ఇంత యాటిట్యూడ్‌ దేనికో.. తాప్సీపై నెటిజన్లు ఫైర్‌ | Taapsee Pannu Gets Angry On Fan After He Chases For Selfie, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: సెల్ఫీ అడిగిన అభిమాని.. లెక్క చేయని హీరోయిన్‌.. వీడియో వైరల్‌

Published Thu, Jun 13 2024 5:32 PM | Last Updated on Thu, Jun 13 2024 5:51 PM

Taapsee Pannu Gets Angry, Say No for Selfie: Please Hat Jaye

ఒక్క సెల్ఫీ మేడమ్‌ అని విన్నవించినా బేఖాతరు చేసింది. ప్లీజ్‌.. పక్కకు జరుగు అంటూ అతడివైపు కన్నెత్తి కూడా చూడకుండా నేరుగా కారెక్కింది. ఇందుకు సంబంధించిన వీడి

సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సెల్ఫీలంటూ అభిమానులు ఎగబడుతుంటారు. కొందరు తారలు ఓపికగా వారితో ఫోటోలకు పోజిస్తుంటారు. మరికొందరు వారిని లెక్క చేయకుండా వెళ్లిపోతారు. హీరోయిన్‌ తాప్సీ రెండో రకానికి చెందినది. తాజాగా ఆమె తన కారు ఎక్కేందుకు వెళ్తుండగా ఫోటోగ్రాఫర్లు ఫోటో ప్లీజ్‌ అని వెంటపడ్డారు. వారిని ఆమె పట్టించుకోకుండా ముందుకెళ్లిపోయింది. 

సెల్ఫీకి నో
ఒక అభిమాని.. ఒక్క సెల్ఫీ మేడమ్‌ అని విన్నవించినా బేఖాతరు చేసింది. ప్లీజ్‌.. పక్కకు జరుగు అంటూ అతడివైపు కన్నెత్తి కూడా చూడకుండా నేరుగా కారెక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తాప్సీ ప్రవర్తనపై విరుచుకుపడుతున్నారు. 

ఎందుకంత యాటిట్యూడ్‌
జయాబచ్చన్‌ను చూసి నేర్చుకున్నావా? ఎందుకంత యాటిట్యూడ్‌ చూపిస్తున్నావ్‌.., నీ సినిమాలన్నీ షెడ్డుకు వెళ్లిపోతున్నాయన్న ఫ్రస్టేషన్‌లో ఉన్నావా?, వాళ్లేమీ నిన్ను షూట్‌ చేయట్లేదు.. ఫోటో తీసుకుంటామంటున్నారు.. అలా పట్టించుకోకుండా పోతున్నావేంటి? అని తాప్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

చదవండి: షారూఖ్‌ ఖాన్‌ కంటే నేనే ఎక్కువ సంపాదించా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement