Chandini Chowdary
-
తెలుగు ఇండస్ట్రీలో అత్యుత్తమ మహిళలకు 'షీ తెలుగు నక్షత్రం అవార్డ్స్' (ఫోటోలు)
-
సెన్సిటివ్ టాపిక్.. అలరించేలా 'సంతాన ప్రాప్తిరస్తు' టీజర్
ప్రెగ్నెన్సీ, స్మెర్మ్ కౌంట్ లాంటి పదాల గురించే మాట్లాడుకోవడానికే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఈ తరహా కాన్సెప్ట్ తో మూవీ తీయడం తక్కువే. తెలుగులో ఒకటి రెండు చిత్రాలతో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు 'సంతాన ప్రాప్తిరస్తు' పేరుతో మరో సినిమా రాబోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'మార్కో'.. అసలు ముద్దాయి సెన్సార్ బోర్డ్!)ఇంజినీరింగ్ జాబ్ చేసే ఓ కుర్రాడు.. ప్రేమించి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తీరా అతడి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని వైద్యపరీక్షల్లో తేలుతుంది. అంటే పిల్లలు పుట్టే అవకాశం తక్కువని డాక్టర్స్ చెబుతారు. స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు వైద్యుల సలహాలు, డైట్ ఫాలో అవుతూ వంద రోజుల్లో తన భార్యను ప్రెగ్నెంట్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు హీరో. చివరకు ఏమైందనే అసలు కథ. టీజర్ చూస్తే ఇదే అనిపించింది.ఇది సెన్సిటివ్ విషయమే కానీ దీన్ని ఎంటర్ టైనింగ్ గా చెప్పినట్లు తెలుస్తోంది. విక్రాంత్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. సంజీవ్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో రిలీజ్ వివరాలు ప్రకటిస్తారు.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్) -
సంతాన ప్రాప్తిరస్తు మూవీ.. ఆసక్తిగా సంక్రాంతి పోస్టర్
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్స్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా "ఏబీసీడీ" సినిమా, రాజ్ తరుణ్‌తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.ఈ ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రేక్షకులకు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ లుక్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్లో ప్రెగ్నెన్సీ కిట్ ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. పోస్టర్ చూస్తేనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా సునీల్ కశ్యప్ పని చేస్తున్నారు. -
తీవ్రంగా గాయపడిన 'కలర్ ఫోటో' హీరోయిన్
'కలర్ ఫోటో' మూవీతో హీరోయిన్గా బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి. చాందిని చౌదరి.. తీవ్రంగా గాయపడింది. ఆ విషయాన్ని ఈమెనే స్వయంగా బయటపెట్టింది. అయితే చాన్నాళ్ల క్రితం ఇది జరగ్గా.. తాను లైట్ తీసుకున్నానని ఇప్పుడు అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు)చాందిని ఏం చెప్పింది?'హలో.. నేను గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేను. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం నాకు ఓ గాయమైంది. దాన్ని పెద్దగా పట్టించుకోకుండా షూటింగ్స్‌లో పాల్గొన్నాను. ఇప్పుడు ఆ గాయం తిరగబెట్టింది. షూట్ కోసం వెళ్తుంటే గాయం వల్ల మరింత నొప్పిగా అనిపిస్తుంది. దీంతో అన్నింటికి కొన్నాళ్లు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మళ్లీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సోషల్ మీడియాలోకి వస్తా' అని చాందిని చౌదరి ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది.షార్ట్ ఫిల్మ్స్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన చాందిని చౌదరి.. టాలీవుడ్‌లోనూ హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ఈ ఏడాది గామి, మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ చిత్రాలతో వచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ కొత్త మూవీలో నటిస్తోంది. బహుశా ఈమెకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు ఉంది. అందుకే కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకుంటానని చెప్పినట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: షోలో కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య) -
లేడీ పోలీస్ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
'కలర్ ఫోటో' సినిమా హీరోయిన్ చాందిని చౌదరి లేటెస్ట్ మూవీ 'యేవమ్'. లేడీ ఓరియెంటెడ్ కథతో తీసిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలో చాందిని పోలీస్‌గా నటించింది. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ 'యేవమ్' సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: Kill Movie Review: 'కిల్' సినిమా రివ్యూ)షార్ట్ ఫిల్మ్స్ హీరోయిన్ గా నటిగా మారిన చాందిని చౌదరి.. కొన్నాళ్ల పాటు సైడ్ క్యారెక్టర్స్ చేసింది. 'కలర్ ఫోటో' వల్ల ఈమెకు గుర్తింపు దక్కింది. దీని తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. వారాల వ్యవధిలో ఈమె నటించిన యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి మూవీస్ థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో 'యేవమ్' చిత్రాన్ని తాజాగా ఆహా ఓటీటీలో జూలై 25 నుంచి అంటే గురువారం మధ్యాహ్నం నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.'యేవమ్' కథ విషయానికొస్తే.. వికారాబాద్ పోలీస్ స్టేషన్లో సౌమ్య (చాందిని చౌదరి)కి ప్రొబేషనరీ ఎస్సైగా పోస్టింగ్ వస్తుంది. అదే స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సైతో ప్రేమలో పడుతుంది. మరోవైపు అదే స్టేషన్ ఫరిదిలో యుగంధర్ అనే వ్యక్తి, హీరోల పేర్లు చెప్పి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తుంటాడు. ఇతడి వల్ల ఓ అమ్మాయి హత్యకు గురవుతుంది. సౌమ్యకి యాక్సిడెంట్ అవుతుంది. చివరకు ఏమైంది? పోలీసులు యుగంధర్ని పట్టుకున్నారా లేదా అనేదే పాయింట్.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన డిఫరెంట్ తెలుగు సినిమా
ఓటీటీలోకి మరో తెలుగు సినిమా వచ్చేసింది. చాలా మూవీస్‌తో పోలిస్తే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ, కామెడీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పేరున్న యాక్టర్స్ చేసినప్పటికీ ఎందుకో జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి అందరూ ఎంచక్కా చూసేయొచ్చు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)'రంగస్థలం', 'పుష్ప' తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఘోష్ లీడ్ రోల్ చేసిన సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'. ఇతడితో పాటు చాందినీ చౌదరి మరో కీలక పాత్ర చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. చూడని వాళ్లుంటే ఓ లుక్కేసేయండి.క్యాసెట్ షాప్ నడుపుకొనే 50 ఏళ్ల మూర్తి అనే వ్యక్తి.. డీజే కావాలనుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో ఈయనకు డీజేగా పనిచేసే అమ్మాయి పరిచయమవుతుంది. ఈమె దగ్గర మూర్తి డీజే నేర్చుకోవడం, మరి చివరకు ఏమైంది అనేదే 'మ్యూజిక్ షాప్ మూర్తి'.(ఇదీ చదవండి: బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వెబ్ సిరీస్... ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
నా నంబర్ ఇదే.. సినిమా నచ్చకపోతే కాల్ చేయండి: అజయ్ ఘోష్
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'. జూన్ 14న థియేటర్లలోకి రాబోతుంది. హర్ష గారపాటి, రంగారావు గారపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలడుగు దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు, పోస్టర్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. కొద్దిరోజు క్రితం విడుదలైన ట్రైలర్‌కు మంచి టాక్ వచ్చింది.'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా అందరికీ నచ్చుతుందని ఆయన అన్నాడు. కుటుంబ సమేతంగా చూడతగిన సినిమా అని ఆయన పేర్కొన్నాడు. సినిమా అందరూ చూడండి.. నచ్చకపోతే తనకు ఫోన్ చేసి బూతులు తట్టొచ్చని చెబుతూనే తన నంబర్ కూడా ఇచ్చేశాడు. దీంతో 'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమాపై ఆయన ఎంతటి అంచనాలు పెట్టుకున్నాడో తెలుస్తోందని నెటజన్లు అంటున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అజయ్ ఘోష్‌దే కావడం విషేశం. ప్రస్తుతం టాలీవుడ్లో అద్భుతమైన నటనతో ఆయన ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది..? ఎంత ఎమోషనల్‌గా ఉంటుందని ఆడియెన్స్‌కు చెప్పాలనే ఈ కథను రాసుకున్నానని దర్శకుడు శివ పాలడుగు తెలిపాడు. -
రెడ్ కలర్ డ్రస్‌లో మెరిసిన ‘చాందిని చౌదరి’ (ఫొటోలు)
-
మ్యూజిక్ మీద చాలా రీసెర్చ్ చేశా: డైరెక్టర్ శివ పాలడుగు
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఇప్పుడు లేదు. కంటెంట్ ఉంటే.. ఎమోషన్స్ ఉంటే.. ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే చిన్న చిత్రాలే పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. ఆ నమ్మకంతోనే ‘మ్యూజిక్ షాప్ మూర్తి’సినిమాను తీశాం. మా చిత్రంలోని ఎమోషన్స్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది’అన్నారు డైరెక్టర్ శివ పాలడుగు. ఆయన దర్శకత్వం వహించిఆన తొలి సినిమా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ శివ పాలడుగు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ మాది విజయవాడ. అమెరికాలో ఉద్యోగం చేశాను. కొన్నాళ్ల తర్వాత అక్కడే డైరెక్షన్ కోర్సులో డిప్లోమా చేశాను. నాకు మొదటి సినిమా అవకాశం చాలా సులభంగానే వచ్చింది. నా ఫ్రెండ్స్ నిర్మాతలు కావడంతో అంతా చాలా ఈజీగా జరిగిపోయింది.⇒ కాస్త కొత్తగా ఉండాలనే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి పాత్ర కోసం అజయ్ ఘోష్‌ని తీసుకున్నాం. ఆయన అద్భుతంగా ఎమోషన్స్ పండిస్తారని నాకు తెలుసు. ఈ సినిమా అనుకుంటున్న టైంలో ఇంకా పుష్ప రాలేదు. కానీ ఆయన ఈ పాత్రను పోషించగలరని అనుకున్నాను.⇒ చాందినీ చౌదరి పాత్రతోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఆమె పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మూర్తి జీవితంలో అంజన వల్ల వచ్చిన మార్పులు సినిమాని ముందుకు తీసుకెళ్తాయి. అంజన కారెక్టర్లో చాందినీ చౌదరి అద్భుతంగా నటించారు. ఆమెకు ఇందులో తగిన ప్రాధాన్యం లభించింది.⇒ ఈ సినిమా కోసం మ్యూజిక్ మీద చాలానే రీసెర్చ్ చేశాం. అప్పటి తరం సంగీతం, నేటి ట్రెండీ మ్యూజిక్ ఇలా అన్నింటిపై పరిశోధించాం. పవన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. ప్రతీ పాట సందర్భానుసారంగానే వస్తుంది. ఎక్కడా ఇరికించినట్టుగా అనిపించదు.⇒ ఈ సినిమా ప్రయాణంలో నాకు బడ్జెట్ పరంగా ఎలాంటి సమస్యలు రాలేదు. నా స్నేహితులే నిర్మాతలు కావడంతో, వారు నా మీద నమ్మకంతో ఖర్చుకి వెనుకాడలేదు. అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే ఖర్చు అయినా.. ఎక్కడా వృథాగా ఖర్చు పెట్టలేదు.⇒ ఏదో సందేశం ఇవ్వాలని ఈ కథను రాసుకోలేదు. పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? ఎంత ఎమోషనల్‌గా ఉంటుందని ఆడియెన్స్‌కు చెప్పాలనే ఈ కథను రాసుకున్నాను. ఈ సినిమా ఫలితంతోనే నా నెక్ట్స్ ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేస్తాను. -
Chandini Chowdary: యేవం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చాందిని (ఫోటోలు)
-
Chandini Chowdary: యేవం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫోటోలు)
-
రెడ్ డ్రస్‌లో మెస్మరైజ్ చేస్తున్న'చాందిని చౌదరి' లేటెస్ట్ (ఫొటోలు)
-
మిడిల్ క్లాస్ కష్టాలతో 'మ్యూజిక్ షాప్ మూర్తి' ట్రైలర్
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'. జూన్ 14న థియేటర్లలోకి రాబోతుంది. హర్ష గారపాటి, రంగారావు గారపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలడుగు దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు, పోస్టర్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: శ్రీలీల కాదు ఆ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్?)ఈ ట్రైలర్ చూస్తే నవ్వించేలా, ఏడిపించేలా ఉంది. మిడిల్ క్లాస్ కష్టాలను, కల కనడానికి, ఆ కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదనే కాన్సెప్ట్ చూపించబోతున్నారు. ‘అన్నీ మన కోసమే చేసుకోకూడదు.. కొన్ని మన అనుకునేవాళ్ల కోసం వదులుకోవాలి’ అంటూ అజయ్ ఘోష్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. (ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గ్రాండ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?) -
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ‘అంగ్రేజీ బీట్’ అంటూ అదిరిపోయే బీటున్న పాటను విడుదల చేశారు.అంగ్రేజీ బీట్ అంటూ సాగే ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో డీజే మూర్తిగా అజయ్ ఘోష్ ఆహార్యం, వేసిన స్టెప్పులు, కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. పవన్ లిరిక్స్, బాణీలు ఈ పాటను ప్రత్యేకంగా మార్చేశాయి.మంచి హుషారైన బీటుతో ప్రస్తుతం ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. -
‘గామి’ విడుదలే మాకు పెద్ద విజయం: నిర్మాత
‘మా లాంటి కొత్త వారికి సినిమా చేసిన తర్వాత అది విడుదల చేయడమే పెద్ద విజయం. లాంటింది 'గామి'కి అన్ని చోట్లా నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కడం చాలా బలాన్ని ఇచ్చింది. సినిమా విజయం సాధించడంతో ప్రశంసలు దక్కడం మరిన్ని మంచి చిత్రాలు చేయగలమనే నమ్మకాన్ని ఇచ్చింది’అన్నారు నిర్మాత కార్తిక్ శబరీష్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ చిత్ర మర్చి 8న విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత కార్తీక్ శబరీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. అలా గామి మొదలైంది నేను తమాడ మీడియంలో షో ప్రొడ్యుసర్ గా షార్ట్ ఫిలిమ్స్ కి పని చేసేవాడిని. అక్కడ చాలా మంది ఎన్ఆర్ఐ లు తమ పేరు చూసుకోవాలనే ఇష్టంతో షార్ట్ ఫిల్మ్స్ ని నిర్మించేవారు. ఇలాంటి వారందరిని ఒక్క చోటికి చేర్చి ఒక సినిమా తీస్తే బావుటుందనే ఆలోచన వచ్చింది. ‘మను’ అలా చేసిన చిత్రమే. గామి చిత్రానికి కూడ అదే స్ఫూర్తి. అంతకుముందు దర్శకుడు విద్యాధర్ తో షార్ట్ ఫిలిమ్స్ చేశా. తనతో మంచి అనుబంధం ఉండేది. కలసి 'గామి' సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో ఈ జర్నీ మొదలైయింది. వీఎఫ్ఎక్స్పై దర్శకుడికి మంచి పట్టు ఉంది దర్శకుడు విద్యాధర్ వీఎఫ్ఎక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. తనకి వీఎఫ్ఎక్స్ పై మంచి పట్టు ఉంది. గామిలో చాలా వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. దాని వీలైనంత వరకూ మన పరిధిలో ఎలా చేయగలమని అలోచించాం. ప్రత్యేకంగా సింహం సీక్వెన్స్ ని వారితో చేయించుకొని దానికి అదనంగా వాడాల్సిన హంగులని మన టీంతో చేయించుకునేలా ప్లాన్ చేసుకున్నాం. దాని కారణంగా దాదాపు వారి ఇచ్చిన కొటేషన్ కి 40శాతం తగ్గించగలిగాం. సినిమాని ఫలానా సమయానికి విడుదల చేసేయాలనే ఒత్తిడి లేదు కాబట్టి కావాల్సిన సమయాన్ని వెచ్చించి మంచి అవుట్ పుట్ ని తీసుకురాగలిగాం. నాగ్ అశ్విన్ సహాయం మరువలేనిది క్రౌడ్ ఫండ్‌తో ఈ సినిమాను నిర్మించాలి భావించి..అనౌన్స్ చేశాం. కానీ దాని ద్వారా మాకు తక్కువ ఫండ్ వచ్చింది. అయితే ప్రాజెక్ట్ కి కావాల్సిన మొత్తం ఫండ్ ఉన్నపుడే మొదలుపెట్టాలని భావిస్తే అది జరగదు. ముందు దూకేయాలనే ఓ ధైర్యంతో నెల్లూరు లో మొదటి షెడ్యుల్ స్టార్ట్ చేశాం. నెల్లూరు మా సొంత ఊరు కాబట్టి లోకేషన్స్ పర్మిషన్స్ సులువుగా దక్కాయి. మాకున్న బడ్జెట్ లో ఆ షెడ్యుల్ పూర్తి చేయగలిగాం. తర్వాత ఏమిటనేది సవాల్. ఈ సమయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ గారు మా వీడియో చూసి కాల్ చేశారు. మా ఆఫీస్ కి వచ్చి మా వర్క్ అంతా చూసి సినిమా గురించి బైట్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత జనాలు కొందరు పెట్టుబడి పెడతామని వచ్చారు. అసోషియేషన్స్ దొరికాయి. దాని తర్వాత వర్క్ ఇంకాస్త స్మూత్ గా జరిగింది. నాగ్ అశ్విన్ సహాయం మరువలేనిది క్లైమాక్స్ బాగా నచ్చింది గామిని ఓ రెండు సినిమాలతో పోల్చడం గమనించాను, నిజానికి ఆ సినిమాలు స్టార్ట్ కాకముందే 'గామి'ని మొదలుపెట్టాం. క్లైమాక్స్ లో వచ్చే యూనిక్ పాయింట్ చాలా బావుంది. దర్శకుడు చెప్పినప్పుడే చాలా కొత్తగా అనిపించింది. అది నచ్చే సినిమా చేయాలని నిర్ణయించాం. వి సెల్యులాయిడ్ వచ్చిన తర్వాత మేము సేఫ్ అనే ఫీలింగ్ వచ్చింది. రాజీపడకుండా చేయొచ్చనే ధైర్యం వచ్చింది. -
విశ్వక్ సేన్ ‘గామి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'గామి' సినిమా రివ్యూ
టైటిల్: గామి నటీనటులు: విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, హారిక పెద్ద తదితరులు నిర్మాతలు: కార్తిక్ శబరీష్, శ్వేత మొరవనేని రచన-దర్శకత్వం: విద్యాధర్ కాగితాల సంగీతం: నరేశ్ కుమారన్, స్వీకర్ అగస్తీ సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపీ నందిగాం విడుదల తేదీ: 2024 మార్చి 8 నిడివి: 2h 26m ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకొన్న తెలుగు సినిమాగా 'గామి' వార్తల్లో నిలిచింది. ట్రైలర్ రిలీజ్ కాగానే విజువల్స్ చూసి అందరూ షాకయ్యారు. అంచనాలు పెరిగపోయాయి. ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు శివరాత్రి కానుకగా 'గామి' థియేటర్లలో విడుదలైంది. విశ్వక్ సేన్ అఘోరాగా నటించిన ఈ మూవీ ఎలా ఉంది? అంచనాలకు మించి హిట్ కొట్టిందా? లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 'గామి' కథేంటి? శంకర్ (విశ్వక్ సేన్) హరిద్వార్‌లో ఉండే ఓ అఘోరా. ఇతడికి ఓ విచిత్రమైన సమస్య. ఎవరైనా పొరపాటున తాకితే శంకర్ ఒళ్లంతా నీలం రంగులోకి మారిపోతుంది. సృహ తప్పి పడిపోతాడు. ఇతడి వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా అఘోరాలు అందరూ ఇతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొడతారు. దీంతో తన సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు కాశీకి వెళ్తాడు. అక్కడ ఓ సాధువు వల్ల శంకర్ సమస్యకు పరిష్కారం తెలుస్తుంది. హిమాలయాల్లో 36 ఏళ్లకు ఓసారి లభించే మాలిపత్రాలే తీసుకుంటే ఇది నయమవుతుంది. దీంతో శంకర్ హిమాలయాలకు ప్రయాణం మొదలుపెడతాడు. ఇతడికి జాహ్నవి (చౌందిని చౌదరి) కూడా తోడు వెళ్తుంది. మరి శంకర్ చివరకు మాలి పత్రాల్ని సాధించాడా? అలానే శంకర్ ఆలోచనల్లో వచ్చే ఉమ (హారిక పెద్ద), సీటీ-333(మహమ్మద్ సమాద్) ఎవరు? తెలియాలంటే 'గామి' చూడాల్సిందే. ఎలా ఉందంటే? 'గామి' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బొమ్మ బ్లాక్ బస్టర్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా నచ్చదు. కానీ డిఫరెంట్ మూవీస్, అందులోనూ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండే చిత్రాలు చూసే వాళ్లకు 'గామి'.. మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది. అలా అని ఈ సినిమాలో లోటుపాట్లు లేవా అంటే ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం టాలీవుడ్లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందన చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హరిద్వార్‌లో అఘోరాల ఆశ్రమంలో ఉండే ఒకడిగా శంకర్‌ని చూపించి నేరుగా కథ మొదలుపెట్టేశారు. హీరోకి ఉన్న సమస్య గురించి వివరించడం, దీనికి సొల్యూషన్ ఏంటో కూడా ఓ సాధువు.. శంకర్‌కి చెప్పడం, దీంతో హీరో పరిష్కారం కోసం హిమాలయాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం.. ఇలా సీన్లన్నీ చకాచకా సాగిపోతుంటాయి. ఈ ట్రాక్‌కి సమాంతరంగా ఇండో-చైనీస్ బోర్డర్లో ఓ రీసెర్చ్ ల్యాబ్‌లో ఉండే అబ్బాయి, దక్షిణ భారతదేశంలో దేవదాసి అనే ఊరిలో ఉమ అనే అమ్మాయి కథ సమాంతరంగా చూపిస్తుంటారు. దీంతో అసలు ఈ ముగ్గురికి కనెక్షన్ ఏంటా అని ఓ వైపు క్యూరియాసిటీ.. శంకర్ అసలు మాలిపత్రాల్ని ఎలా సాధిస్తాడనే టెన్షన్ ఓవైపు నుంచి ఉంటుంది. అయితే ఏదో కావాలని పెట్టినట్లు ఇంటర్వెల్ పడుతుంది. ఆ తర్వాత శంకర్‌తో తాను కూడా హిమాలయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో జాహ్నవి చెబుతుంది. అయితే ఫస్టాప్‌లో సినిమా వేగంగా నడుస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి నెమ్మదిస్తుంది. కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో రోప్ సాయంతో శంకర్-జాహ్నవి చేసే అడ్వెంచర్ సీక్వెల్ ఒకటు ఉంటుంది. చూస్తుంటే టెన్షన్‌తో సచ్చిపోతాం. చివర్లో సింహాం ఓ రెండు మూడు సీన్లలో కనిపిస్తుంది. ఆ సీన్స్‌ని ఇంకాస్త ఎఫెక్టివ్‌గా తీసుండాల్సింది. ఇకపోతే శంకర్‌కి అతడి ఆలోచనల్లో వచ్చే ఇద్దరు వ్యక్తులకు మధ్య రిలేషన్ ఏంటనేది క్లైమాక్స్‌లో రివీల్ అవుతుంది. అయితే దీన్ని సినిమా ప్రారంభంలోనే చాలామంది ఊహించేస్తారు. చివర్లో చూసినప్పుడు ఇది ఇంప్రెసివ్‌గా అనిపిస్తుంది. ఇందులో శివుడి రిఫరెన్సులు కొన్ని ఉన్నాయి. అవి శివభక్తులని ఆకట్టుకుంటాయి. అయితే శంకర్ ఫ్లాట్ రాసుకున్నంత శ్రద్ధగా.. దేవదాసి ట్రాక్, రీసెర్చ్ ట్రాక్ రాసుకోలేదు. సినిమాలో ఇది కాస్త వెలితిగా అనిపిస్తుంది. ఎవరెలా చేశారు? మాస్, కమర్షియల్ పాత్రలతో మనకు తెలిసిన విశ్వక్ సేన్.. ఇందులో అఘోరా శంకర్‌గా కొత్తగా కనిపిస్తాడు. సినిమా అంతా కూడా ఒకే కాస్ట్యూమ్‌లో ఉంటాడు. చెప్పాలంటే ఇందులో అతడి హీరో కాదు కథలో ప్రధాన పాత్రధారి అంతే. ఆ క్యారెక్టర్‌కి ఫెర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. ఇక సీటీ-333 పాత్ర చేసి మహమ్మద్ సమాద్, దుర్గ పాత్ర చేసిన హారిక అనే చైల్డ్ ఆర్టిస్టు వాళ్లకిచ్చిన పాత్రల్లో ఆకట్టుకున్నారు. చాందిని చౌదరి రోల్ ఉన్నంతలో బాగా చేసింది. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడిన దర్శకుడు విద్యాధర్‌ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. సినిమా మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా ఇంప్రెస్ చేస్తాడు. ఓ కొత్త దర్శకుడు ఈ రేంజులో సినిమా తీశాడా అంటే నమ్మలేం. ఇతడి తర్వాత సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్, ర్యాంపీ.. హిమాలయాల్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాకు కథ ఎంత ప్లస్ అయిందో.. సంగీతం అంతకు మించి ప్లస్ అయింది. స్వీకర్ అగస్తీ పాటలు.. నరేశ్ కుమారన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరోస్థాయిలో నిలబెట్టాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'గామి' ఓ డిఫరెంట్ అటెంప్ట్. ఎలాంటి అంచనాల్లేకుండా వెళ్లండి. మిమ్మల్ని అంతకు మించి ఆశ్చర్యపరుస్తుంది. -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
‘గామి’ ప్రయాణం ఓ సాహస యాత్ర.. కన్నీళ్లు వచ్చాయి: చాందినీ చౌదరి
‘‘కలర్ ఫోటో’ సినిమా తర్వాత సీరియస్ యాక్ట్రెస్‌గా నాకు గుర్తింపు వచ్చింది. ఆ మూవీ తర్వాత నా పనిని ఇంకా ఎలా మెరుగుపరచుకోవచ్చు అనే దానిపైనే దృష్టి పెడుతున్నాను. ‘గామి’ కథ విన్నప్పుడు కచ్చితంగా భాగం కావాలనిపించింది. నా మనసుకి చాలా తృప్తి ఇచ్చిన సినిమా ‘గామి’’ అని హీరోయిన్ చాందినీ చౌదరి అన్నారు. విశ్వక్ సేన్, చాందినీ చౌదరి జంటగా విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన చిత్రం ‘గామి’. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 8న విడుదలకానుంది. ఈ సందర్భంగా చాందినీ చౌదరి మాట్లాడుతూ–‘‘వారణాసి, కుంభమేళా, కాశ్మీర్, హిమాలయాలు.. ఇలా రియల్ లొకేషన్స్‌లో ‘గామి’ని చిత్రీకరించాం. షూటింగ్లో చాలా సవాల్‌తో కూడిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ సినిమా ప్రయాణం ఒక సాహస యాత్రలా జరిగింది. ఈ మూవీకి ఐదేళ్లు పట్టింది. అంత సమయం తీసుకున్నాం కాబట్టే విజువల్స్ ఇంత అద్భుతంగా వచ్చాయి. ఐమ్యాక్స్ స్క్రీన్‌లో మా మూవీ ట్రైలర్ చూసినప్పుడు మా కష్టానికి ప్రతిఫలం లభించిందనే ఆనందంతో నాకు కన్నీళ్లు వచ్చాయి. ‘గామి’ లాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. నేను నటించిన 4 చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్‌లోనూ నటించా’’ అన్నారు. -
