సీ పేర్కొన్నారు. -
'పింక్' సినిమా ట్రైలర్ విడుదల
-
తాప్సీని అంత కష్టమైన ప్రశ్నలెందుకడిగారు?
కోర్టు సీన్.. ఎదురుగా లాయర్ పాత్రలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. బోనులో నిందితురాలిగా తాప్సీ.. 'మీరు వర్జినా కాదా?' అని లాయర్ ప్రశ్న.. బిత్తరపోయిన నిందితురాలిని చూస్తూ.. 'తలూపడం కాదు.. అవునా? కాదా? చెప్పండి' అని లాయర్ గద్దింపు. 'కాదు' అని తాప్సీ సమాధానం. ఇది అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'పింక్' సినిమా ట్రైలర్ లోని ఓ సీన్. ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇందులో లాయర్ దీపక్‌గా అమితాబ్ నటిస్తుండగా.. ఓ కేసులో నిందితురాలిగా తాప్సీ కనిపించనుంది. ఆమె చేసిన నేరం ఏమైంది తెలియనప్పటికీ.. హత్యకేసులో నిందితురాలిగా ఉన్నట్టు ట్రైలర్‌ను బట్టి అర్థం అవుతున్నది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా అనిరుద్ధ రాయ్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన 'పింక్' సినిమా సెప్టెంబర్ 18న విడుదల కానుంది. షూజిత్ సర్కార్ నిర్మించిన ఈ సినిమా ఓ మహిళ న్యాయపోరాటం నేపథ్యంగా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. -
బాలీవుడ్లో బిజీ అవుతోంది
సౌత్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఢిల్లీ భామ తాప్సీ పన్ను. తొలి సినిమాలోనే తన అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటి స్టార్ హీరోయిన్ ట్యాగ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. సౌత్‌లో వరుస సినిమాలు చేసినా స్టార్ ఇమేజ్ అందుకోలేకపోవటంతో బాలీవుడ్ బాట పట్టింది. సౌత్ హీరోయిన్లకు నార్త్‌లో పెద్దగా అవకాశాలు రావన్న అపవాదును చెరిపేస్తూ వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న సాకిబ్ సలీమ్‌తో చేస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొంటోంది తాప్సీ. ఈ సినిమా పూర్తవ్వగానే ప్రకాష్ రాజ్ తొలిసారిగా బాలీవుడ్లో డైరెక్ట్ చేస్తున్న తడ్కా సినిమా చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు అమితాబ్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న పింక్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనుంది. ఈ మూడు సినిమాల తరువాత రాజ్ కుమార్ రావ్ హీరోగా రత్నసిన్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలోనూ హీరోయిన్గా నటించనుంది. ఇలా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది తాప్సీ పన్ను. -
కాస్ట్యూమ్స్, మేకప్ అన్నీ ఆవిడవే!
కథానాయికగా పలు క్రేజీ బాలీవుడ్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న తాప్సీ తాజాగా మరో అవతారం ఎత్తారు. ‘పికు’ ఫేమ్ సుజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పింక్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఢిల్లీ అమ్మాయిగా కనిపించనున్నారు. ఆమె సొంత ఊరు కూడా ఢిల్లీ కావడంతో తాప్సీ ఈ సినిమా చిత్రీకరణను ఎంజాయ్ చేస్తున్నారట. ఈ చిత్రం కోసం స్టయిలిస్ట్‌గా కూడా మారారు. తన దుస్తుల డిజైనింగ్, మేకప్ విషయాల్లో తాప్సీకి దర్శకుడు స్వేచ్ఛ ఇచ్చేయడంతో చక్కగా ఢిల్లీలో తన నచ్చిన షాపింగ్ మాల్స్‌కు వెళిపోయి, హాయిగా షాపింగ్ చేస్తున్నారట. ‘‘నా జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర కావడంతో ఈ సినిమాలో నా మేకప్, లుక్ విషయంలో దర్శకుడు నాకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు. ఏ సినిమాకు రానీ అవకాశమిది’’ అని చెప్పారు. అన్నట్లు ఈ ‘పింక్’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
మార్షల్ ఆర్ట్స్‌కి రెడీ!
శ్రుతీహాసన్ కర్రసాము చేస్తే? విలన్లను ఎగిరెగిరి తంతే?.. ఈ గులాబీ బాల ఇవన్నీ చేయగలగుతారా? అని అనుమానంగా ఉందా? కానీ, శ్రుతీహాసన్‌కి మాత్రం ఎలాంటి అనుమానం లేదు. చెట్ల చుట్టూ తిరుగుతూ డ్యూయెట్లు పాడటం, నాలుగైదు సెంటిమెంట్ సన్నివేశాల ద్వారా మనసుని టచ్ చేయడం, కామెడీ చేసి నవ్వించడం.. ఇవన్నీ శ్రుతీకి బాగా తెలుసు. ఇప్పుడు తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి రెడీ అయ్యారు. పూర్తి స్థాయి యాక్షన్ కథా చిత్రంలో నటించనున్నారు. హిందీలో బాజీగర్, సోల్జర్, రేస్, రేస్ 2 వంటి యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శక ద్వయం అబ్బాస్-మస్తాన్ దర్శకత్వంలో శ్రుతీహాసన్ ఓ చిత్రంలో నటించనున్నారట. ఇటీవలే ఈ దర్శకులిద్దరూ శ్రుతీకి కథ చెప్పారనీ, ఆమెకు కూడా ఆ కథ నచ్చిందనీ భోగట్టా. ఈ చిత్రంలో వీరోచితమైన పోరాట దృశ్యాల్లో నటించాలి కాబట్టి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి రెడీ అవుతున్నారట. ఇప్పటికే కేరళకు చెందిన కలరిపయ్యాట్టు అనే మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్‌లో ఆరంభం కానుంది. ఈలోపు పాత్ర గురించి అవగాహన పెంచుకోవడానికి వర్క్ షాప్స్కి కూడా హాజరు కావాలనుకుంటున్నారట. -
స్విస్‌లో ‘పింక్’ స్వింగ్!
ఆసీస్, ఇంగ్లండ్‌లాంటి చోట ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నా... ప్రపంచ క్రికెట్లో తొలిసారి పూర్తి స్థాయిలో ‘పింక్’ బంతులను స్విట్జర్లాండ్ వినియోగించనుంది. 2015-16 దేశవాళీ సీజన్లో ఆ దేశంలోని 20 క్లబ్‌లు ఆడే అన్ని మ్యాచ్‌లలో పింక్ బంతులను ఉపయోగిస్తారు. క్రికెట్ ఇంకా బాలారిష్టాలను దాటని ఆ దేశంలో క్రికెట్ మాత్రమే ఆడే పెద్ద మైదానాలు లేవు, సైట్ స్క్రీన్లను వాడే అవకాశం లేదు. చుట్టు పక్కల మొత్తం తెల్ల రంగు భవనాలు, ఎర్రని ఇటుకల ఇళ్లు కనిపిస్తాయి. పచ్చటి అడవులు కూడా వర్షం, శీతాకాలాల్లో ఎర్రగా కనిపిస్తాయి. కాబట్టి బ్యాక్ గ్రౌండ్ క్రికెటర్లకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరూ వాడే ఎరుపు, తెల్ల బంతులకు అక్కడ అవకాశమే లేదు! దాంతో మధ్యేమార్గంగా పింక్ బంతులను ఓకే చేశారు. -
గూడు దాటని గులాబీ గుబాళింపు..!
అధినేత ప్రకటించినా సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ తారుమారు నేడు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సంస్థాగత సంస్కరణలతోపాటు, ఎన్నికలకు ముహూర్తం కుదరడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా, సొంత పార్టీ వ్యవహారాలను ఇంకా చక్కబెట్టలేకపోయారు. ఫిబ్రవరిలో ఇందుకోసం ప్రయత్నాలు ప్రారంభించినా ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అవకాశం కార్యకర్తలకే ఉంటుందని పార్టీ నాయకత్వం పలుమార్లు పేర్కొన్నా ఆదిశగా వారి సేవలను వినియోగించుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీ యే కాకుండా, చివరకు పార్టీ పదవులకు కూడా దిక్కులేకుండా పోయిందన్న అసంతృప్తి పా ర్టీ వర్గాల్లోని అన్ని స్థాయిల్లో గూడుకట్టుకుంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే రెండుసార్లు పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. ఫిబ్రవరి 3న ప్రారంభమైన సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆ నెల 20వ తేదీ వరకు కొనసాగింది. కానీ, ఇప్పటికీ ఎంత సభ్యత్వం నమోదయిందో పార్టీ నాయకత్వం నుంచి ప్రకటనే వెలువడలేదు. సభ్యత్వ నమోదు వ్యవహరాలను పర్యవేక్షించడానికి నియమించిన అడహాక్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని శాసనమండలి ఎన్నికల్లో ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. ఈలోగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. సీఎం అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ భేటీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సోమవారం సాయంత్రం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ప్రధానంగా సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత ఎన్నికలు, మండలి ఎన్నికలు, పార్టీ సభ్యులకు బీమా సౌకర్యం తదితర అంశాలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాసన మండలికి ఎన్నికలు జరుగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్, అడహక్కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను గెలిపించుకోవడం పార్టీ ముందున్న అతి పెద్ద సవాలు. ఒక్క ప్రతి కూల ఫలితం వచ్చినా, అది ప్రభుత్వ పాల నకు రెఫరెండంగా ప్రచారం చేసే అవకాశం ఉండడంతో ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పారు. త్వరలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలూ జరగనున్నాయి. ఏప్రిల్ 24న పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక, 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. మరో సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను సీఎం ప్రకటించే అవకాశం ఉంది. -
ప్రేమంటే ఏమిటంటే..?
గులాబీ పూస్తే ఒక్క రోజుపాటు అందంగా ఉంటుంది. మరుసటి రోజు తన రూపు కోల్పోతుంది. అదే మనసులో ప్రేమ పుడితే. అది అందంగా వికసించడమే కాదు. నిత్య ప్రవాహమవుతుంది. ప్రేమ కేవలం ఇద్దరు యువతీయువకుల మధ్య పుట్టేదే కాదు. తల్లీదండ్రులు పిల్లలు... అన్నా చె ల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు... ఇలా సర్వవ్యాపితమైన ప్రేమను అందరూ వ్యక్తీకరించుకోవచ్చు. కానీ ‘ప్రేమకు ఒకరోజు’ పేరుతో ఏర్పడిన వాలెంటైన్స్‌డేను ప్రేమికులే జరుపుకొంటారు. మరి ప్రేమ ఈ ఒక్క రోజుకే పరిమితమా? అసలు ప్రేమకు ఒకరోజు అవసరమా? ప్రేమ ఎలా ఉండాలి? లాంటి అంశాలతో ‘సాక్షి’ ఆధ్వర్యంలో చర్చ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని రిజెన్సీ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో సినీ,బుల్లితెర నటుడు విజయ్, దర్శకులు శేఖర్సూరి(ఏ ఫిలిం బై అరవింద్), రాజేష్ (నా బంగారు తల్లి), బుల్లితెర కథానాయికలు సుభాషిణి, సునీత, అనూష, లహరిక, అనిత, మైత్రిక, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రేమపై తమ భావాలను ఇలా వ్యక్తీకరించారు. ప్రేమికుల దినోత్సవం అనగానే చాలామందిలో నేటికీ ఒక అపోహ ఉంది. ఇది కేవలం ప్రేమించుకొనే యువతీయువకులకు సంబంధించిన అంశమని. కానీ ఇలాంటి ఆలోచనే తప్పంటున్నారు చర్చావేదికలో పాల్గొన్న పలువురు కాలేజీ విద్యార్థులు. అది నిత్యం ప్రవహించే నది లాంటిది. ప్రేమను ఒక్క రోజుకే పరిమితం చేసుకొని ఆరోజునే ప్రేమను వ్యక్తీకరించాలనుకోవడం సబబు కాదంటున్నారు. వాలెంటైన్ డేను సమర్ధిస్తారా.. సమర్థిస్తే ఎందుకు అంటూ దర్శకులు శేఖర్సూరి అడిగిన ప్రశ్నకు ‘మనసిచ్చి పుచ్చుకొని మాట్లాడుకోవడం ఏ రోజైనా చేయొచ్చు. కానీ ప్రేమికుల మధ్య ఉన్న మనస్పర్థలను, వ్యత్యాసాలను తగ్గించేందుకు ఇలాంటి ఒక రోజు అవసరం. వారి మధ్య అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. ఆ రోజున ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవచ్చు’ అని స్పందించారు విద్యార్థులు. కానీ వాలెంటైన్ డే అనేది అది కేవలం ప్రేమికులకు సంబంధించినది కాదు. ప్రతి ఒక్కరూ జరుపుకొనేదంటున్నారు దర్శకులు శేఖర్సూరి. అయితే పార్కులకు వెళ్లి, ఐస్‌క్రీమ్‌లు తిని అటునుంచి అటు సినిమాలకు వెళ్లడం ప్రేమకాదు, ఆలోచనలను, జీవితాన్ని మార్చి, సరైన దిశలో అడుగులు వేయించే ఒక బాధ్యత అంటున్నారు సిరిల్. విషం చిమ్మొద్దు.. ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. అలాంటి ఆ ప్రేమ ఫలించలేదని కొందరు ‘విషం’ చిమ్ముతుంటారు. ఇది సమంజసం కాదంటున్నారు బుల్లితెర కథానాయిక మైత్రేయి. ఇలాంటి ధోరణి మారాలి. ప్రేమ మనిషినే కాదు.. మనసును కూడా అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రేమతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు మరో కథానాయిక లహరిక. ‘ప్రేమ అనేది ఒక్కరోజుకు పరిమితమైనది కాదు.. ఇది ప్రతి రోజూ ఉండాలి. ప్రేమలో నిజాయితీ ఉండాలి. అది ఎవరితోనైనా సరే! ప్రేమను వ్యక్తీకరించుకోవడానికి ఒక రోజు ఉండాలి. కానీ అదే ప్రేమకు కొలమానంగా ఉండకూడదు’ అని అంటున్నారు దర్శకుడు రాజేష్. ‘అన్ని రోజులు ఒకేలా ఉంటే బాగుండదు. అదే ఒక రోజంటూ ఉంటే.. ఆ రోజు కోసం సంవత్సర కాలం ఎదురుచూస్తారు. ప్రేమించిన వారు తమ ప్రేమను వ్యక్తీకరిస్తూ ఇచ్చే అందమైన అనుభూతిని కలకాలం గుండెల్లో దాచుకుంటారు’ అని అభిప్రాయపడుతున్నారు సునీత. జీవితాంతం... చాలా మంది ప్రేమికుల రోజును గుర్తుంచుకుంటున్నారు కాని అంతకుముందు రోజైన ఫిబ్రవరి 13 భగత్‌సింగ్ చనిపోయిన రోజు. అలాంటి రోజును గుర్తుపెట్టుకోవడం లేదు. విదేశీ సంస్కృతిని ఇంతలా పాటిస్తున్న మనం... మన దేశంకోసం త్యాగం చేసిన వ్యక్తిని మరుస్తున్నాం. ఇలాంటివారిని గుర్తు పెట్టుకున్ననాడే మన దేశంపై, మనం ఇష్టపడే వారిపై ప్రేమను చూపగలమని అభిప్రాయ పడ్డారు నటి సుభాషిణి. ఈ వాలెంటైన్స్ డేనాడు ఒకరితో, వచ్చే వాలెంటైన్స్‌డేకు మరొకరితో.. ఇప్పుడు కొందరి ప్రేమ పరిస్థితి ఇది. కానీ ప్రేమ అంటే ఇద్దరు, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం నడిచే బాట. తప్పటడుగులను సైతం సరిచేసుకొని ముందుకెళ్లాలన్నారు నటుడు విజయ్. - పి.నరసింహారెడ్డి, బంజారాహిల్స్ -
బహుమెత్తని బహుమతి
మన ఇష్టాన్ని అవతలివారికి తెలియజేయడానికి పడే కష్టాన్ని తగ్గించేది.. అవతలివారి ఇష్టాన్ని చూరగొనడానికి చేసే ప్రయత్నం ఫలించేలా చేసేది ఒకటుంది. అదేంటో తెలుసా..? కానుక. అవును. ఓ మంచి కానుక మనం చెప్పకుండానే మన మనసును అవతలివారి ముందు పరుస్తుంది. వారి మనసులో మనమీద ఓ ముద్ర వేస్తుంది. తగిన స్థానాన్నీ కల్పిస్తుంది. అందుకే మన అనుకునేవారికి, మనవాళ్లని చేసుకునేందుకు మనం ఎంచుకున్న వారికి.. మంచి కానుకను ఇవ్వడానికి ఓ రోజును సృష్టించారు. అదే ‘టెడ్డీ డే’! ..:: సమీర నేలపూడి వాలెంటైన్ వీక్‌లో నాలుగో రోజైన ‘టెడ్డీ డే’ నాడు ప్రతి ప్రేమికుడూ తన ప్రేయసికి ఓ టెడ్డీ బేర్‌ను గిఫ్ట్‌గా ఇస్తాడు. టెడ్డీ బేర్నే ఎందుకు ఇస్తారు అన్నది తెలుసుకోవాలంటే.. ముందు ఆ బొమ్మ చరిత్రను తెలుసుకోవాలి. నిజానికి టెడ్డీ బేర్ అనే బొమ్మ పుట్టుక వెనుక పెద్ద కథే ఉంది. 1902లో నాటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్.. మిసిసిపీ, లూసియానాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యని తీర్చడానికి వెళ్లారు. తీరిక సమయంలో మిసిసిపీలో వేటకు వెళ్లారు. అప్పుడాయనకు ఓ ఎలుగుబంటి కంటబడింది. వెంటనే దాన్ని వేటాడాలనుకున్నారు రూజ్వెల్ట్. కానీ అది బుజ్జి పిల్ల. ఎంతో ముద్దుగా ఉంది. దాంతో కాల్చడానికి ఆయనకు మనసొప్పలేదు. జాలితో విడిచిపెట్టేశారు. మర్నాడు ఓ పత్రికలో క్లిఫార్డ్ బెర్రీమ్యాన్ అనే కార్టూనిస్టు వేసిన చక్కని కార్టూన్ ప్రచురితమైంది. దాన్ని చూసిన ఓ బొమ్మల కంపెనీ యజమానురాలు, ఎలుగుబంటి పిల్ల రూపంలో ఓ బొమ్మను తయారుచేసింది. దాన్ని రూజ్వెల్ట్కు పంపిస్తూ... ‘ఆ బొమ్మకి టెడ్డీ బేర్’ అని పేరు పెట్టుకోవచ్చా’ అంటూ లేఖ రాసింది. ఆయన అనుమతినివ్వడంతో టెడ్డీ బేర్ అనే బొమ్మ ఈ ప్రపంచానికి పరిచయమైంది. సాఫ్ట్ గిఫ్ట్.. ఆనాడు అలా రూజ్వెల్ట్ ఎలుగు పిల్లను సంరక్షించడం వల్లే టెడ్డీ బేర్ పుట్టుకొచ్చింది కాబట్టి, టెడ్డీ బేర్‌ను సంరక్షణకు ప్రతిరూపంగా భావిస్తున్నారు. అందుకే వాలెంటైన్ వీక్‌లో ‘టెడ్డీ డే’నాడు.. నిన్ను జీవితాంతం జాగ్రత్తగా కాపాడుకుంటాను అని వాగ్దానం చేస్తూ ప్రేమికులు తమ ప్రియసఖులకు టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇవ్వడం జరుగుతోంది. ఈ మధ్య కొందరు అమ్మాయిలు కూడా అబ్బాయిలకు టెడ్డీ బేర్ కీ చెయిన్లు, టెడ్డీ బొమ్మలు ముద్రించిన గ్రీటింగ్ కార్డులూ ఇస్తున్నా.. ఎక్కువగా ఇచ్చేది మాత్రం అబ్బాయిలే. అబ్బాయిలే అమ్మాయిలకు ఎందుకు ఇస్తారు అనే ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి. మొదటిది.. అమ్మాయిలే సాఫ్ట్ టాయిస్ని ఇష్టపడతారు. రెండవది.. ఎప్పుడూ పురుషుడే స్త్రీని సంరక్షించాల్సిన స్థానంలో ఉంటాడు. అందుకే టెడ్డీ డే రాగానే ప్రతి ప్రేమికుడూ తన ఇష్టాన్ని, ప్రేమను వ్యక్తపరుస్తూ.. ఆమెను కాపాడతానని భరోసా ఇస్తూ.. అందమైన టెడ్డీ బేర్‌ని ప్రేయసి చేతుల్లో పెడతాడు. ఆమె మనసును, నమ్మకాన్ని గెలుచుకుంటాడు! అద్దాల అల్మరాల్లోంచి.. భాగ్యనగరంలో టెడ్డీ డే సందడి చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. సంవత్సరమంతా దుకాణాల్లోని అద్దాల అల్మరాల్లో కూర్చుని జాలిగా చూసే టెడ్డీ బేర్లు.. టెడ్డీ డే దగ్గర పడుతోందంటే రోడ్ల మీదకు వచ్చి సందడి చేస్తుంటాయి. ఎరుపు, తెలుపు, గులాబి, ఆరెంజ్ తదితర రంగుల్లో మెరిసిపోతుంటాయి. అయితే ప్రేమికుల మనసుకు దగ్గరగా ఉండే గులాబి రంగు టెడ్డీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. మెడకు అందమైన రిబ్బన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టెడ్డీ మెత్తని రూపం.. చెలి నులివెచ్చని కౌగిలిలో నలిగిపోతుంది. వాలెంటైన్స్ డే పూర్తయ్యే వరకూ రోడ్ల పక్క ఎక్కడ చూసినా టెడ్డీలు కనిపించి మురిపిస్తుంటాయి. ఈ ఏడాది కూడా వీటి సందడి ఎక్కువగానే ఉంది. ఎక్కడ చూసినా ప్రేమికులు టెడ్డీలను కొంటూ కనిపిస్తున్నారు. తమ ప్రేమ కానుకను ప్రేమించిన వారికి అందించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
బ్యూటీ
గులాబీలతో... కప్పు గులాబీ రేకలను పేస్ట్ చేసి, ఇందులో కొద్దిగా పాలు, కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి, మృదువుగా మసాజ్ చేయాలి. తరచు ఈ విధంగా చేస్తుంటే చేతులు మృదువుగా, కాంతిమంతంగా తయారవుతాయి. కప్పు నీళ్లలో పది గులాబీ రేకలు వేసి మరిగించి చల్లారనివ్వాలి. తర్వాత వడపోసి దీంట్లో టీ స్పూన్ రోజ్ వాటర్ కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయం, సాయంత్రం రోజూ ఈ నీటిలో దూది ఉండను ముంచి ముఖాన్ని శుభ్రంగా తుడవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. రాత్రి పడుకునేముందు గులాబీల పేస్ట్‌లో కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాసుకోవాలి. ఈ విధంగా చే స్తే పెదవులకు గులాబీల అందం వస్తుంది. పొడిబారిన జుట్టుకు... చర్మానికి లాగే జుట్టుకు కూడా మాయిశ్చరైజర్ అవసరం. ఎందుకంటే పొడిబారిన చర్మంలాగే జుట్టు కూడా నిస్తేజంగా కనిపిస్తుంది. వారానికి రెండు సార్లు పెరుగును మాడుకు, వెంట్రుకలంతా పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. అలాగే షాంపూ వాడిన తర్వాత తప్పనిసరిగా కండిషనర్‌ని ఉపయోగించాలి. తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, బాదంపప్పు, పాల ఉత్పత్తులు, తాజా కాయగూరలను చేర్చాలి. ఈ జాగ్రత్తలు పొడిబారిన జుట్టుకు జీవం తీసుకువస్తాయి. బ్లాక్ అండ్ వైట్ హెడ్స్... చాలా పార్లర్ లలో స్వేదరంధ్రాలలో పొడవాటి ఇనుప పుల్లను గుచ్చి, బ్లాక్‌హెడ్స్ తీస్తుంటారు. దీనివల్ల స్వేదరంధ్రాలు మరీ సున్నితమవుతాయి. పోర్స్ ఓపెన్ అయితే చర్మం కళ తప్పుతుంది. అలాకాకుండా, మార్కెట్లో బ్లాక్‌హెడ్స్ రిమూవల్ ఫోమ్ లభిస్తుంది. దీనిని రాసి బ్లాక్, వైట్ హెడ్స్‌ను తొలగించుకోవచ్చు. కమిలిన చర్మానికి చాకొలెట్! చర్మం మృదువుగా మారడానికి, ఎండవల్ల నల్లబడిన చర్మం తిరిగి సహజరంగుకు రావడానికి చాకొలెట్ ఫేషియల్ సహాయపడుతుంది. చాకొలెట్ క్రీమ్‌లు, స్క్రబ్ దీనిలో ఉపయోగిస్తారు. అన్ని చర్మతత్వాలకు సరిపోయే ఫేషియల్ ఇది. ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవాలంటే- ముందుగా క్లెన్సింగ్ చేసి, రోజ్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రపరచాలి. బ్రౌన్ కలర్ షుగర్, కాఫీ గింజలను కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచాలి. తరువాత ముఖం మీద కొద్దిగా నీళ్లు చిలకరించి, మృదువుగా రుద్ది, నీటితో కడగాలి. తరువాత చాకొలెట్ మసాజ్ క్రీమ్‌ను ముఖానికి రాసి, మరొకసారి మృదువుగా రాసి, శుభ్రపరిచాలి. చాకొలెట్ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి వేసి, 20 నిమిషాలు ఉంచి, చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. -
గులాబీల గుసగుసలు
పద్మావతి గార్డెన్లో గులాబీల సోయగం తెలుపు, ఎరువు, పింక్ పువ్వులు తన్మయత్వం చెందుతున్న సందర్శకులు అరకులోయ, న్యూస్‌లైన్: పర్యాటక కేంద్రం అరకులోయలోని పద్మావతి గార్డెన్‌లోని గులాబీల సోయగం సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం అన్‌సీజన్ కావడంతో సందర్శకుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉన్నా వచ్చిన వారు ఇక్కడి పూల సొగసుతో తన్మయత్వం చెందుతున్నారు. ఎరుపు, తెలుపు, పింక్...ఇలా పలు రంగుల్లో, రకరకాల ఆకారాలతో పూలు ముచ్చటగొలుపుతున్నాయి. గార్డెన్లో చూడదగిన అంశాలు ఏమీ లేకపోవడంతో పర్యాటకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నిర్వాహకులు వారిని కొంతైనా సంతోషపరచాలన్న ఉద్దేశంతో గులాబీ తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. అయితే సీజన్ ముగిసిన తరువాత పెంచడంతో అన్‌సీజన్ నాటికి ఇవి విరబూస్తున్నాయి. దీంతో వచ్చిన కొద్దిమందైనా సంతృప్తితో వెనుదిరుగుతున్నారు.