
Sammathame Movie First Song Lyrical Video Release: విభిన‍్న కథలతో అలరిస్తున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ‍్బవరం. అతడి మొదటి రెండు చిత్రాలైన 'రాజా వారు రాణి గారు', 'ఎస్‌ఆర్ కళ‍్యాణమండపం' మంచి హిట్స్ సాధించాయి. ఇప్పుడు తాజాగా అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మ‍్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సమ్మతమే' సినిమాతో అలరించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇప్పుడేమో మ‍్యాజిక్ చేసేందుకు మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగానే 'కృష్ణ అండ్ సత్యభామ' మొదటి సింగిల్ లిరికల్ వీడియోను ఇవాళ రిలీజ్ చేశారు.
ఈ పాటలో కృష్ణుడు, సత్యభామల ప్రేమకథ ఎంత అందంగా ఉంటుందో చూపించారు. కిరణ్, చాందినీ చౌదరీల రొమాంటిక్ ట్రాక్ చూడముచ్చటగా అనిపిస్తుంది. శేఖర్ చంద్ర గ్రూవీ బీట్స్, కృష్ణకాంత్ తెలుగు , ఆంగ్ల పదాల కలయికల సాహిత్యం ఆకట్టుకున్నాయి. యాజీన్ నజీర్, శిరీషా భాగవతుల ఆహ్లాదకరమైన గానం ఈ సాంగ్‌ను మరింత మనోహరంగా చేశాయి. యూజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై కె. ప్రవీణ్ నిర్మించిన ఈ సినిమాకు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.