
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'. జూన్ 14న థియేటర్లలోకి రాబోతుంది. హర్ష గారపాటి, రంగారావు గారపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలడుగు దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు, పోస్టర్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. కొద్దిరోజు క్రితం విడుదలైన ట్రైలర్‌కు మంచి టాక్ వచ్చింది.
'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా అందరికీ నచ్చుతుందని ఆయన అన్నాడు. కుటుంబ సమేతంగా చూడతగిన సినిమా అని ఆయన పేర్కొన్నాడు. సినిమా అందరూ చూడండి.. నచ్చకపోతే తనకు ఫోన్ చేసి బూతులు తట్టొచ్చని చెబుతూనే తన నంబర్ కూడా ఇచ్చేశాడు. దీంతో 'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమాపై ఆయన ఎంతటి అంచనాలు పెట్టుకున్నాడో తెలుస్తోందని నెటజన్లు అంటున్నారు.
ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అజయ్ ఘోష్‌దే కావడం విషేశం. ప్రస్తుతం టాలీవుడ్‌లో అద్భుతమైన నటనతో ఆయన ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది..? ఎంత ఎమోషనల్‌గా ఉంటుందని ఆడియెన్స్‌కు చెప్పాలనే ఈ కథను రాసుకున్నానని దర్శకుడు శివ పాలడుగు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment