కథ చెప్పడానికి వెళితే.. | Taapsee Rejects Tamil Director Story | Sakshi
Sakshi News home page

నేను హిందీలో చాలా బిజీ!

Published Wed, May 23 2018 8:33 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Taapsee Rejects Tamil Director Story - Sakshi

తమిళ సినిమా: అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే, విజయాలను అందుకోవడం మరో ఎత్తు. ముందు ఒక్క అవకాశం అంటూ కాళ్లు అరిగేలా దర్శక, నిర్మాతల చుట్టూ తిరిగిన వాళ్లే, ఆ ఒక్క అవకాశం విజయాన్ని అందిస్తే, ఒక్కసారిగా గర్వం తలకెక్కేస్తుంది. ఇక గతం మరచిపోతారు. అందరూ అలా కాకపోయినా, నటి తాప్సీ లాంటి చాలా మంది ఇలానే ప్రవర్తిస్తుంటారు. ఆడుగళం చిత్రంలో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ. ఆ చిత్రం సక్సెస్‌ అయినా అమ్మడికిక్కడ వరుసగా అవకాశాలను రాబట్టుకోలేకపోయింది. అప్పట్లో  అవకాశాలు రావడం లేదని తెగ మదన పడిపోయింది. అదే విధంగా తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటించినా అక్కడా స్టార్‌డమ్‌ను పొందలేకపోయింది. అలాంటి సమయంలో లక్కీగానో నటించిన పింకూ చిత్రం సక్సెస్‌ అయి తాప్సీకి మంచి పేరు తెచ్చి ఎట్టింది.

ఆ తరువాత నటించిన నామ్‌ షబానా చిత్రం కూడా హిట్‌ అనిపించుకోవడంతో ఇప్పుడు బాలీవుడ్‌లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. పింకూ చిత్రం తరువాత మరోసారి బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌తో నటించే అవకాశం తాజాగా వరించింది. అంతే ఈ బ్యూటీ  కళ్లాలు లేని గుర్రంలా ఎగసి పడుతోంది. మొదట్లో కోలీవుడ్‌లో అవకాశాల కోసం పాట్లు పడిన ఈ అమ్మడు ఇప్పుడు వచ్చినా ఒప్పుకునే స్థితిలో లేదు. ఇటీవల ఒక తమిళ దర్శకుడు తాప్సీకి కథ చెప్పడానికి వెళితే అది వినడానికి కూడా ఇష్టపడలేదట. సారీ హిందీలో నేను చాలా బిజీగా ఉన్నాను. కథానాయకి పాత్రకు ప్రాధాన్యత ఉన్న అవకాశాలు వరిస్తున్నాయి. అందుకే కోలీవుడ్‌లో చెట్లు, పుట్టలు తిరిగి హీరోలతో ఆడి పాడే పాత్రల్లో నటించడం ఇష్టం లేదు అని నిర్మోహమాటంగా చెప్పిందట. ఓడ దాటే వరకూ ఓడన్న, దాటిన తరువాత బోడన్నా అన్న చందాన తాప్సీ ప్రర్తిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతాన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement