Actor Kiran Abbavaram Sammathame Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Kiran Abbavaram Sammathame Movie: కిరణ్‌ అబ్బవరం 'సమ్మతమే' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Thu, Apr 28 2022 9:17 PM | Last Updated on Fri, Apr 29 2022 10:51 AM

Kiran Abbavaram Sammathame Gets Release Date - Sakshi

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఎస్ఆర్ క‌ల్యాణమండ‌పం సినిమాతో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ హీరో ఇటీవలె సెబాస్టియ‌న్ పీసీ 524 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డీలా పడిపోయింది. తాజాగా స‌మ్మ‌త‌మే  సినిమాతో ప్రేక్షకులకు అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాతో గోపీనాథ్ రెడ్డి దర్శకునిగా పరిచయం కానున్నారు.

క‌లర్‌ఫొటో ఫేం చాందినీ చౌద‌రి కిరణ్‌ అబ్బవరం జోడీగా నటించనుంది. తాజాగా ఈ సినిమా విడుదల ప్రకటిస్తూ మేకర్స్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ కంక‌ణాల ప్ర‌వీణ నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement