
రాజకీయాల్లో అడుగుపెట్టడమే ఆలస్యం.. ఎంపీగా గెలిచి సత్తా చూపించింది కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయకేతనం ఎగురవేసింది. ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసి పూర్తిగా ప్రజాసేవలోనే లీనమవుతానని ఈ మధ్యే వెల్లడించింది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఎప్పటినుంచో ఆహ్వానాలు
కంగనా రనౌత్ మాట్లాడుతూ.. 'రాజకీయాల నుంచి పిలుపు రావడం నాకు కొత్తేమీ కాదు. నా ఫస్ట్ సినిమా గ్యాంగ్‌స్టర్ రిలీజైన వెంటనే టికెట్ ఆఫర్ చేశారు. ఆ తర్వాత కూడా పలుసార్లు పాలిటిక్స్‌లోకి రావాలంటూ ఆహ్వానాలు అందాయి. మా తాత మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ సక్సెస్ ఉంది కనుకనే మమ్మల్ని పదేపదే పాలిటిక్స్‌లోకి రమ్మని ఆహ్వానించేవారు. నాతో పాటు మా నాన్నకు, చెల్లికి కూడా పిలుపొచ్చింది.

ఇక్కడిదాకా వచ్చేదాన్నే కాదు
నాకు ఆసక్తి లేకపోయుంటే ఇంత కష్టపడి ఇక్కడిదాకా వచ్చేదాన్ని కాదు. నేనెప్పుడూ నా మనసుకు నచ్చింది చేస్తుంటాను. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కేవలం హీరోయిన్‌గానే కాకుండా డైరెక్టర్‌గా, నిర్మాతగా, రచయిత్రిగా ఇలా రకరకాల పనులు చేశాను. ఇప్పుడు రాజకీయ జీవితంలోనూ అలాగే ఉంటాను. జనం మధ్యలోకి వెళ్లాలనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వారిని కలుస్తాను.
సినిమాలో ఈజీ
చెప్పాలంటే రాజకీయాల కంటే సినిమాలే ఈజీ. ఇక్కడ ఒక్క సినిమా చూస్తే అంతా మర్చిపోయి రిలాక్స్ అయిపోతాం.. కానీ పాలిటిక్స్‌లో అలా కాదు! డాక్టర్స్ లాగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజల కోసం లీడర్స్ ఎప్పుడూ అందుబాటులో' ఉండాలి అని చెప్పుకొచ్చింది. కంగనా స్వీయదర్శకత్వంలో నటించిన ఎమర్జెన్సీ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
చదవండి: నా నంబర్ ఇదే.. సినిమా నచ్చకపోతే కాల్ చేయండి: అజయ్ ఘోష్
Comments
Please login to add a commentAdd a comment