షారూఖ్‌ ఖాన్‌ కంటే నేనే ఎక్కువ సంపాదించా.. | Farah Khan Says She Got Higher Paycheck Than Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

షారూక్‌ ఖాన్‌ కంటే నా సంపాదనే ఎక్కువ.. అదెలాగంటే?

Published Thu, Jun 13 2024 3:16 PM | Last Updated on Thu, Jun 13 2024 3:51 PM

Farah Khan Says She Got Higher Paycheck than Shah Rukh Khan

షారూఖ్‌ ఖాన్‌ కంటే తానే ఎక్కువ సంపాదించానంటోంది కొరియోగ్రాఫర్‌, దర్శకురాలు ఫరా ఖాన్‌. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదివేయండి.. ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే షారూఖ్‌ ఖాన్‌ తొలిసారి వెండితెరపై కనిపించింది దీవానా చిత్రంలో! ఈ మూవీతోనే అతడి కెరీర్‌ ఆరంభమైంది. నిజానికి అతడు ఫస్ట్‌ సంతకం చేసింది కబీ హా కబీ నా సినిమాకు.. తొలిసారి కెమెరా ముందుకు వచ్చిందీ ఈ సినిమాకే! ఈ సినిమాకు ఫరా ఖాన్‌ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించింది.

నాకే ఎక్కువ..
తాజాగా ఫరా ఖాన్‌ ఆ సినిమా విశేషాలను చెప్పుకొచ్చింది. కబీ హా కబీ నా తక్కువ బడ్జెట్‌లోనే పూర్తి చేశారు. ఈ సినిమాకుగానూ షారూఖ్‌ ఖాన్‌కు రూ.25,000 ఇచ్చారు. అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ నాకే ఇచ్చారు. అదెలాగంటే.. ఒక్క పాటకు రూ.5,000‌ చొప్పున ఆరు పాటలకుగానూ రూ.30,000 ఇచ్చారు. అప్పట్లో అసిస్టెంట్‌ను పెట్టుకునేంత సీన్‌ కూడా లేదు.

ఫ్రెండ్‌షిప్‌
కాబట్టి ఆ జీతం అంతా నేను మాత్రమే తీసుకున్నాను. పైగా ఆనా మేరే ప్యార్‌ కో పాట కోసం బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్లకు బదులుగా గోవాలో ఉన్న జనంతోనే షూటింగ్‌ కానిచ్చేశాం అని తెలిపింది. ఈ సినిమా నుంచే షారూఖ్‌- ఫరా ఖాన్‌ మధ్య స్నేహ బంధం బలపడింది. ఫరా ఖాన్‌ దర్శకత్వంలో షారూఖ్‌.. మై హూనా, ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్‌ వంటి చిత్రాల్లో నటించాడు.

చదవండి: రాజకీయాల కంటే సినిమాలే నయం: కంగనా రనౌత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement