మలేషియాలో తాప్సీ డిష్యుం డిష్యుం
మలేషియాలో తాప్సీ డిష్యుం డిష్యుం
Published Fri, Oct 28 2016 3:16 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సరసన తాప్సీ నటిస్తున్న 'నామ్ షబానా' సినిమా మలేషియా షెడ్యూలు పూర్తయింది. 2015లో తాప్సీ హీరోయిన్‌గా చేసిన బేబీ సినిమాకు సీక్వెల్‌గా తీస్తున్న ఈ సినిమాలో్ కూడా ఆమెకు చాన్స్ ఇచ్చారు. బేబీ సినిమాలో చిన్నపాటి ఫైట్స్ చేసిన తాప్సీ.. సీక్వెల్‌లో మాత్రం రిస్కీ యాక్షన్ సీన్స్‌లో కనిపిస్తారు. ఆరేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ తాప్సీ టైటిల్ రోల్ చేయలేదు. తొలిసారి ఈ అవకాశం దక్కిందని, నటిగా తనను తాను నిరూపించుకోడానికి ఇది మంచి అవకాశమని తాప్సీ అన్నారు. ఈ సినిమా కోసం తాప్సీ 'మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్', జపనీస్ మార్షల్ ఆర్ట్ అయిన 'ఐకిడో', ఆత్మ రక్షణ కళ 'క్రావ్ మగా' నేర్చుకున్నారు. ఈ మూడు కళలు ఎందుకు నేర్చుకున్నానో సినిమా చూస్తే అర్థమవుతుందని ఆమె చెప్పారు.
నామ్ షబానా సినిమా షూటింగులో రెండోభాగం కూడా పూర్తయిందని, షెడ్యూలు మొత్తం అనుకున్నట్లుగానే అనుకున్న సమయానికే అయిపోయిందని చెప్పారు. అక్షయ్ కుమార్ యాక్షన్ సీన్లలో చేస్తుంటే చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆమె అన్నారు. మరో వారం రోజుల్లో సినిమా తదుపరి షెడ్యూలు ప్రారంభమవుతుందని తెలిపారు. రెండో షెడ్యూలు ముంబైలో జరగనుంది. శివం నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. వచ్చే సంవత్సరం విడుదల కానుంది.
Advertisement
Advertisement