విశ్వక్ సేన్ ‘గామి’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ఈ సమయం దాటితే మరో 36 ఏళ్లు నిరీక్షించాల్సిందే
విశ్వక్సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గామి'. వి సెల్యులాయిడ్ పతాకంపై కార్తీక్ శబరీష్ దీనిని నిర్మించారు. ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ ఇప్పటికే సూపర్ అని ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో శంకర్ అనే అఘోరా పాత్రలో విశ్వక్సేన్ కనిపించనున్నారు. నేనెవరో..? అసలు ఎక్కడి నుంచి వచ్చానో..? నాకీ సమస్య ఎప్పటి నుంచి ఉందో..? ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు. అంటూ పలు ప్రశ్నలతో విశ్వక్సేన్ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ట్రైలర్‌లోని సంభాషణలు అన్ని సస్పెన్స్‌గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఎవరూ టచ్ చేయని కథతో విశ్వక్ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌తోనే సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన డైరెక్టర్.. సిల్వర్ స్క్రీన్‌పై సరికొత్త చరిత్ర క్రియేట్ చేసేలా కనిపిస్తుంది. మరో రెండు రోజుల్లో అనుకున్న కార్యం చేయలేకపోతే మరో 36 ఏళ్లు నిరీక్షించాల్సిందే అనే డైలాగ్ సనిమాకు మూలం కానుంది. అఘోరా గెటప్‌తో పాటు మరో రెండు భిన్నమైన గెటప్‌లు గామి చిత్రంలో ఉంటాయి. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ట్రైలర్ సుమారు మూడు నిమిషాలకు పైగానే ఉంది. చాందిని చౌదరి కథానాయికగా ఉంది. క్రౌడ్ ఫండింగ్‌లో భాగంగా చేసిన ఈ సినిమాకు కార్తీక్ శబరీష్ నిర్మాతగా ఉన్నారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంలో అద్భుతమైన గ్రాఫిక్స్ ఉన్నాయి. -
సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్‌తో వస్తోన్న కలర్ ఫోటో హీరోయిన్!
కలర్ ఫోటో , గామి చిత్రాల ఫేమ్ చాందినీ చౌదరి మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ప్రకాష్ దంతులూరి దర్శత్వంలో సీ స్పేస్ బ్యానర్‌పై యేవమ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రసిద్ధ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలై చేతుల మీదుగా ప్రత్యేకంగా చేయించిన టైటిల్ లోగోను ఆవిష్కరించారు. ప్రమోషన్లలో ఇది ఒక వినూత్న ప్రయత్నంగా కనిపిస్తోంది. సోషల్ మీడియా యూజర్స్ దీన్ని లైక్ చేసి షేర్ చేస్తూ సక్సెస్ చేస్తున్నారు. ఈ చిత్రం ఒక సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చాందినీ నటన హైలెట్‌గా ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రానికి నీలేష్ మండాలపు సంగీతం అందించారు. ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్ వశిష్ట, భరత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by YEVAM (@yevam_movie) -
విశ్వక్సేన్ 'గామి' టీజర్ వచ్చేసింది
విష్వక్సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గామి'. వి సెల్యులాయిడ్ పతాకంపై కార్తీక్ శబరీష్ దీనిని నిర్మించారు. ఇందులో శంకర్ అనే అఘోరా పాత్రలో విష్వక్సేన్ కనిపించనున్నారు. ఇందులో అఘోరా గెటప్‌తో పాటు మరో రెండు భిన్నమైన గెటప్‌లు ఉంటాయి. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ నుంచి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాందిని చౌదరి కథానాయికగా ఉంది. క్రౌడ్ ఫండింగ్‌లో భాగంగా చేసిన ఈ సినిమాకు కార్తీక్ శబరీష్ నిర్మాత. నాలుగున్నరేళ్లుగా విష్వక్సేన్ శ్రమించాడు. 'గామి' చిత్రం కోసం మునుపెన్నడూ లేని ఓ సరికొత్త అనుభూతిని ఆయన పంచనున్నారు. తాజాగా గామి చిత్రం నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న అఘోర శంకర్ హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్రమని మేకర్స్ అన్నారు. ఫిబ్రవరి 29న గామి ట్రైలర్ విడుదల అవుతుందని ప్రకటించారు. గామి సినిమా కూడా మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. 'ఫలక్‌నుమా దాస్' సినిమా విడుదలకు ముందే గామి ప్రారంభమైంది. ఈ స్టోరీతో నాలుగున్నరేళ్లు ప్రయాణం చేశామని చెప్పిన విశ్వక్.. గామి సినిమా గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయని ఆయన చెప్పారు. -
ఆసక్తికరంగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ఫస్ట్ లుక్ పోస్టర్
కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇప్పుడు ఆడియెన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీ రాబోతోంది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ విలన్‌గా అయినా, కమెడియన్‌గా అయినా ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రస్తుతం ఆయన ఓ డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీ అయ్యారు. చాందినీ చౌదరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలుగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే చిత్రం రాబోతోంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద.. హర్ష గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అజయ్ ఘోష్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ గమనిస్తుంటే అజయ్ ఘోష్ పాత్ర ఇందులో పూర్తి వినోదాత్మకంగా ఉండేలా అనిపిస్తోంది. ఇక చాందినీ చౌదరి పాత్రకు, అజయ్ ఘోష్ కారెక్టర్‌కు ఉండే కనెక్షన్ ఏంటి? అసలు ఈ సినిమా పాయింట్ ఏంటి? వీరిద్దరి కథ ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా పోస్టర్ ఉంది. -
ఓటీటీలోకి సూపర్ హిట్ రొమాంటిక్ లవ్ స్టోరీ
ప్రతి వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే ప్రేమ కథలతో పాటు థ్రిల్లర్ చిత్రాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాంటిది ప్రేమికుల దినోత్సవం రోజున ఎలాంటి సినిమా ఉంటే బాగుంటుందో అలాంటి రొమాంటిక్ డ్రామా మూవీని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు హాట్‌స్టార్ తెలిపింది. తమిళంలో సూపర్ హిట్ కొట్టిన 'సబా నాయగన్' స్ట్రీమింగ్కు రెడీగా ఉంది. ఇందులో కలర్ ఫొటో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న 'చాందిని చౌదరి' ప్రధాన పాత్రలో నటించింది. భద్రమ్, మన్మధ లీల, పిజ్జా 2 సినిమాలతో 'అశోక్ సెల్వన్' హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. దీంతో టాలీవుడ్లో కూడా అశోక్ సెల్వన్‌కు గుర్తింపు ఉంది. చాందినీ చౌదరితో కలిసి నటించిన సబా నాయగన్ చిత్రం 2023 డిసెంబర్లో విడుదలైంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. ఈ సినిమాతో సీఎస్ కార్తికేయ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కమల్ హాసన్ నటించిన 'విశ్వరూపం, విశ్వరూపం 2' చిత్రాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. తమిళంలో భారీ హిట్ అందుకున్న 'సబా నాయగన్' చిత్రం ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు హాట్‌స్టార్ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో విడుదల చేసింది. ఒక టికెట్‌కు నాలుగు సినిమాలు అంటూ 'జో,ఫైట్ క్లబ్, పార్కింగ్' ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయని.. 'సబా నాయగన్' ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌డే సందర్భంగా రానుందని హాట్‌స్టార్ తెలిపింది. ఈ చిత్రం కూడా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. 'సబా నాయగన్' సినిమా కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. డీస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 14 నుంచి సబా నాయగన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటన రావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే ఇంతకుముందు ఫిబ్రవరి 1 నుంచి సబా నాయగన్ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ చేస్తే మేకర్స్‌కు, ఓటీటీ సంస్థకు కలిసి వస్తుందని వాయిదా వేసి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు అక్కడ 3 స్టార్ రేటింగ్‌తో పాటు Imbd నుంచి 8.1 రేటింగ్ అందుకుంది. View this post on Instagram A post shared by Disney+ Hotstar Tamil (@disneyplushotstartamil) -
నటి చాందిని చౌదరితో " స్పెషల్ చిట్ చాట్ "
-
పొట్టి దుస్తుల్లో ఆరోహి హొయలు.. బ్లాక్ అండ్ వైట్‌లో శివాత్మిక
► సితార క్యూట్ లుక్స్.. నయా ఫోటోషూట్ అదుర్స్ ► ఒంటినిండా నగలతో మెరిసిపోతున్న గీతా మాధురి ► మన్మథుడికి నేహా చౌదరి ఆహ్వానం ► పొట్టి బట్టల్లో బిగ్‌బాస్ బ్యూటీ ఆరోహి రావ్ ► బ్లాక్ అండ్ వైట్ అందాలతో శివాత్మిక ► కింద కూర్చొని ఫోటోకి ఫోజుచ్చిన చాందిని View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by EmraanArtistry🧿 (@emraanartistry) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by KUSHI🐰#petlover (@kushithakallapu) View this post on Instagram A post shared by Swetha (@swethapvs) View this post on Instagram A post shared by Arohi Rao (@arohi_rao) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Hina Khan (@realhinakhan) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) -
వాట్సాప్ మెసేజ్‌లతో వేధింపులు.. స్క్రీన్‌షాట్స్ షేర్ చేసిన హీరోయిన్
షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ స్టార్ చేసి ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది చాందినీ చౌదరి. కలర్ ఫోటో సినిమాతో మరింత పాపులారిటీని దక్కించుకున్నా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ రావడం లేదు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చాందినీకి ఇప్పుడు సైబర్ వేధింపులు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టినట్లయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'నా పేరు, ఫోటోలతో గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ నెంబర్స్ ఉపయోగించి కొంతమంది వ్యక్తులు స్కామ్‌కి పాల్పడుతున్నారు. వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడం కోసం వాట్సాప్‌లో నా పేర్లు వాడుకుంటూ మెసేజ్‌లు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా వేధింపులకు కూడా పాల్పడుతున్నారు. నాకే కాదు నా కోస్టార్స్ పేర్లు, ఫోటోలు కూడా వాడుతున్నారు. మీలో ఎవరికైనా ఇలాంటి మెసేజ్‌లు వస్తే దయచేసి రిపోర్ట్ చేయండి. మీ వివరాలను వారితో షేర్ చేసుకోకండి' అంటూ నెటిజన్లను హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన పలు స్క్రీన్షాట్లను కూడా చాందినీ ఈ సందర్భంగా పోస్ట్ చేసింది. -
కలర్ ఫొటోకు వీళ్లను తీసుకుంటే చాలా చీప్‌గా చూశారు: డైరెక్టర్
కలర్ ఫొటో.. ఉత్తమ చిత్రంగా ఈ మధ్యే జాతీయ అవార్డు అందుకుంది. దీంతో సినిమా హీరో సుహాస్, దర్శకుడు సందీప్ రాజ్‌ల పేర్లు ఒక్కసారిగా మార్మోగిపోయాయి. తమ సినిమాకు ఇంతటి గౌరవం లభించినందుకు సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. తాజాగా సుహాస్, సందీప్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'కలర్ ఫొటో షూటింగ్ సమయంలో ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని, ఇందులో సునీల్ హీరో అని చెప్పేవాడిని. నేను, హర్ష క్యారెక్టర్స్ వేస్తున్నామని మా వాళ్లందరికీ చెప్పేవాడిని. నేను హీరో అని చెప్పడం ఎందుకని అలా చేశాను' అని చెప్పుకొచ్చాడు సుహాస్. 'కలర్ ఫొటోకు చాందినిని హీరోయిన్గా తీసుకుందామనుకున్నప్పుడు చాలామంది వద్దన్నారు. ఆ అమ్మాయి ఇంతకుముందు చేసిన సినిమాలు చూశావు కదా! ఒక నిర్మాత అయితే సుహాసా... రాహుల్ రామకృష్ణతో చేయొచ్చు కదా, నేను బడ్జెట్ పెడతాను అన్నాడు. సుహాస్ ఎందుకు అని అడిగినా పర్వాలేదు, కానీ అతడు అవసరమా? అని కొందరు చీప్ లుక్ ఇచ్చారు అని ఆవేదన వ్యక్తం చేశాడు సందీప్ రాజ్. చదవండి: నాకేదైనా అయితే వాళ్లే కారణం, వదిలిపెట్టొద్దు: హీరోయిన్ రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ -
కోలీవుడ్ హీరోతో రొమాన్స్‌కి రెడీ అంటున్న చాందిని చౌదరి!
చాందిని చౌదరి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మన తెలుగమ్మాయి అయిన చాందిని మధురం వంటి షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాల్లో సహానటి పాత్రలు పోషిస్తూ హీరోయిన్గా ఎదిగింది. ఇటీవల ఆమె సమ్మతమే చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆమె నటించిన కలర్ ఫొటో ఉత్తమ ప్రాంతియ చిత్రంగా జాతీయ అవార్డుకు ఎన్నికైన విషయం తెలిసిందే. చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన విజయ్ ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. త్వరలోనే ఆమె కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ‘ఓ మై కడవులే’, ‘మన్మథ లీలై’ చిత్రాల హీరో అశోక్ సెల్వన్ సరసన నటించే చాన్స్ అందుకుంది. ఈ మూవీతో కమల్ హాసన్ శిష్యుడు సి.ఎస్ కార్తికెయన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కమల్ తెరకెక్కించిన విశ్వరూపం సీక్వెల్స్లోకు కార్తీకేయన్ దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఇప్పుడ స్వయంగా ఈ సినిమాను రూపొందించబోతున్నాడు. చదవండి: నయన్‌ను కించపరిచిన ప్రముఖ నిర్మాత.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్ ఈ సందర్భంగా కార్తికేయన్ మాట్లాడుతూ.. ‘స్కూల్, కాలేజీ, పోస్ట్ కాలేజీకి సంబంధించిన కథ. ఓ యువకుడి జీవితంలోకి మూడు ఫేజెస్‌లో ముగ్గురు అమ్మాయిలు వస్తారు. రొమాంటిక్, కామెడీ నేపథ్యంలోనే మూవీ సాగనుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ చిత్రంలో తాను కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది చాందిని. కాగా అశోక్ సెల్వెన్ తెలుగులో ‘నువ్విలా నువ్విలా’ చితంరలో నటించగా.. అశోక వనంలో అర్జున కళ్యాణంలో అతిథి పాత్రలో కనిపించాడు. -
ఓటీటీకి సమ్మతమే మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరో చాందిని చౌదరిలు జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం సమ్మతమే. డైరెక్టర్ గోపీనాథ్‌రెడ్డి తెరక్కించిన ఈ చిత్రం ఇటీవల జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. కొన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగా.. మరికొన్ని వర్గాల ఆడియన్స్‌ను నిరాశ పరిచింది. దీంతో ఆ మూవీ యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. చదవండి: నేను ఇంతకాలం నటించకపోవడానికి కారణం ఇదే.. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో సమ్మతమే మూవీ త్వరలో విడుదల కాబోతోంది. దీనిపై సదరు ఓటీటీ సంస్థ తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది. జూలై 15 అర్థరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందంటూ ఆహా తమ అధికారిక ట్విటర్లో వెల్లడిచింది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానరపై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి రావడం గమనార్హం. Krishnudi leelalu, Sathyabhama alakalu kathale vinamu ipativaraku kani ade role reverse aithe?#SammathameOnAHA premieres July 15.@Kiran_Abbavaram @iChandiniC #GopinathReddy #DivyaSree pic.twitter.com/DQ4v2zlCha — ahavideoin (@ahavideoIN) July 6, 2022 -
ఆ సినిమాకు మొదట మిశ్రమ రివ్యూలు వచ్చాయి: హీరో
Kiran Abbavaram Speech In Sammathame Movie Success Meet: ''ప్రేక్షకుల వల్లే 'సమ్మతమే' బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇది ప్రేక్షకుల విజయం. నా 'ఎస్ఆర్ కల్యాణ మండపం' సినిమాకు కూడా మొదట్లో మిశ్రమ రివ్యూలు వచ్చాయి. ఆ తర్వాత సినిమా బ్లాక్‌బస్టర్. 'సమ్మతమే' మార్నింగ్ షో తర్వాత మిశ్రమ రివ్యూలు వినిపించాయి. అదేరోజు సాయంత్రం ఓ థియేటర్‌కు వెళ్లి చూస్తే హౌస్‌ఫుల్ అయింది.' అని తెలిపాడు కిరణ్ అబ్బవరం. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం 'సమ్మతమే'. కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా ఈ నెల 24న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో ''డబ్బులుంటే ఎవరైనా సినిమా తీస్తారు. కానీ హిట్ కొట్టండ ముఖ్యం. మా సొంత డబ్బులతో 'సమ్మతమే' తీసి, సూపర్ హిట్ కొట్టడం హ్యాపీగా ఉంది' అని గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ''సమ్మతమే' సినిమాను బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని ప్రవీణ తెలిపారు. చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. మాస్ హీరోగా గుర్తింపు దక్కింది: ఆకాష్ పూరి -
Sammathame Movie Review: ‘సమ్మతమే’ మూవీ రివ్యూ
టైటిల్ : సమ్మతమే నటీనటులు : కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, గోపరాజు రమణ తదితరులు నిర్మాణ సంస్థ : యూజీ ప్రొడక్షన్స్ నిర్మాతలు: కంకణాల ప్రవీణ దర్శకత్వం : గోపినాథ్ రెడ్డి సంగీతం :శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ :సతీష్ రెడ్డి మాసం ఎడిటర్ : విప్లవ్ నైషధం విడుదల తేది :జూన్ 24,2022 కొంతమంది హీరోలు తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకుంటారు.అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించాడు. ఆ వెంటనే ఎస్.ఆర్.కళ్యాణమండపం, సెబాస్టియన్ చిత్రాలతో అలరించాడు. తాజాగా ఈ యంగ్ హీరో ‘సమ్మతమే’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘సమ్మతమే’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జూన్ 24) విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ(కిరణ్ అబ్బవరం) చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. దీంతో బాల్యంలోనే చాలా అడ్డంకులు ఎదుర్కొంటాడు. ఇంట్లో ఆడవాళ్లు లేకపోవడం వల్లే ఇవన్ని ఇబ్బందులని భావించిన కృష్ణ.. తల్లిలా చూసుకునే జీవిత భాగస్వామి రావాలనుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక భార్యనే ప్రేమించాలని భావిస్తాడు. అయితే తనకు కాబోయే భార్య మాత్రం పద్దతిగా, అబద్దాలు చెప్పకుండా ఉండాలనుకుంటాడు. ఇలాంటి వ్యక్తి.. తనకు పూర్తి వ్యతిరేకమైన శాన్వీ(చాందిని చౌదరి)తో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను ఎలాగైన తన పద్దతిలోకి తెచ్చుకోవాలనుకుంటాడు. శాన్వీ కూడా కృష్ణని ప్రేమిస్తుంది. కానీ అతని అతిప్రేమ తట్టుకోలేకపోతుంది. దీంతో ఇద్దరి మధ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిని కృష్ణ ఎలా పరిష్కరించుకున్నాడు? అసలు పెళ్లికి ముందు ఎవరిని ప్రేమించను అని చెప్పిన కృష్ణ.. శాన్వీ ప్రేమలో ఎలా పడ్డాడు? తన అతిప్రేమతో శాన్వీని ఎలా ఇబ్బంది పెట్టాడు? చివరకు శాన్విని కృష్ణ పెళ్లి చేసుకున్నాడా లేదా? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే..? పెళ్లి చేసుకునే ప్రతి యువకుడు తనకు కాబోయే భార్య ఇలా ఉండాలి..అలా ఉండాలని అనుకుంటారు. కన్నవాళ్లని వదులుకొని వచ్చిన భార్యకు ఆంక్షలు విధిస్తారు. అది తన భార్యపై తనకున్న ప్రేమ అని భావిస్తారు. కానీ ఆ ఆంక్షల వల్ల అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడుతుంది? పాతికేళ్లు తనకు నచ్చినట్లుగా బతికే అమ్మాయి.. పెళ్లి తర్వాత భర్తకు నచ్చినట్లుగా ఉండాలనడం ఎంతవరకు సమంజసం? తనకంటూ ఓ జీవితం ఉంటుంది కదా? ఇదే విషయాన్ని ‘సమ్మతమే’చిత్రం ద్వారా తెలియజేశాడు దర్శకుడు గోపినాథ్ రెడ్డి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ...కథనం మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా మొత్తం కృష్ణ, శాన్వీల చుట్టే తిరుగుతుంది. ప్రతిసారి కండీషన్స్ పెట్టడం.. అనుమానించడం..చివరకు సారీ చెప్పడం.. కథంతా ఇలానే సాగుతుంది. కృష్ణ హైదరాబాద్‌కు రావడం..శాన్వీని ప్రేమించడం.. తనకు నచ్చే విధంగా మార్చుకోవాలనుకోవడం..ఇలా సోసోగా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథంతా సాగదీసినట్లుగా ఉంటుంది. కృష్ణ, శాన్వీల మధ్య ప్రేమ, గొడవలు..సారీలు చెప్పుకోవడం ఇలానే సాగుతుంది. కృష్ణ సంఘర్షనకు అసలు అర్థమే లేదనిపిస్తుంది. ఎలాంటి ట్విస్టులు లేకుండా కథంతా నీరసంగా సాగుతుంది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. అయితే చివరల్లో గోపరాజు రమణ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. చివరగా ఇది సాధారణ ప్రేమ కథే అయినప్పటికీ.. దర్శకుడి ఇచ్చిన సందేశానికి మాత్రం సమ్మతం తెలుపాల్సిందే. ఎవరెలా చేశారంటే.. కృష్ణ పాత్రలో కిరణ అబ్బవరం చక్కగా నటించాడు. నేటి తరం యువకులకు ప్రతి రూపంగా అతని పాత్ర ఉంటుంది. అయితే సినిమా మొత్తం ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో నటించడం కాస్త మైనస్. ఇక శాన్వీగా చాందిని చౌదరి అదరగొట్టేసింది. తెరపై అందంగా కనిపించడమే కాకుండా.. మోడ్రన్ అమ్మాయిగా తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తండ్రిగా గోపరాజు రమణ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. కథంతా కిరణ్, శాన్వీ పాత్రలే తిరిగినా...క్లైమాక్స్‌లో మాత్రం గోపరాజు రమణ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుడికి అలా గుర్తిండిపోతాయి. సెకండాఫ్‌లో సప్తగిరి తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. శివ నారాయణ, అన్నపూర్ణమ్మ, సద్దాం తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం శేఖర్ చంద్ర సంగీతం. పాటలతో అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. కథకు అనుగుణంగా పాటలు వస్తాయి. ఎక్కడా ఇరికించినట్లు అనిపించదు..అలా అని గుర్తిండిపోయే పాటలు కూడా కాదు. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ విప్లవ్ నైషధం తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నాన్న నాకు ఏ క్లాస్‌లో పెళ్లి చేస్తావ్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్
KTR Launched Kiran Abbavaram Sammathame Trailer: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఇటీవలె 'సెబాస్టియన్ పీసీ 524' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. తాజాగా 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకులకు అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇందులో హీరోయిన్గా 'కలర్ ఫొటో' ఫేమ్ చాందినీ చౌదరి నటిస్తోంది. గోపీనాథ్ రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ మూవీ జూన్ 24న విడుదల కానుంది. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఇప్పటికే రిలీజైన టీజర్ యూత్‌ను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి విడుదల చేశారు. 'ఏ ఇంటికైనా ఆడపిల్లే మహాలక్ష్మీ. వాళ్లు లేని ఇళ్లు ఇలాగే ఉంటుంది' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం కామెడీతో ఆకట్టుకునేలా ఉంది. పెళ్లి, అమ్మాయి కోసం ఎదురుచూసే ఓ యువకుడి కథగా 'సమ్మతమే' సినిమా అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 'చెప్పు నాకు ఏ క్లాస్‌లో పెళ్లి చేస్తావ్', 'ఇన్నాళ్లు గోల్డ్ చైన్ వేసుకున్నందుకు ఇన్నాళ్లకు వచ్చిందిరా గోల్డెన్ ఆపర్చునిటీ', 'నీకు ఏ అమ్మాయి కరెక్ట్ కాదు. అద్దంలో మొహం చూసుకుని బొట్టు పెట్టుకుని తాళి కట్టుకో.' అంటూ చెప్పై చాలా డైలాగ్‌లు సూపర్బ్‌గా ఉన్నాయి. శేఖర్ చంద్ర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. చదవండి: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి Gold chain vesukunanduku innalaki vachindi golden opportunity ☺️https://t.co/3BL4z6bCZe Thank you @KTRTRS gaaru for launching ☺️#Sammathame #SammathameFromJune24th pic.twitter.com/U6OuGj5g4f — Kiran Abbavaram (@Kiran_Abbavaram) June 16, 2022 -
ఆ నిర్మాత నన్ను నా ఫ్యామిలీని బెదిరించాడు: చాందిని చౌదరి
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ‘కలర్ ఫొటో’ ఫేం చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సమ్మతమే’. జూన్ 24న ఈ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోహీరోయిన్లు ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మూవీ విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్బంగా ఓ నిర్మాత తన కెరీర్ ఆగిపోయేలా చేశాడనే విషయం తెలిసిందని, దీనిపై మీ స్పందన ఏంటనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి చాందిని స్పందిస్తూ.. ‘నన్ను ఇండస్ట్రీలో కనబడకుండా చేస్తానిన ఆ నిర్మాత బెదరించాడు. నాతో పాటు నా ఫ్యామిలీని కూడా భయపెట్టాడు. చదవండి: ట్రోలర్స్‌కు షాకిచ్చిన ప్రభాస్, స్టైలిష్ లుక్‌లో ‘డార్లింగ్’ చివరికి నాతో సైన్ చేయించుకున్న కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాదని నాకు తెలిసింది’ చెప్పింది. దీంతో తనకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు ఇండస్ట్రీ పెద్దలను సంప్రదించలేదని ప్రశ్నించగా.. ‘ఎవరి దగ్గరకు వెళ్లను? నన్ను నేను బ్యాకప్ చేసుకోవడానికి నా దగ్గర ఏముంది? చిటికెలో నన్ను మసి చేసేస్తారు కదా’ అంటూ చాందిని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇంతకి ఆ నిర్మాత ఎవరా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే సమ్మతమే మూవీతో గోపీనాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్లో కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చదవండి: లండన్‌లో ఘనంగా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్ -
పెళ్లికి ముందు ప్రేమ పడదంటూనే లవ్‌లో పడ్డాడుగా!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం సమ్మతమే. కలర్ ఫొటో ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. గోపీనాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఐ లవ్యూ కృష్ణ అంటూ ఓ అమ్మాయి ప్రపోజల్‌తో టీజర్ మొదలవుతుంది. అయితే పెళ్లికి ముందు ప్రేమ పడదండీ, అందులో నేను పడను అంటూ తన గురించి చెప్పకనే చెప్పాడు హీరో. కానీ తనకు తెలీకుండానే హీరోయిన్‌తో ఎలా లవ్‌లో పడ్డాడు? అసలది ప్రేమే అని ఎలా తెలుసుకున్నాడు? అన్నది తెలియజేస్తూ కొన్ని సీన్లు వదిలారు. ఇక ఈ మూవీలో కిరణ్ బాలయ్య అభిమానిగా కనిపించినట్లు తెలుస్తోంది. మొత్తానికి టీజర్ సమ్మతంగానే ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా జూన్ 24న రిలీజ్ కానుంది. చదవండి: అనిల్ కలిసొచ్చిన లక్! బిగ్‌బాస్ నుంచి హమీదా ఎలిమినేట్! నా కెరీర్లో హనీ ఈజ్ బెస్ట్ -
కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఇటీవలె సెబాస్టియన్ పీసీ 524 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. తాజాగా సమ్మతమే సినిమాతో ప్రేక్షకులకు అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాతో గోపీనాథ్ రెడ్డి దర్శకునిగా పరిచయం కానున్నారు. కలర్‌ఫొటో ఫేం చాందినీ చౌదరి కిరణ్ అబ్బవరం జోడీగా నటించనుంది. తాజాగా ఈ సినిమా విడుదల ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. Krishna and Saanvi prema katha me andari prema kathaki daggaraga untundi From June 24th .#Sammathame pic.twitter.com/OEay9KUZDE — Kiran Abbavaram (@Kiran_Abbavaram) April 28, 2022 -
కొడుకును చంపినవాడే ఇంటికొస్తే.. 'గాలివాన' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: గాలివాన జానర్: క్రైమ్ అండ్ మిస్టరీ, థ్రిల్లర్ నటీనటులు: సాయి కుమార్, రాధికా శరత్ కుమార్, చాందిని చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, శరణ్య, తాగుబోతు రమేష్ తదితరులు దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి నిర్మాత: శరత్ మరార్ సంగీతం: హరి గౌర సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ ఓటీటీ: జీ5 విడుదల తేది: ఏప్రిల్ 14, 2022 ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ5' తనదైన ముద్ర వేస్తూ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో ముందుకు సాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే బీబీసీతో కలిసి జీ5, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ 'గాలివాన' వెబ్ సిరీస్‌ను నిర్మించాయి. ఈ వెబ్ సిరీస్‌తో సీనియర్ నటుడు సాయి కుమార్, రాధికా శరత్ కుమార్‌లు తొలిసారిగా డిజిటల్ తెరకు పరిచయమయ్యారు. కిర్రాక్ పార్టీ, తిమ్మరుసు చిత్రాల దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్‌సిరీస్‌ను డెరెక్ట్ చేశాడు. సాయి కుమార్, రాధికా శరత్ కుమార్‌తోపాటు చాందిని చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, అశ్రిత, శరణ్య ప్రదీప్, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 14న జీ5లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్న 'గాలివాన' వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథ: కొమర్రాజు (సాయి కుమార్) కూతురు గీత, సరస్వతి (రాధికా శరత్ కుమార్) కుమారుడు అజయ్ వర్మ చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. హనీమూన్‌కు వెళ్లిన ఈ జంటను శ్రీను అనే యువకుడు దారుణంగా హత్య చేస్తాడు. తర్వాత కారులో పారిపోతూ గాలివాన కారణంగా సరస్వతి ఇంటి ముందు యాక్సిడెంట్‌కు గురవుతాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీనును సరస్వతి కుటుంబ సభ్యులు కాపాడి చికిత్స అందించడానికి సిద్ధమవుతారు. ఇంతలో వారి కూతురు అల్లుడిని చంపింది శ్రీనునే అని తెలుస్తుంది. ఆ మరసటి రోజు శ్రీను హత్యకు గురవుతాడు. శ్రీను చంపింది ఎవరు ? తమ వాళ్లను చంపిన వ్యక్తి తమ ఇంట్లోకి వస్తే ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారు ? అసలు గీత, అజయ్ వర్మలను శ్రీను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది ? అనేది 'గాలివాన' వెబ్ సిరీస్ కథ. విశ్లేషణ: బీబీసీ మినీ సిరీస్‌గా వచ్చిన 'వన్ ఆఫ్ అజ్'కు అఫిషియల్ రీమేక్‌గా తెరకెక్కిందే 'గాలివాన' వెబ్ సిరీస్. కిర్రాక్ పార్టీ, తిమ్మరుసు వంటి రీమేక్ సినిమాలను డైరెక్టర్ చేసిన శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇదివరకూ శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేసినవి రీమేక్ చిత్రాలే కావడంతో ఈ బీబీసీ మినీ సిరీస్‌ను కూడా తెలుగు నేటివిటీకి తగినట్లే చిత్రీకరించాడు. పల్లెటూరులో జరిగే ఈ కథకు అనువుగా పాత్రల ఎంపిక బాగుంది. ఆయుర్వేద వైద్యుడిగా సాయి కుమార్, ముగ్గురు పిల్లల ఒంటరి తల్లిగా రాధికా శరత్ కుమార్. సరస్వతి పిల్లలుగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, తదితరులు వారి పాత్రలకు చక్కగా సరిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను హత్య చేయడంతో ప్రారంభమైన 'గాలివాన' ఆసక్తిగా ఉంటుంది. తర్వాత మర్డర్ చేసిన వ్యక్తి దంపతుల ఇంటి ముందు యాక్సిడెంట్‌కు గురికావడం, అతనే కిల్లర్ అని ఆ కుటుంబ సభ్యులకు తెలవడం, ఇంతలో అతను కూడా చంపబడటం థ్రిల్లింగ్‌గా ఫస్ట్ ఎపిసోడ్ సాగుతోంది. ఇక తర్వాత ఎపిసోడ్లు సాదాసీదాగా ఉంటాయి. కొంచెం సీరియల్ అనుభూతిని కలిగిస్తాయి. అయితే తమ పిల్లల హత్యతో రెండు కుటుంబాలు ఎలాంటి వేదనకు గురయ్యాయి అనేది చాలా చక్కగా చూపించారు. పాత్రల పరిచయం, వారి స్వభావం చూపించే ప్రయత్నంలో కొంతవరకు బోరింగ్‌గా అనిపిస్తుంది. తర్వాత జంటను చంపిన కిల్లర్ పట్టుకునేందుకు వచ్చిన పోలీస్ ఆఫిసర్‌గా నందిని రాయ్ ఎంట్రీతో కథలో ఆసక్తి మొదలవుతుంది. ఒక పక్క నందిని రాయ్ కిల్లర్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా మరోవైపు కిల్లర్ శవాన్ని మాయం చేసే పనిలో రెండు కుటుంబాలు ఉండటం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఈ సీన్లు కొద్దివరకు 'దృశ్యం' మూవీని తలపిస్తాయి. అలాగే కిల్లర్ శ్రీనును హత్య చేసింది తమలోని వారే అని ఒకరిపై ఒకరు అనుమానపడటం మనుషులను పరిస్థితులను ఎలా మారుస్తాయే తెలిసేలా అద్దం పడుతాయి. సరస్వతి భర్త ఎపిసోడ్ నిడివి పెంచినట్లే ఉంది గానీ అంతగా ఆకట్టుకోలేదు. ఒక ట్విస్ట్ తర్వాత ఒక ట్విస్ట్‌తో చివరి రెండు ఎపిసోడ్స్ ఉత్కంఠభరితంగా సాగాయి. 7 ఎపిసోడ్లు కాకుండా కొన్ని ఎపిసోడ్లు తీసేస్తే ఈ వెబ్ సిరీస్ మరింతబాగా ఆకట్టుకునేది. ఎవరెలా చేశారంటే ? ఆయుర్వేద వైద్యుడిగా, గ్రామానికి పెద్ద దిక్కుగా సాయి కుమార్ నటన బాగుంది. ఆయన పాత్రకు తన నటనతో న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఇక రాధిక శరత్ కుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముగ్గురు పిల్లల ఒంటరి తల్లిగా, భర్త వదిలేసిన భార్యగా, అనవసరపు ఆలోచనలతో భయపడిపోయే గృహిణిగా ఆమె సరస్వతి పాత్రలో ఒదిగిపోయారు. చైతన్య కృష్ణ, చాందిని చౌదరి, అశ్రిని వేముగంటి, శరణ్య ప్రదీప్ వారి పరిధి మేర బాగానే నటించారు. నందిని రాయ్ తన నటనతో ఆకట్టుకున్న ఆ పాత్ర అంతగా ప్రభావం చూపించలేకపోయింది. నందినిరాయ్కు అసిస్టెంట్‌గా అంజి పాత్రలో తాగుబోతు రమేష్ నటన బాగుంది. సీనియర్ లేడీ కమెడియన్ శ్రీ లక్ష్మీ రెండు, మూడు సన్నివేశాల్లో కనిపించి పర్లేదనిపించారు. టెక్నికల్ టీం వర్క్ బాగుంది. హరి గౌర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. అయితే థ్రిల్లర్ సినిమాలు ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో ముందుకు సాగితే.. వెబ్ సిరీస్‌లు మాత్రం కాస్త నెమ్మదిగానే నారేట్ చేయబడుతాయి. ఎండింగ్లో వచ్చే ట్విస్ట్‌లు, కారణాలు బాగుంటే ఆ వెబ్ సిరీస్ ఆకట్టుకున్నట్టే. మొత్తంగా ఈ 'గాలివాన' వెబ్ సిరీస్ థ్రిల్లింగ్ కంటే మిస్టీరియస్‌గా బాగానే ఆకట్టుకుంటుంది. -
మనోహరంగా 'సమ్మతమే' మొదటి పాట లిరికల్..
Sammathame Movie First Song Lyrical Video Release: విభిన్న కథలతో అలరిస్తున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం. అతడి మొదటి రెండు చిత్రాలైన 'రాజా వారు రాణి గారు', 'ఎస్ఆర్ కళ్యాణమండపం' మంచి హిట్స్ సాధించాయి. ఇప్పుడు తాజాగా అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'సమ్మతమే' సినిమాతో అలరించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇప్పుడేమో మ్యాజిక్ చేసేందుకు మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగానే 'కృష్ణ అండ్ సత్యభామ' మొదటి సింగిల్ లిరికల్ వీడియోను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ పాటలో కృష్ణుడు, సత్యభామల ప్రేమకథ ఎంత అందంగా ఉంటుందో చూపించారు. కిరణ్, చాందినీ చౌదరీల రొమాంటిక్ ట్రాక్ చూడముచ్చటగా అనిపిస్తుంది. శేఖర్ చంద్ర గ్రూవీ బీట్స్, కృష్ణకాంత్ తెలుగు , ఆంగ్ల పదాల కలయికల సాహిత్యం ఆకట్టుకున్నాయి. యాజీన్ నజీర్, శిరీషా భాగవతుల ఆహ్లాదకరమైన గానం ఈ సాంగ్‌ను మరింత మనోహరంగా చేశాయి. యూజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై కె. ప్రవీణ్ నిర్మించిన ఈ సినిమాకు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
ఆ హీరోయిన్స్‌తో పోలుస్తూ అవమానించేవారు: చాందిని
చాందిని చౌదరి.. ఒకప్పడు యూట్యూబ్ స్టార్‌గా రాణించిన ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్గా ఎదిగింది. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ తీసి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ బ్రహ్మోత్సవం, లై వంటి చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక ఆమె హీరోయిన్గా నటించిన ‘కలర్ ఫొటో’ మూవీ గతేడాది విడుదలైన సంగతి తెలిసిందే. థియేటర్లో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైంది. అయినప్పటికి ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుని సక్సెస్ బాట పట్టింది. అంతేగాక ఇందులో తన నటనకు ప్రశంసలు కూడా అందుకుంది. అదే సమయంలో ఈ మూవీతో పాటు ఆమె తొలిసారి హీరోయిన్గా నటించిన ‘సూపర్ ఓవర్’ చిత్రంలో కూడా ఓటీటీలోనే విడుదలైంది. రెండు ఒకే సమయంలో వచ్చినప్పటికి చాందినికి కలర్ ఫొటో మూవీయే మంచి విజయాన్ని అందించింది. అంతేగాక హీరోయిన్గా కూడా ఈ మూవీ గుర్తింపును ఇచ్చింది. అంతటి సక్సెస్‌ను అందుకున్న ఈ భామ పలు ఛానల్స్‌కు ఇంటర్య్వూలు ఇస్తూ గతేడాదిఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాందిని మాట్లాడుతూ.. ‘ఇక్కడ తెలుగు హీరోయిన్స్, బయటి హీరోయిన్స్ కంటే రెట్టింపు కష్టపడాలి. అయినా వారికి అవకాశాలు వస్తాయన్న నమ్మకం లేదు. నేను కనీసం కొన్ని సినిమాల్లోనైన నటించగలిగాను, నా కంటే ముందుగా పరిశ్రమకు వచ్చి ఇంకా అవకాశాలు దొరకని వారున్నారు. ఎన్నో ఏళ్లుగా తెలుగమ్మాయిలు అవకాశాల కోసం ఎదురుచుస్తూనే ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. కేరీర్ ప్రారంభంలో ఏమైనా వివక్షకు గురయ్యారా అని అడగ్గా.. ‘ప్రస్తుతానికైతే నాకు నటిగా, హీరోయిన్గా అవకాశాలు వస్తున్నాయి. ఈ సమయంలో ఇలాంటి వాటి గురించి నేను అంతగా మాట్లాడలేకపోవచ్చు. ఇంకా అవకాశాలు లేక వివక్షకు గురవుతున్నవారు మీ ప్రశ్నకు సరైనా సమాధానం ఇవ్వగలరనుకుంటున్నా’ అంటూ వివరించింది. అయితే హీరోయిన్ అయ్యాక మాత్రం కొన్ని అవమానాలు ఎదుర్కొన్నానని, బయట హీరోయిన్స్‌తో పోలుస్తూ తనని ‘నువ్వు ఏమంత కలర్ లేవు’ అంటూ విమర్శించేవారని వెల్లడించింది. అంతేగాక ఇప్పటికి సమాజంలో వర్ణ వివక్ష ఉండడం చూసి ఆశ్చర్యం వేసిందని ఆమె పేర్కొంది. -
‘సూపర్ ఓవర్’ మూవీ రివ్యూ
చిత్రం: ‘సూపర్ ఓవర్’ తారాగణం: నవీన్ చంద్ర, చాందినీ చౌదరి, రాకేందుమౌళి, ప్రవీణ్ నిర్మాత: సుధీర్ వర్మ దర్శకత్వం: ప్రవీణ్ వర్మ ఓ.టి.టి. ప్లాట్‌ఫామ్: ఆహా విడుదల తేది : జనవరి 22, 2021 క్రికెట్ బెట్టింగ్, హవాలా నేపథ్యంలో తెలుగులో పూర్తి స్థాయి సినిమాలు రాలేదనే చెప్పాలి. ఆ రెండు నేపథ్యాలనూ వాడుతూ, డబ్బు కోసం మనిషి ఎంత దూరం వెళతాడో విలక్షణమైన స్క్రీన్‌ప్లేతో చెబితే? క్రికెట్ బెట్టింగ్ నేపథ్యం కన్నా హవాలా నేపథ్యం ఎక్కువుండే ‘సూపర్ ఓవర్’లో దర్శక, నిర్మాతలు చేసిన యత్నం అదే. కథ కాశీ (నవీన్ చంద్ర), మధు (చాందినీ చౌదరి), వాసు (రాకేందు మౌళి) – ముగ్గురూ చిన్నప్పటి స్నేహితులు. ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ కాశీ ఈజీ మనీ కోసం బెట్టింగ్‌కు దిగుతాడు. మిగతా ఇద్దరు ఫ్రెండ్లూ సమర్థిస్తారు. అనుకోకుండా కాశీ కోటీ 70 లక్షలు గెలుస్తాడు. ఆ డబ్బులు తీసుకొని, కష్టాలు తీర్చుకోవాలని ముగ్గురూ రాత్రివేళ బయల్దేరతారు. ఆ రాత్రి తెల్లవారే లోపల అసలు ట్విస్టులు, కష్టాలు మొదలవుతాయి. బుకీ మురళి (కమెడియన్ ప్రవీణ్), పోలీసు ఎస్.ఐ. (అజయ్), హవాలా డబ్బు డీల్ చేసే మనుషులు – ఇలా రకరకాల పాత్రలతో సాగే ఛేజింగ్ థ్రిల్లర్ మిగతా కథ. ఎలా చేశారంటే హితుల కథలా మొదలై పూర్తిస్థాయి థ్రిల్లర్‌లా సాగే ఈ సినిమాలో నటీనటులందరూ పాత్రలకు సరిగ్గా అతికినట్టు సరిపోయారు. ముగ్గురు స్నేహితుల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. గంభీర కంఠస్వరం, ఒకింత రగ్డ్ లుక్‌తో నవీన్ చంద్ర ఈ కథను నడిపే కాశీ పాత్రలో బాగున్నారు. తెలుగమ్మాయి చాందిని పాత్రచిత్రణతో, ఆ ఎనర్జీతో ప్రేక్షకులు ప్రేమలో పడతారు. ‘మస్తీస్’, ‘కలర్ ఫోటో’ లాంటి హిట్ వెబ్ సినిమాల్లో కనిపించిన చాందినికి మంచి భవిష్యత్తు ఉందనిపిస్తుంది. ప్రతిదానిలో ఏదో ఒక అనుమానం లేవనెత్తే కామికల్ రిలీఫ్ పాత్రలో రచయిత వెన్నెలకంటి కుమారుడు రాకేందుమౌళి వినోదం అందిస్తారు. కమెడియన్ ప్రవీణ్, అజయ్ సహా ఈ సినిమాలో పాత్రలే తప్ప, ఎక్కడా నటీనటులు కనిపించరు. ఎవరెంతసేపున్నా సన్నివేశాలనూ, సందర్భాలనూ, పాత్రల ప్రవర్తననూ ఉత్కంఠ రేపేలా, శ్రద్ధగా రాసుకోవడం దర్శకుడి ప్రతిభ. ఎలా తీశారంటే..: ఈ సినిమాకు బలం – స్క్రీన్‌ప్లేలోని వైవిధ్యం. ఇలాంటి కథ, దానికి వెండితెర కథనం రాసుకోవడం కష్టం. రాసుకున్నది రాసుకున్నట్టు తీయడం మరీ కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భుజానికెత్తుకొని, నలుగురూ ఇష్టపడేలా తీశారు – దర్శకుడు స్వర్గీయ ప్రవీణ్ వర్మ. షూటింగ్ ఆఖరులో వాహనప్రమాదంలో ప్రవీణ్ వర్మ దుర్మరణం పాలయ్యారు. దాంతో, ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని ఇచ్చిన ‘స్వామిరారా’ సుధీర్‌వర్మ పోస్ట్‌ప్రొడక్షన్ చేశారు. సాంకేతిక విభాగాల పనితనం సినిమాకు మరో బలం. 25 రోజులకు పైగా సికింద్రాబాద్ మోండా మార్కెట్ తదితర ప్రాంతాల్లో రాత్రివేళ షూటింగ్ జరుపుకొందీ సినిమా. నైట్ ఎఫెక్ట్‌లో, ఏరియల్ షాట్స్‌తో దివాకర్ మణి కెమేరావర్క్ కనిపిస్తుంది. ఈ థ్రిల్లర్‌కి నేపథ్య సంగీతం గుండెకాయ. సన్నీ ఈ చిత్రానికి గ్యాప్ లేకుండా సంగీతం ఇస్తూనే ఉన్నారు. అక్కడక్కడ కాస్తంత మితి మీరినా, ఆ నేపథ్య సంగీతమే లేకుండా ఈ సినిమాను ఊహించలేం. ఎడిటింగ్ సైతం కథ శరవేగంతో ముందుకు కదిలేలా చేసింది. సెన్సార్ లేని ఓటీటీలో సహజంగా వినిపించే, అసభ్యమైన డైలాగులు కూడా చాలానే ఉన్న చిత్రమిది. అనేక చోట్ల లాజిక్ మిస్సయి, కథనంలో మ్యాజిక్ ఎక్కువున్న ఈ సినిమాకు ఓటీటీ రిలీజు లాభించింది. థియేటర్లలో కన్నా ఎక్కువ మంది ముంగిటకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఛేజింగ్ థ్రిల్లర్ కావడంతో దర్శకుడు పలుచోట్ల తీసుకున్న సినిమాటిక్ లిబర్టీని ప్రేక్షకుడు క్షమిస్తాడు. అలాగే, దర్శకుడు ఎంచుకున్న విలక్షణ కథనం వల్ల ఒకే సీన్ సందర్భాన్ని బట్టి, పదే పదే వస్తున్నా సరే సహిస్తాడు. అక్కడక్కడా ఓవర్‌గా అనిపించే అలాంటివి పక్కన పెడితే, గంట 20 నిమిషాల కాలక్షేపం థ్రిల్లర్‌గా ఈ కథాకథనం సూపర్ అనిపిస్తుంది. బలాలు: విలక్షణమైన స్క్రీన్ ప్లే, దర్శకత్వం సహజంగా తోచే∙నటీనటులు, వారి అభినయం కెమేరా వర్క్, ఉత్కంఠ పెంచే నేపథ్య సంగీతం బలహీనతలు: ట్విస్టుల హడావిడిలో మిస్సయిన లాజిక్కులు స్క్రీన్ ప్లేలో భాగంగా రిపీటయ్యే సీన్లు వెండితెర కన్నా ఓటీటీకే పనికొచ్చే అంశాలు కొసమెరుపు: ఇది ఓటీటీలో ఓకే థ్రిల్లర్! – రెంటాల జయదేవ -
‘కలర్ ఫోటో’పై అల్లు అర్జున్ ప్రశంసలు
కమెడియన్ సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కలర్ ఫోటో’ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్గా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీ ‘ఆహా’లో ఆక్టోబర్ 23న విడుదలైన ఈ సినిమా అందరి మన్ననలు పొందుతుంది. సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ లవ్ స్టోరీ ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. చిన్న సినిమా అయినప్పటికీ ఎంతో మంది మనసులను దోచుకుంది. అభిమానుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: పుష్ప షూటింగ్; వైజాగ్‌కు బన్నీ, రష్మిక తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమాను ప్రశంసలతో ముంచెత్తాడు. సినిమా అద్భుతంగా ఉందంటూ దర్శకుడు సందీప్‌ను, చిత్రయూనిట్‌ను అభినందించాడు. ఈ మేరకు ట్విటర్లో స్పందించిన బన్నీ... ‘వెరీ స్వీట్ లవ్ స్టోరీ.. అద్భుతమైన మ్యూజిక్, ఎమోషన్స్, పెర్ఫామెన్స్ అన్నీ బాగున్నాయి. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసినందుకు సంతోషంగా ఉంది. అంటూ ట్వీట్ చేశారు. అలాగే చిత్ర యూనిట్‌ను కలిసి ఓ మొక్కను బహుమతిగా అందించాడు. చదవండి: కలర్ ఫొటో రివ్యూ Congratulations to the entire team of #ColourPhoto . Very sweet love story & a haunting film with amazing music , emotions and performances. Very happy to see a good film in a long time. @ActorSuhas @SandeepRaaaj @iChandiniC @SaiRazesh @harshachemudu @kaalabhairava7 pic.twitter.com/mWuFVMbN4o — Allu Arjun (@alluarjun) October 31, 2020 -
కలర్ ఫొటో రివ్యూ
టైటిల్: కలర్ ఫొటో నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష, తదితరులు రచనా, దర్శకత్వం: సందీప్ రాజ్ సంగీతం: కాళ భైరవ బ్యానర్: అమృత ప్రొడక్షన్&లౌఖ్య ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని విడుదల: 23 అక్టోబర్ (ఆహా) దసరా పండగకు కళకళలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలవెలబోయాయి. నువ్వానేనా అంటూ పోటీలో దిగే పెద్ద సినిమాలు ఈసారి పత్తా లేకుండా పోయాయి. కానీ ఓ చిన్న సినిమా మాత్రం దసరా బరిలో నిలిచింది. పడిపడి లేచే మనసు, మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల్లో హీరో స్నేహితుడిగా కమెడియన్‌గా నటించిన సుహాస్ హీరోగా పరిచయమవుతున్న సినిమా కలర్ ఫొటో. తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన సందీప్‌రాజ్ తొలిసారిగా దర్శకుడి బాధ్యతలు ఎత్తుకున్నాడు. కానీ కథ మాత్రం సాయి రాజేష్ నీలం అందించారు. తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాలో అక్టోబర్ 23న రిలీజైన ఈ చిత్రం వీక్షకుల మదిని క్లిక్మనిపించిందో లేదో చూసేద్దాం.... కథ 1997లో జరిగే కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ (సుహాస్) అనే కుర్రాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాళ్లు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మ(చాందినీ చౌదరి)ని తొలిచూపులోనే ప్రేమించేశాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మథనపడ్డాడు. కారణం.. నల్లగా ఉన్నాడని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరిముందు చితక్కొట్టడంతో దీపుకు పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామరాజు(సునీల్)కు ఈ ప్రేమాదోమా నచ్చదు. పైగా చెల్లెలిని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇంతలో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ల ప్రేమకు శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతడిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? జయకృష్ణ, దీప్తి పెళ్లి చేసుకున్నారా? లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే..! (పెంగ్విన్ మూవీ రివ్యూ) విశ్లేషణ ప్రేమ ఒక సముద్రం. దానిపై వచ్చిన సినిమాలు అలలవంటివి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకుని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షను ఆధారంగా చేసుకొని మాత్రం సినిమాలు రాలేదనే చెప్పొచ్చు. దర్శకుడు సందీప్ రాజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యభరితమైన కథను ఎంచుకున్నారు. కామెడీ పండించే సుహాన్‌తో ఎమోషన్స్ పండించారు. కానీ ప్రేమకావ్యాన్ని రక్తికట్టించడంలో తడబడ్డారు. కథను సూటిగా సుత్తి లేకుండా చెప్పలేకపోయాడు. ఫస్టాఫ్ మొత్తం హీరో వన్‌సైడ్ లవ్, సెకండాఫ్‌లో ప్రేమ పట్టాలెక్కడం, ఓ రెండు పాటలేసుకోవడం, వీరి ప్రేమకు హీరో అన్నయ్య అడ్డు చెప్పడం, దాడి చేయడం మళ్లీ పాత వాసనలే కనిపిస్తాయి. అయితే అమ్మాయిలు అందంగా ఉన్న అబ్బాయిలను మాత్రమే ప్రేమిస్తారు అనే అపోహను ఈ సినిమా పోగొట్టే ప్రయత్నం చేసింది. కుల మత ప్రాంతాలే కాదు వర్ణం కూడా ప్రేమ సాగరానికి ఆనకట్ట వేయలేదనే సందేశాన్ని అందించారు. (నా కలర్‌ఫొటోకు విలన్ సునీల్) నటన సుహాస్ తొలిసారి హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవమున్న నటుడిగానే కనిపిస్తారు. దీప్తి పాత్రలో చాందినీ చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయారు. కానీ ప్రేక్షకుడికి మాత్రం అతడిని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవా హర్ష కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. కీరవాణి తనయుడు కాళ భైరవ అందించిన నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. (‘హిట్’ మూవీ రివ్యూ) ప్లస్ పాయింట్స్: సుహాస్ పరిపక్వత నటన కథ సంగీతం మైనస్ పాయింట్స్ కథను సాగదీయడం ప్రేమకథను మరింత లోతుగా, గాఢంగా చూపించలేకపోవడం చివరి మాట: ప్రేమకు కలర్ కూడా అడ్డు కాదన్న మంచి సందేశాన్ని అందించారు. అందుకని దీన్ని అందమైన అనకుండా రమ్యమైన ప్రేమకథ అనేద్దాం.. -
అందరికీ కనెక్ట్ అయ్యే కథ
‘‘నా సొంత అనుభవాల నుంచి నేను తయారు చేసుకున్న కథే ‘కలర్ ఫొటో’. 1990 – 97 ప్రాంతంలో జరిగిన ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇంటర్నెట్ లేని టైమ్‌లో ప్రేమలు ఎలా ఉన్నాయి? అనే అంశాన్ని ఈ సినిమాలో చెప్పాం’’ అని నిర్మాత సాయి రాజేష్ నీలం అన్నారు. హాస్యనటుడు సుహాస్ హీరోగా, చాందీని చౌదరి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘కలర్ ఫొటో’. సునీల్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. సందీప్ దర్శకత్వం వహించారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని, అమృత ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రవణ్ కొంక నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న ‘ఆహా’ ఓటీటీలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిరాజేష్ నీలం మాట్లాడుతూ– ‘‘గతంలో నిర్మించిన ‘హృదయ కాలేయం, కొబ్బరిమట్ట’ రెండూ కమర్షియల్ హిట్స్ అయినప్పటికీ, మా బ్యానర్‌కి రావాల్సిన గౌరవం రాలేదనుకుని, ‘కలర్ ఫొటో’ నిర్మించాను. ఈ చిత్రం టీజర్‌తోనే నాకు, నా బ్యానర్‌కి మంచి గుర్తింపు, గౌరవం వచ్చాయి. రంగు వివక్ష గురించి ఈ సినిమాలో నిజాయతీగా చెప్పడానికి ప్రయత్నించాం. అలా అని ఇదేదో సీరియస్ సబ్జెక్ట్ కాదు.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం, భావోద్వేగాలుంటాయి. ఈ కథకి తగిన హీరోగా సుహాస్ సూట్ అవుతాడని తీసుకున్నాం. సునీల్‌గారు ఈ సినిమాలో హీరోయిన్ అన్న పాత్రలో ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. కాలభైరవ సంగీతం ఓ ప్లస్ పాయింట్’’ అన్నారు. -
నువ్వే మను అన్నాడు
‘‘మను’ సినిమా మూడేళ్ల ప్రయాణం. ఈ జర్నీ స్టార్ట్ కాకముందు చాలా మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్‌ని కలిశాను. 40 – 50 కథలు విన్నాను. ‘మధురం’ షార్ట్ ఫిల్మ్ చూసి ఫణిని అభినందించా. అప్పుడే ఫణి ‘మను’ కథ చెప్పాడు’’ అన్నారు రాజా గౌతమ్. నూతన దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో రాజా గౌతమ్, చాందినీ చౌదరీ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండింగ్ మూవీగా నిర్మితమైంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. గౌతమ్ మాట్లాడుతూ – ‘‘ఈ కథ విన్నాక బావుందని అప్రిషియేట్ చేశాను. కొన్ని రోజుల తర్వాత నువ్వే ‘మను’ క్యారెక్టర్ చేస్తున్నావన్నాడు ఫణి. చాలా సంతోషంగా అనిపించింది. 115 మంది డబ్బు పెట్టారు. ఎంతో బాధ్యతగా తీశాడు. సెప్టెంబర్ 7న సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ క్షణం కోసం ఎంతో ఎదురు చూశా. ట్రైలర్ కంటే సినిమా ఎన్నో రెట్లు బాగుంటుంది. ఫణి విజన్ ఉన్న దర్శకుడు’’ అన్నారు చాందిని. ‘‘నాకు ఎమోషనల్ మూమెంట్. నా ఇన్వెస్టర్స్‌ని మర్చిపోలేను. వాళ్లందరికీ థ్యాంక్స్. నా సినిమా ఎక్కువ మాట్లాడుతుందని నమ్ముతున్నాను. నిర్వాణ సినిమాస్ వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేస్తుంది’’ అన్నారు దర్శకుడు. ‘‘ఒక సినిమా అందరికీ రీచ్ కావాలంటే మంచి కథ కావాలి. ఫణి అలాంటి కథతోనే వస్తున్నాడు. మంచి సినిమా ప్రేక్షకులకు అందించాల్సిన బాధ్యత మాపై ఉందనిపించింది’’ అన్నారు నిహార్. ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్, సంగీతం: నరేశ్. -
ఆసక్తి రేకెత్తించేలా ‘మను’ ట్రైలర్
చిన్న సినిమాను, ప్రచారం అంతగా లేని సినిమాను అందరూ చిన్న చూపు చూస్తారు. కానీ ఒక్కసారి ఆ సినిమా తన స్టామినాను చూపిస్తే.. అందరూ దానిగురించే మాట్లాడుకుంటారు. ‘మను’ చిత్రం కూడా అలాంటిదే. ట్రైలర్ వచ్చే వరకు కూడా ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. వినూత్న ప్రచారాలు చేసినా సినిమాకు హైప్ రాలేదు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఈ మూవీ గురించి మాట్లాడేలా చేస్తోంది. చాలా రోజుల తరువాత గౌతమ్ మళ్లీ హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్, లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఎక్కువ క్యారెక్టర్స్ లేకుండా పరిమిత పాత్రలతోనే సినిమాను నడిపించినట్లు కనిపిస్తోంది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన చాందిని చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. గతంలోకూడా హీరోయిన్గా చేసినా.. అంతగా గుర్తింపు రాలేదు. నిర్వాణ సినిమాస్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రెండేళ్ల కష్టం
బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్, చాందినీ చౌదరీ జంటగా ‘మధురం’ షార్ట్‌ఫిల్మ్ ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన చిత్రం ‘మను’. క్రౌడ్ ఫండింగ్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్వాణ సినిమాస్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం గురించి నిర్వాణ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ – ‘‘మను’ చిత్రాన్ని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌తో మేం చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం. ఈ సినిమాలో చాలామంది కష్టం, కన్నీళ్లు, శ్రమ ఉన్నాయి. ఈ సినిమాను పూర్తి చేయడానికి సుమారు 20 మంది రెండేళ్లు కష్టపడ్డారు. దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో అసోసియేట్ అవ్వడం చాలా హ్యాపీ. వాల్ట్ డిస్నీ నమ్మే సిద్ధాంతాన్నే మేమూ నమ్ముతాం. ‘మేం డబ్బులు సంపాదించడానికి సినిమాలు తీయం, సినిమాలు తీయడానికి డబ్బులు సంపాదిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నరే‹శ్ కుమార్, కెమెరా: విశ్వనాథ్ రెడ్డి. -
హైదరాబాద్ అంతా చుట్టేయాలి...
షార్ట్ ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి.. ‘కేటుగాడు’తో తెరంగ్రేటం చేసి.. ‘శమంతకమణి’లా మెరిసిన ‘కుందనపు బొమ్మ’లాంటి పదహారణాల తెలుగమ్మాయి చాందినీ చౌదరి. ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోయిన్గా నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఆమె నటించిన మరో చిత్రం ‘హౌరాబ్రిడ్జి’విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చాందిని సిటీతో అనుబంధం, తన నటనా ప్రస్థానాన్ని వివరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... మాది వైజాగ్. బెంగళూర్‌లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. బీటెక్‌లో ఉండగా స్నేహితుల కోరిక మేరకు షార్ట్ఫిల్మ్స్లో నటించాను. నేను, హీరో రాజ్‌తరుణ్ కలిసి 2011లో నటించిన ‘బ్లైండ్ డేట్’ షార్ట్ఫిలిమ్కి మంచి స్పందన వచ్చింది. తర్వాత లక్కీ, నౌదోగ్యారా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ షార్ట్‌ఫిల్మ్స్‌తో నెటిజన్లకు మరింత చేరువయ్యాను. 2014లో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నేను, రవి నటించిన ‘మధురం’ షార్ట్ ఫిలిమ్ యూట్యూబ్‌లో సూపర్‌హిట్ అయింది. వెండితెరపై అవకాశం.. ‘మధురం’ సోషల్‌లో వైరల్ అవడంతో వెండితెరపై అవకాశాలొచ్చాయి. అయితే అప్పుడు చదువు కోసం సినిమాలు వదులుకున్నాను. 2015లో కేటుగాడు చిత్రంలో హీరోయిన్గా నటించాను. అనంతరం కుందనపు బొమ్మ, శమంతకమణి చిత్రాల్లో చేశాను. హీరో రాహుల్ రవీంద్రన్తో కలిసి నటించిన ‘హౌరాబ్రిడ్జి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌తో కలిసి నటించిన ‘మను’ చిత్రం త్వరలో విడుదల కానుంది. సిటీ చుట్టేయాలి... హైదరాబాద్ అంతా చుట్టేయాలని ఉంది. అయితే షూటింగ్‌లతో బిజీగా ఉండడంతో కుదరడం లేదు. ఇక్కడ ఎక్కువ సమయం గడపాలనుకున్నా వీలు కావడం లేదు. దేశంలోనే ఇది డిఫరెంట్, ఫ్రీడమ్ అండ్ ఫ్రెండ్లీ సిటీ. సిటీలో ఉలవచారు బిర్యానీ అంటే చాలా ఇష్టం. జూబ్లీహిల్స్‌లోని కొన్ని రెస్టారెంట్స్‌లో దొరికే ‘జపనీస్ సూశి’ వంటకాన్ని ఎంతో ఇష్టంగా లాగించేస్తా. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ వంటకాన్ని రుచి చూస్తాను. షాపింగ్ చేయడమంటే ఇష్టం. స్పోర్ట్స్ అంటే ఇష్టం.. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు క్రీడల్లో అధికంగా పాల్గొనేదాన్ని. త్రోబాల్, ఖోఖో, లాంగ్‌జంప్‌లలో రాష్ట్రస్థాయిలో పాల్గొన్నాను. పెయింటిం కూడా వేస్తాను. పెయింటింగ్ ఎగ్జిబిషన్లో నా చిత్రాలు ప్రదర్శించాను. ఫేస్బుక్లో 5లక్షల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 2.3 లక్షల మంది అభిమానులు ఉన్నారు. వారందరి ఆదరాభిమానాలతో తెలుగు తెరపై రాణిస్తున్నాను. -
మనుషుల్ని విడదీసే గోడ
‘‘గోడ, బ్రిడ్జ్ ఒకే మెటీరియల్‌తో తయారవుతాయి. కానీ, గోడ మనుషుల్ని విడదీస్తుంది. బ్రిడ్జ్ మనుషుల్ని కలుపుతుంది. అదే ‘హౌరా బ్రిడ్జ్’ సినిమా కథ. హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామాగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు రేవన్ యాదు అన్నారు. రాహుల్ రవీంద్రన్ హీరోగా, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరోయిన్లుగా ఆయన దర్శకత్వంలో శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వాదాలతో ఈ.ఎమ్.వి.ఈ. స్టూడియోస్ పతాకంపై రూపొందిన ‘హౌరా బ్రిడ్జ్’ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ –‘‘ఈ సినిమా నాకొక లవ్లీ జర్నీ. డైరెక్టర్ చాలా క్లియర్‌గా అనుకున్న కథని తెరపైకి తీసుకొచ్చారు. చాందిని వెరీ టాలెంటెడ్. డైరెక్టర్ తర్వాత కెమెరామెన్ విజయ్ మిశ్రా హీరో అనొచ్చు. అంతమంచి క్వాలిటీతో సన్నివేశాలు తీశారు. నిర్మాతలు సపోర్టివ్‌గా ప్రమోషన్స్ చేస్తున్నారు’’ అన్నారు. ‘‘లాంగ్ అండ్ ఎమోషనల్ జర్నీ ఇది. సినిమా చాలా రిచ్‌గా వచ్చింది’’ అన్నారు చాందినీ చౌదరి. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, మనాలి రాథోడ్ పాల్గొన్నారు. రావు రమేశ్, అజయ్ నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజు. -
100 షార్ట్ ఫిల్మ్స్.. యూత్‌ఫుల్ ఐడియా
ఆలోచనలో కొత్తదనం ఉదయిస్తే.. అవకాశాలు అవే చిగురిస్తాయి. వాటికి క్రియేటివిటీ జోడిస్తే.. అనుకున్న ల క్ష్యం దగ్గరవుతుంది. అలా పుట్టిందే ఎంఆర్ ప్రొడక్షన్స్. ఓ ఇద్దరు ఇంజనీరింగ్ కుర్రాళ్ల కళల ప్రాజెక్టు ఇది. ఐదేళ్లలోనే 100 సినిమాలు నిర్మించిన సంస్థంటే నమ్ముతారా..? ఏ ప్రొడక్షన్ విత్ వాల్యూస్ అండ్ క్రియేటివ్ ఐడియాస్ అనే ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఎంఆర్ ప్రొడక్షన్స ఇప్పుడు పొట్టి సినిమాల ప్రపంచంలో రారాజుగా నిలుస్తోంది. ఈ సంస్థ 2009డి సెంబర్‌లో ప్రారంభమైంది. వారిద్దరి పేర్లు ధీరజ్ రాజ్, సుభాష్‌చంద్ర. ధీరజ్ రాజ్‌ది విజయనగరం జిల్లా కొట్టాయం. సుభాష్‌చంద్రది పశ్చిమగోదావరి జిల్లా రేలంగి ప్రాంతం. ఇంటర్మీడియెట్ రోజుల్లోనే దోస్తీతో జట్టు కట్టారు. ధీరజ్ మహారాజా కాలేజీలో, సుభాష్ రఘు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ పూర్తికాగానే.. లఘు చిత్రాలను నిర్మించాలని డిసైడయ్యారు. కట్ చేస్తే.. వారు చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజీల మొదటి అక్షరాలను తీసుకుని ఎంఆర్ ప్రొడక్షన్స స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్ మీద మొట్టమొదట తీసిన ‘సక్సెస్’ లఘు చిత్రం గీతం వర్సిటీ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో ఫోర్త్ బెస్ట్‌గా నిలిచింది. అలా మొదలైన షార్ట్ ఫిల్మ్ యాత్ర ఐదేళ్లలో 99 రిలీజ్ చేసి వందో చిత్రం విడుదలకు సన్నద్ధం అవుతోంది. ఈ బ్యానర్ నుంచి వచ్చిన అన్ని సినిమాలకు కథ వీరిదే. ఆర్టిస్టుల చాయిస్, నేపథ్య సంగీతంపైనా దృష్టి పెట్టారు. ‘తల్లిదండ్రులు, స్నేహితులు ఎంతగానో ప్రోత్సహించారు. మా చిత్రాలకు సినీహీరోలు, దర్శకుల ప్రశంసలు లభించాయి’ అని చెప్పారు ఈ కుర్రాళ్లు. మా బ్యానర్ మీద 49 చిత్రాలలో నటించిన రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో హీరోగా నటించారు. మా 11 చిత్రాలలో నటించిన చాందినీ చౌదరి త్వరలోనే వెండితెరపై వెలగనుంది. ఎన్నో సినిమాలకు అసిస్టెంట్‌గా చేస్తున్న సంగీత దర్శకుడు వంశీకృష్ణ మా సినిమాలకు సంగీతం అందించారు. ‘మూగమనసులు’ ఫీచర్ ఫిల్మ్‌కు సంగీతం అందించిన కేశవ్ కిరణ్ మా దగ్గర నుంచే వచ్చారు. ‘ద బ్లైండ్ డే’ (సుభాష్ చంద్ర) చిత్రం ద్వారా ఎంఆర్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ఉందని అందరూ గుర్తించారు. ఆ చిత్రంతోనే చాలామందికి బ్రేక్ వచ్చింది. ‘పెళ్లి పుస్తకం’ (ధీరజ్ రాజ్) ట్రెండ్ సెట్ చేసింది. ఫ్యామిలీ సినిమాలను షార్ట్ ఫిల్మ్స్‌గా తియ్యొచ్చనే ట్రెండ్ క్రియేట్ చేసింది. ధీరజ్ రాజ్, సుభాష్‌చంద్ర - డాక్టర్ వైజయంతి