naam shabana
-
మాట మార్చిన తాప్సీ
బాలీవుడ్ ఆశలతో సౌత్ సినిమాను పక్కన పెట్టేసిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ ఇప్పుడు మాట మార్చింది. బాలీవుడ్లో లక్కీగా పింక్, నామ్ సభానా వంటి చిత్రాలు సక్సెస్ అవడంతో దక్షిణాదిపై తాప్సీ తీరు మారిపోయింది. ముఖ్యంగా ఇక్కడి దర్శకులను పరిహసించే వ్యాఖ్యలు చేసే స్థాయికి చేరుకుంది. అలాంటిది ఇప్పుడు తనను పరిచయం చేసింది దక్షిణాది సినిమానే అని కాబట్టి దాని నుంచి దూరం కానని చెబుతోంది. ప్రస్తుతం ఈభామ గేమ్ ఒవర్ అనే దక్షిణాది చిత్రంలో నటిస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. ఈ సందర్భంగా నటి తాప్సీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కథానాయకిగా పరిచయమైంది దక్షిణాది చిత్రాలతోనే అని, పెద్ద సక్సెస్‌లు రాకపోయినా హీరోయిన్ అనిపించుకున్నది ఇక్కడేనని అంది. దక్షిణాది ప్రేక్షకులు తనను తమ ఇంటి ఆడపడుచుగా ఆదరిస్తున్నారని చెప్పింది. హిందీ చిత్రాల్లో నటించే అవకాశం రావడంతో అక్కడ మంచి చిత్రాల్లో నటిస్తున్నానని, పేరు, ప్రఖ్యాతలు లభించాయని పేర్కొంది. అయితే హిందీలో ఎన్ని చిత్రాల్లో నటించినా తమిళం, తెలుగు చిత్రాలను మాత్రం వదులు కోనని చెప్పింది. ఎందుకంటే తన సినీ జీవితానికి శ్రీకారం చుట్టింది దక్షిణాది సినిమానేనని పేర్కొంది. హిందీలో బిజీగా నటిస్తున్నా, తమిళ్, తెలుగు భాషల్లో మంచి అవకాశాలు వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పింది. అందుకు ఎన్ని కాల్షీట్స్ కావాలన్నా కేటాయిస్తానని అంది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - నామ్ షబానా
-
షార్ట్ ఫిలింలో స్టార్ హీరోయిన్
ఈ శుక్రవారం నామ్ షబానా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఢిల్లీ భామ తాప్సీ, మరో ఇంట్రస్టింగ్ రోల్ లో కనిపించనుంది. అమ్మాయిల మీద జరుగుతున్న లైగింక దాడుల నేపథ్యంలో తెరకెక్కుతున్న షార్ట్ ఫిలింలో అతిథి పాత్రలో కనిపించనుంది. హైదరాబాద్ పోలీస్ సహకారంతో తెరకెక్కుతున్నీ షార్ట్ ఫిలింకు హైదరాబాద్ యునివర్సిటీ విద్యార్థిని విషీ టెక్కీ దర్శకత్వం వహిస్తోంది. టాలీవుడ్ లో హీరోయిన్గా పరిచయం అయినా.. బాలీవుడ్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న బ్యూటి తాప్సీ. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన జుమ్మంది నాధం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన తాప్సీ తరువాత.. సౌత్ లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసింది. కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయాలు చాలా ఉన్నా.. టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ భామ కొద్ది రోజుల్లో బాలీవుడ్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా బిగ్ బీ అమితాబ్ తో కలిసి చేసిన పింక్ సినిమా తాప్సీ కెరీర్ ను మలుపు తిప్పింది. అప్పటి వరకు గ్లామర్ షోకే పరిమితమైన ఈ భామ. ప్రస్తుతం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో ఆకట్టుకుంది. సినిమాలే కాదు సందేశాత్మకంగా తెరకెక్కే షార్ట్ ఫిలింస్ లోనూ నటించేందుకు రెడీ అంటోంది. -
తాప్సీ ఎందుకు పరుగులు తీస్తోంది?
తాప్సీ బాలీవుడ్‌లోకి వెళ్లిన తర్వాత చేస్తున్న తాజా సినిమా 'నామ్ షబానా'. ఈ సినిమా పోస్టర్‌ను బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ పోస్టర్లో తాప్సీ పరుగులు తీసేందుకు సిద్ధంగా కనిపించగా, మిగిలిన నటులంతా ఆమె చుట్టూ కనిపిస్తారు. ఈ పోస్టర్ చూస్తుంటే తనకు ఒక విషయం గుర్తుకొస్తుందని, ''ఆడవాళ్లు నిస్సహాయంగా ఎప్పుడు ఉంటారంటే.. వాళ్ల గోళ్ల రంగు ఆరిపోతున్నప్పుడే'' అని అన్నారు. విషయం ఏమిటంటే, తాప్సీ నటిస్తున్న తాజా చిత్రం.. ఇంతకుముందు అక్షయ్ కుమార్ నటించిన థ్రిల్లర్ మూవీ 'బేబీ'కి ప్రీక్వెల్. నామ్ షబానా సినిమా.. ఉగ్రవాదుల మీద విరుచుకుపడే అండర్ కవర్ ఏజెంట్ల గురించి ఉంటుంది. ఇంతకుముందు తాప్సీ నటించిన పింక్ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. బాలీవుడ్లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఈమధ్య కాలంలో ఎక్కువగా రావట్లేదు. ఇలాంటి సమయంలో ఈ సినిమా రావడం గమనార్హం. ఈనెల పదోతేదీన సినిమా ట్రైలర్ విడుదల చేస్తామని, సినిమాను మార్చి 31న తీసుకొస్తామని అంటున్నారు. శివమ్ నాయర్ దర్శకత్వంలో వస్తున్న నామ్ షబానాలో ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు దక్షిణాది స్టార్ పృథ్వీరాజ్ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఎక్కువగా ముంబై, మలేసియాలలో చిత్రీకరించారు. Shabana reminds me of a quote,"The only time a woman is helpless is when her nail polish is drying!"Sharing the #NaamShabanaPoster,more soon pic.twitter.com/KUsyv5Oi7t — Akshay Kumar (@akshaykumar) 5 February 2017 -
మలేషియాలో తాప్సీ డిష్యుం డిష్యుం
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సరసన తాప్సీ నటిస్తున్న 'నామ్ షబానా' సినిమా మలేషియా షెడ్యూలు పూర్తయింది. 2015లో తాప్సీ హీరోయిన్గా చేసిన బేబీ సినిమాకు సీక్వెల్‌గా తీస్తున్న ఈ సినిమాలో్ కూడా ఆమెకు చాన్స్ ఇచ్చారు. బేబీ సినిమాలో చిన్నపాటి ఫైట్స్ చేసిన తాప్సీ.. సీక్వెల్లో మాత్రం రిస్కీ యాక్షన్ సీన్స్‌లో కనిపిస్తారు. ఆరేళ్ల కెరీర్లో ఇప్పటివరకూ తాప్సీ టైటిల్ రోల్ చేయలేదు. తొలిసారి ఈ అవకాశం దక్కిందని, నటిగా తనను తాను నిరూపించుకోడానికి ఇది మంచి అవకాశమని తాప్సీ అన్నారు. ఈ సినిమా కోసం తాప్సీ 'మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్', జపనీస్ మార్షల్ ఆర్ట్ అయిన 'ఐకిడో', ఆత్మ రక్షణ కళ 'క్రావ్ మగా' నేర్చుకున్నారు. ఈ మూడు కళలు ఎందుకు నేర్చుకున్నానో సినిమా చూస్తే అర్థమవుతుందని ఆమె చెప్పారు. నామ్ షబానా సినిమా షూటింగులో రెండోభాగం కూడా పూర్తయిందని, షెడ్యూలు మొత్తం అనుకున్నట్లుగానే అనుకున్న సమయానికే అయిపోయిందని చెప్పారు. అక్షయ్ కుమార్ యాక్షన్ సీన్లలో చేస్తుంటే చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆమె అన్నారు. మరో వారం రోజుల్లో సినిమా తదుపరి షెడ్యూలు ప్రారంభమవుతుందని తెలిపారు. రెండో షెడ్యూలు ముంబైలో జరగనుంది. శివం నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. వచ్చే సంవత్సరం విడుదల కానుంది. -
ఆత్మరక్షణకు శిక్షణ
ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నానంటోంది నటి తాప్సీ. ఈ బ్యూటీ ఇటీవల ఎక్కువగా సెల్ఫ్ ప్రచారం చేసుకోవడానికి తెగ తంటాలు పడుతోందనిపిస్తోంది. ఆ మధ్య తాను ఢిల్లీ భామను, తనకు ధైర్యం ఎక్కువ అని డబ్బా కొట్టుకుంది. హిందీ చిత్రం పింక్‌లో అత్యాచారానికి గురైన యువతి పాత్రల్లో నటించిన తాప్సీ ఇటీవల తాను నిజ జీవితంలో పోకిరిల దురాఘతాలకు గురయ్యానని చెప్పుకుని వార్తల్లో నిలిచింది. తాజాగా ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటున్నానంటూ మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈ సారి తాను నటించనున్న చిత్రంలోని పాత్ర పోషణ కోసం ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటున్నట్లు తాప్సీ పేర్కొంది. కోలీవుడ్‌లో ఆడుగళం, కాంచన-2 వంటి రెండు మూడు విజయాలతోనే సరిపెట్టుకున్న ఈ ముద్దుగమ్మకు ఇక్కడ అవకాశాలు కరువయ్యాయి. అయితే లక్కీగా హిందీలో జాక్‌పాట్ లాంటి అవకాశాన్ని కొట్టేసింది. అక్కడ బిగ్‌బీ అమితాబ్‌తో పింక్ చిత్రంలో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో బాలీవుడ్లో చిన్నగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. తాజాగా నామ్ షబానా అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం కోసమే ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ పొందుతోందట. దీని గురించి తను తెలుపుతూ పింక్ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని అంది. ప్రస్తుతం నామ్ షబానా చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. ఇది తాను ఇంతకు ముందు నటించిన బేబి చిత్రానికి సీక్వెల్ అని చెప్పింది. ఇందులోని పాత్ర కోసం క్రావ్ మగా అనబడే ఇజ్రాయిల్ దేశంలో ప్రాచుర్యం పొందిన ఆత్మరక్షణ విద్యతో పాటు అయికిడో అనే జపాన్ ఆత్మరక్షణ విద్య తదితర మూడు రకాల విద్యలను నేర్చుకుంటున్నట్లు చెప్పింది. ఇందుకోసం నిత్యం గంటన్నర సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపింది. కథా పాత్రకు అవసరం అవ్వడంతో ఈ విద్యల్లో శిక్షణ పొందుతున్నట్లు వివరించింది. ఇందులో నటుడు అక్షయ్‌కుమార్ అతిథి పాత్రలో నటించనున్నారని, ఆయనకు తనకు మధ్య యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకంటాయా అన్నది తెలియదని అంది. మనోజ్ బాజ్‌పాయ్, మలయాళ నటుడు పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారని తాప్సీ తెలిపింది.