taapsee Pannu
-
హీరోలకు తక్కువేం కాదు.. ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తున్న హీరోయిన్లు
వెండితెరపై వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తుంటారు హీరోయిన్లు. కొన్ని చిత్రాల్లో ఫెరోషియస్ రోల్స్ చేస్తుంటారు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తుంటారు. హీరోలా సినిమాని నడిపించేలా హీరోషియస్ రోల్స్ చేస్తున్న కొంతమంది హీరోయిన్స్‌పై కథనం.ప్రతీకారంపవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేసే అగ్రశ్రేణి హీరోయిన్స్ జాబితాలో అనుష్కా శెట్టి ముందు వరసలో ఉంటారు. ‘అరుంధతి, భాగమతి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో అనుష్క చేసిన నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ను ఆడియన్స్ అంత సులభంగా మర్చిలేరు. కొంత గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ పవర్ఫుల్ రోల్‌నే ‘ఘాటి’ చిత్రంలో చేస్తున్నారు అనుష్క. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటీవల ‘ఘాటి’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోలో ఓ మనిషి తలను అతి క్రూరంగా కొడవలితో నరికిన మహిళగా అనుష్క కనిపించారు. ఈ విజువల్స్ ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో స్పష్టం చేశాయి. ‘షూటి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది.ఇక వ్యాపారంలో అత్యుత్తమంగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు దారుణంగా మోసం చేస్తారు. ఈ మోసంతో ఆ మహిళ మనసు విరిగిపోయి, కఠినంగా మారుతుంది. తనను మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడే గెలవాలనుకుంటుంది. ఆ మహిళ ఎలా గెలిచింది? అన్నదే ‘ఘాటి’ కథ అని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.శివశక్తిదాదాపు ఇరవైఏళ్ల సినీ కెరీర్లో హీరోయిన్ తమన్నా డిఫరెంట్ రోల్స్ చేశారు. వీటిలో కొన్ని యాక్షన్ తరహా చిత్రాలూ ఉన్నాయి. అయితే ఈసారి కొంచెం కొత్తగా యాక్షన్‌తో కూడిన ఆధ్యాత్మిక పాత్ర నాగసాధువు శివశక్తిగా కనిపించనున్నారు తమన్నా. దర్శకుడు సంపత్ నంది కథతో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ సినిమాలోనే నాగసాధువు శివశక్తిగా తమన్నా కనిపిస్తారు.మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ, నాగమహేశ్ వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఓదెల మల్లన్న ఆలయం, ఆ గ్రామంలో జరిగే కొన్ని ఊహాతీత ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.కూతురి కోసం...ఓ రాక్షసుడి నుంచి తన చిన్నారి కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తల్లి రాక్షసిగా మారింది. ఈ రాక్షసుడిపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో ఆ తల్లి ఎలా పోరాడింది? అనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘రాక్కాయి’. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో కూతురి రక్షణ కోసం ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. సెంథిల్ నల్లసామి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో బరిసె పట్టుకుని, ఆ బరిసెకు కొడవలి బిగించి, మరో చేతిలో మరో కొడవలిని పట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న నయనతార విజువల్స్ ‘రాక్కాయి’ టైటిల్ గ్లింప్స్‌లో కనిపించాయి. ఇప్పటివరకు ‘డోరా, ఐరా, నెట్రిక్కన్’ వంటి హారర్ ఫిల్మ్స్, ‘కర్తవ్యం’ వంటి సామాజిక సందేశం ఉన్న సినిమాల్లోనే నయనతార ఎక్కువగా నటించారు. తొలిసారిగా ఆమె ‘రాక్కాయి’ వంటి పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.వంట గదిలో తుపాకీకిచెన్లో గరిటె పట్టుకునే గృహిణిగానే కాదు... అవసరమైతే అదే చేత్తో తుపాకీ కూడా పట్టుకోగలదు. ఇంతకీ ఆ గృహిణి పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలంటే ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్స్‌లోకి వచ్చేంతవరకూ వేచి ఉండాలి. ఇందులో సమంత లీడ్ రోల్లో నటిస్తారు. ‘ట్రా లా లా’ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను సమంతనే నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది సమంత బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాను ప్రకటించారు.అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, షూటింగ్ అప్డేట్స్ వంటి విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, షూట్ మొదలైందని సమాచారం. ఇక ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో సమంత ఓ యాక్షన్ రోల్ చేసి, బుల్లితెరపై సూపర్‌హిట్ అయ్యారు. ఇప్పుడు వెండితెరపైనా ఈ రిజల్ట్‌ను రిపీట్ చేయాలనుకుని యాక్షన్ బేస్డ్ మూవీ ‘మా ఇంటి బంగారం’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్.హ్యాండ్ బాగ్‌లో బాంబుఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో ఏముంటాయి? మేకప్ కిట్, మొబైల్ ఫోన్... వగైరా వస్తువులు ఉండటం కామన్. కానీ ఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో మాత్రం రక్తంతో తడిసిన కత్తి, ఓ తుపాకీ, బాంబు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు అంటే రివాల్వర్ రీటా. వెండితెరపై రివాల్వర్ రీటాగా చేస్తున్నారు కీర్తీ సురేష్. పవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేయడంలో సిద్ధహస్తురాలైన హీరోయిన్స్‌లో ఒకరైన కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’లో మరోసారి నటిగా తానేంటో చూపించనున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు కె. చంద్రు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.గాంధారి గతంకిడ్నాప్కు గురైన తన కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘గాంధారి’. ఈ చిత్రంలో తల్లి పాత్రలో తాప్సీ నటిస్తున్నారు. ఈ ఫిల్మ్‌లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను ఆమె డూప్ లేకుండా చేశారు. దేవాశిశ్ మఖీజా దర్శకత్వంలో ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తున్నారు. ఓ తల్లి గతం వల్ల ఆమె కూతురు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఏం చేసింది? అనే అంశాలతో ‘గాంధారి’ చిత్రకథ ఉంటుందని సమాచారం.ఇలా యాక్షన్ రోల్స్ చేసే హీరోయిన్స్ మరికొంతమంది ఉన్నారు. : ముసిమి శివాంజనేయులు -
ఓ తల్లి ప్రతీకారం
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అటు హీరోయిన్గా ఇటు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు తాప్సీ. తాజాగా ఆమె ప్రధానపాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం ‘గాంధారి’. దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కనికా థిల్లాన్ కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లోపాల్గొన్నారట తాప్సీ. తల్లీకూతుళ్ల అనుబంధం, ఓ తల్లి ప్రతీకారం అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం.కిడ్నాప్ అయిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసేపోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. వెండితెరపై తాప్సీ తల్లిపాత్రలో కనిపించనున్న తొలి చిత్రం ఇదే. త్వరలో ‘గాంధారి’ సినిమా విడుదల తేదీని ప్రకటించనుంది యూనిట్. ఇదిలా ఉంటే... తాప్సీ ఓ ప్రధానపాత్రలో నటించి, కనికా థిల్లాన్ కథ అందించిన ‘హసీన దిల్రుబా’, ఫిర్ ఆయీ హసీన దిల్ రుబా’లకు మంచి స్పందన లభించింది. దీంతో వీరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘గాంధారి’పై బాలీవుడ్లో మంచి అంచనాలున్నాయి. -
నా ఇల్లు.. నా భారతీయత
‘నా ఇల్లంతా భారతీయత కనిపించాలి. ఆ కళతో నేను అనుభూతి చెందాలి’ అంటోంది నటి తాప్సీపన్ను. ముంబైలోని తాప్సీ పన్ను ఇల్లు ప్రాచీన పంజాబీ కళతో ఆకట్టుకుంటుంది. ఇందుకు సోదరి షగున్ తన కలకు సహాయం చేసిందని మరీ మరీ చెబుతుంది తాప్సీ.ఇంటి లోపలి అలంకరణలో ఎర్ర ఇటుక గోడలు, జూట్ చార్పైస్, గోడకు అమర్చిన ఝరోఖాలు ఉన్నాయి. ఇది పంజాబ్ ఇంటీరియర్లలో ఒక అద్భుతమైనప్రాచీన ఇంటిని గుర్తు చేస్తుంది. ‘నా సోదరి వెడ్డింగ్ ప్లానర్,ప్రొఫెషనల్ కూడా. దీంతో ప్రత్యేకమైన డిజైనర్ అవసరం లేకపోయింది. ఆమె మా ఇంటిని చాలా అర్ధవంతంగా మార్చడానికి సహాయం చేసింది. మేం దేశంలోని పంజాబ్, రాజస్థాన్, కచ్ వంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడల్లా కొన్ని వస్తువులు సేకరించి, తీసుకొచ్చాం. అలా తీసుకొచ్చిన వాటితోనే మా ఇంటి అలంకరణ చేశాం.ప్రాచీన కళ‘నేనెప్పుడూ విలాసవంతమైన ఇల్లు కావాలనుకోలేదు. భారతీయత కనిపించాలని, అనుభూతి చెందాలని కోరుకుంటాను. అందుకు ఇది ఫ్యాన్సీదా, ఖరీదైనదా అనుకోను. ఇల్లు మన ఆత్మీయులందరినీ స్వాగతించేలా ఉండాలి.దేశీ – విదేశీ మా ఇల్లు అపార్ట్మెంట్లోని డ్యూప్లెక్స్ స్టైల్. ఒక అంతస్తు మొత్తం దేశీ అనుభూతిని పంచుతుంది. నా అభిరుచికి ఈ అంతస్తు అద్దం పడుతుంది. మరొక అంతస్తు నా వ్యక్తిగత స్థలం. అక్కడ, నా మానసిక స్థితిని బట్టి, మార్చుకోవడానికి అనువైనది ఉండేలా చూసుకుంటాను. నా స్నేహితులు దేశీ ఫ్లోర్‌పైనే సందడి చేస్తారు.ఇక నా గదిని చూసి మాత్రం పింటరెస్ట్ హౌస్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇంట్లోని ప్రతి మూలన ఏదో ఒక ఫొటో ఫ్రేమ్ ఉంటుంది. నాకెందుకో ఏ మూలన ఖాళీగా అనిపించినా, అక్కడ ఫొటో ఫ్రేమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నా ఫొటో ఆల్బమ్‌లో అన్ని మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని ఫొటో ఫ్రేమ్స్‌లో పెట్టి, నచ్చిన చోటల్లా పెట్టేస్తుంటాను. మా నాన్నకు ఇంటీరియర్స్‌లో చాలా మంచి అభిరుచిని ఉంది. అందుకు ఉపయుక్తంగా, వైద్యపరంగా ఉండటానికి ఇష్టపడతాడు. మాస్టర్ బెడ్రూమ్ క్లాసిక్ వైట్‌తో ఉంటుంది. నలుగురు పడుకునేంత పెద్ద బెడ్, వుడెన్ ఫ్రేమ్స్, కార్వింగ్‌తో చేయించాం. వానిటీ ఏరియాలో పెద్ద డ్రెస్సింగ్ మిర్రర్ ఏర్పాటు చేయించాం. మిర్రర్ చుట్టూ ఎల్లో లైట్స్ డిజైన్ చేయించాం. మంచి రంగున్న కర్టెయిన్స్, బెడ్ కు ముందు కిటికీ, ఫ్లోరింగ్ కూడా ఉడ్‌తో తయారుచేసిందే. బాల్కనీ ఏరియాలో వుడెన్ ఫ్లోరింగ్, ముదురు గోధుమ రంగు కుషన్స్, ప్రింటె ప్యాబ్రిక్స్ ఉంటాయి. కొన్ని మొక్కలతో బాల్కనీ ఏరియాను డిజైన్ చేసుకున్నాం. యోగా చేసుకోవడానికి వీలుగా ప్లేస్ ఉంటుంది. కుండీలలో మొక్కలు, కలర్‌ఫుల్ ఫ్రేమ్స్, బుద్ద విగ్రహం, వాల్ హ్యాంగింగ్స్... అన్నీ కలిసి ఓ మినీ ఫారెస్ట్‌ని తలపించేలా డిజైన్ చేయించాం. ఇంటిని డిజైన్ చేయించం అంటే మనలోని కళకు అద్దం పట్టినట్టే’’ అంటోంది తాప్సీ. -
అందులో నిజం లేదు!
‘‘జుడ్వా 2’, ‘డంకీ’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటించినందుకు పెద్ద మొత్తంలో నేను పారితోషికం అందుకున్నానని చాలామంది భావిస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు’’ అంటున్నారు హీరోయిన్ తాప్సీ. బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లలో తాప్సీ ఒకరు. ఓ వైపు హీరోలకి జోడీగా వాణిజ్య చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ దూసుకెళుతున్నారు ఈ బ్యూటీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ హీరో, హీరోయిన్ల మధ్య పారితోషికం వ్యత్యాసంపై స్పందించారు. ‘‘వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ఆలోచిస్తాను. పారితోషికం విషయంలో నటీనటుల మధ్య వ్యత్యాసం ఉంటుందని అందరికీ తెలుసు.‘జుడ్వా 2’, ‘డంకీ’ సినిమాలకు నేను భారీగా పారితోషికం అందుకున్నానని పలువురు భావిస్తున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నప్పుడు కొందరు నిర్మాతలు ఏదో మాపై దయ చూపుతున్నట్లు వ్యవహరిస్తారు. మా సినిమాలో పెద్ద హీరో ఉన్నాడు. వేరే వాళ్లను ఎంచుకోవాల్సిన అవసరం ఏముంది? అన్నట్లు వారి ప్రవర్తన ఉంటుంది.. మరికొంతమంది ‘మేము మంచి ప్రాజెక్టులు ఇచ్చి మీ కెరీర్ ఉన్నతి కోసం సాయం చేస్తున్నాం.. డబ్బుదేముంది’ అన్నట్లు మాట్లాడతారు. ఇలాంటి మాటలపై నేను ప్రతిరోజూ పోరాటం చేస్తున్నాను. పెద్ద ప్రొడక్షన్స్‌లో హీరోయిన్ల పాత్రలపై చిన్నచూపు ఉంటుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్లో వైరల్‌గా మారాయి. -
హీరోయిన్ ఎవరనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు: తాప్సీ
సినిమాలో ఏ హీరోయిన్ను సెలక్ట్ చేసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారంటోంది తాప్సీ పన్ను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. వరుణ్ ధావన్ 'జుడ్వా', షారూఖ్ ఖాన్ 'డుంకీ' సినిమాలు డబ్బు కోసం చేశానని అందరూ అనుకుంటారు. ఈ చిత్రాల వల్ల నేను ఎంతో సంపాదించానని ఫీలవుతుంటారు. కానీ అది నిజం కాదు. వాస్తవం.. మీ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది.పెద్ద సినిమాల్లో ఎక్కువ పారితోషికం?నా చుట్టూ కథ తిరిగే సినిమాల్లోనే నాకు ఎక్కువ పారితోషికం లభిస్తుంది. ఉదాహరణకు హసీన్ దిల్రుబా వంటివి. మిగతా చిత్రాల్లో అంత డబ్బేమీ ఇవ్వరు. పైగా నన్ను పెద్ద సినిమాలో సెలక్ట్ చేసుకుని నాకే ఏదో ఉపకారం చేసినట్లు ఫీలవుతారు.హీరోలే డిసైడ్ చేస్తున్నారుఒక సినిమాలో ఆల్రెడీ పెద్ద హీరో ఉన్నాడు అంటే ఎక్కువ డబ్బు పెట్టి హీరోయిన్ను తీసుకోవాలనుకోరు. అంతేకాదు, ఎవర్ని హీరోయిన్గా తీసుకోవాలన్నది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు. ఎవరో కొందరు సక్సెస్ఫుల్ దర్శకులు మాత్రమే హీరో మాటను కాదని కథకు తగ్గట్లు హీరోయిన్ను తీసుకుంటారు.ట్రెండింగ్‌లో ఉన్నవారే కావాలి!ఎక్కువగా హీరోలు ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్లతో కలిసి యాక్ట్ చేయాలనుకుంటారు. లేదా తమను డామినేట్ చేయని నటీమణులు పక్కన ఉండాలని ఫీలవుతారు అని చెప్పుకొచ్చింది. కాగా తాప్సీ పన్ను చివరగా ఖేల్ ఖేల్ మే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె వో లడ్కీ హై కహా సినిమా చేస్తోంది.చదవండి: ఓటీటీలో 'దేవర' ఎంట్రీ సమయం వచ్చేసిందా..? -
26 సార్లు రీమేక్ అయిన సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తాప్సి ప్రధాన పాత్రలో మదస్సర్ అజీజ్ తెరకెక్కించిన కామెడీ డ్రామా చిత్రం 'ఖేల్ ఖేల్ మే'. టీ-సిరీస్ నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీలో ఫర్దీన్ ఖాన్, వాణీ కపూర్, ప్రగ్యా జైస్వాల్, ఆదిత్య సీల్ కీలక పాత్రల్లో నటించారు.దసరా కానుకగా అక్టోబర్ 09 నుంచి 'ఖేల్ ఖేల్ మే' చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. సుమారు రూ. 100 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 60 కోట్ల వరకు రాబట్టింది.మూడు జంటల చుట్టూ తిరిగే కథతో, నవ్వులు పూయించే సన్నివేశాలతో ఉండే ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకుంది. 2016లో పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ పేరుతో మొదట ఇటాలియన్లో విడుదలైంది. ఈ ఎనిమిదేళ్లలో 26సార్లు ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఫ్రెంచ్, కొరియన్, మాండరిన్, రష్యన్, ఐస్‌ల్యాండిక్, తెలుగులో (రిచి గాడి పెళ్లి), మలయాళం (12th మ్యాన్), కన్నడలో (లౌడ్ స్పీకర్) పలు భాషల్లో ఈ చిత్రం రీమేక్ చేశారు. హిందీలో 'ఖేల్ ఖేల్ మే'గా ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైంది. -
యాక్షన్ గాంధారి
తాప్సీ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా హిందీ చిత్రానికి ‘గాంధారి’ టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహిస్తున్నారు. ‘గాంధారి’ సినిమాకు కనికా థిల్లాన్ కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నారు. తల్లీకూతుళ్ల అనుబంధం, ఓ తల్లి ప్రతీకారం అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం.కాగా తాప్సీ ఓ ప్రధానపాత్రలో నటించి, కనికా థిల్లాన్ కథ అందించిన ‘హసీనా దిల్రుబా’, ‘ఫిర్ ఆయీ హసీనా దిల్ రుబా’లకు వీక్షకుల నుంచి మంచిపాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘గాంధారి’పై బాలీవుడ్లో అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ‘గాంధారి’ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ΄్లాట్‌ఫామ్‌లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. -
నో అంటే నో: తాప్సీ
‘‘నేను నటిని మాత్రమే. పబ్లిక్ప్రాపర్టీని కాదు’’ అంటున్నారు హీరోయిన్ తాప్సీ. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఝుమ్మంది నాదం’ (2010) సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు తాప్సీ. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ కొన్నేళ్లుగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టారు. వరుస హిందీ సినిమాలతో దూసుకెళుతున్న తాప్సీ తాజాగా చేసిన బోల్డ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. సాధారణంగా సెలబ్రిటీలను చూసినప్పుడు వారి ఫోటోలు, వీడియోలు తీయడం కోసం ఉత్సాహం చూపుతుటాంటారు.ఇటీవల తాప్సీని తమ కెమెరాల్లో బంధించేందుకు కొందరు పోటీపడ్డారట. అయితే అందుకు ఆమె నో అంటే నో చెప్పారు. ‘‘నేను నటిని మాత్రమే.. పబ్లిక్ప్రాపర్టీని కాదు. రెండింటికీ చాలా తేడా ఉంది. కెమెరాలతో నా పైకి దూసుకురావడం, ఫిజికల్‌గా హ్యాండిల్ చేయడం చాలా తప్పు. ఎవరైనా నో అని చెబితే వారి అభి్రపాయానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. నేను ఇలా అంటున్నానని కొందరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు హీరోయిన్గా చేస్తున్నావ్? అని కామెంట్ చేయొచ్చు. కానీ నటన నాకు నచ్చిన వృత్తి... అందుకే సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు తాప్సీ. -
శ్రీముఖి క్లాస్ లుక్.. చీరలో మౌనీ రాయ్ ధగధగ!
ఫుల్ ఆనందంగా 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీఈఫిల్ టవర్ దగ్గర దక్ష నగర్కర్ అందాల ఆరబోతవైట్ డ్రస్ లో మరింత క్యూట్‌గా ప్రియాభవానీ శంకర్చిట్టి హ్యాండ్ బ్యాగ్‌తో నాజుగ్గా మెరిసిపోతున్న తాప్సీఓరకంట అలా చూస్తూ మైమరిచిపోయిన శ్రద్ధా దాస్క్లాస్ ఔట్ఫిట్లో హాట్‌గా కనిపిస్తున్న శ్రీముఖిటర్కీలో గ్లామర్ హీట్ పెంచేస్తున్న హీరోయిన్ శాన్వీ శ్రీవత్సవ View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nikita Dutta (@nikifying) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) -
Taapsee Pannu: పారిస్ ఒలింపిక్స్‌లో చీరలతో అలరిస్తున్న తాప్సీ..! (ఫోటోలు)
-
ఆ మూవీ కోసం వేరే నటిని అనుకున్నారు: తాప్సీ
హసీన్ దిల్‌రుబ సినిమాతో హిట్ అందుకుంది హీరోయిన్ తాప్సీ పన్ను. ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న హసీన్ దిల్‌రుబ 2 రేపు(ఆగస్టు 9న) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా తాప్సీ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.బిజీ అయిపోయాఒక డిఫరెంట్ స్టోరీతో సినిమా తీయాలనుకుంటున్నట్లు దర్శకురాలు కనికా ధిల్లాన్ చెప్పింది. ఆ కథ వినడానికి నేను ఆసక్తిగా ఉన్నానన్నాను. తర్వాత ఇతర సినిమాల షూటింగ్ బిజీలో పడిపోయాను. ఆ షూటింగ్ పూర్తి చేసుకునేసరికి కనిక.. తన కథను మరో నటికి వివరించిందని తెలిసింది.వెంటనే ఓకే చెప్పాకొన్ని నెలల తర్వాత తను మళ్లీ నాకు ఫోన్ చేసింది. తన ఆఫీసుకు రమ్మని కథ వినిపించింది. కథ చెప్పడం పూర్తవగానే గట్టిగా నవ్వేశాను. ఇంతకుముందే ఈ మూవీ చేద్దామని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అన్నాను. అయినా స్క్రిప్ట్ విన్న వెంటనే నాకోసమే రాసినట్లు అనిపించి వెంటనే ఓకే చెప్పా అంది. -
ఒలింపిక్స్‌లో తాప్సీ సందడి.. ఆ తర్వాత అక్కడే మకాం!
బాలీవుడ్ నటి, హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీని తాప్సీ నటించిన హిట్ చిత్రం హసీన్ దిల్రూబాకు సీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. ఇందులో విక్రాంత్ మాస్సే, జిమ్మీ షెర్గిల్, సన్నీ కౌశల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 9 నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.అయితే ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు మథియాస్ బో పెళ్లాడిన సంగతి తెలిసిందే. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా మథియాస్ ప్రస్తుతం భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు పురుషుల డబుల్స్ కోచ్‌గా ఉన్నారు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా తాప్సీ సైతం పారిస్ చేరుతుంది. భారత టీమ్‌తో పాటు భర్తకు మద్దతు తెలిపేందుకు పారిస్ చేరుకుంది.అయితే తాప్సీ పన్ను, తన భర్త మథియాస్ బో డెన్మార్క్‌లో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. త్వరలోనే డెన్మార్క్ ఇంట్లో గృహప్రవేశం జరుగుతుందని తెలిపింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత తన భర్తతో పాటు డెన్మార్క్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తాప్సీ పేర్కొంది. సమ్మర్లో డెన్మార్క్ ఎక్కువ సమయం ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. -
ఆయన గురించి చెప్పుకునేంత సీన్ లేదు: తాప్సీ ఆసక్తికర కామెంట్స్
హీరోయిన్ తాప్సీ ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ కీల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నేరుగా ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.అయితే ఈ ఏడాది మార్చిలో తాప్సీ పన్ను వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు మథియాస్ బోను పెళ్లాడింది. డెన్మార్కు చెందిన మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో ఏడడుగులు వేసింది. అయితే తాజా ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన భర్త మథియాస్ బో గురించి కొంతమందికి ఇంకా తెలియకపోవడం బాధకరమని తెలిపింది. అలాంటి వారి పట్ల విచారంగా ఉందని వెల్లడించింది.తాప్సీ మాట్లాడుతూ.." నా భర్త మథియాస్ బో ఎవరో తెలియని వారి గురించి నేను చాలా బాధపడ్డా. నేను బయటకు వచ్చి అతని గురించి ప్రజలకు చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే అతను పెద్ద క్రికెటర్ కాదు.. బిజినెస్మెన్ అంతకన్నా కాదు. అతని గురించి మీకు నిజంగా తెలుసుకోవాలని అనిపించడం లేదు అంతే. ప్రపంచంలో బ్యాడ్మింటన్‌లో అతిపెద్ద విజయాలు సాధించిన వారిలో ఈయన ఒకరు " అని వెల్లడించింది. కాగా.. తాప్సీ 2024 మార్చిలో ఉదయపూర్‌లో మాజీ డానిష్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను వివాహం చేసుకుంది. కాగా.. ప్రస్తుతం తాప్సీ భర్త భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. -
జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం: తాప్సీ పన్ను
హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం ఫీర్ ఆయి హాసిన్ దిల్రుబా చిత్రంలో కనిపంచనుంది. 2021లో హసీన్ దిల్రుబా మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, సన్నీ కె కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను పెళ్లాడిన సంగతి తెలిసిందే. బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా మథియాస్ ఇండియన్ ఆటగాళ్లు చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డికి 2021 నుంచి కోచ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు ఆటగాళ్లు పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.దీంతో తన భర్త కోసం నటి తాప్సీ పన్ను పారిస్ ఒలింపిక్ క్రీడలకు హాజరు కానున్నారు. ఈనెల 29న పారిస్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా ఒలింపిక్స్ చూసే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని పేర్కొన్నారు. తన భర్తతో పాటు.. మనదేశ ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు పారిస్ వెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది. కాగా.. ఇప్పటికే బాడ్మింటన్ క్రీడాకారులు చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్, తాప్సీ భర్త మథియాస్ బో పారిస్ చేరుకున్నారు. మథియోస్ను 2012లో ఒలింపిక్స్ పతకం గెలిచిన తర్వాత తొలిసారి కలుసుకున్నట్లు తాప్సీ వెల్లడించింది.కాగా.. తాస్పీ పన్ను తెలుగులో పలు చిత్రాలు చేసింది. బాలీవుడ్లో సూర్మ (2018), సాంద్ కి ఆంఖ్ (2019), రష్మీ రాకెట్ (2021), లూప్ లాపేట (2022), శభాష్ మిథు (2022) స్పోర్ట్స్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. తాను స్క్వాష్ గేమ్ మాత్రమే బాగా ఆడగలనని తాప్సీ తెలిపింది. -
నాకు పెళ్లయిందన్న విషయమే మర్చిపోయా: తాప్సీ
కొందరు తారలకు తమ వ్యక్తిగత విషయాలను ఊరంతా చాటింపు వేసి చెప్పుకోవడం అస్సలు ఇష్టముండదు. హీరోయిన్ తాప్సీ పన్ను కూడా అదే కోవలోకి వస్తుంది. ప్రియుడు, డెన్మార్క బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోతో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వస్తే అలాంటిదేం లేదని కప్పిపుచ్చింది. కట్ చేస్తే సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసింది. మార్చి నెలలో వీరి వివాహం జరిగింది. తరర్వాత తమ పెళ్లి గురించి పరోక్షంగా మాట్లాడుతూ వచ్చింది.సాంగ్ లాంచ్ ఈవెంట్ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఖేల్ ఖేల్ మే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి హాలి హాలి అనే పాటను గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ నుంచి తిరిగొస్తున్న తాప్సీని చూసిన ఓ ఫోటోగ్రాఫర్ ఆమెకు శుభాకాంక్షలు చెప్పాడు. అదేంటి? మూవీ రిలీజ్ కాకముందే హిట్టయిందా? అని సరదాగా అడిగింది. నా పెళ్లి నేనే మర్చిపోయాఅందుకాయన పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నాడు. అది విన్న తాప్సీ.. పెళ్లి గురించి కంగ్రాట్స్ చెప్తున్నావా? నాకు వివాహమైందన్న విషయం నేనే మర్చిపోయాను అని ఫన్నీగా రిప్లై ఇచ్చింది. కాగా తాప్సీ 'ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా' సినిమాలో నటించింది. ఇది 'హసీన్ దిల్రుబా'కు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) చదవండి: ఎప్పుడూ చావు గురించే ఆలోచిస్తున్నా.. -
తాప్సీ 'ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా' ట్రైలర్ విడుదల
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. 2021లో విడుదలైన ‘హసీన్ దిల్రుబా’ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడీ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. మర్డర్ మిస్టరీ కథాంశంతో వినీల్ మాథ్యూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం అభిమానులు కూడా భారీగానే ఎదురుచూస్తున్నారు.‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ సీక్వెల్‌ను జయ్‌ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు. కనికా థిల్లాన్ నిర్మాత. ఇందులో విక్రాంత్ మాస్సే, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 9న డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని కొద్దిరోజుల క్రితం మేకర్స్ ప్రకటించారు. ఇప్పడు విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. కథపై మంచి గ్రిప్పింగ్ ఉండేలా ట్రైలర్‌ను మేకర్స్ కట్ చేశారు.నిర్మాత కనికా ధిల్లాన్ మాట్లాడుతూ తాప్సీ పన్ను చాలా అద్భుతంగా ఈ చిత్రంలో నటించారని తెలిపింది. పార్ట్ 1 కంటే సీక్వెల్లో ఆమె అందరినీ ఆకట్టుకునేలా మెప్పించారని చెప్పారు. మరో ప్రధాన పాత్రలో నటించిన విక్రాంత్‌మాస్సే గురించి కూడా ఆమె మాట్లాడింది. ఆయనలోని ప్రతిభ ఈ సినిమాతో మరింతగా ప్రకాశిస్తుందని కనికా చెప్పింది. మీర్జాపూర్లో బబ్లూ పండిట్ పాత్రలో కనిపించిన విక్రాంత్ తెలుగువారికి పరిచయం అయ్యాడు. '12th ఫెయిల్' సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు.ఫస్ట్ పార్ట్‌లో భర్త (విక్రాంత్ మాస్సే)తో కలిసి పక్కా ప్లాన్‌తో ప్రియుడిని చంపిన రాణి కశ్యప్(తాప్సీ) ఆపై అక్కడి నుంచి ఆమె పారిపోయి కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంది. ఈ కేసులో రాణిని తన భర్త కాపాడుతాడా..? అనేది తెలియాలంటే ఆగష్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న 'ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా' సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలు చేతులెత్తేస్తున్నాయి.. ప్రతి సినిమా తీసుకోవట: తాప్సీ
ఓటీటీల పుణ్యమా అని చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. అటు లాభాల బాట పడుతున్నాయని అంతా అనుకుంటున్నారు. కానీ అందరికీ తెలియాల్సిన విషయం మరొకటి ఉందంటోంది హీరోయిన్ తాప్సీ పన్ను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటిదాకా ఏం జరిగేదంటే ఓటీటీల దగ్గర ప్రతి సినిమాకు ఓ ప్యాకేజీ మాట్లాడేసుకునేవారు.ఓటీటీల యూటర్న్దీనివల్ల మూవీలో పెద్ద పెద్ద హీరోలు ఉన్నాలేకున్నా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అంతగా రాకపోయినా నష్టం వాటిల్లకపోయేది. కానీ ఇప్పుడు ఓటీటీలు కూడా యూటర్న్ తీసుకున్నాయి. ప్రతి సినిమాను తీసుకోలేమని చెప్తున్నాయి. వాటిని ప్రమోట్ చేసేందుకు డబ్బు ఖర్చు పెట్టలేమని చేతులెత్తేస్తున్నాయి. పెద్ద స్టార్స్ లేని చిన్న సినిమాను ఆడియన్స్ చూసేలా చేయడం కష్టమని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ భావిస్తున్నాయి. ఎంతోకొంత ప్రమోషన్ చేసి థియేటర్లో విడుదల చేయమని, ఆ తర్వాతే ఫలానా వారానికి ఓటీటీలో తీసుకుంటామని చెప్తున్నాయి' అని తాప్సీ పేర్కొంది.సినిమాకాగా తాప్సీ చివరగా డంకీ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన 'ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా' మూవీ విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఖేల్ ఖేల్ మే మూవీలోనూ తాప్సీ కనిపించనుంది.చదవండి: అనంత్ అంబానీతో స్టెప్పులేసిన బాలీవుడ్ స్టార్.. వీడియో వైరల్ -
ఇంత యాటిట్యూడ్ దేనికో.. తాప్సీపై నెటిజన్లు ఫైర్
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సెల్ఫీలంటూ అభిమానులు ఎగబడుతుంటారు. కొందరు తారలు ఓపికగా వారితో ఫోటోలకు పోజిస్తుంటారు. మరికొందరు వారిని లెక్క చేయకుండా వెళ్లిపోతారు. హీరోయిన్ తాప్సీ రెండో రకానికి చెందినది. తాజాగా ఆమె తన కారు ఎక్కేందుకు వెళ్తుండగా ఫోటోగ్రాఫర్లు ఫోటో ప్లీజ్ అని వెంటపడ్డారు. వారిని ఆమె పట్టించుకోకుండా ముందుకెళ్లిపోయింది. సెల్ఫీకి నోఒక అభిమాని.. ఒక్క సెల్ఫీ మేడమ్ అని విన్నవించినా బేఖాతరు చేసింది. ప్లీజ్.. పక్కకు జరుగు అంటూ అతడివైపు కన్నెత్తి కూడా చూడకుండా నేరుగా కారెక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తాప్సీ ప్రవర్తనపై విరుచుకుపడుతున్నారు. ఎందుకంత యాటిట్యూడ్జయాబచ్చన్ను చూసి నేర్చుకున్నావా? ఎందుకంత యాటిట్యూడ్ చూపిస్తున్నావ్.., నీ సినిమాలన్నీ షెడ్డుకు వెళ్లిపోతున్నాయన్న ఫ్రస్టేషన్లో ఉన్నావా?, వాళ్లేమీ నిన్ను షూట్ చేయట్లేదు.. ఫోటో తీసుకుంటామంటున్నారు.. అలా పట్టించుకోకుండా పోతున్నావేంటి? అని తాప్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood)చదవండి: షారూఖ్ ఖాన్ కంటే నేనే ఎక్కువ సంపాదించా.. -
అతన్ని సాధారణ మనిషిలాగే భావించా..చూడగానే ప్రేమ పుట్టలేదు: తాప్సీ
తమిళసినిమా: ఒకరిపై ప్రేమ కలగడానికి సరైన నిర్వచనం ఉండదు. కొందరు చూడగానే నచ్చేస్తారు. మరి కొందరు వారి ప్రవర్తన కారణంగా ప్రేమించబడతారు. మరొకరు ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాత ప్రేమలో పడతారు. ఇలా ప్రేమలో చాలా కోణాలు ఉంటాయి. కాగా తాప్సీ ఎలా ప్రేమలో పడ్డారో చూద్దాం. ఢిల్లీలో పుట్టి పెరిగన బ్యూటీ తాప్సీ. తొలుత బాలీవుడ్లో నటిగా పరిచయమైన, పాపులరైంది మాత్రం దక్షిణాది చిత్రాలతోనే. తెలుగులో జుమ్మందినాథం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, తమిళంలోకి ఆడుగళం చిత్రంతో దిగుమతయ్యారు. ఈ చిత్రం జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకుంది. అయితే తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా స్టార్ హీరోలతో జతకట్టి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత హిందీలో అవకాశాలు రావడంతో అక్కడే ఎక్కువగా దృష్టి పెట్టారు. హిందీలో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. కాగా ఈమె డెన్మార్క్‌కు చెందిన మాథియస్ బో అనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడితో ప్రేమలో మునిగి తేలుతున్నారు. పెళ్లికి మాత్రం ఇంకా చాలా టైమ్ ఉందంటున్న చెబుతూ వచ్చిన తాప్సీ సమీప కాలంలో రహస్యంగా ప్రియుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. కాగా తన ప్రేమ అనుభవాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలుపుతూ తనకు మాథియస్ను చూడగానే, ఒక నెల తరువాతనో ప్రేమ పుట్టలేదన్నారు. ఆయన్ని చూడగానే గౌరవం ఏర్పడిందన్నారు. ఆయన్ని ఒక సాధారణ మనిషిగానే భావించానని చెప్పారు. ఆ తరువాత తరచూ కలుసుకునేవారిమని చెప్పారు. అలా ఆయన్ని ప్రేమించడం మొదలెట్టానని, అయితే వెంటనే మాథి యస్ బోకు తన ప్రేమను వ్యక్తం చేయలేదని, అందుకు చాలా కాలం తీసుకున్నానని చెప్పారు. ప్రేమ పెళ్లి విధానం వర్కౌట్ అవుతుందా? అని కూడా ఆలోచించడానికి కొంత సమయం తీసుకున్నానని చెప్పా రు. చివరికి తనకు కావలసిన వ్యక్తిని కనుగొన్నానన్న భావన కలగడంతో ఇద్దరం ప్రేమించుకోవడం మొదలెట్టామని తాప్సీ పేర్కొన్నారు. -
ప్రేమ పరీక్షలు పెట్టా!
‘‘మథియాస్‌తో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. మథియాస్ కన్నా ముందు నేను కొంతమంది అబ్బాయిలతో డేటింగ్ చేశాను. కానీ మథియాస్ పరిచయమై, తనతో మాట్లాడటం మొదలుపెట్టాక ఫైనల్‌గా నా అభిప్రాయానికి తగ్గ మనిషిని కనుగొనగలిగాను అనిపించింది’’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్, తాప్సీ ఈ ఏడాది మార్చి 23న అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్నారు.ఈ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్. అయితే మథియాస్‌తో ప్రేమలో పడే ముందు కొన్ని ప్రేమ పరీక్షలు పెట్టానని తాప్సీ చెబుతూ – ‘‘నాకు క్రీడాకారులంటే ఇష్టం. దేశం కోసం వాళ్లు ఆడుతుంటారు. ఇక మథియాస్‌తో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. అలాగే ఒక నెలలో పుట్టిన ప్రేమ కూడా కాదు. మా మధ్య ఉన్నది నిజమైన ప్రేమేనా అని తెలుసుకోవడానికి కొన్ని ప్రేమ పరీక్షలు పెట్టాను. అన్నింటిలోనూ మథియాస్ గెలిచాడు.ఒక అనుబంధం బలంగా నిలవడం ముఖ్యం. అందుకే నేను తొందరపడలేదు. అంతకు ముందు నాకు పరిచయం ఉన్న అబ్బాయిలు వేరు... మథియాస్ వేరు. ఆ అబ్బాయిల్లో ఏ ఒక్కరినీ మథియాస్‌తో పోల్చలేం. పరిణతి, భద్రతాభావం... ఇవే అతను నాకు సరైన వ్యక్తి అని నిర్ణయించుకునేలా చేశాయి’’ అన్నారు. -
స్టార్ హీరోయిన్ను పట్టించుకోని డెలివరీ బాయ్.. నెటిజన్ల ప్రశంసలు!
ఎవరైనా సెలబ్రిటీ మనకు ఎదురైతే చాలు. సెల్ఫీల కోసం ఎగబడే కాలం ఇది. ఇక పొరపాటున స్టార్స్ హీరోయిన్స్, హీరోలు కనపడితే ఇంక అంతే. సెల్పీ కోసం క్యూ కడతారు. అలాంటి ఈ రోజుల్లో ఓ డెలివరీ బాయ్ చేసిన పని నెట్టింట తెగ వైరలవుతోంది. అసలేం అతను ఏం చేశాడు? ఎందుకు అంతలా హాట్ టాపిక్‌గా మారిందో తెలుసుకుందాం.తాజాగా ముంబయిలోని ఓ సెలూన్ నుంచి స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను బయటకొచ్చింది. దీంతో ఆమె అక్కడే వేచి ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అనుకోకుండా అదే సమయంలో సెలూన్ లోపలికి వెళ్తూ కనిపించారు. అతనికి ఎదురుగా హీరోయిన్ తాప్సీ వస్తున్నప్పటికీ అసలు ఆమెను పట్టించుకోకుండా తన పనేంటో చూసుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్ జరుగు అంటూ గట్టిగా అరిచినా ఎవరినీ లెక్కచేయకుండా సైలెంట్‌గా లోపలికి వెళ్లిపోయాడు. దీంతో ఆ డెలివరీ బాయ్‌పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతను తన పని పట్ల అంకితభావంతో ఉన్నాడంటూ మరొకరు రాసుకొచ్చారు. అతన్ని చూస్తుంటే సంతోషంగా ఉందంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు. అతనికి కంపెనీ ప్రోత్సాహం ఇవ్వాలని కొందరు సూచించారు.ఆ తర్వాత తాప్సీ తన కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా.. ఈ ఏడాది మార్చిలో తాప్సీ తన చిరకాల ప్రియుడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమావ విషయానికొస్తే ఖేల్ ఖేల్ మే, ఫిర్ అయి హసీన్ దిల్రుబాలో తాప్సీ కనిపించనుంది.Hey @Swiggy, this delivery partner deserves an incentive for his dedication!! 😬😂pic.twitter.com/8MM6RfDZ2V— Divya Gandotra Tandon (@divya_gandotra) May 19, 2024 -
Taapsee Pannu Sister: తాప్సీ చెల్లిని చూశారా? ట్రై చేస్తే యాక్టరయ్యేది! (ఫోటోలు)
-
ఇక వ్యక్తిగత జీవితంపై ఫోకస్
వ్యక్తిగత జీవితానికి తాను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చుకోవాల్సిన తరుణం వచ్చిందన్నట్లుగా మాట్లాడుతున్నారు హీరోయిన్ తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ వివాహం గత నెల 23న ఉదయ్‌పూర్‌లో జరిగిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాప్సీ, మథియాస్ తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ వధూవరులుగా తాప్సీ, మథియాస్ ఉన్న వీడియోలు వైరల్ అవుతుండటంతో వీరిద్దరికీ వివాహం జరిగిందని స్పష్టమైంది. కాగా పెళ్లి తర్వాత తాప్సీ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కొన్నేళ్లు గడిచిన తర్వాత నేను నటించిన సినిమాల జాబితాను ఓ సారి చూసుకున్నప్పుడు ఆ జాబితా నాకు సంతోషాన్నివ్వాలి. ఎందుకుంటే నా జీవితంలోని ఎక్కువ సమయాన్ని సినిమాలకే కేటాయించాను. 24 గంటల్లో నేను పన్నెండు గంటలు పని చేసిన రోజులూ ఉన్నాయి. అయితే ఇకపై నేను నా వృత్తి జీవితంపైకన్నా, వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నా. అందుకే ఈ సినిమా వదులుకోకూడదు అనిపించేంత మంచి స్క్రిప్ట్ అయితేనే చేయాలనుకుంటున్నాను. కెరీర్‌కి మించిన జీవితం ఒకటి ఉంటుంది. ఆ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో సమయం గడపాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు తాప్సీ. -
ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో లీక్!
ఇటీవలే హీరోయిన్ తాప్సీ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను వివాహమాడింది. వీరిద్దరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మార్చి 23న ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహా వేడుకలో కేవలం ఇరుకుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. తన పెళ్లి గురించి తాప్సీ ఎక్కడే గానీ వెల్లడించలేదు. ఇటీవల తాప్సీ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కనిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దానికి 'మేరే యార్‌కీ షాదీ' అన్న హ్యాష్‌ట్యాగ్ జత చేసింది. ఆ తర్వాత తాప్సీ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ శారీతో ఈ బంధం కలకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్ కలర్ కోట్ వేసుకుని దిగిన ఫోటోలు షేర్ చేసింది. దీంతో తాప్సీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని అభిమానులు విషెస్ తెలిపారు. పెళ్లి వీడియో లీక్.. తాజాగా తాప్సీ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి కూతురిలా రెడీ అయిన ముద్దుగుమ్మ డ్యాన్స్ చేస్తూ కాబోయే వరుడి వద్దకు చేరుకుంది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా సింపుల్‌గా తాప్సీ పెళ్లి చేసుకుందంటూ పోస్టులు పెడుతున్నారు. తాప్సీ సీనీ కెరీర్.. తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసి క్రేజ్ దక్కించుకుంది. A Happy Bride is the prettiest of all! #TaapseePannu gets married to long time beau #MathiasBoe😍 @taapsee #BollywoodBubble pic.twitter.com/ULKZFTZp1T — Bollywood Bubble (@bollybubble) April 3, 2024 View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
పెళ్లి వార్తలు.. తాప్సీ ఫస్ట్ పోస్ట్ చూశారా?
సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు అన్ని విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. మరికొందరు తమ పర్సనల్ విషయాలను గోప్యంగా ఉంచుకోవడానికే ఇష్టపడతారు. అలా ఈ మధ్య హీరో సిద్దార్థ్ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకోగా హీరోయిన్ తాప్సీ పన్ను అయితే ఏకంగా పెళ్లే చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను పెళ్లాడిందని బాలీవుడ్ సమాచారం. మార్చి 23న వివాహం? మార్చి 23న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వివాహ వార్తల నేపథ్యంలో తాప్సీ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. సారీతో ఈ బంధం కలకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్ కలర్ కోట్ వేసుకుని దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు నిజంగా చీర గురించే మాట్లాడుతున్నావా? లేదా మథియస్‌తో నీ బంధం శాశ్వతంగా నిలిచిపోవాలని పరోక్షంగా చెప్తున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు. కెరీర్.. తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసి క్రేజ్ దక్కించుకుంది. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) చదవండి: కియారా భర్తను రాశీ పెళ్లి చేసుకుంటే బాగుండేది.. హీరోయిన్ ఏమందంటే?