Gaami Movie
-
హనుమాన్ టు కల్కి.. టాలీవుడ్ ఫస్టాప్ ఎలా ఉందంటే..
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. ఇక్కడి సినిమాలను ప్రపంచం మొత్తం ఆదరిస్తోంది. వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతూ రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఇక్కడ సక్సెస్ ఎంత శాతం ఉందో ఫెయిల్యూర్ అంతే ఉంది. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో కలెక్షన్స్ రాబడితే.. మరికొన్ని దారుణమైన అపజయాన్ని మూటగట్టుకున్నాయి. ఈ ఆరు నెలల్లో టాలీవుడ్ రిపోర్ట్ ఎలా ఉందో చూసేద్దాం.ఓపెనింగ్ అదిరింది!టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ చాలా పెద్దది. ప్రతి సంక్రాంతికి ఒకటి రెండు పెద్ద సినిమాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’తో పాటు కుర్రహీరో తేజ సజ్జ ‘హనుమాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిల్లో హనుమాన్ భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులు ‘హనుమాన్’కే ఓటేశారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. గుంటూరుకారం, నా సామిరంగ చిత్రాలకి మిశ్రమ టాక్ వచ్చినా.. మంచి వసూళ్లనే రాబట్టాయి. సైంధవ్ మాత్రం దారుణంగా బోల్తాపడింది. అంతకు ముందు జనవరి 1న వచ్చిన సర్కారు నౌకరి, రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన ‘ర్యాపిడ్ యాక్షన్ మిషన్’, ‘బిఫోర్ మ్యారేజ్’ సినిమాలు ప్లాప్ టాక్‌నే మూటగట్టుకున్నాయి.బ్యాండ్ మోగింది..ఇక ఫిబ్రవరి తొలివారంలో సుహాస్ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. అదేవారంలో వచ్చిన ‘కిస్మత్’, ‘హ్యాపీ ఎండింగ్’, ‘బూట్‌కట్ బాలరాజు’, ‘గేమ్ ఆన్’ చిత్రాలు మాత్రం సందడి చేయలేకపోయాయి. ఇక రెండో వారంలో వచ్చిన రవితేజ ఈగల్, మమ్ముట్టి, జీవా ల‘యాత్ర 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపంచాయి. మూడోవారంలో వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ప్రేక్షకలను కొంతమేర భయపెట్టేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక చివరివారంలో వచ్చిన ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘రాజధాని ఫైల్స్’, ‘సిద్ధార్థ్ రాయ్’, ‘సుందరం మాస్టర్’ చిత్రాలేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయితే ఫిబ్రవరిలో ఈగల్, యాత్ర 2 తప్పితే మిగతావన్నీ అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిన్న చిత్రాలే రిలీజ్ కావడం గమనార్హం.అలరించని సమ్మర్సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ టాలీవుడ్‌కి చాలా ముఖ్యమైనది. దాదాపు మూడు నాలుగు పెద్ద సినిమాలైనా వేసవిలో విడుదలయ్యేవి. కానీ ఈ ఏడాది సమ్మర్లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదు. మార్చి తొలివారం వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అదేవారం భూతద్దం భాస్కర్ నారాయణ’, ‘చారి 111’, ‘ఇంటి నెంబర్ 13’లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏ ఒక్కటి అలరించలేదు. (చదవండి: బాక్సాఫీస్ వద్ద కల్కి నయా రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?)రెండోవారం గోపిచంద్ ‘భీమా’తో విశ్వక్ సేన్ ‘గామి’తో వచ్చాడు. వీటిల్లో భీమాకి ప్లాప్ టాక్ రాగా.. ‘గామి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలో బోల్తా పడ్డాయి. ఇక మూడో వారంలో రజాకార్, లంబసింగి, షరతులు వర్తిసాయి’తో పాటు అరడజనుకు పైగా చిన్న సినిమాలు రిలీజ్ అయినా..ఒక్కటి కూడా హిట్ కాలేదు. మూడో వారంలో రిలీజైన శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ థియేటర్లలో నవ్వులు పూయించింది. ఇక చివరి వారంలో వచ్చిన ‘టిల్లు స్వ్కేర్’ సూపర్ హిట్ కొట్టేసింది. బాక్సాపీస్ వద్ద దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ‘టిల్లుగాడు’ సత్తా చాటాడు.ఏప్రిల్‌లో భారీ అంచనాలతో వచ్చిన విజయదేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదేవారంలో రిలీజైన భరతనాట్యం’, ‘బహుముఖం’ చిత్రాలు ప్లాప్ టాక్ని సంపాదించుకున్నాయి. రెండోవారంలో రిజీలైన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం యావరేజ్ టాక్ని సంపాదించుకుంది. ఇక చివరి రెండు వారాల్లో ‘శ్రీరంగనీతులు’ ‘పారిజాతపర్వం’, ‘మార్కెట్ మహాలక్ష్మీ, తెప్ప సముద్రం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా..ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు.(చదవండి: పాన్ ఇండియాపై ‘మెగా’ ఆశలు)మేలో తొలివారం ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ అల్లరి నరేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత నరేశ్ నటించిన కామెడీ చిత్రమిది. మంచి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌నే సంపాదించుకుంది. ఈ మూవీతో పాటు రిలీజైన సుహాస్ ‘ప్రసన్నవదనం’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఒక సెకండ్ వీక్‌లో సత్యదేవ్ ‘కృష్ణమ్మ’తో పాటు ‘ఆరంభం’ అనే చిన్న చిత్రం విడుదలైన..తొలిరోజే నెగెటివ్ టాక్ని సంపాదించుకున్నాయి. ఇక నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ థియేటర్స్‌కి వచ్చిన విషయమే తెలియదు. ఆ తర్వాత వారంలో ‘నట రత్నాలు’, ‘బిగ్ బ్రదర్’, ‘సీడీ’ ‘సిల్క్ శారీ’, ‘డర్టీ ఫెలో’, ‘బ్రహ్మచారి’తో పాటు మొత్తం అరడజను చిత్రాలు విడుదలైన ప్లాప్ టాక్ని మూటగట్టుకున్నాయి. గెటప్ శ్రీను తొలిసారి హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక చివరివారం భజేవాయు వేగం, గం..గం..గణేశా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు రిలీజ్ కాగా.. వీటిల్లో ‘భజే వాయు వేగం’ హిట్ టాక్‌కి సంపాదించుకుంది. ఇక జూన్ తొలివారం ‘సత్యభామ’ అంటూ కాజల్.. ‘మనమే’ అంటూ శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయాయి. అదేవారంలో లవ్ మౌళితో పాటు మరో రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏది హిట్ కాలేదు. రెండో వారంలో సుధీర్ బాబు ‘హరోం హర’తో పాటు ‘మ్యూజిక్ షాప్ మూర్తి, నీ దారే నీ కథ, యేవమ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో మ్యూజిక్ షాప్ మూర్తి విమర్శకులు ప్రశంసలు అందుకుంది. మూడోవారంలో నింద, ‘ఓ మంచి ఘోస్ట్’, ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’, ‘అంతిమ తీర్పు’ లాంటి పలు చిన్న సినిమాలు విడుదలైనా..ఏ ఒక్కటి అలరించలేదు. ఇక చివరి వారం మాత్రం టాలీవుడ్‌కి గుర్తిండిపోయే విజయాన్ని అందించింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 415 కోట్లను వసూళ్లు చేసి రికార్డ్ సృష్టిస్తోంది. మొత్తంగా ఈ ఆరు నెలల్లో హిట్ల కంటే ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయి. అయితే హనుమాన్, కల్కి 2898 చిత్రాలు మాత్రం చారిత్రాత్మక విజయాలను అందుకున్నాయి. -
ఓటీటీలో సరికొత్త రికార్ట్ క్రియేట్ చేసిన 'గామి'
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5 ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. తాజాగా ‘గామి’ చిత్రంతో ZEE5 ప్రేక్షకులను అలరిస్తోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది. విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని జీ 5 ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. జీ 5లో గామి చిత్రానికి అపూర్వ ఆదరణ దక్కుతోంది. 72 గంటల్లోపే ఈ చిత్రం 50 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టుకోవటం విశేషం. హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలను దర్శకుడు తెరకెక్కించిన తీరు అభినందనీయం. నరేశ్ కుమార్, స్వీకర్ అగస్తి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపి నందిగాం సినిమాటోగ్రఫీ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. చక్కటి ఎమోషన్స్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఆసక్తికరమైన కథనం, చక్కటి విజువల్స్ అన్ని ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాయి ఇప్పుడు ఈ విజువల్, ఎమోషనల్ వండర్ జీ5 ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. కేవలం 72 గంటల్లోనే 50Million Streaming Minutes తో సరికొత్త రికార్డ్ సృష్టించిన 'గామి'. Zee5 లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది వెంటనే చూడండి. pic.twitter.com/pEkVqzRhTn — ZEE5 Telugu (@ZEE5Telugu) April 15, 2024 -
అక్కడ శవాలు కాలుతున్నా 20 నిమిషాలు షూట్ చేశాం: విశ్వక్ సేన్
విశ్వక్ సేన్, చాందినీ చౌదని హీరో హీరోయిన్లుగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘గామి’. కార్తిక్ శబరీష్ నిర్మాతగా వచ్చిన ఈ మూవీకి నరేష్ కుమరన్ సంగీతాన్ని అందించారు. మార్చి 8లో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి జీ5 ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ స్నో కింగ్డమ్లో మీడియాతో ముచ్చటించింది. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో ఇలా స్నో కింగ్డమ్లో నిర్వహించాలనే ఐడియా అంతా కూడా జీ5 టీందే. ఇలాంటి ఐడియా నాకు ఎందుకు రాలేదని అనుకుంటున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా ఇలా చలిలోనే చేసేవాడ్ని. గామిలాంటి సినిమాలకు మామూలుగా అవార్డులు, ప్రశంసలు వస్తుంటాయి.. కలెక్షన్లు రావని అంతా అనుకుంటారు. కానీ ఇది నా కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్, కలెక్షన్లను సాధించింది. గామిలో కమర్షియల్ అంశాలేవీ ఉండవు. అయినా ఆడియెన్స్ చాలా బాగా ఆదరించారు. వారణాసిలోని ఘాట్‌లో శవాలు కాలుతున్నా కూడా ఓ 20 నిమిషాలు షూట్ చేశాం. చావుని వాళ్లు సెలెబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు నాకు జీవితం చాలా చిన్నది అనిపించింది. ఇలాంటి కథను నమ్మాలి. నాకు పెద్ద రిస్క్ అనిపించలేదు. ఓ ఫ్లాప్ సినిమాను తీయడం కంటే.. ఇలాంటి కథను నమ్మడం బెటర్. గామిని థియేటర్లో అందరూ చూశారు. మాకు మంచి రివ్యూలు ఇచ్చారు. ఏప్రిల్ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలోనూ మా చిత్రాన్ని చూడండి’ అని అన్నారు. డైరెక్టర్ విద్యాధర్ మాట్లాడుతూ.. ‘థియేటర్లో మా సినిమా కొంత మందికి అర్థం కాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. మూడు నాలుగు సార్లు చూస్తే మా థీమ్ ఏంటి? మా కాన్సెప్ట్ ఏంటి? అన్నది అందరికీ ఈజీగా అర్థం అవుతుంది. మేం ఎప్పుడూ ఈ సినిమా కోసం లెక్కలు వేసుకోలేదు. చిన్నా, పెద్దా.. బడ్జెట్ అంటూ ఇలా లెక్కలేసుకుండా సినిమా తీశాం. జీ5లో ఏప్రిల్ 12 నుంచి మా స్ట్రీమింగ్ అవుతుంది.. అందరూ వీక్షించండి’ అని అన్నారు. లాయిడ్ జేవియర్ (జీ 5 సౌత్, వైస్ ప్రెసడెంట్ - మార్కెటింగ్) మాట్లాడుతూ.. ‘గామిలాంటి మంచి చిత్రాన్ని తీసిన విద్యాధర్, విశ్వక్ సేన్‌లకు థాంక్స్. ఈ రోజు ఇలా వినూత్నంగా ఆలోచించి ఈవెంట్‌ను నిర్వహించాం. స్నో కింగ్డమ్లో ప్రెస్ మీట్ నిర్వహించటం ఇండియాలోనే ఇదే తొలిసారి. అందరూ ఎంజాయ్ చేసుంటారని భావిస్తున్నాం. చాలా కొత్తగా ఉంటుందని ఇలా స్నో కింగ్డమ్లో ఈవెంట్ పెట్టాం. ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ్, కన్నడలో జీ5లో గామి స్ట్రీమింగ్ అవుతోంది. అందరూ వీక్షించండి. 2024లో వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ఇదొకటి’ అని అన్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే
ఓటీటీలోకి మరో రెండు క్రేజీ సినిమాలు వచ్చేశాయి. గత కొన్నాళ్లుగా అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో పెద్దగా చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ అయితే రాలేదు. వచ్చినా కూడా ఒకటి అరా వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా రెండు మూడు క్రేజీ చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి అనేది చూసేద్దాం. (ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్) గత నెలలో శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన మూవీ 'గామి'. దాదాపు ఆరేళ్లపాటు షూటింగ్ చేసి మరీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్ అఘోరాగా నటించడం విశేషం. టాక్ పరంగా పాజిటివ్ వచ్చినప్పటికీ డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే ఇది నచ్చింది. ఇప్పుడు అందరికోసమా అన్నట్లు జీ5 ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలానే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఓం భీమ్ బుష్' అనే సినిమా కూడా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. లాజిక్స్ లేని కామెడీతో తీసిన ఈ చిత్రం.. గతనెల చివరి వారంలో రిలీజైంది. ఇప్పుడు మరీ 3 వారాల్లోనే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ వీకెండ్ ఎంటర్ టైన్ మెంట్ కోసం ఈ రెండు మూవీస్ బెస్ట్ ఆప్షన్. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 చిత్రాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. మరోవైపు రంజాన్ పండగ వచ్చేసింది. దీంతో ఈ హాలీడేస్‌లో సినీ ప్రియులకు పండగే. వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో ఫ్యామిలీతో చిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ కావటం లేదు. ఈ వారంలో గీతాంజలి మళ్లీ వచ్చింది మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంతే కాకుండా ఒకటి, రెండు చిన్న చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రియులు ఓటీటీ వైపు చూస్తున్నారు. ఈ వీకెండ్లో సందడి చేసేందుకు హిట్ సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం విశ్వక్సేన్ గామి, ఓం భీమ్ బుష్, రజినీకాంత్ లాల్ సలామ్, మలయాళ హిట్ మూవీ ప్రేమలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. వీటితో పాటు మరికొన్ని వెబ్ సిరీస్‌లు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. మీకిష్టమైన సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ లాల్ సలామ్(తమిళ డబ్బింగ్ సినిమా)- ఏప్రిల్ 12 అమర్ సింగ్ చమ్కిలా (హిందీ సినిమా)- ఏప్రిల్ 12 గుడ్ టైమ్స్ -(యానిమేటెడ్ సిట్కామ్)- ఏప్రిల్ 12 లవ్ డివైడెడ్ - (స్పానిష్ రోమాంటిక్ కామెడీ)- ఏప్రిల్ 12 స్టోలెన్ - (స్వీడిష్ చిత్రం)- ఏప్రిల్ 12 ఊడీ ఉడ్‌పెక్కర్ గోస్ టూ క్యాంప్ (2024) (కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్)- ఏప్రిల్ 12 అమెజాన్ ప్రైమ్ ఓం భీం బుష్(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12 ఎన్డబ్ల్యూఎస్ఎల్(అమెజాన్ ఒరిజినల్ సిరీస్)- ఏప్రిల్ 12 జీ5 గామి(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రేమలు(తమిళం, మలయాళం, హిందీ వర్షన్)- ఏప్రిల్ 12 -
ఓటీటీలో ఒకేరోజు నాలుగు హిట్ సినిమాలు.. ఈ వారం పండగే
‘ఓమ్ భీమ్ బుష్’: అమెజాన్ ప్రైమ్ శ్రీవిష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ‘ఓమ్ భీమ్ బుష్’ హిట్ టాక్‌తో భారీ హిట్ కొట్టింది. మార్చి 22న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 20 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా ప్రేక్షకుల చేత ఔరా అనిపించింది.లాజిక్‌తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. గామి: జీ5 టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే గామి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో అఘోరా పాత్రలో మెప్పించారు. శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన గామి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. విద్యాధర్ కాగిత అనే యువ దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. క్రౌడ్ ఫండింగ్‌తో మొదలైన గామి సినిమాను దాదాపు ఆరేళ్ల పాటు తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ట్వీట్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 'లాల్ సలామ్': నెట్ ఫ్లిక్స్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'లాల్ సలామ్' సినిమా ఓటీటీ కష్టాలు దాటుకుని స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. రజనీ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్లలో కొద్దిరోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'లాల్ సలామ్' స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 12న ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ప్రేమలు: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేమలు. నెస్లన్ కే గపూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మలయాళంలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అక్కడ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రాజమౌళి తనయుడు కార్తికేయ. అదే పేరుతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రూ.5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.135 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మలయాళంలో ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ.. తెలుగులో మార్చి 8న వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 12న ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళం, హిందీ, తమిళ వెర్షన్లు అందుబాటులోకి రానున్నాయి. -
This Week OTT Releases: అసలే పండుగ సీజన్.. ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. అసలే వేసవి సెలవులు. అంతే కాకుండా వరుసగా ఉగాది, రంజాన్ పండుగలు వస్తున్నాయి. దీంతో సినీ ప్రియులు కుటుంబంతో కలిసి సినిమాలు చూసేందుకు మంచి సమయం. అలాంటి వారి కోసం ఓటీటీలు సైతం రెడీ అయిపోయాయి. ఈ వారం మిమ్మల్ని అలరించేందుకు సరికొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాలు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో అఘోరా పాత్రలో విశ్వక్ సేన్ నటించిన గామి ఈ వారంలోనే ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ప్రేమలు మూవీ సైతం స్ట్రీమింగ్కు సిద్ధమైంది. వీటితో పాటు బాలీవుడ్లో పరిణీతి చోప్రా నటించిన మూవీ అమర్ సింగ్ చమ్కిలా ఓటీటీలో రిలీజ్ కానుంది. అంతే కాకుండా హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు, యానిమేషన్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ స్పిరిట్ రేంజర్స్- సీజన్- 3 (కిడ్స్ యానిమేటెడ్ సిరీస్)- ఏప్రిల్ 08 నీల్ బ్రెన్నాన్: క్రేజీ గుడ్ (స్టాండ్-అప్ కామెడీ స్పెషల్)- ఏప్రిల్ 09 ఆంత్రాసైట్- (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10 ది హైజాకింగ్ ఆఫ్ ఫ్లైట్ 601 -(కొలంబియా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10 అన్లాక్డ్: ఏ జైల్ ఎక్స్పెరిమెంట్- (డాక్యుమెంటరీ సిరీస్)- ఏప్రిల్ 10 జెన్నిఫర్ వాట్ డిడ్ - (బ్రిటిష్ రియల్ క్రైమ్ డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 10 యాజ్ ది క్రో ఫైల్స్- సీజన్ 3- (టర్కిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11 హార్ట్‌బ్రేక్ హై -సీజన్ 2 (ఆస్ట్రేలియన్ టీన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11 మిడ్ సమ్మర్ నైట్ -సీజన్ 1 -(నార్వే థ్రిల్లర్ సిరీస్)- ఏప్రిల్ 11 అమర్ సింగ్ చమ్కిలా (హిందీ సినిమా)- ఏప్రిల్ 12 గుడ్ టైమ్స్ -(యానిమేటెడ్ సిట్కామ్)- ఏప్రిల్ 12 లవ్ డివైడెడ్ - (స్పానిష్ రోమాంటిక్ కామెడీ)- ఏప్రిల్ 12 స్టోలెన్ - (స్వీడిష్ చిత్రం)- ఏప్రిల్ 12 ఊడీ ఉడ్‌పెక్కర్ గోస్ టూ క్యాంప్ (2024) (కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్) జీ5 గామి(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రేమలు(మలయాళ వర్షన్)- ఏప్రిల్ 12 అమెజాన్ ప్రైమ్ అన్‌ఫర్‌గాటన్ సీజన్-5(వెబ్ సిరీస్) - ఏప్రిల్ 08 ది ఎక్సార్సిస్ట్: బిలీవర్(హారర్ మూవీ)- ఏప్రిల్ 09 ఫాల్ అవుట్(అమెరికన్ సిరీస్)- ఏప్రిల్ 11 ఎన్డబ్ల్యూఎస్ఎల్(అమెజాన్ ఒరిజినల్ సిరీస్)- ఏప్రిల్ 12 -
ఓటీటీకి టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే గామి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో అఘోరా పాత్రలో మెప్పించారు. శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన గామి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. విద్యాధర్ కాగిత అనే యువ దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. క్రౌడ్ ఫండింగ్‌తో మొదలైన గామి సినిమాను దాదాపు ఆరేళ్ల పాటు తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారంలోనే ఓటీటీకి రానుందని రూమర్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ట్వీట్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Fasten your seatbelts! The journey into the intriguing world of Gaami continues on ZEE5. ❄️@VishwakSenActor @iChandiniC @KarthikSabaresh @nanivid @mgabhinaya #NareshKumaran @_Vishwanath9 @Synccinema @vcelluloidsoffl @UV_Creations @adityamusic#MassKaDasOnZEE5 #Gaami pic.twitter.com/p5SmeyINrx — ZEE5 Telugu (@ZEE5Telugu) April 3, 2024 -
నలుగురు పెద్ద మనుషులు మాట్లాడాలంటూ 'విష్వక్సేన్' వైరల్ కామెంట్లు
టాలీవుడ్ ప్రముఖ హీరో విష్వక్సేన్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'గామి'. వి సెల్యూలాయిడ్ సమర్పణలో విద్యాధర్ కాగిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. మంచి వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోందీ చిత్రం. తాజాగా శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన విష్వక్సేన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా సాధిస్తున్న వసూళ్ల కంటే కూడా... గామి మేకర్స్ చేసిన ప్రయత్నం గురించి ప్రేక్షకులు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాన్ని చాలా రిస్క్ చేసి నిర్మించినట్లు విష్వక్సేన్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు ఆరేళ్లు కష్టపడి తీసినట్లు చెప్పారు. కానీ తమ సినిమాకు ఇండస్ట్రీ పెద్దల నుంచి సహకారం అందలేదని పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో గామి సినిమాను కూడా నలుగురు పెద్ద మనుషులు చూసి.. తమ కష్టం గురించి మాట్లాడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. టాలీవుడ్లో ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదని ఆయన అన్నారు. మరో 20 ఏళ్ల తర్వాత కూడా ఈ చిత్రం గురించి గర్వంగా చెప్పుకుంటారని ఆయన పేర్కొన్నారు. తాను చెబుతున్న మాటలు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెబుతున్న మాటలు కావని చెప్పారు. గామి సినిమా టాక్ బాగున్నప్పటికీ కాందరు కావాలనే నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారని చెప్పారు. ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని తెలిపిన విష్వక్.. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు దన్యవాదాలు తెలిపారు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రంతో త్వరలో విష్వక్సేన్ రానున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన సరసన నేహాశెట్టి హీరోయిన్గా ఉన్నారు. -
'గామి'తో సక్సెస్ కొట్టిన విశ్వక్ సేన్.. మూవీటీమ్‌తో తిరుమలలో సందడి (ఫోటోలు)
-
‘గామి’ విడుదలే మాకు పెద్ద విజయం: నిర్మాత
‘మా లాంటి కొత్త వారికి సినిమా చేసిన తర్వాత అది విడుదల చేయడమే పెద్ద విజయం. లాంటింది 'గామి'కి అన్ని చోట్లా నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కడం చాలా బలాన్ని ఇచ్చింది. సినిమా విజయం సాధించడంతో ప్రశంసలు దక్కడం మరిన్ని మంచి చిత్రాలు చేయగలమనే నమ్మకాన్ని ఇచ్చింది’అన్నారు నిర్మాత కార్తిక్ శబరీష్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ చిత్ర మర్చి 8న విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత కార్తీక్ శబరీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. అలా గామి మొదలైంది నేను తమాడ మీడియంలో షో ప్రొడ్యుసర్ గా షార్ట్ ఫిలిమ్స్ కి పని చేసేవాడిని. అక్కడ చాలా మంది ఎన్ఆర్ఐ లు తమ పేరు చూసుకోవాలనే ఇష్టంతో షార్ట్ ఫిల్మ్స్ ని నిర్మించేవారు. ఇలాంటి వారందరిని ఒక్క చోటికి చేర్చి ఒక సినిమా తీస్తే బావుటుందనే ఆలోచన వచ్చింది. ‘మను’ అలా చేసిన చిత్రమే. గామి చిత్రానికి కూడ అదే స్ఫూర్తి. అంతకుముందు దర్శకుడు విద్యాధర్ తో షార్ట్ ఫిలిమ్స్ చేశా. తనతో మంచి అనుబంధం ఉండేది. కలసి 'గామి' సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో ఈ జర్నీ మొదలైయింది. వీఎఫ్ఎక్స్పై దర్శకుడికి మంచి పట్టు ఉంది దర్శకుడు విద్యాధర్ వీఎఫ్ఎక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. తనకి వీఎఫ్ఎక్స్ పై మంచి పట్టు ఉంది. గామిలో చాలా వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. దాని వీలైనంత వరకూ మన పరిధిలో ఎలా చేయగలమని అలోచించాం. ప్రత్యేకంగా సింహం సీక్వెన్స్ ని వారితో చేయించుకొని దానికి అదనంగా వాడాల్సిన హంగులని మన టీంతో చేయించుకునేలా ప్లాన్ చేసుకున్నాం. దాని కారణంగా దాదాపు వారి ఇచ్చిన కొటేషన్ కి 40శాతం తగ్గించగలిగాం. సినిమాని ఫలానా సమయానికి విడుదల చేసేయాలనే ఒత్తిడి లేదు కాబట్టి కావాల్సిన సమయాన్ని వెచ్చించి మంచి అవుట్ పుట్ ని తీసుకురాగలిగాం. నాగ్ అశ్విన్ సహాయం మరువలేనిది క్రౌడ్ ఫండ్‌తో ఈ సినిమాను నిర్మించాలి భావించి..అనౌన్స్ చేశాం. కానీ దాని ద్వారా మాకు తక్కువ ఫండ్ వచ్చింది. అయితే ప్రాజెక్ట్ కి కావాల్సిన మొత్తం ఫండ్ ఉన్నపుడే మొదలుపెట్టాలని భావిస్తే అది జరగదు. ముందు దూకేయాలనే ఓ ధైర్యంతో నెల్లూరు లో మొదటి షెడ్యుల్ స్టార్ట్ చేశాం. నెల్లూరు మా సొంత ఊరు కాబట్టి లోకేషన్స్ పర్మిషన్స్ సులువుగా దక్కాయి. మాకున్న బడ్జెట్ లో ఆ షెడ్యుల్ పూర్తి చేయగలిగాం. తర్వాత ఏమిటనేది సవాల్. ఈ సమయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ గారు మా వీడియో చూసి కాల్ చేశారు. మా ఆఫీస్ కి వచ్చి మా వర్క్ అంతా చూసి సినిమా గురించి బైట్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత జనాలు కొందరు పెట్టుబడి పెడతామని వచ్చారు. అసోషియేషన్స్ దొరికాయి. దాని తర్వాత వర్క్ ఇంకాస్త స్మూత్ గా జరిగింది. నాగ్ అశ్విన్ సహాయం మరువలేనిది క్లైమాక్స్ బాగా నచ్చింది గామిని ఓ రెండు సినిమాలతో పోల్చడం గమనించాను, నిజానికి ఆ సినిమాలు స్టార్ట్ కాకముందే 'గామి'ని మొదలుపెట్టాం. క్లైమాక్స్ లో వచ్చే యూనిక్ పాయింట్ చాలా బావుంది. దర్శకుడు చెప్పినప్పుడే చాలా కొత్తగా అనిపించింది. అది నచ్చే సినిమా చేయాలని నిర్ణయించాం. వి సెల్యులాయిడ్ వచ్చిన తర్వాత మేము సేఫ్ అనే ఫీలింగ్ వచ్చింది. రాజీపడకుండా చేయొచ్చనే ధైర్యం వచ్చింది. -
'గామి' రేటింగ్ వివాదం.. హీరో విశ్వక్ సేన్ షాకింగ్ పోస్ట్
'గామి' సినిమా హిట్ కొట్టింది. థియేటర్లలోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.22 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి లాభాల్లోకి వెళ్లిపోయింది. అయితే ఈ మూవీ కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. కానీ బుక్ మై షో వెబ్ సైట్లో మాత్రం రేటింగ్స్ విషయంలో చిన్నపాటి వివాదమే నడుస్తోంది. దీనిపై ఇప్పుడు స్వయంగా విశ్వక్ సేన్ పోస్ట్ పెట్టాడు. లీగల్ యాక్షన్ తీసుకుంటానని అన్నాడు. ఏంటీ వివాదం? ప్రస్తుతం థియేటర్లలో రిలీజైన సినిమాలు హిట్, ఫ్లాప్ అనేది తెలుసుకోవడం కోసం చాలామంది బుక్ మై షోలో వచ్చే రేటింగ్స్ చూస్తున్నారు. అయితే కొన్ని మూవీస్ విషయంలో బాట్స్ (ఊరు పేరు లేని అకౌంట్స్) రేటింగ్ చాలా తక్కువగా ఇస్తున్నాయి. దీని వల్ల ఓవరాల్ రేటింగ్ చాలా తగ్గిపోతుంది. సంక్రాంతికి 'గుంటూరు కారం' చిత్రానికి కూడా ఇలానే జరిగింది. ఇప్పుడు 'గామి' విషయంలో అదే రిపీటైంది. (ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?) విశ్వక్ ఏం అన్నాడు? 'గామి సినిమాను ఇంతలా హిట్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. అయితే దీని రేటింగ్ విషయంలో నా దృష్టికి వచ్చిన సమస్య గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. కొందరు కావాలనే 10కి 1 రేటింగ్ ఇస్తున్నారు. రకరకాల యాప్స్ ఉపయోగించి ఫేక్ రేటింగ్ ఇవ్వడం వల్ల 9 ఉన్న రేటింగ్ 1కి పడిపోయింది. మీరు ఎన్నిసార్లు లాగినా రెట్టింపు ఉత్సాహంతో పైకి లేస్తాను. ఇలాంటి పనులు ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలీదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. 'గామి'ని సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్, మీడియాకు థ్యాంక్స్. ఈ వ్యవహారంపై చట్టపరంగా ముందుకెళ్తాను' అని విశ్వక్.. ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. విశ్వక్ చెప్పిన దానిబట్టి చూస్తే రాబోయే కొత్త సినిమాలకు కూడా ఇలా రేటింగ్స్ తక్కువగా ఇవ్వడం జరిగే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అయితే ఇదంతా ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నారో వెతికిపట్టుకుని, సమస్యని పరిష్కరించడం అయ్యే పనేనా అని కొందరు నెటిజన్స్ అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) -
లాభాల్లోకి విశ్వక్సేన్ 'గామి'.. మొత్తం వసూళ్లు ఎన్ని కోట్లంటే?
శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన 'గామి' సినిమా బాక్సాఫీస్ దగ్గర రచ్చ లేపుతోంది. వీకెండ్ అయ్యేసరికే లాభాల్లోకి వెళ్లిపోయింది. అలానే విశ్వక్ సేన్ గత చిత్రాలతో పోలిస్తే ఇది అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. దాదాపు ఆరేళ్ల పాటు తీసిన ఈ సినిమాకు ప్రతిఫలం ఇప్పుడు వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. తాజాగా వీకెండ్ అయ్యేసరికి అద్భుతమైన మార్క్ దాటేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) విద్యాధర్ కాగిత అనే యువ దర్శకుడు తీసిన తొలి సినిమా 'గామి'. క్రౌడ్ ఫండింగ్‌తో మొదలై, ఆగుతూ ఆగుతూ ఈ చిత్రాన్ని ఆరేళ్ల పాటు తీశారు. అన్ని అడ్డంకుల్ని క్లియర్ చేసుకుని తాజాగా మార్చి 8న థియేటర్లలోకి వదిలారు. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచిన ఈ చిత్రం.. తొలిరోజు రూ.9 కోట్లు, రెండు రోజు రూ.6 కోట్లు, మూడు రోజు రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంటే మూడు రోజుల్లో రూ.20.3 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు స్వయంగా నిర్మాతలే పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రయోగాత్మక కథతో తీసిన 'గామి' చిత్రానికి మూడు రోజుల్లో ఈ రేంజులో కలెక్షన్స్ రావడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ వారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం థియేటర్లలోకి రావట్లేదు కాబట్టి ఈ మూవీ మరిన్ని కోట్లు రాబట్టుకోవడం గ్యారంటీ. వీకెండ్ అయ్యేసరికే దాదాపు అన్నిచోట్ల లాభాల్లోకి వెళ్లిపోయిన 'గామి'.. ఓవర్సీస్లో మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. లాంగ్ రన్లో మిలియన్ డాలర్స్ మార్క్ అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్) MASSIVE FIRST WEEKEND for #Gaami at the Box Office ❤🔥 Collects 20.3 CRORE+ Gross Worldwide in 3 days & ATTAINS PROFITS in all territories 🔥 Book your tickets now for the 𝗧𝗛𝗘 𝗕𝗥𝗘𝗔𝗧𝗛𝗧𝗔𝗞𝗜𝗡𝗚 𝗘𝗣𝗜𝗖 𝗙𝗥𝗢𝗠 𝗧𝗘𝗟𝗨𝗚𝗨 𝗖𝗜𝗡𝗘𝗠𝗔 💥 🎟️… pic.twitter.com/6SIBx8VTCb — V celluloid (@vcelluloidsoffl) March 11, 2024 -
తగ్గేదేలే అంటోన్న విశ్వక్ సేన్.. రెండు రోజుల్లోనే క్రేజీ రికార్డ్!
విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'గామి'. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న ఈ చిత్రం విడుదల అయింది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు గామి టీమ్‌ను మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో హీరోగా నటించిన విశ్వక్ సేన్‌కు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విశ్వక్ సేన్ కెరీర్లో మొదటి రోజు అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రంగా నిలిచింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.9.07 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో వీకెండ్ కావడంతో వసూళ్ల పర్వం ఏమాత్రం తగ్గలేదు. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.15.1 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా రెండో రోజు 6.03 కోట్లు వసూళ్లతో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది. ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ఈవెన్కు చేరుకోగా.. మూడో రోజు మిగిలిన ఏరియాల్లోను రీచ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా థియేటర్లలో 52 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు తెలుస్తోంది. గామి ప్రత్యేకతలు.. ఇక గామి సినిమా కోసం చిత్రయూనిట్ ఎన్నో కష్టాలు పడింది. మైనస్ 25 డిగ్రీల చలిలో షూట్ చేశారు. వారి ప్రాణలు పణంగా పెట్టి సినిమా తీశారు. సినిమా మొత్తంలో విశ్వక్‌కు రెండు పేజీల డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. విశ్వక్‌కు అఘోరాగా మేకప్ వేయడానికే రెండు గంటలకు పైగా సమయం పట్టేది. ఈ సినిమాకు విశ్వక్ ఇంతవరకు పారితోషికం తీసుకోనేలేదు. సినిమా ఆరేళ్ల క్రితమే మొదలైంది. కానీ డైరెక్టర్ ఈ సినిమాపై తొమ్మిదేళ్లుగా వర్క్ చేయడం విశేషం. #Gaami is going super strong all over 💥 Collects 15.1CRORE+ gross worldwide in 2 days with super positive WOM & remains #1 choice of moviegoers this week 💥💥 Book your tickets now for the 𝗧𝗛𝗘 𝗕𝗥𝗘𝗔𝗧𝗛𝗧𝗔𝗞𝗜𝗡𝗚 𝗘𝗣𝗜𝗖 𝗙𝗥𝗢𝗠 𝗧𝗘𝗟𝗨𝗚𝗨 𝗖𝗜𝗡𝗘𝗠𝗔 🤩 🎟️… pic.twitter.com/l13z6Wik1b — UV Creations (@UV_Creations) March 10, 2024 -
గామికి సూపర్ హిట్ టాక్.. ఫస్ట్ డే ఎంతొచ్చిందంటే?
అన్ని సినిమాల్లోలాగా ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్ వంటి కమర్షియల్ అంశాలు ఏవీ గామి చిత్రంలో ఉండవు. ఈ సినిమాకు ఉన్న ప్రధాన బలం భావోద్వేగం. 2017లోనే ఈ కథ విన్నాడు విశ్వక్ సేన్. ఒక్క ఏడాదిలో పూర్తి చేసే చిత్రం కాదని ఆనాడే అనుకున్నాడు. అన్నట్లుగానే సినిమా పూర్తి చేయడానికి ఐదారేళ్ల సమయం పట్టింది. ఇందులో చాందీ చౌదరి హీరోయిన్గా నటించగా విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించాడు. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే? వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి అంతటా హిట్ టాక్ వస్తోంది. తొలి రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.9.07 కోట్లు రాబట్టింది. సినీప్రియుల ఫస్ట్ చాయిస్ గామి అంటూ చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ మీ ఇన్నేళ్ల కష్టం వృథా పోలేదు అని కామెంట్లు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ వసూళ్ల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు. గామి ప్రత్యేకతలు.. ఇక గామి సినిమా కోసం చిత్రయూనిట్ ఎన్నో కష్టాలు పడింది. మైనస్ 25 డిగ్రీల చలిలో షూట్ చేశారు. వారి ప్రాణలు పణంగా పెట్టి సినిమా తీశారు. సినిమా మొత్తంలో విశ్వక్‌కు రెండు పేజీల డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. విశ్వక్‌కు అఘోరాగా మేకప్ వేయడానికే రెండు గంటలకు పైగా సమయం పట్టేది. ఈ సినిమాకు విశ్వక్ ఇంతవరకు పారితోషికం తీసుకోనేలేదు. సినిమా ఆరేళ్ల క్రితమే మొదలైంది. కానీ డైరెక్టర్ ఈ సినిమాపై తొమ్మిదేళ్లుగా వర్క్ చేయడం విశేషం. EPIC RESPONSE for 𝗧𝗛𝗘 𝗕𝗥𝗘𝗔𝗧𝗛𝗧𝗔𝗞𝗜𝗡𝗚 𝗘𝗣𝗜𝗖 𝗙𝗥𝗢𝗠 𝗧𝗘𝗟𝗨𝗚𝗨 𝗖𝗜𝗡𝗘𝗠𝗔 ❤🔥#Gaami collects a gross of 9.07 CRORES on Day 1 💥💥💥 A sensational first weekend on cards with fast fillings all over 🔥 🎟️ https://t.co/GPGN6SF5RL@VishwakSenActor… pic.twitter.com/itvPC6Z9Iw — UV Creations (@UV_Creations) March 9, 2024 చదవండి: పందిలా తింటాడు.. ఇప్పటికీ నాన్న దగ్గర డబ్బులడుక్కుని.. -
బ్లాక్‌బస్టర్ సినిమా 'గామి' ఓటీటీ వివరాలు ఇవే
విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'గామి'. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న ఈ చిత్రం విడుదల అయింది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు గామి టీమ్‌ను మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో హీరోగా నటించిన విశ్వక్ సేన్‌కు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సుమారు 30 రోజులు పట్టే అవకాశం ఉంది. 'గామి' ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు జీ5 నెట్వర్క్ వారు దక్కించుకున్నారు. ట్రైలర్‌తో అందరినీ మెప్పించిన 'గామి' రైట్స్ కోసం చాలా ఓటీటీ సంస్థలు పోటీ పడినట్లు సమాచారం. వాటన్నింటిని దాటుకుని ఫైనల్‌గా భారీ వ్యయం వెచ్చించి 'గామి' హక్కులను జీ5 సొంతం చేసుకుందట. ఏప్రిల్ రెండో వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావచ్చు అనే వార్తలు వస్తున్నాయి. విద్యాధర్ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. చాందినీ చౌదరి కథానాయికగా నటించారు. క్రౌడ్ ఫండింగ్‌తో కార్తీక్ శబరీష్ 'గామి' చిత్రాన్ని నిర్మించారు. రొటీన్ మూస సినిమాల నడుమ ఓ కొత్తదనం, ప్రయోగం గామిలో కనిపిస్తాయి. తక్కువ బడ్జెట్‌తోనే మనవాళ్లు ఇంతటి ప్రమాణాలతో సినిమాను చూపించగలరా అని ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. నిజానికి హీరో విశ్వక్ షేన్ను మెచ్చుకోవాలి.. 'గామి' సమయానికి ఆయన ఎవరో కూడా తెలియదు అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పుకుని ఉంటాడు.. ఇప్పుడైతే ఈ భిన్నమైన పాత్రను అంగీకరించేవాడో కాదో తెలియదు. ఏదేమైనా శభాస్ విశ్వక్ అంటూ సినీ అభిమానులు ప్రశంసిస్తున్నారు. -
విశ్వక్ సేన్ ‘గామి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'గామి' సినిమా రివ్యూ
టైటిల్: గామి నటీనటులు: విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, హారిక పెద్ద తదితరులు నిర్మాతలు: కార్తిక్ శబరీష్, శ్వేత మొరవనేని రచన-దర్శకత్వం: విద్యాధర్ కాగితాల సంగీతం: నరేశ్ కుమారన్, స్వీకర్ అగస్తీ సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపీ నందిగాం విడుదల తేదీ: 2024 మార్చి 8 నిడివి: 2h 26m ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకొన్న తెలుగు సినిమాగా 'గామి' వార్తల్లో నిలిచింది. ట్రైలర్ రిలీజ్ కాగానే విజువల్స్ చూసి అందరూ షాకయ్యారు. అంచనాలు పెరిగపోయాయి. ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు శివరాత్రి కానుకగా 'గామి' థియేటర్లలో విడుదలైంది. విశ్వక్ సేన్ అఘోరాగా నటించిన ఈ మూవీ ఎలా ఉంది? అంచనాలకు మించి హిట్ కొట్టిందా? లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 'గామి' కథేంటి? శంకర్ (విశ్వక్ సేన్) హరిద్వార్‌లో ఉండే ఓ అఘోరా. ఇతడికి ఓ విచిత్రమైన సమస్య. ఎవరైనా పొరపాటున తాకితే శంకర్ ఒళ్లంతా నీలం రంగులోకి మారిపోతుంది. సృహ తప్పి పడిపోతాడు. ఇతడి వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా అఘోరాలు అందరూ ఇతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొడతారు. దీంతో తన సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు కాశీకి వెళ్తాడు. అక్కడ ఓ సాధువు వల్ల శంకర్ సమస్యకు పరిష్కారం తెలుస్తుంది. హిమాలయాల్లో 36 ఏళ్లకు ఓసారి లభించే మాలిపత్రాలే తీసుకుంటే ఇది నయమవుతుంది. దీంతో శంకర్ హిమాలయాలకు ప్రయాణం మొదలుపెడతాడు. ఇతడికి జాహ్నవి (చౌందిని చౌదరి) కూడా తోడు వెళ్తుంది. మరి శంకర్ చివరకు మాలి పత్రాల్ని సాధించాడా? అలానే శంకర్ ఆలోచనల్లో వచ్చే ఉమ (హారిక పెద్ద), సీటీ-333(మహమ్మద్ సమాద్) ఎవరు? తెలియాలంటే 'గామి' చూడాల్సిందే. ఎలా ఉందంటే? 'గామి' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బొమ్మ బ్లాక్ బస్టర్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా నచ్చదు. కానీ డిఫరెంట్ మూవీస్, అందులోనూ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండే చిత్రాలు చూసే వాళ్లకు 'గామి'.. మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది. అలా అని ఈ సినిమాలో లోటుపాట్లు లేవా అంటే ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం టాలీవుడ్లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందన చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హరిద్వార్‌లో అఘోరాల ఆశ్రమంలో ఉండే ఒకడిగా శంకర్‌ని చూపించి నేరుగా కథ మొదలుపెట్టేశారు. హీరోకి ఉన్న సమస్య గురించి వివరించడం, దీనికి సొల్యూషన్ ఏంటో కూడా ఓ సాధువు.. శంకర్‌కి చెప్పడం, దీంతో హీరో పరిష్కారం కోసం హిమాలయాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం.. ఇలా సీన్లన్నీ చకాచకా సాగిపోతుంటాయి. ఈ ట్రాక్‌కి సమాంతరంగా ఇండో-చైనీస్ బోర్డర్లో ఓ రీసెర్చ్ ల్యాబ్‌లో ఉండే అబ్బాయి, దక్షిణ భారతదేశంలో దేవదాసి అనే ఊరిలో ఉమ అనే అమ్మాయి కథ సమాంతరంగా చూపిస్తుంటారు. దీంతో అసలు ఈ ముగ్గురికి కనెక్షన్ ఏంటా అని ఓ వైపు క్యూరియాసిటీ.. శంకర్ అసలు మాలిపత్రాల్ని ఎలా సాధిస్తాడనే టెన్షన్ ఓవైపు నుంచి ఉంటుంది. అయితే ఏదో కావాలని పెట్టినట్లు ఇంటర్వెల్ పడుతుంది. ఆ తర్వాత శంకర్‌తో తాను కూడా హిమాలయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో జాహ్నవి చెబుతుంది. అయితే ఫస్టాప్‌లో సినిమా వేగంగా నడుస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి నెమ్మదిస్తుంది. కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో రోప్ సాయంతో శంకర్-జాహ్నవి చేసే అడ్వెంచర్ సీక్వెల్ ఒకటు ఉంటుంది. చూస్తుంటే టెన్షన్‌తో సచ్చిపోతాం. చివర్లో సింహాం ఓ రెండు మూడు సీన్లలో కనిపిస్తుంది. ఆ సీన్స్‌ని ఇంకాస్త ఎఫెక్టివ్‌గా తీసుండాల్సింది. ఇకపోతే శంకర్‌కి అతడి ఆలోచనల్లో వచ్చే ఇద్దరు వ్యక్తులకు మధ్య రిలేషన్ ఏంటనేది క్లైమాక్స్‌లో రివీల్ అవుతుంది. అయితే దీన్ని సినిమా ప్రారంభంలోనే చాలామంది ఊహించేస్తారు. చివర్లో చూసినప్పుడు ఇది ఇంప్రెసివ్‌గా అనిపిస్తుంది. ఇందులో శివుడి రిఫరెన్సులు కొన్ని ఉన్నాయి. అవి శివభక్తులని ఆకట్టుకుంటాయి. అయితే శంకర్ ఫ్లాట్ రాసుకున్నంత శ్రద్ధగా.. దేవదాసి ట్రాక్, రీసెర్చ్ ట్రాక్ రాసుకోలేదు. సినిమాలో ఇది కాస్త వెలితిగా అనిపిస్తుంది. ఎవరెలా చేశారు? మాస్, కమర్షియల్ పాత్రలతో మనకు తెలిసిన విశ్వక్ సేన్.. ఇందులో అఘోరా శంకర్‌గా కొత్తగా కనిపిస్తాడు. సినిమా అంతా కూడా ఒకే కాస్ట్యూమ్‌లో ఉంటాడు. చెప్పాలంటే ఇందులో అతడి హీరో కాదు కథలో ప్రధాన పాత్రధారి అంతే. ఆ క్యారెక్టర్‌కి ఫెర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. ఇక సీటీ-333 పాత్ర చేసి మహమ్మద్ సమాద్, దుర్గ పాత్ర చేసిన హారిక అనే చైల్డ్ ఆర్టిస్టు వాళ్లకిచ్చిన పాత్రల్లో ఆకట్టుకున్నారు. చాందిని చౌదరి రోల్ ఉన్నంతలో బాగా చేసింది. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడిన దర్శకుడు విద్యాధర్‌ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. సినిమా మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా ఇంప్రెస్ చేస్తాడు. ఓ కొత్త దర్శకుడు ఈ రేంజులో సినిమా తీశాడా అంటే నమ్మలేం. ఇతడి తర్వాత సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్, ర్యాంపీ.. హిమాలయాల్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాకు కథ ఎంత ప్లస్ అయిందో.. సంగీతం అంతకు మించి ప్లస్ అయింది. స్వీకర్ అగస్తీ పాటలు.. నరేశ్ కుమారన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరోస్థాయిలో నిలబెట్టాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'గామి' ఓ డిఫరెంట్ అటెంప్ట్. ఎలాంటి అంచనాల్లేకుండా వెళ్లండి. మిమ్మల్ని అంతకు మించి ఆశ్చర్యపరుస్తుంది. -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
విశ్వక్ సేన్ ‘గామి’ టాక్ ఎలా ఉందంటే..
విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'గామి'. ప్రపంచవ్యాప్తంగా నేడు (మార్చి 8) ఈ చిత్రం విడుదల అయింది. కానీ అమెరికా వంటి దేశాల్లో అందరికంటే ముందుగానే ప్రీమియర్ షోలు పడిపోయాయి. విద్యాధర్ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. చాందినీ చౌదరి కథానాయిక. విశ్వక్సేన్ కెరీర్ కెరీర్ తొలి నాళ్లలో మొదలుపెట్టిన సినిమా ఇది. అంటే ఆయనకు ఇదే మొదటి సినిమా.. కానీ సుమారుగా 6 ఏళ్ల పాటు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలైంది. గామి ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే 'గామి' సినిమా ప్రీమియర్స్ చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్ టాక్‌తో బయటకు వస్తున్నారు. ఫస్టాఫ్ చాలా బాగుందని ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సెకండాఫ్‌లో కొంత సాగదీసినట్లు ఉన్నప్పటికీ మరీ అంత బోరింగ్ కలికే ఫీలింగ్ అయితే ఉండదని తెలుపుతున్నారు. ఇలాంటి సరికొత్త పాయింట్‌తో ఉన్న స్టోరిని నమ్మి తెరకెక్కించాలని ముందుకొచ్చిన నిర్మాత కార్తీక్ సబరేష్కు హ్యాట్సాఫ్ అంటూ ఆడియన్స్ తెలుపుతున్నారు. గామి స్టోరీ బ్యాక్ డ్రాప్ సరికొత్తగా ఉందని.. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ మీద నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గామి టీమ్ కొత్తగా ప్రయోగం చేసింది కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేకుంటారో వేచి చూడాలని ఎక్కువమంది అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎందుకు ఇలాంటి కథలు రావడం లేదని ఒక నెటిజన్ చెప్పాడు. కథ ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా విభిన్నంగా ఉందంటూ ప్రశంసలు వస్తున్నాయి. గామి సినిమా కథ చాలా స్గ్రాంగ్‌గా మొదలైందని చెబుతున్న ప్రేక్షకులు చిత్రంలోని అద్భుతమైన విజువల్స్‌కు ఫిదా అవుతున్నారు. విశ్వక్‌కు ఇది మొదటి సినిమా అంటే ఎవరూ నమ్మలేరు అనేలా ఆయన నటన ఉంది. కీలక సన్నివేశాల్లో విశ్వక్ చూపించిన టాలెంట్‌కు ఫిదా అవుతారని చెప్పుకొస్తున్నారు. ఇటీవల వచ్చిన సినిమాలతో పోలిస్తే గామి ఎన్నో రెట్లు బెటర్ అని ఒక నెటిజన్ చెప్పారు.ఇందులోని సినిమాటోగ్రఫి ఎంతో అత్యుత్తమంగా ఉందని అభిప్రాయాలు వస్తున్నాయి. గామి బీజీఎం పీక్స్ అంటూ చెప్పిన ఒక నెటిజన్ స్క్రీన్ ప్లే ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండు అని తెలిపారు. ఓవరాల్‌గా సరికొత్త పాయింట్‌తో వచ్చిన డీసెంట్ సినిమా అని అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సినిమా కథ పరంగా ఫస్టాప్ అదిరిపోతుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కానీ విజువల్ పరంగా సెండాఫ్ మెప్పిస్తుందని చెప్పుకొస్తున్నారు. క్లైమాక్స్‌లో ట్విస్టులు పీక్స్‌కు తీసుకెళ్తాయన కూడా ఎక్కువ మంది చెబుతున్నారు. గామి కోసం టీమ్ చాలా హార్డ్ వర్క్ చేసినట్లు అర్థమౌతుంది. అందుకు తగ్గట్లే సినిమా నిర్మాణ విలువలు ఉన్నాయి. గామి సినిమా బ్లాక్ బస్టర్ అని ఫైనల్‌గా ఎక్కువ మంది ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు. #Gaami First Half - DECENT !! - An interesting story setup in 3 different plots which keeps puzzled through the 1st half👌 - But the Movie goes very SLOW PHASE with fairly engaging screenplay - Visuals, Making and BGM are outstanding 🔥 Need a Very Good second half & proper… pic.twitter.com/Z6OWKIncQk — AmuthaBharathi (@CinemaWithAB) March 8, 2024 Genuine effort epic tale with high standards.. Ah human touch kosam oka human pade tapa tapana tanaki enduku ala ayyindi ane detailing human cruelty anni chala baga chupincharu #Gaami — TheRealAKHIL (@TheRealAKHIL999) March 7, 2024 Asalu Ah Gender Change Concept I Have Never Seen It Before In My Life 🙏 Spoiler: Heroine Chanipoyindi Anukuna But Last Ki Bale Pettara Bhayya Oka Human Touch Value Telisindi Bhayya Naku Ee Movie Tho #VishwakSen#Gaami#GaamiOnMarch8th #GaamiReview#GaamiPremier — UK DEVARA 🌊⚓ (@MGRajKumar9999) March 7, 2024 1st half Locations and DOP work top notch 🔥🔥 #Gaami pic.twitter.com/A0TaDSklgZ — Koushik Chowdary (@KoushikD9) March 7, 2024 #Gaami Completed 1st half Engaging and Loved id ❤️🔥@VishwakSenActor Acting 🥵 pic.twitter.com/pxUNKc8Ooa — Saikiran N T (DP) R ✌️ (@saikirannuthal3) March 8, 2024 Pacing issue + important point deggara rushed anipinchindi.. rest all aspects too good from a debutant team! #Gaami pic.twitter.com/4ORWbNxSuf — R R (@RacchaRidhvik) March 7, 2024 Showtime - #Gaami🍿 Expecting an immense theatrical experience 🤩🤞 pic.twitter.com/mU2RZnNUxm — AmuthaBharathi (@CinemaWithAB) March 8, 2024 #Gaami Ah climax🔥ee cinema ni maa telugu cinema kuda sensibilities ni base chesukoni inta goppaga chupistadi ani garvam ga cheppukovachu.dinni publicise chesukolekapote sambar taagutu mallu cinemalu ott lo chusukuntu aha oho ani telugu cinema meeda cmnts chesukuntu bratikeyochu — TheRealAKHIL (@TheRealAKHIL999) March 7, 2024 Just finished #GAAMi a must-watch for newcomers to Telugu cinema! Incredible screenplay that starts slow but builds to a thrilling climax. Outstanding twist, top-notch BGM, and visuals. The Shankar touch-UMMA hut scene in the climax is executed brilliantly. — Radhe Rishi (@RadheRishi29801) March 7, 2024 #Gaami is one of the most unique attempts to come from Telugu Cinema. While the narration feels slow and dull at times, the interesting storyline coupled with the top notch visuals and music keep this one engaging. Vishwak and the rest of the cast have done well. Despite some of… — Venky Reviews (@venkyreviews) March 8, 2024 -
గ్రాండ్‌గా విశ్వక్ సేన్ గామి ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
విశ్వక్ సేన్ ‘గామి’పై రాజమౌళి ప్రశంసలు
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పలువురు సినీ ప్రముఖులు ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా ఇన్‌స్టా వేదికగా ‘గామి’ చిత్రంపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. (చదవండి: వారి కోసం చాలా మంచి పనులు చేశారు.. సీఎం జగన్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రశంసలు) ‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’ అని తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అంతకుముందు ప్రభాస్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ఇంకా పలువురు సెలబ్రిటీలు టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. (చదవండి: ఆత్మహత్య చేసుకోబోతున్నా.. నా చావుకు కారణం అతనే, నటి వీడియో వైరల్) గామి విషయానికొస్తే.. చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ మూవీ ఇప్పుడు పెద్ద చిత్రంగా రిలీజ్ అవుతోంది. దాదాపు ఐదేళ్ల పాటు ఈ సినిమాని షూటింగ్ చేశారు. విశ్వక్ తన తొలి సినిమా రిలీజ్ కాకముందే ఈ కథను ఓకే చెప్పేశాడు. ఇందులో ఆయన అఘోరాగా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేసింది. -
అందుకే ‘గామి’ తీయడానికి ఐదేళ్లు పట్టింది : డైరెక్టర్
ఏదైనా కొత్తగా చేయాలంటే కొంత సమయం పడుతుంది. అందుకే అవతార్ తీయడానికి పదేళ్లు పట్టింది. గామి కూడా ఒక కొత్త ప్రయోగమే. అందుకే ఐదేళ్ల సమయం పట్టింది. ఆడియన్స్ కి కొత్త అనుభూతిని ఇవ్వడానికి.. విజువల్, మ్యూజిక్, టెక్నికల్ పరంగా కొత్తగా ప్రయత్నించాం’ అని అన్నారు దర్శకుడు విద్యాధర్ కాగిత. ఆయన దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గామి’. చాందినీ చౌదరి హీరోయిన్. మార్చి 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ డైరెక్టర్ విద్యాధర్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. అలా ‘గామి’ ప్రాజెక్ట స్టార్ట్ అయింది నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన నన్ను చాలా ఎక్సయిట్ చేసింది. ఆ ఐడియాని రాసిపెట్టుకున్నాను. దీంతో పాటు హిమాలయాల పర్వాతాలు, మంచు, అక్కడ ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే విఠలాచార్య లాంటి సాహస కథలు ఇష్టం. ఇవన్నీ కలసి ఒక ఆలోచనగా మారాయి. మనకి దొరికిన బడ్జెట్ లో తీసేద్దామనే ఆలోచనతో ‘గామి’ మొదలుపెట్టాం. క్రౌడ్ ఫండ్ కోసం ఒక పిచ్ వీడియో చేశాం. దాని ద్వారా వచ్చిన డబ్బులతో సినిమానిస్టార్ట్ చేశాం. తర్వాత డబ్బులు అవసరమైతే నిర్మాత బయట నుంచి తీసుకొచ్చారు. తర్వాత ఒక గ్లింప్స్ చూసి యూవీ క్రియేషన్స్ వారు రావడం జరిగింది. విశ్వక్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి నటుల కోసం చూస్తున్నపుడు విశ్వక్ ని అనుకున్నాం. అప్పటికి తన సినిమాలు ఏవీ రాలేదు. రెగ్యులర్ గా ఒక ఆడిషన్స్ లా చేశాం. చాలా ఓపెన్ మైండ్ తో తను ఈ ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకున్నారు. నిజంగా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. చాలా పెద్ద అలోచించారు.ఇందులో హీరో హీరోయిన్లు ఇద్దరు రిస్క్ సీన్లు చేశారు. వాళ్లు చేసిన ప్రతి రిస్క్‌ని ముందు నేను లేదా మా సహాయ దర్శకుడు చేసి చూపించడం జరిగింది. అందరం రిస్క్ అంచునే ప్రయాణం చేశాం అది ఇప్పుడే చెప్పలేం ఈ సినిమాలో చాలా పాత్రలు ఉంటాయి. వాటి మధ్య ఉన్న లింక్ గురించి ఇప్పుడే చెప్పలేం.అది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అయితే ట్రైలర్ చూపినట్లుగానే ఆ పాత్రలన్నీ చాలా ఆసక్తికరంగా సాగుతాయి. సమద్, హారిక, చాందిని వీరందరినీ ఆడియన్స్ చేసే తీసుకున్నాం. అందుకే ‘గామి’ అనే టైటిల్ పెట్టాం 'గామి' సినిమా అంతా ఎంగేజింగ్ గా ఉండబోతుంది. తర్వాత ఏం జరగబోతుందనే క్యురియాసిటీ ప్రేక్షకుల్లో ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఇందులో డ్రామా చాలా అద్భుతంగా ఉంటుంది. అది ప్రేక్షకులని సినిమాలో లీనం చేస్తుంది. గామి అంటే సీకర్. గమ్యాన్ని చేరేవాడు. ఇందులో ప్రధాన పాత్రకు ఒక గమ్యం ఉంటుంది. దాన్ని ఎలా చేరాడనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాం మనం అనుకున్న ఎమోషన్స్ ని పెర్ఫార్మెన్స్ ల ద్వారా సరిగ్గా వ్యక్తం చేయించడం ఒక సవాల్. టెక్నికల్ గా ఎడిటింగ్ కూడా బిగ్గెస్ట్ సవాల్. కాంప్లెక్స్ సినిమాని ప్రేక్షకులందరినీ లీనం చేసేలా ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాం.యూవీ వారు ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత ఫైనాన్సియల్ ఫ్రీడమ్ వచ్చింది. అన్ని వనరులు పెరిగాయి. మాకు కావాల్సిన సమయం ఇచ్చారు. మేము ఎదో కొత్తగా చేస్తున్నామని వారు నమ్మారు. చాలా బిగ్గర్ స్కేల్ లో పోస్ట్ ప్రొడక్షన్స్ చేసుకునే అవకాశం ఇచ్చారు. -
‘గామి’ ప్రయాణం ఓ సాహస యాత్ర.. కన్నీళ్లు వచ్చాయి: చాందినీ చౌదరి
‘‘కలర్ ఫోటో’ సినిమా తర్వాత సీరియస్ యాక్ట్రెస్‌గా నాకు గుర్తింపు వచ్చింది. ఆ మూవీ తర్వాత నా పనిని ఇంకా ఎలా మెరుగుపరచుకోవచ్చు అనే దానిపైనే దృష్టి పెడుతున్నాను. ‘గామి’ కథ విన్నప్పుడు కచ్చితంగా భాగం కావాలనిపించింది. నా మనసుకి చాలా తృప్తి ఇచ్చిన సినిమా ‘గామి’’ అని హీరోయిన్ చాందినీ చౌదరి అన్నారు. విశ్వక్ సేన్, చాందినీ చౌదరి జంటగా విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన చిత్రం ‘గామి’. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 8న విడుదలకానుంది. ఈ సందర్భంగా చాందినీ చౌదరి మాట్లాడుతూ–‘‘వారణాసి, కుంభమేళా, కాశ్మీర్, హిమాలయాలు.. ఇలా రియల్ లొకేషన్స్‌లో ‘గామి’ని చిత్రీకరించాం. షూటింగ్లో చాలా సవాల్‌తో కూడిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ సినిమా ప్రయాణం ఒక సాహస యాత్రలా జరిగింది. ఈ మూవీకి ఐదేళ్లు పట్టింది. అంత సమయం తీసుకున్నాం కాబట్టే విజువల్స్ ఇంత అద్భుతంగా వచ్చాయి. ఐమ్యాక్స్ స్క్రీన్‌లో మా మూవీ ట్రైలర్ చూసినప్పుడు మా కష్టానికి ప్రతిఫలం లభించిందనే ఆనందంతో నాకు కన్నీళ్లు వచ్చాయి. ‘గామి’ లాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. నేను నటించిన 4 చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్‌లోనూ నటించా’’ అన్నారు. -
ఆరేళ్లు తీసిన సినిమా.. స్టార్ హీరోకి నో రెమ్యునరేషన్.. కారణమదే
ఒకప్పటితో పోలిస్తే తెలుగు సినిమాలో చాలా మార్పులు వచ్చాయి. రొటీన్ కమర్షియల్ కథల్ని చాలావరకు పక్కనబెట్టి సమ్‌థింగ్ డిఫరెంట్ ఉండే మూవీస్ తీస్తున్నారు. అలా యంగ్ హీరో విశ్వక్ సేన్ చేసిన సినిమా 'గామి'. దాదాపు ఆరేళ్ల పాటు ఈ మూవీ కోసం పనిచేసిన విశ్వక్.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అందుకు కారణమేంటనేది కూడా చెప్పాడు. విశ్వక్ సేన్.. అఘోరా పాత్రలో నటించిన సినిమా 'గామి'. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజైంది. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. హాలీవుడ్ సినిమాల రేంజులో ఉండటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్) విశ్వక్ సేన్ ఇంకా హీరోగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోని టైంలో అంటే 2018లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. క్రౌడ్ ఫండింగ్ విధానంలో కేవలం రూ.25 లక్షల పెట్టుబడితో మాత్రమే ఈ మూవీ తీయాలనేది ప్లాన్. కానీ దాదాపు ఆరేళ్ల పాటు అడపాదడపా షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. అయితే పనిచేసినందుకు డబ్బులు తీసుకుంటే.. మూవీ బడ్జెట్ పెరిగిపోద్ది అనే ఉద్దేశంతోనే తాను రెమ్యునరేషన్ తీసుకోలేదని విశ్వక్ సేన్ తాజాగా ప్రెస్ మీట్లో చెప్పాడు. అయితే 'గామి' కోసం రెమ్యునరేషన్ తీసుకోనప్పటికీ.. రిలీజ్ తర్వాత వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటాడని సగటు ప్రేక్షకుడు మాట్లాడుకుంటున్నాడు. ఏదేమైనా ఆరేళ్ల పాటు ఓ సినిమా కోసం కష్టపడి పారితోషికం తీసుకోకపోవడమనేది ఆసక్తకర విషయమే. మార్చి 8న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ) -
కంటెంట్ కనెక్ట్ అయితే బ్లాక్ బస్టర్..?