విశ్వక్‌సేన్‌ 'గామి' టీజర్‌ వచ్చేసింది | Vishwak Sen Gaami Movie Teaser Out Now | Sakshi
Sakshi News home page

విశ్వక్‌సేన్‌ 'గామి' టీజర్‌ వచ్చేసింది

Published Sat, Feb 17 2024 11:47 AM | Last Updated on Sat, Feb 17 2024 12:25 PM

Vishwak Sen Gaami Movie Teaser Out Now - Sakshi

విష్వక్‌సేన్‌ హీరోగా విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గామి'. వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ దీనిని నిర్మించారు. ఇందులో శంకర్‌ అనే అఘోరా పాత్రలో విష్వక్‌సేన్‌ కనిపించనున్నారు. ఇందులో అఘోరా గెటప్‌తో పాటు మరో రెండు భిన్నమైన గెటప్‌లు ఉంటాయి. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ నుంచి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాందిని చౌదరి కథానాయికగా ఉంది. క్రౌడ్‌ ఫండింగ్‌లో భాగంగా చేసిన ఈ సినిమాకు కార్తీక్‌ శబరీష్‌ నిర్మాత‌.

నాలుగున్నరేళ్లుగా విష్వక్‌సేన్‌ శ్రమించాడు. 'గామి' చిత్రం కోసం మునుపెన్నడూ లేని ఓ సరికొత్త అనుభూతిని ఆయన పంచనున్నారు. తాజాగా గామి చిత్రం నుంచి టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.‌ మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న అఘోర శంకర్‌ హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్రమని మేకర్స్‌ అన్నారు.

ఫిబ్రవరి 29న గామి ట్రైలర్‌ విడుదల అవుతుందని ప్రకటించారు. గామి సినిమా కూడా మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. 'ఫలక్‌నుమా దాస్‌' సినిమా విడుదలకు ముందే గామి ప్రారంభమైంది. ఈ స్టోరీతో నాలుగున్నరేళ్లు ప్రయాణం చేశామని చెప్పిన విశ్వక్‌.. గామి సినిమా గ్రాఫిక్స్‌ అద్భుతంగా ఉంటాయని ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement