
తాను ఎప్పుడో ప్రేమలో పడ్డానంటోంది హీరోయిన్ తాప్సీ. ఈ ఉత్తరాది బ్యూటీ మొదట కథానాయికగా పాపులర్ అయింది దక్షిణాది చిత్రాలతోనే. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల దర్శక నిర్మాతలే ఈమెను స్టార్ హీరోయిన్‌ను చేశారు. ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఆడుగళం చిత్రం ద్వారా తాప్సీ కోలీవుడ్‌లో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వందాన్ వెండ్రాన్, కాంచన 3, గేమ్ ఓవర్ తదితర చిత్రాల్లో నటించింది. అదే విధంగా తెలుగులో ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన తాప్సీ అక్కడ స్టార్ హీరోల సరసన నటించింది.
బాలీవుడ్‌లో బిజీ
ఇలా దక్షిణాది చిత్రాల్లో నటిస్తుండగానే బాలీవుడ్ నుంచి పిలుపువచ్చింది. అక్కడ నటించిన తొలి చిత్రం బేబీ మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా అవకాశాలు వరించాయి. హిందీలో పలు లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లోనూ నటించి విజయాలు సాధించింది. ఆ మధ్య అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన పింక్ సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా షారుక్ ఖాన్ సరసన నటించిన డంకీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది.
సీనియర్‌తో లవ్..
బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న తాప్సీ ఇటీవల ఒక భేటీలో తన సినీ పయనం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. తాను తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలోనే ప్రేమలో పడ్డానని చెప్పింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రేమించానని చెప్పింది. మొదట్లో అతను తనపై ఆసక్తి చూపాడని, ఆ తరువాత చదువు పాడై పోతుందని భావించి తనకు దూరం అయ్యాడని పేర్కొంది. చదువుపై శ్రద్ధ పెట్టాలని తనకు ఉచిత సలహా కూడా ఇచ్చాడని తెలిపింది. తన తొలి ప్రేమ విఫలం నుంచి బయట పడటానికి చాలా కాలం పట్టిందని తాప్సీ వెల్లడించింది.
చదవండి: మాజీ ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన స్టార్ హీరో 'విన్ డీజిల్'
Comments
Please login to add a commentAdd a comment