
తమిళసినిమా: సంచలన తారల్లో తాప్సీ ఒకరు. ఈ భామ వివాదాస్పద నటిగా కూడా పేరు గాంచింది. అప్పుడెప్పుడో ఆడుగళం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ ఢిల్లీ భామ ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్నా, ఎందుకనో ఇక్కడ పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది.అదే విధంగా టాలీవుడ్‌లోనూ ప్రముఖ స్టార్స్‌తో నటించినా స్టార్ ఇమేజ్‌ను పొందలేకపోయింది.
అలాంటి సమయంలో బాలీవుడ్ ఈ బ్యూటీని ఆదుకుంది. అక్కడ నామ్ షబానా చిత్రం మంచి విజయాన్ని సాంధించింది. ఇక అమితాబ్‌బచ్చన్‌తో నటించిన పింక్ చిత్రం మంచి సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలు తాప్సీ చేతిలో ఉన్నాయి. మళ్లీ దక్షిణాదిలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టిందనే ప్రచారం జరుగుతోంది.
ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకు ఏదో ఒక ప్రయత్నం చేసే తాప్సీ తనకు వచ్చిన ఓ ప్రేమలేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాంటి వాటిలో ఇటీవల ఒక అభిమాని రాసిన ప్రేమ, పెళ్లి ప్రపోజల్ లేఖ తాప్సీని విస్మయం పరచిందట. ఈ లేఖను ఈ అమ్మడు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ అందులో ఏముందంటే నేను మద్యం తాగను, మాంసాహారం భుజించను. అన్నింటికంటే ముఖ్యం నేను చాలా నిజాయితీపరుడ్ని.
నీపై నాకున్న ప్రేమను నిరూపించుకోవడానికి ఎలాంటి పరిక్షలకైనా సిద్ధం. నా విన్నపాన్ని పరిశీలించడం మరచిపోవద్దు. నా మనసంతా నువ్వే నిండిపోయావు అని రాశాడు. ఈ ప్రేమలేఖ నటి తాప్సీని ఎంతగానో ఆకట్టుకుందట. తనకు వచ్చిన వాటిలో ఇదే ఉత్తమప్రేమలేఖ అని తాప్సీ పేర్కొంది. ఇప్పుడీ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment