
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం సమ్మతమే. కలర్ ఫొటో ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీనాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఐ లవ్‌యూ కృష్ణ అంటూ ఓ అమ్మాయి ప్రపోజల్‌తో టీజర్ మొదలవుతుంది.
అయితే పెళ్లికి ముందు ప్రేమ పడదండీ, అందులో నేను పడను అంటూ తన గురించి చెప్పకనే చెప్పాడు హీరో. కానీ తనకు తెలీకుండానే హీరోయిన్‌తో ఎలా లవ్‌లో పడ్డాడు? అసలది ప్రేమే అని ఎలా తెలుసుకున్నాడు? అన్నది తెలియజేస్తూ కొన్ని సీన్లు వదిలారు. ఇక ఈ మూవీలో కిరణ్ బాలయ్య అభిమానిగా కనిపించినట్లు తెలుస్తోంది. మొత్తానికి టీజర్ సమ్మతంగానే ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా జూన్ 24న రిలీజ్ కానుంది.
చదవండి: అనిల్ కలిసొచ్చిన లక్! బిగ్‌బాస్ నుంచి హమీదా ఎలిమినేట్!
Comments
Please login to add a commentAdd a comment