క సినిమాతో కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). అతడి పనైపోయిందని విమర్శించినవారితోనే భలే సినిమాతో వచ్చాడని మెచ్చుకునేలా చేశాడు. ప్రస్తుతం ఇతడు దిల్‌రూబా అనే చిత్రంలో నటిస్తున్నాడు. రుక్సర్ ధిల్లన్ కథానాయిక. ఈ మూవీతో విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
శుక్రవాం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. మ్యాగీ తన ఫస్ట్ లవ్ అని.. మార్చిలో ఎగ్జామ్స్ ఫెయిలయినట్లు మొదటి ప్రేమలో విఫలమయ్యానంటూ హీరో వాయిస్‌తో టీజర్ మొదలవుతుంది. మార్చి పోతే సెప్టెంబర్ వచ్చినట్లు నా లైఫ్‌లోకి అంజలి వచ్చిందంటూ హీరోయిన్‌ను చూపించారు. వీళ్ల ప్రయాణం, గొడవలు.. ఇలా అన్నింటినీ చూపించారు. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇచ్చిన క్లాసిక్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా ఉంది.
ప్రేమ గురించి చెప్పడమైపోగానే కిరణ్ యాక్షన్ మోడ్‌లోకి మారాడు. తనకు అడ్డొచ్చినవారిని కోపంతో చితక్కొట్టాడు. ప్రేమ చాలా గొప్పది.. కానీ అదిచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది అన్న డైలాగ్‌తో టీజర్ ముగిసింది. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది.
దవ
Comments
Please login to add a commentAdd a comment