మాట మార్చిన తాప్సీ | Taapsee About Doing Telugu and Tamil Cinema | Sakshi
Sakshi News home page

మాట మార్చిన తాప్సీ

Published Thu, Feb 28 2019 12:46 PM | Last Updated on Thu, Feb 28 2019 12:46 PM

Taapsee About Doing Telugu and Tamil Cinema - Sakshi

బాలీవుడ్ ఆశలతో సౌత్‌ సినిమాను పక్కన పెట్టేసిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ ఇప్పుడు మాట మార్చింది. బాలీవుడ్‌లో లక్కీగా  పింక్, నామ్‌ సభానా వంటి చిత్రాలు సక్సెస్‌ అవడంతో దక్షిణాదిపై తాప్సీ తీరు మారిపోయింది. ముఖ్యంగా ఇక్కడి దర్శకులను పరిహసించే వ్యాఖ్యలు చేసే స్థాయికి చేరుకుంది. అలాంటిది ఇప్పుడు తనను పరిచయం చేసింది దక్షిణాది సినిమానే అని కాబట్టి దాని నుంచి దూరం కానని చెబుతోంది.

ప్రస్తుతం ఈభామ గేమ్‌ ఒవర్‌ అనే దక్షిణాది చిత్రంలో నటిస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. ఈ సందర్భంగా నటి తాప్సీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కథానాయకిగా పరిచయమైంది దక్షిణాది చిత్రాలతోనే అని, పెద్ద సక్సెస్‌లు రాకపోయినా హీరోయిన్‌ అనిపించుకున్నది ఇక్కడేనని అంది. దక్షిణాది ప్రేక్షకులు తనను తమ ఇంటి ఆడపడుచుగా ఆదరిస్తున్నారని చెప్పింది.

హిందీ చిత్రాల్లో నటించే అవకాశం రావడంతో అక్కడ మంచి చిత్రాల్లో నటిస్తున్నానని, పేరు, ప్రఖ్యాతలు లభించాయని పేర్కొంది. అయితే హిందీలో ఎన్ని చిత్రాల్లో నటించినా తమిళం, తెలుగు చిత్రాలను మాత్రం వదులు కోనని చెప్పింది. ఎందుకంటే తన సినీ జీవితానికి శ్రీకారం చుట్టింది దక్షిణాది సినిమానేనని పేర్కొంది. హిందీలో బిజీగా నటిస్తున్నా, తమిళ్, తెలుగు భాషల్లో మంచి అవకాశాలు వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పింది. అందుకు ఎన్ని కాల్‌షీట్స్‌ కావాలన్నా కేటాయిస్తానని అంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement