నాన్న నాకు ఏ క్లాస్‌లో పెళ్లి చేస్తావ్‌.. ఆకట్టుకుంటున్న ట్రైలర్‌ | KTR Launched Kiran Abbavaram Sammathame Trailer | Sakshi
Sakshi News home page

Sammathame Movie: కిరణ్‌ అబ్బవరం 'సమ్మతమే' ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన కేటీఆర్..

Published Thu, Jun 16 2022 4:47 PM | Last Updated on Thu, Jun 16 2022 4:51 PM

KTR Launched Kiran Abbavaram Sammathame Trailer - Sakshi

KTR Launched Kiran Abbavaram Sammathame Trailer: యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 'ఎస్ఆర్ క‌ల్యాణమండ‌పం' సినిమాతో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ హీరో ఇటీవలె 'సెబాస్టియ‌న్ పీసీ 524' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డీలా పడిపోయింది. తాజాగా 'స‌మ్మ‌త‌మే' సినిమాతో ప్రేక్షకులకు అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇందులో హీరోయిన్‌గా 'కలర్‌ ఫొటో' ఫేమ్‌ చాందినీ చౌదరి నటిస్తోంది. గోపీనాథ్ రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ మూవీ జూన్‌ 24న విడుదల కానుంది. మ్యూజికల్‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఇప్పటికే రిలీజైన టీజర్‌ యూత్‌ను ఆకట్టుకుంది. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి విడుదల చేశారు. 'ఏ ఇంటికైనా ఆడపిల్లే మహాలక్ష్మీ. వాళ్లు లేని ఇళ్లు ఇలాగే ఉంటుంది' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం కామెడీతో ఆకట్టుకునేలా ఉంది. పెళ్లి, అమ్మాయి కోసం ఎదురుచూసే ఓ యువకుడి కథగా 'సమ్మతమే' సినిమా అని ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. 'చెప్పు నాకు ఏ క్లాస్‌లో పెళ్లి చేస్తావ్‌', 'ఇన్నాళ్లు గోల్డ్‌ చైన్‌ వేసుకున్నందుకు ఇన్నాళ్లకు వచ్చిందిరా గోల్డెన్‌ ఆపర్చునిటీ', 'నీకు ఏ అమ్మాయి కరెక్ట్‌ కాదు. అద్దంలో మొహం చూసుకుని బొట్టు పెట్టుకుని తాళి కట్టుకో.' అంటూ చెప్పై చాలా డైలాగ్‌లు సూపర్బ్‌గా ఉన్నాయి. శేఖర్‌ చంద్ర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ ఆకట్టుకునేలా ఉంది. 

చదవండి: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కన్నుమూత
13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement