
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ‘కలర్ ఫొటో’ ఫేం చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సమ్మతమే’. జూన్ 24న ఈ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోహీరోయిన్‌లు ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మూవీ విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్బంగా ఓ నిర్మాత తన కెరీర్ ఆగిపోయేలా చేశాడనే విషయం తెలిసిందని, దీనిపై మీ స్పందన ఏంటనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి చాందిని స్పందిస్తూ.. ‘నన్ను ఇండస్ట్రీలో కనబడకుండా చేస్తానిన ఆ నిర్మాత బెదరించాడు. నాతో పాటు నా ఫ్యామిలీని కూడా భయపెట్టాడు.
చదవండి: ట్రోలర్స్‌కు షాకిచ్చిన ప్రభాస్, స్టైలిష్ లుక్‌లో ‘డార్లింగ్’
చివరికి నాతో సైన్ చేయించుకున్న కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాదని నాకు తెలిసింది’ చెప్పింది. దీంతో తనకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు ఇండస్ట్రీ పెద్దలను సంప్రదించలేదని ప్రశ్నించగా.. ‘ఎవరి దగ్గరకు వెళ్లను? నన్ను నేను బ్యాకప్ చేసుకోవడానికి నా దగ్గర ఏముంది? చిటికెలో నన్ను మసి చేసేస్తారు కదా’ అంటూ చాందిని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇంతకి ఆ నిర్మాత ఎవరా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే సమ్మతమే మూవీతో గోపీనాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment